Sunday, 5 September 2021

81. వెలుపల మఱవక లోపల లేదు (velupala ma~ravaka lOpala lEdu)

 

ANNAMACHARYA

81. వెలుపల మఱవక లోపల లేదు 

Introduction:  In this is deeply enigmatical verse, you will find path breaking Annamacharya, a great truth seeker transcending traditional systems and severing their affiliation.

I feel he wrote these poems not in leisure, but  witnessing something indescribable, not possible to comprehend and not possible to explain.

He invoked names of numerous Hindu Gods, used name of Lord Venkteswara in every single poem  as means to convey his ideas. No doubt he is a devout Hindu, but definitely not in conventional sense.

Most notable point is that, Annamacharya tried his best to explain in most simple words. There is not a single difficult word, yet this poem is one of the most complicated. But our understanding being steeped in material and it’s not readily comprehendible. This necessitated long explanation.

ఉపోద్ఘాతము:  నేక గుప్తార్ధములుకల ఈ కీర్తనలో, సాంప్రదాయక సూత్రాలను, సిద్ధాంతాలను అధిగమించుతూ  అగమ్యగోచరమై, మార్గము అగుపించని అలౌకిక  విషయాన్ని అన్నమాచార్యులు వివరించడం కనుగొంటారు. ఆయన ఈ కవిత్వం విశ్రాంతిగా కూర్చుని వ్రాసింది  కాదని, వర్ణించలేని, అర్థం చేసుకోవడానికి సాధ్యం కాని, వివరించలేని దానిని కన్నులెదుట చూస్తూ వ్రాసినట్లు భావిస్తాను. ఇంకా అన్నమాచార్యులు సంప్రదాయ వ్యవస్థలలో పెంచబడినప్పటికీ వాటి అనుబంధాన్ని తెంచుకుంటూ ఎదిగిన​ సత్యాన్వేషి అని పేర్కొనడానికి ఈ ఒక్క కీర్తన సరిపోతుంది.

ప్రతి ఒక్క కవితలో వెంకటేశ్వర స్వామి పేరును తాను వీక్షించినదాన్ని మాటలలో, సంఙ్ణార్థము తెలియజేయడానికి ఉపయోగించాడు. నిస్సందేహంగా ఆయన అత్యంత భక్తి ప్రపత్తులు గల హిందువే కానీ సంప్రదాయ కోణంలో కానేకాదు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్నమాచార్యులు చాలా సరళమైన పదాలలో వివరించడానికి తన వంతు ప్రయత్నం చేసారు. కానీ మన అవగాహన పదార్థ సమ్మిళితం కావడంతో అది వెంటనే గ్రహించుటకు సాధ్యం కాక మఱల మఱల యోచించ వలసిన అవసరము కలుగుతుంది. అందువల్లనే సుదీర్ఘ వివరణ ఆవశ్యమైంది. 

కీర్తన:

వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు

చలమున నిదియే ఘడియ ఘడియకును సాధించిన సుఖమటు దోఁచు॥పల్లవి॥ 

వెలుపలి వెలుఁగే చూడఁగ లోపలి వెడ చీఁకటి గాననియట్లు

అలరి ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదు
పలుమరు చీఁకటి చూడఁగఁ జూడఁగ బయలే వెలుఁగై తోఁచినయట్లు
అలయక తనలోచూపు చూచినను అంతరంగమున హరిఁ గనును॥వెలు॥ 

జాగరమే కడుఁ జేయఁగఁ జేయఁగ సతతము నిద్దుర రానట్లు

చేగల నింద్రియములలోఁ దిరిగిన చిత్తవికారము లయపడదు
యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు
యోగపు టేకాంతంబును దన మనసొగి మరవఁగ మరవఁగ హరిఁ గనును॥వెలు॥ 

దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు

ఆహ జీవుని జననమరణములు అందే పొడముచు నందడఁగు
వూహల శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము
ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుట॥వెలు॥

 

velupala ma~ravaka lOpala lEdu velupala galigina lOpala ma~rachu

chalamuna nidiyE ghaDiya ghaDiyakunu sAdhiMchina sukhamaTu dOchupallavi

velupali velugE chUDaga lOpali veDa chIkaTi gAnaniyaTlu

alari prapaMchaj~nAnikidanalO nAtmaj~nAnamu ganarAdu
palumaru chIkaTi chUDaga jUDaga bayalE velugai tOchinayaTlu
alayaka tanalOchUpu chUchinanu aMtaraMgamuna hari ganunu  velu

jAgaramE kaDu jEyaga jEyaga satatamu niddura rAnaTlu

chEgala niMdriyamulalO dirigina chittavikAramu layapaDadu
yIgati nidduravOgA bOgA nilalO suddulu ye~raganiyaTTu
yOgapu TEkAMtaMbunu dana manasogi maravaga maravaga hari ganunu velu

dEhapu TAkASapu niTTUrpulu bAhirapu bayaTa naDaginayaTlu

Aha jIvuni jananamaraNamulu aMdE poDamuchu naMdaDagu
vUhala SrIvEMkaTapati vAyuvu kogi nAkASamu vokka sUtramu
AhA prANApAnavAyuvulu Atuma nilupuTE hari ganuTa velu

