Sunday, 15 August 2021

77. ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు (okkaDE aMtaryAmi vupakAri chEpaTTu)

 ANNAMACHARYA

77. ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు 

Introduction: In this commendable verse, Annamacharya said, thought has no place in the process of liberation.

In this landmark declaration, he said there is no specific path to life. He said the mind just makes you go after the wants and the sense organs are rather obstacles in this pursuit.  

You will find many of the above observations were mirrored by Jiddu Krishnamurti. There was no doubt that Jiddu came to this conclusion independently.  However understand that these were revealed at least 500 years earlier by Annamacharya. 

ఉపోద్ఘాతము:  ఈ ప్రశంసనీయమైన కీర్తనలో, అన్నమాచార్యులు విముక్తి ప్రక్రియలో ఆలోచనకు స్థానం లేదు అన్నారు.

ఈ ముఖ్యమైన ప్రకటనలో, జీవితానికి నిర్దిష్ట మార్గం లేదని ఆయన అన్నారు. మనస్సు మనల్ని కోరికలను వెంబడించేలా చేస్తుందని మరియు ఈ దారిలో ఇంద్రియాలు అడ్డంకులుగా భావించాలని అన్నమాచార్యులు అన్నారు ​

పైన పేర్కొన్న అనేక పరిశీలనలను జిడ్డు కృష్ణమూర్తి ప్రతిబింబించినట్లు మీరు గ్రహించి ఉంటారు.  కృష్ణమూర్తి స్వతంత్రంగా ఈ నిర్ధారణకు వచ్చారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇవి అన్నమాచార్యుల ద్వారా కనీసం 500 సంవత్సరాలకు ముందే బహిర్గతమయ్యాయని అర్థం చేసుకోండి.

కీర్తన:

ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు

తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని   ॥పల్లవి॥ 

యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు

గుఱియై మాయలలోనఁ గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు
తెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె   ॥ఒక్క॥ 

తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదు

వలసితే నుండుఁ బోవు వన్నెవంటిది
తలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచేఁ బరచెడి దింతె ॥ఒక్క॥ 

సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు

బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింత
నెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే    ॥ఒక్క॥

Details and Explanations: 

ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు

తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని       ॥పల్లవి॥ 

okkaDE aMtaryAmi vupakAri chEpaTTu

takkinavi yinniyunu talapu rEcheDini   pallavi 

Word to Word meaning:  ఒక్కఁడే (okkaDE ) = one and only; అంతర్యామి (aMtaryAmi) = the inside dweller; వుపకారి (vupakAri) = beneficial, obliging, assisting; చేపట్టు (chEpaTTu) = take up;   తక్కినవి (takkinavi) = the remaining; యిన్నియును (yinniyunu) = all these; తలఁపు (talapu) = thought, memory; రేఁచెడిని (rEcheDini) = provoking, generating.      

Literal meaning: There exists one and only the inside dweller. He will help you. Take the step. Rest everything, is provoked by memory and thought.

Explanation: Just see the statement of Jiddu Krishnamurti below

(In a talk at Brandies University JK said) “Why has man given such extraordinary importance to thought which formulates a concept which he tries to live. The formulation of ideologies and the attempted conformity to those ideologies is observable throughout the world. …..

So we ask: Can thought ever solve our human problems? 
Is thought the only instrument that we have to deal with all our human problems? - for it does not answer, it does not resolve our problems. It may be, we are just questioning it, we are not dogmatically asserting it. It may be that thought has no place whatsoever, except for mechanical, technological, scientific matters.”

Annamacharya said, there is only one thing (inside dweller = God) in this world. Rest everything is formulated by thought.

భావము:  ఉన్నవాడు అంతర్యామి  ఒక్కఁడు మాత్రమే.  అడుగు ముందుకు వేయండి. ఆయన మీకు  చేయూతనిస్తాడు. తక్కినవన్నీ జ్ఞాపకశక్తి మరియు ఆలోచనల ద్వారా రెచ్చగొట్టబడతాయి.