 

 

Details and Explanations: 

వెలుపల మఱవక లోపల లేదు వెలుపలఁ గలిగిన లోపల మఱచు

చలమున నిదియే ఘడియ ఘడియకును సాధించిన సుఖమటు దోఁచుపల్లవి॥ 

velupala ma~ravaka lOpala lEdu velupala galigina lOpala ma~rachu

chalamuna nidiyE ghaDiya ghaDiyakunu sAdhiMchina sukhamaTu dOchu  pallavi 

Word to Word meaning: వెలుపల (velupala)  = outside; మఱవక (ma~ravaka) = if not forget, if not leave out; లోపల (lOpala) = inside; లేదు (lEdu) = not exist;  వెలుపలఁ (velupala) = if outside; గలిగిన (galigina) = exist, to be; లోపల (lOpala) = inside; మఱచు (ma~rachu) =  forget; చలమునను (chalamunanu) = by Insolence, obstinacy; ఇదియే (idiyE) = this one;  ఘడియ ఘడియకును (ghaDiya ghaDiyakunu) = hour by hour; సాధించిన (sAdhiMchina) = achieved, accomplished; సుఖము (sukhamu) =  comfort; అటు (aTu) = the other side; దోఁచు (dOchu) = felt;  

Literal meaning: If you do not forget outside, it is not there inside; In case you have it out side, it does not exist inside. You may feel achievement hour by hour by deriving comfort out of your obstinacy.

Explanation:  velupala (వెలుపల)  is indicating outside, outside body, physical shape etc. ma~ravaka (మఱవక) is signifying a definite shape or form, which must be dissolved. lOpala (లోపల)  is showing inner self including the mind and ego. The mind and ego are influenced by the outer.

The third stanza is equating god with thin air. Combining all these together, the meaning of first line of this chorus is: God is neither in the outer nor in the inner.

The meaning of second line may be taken as “anything achieved by effort, is still a conscious experience, therefore not belong to God. We may derive comfort, but is not truth.

Another important indication is given by word ghaDiya ghaDiyakunu (ఘడియ ఘడియకును). Understand that Man would like to review his progress of spiritual journey hour by hour. Is human life a cricket match to provide ball by ball progress? But regrettably, this is our actual displayed attitude. These 500 year old writings are demonstration of observation power of Annamacharya.

The Word aTu dOchu (అటు దోఁచు) is indicating that Man anticipates that he found the other thing. 

Thus the implied meaning of this chorus is: “God is neither inside nor outside. (Thus cannot found by searching). Things achieved by effort should not be confused with God.

Now, please compare this statement with Jiddu Krishanmurti’s:  Only when the mind is still, not expecting or grasping or resisting a single thing, is it possible to see what is true. It is the truth that liberates, not your effort to be free.”

భావము: బయట మరవకపోతే, అది లోపల లేదు; ఒకవేళ బాహ్యంగా కలిగిననూ, అది లోపల ఉండదు. పట్టుదలతో మొండిగా ఉంటే సాధించిన సౌకర్యం  గంట గంటకు  అనుభూతిని చెందవచ్చు.

వివరణము:.  వెలుపల  వెలుపలి శరీరం, భౌతిక ఆకారం మొదలైనవాటిని సూచిస్తుంది. లోపల  మనసు మరియు అహంతో సహా అంతర్గత స్వభావాన్ని చూపుతోంది. మనస్సు మరియు అహాలపై బాహ్య ప్రభావం ఎంతో ఉంటుంది. మఱవక  అనేది అది కరిగిపోవాల్సిన  కచ్చితమైన ఆకారం లేదా రూపాన్ని సూచిస్తుంది. మనస్సు మరియు అహములపై బాహ్య విషయముల ప్రభావము ఎక్కువ​. మన ఆహారము, భాషా, సమాజము, అనేక విధములైన ఒత్తిడిని తెస్తాయి.

మూడవ చరణం దైవము గాలితో సమానం చేస్తోంది. వీటన్నింటినీ కలిపి, ఈ పల్లవి యొక్క మొదటి పంక్తి యొక్క అర్థం: దేవుడు వెలుపల లేదా లోపలి భాగాలలో కాని లేడు.

ఘడియ ఘడియకును:  మనిషి శీఘ్ర ఫలితాలను కోరుకుంటాడు. తన ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క పురోగతిని గంటగంటకు సమీక్షించాలనుకుంటాడు. బంతి తర్వాత బంతిని ఎలా ఆడారో వ్యాఖ్యానము అందించడానికి మానవ జీవితం క్రికెట్ మ్యాచ్ కాదు కదా? 500 సంవత్సరాల పురాతన రచనలు అన్నమాచార్యుల పరిశీలనా శక్తికి నిదర్శనము.  

అటు దోఁచు అనే పదం మనిషి తాను మరొక (పరలోక​) విషయాన్ని కనుగొన్నట్లు ఊహించడాన్ని సూచిస్తుంది.

రెండవ పంక్తి యొక్క అర్ధం "ప్రయత్నం ద్వారా సాధించినది ఏదైనప్పటికీ చేతనానుభవం కనుక దైవమునకు చెందినది కాదు. మనం సంతృప్తైతే పొందవచ్చు, కానీ అది సత్యము కాదు."