వివరణము: దిగువన జిడ్డు కృష్ణమూర్తి ప్రకటన చూడండి

“జీవించడానికి ప్రయత్నించే భావనను రూపొందించే ఆలోచనకు అసాధారణ ప్రాముఖ్యతను మనిషి ఎందుకు  ఇచ్చాడో? సిద్ధాంతాల సూత్రీకరణ మరియు భావజాలాలకు అనుగుణంగా జీవించ ప్రయత్నించడం ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు. … ..

కాబట్టి, ఆలోచన మన మానవ సమస్యలను ఎప్పుడైనా పరిష్కరించగలదా? అని జిజ్ఞాస కొద్దీ అడుగుతున్నా? మన మానవ సమస్యలన్నింటినీ పరిష్కరించే ఏకైక సాధనం ఆలోచన మాత్రమేనా? - ఆలోచన మానవుల సమస్యలను పరిష్కరించలేదేమో! నేను  కేవలం ప్రశ్నిస్తున్నాను, దానిని పిడివాదంగా నొక్కి చెప్పడం లేదు. యాంత్రిక, సాంకేతిక, శాస్త్రీయ విషయాలలో మినహా ఆలోచనకు స్థానం లేదు."

"ఈ ప్రపంచంలో ఒకే ఒక్క విషయం (దైవము మాత్రమే) ఉంది. మిగిలినవి ఆలోచనల ద్వారా రూపొందించబడ్డాయి" అని అన్నమాచార్యులు అన్నారు.

యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు

గుఱియై మాయలలోనఁ గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు
తెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె       ॥ఒక్క॥ 

ye~rugumI jIvuDA yiMdriyAlu sommu gAvu

gu~riyai mAyalalOna gUDiMchE viMte
ma~ravaku jIvuDA manasu chuTTamu gAdu
te~ragoppa AsalAnE tippeDi diMte        okka 

Word to Word meaning: యెఱుఁగుమీ (ye~rugumI) = know that; జీవుఁడా (jIvuDA) = O man!; యింద్రియాలు (yiMdriyAlu) = sense organs;  సొమ్ము గావు (sommu gAvu) = not property, not money; గుఱియై (gu~riyai) = get subjected;  మాయలలోనఁ (mAyalalOna) = in illusions; గూడించేవి (gUDiMchE) = make you mingle;  ఇంతె (iMte) =  that’s all;  మఱవకు (ma~ravaku)  జీవుడా (jIvuDA) ) = O man! మనసు (manasu) = mind; చుట్టము (chuTTamu) = well-wishing relation; గాదు (gAdu) = not; తెఱఁగొప్ప(te~ragoppa) = like a beautiful; ఆసలానే (AsalAnE) = (akin to) want; తిప్పెడిది (tippeDi) = makes you move/go around; ఇంతె (iMte) = that’s all;

Literal meaning: O man! Learn that sense organs are not your property. They get subjected to illusions and make you part of it. This mind is not your well-wisher. Like a beautiful want, it makes you go around (in circles).

Explanation: Notice that Annamacharya said, "The senses make you part of the illusions". This is very much similar to the modern management statement, "Are you here with a solution or (are you part of the problem)?

Thus modern look of the great saint, cannot be denied even in these dry philosophical statements. I believe, he wrote in commoner’s language and in song form, so that people will recite and eventually understand the philosophy behind his songs.

By stating manasu chuTTamu gAdu (మనసు చుట్టము గాదు), Annamacharya is clear that the mind makes man follow the illusions and leads him elsewhere. Please refer to the verse kaMchUM gAdu peMchU gAdukaDubeluchu manasu where unyielding, defying and un-tutorable nature of mind is described in detail.