ఈ పల్లవి యొక్క యొక్క భావార్థం: "దేవుడు లోపల లేదా బయట కానీ లేడు. (అందువలన శోధించడం ద్వారా కనుగొనబడడు). ప్రయత్నం ద్వారా సాధించిన విషయాలను దైవముతో తాఱుమాఱుచేసి భ్రమ పడరాదు.

జిడ్డు కృష్ణమూర్తి గారి క్రింది ప్రకటనను పరిశీలించండి. "మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏ విషయాన్ని ఆశించడమో, గ్రహించడమో లేదా ప్రతిఘటించడమో లేనప్పుడే, ఏది నిజమో చూడడం సాధ్యమవుతుంది. విముక్తి కలిగించేది సత్యమేగాని, స్వేచ్ఛగా ఉండటానికి మీ ప్రయత్నం కాదు."                                                                                                                                             

వెలుపలి వెలుఁగే చూడఁగ లోపలి వెడ చీఁకటి గాననియట్లు

అలరి ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదు
పలుమరు చీఁకటి చూడఁగఁ జూడఁగ బయలే వెలుఁగై తోఁచినయట్లు
అలయక తనలోచూపు చూచినను అంతరంగమున హరిఁ గనునువెలు॥ 

velupali velugE chUDaga lOpali veDa chIkaTi gAnaniyaTlu

alari prapaMchaj~nAnikidanalO nAtmaj~nAnamu ganarAdu
palumaru chIkaTi chUDaga jUDaga bayalE velugai tOchinayaTlu
alayaka tanalOchUpu chUchinanu aMtaraMgamuna hari ganunu           velu

 

Word to Word meaning:  వెలుపలి (velupali) = outside; వెలుఁగే (velugE)= light; చూడఁగ (chUDaga) = seeing, observing; లోపలి (lOpali)  = inside; వెడ (veDa) = ugly, wicked, useless;  చీఁకటి (chIkaTi) = darkness;  గాననియట్లు (gAnaniyaTlu) = unable to see, unable to find;  అలరి (alari) = captivating;  ప్రపంచజ్ఞానికిఁ (prapaMchaj~nAniki) = person with great understanding of world ( more in the sense of knowledge and application to make money); దనలో (danalO) = inside himself; నాత్మజ్ఞానము (nAtmaj~nAnamu) = self-knowledge; గనరాదు (ganarAdu) = cannot be found/seen); పలుమరు (palumaru) = many times; చీఁకటి (chIkaTi) = darkness; చూడఁగఁ జూడఁగ (chUDaga jUDaga) = repeated observation; బయలే (bayalE) = శూన్యము, empty, వెలుఁగై (velugai) = light; తోఁచినయట్లు (tOchinayaTlu) = appears to be; అలయక (alayaka) = without getting tired, indefatigably; తనలోచూపు (tanalOchUpu) = look inside; చూచినను chUchinanu) = seeing thus; అంతరంగమున (aMtaraMgamuna) = in his hear/mind;  హరిఁ(hari) = lord Hari,  A ray of Light; గనును (ganunu) = Will find;

Literal meaning: After long exposure to outside light, mind cannot understand the treacherous darkness inside. Those who are adept at worldly ways, most often, cannot find self-knowledge within themselves. After looking at the darkness inside, emptiness appears as light. If one searches inside oneself indefatigably, he will find God Hari/Light.

By velupali velugE (వెలుపలి వెలుఁగే) Annamayya is signifying the physical, material victories we achieve. These obviously overwhelm and dilute the inner, is indicated by lOpali veDa chIkaTi gAnaniyaTlu (లోపలి వెడ చీఁకటి గాననియట్లు) unable to see the pitch darkness inside.

What is this darkness? What we fill the mind with. “That Lady is beautiful; this fellow will be after my job and let me give him strong counter; I will go Switzerland next year; my son should be a great doctor; I need all the comforts of life; If I were the president, I would change the world; Let me forget this ugly world in the commiseration of liquor; it’s not my job to correct the society; I will pray god to ensure better life after death; etc. etc.”

Careful observation reveals that these conclusions actually obliterate or distort our view of the world irrevocably. Yet surprising thing is that we know it and still continue with it. Take each of these conclusions as a dust particle. Even the bright light of sun gets affected by the tiny dust particles and make sun appear reddish during sun rise and sunset. Now, what to speak of feeble light we deal with.

Anything that is contributing to distortion, however comforting it might be, is an obstacle. When clarity is there in mind that such distortions are making us to see the world thru a cloured glass, there exists a possibility to dismantle it.

If we are busy with many tasks from dawn dusk Where will there be energy for the insight? Annamayya suggested that man should accumulate all his energy with alayaka (అలయక) and use it in aMtaraMgamuna hari ganuTalO (అంతరంగమున హరిఁ గనుటలో) meditation without wasting it elsewhere. This also signifies know that Prayer or Meditation is not a part time activity.

prapaMchaj~nAnikidanalO nAtmaj~nAnamu ganarAdu (ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదు) We often confuse the worldly trickery with wisdom. Tricks are learnable, not wisdom. We learn lot of tricks thru so called education to earn money. Annamacharya says all these tricks are no avail on the path of self-realisation. He is asserting that they are rather obstacles.

If we have a small scar on our eye glasses, it may bother us for a while, but then we get used to it and forget about the scar. We work normally after some time despite the scar. In the same way, even if we initially recognize the flaws in ourselves, we tend to ignore. After a while, we forget that flaw. Many distortions of this kind come and stay within us. If they happen to bring money and happiness, we will treasure to see them as right and not wrong. That is the reason, who are adept at worldly wisdom, often falter on path of self-realisation.

By the word lOchUpu (లోచూపు) he is indicating distortion free view. A view that is not meddled by distortions of the mind. By hari ganunu (హరిఁ గనును) Annamayya meant 2 meanings: first, sees Lord Hari; second: sees a Ray of Light. Thus we may take that finally what he witnessed something he could not imagine, grasp or interpret.

భావము:  వెలుపలి కాంతిని చూసిన  తరువాత, మనస్సు తన లోపలి వికృతమైన చీకటిని అర్థం చేసుకోలేదు. ప్రాపంచిక మార్గాల్లో నైపుణ్యం ఉన్నవారు, చాలా తరచుగా తమలోని ఆత్మజ్ఞానాన్ని కనుగొనలేక పోతారు. లోపల చీకటిని చూసి చూసి శూన్యమైన కాంతిలాగా అనిపిస్తుంది. ఎవరైనా తనలో తాను నిర్విరామంగా శోధిస్తే, అతడు  దేవుడైన హరిని/కాంతిని కనుగొంటాడు.

వివరణము: వెలుపలి వెలుగే  ద్వారా అన్నమయ్య మనం సాధించు భౌతిక విజయాలను సూచిస్తున్నారు. ఇవి స్పష్టంగా లోపలికి ఇంకి, మరియు అక్కడి వెలితిని కప్పేందుకు పనిచేస్తాయి. దీంతో మనిషికి తనలోని  వెడ చీకటి గానియట్లు నిజమౌతుంది.

వెడ చీకటితో అతను లోపల చీకటిని సూచిస్తున్నాడు. ఈ చీకటి ఏమిటి? మనం మనస్సును దేనితో నింపుతాము. ఆ యువతి అందంగా ఉంది; ఈ వ్యక్తి నా ఉద్యోగం హరించేయడానికి చూస్తున్నాడు; నేనతనికి మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాను.; నేను వచ్చే ఏడాది స్విట్జర్లాండ్ వెళ్తాను; నా కొడుకు గొప్ప డాక్టర్ కావాలి; నాకు జీవితంలోని అన్ని సౌకర్యాలు కావాలి; నేను అధ్యక్షుణ్ణైతే (ప్రెసిడెంట్) అయితే, నేను ప్రపంచాన్నే మారుస్తాను; మద్యం కల్పించే సాంత్వనలో నేను ఈ వికారమైన ప్రపంచాన్ని మర్చిపోతాను; సమాజాన్ని సరిచేయడం నా పని కాదు; మరణం తర్వాత మెరుగైన జీవితాన్ని అందించడానికి నేను దేవుడిని ప్రార్థిస్తాను;” మొదలైనవే కదా!

పైన పేర్కొన్న తీర్మానాలు వాస్తవంగా ప్రపంచం గురించి మన దృష్టికోణాన్ని తిరుగులేని విధంగా మరుగుపరుస్తాయి లేదా వక్రీకరిస్తాయి. ఒక్కొక్క వక్రీకరణ ఒక్క ధూళి కణమనుకొంటే, అలాంటి ఎన్నో ధూళి కణములు చేరి మన దృష్టి కోణపు రంగును మార్చేస్తాయి. సూర్యుని ప్రకాశవంతమైన కాంతి కూడా చిన్న ధూళి కణాల ద్వారా ప్రభావితమవుతుంది. ధూళి కణాలే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపించేలా చేస్తాయి.

ఈ వక్రీకరణకు దోహదపడే ఏదైనా, అవి ఎంత ఆనందాన్ని, సంతృప్తినీ ఇవ్వనీయండి, అడ్డంకిగానే ఉంటుంది. మనస్సులో ప్రపంచాన్ని రంగుల గాజు ద్వారా చూస్తున్నాము అన్న స్పృహ ఉంటే దానిని కూల్చే అవకాశం ఉంటుంది.

ప్రొద్దుట్నుంచి సాయంత్రం అనేక పనుల్లో ములిగి ఉంటే, అలాంటి వారు అలసిపోరా? వారు ఏవిధంగా లోచూపు చూడగలుగుతారో? అలయక  అనేదాంతో మనిషి తనకున్న శక్తినంతా కూడగట్టుకుని వేరెక్కడా వృధా కానివ్వకుండా అంతరంగమున హరిఁ గనుటలో ఉపయోగించవలెనని అన్నమయ్య సూచించారు. భగవద్ధ్యానము పాక్షిక వ్యవసాయం కాదు (పార్ట్ టైం జాబ్ కాదు) అనికూడా తెలియవలె.