భావము:  మానవుడా! జ్ఞానేంద్రియాలు  ఆస్తి కాదని తెలుసుకో. అవి భ్రమలకు లోనై నిన్ను వాటిలో భాగస్తుని చేస్తాయి. మనస్సు మీ శ్రేయోభిలాషి కాదు. ఒక అందమైన కోరికలాగా, అది నిన్ను తిప్పుతూనే ఉంటుంది. అంతే!

వివరణము: గమనిస్తే అన్నమాచార్యులు "ఇంద్రియములు భ్రమలకు లోనై నిన్ను వాటిలో భాగస్తుని చేస్తాయి" అని చెప్పి "మీరు ఇక్కడ పరిష్కారంతో ఉన్నారా  లేదా మీరు సమస్యలో భాగమా?" అనే  వ్యాప్తిలో ఉన్న ఆధునిక నిర్వహణ ప్రకటనను తలపింప  చేశాడు.

పొడి తాత్విక ప్రకటనలలో కూడా గొప్ప తాపసి యొక్క ఆధునిక రూపాన్ని దర్శించగలం. ప్రజలు పాటలు పాడుతూ కొంత కాలానికి వాని వెనుక ఉన్న తత్వన్ని అర్థం చేసుకుంటారు అనే భావనతో అతడు  పాట రూపంలో సామాన్య భాషలో వ్రాసాడు అనుకోవచ్చు.

మనసు చుట్టము గాదు అని చెప్పి, మనస్సు మనిషిని మాయల వెంబడి పరుగెత్తించి, తప్పుదారి పట్టిస్తుందని చెప్పారు. అణఁగని, లొంగని, చెప్పినట్లు వినని మనస్సు గురించి కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు అనే కీర్తనలో విపులంగా వివరించారు.  (లింకు తెరిచి చూడండి). 

తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదు

వలసితే నుండుఁ బోవు వన్నెవంటిది
తలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచేఁ బరచెడి దింతె    ॥ఒక్క॥ 

telukO jIvuDA dEhamunu nammarAdu

valasitE nuMDuM bOvu vannevaMTidi
talachukO jIvuDA dhanamu danichcha gAdu
palulaMpaTamulachE baracheDi diMte   okka 

Word to Word meaning: తెలుకో (telukO)  = know that; జీవుఁడా (jIvuDA) = O man! దేహమును (dEhamunu) = body; నమ్మరాదు (nammarAdu) = should not believe; వలసితే (valasitE) = if required; నుండుఁ (nuMDu) = stays;  బోవు (bOvu)  = go away; వన్నెవంటిది (vannevaMTidi) = like a shade of a colour; తలఁచుకో (talachukO) = consider/ reflect;  జీవుడా (jIvuDA) = O man! ధనము (dhanamu) = Money; దనిచ్చ (danichcha) = requirement; గాదు (gAdu) = not; పలులంపటములచేఁ (palulaMpaTamulachE)  = multiple objects of attachment; aggravations బరచెడిది (baracheDi) = causing; ఇంతె (iMte) = that’s all;  

Literal meaning: O Man! Beware. Do not believe body (signals). They change the shade of the colour (with time). The wealth is not a requirement. But watch out! It makes you get caught with multiple attachments. That’s all

Explanation: the words దేహమును నమ్మరాదు implying that, one should be sensitive, sensible and cautious as body can throw confusing signals.

Annamacharya earlier described as body vUhala dEhamu (body made up of imagination in song రెప్పలమరఁ గదె రేపును మాపును) Thus we learn that the body is actually controlled by the mind.

In a song on effects of money on man, Annamacharya described it as prakaTiMchi kanakamE bhramayiMchI jagamu ప్రకటించి కనకమే భ్రమయించీ జగము  meaning that the money baffles and perplexes people, despite the knowledge of its ill effects.

భావము మానవుడా! జాగ్రత్తపడు. శరీరం చూపే సంకేతాలు నమ్మవద్దు అవసరాన్నిబట్టి (కాలాన్నిబట్టి) తన రంగును మారుస్తుంది. సంపద అవసరం లేదు. కానీ అది నిన్ను అనేక లంపటములలో ఇరుక్కునేలా చేస్తుంది. అంతే.