మన కళ్ళద్దాల మీద చిన్న మచ్చ ఉంటే అది మన్ని కొంచెంసేపు విసిగించినా, తరవాత అలవాటు పడి, ఆ మచ్చ ఉన్న విషయమే మరచి పోతాం. అదే రకంగా, మనలోని లోపాల్ని మొదట్లో గుర్తించినా, రానురాను పట్టించుకోం. కొంత కాలానికి మనలో ఆ లొపముందనే మరచిపోతాం. ఈ  రకంగా అనేక వక్రీకరణలు మనలో వచ్చి చేరతాయి. ఆవి మనకు డబ్బులు, సుఖము తెచ్చిపెడుతూ ఉంటే, వాటిని తప్పుగా కాక ఒప్పుగా చూడ్డం కూడా నేర్చుతాం. దానినే  ప్రపంచజ్ఞానం తో అన్నమయ్య సూచించారు..

మనము తరచుగా ఉపాయాలను జ్ఞానంతో పొరపడతాము. ఉపాయాలను నేర్చుకోగలము కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బు సంపాదించడానికి విద్య అని పిలవబడే అనేక ఎత్తుగడలు, సాధనములు, తంత్రములు నేర్చుకుంటాము. ప్రపంచజ్ఞానికిఁదనలో నాత్మజ్ఞానము గనరాదుతో అన్నమాచార్యులు ఎత్తుగడలు, సాధనములు, తంత్రములతో స్వీయ-సాక్షాత్కార మార్గంలో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. పైగా అవి అడ్డంకులని ఆయన నొక్కిచెప్పారు.

అన్నమయ్య హరి గనును  అంటూ రెండుఅర్థాలు పెట్టి ఇంకా సంగ్దిద్ధంలోనే ఉంచేశారు: ముందుది, భగవానుడైన హరిని చూశాడు; రెండవది: కాంతి కిరణాన్ని చూశాడు. ఆవిధంగా అన్నమయ్య ఊహించలేని, గ్రహించలేని లేదా అర్థం చేసుకోలేని దానిని చివరకు చూశాడు అనుకోవచ్చు.

జాగరమే కడుఁ జేయఁగఁ జేయఁగ సతతము నిద్దుర రానట్లు

చేగల నింద్రియములలోఁ దిరిగిన చిత్తవికారము లయపడదు
యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు
యోగపు టేకాంతంబును దన మనసొగి మరవఁగ మరవఁగ హరిఁ గనునువెలు॥

 jAgaramE kaDu jEyaga jEyaga satatamu niddura rAnaTlu

chEgala niMdriyamulalO dirigina chittavikAramu layapaDadu
yIgati nidduravOgA bOgA nilalO suddulu ye~raganiyaTTu
yOgapu TEkAMtaMbunu dana manasogi maravaga maravaga hari ganunu velu

Word to Word meaning:  జాగరమే (jAgaramE)= wake up all night; కడుఁ (kaDu)= many times; జేయఁగఁ జేయఁగ (jEyaga jEyaga) = perfomed;  సతతము (satatamu) = all the time; నిద్దుర (niddura) = sleep; రానట్లు (rAnaTlu) =  not getting; చేగల (chEgala) = ఉదారముగా, liberally;  నింద్రియములలోఁ (niMdriyamulalO) = in the sense organs; దిరిగిన (dirigina) = roamed; చిత్తవికారము (chittavikAramu) = inversions of the mind;  లయపడదు (layapaDadu) =  ( literal meaning: unable to see the fraud, trick, deceit, illusion) unable to comprehend; యీగతి  (yIgati) = this way; నిద్దురవోఁగాఁ nidduravOgA = sleeping; బోఁగా (bOgA) = continue; నిలలో (nilalO)  = in this world; సుద్దులు (suddulu) = news;  యెఱఁగనియట్టు (ye~raganiyaTTu) = do not know;  యోగపు టేకాంతంబును (yOgapu TEkAMtaMbunu) = in the loneliness of the yoga; దన (dana) = slef;   మనసొగి (manasogi) = submit mind properly; మరవఁగ మరవఁగ (maravaga maravaga) = forget & lose remembrance; హరిఁ (hari) = Lord Hari;  గనును (ganunu) = Will find;

Literal meaning: If a person keeps awake continuously for many days, his eye get used to awaken state and will not let him go to sleep. In the similar way, the mind that gets liberally engaged in the sense organs will not comprehend the illusions it creates on the person. Like a person in deep sleep for long time will not know the latest happenings of the world, A person in the loneliness of yoga; submits his mind to the will of God, he forgets and lose remembrance of the past and finds God Hari/Light.

Explanation: chittavikAramu (చిత్తవికారము) is inversion of the mind are those distortions that happen during the journey of life. Do we really know them? Most often we keep symbols in the mind. We may accept dissolution of symbols we donot like. What about symbols we love passionately?

Thus our mind works on selective basis. Obviously it puts inconvenient things in the waste basket. Unfortunately, this deleted file bin does not get deleted as easily as in a computer. They stay there. They create what we call as stress and complicate things. There is no medicine invented to forget. Alcohol and drugs work on temporary basis. They are not solutions at all.

maravaga maravaga (మరవఁగ మరవఁగ). How can a person forget a thing intentionally? Impossible. Then What Annamayya is saying? yOgapu TEkAMtaMbu (యోగపు టేకాంతంబు) = in the loneliness of the yoga). Is anyone lonely on this planet? We may be in seclusion, but our mind is occupied with thousands of thoughts. Thus we are never alone. As long as thoughts are interfering loneliness is not experienced, even if a person is sitting in inaccessible corner of Himalayas.

However Annamacharya is aware that this isolation is not sufficient, actual need is devotion in every sense of body, soul and mind as single unit. For that he wrote the verse తగు మునులు ఋషులు తపములు సేయఁగ గనము మోచియుఁ గర్మము దెగదా (Copper Leaf 17-1, Volume 1-101) tagu munulu Rushulu tapamulu sEyaga gaganamu mOchiyu garmamu degadA, implying that so many saints have moved the mountains and the sky. And yet are unable to break the barrier of chores.

Do not forget that what we eat, what language we use, the place of living have certain bearing on our mind. Still do we have devotion to forget the needs of Body? Do we have sensitivity to overcome inversions of the mind. Need is not Himalayas, not where one resides. But mind should free from those listless activities. Then that is yOgapu TEkAMtaMbu (యోగపు టేకాంతంబు)..

yIgati nidduravOgA bOgA nilalO suddulu ye~raganiyaTTu (యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు) is indicating that this loneliness is not meant for few hours or days. 

భావము:  ఒక వ్యక్తి చాలా రోజులు నిరంతరం మేల్కొని ఉంటే, అతని కన్నులు మేల్కొని ఉండటానికే అలవాటుపడి అతన్ని నిద్రపోనివ్వవు. అదేవిధంగా, ఇంద్రియాలలో స్వేచ్ఛగా నిమగ్నమయ్యే మనస్సు వ్యక్తిపై సృష్టించే భ్రమలను గ్రహించలేదు. సుదీర్ఘకాలం గాఢనిద్రలో ఉన్న వ్యక్తికి ప్రపంచంలోని తాజా పరిణామాలు తెలియవు. యోగపు ఒంటరితనంలొ వ్యక్తి; దేవుని చిత్తానికి తన మనస్సును సమర్పించుకుంటాడు. అతను గతాన్ని మర్చిపోతాడు, కోల్పోతాడు మరియు హరిని/కాంతిని కనుగొంటాడు.

వివరణము: చిత్తవికారము అనేది మనస్సు యొక్క విలోమమే. జీవిత ప్రయాణంలో జరిగే వక్రీకరణలే. అవేమిటో నిజంగా మనకు తెలుసా? తరచుగా మనం చిహ్నాలను మనస్సులో గుర్తుగా పెట్టుకుంటాము. మనకు నచ్చని చిహ్నాల రద్దును మనం అంగీకరించవచ్చు. మనం ప్రేమగా ఇష్టపడే చిహ్నాల మాట​ ఏమిటో? 

మన మనస్సు ఇష్టాయిష్టాల ప్రాతిపదికన పనిచేస్తుంది. సహజంగానే ఇది చెత్త బుట్టలో అసౌకర్యమైన చిహ్నాలను ఉంచుతుంది. దురదృష్టవశాత్తు, ఇవి కంప్యూటర్‌లో లాగా సులభంగా తొలగించబడదు. అవి అక్కడే ఉంటాయి. అవి మనపై ఒత్తిడి  సృష్టిస్తాయి మరియు  క్లిష్టతరం చేస్తాయి. మర్చిపోవడానికి మందు కనిపెట్టలేదు. మద్యం మరియు మాదక ద్రవ్యాలు తాత్కాలికంగా పనిచేసినా, వాటి ప్రభావం తగ్గిపోగానే యధాస్థితికి చేరుకుంటాం. అవి అస్సలు పరిష్కారాలే కావు.

మరవగ మరవగ. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక విషయాన్ని ఎలా మర్చిపోగలడు? అసాధ్యం. ఐతే అన్నమయ్య ఏం చెబుతున్నాడో? యోగపు టేకాంతంబును అన్నాడు. ఈ గ్రహం మీద ఎవరైనా ఏకాంతంలో ఉన్నారా? మనం ఒంటరిగా  ఉండవచ్చు, కానీ మన మనస్సు వేలాది ఆలోచనలతో నిండి ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ ఏకాంతంలో ఉండము. ఆలోచనలు జోక్యం చేసుకుంటున్నంత కాలం,  హిమాలయాలలో చేరుకోలేని మారు మూలలో కూర్చున్నప్పటికీ, ఏకాంతము అనుభవించబడదు.

శరీరము, ఆత్మ మరియు మనస్సులకు ఒకే సాధనముగా భక్తి అనేది నిజమైన అక్కర​. మిగిలినవన్నీ వ్యర్ధములే. అందుకే ఆయన తగు మునులు ఋషులు తపములు సేయగ గనము మోచియుఁ గర్మము దెగదా (రాగి ఆకు 17-1, సంపుటము 1-101) అనే కీర్తనలో అనేక మంది మునులు ఋషులు  పరి పరి విధముల యత్నించిననూ కర్మముల అడ్డంకిని ఛేదించలేకపోయారన్నారు.