వివరణము: శరీరం గందరగోళ సంకేతాలను చూప​వచ్చు కాబట్టి, సున్నితంగా, తెలివిగా మరియు జాగ్రత్తగా ఉండాలి అని దేహమును నమ్మరాదు తో సూచించారు.

రెప్పలమరఁ గదె రేపును మాపును అనే కీర్తనలో వూహల దేహమే అని వర్ణించి, ఆలోచన ద్వారా శరీరం మీ మనస్సుతో కలుపబడిందని, మనస్సు దాన్ని ఆడిస్తుందని అన్నమాచార్యులు పేర్కొన్నారు.

ప్రకటించి కనకమే భ్రమయించీ జగము ఈ సంపద  కనబడుతుండగానే  ప్రపంచమంతటినీ మైకమున కమ్మివేయును అని సెలవిచ్చారు.

సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు

బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింత
నెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే       ॥ఒక్క॥ 

sammatiMchu jIvuDA saMsAra mokajADa gAdu

bimmaTi poddokajADa penachu niMte
yimmula SrIvEMkaTESa DitanimUlamE yiMta
nemmi dAnE gatiyaMTE nityamavu niMtE      okka 

Word to Word meaning: సమ్మతించు (sammatiMchu)= accept;  జీవుడా (jIvuDA) = O Man! సంసారము (samsaramu) = life;  ఒక (moka) = one; జాడ (jADa) = way/ method; గాదు (gAdu) not; బిమ్మటి (bimmaTi) = దుఃఖము, sorrow; పొద్దొకజాడ (poddokajADa) = every time in a different way; పెనచు (penachu) = twist; నింతె (niMte) = that’s all; యిమ్ముల (yimmula) = uncountable;  శ్రీవేంకటేశడు (SrIvEMkaTESaDu) = Lord Venkateswara; ఇతనిమూలమే (itanimUlamE) = due to his cause; యింత (yiMta) = everything;  నెమ్మిఁ (nemmi) = with love and affection;  దానే (dAnE) = only HE himself; గతియంటే (gatiyaMTE) =proclaim as  only way;  నిత్యమవును (nityamavunu) = permanently, continuously; ఇంతె (iMte) = that’s all;

Literal meaning: O Man! accept that the life has no prescribed method to live. The sorrow will haunt (twist) you every day (in one shape or the other). Lord Venkateswara is the cause of all the things (in the universe). When you say with love affection that he is the only way, (you will know what is) permanent.

Explanation: saMsAra mokajADa gAdu (సంసార మొకజాడ గాదు) is signifying that there is no particular way to live life. There is no formula for life. Now compare it with famous Jiddu Krishanamurti’s statement. Truth is a pathless land. In view of these statements, because indeterminable nature of the path;   is it reasonable to seek path from God?

Also notable is that visitations of troubles is common for all men. Thus that liberated does not enjoy any higher status They painstakingly work their way thru (that is the hard work mentioned by Annamayya, Jiddu and other great philosophers) the troubles whereas we unable to face, look for cocoon of safety (we satisfy with pretences like I will muster courage tomorrow, let me get some money for protection of my family, If God has given me the strength etc) and pity ourselves for the troubles.