మనం ఏమి తింటామో, ఎలా  మట్లాడతామో, ఏ భాషను ఉపయోగిస్తామో, నివసించే ప్రదేశం మన మనస్సుపై కొంత ప్రభావం చూపనే చూపుతుంది. శరీర అవసరాలను మరచిపోయే అంత  మనకు భక్తి ఉందా? మనస్సు యొక్క విలోమాలను అధిగమించే  సున్నితత్వం ఉందా? హిమాలయాలు, నివసించే ప్రదేశం ముఖ్యం కాదు. ఆ లెక్కలేని కార్యకలాపాల నుండి మనస్సు విముక్తి పొందాలి. అప్పుడే అది యోగపు టేకాంతంబు

యీగతి నిద్దురవోఁగాఁ బోఁగా నిలలో సుద్దులు యెఱఁగనియట్టు (గాఢనిద్రలో ఉన్న వ్యక్తికి ప్రపంచంలోని తాజా పరిణామాలు తెలియవు) ఈ ఏకాంతం కొన్ని గంటలు లేదా రోజులో కాదు అని తెలుపుతోంది. 

దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు

ఆహ జీవుని జననమరణములు అందే పొడముచు నందడఁగు
వూహల శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము
ఆహా ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుటవెలు॥ 

dEhapu TAkASapu niTTUrpulu bAhirapu bayaTa naDaginayaTlu

Aha jIvuni jananamaraNamulu aMdE poDamuchu naMdaDagu
vUhala SrIvEMkaTapati vAyuvu kogi nAkASamu vokka sUtramu
AhA prANApAnavAyuvulu Atuma nilupuTE hari ganuTa velu

 

Word to Word meaning:  దేహము (dEhamu) = Body; ఆకాశపు (AkASapu) = gases నిట్టూర్పులు (niTTUrpulu) = deep sighs; బాహిరపు (bAhirapu) బయలుపడినది, వెలియైనది, that came out; బయట (bayaTa)  = in the open; నడగినయట్లు (naDaginayaTlu) = humbled or supressed;  ఆహ (Aha) = ఆశ్చర్యార్థకం, Aye, Yes do so! జీవుని (jIvuni) = the living person;  జననమరణములు (jananamaraNamulu) = birth and death; అందే (aMdE) = in the same thing; పొడముచు (poDamuchu) =కలుగుచూ, produced, created, caused, happen; నందడఁగు (naMdaDagu) = cease/supressed in the same; వూహల  (vUhala) =of  imagination;  శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord Venkateswara; వాయువు (vAyuvu) = Wind, air; కొగి (kogi) = orderly; నాకాశము (nAkASamu) = thin air, empty space; వొక్క (vokka) = only one; సూత్రము (sUtramu) = rule; ఆహా (AhA) ఆశ్చర్యార్థకం, Aye, Yes do so! ప్రాణాపానవాయువులు (prANApAnavAyuvulu) = the inhaled and exhaled gases; ఆతుమ (Atuma) = in the self, in the mind; నిలుపుటే (nilupuTE) = holding, staying;  హరిఁ (hari) =  Lord Hari; గనుట (ganuTa) = Seeing,

Literal meaning: The deep sighs of man gets supressed in the open air. Surprisingly, birth and death occur and cease in the same way. The rule is same for the air and Lord Venkateswara (who is also air), thin air and the sky (space). In those moments, keeping the life together is seeing the God or Seeing the Light.

Explanation: This is one of the toughest stanzas, I have ventured to explain. However, let me try.

dEhapu TAkASapu niTTUrpulu bAhirapu bayaTa naDaginayaTlu (దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు)  Means that the air inside is same as outside. Thus the first two lines are implying that person has reached a stage where he does not consider anything his own, except for the breath. It is a state person feels literal oneness with the world. (Similar to this Bhagavad-Gita Shloka:  सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि sarva-bhūta-stham ātmāna sarva-bhūtāni chātmani (7-29) Will find all living beings in God and God in all living beings) In those moments there is nothing like self, but oneness with the God.

 

SrIvEMkaTapati vAyuvu kogi nAkASamu vokka sUtramu (శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము) is signifying empty space, Lord and thin air have the same rule ( or property) that is you cannot feel or see. Here the word vUhala (వూహల = imagination) is implying Annamacharya is doubtful of what he actually is witnessing.

prANApAnavAyuvulu Atuma nilupuTE hari ganuTa (ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుట) is indicative that all the associations with body and soul have to be merged with the unknown. How can one do it consciously? Therefore it is unconscious act.

If we have to walk 100 meters with eyes open it very easy. The same thing with eyes closed requires high concentration and energy. Same way this unconscious journey requires tremendous energy.

When a person reaches that state, he does not have any interest to alive, but continues life for the (sake of) God. In those moments, this act of choosing the God to death is seeing God Srihari or Seeing the Light.