భావము: మానవుడా! జీవించడానికి నిర్దేశిత పద్ధతి లేదని అంగీకరించు. దుఃఖము ప్రతిరోజూ (ఏదో ఒక రూపంలో) మిమ్మల్ని వెంటాడుతుంది. (విశ్వంలో) అన్నింటికి మూల కారణం వేంకటేశ్వరుడు. ప్రేమతో అతడే ఏకైక మార్గం అని నువ్వన్నప్పుడు శాశ్వతమైనది (ఏమిటో మీకు తెలుస్తుంది) 

వివరణము: సంసార మొకజాడ గాదు జీవితాన్ని గడపడానికి ప్రత్యేకమైన మార్గం లేదని సూచిస్తుంది. అనగా జీవితానికి ఒక సూత్రం లేదు. ఇప్పుడు దానిని  జిడ్డు కృష్ణమూర్తి ప్రముఖ ప్రకటన "సత్యాన్వేషణకు ఇదమిత్థమైన దారి లేదు"తో సరిపోల్చండి. ఇప్పుడు  చెప్పండి, యిట్టిదని చెప్పనలవికాని దారిని “దేవుడా నాకు దారి చూపు" అనడం ఎంత వరకు సబబు?

విముక్తి పొందినవారికి మరియు సామాన్యులకు ఇబ్బందులు ఒకే విధంగా ఉండటం గమనార్హం. విముక్తి పొందినవారు ఈ విషయంలో ఎటువంటి రాయితీ పొందరు. వారు కష్టపడి అవరోధాలను దాటుతారు (అన్నమయ్య చెప్పిన కృషి ఇదే). మనము ఎదుర్కొనే ధైర్యములేక అలవాటైన పక్క దారులలో దూరి (“నేను రేపు ఇంకా ధైర్యము తెచ్చుకుని ఎదుర్కొంటా”,  “నా కుటుంబానికి కొంత ధనము ఏర్పాటు చేసి తరవాత దీని సంగతి చూస్తా”, “భగవంతుడు నాకు బలము ఇచ్చి ఉంటే నేనూ చేయగలిగే వాణ్ణి” వంటి రక్షణ గూళ్ళనే నెపాలు ఎంచుకుని) అయ్యో కష్టం వచ్చిందని బాధ పడతాం.

 

Copper Leaf: 99-6  Volume 1-500


3 comments:

  1. మనలను బ్రోచేవాడు,తరింపజేసే వాడు నిత్యుడు, నిర్వకారి అయిన అంతర్యామి యొక్కడే. హృద్గుహల్లో ఉండే ఆ పరమాత్మను తెలిసికొనుటకు ప్రయత్నశీలురు కండి.మిగిలినవన్నీ అంటే మనస్సనే అంతఃకరణము ద్వారా ఆలోచనలను రేకెత్తించే భౌతికమైన,అనిత్యమైన విషయవస్తువులే.మనస్సే కోరికలకు మూలం..జీవుణ్ణి ఇంద్రియాల ద్వారా వశపఱచుకొనే సాధనం మనస్సే.

    బాహ్యకరణములైన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు జీవుణ్ణి విషయవస్తువుల యందు భ్రమను కల్పింపజేసి,ఆకర్షితుడిని చేసి బంధిస్తాయి.అవి సంసారబంధమునకు కారణములే గాని ఆస్తులు కావు.

    దేహం కూడా ఆశాశ్వతమైనది.ఈ క్షణంలో ఉంటుంది, మరు క్షణంలో పోతుంది.అనుక్షణం వికారములను పొందే దేహాన్ని నమ్మవద్దు.ధనము కూడా అనేక బంధాలకు కారణభూతమైనది.దుఃఖహేతువు కూడా. అందుకే ఈ రెండింటి యెడ జాగ్రత్త అవసరం.

    జీవితంలో దుఃఖము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. జీవితాన్ని ఈవిధంగానే జీవించాలనే నిర్దిష్టమైన సూత్రం కాని మార్గం కాని కానరాదు. శ్రీవేంకటేశ్వరుడే అన్నింటికీ కారణమని, ఆయనే ముక్తికి ఏకైక మార్గమని విశ్వసించి,ఆయననే ఆశ్రయించి, భక్తిశ్రద్ధలతో సేవిస్తే నిత్యము,శాశ్వతమైనది యేదో తెలుస్తుందని ఈ కీర్తనలో అన్నమయ్య మనకు ముక్తిపథమును చూపిస్తున్నాడు.
    🙏

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...