భావము: మనిషి లోతైన నిట్టూర్పులు బహిరంగ ప్రదేశంలో అణచివేయబడతాయి. ఆశ్చర్యకరంగా, అదే విధంగా, జననం మరియు మరణం ఒకే విధంగా జరుగుతాయి మరియు నిలిచిపోతాయి.  వేంకటేశ్వరునికి, (పలుచని) గాలికి, ఆకాశమునకు  కూడా  నియమము ఒకటే. ఆ క్షణాలలో, గాలిని, ఆత్మను కలిపి ఉంచడమే దైవమును వీక్షించుట​.

వివరణము: ఇది కష్టతరమైన చరణాలలో ఒకటి. నేను వివరించడానికి సాహసించాను. అయితే, నా ప్రయత్నం ఎంత వరకు సఫలమైందో చెప్పలేను.

దేహపు టాకాశపు నిట్టూర్పులు బాహిరపు బయట నడగినయట్లు అంటే లోపలా బయటా ఉన్న గాలి ఒక్కటే అని గ్రహించుట​. మొదటి రెండు పంక్తులు ఒక వ్యక్తి శ్వాసను మినహాయించి, తన స్వార్ధముగా ఏమీ పరిగణించని స్థితికి చేరుకున్నట్లు సూచిస్తున్నాయి. ఇది ప్రపంచంతో ఏకమైనప్పుడు అనుభూతి చెందుతున్న స్థితి. (ఇలా అనుకోవచ్చు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని,  భగవద్గీత (7-29)  సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు). ఆ క్షణాలలో నేను అను భావన పూర్తిగా సమసిపోయి  దేవునితో ఏకమౌట జరుగును.

శ్రీవేంకటపతి వాయువు కొగి నాకాశము వొక్క సూత్రము  భగవంతునికి మరియు పలుచని గాలికి,  ఖాళీ స్థలాలకు (స్పేస్)  ఒకే విధమైన లక్షణములు.. వానిని  అనుభూతి చెందలేము లేదా చూడలేము. ఇక్కడ వూహల అనే పదం అన్నమాచార్యులకు తాను చూచినది ఏమిటో తెలియలేదన్న​  సందేహాన్ని  చెబుతుంది.

ప్రాణాపానవాయువులు ఆతుమ నిలుపుటే హరిఁ గనుట శరీరం మరియు ఆత్మతో అన్ని అనుబంధాలు తెలియని  దైవములో విలీనం చేయడాన్ని సూచిస్తుంది. దీనిని స్పృహతో  చేయలేం కనుక  అపస్మారక చర్యే. 

మనం కళ్ళు తెరిచి 100 మీటర్లు నడవవలసి వస్తే అది చాలా సులభం. కళ్ళు మూసుకుని అదే పనికి అధిక ఏకాగ్రత మరియు శక్తి అవసరమౌతాయి. అదే విధంగా ఈ అపస్మారక ప్రయాణానికి ఊహించలేనంత శక్తి అవసరం. 

వ్యక్తి ఆ స్థితికి చేరుకున్నప్పుడు, అక్కడ అతడు సజీవంగా ఉండటానికి ఎలాంటి ఆసక్తిని కలిగి ఉండడు. కానీ (దేవుని కొరకు) జీవితం కొనసాగిస్తాడు. ఆ క్షణాలలో,  మరణము బదులు దైవమును ఎంచుకునే చర్యయే దేవుడైన  శ్రీహరిని చూడటం లేదా కాంతిని (వెలుగును) కనుగొనడం.

 

Copper Leaf: 134-1, Volume 2-137

6 comments:

  1. Very deep and detailed explanation. Absolutely true.keep it up

    ReplyDelete
  2. చక్కని భావం. బాగా వ్రాశారు. దైవంనే నమ్ముకుని జీవితం సాగించడం ఉత్తమం.

    ReplyDelete
  3. శ్రీ చామర్తి శ్రీనివాస్ గారు! మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉన్నది. అతి క్లిష్టమైన, గహనమైన కీర్తన యిది.వివరణ కష్టసాధ్యమైనది. సరళంగా చాలా బాగా వివరించారు.ధన్యవాదములు.
    💐💐🙏

    ReplyDelete
  4. అంతరింద్రియములైన మనస్సు, అహం అనేవి ఇంద్రియముల ద్వారా బాహ్య విషయములచే
    ప్రభావితమై కలుషితమై పోతున్నాయి.అందువలన భగవంతుడు బాహ్యంలోనూ, అంతర్గతంగానూ కూడా లేడు.
    ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించినా కాని ఆది చేతనావస్థలో పొందినదే కాని దైవం కాదు.అదే సత్యస్వరూపమైన దైవమని భ్రమపడరాదు.అట్లా శోధించటం ద్వారా దైవాన్ని కనుగొనలేము అని అన్నమయ్య సూచిస్తున్నాడు.

    బాహ్యప్రపంచంతో అనుసంధానమైన వాడు తనలోన గల తిమిరాంధకారాన్ని గ్రహించలేడు.అంటే ప్రాపంచిక విషయాలలో చిక్కుకొన్నవారు తమలోని ఆత్మజ్ఞానాన్ని తెలిసికోలేరు.బాహ్యవిషయములు ఆత్మజ్ఞానానికిఅవరోధములుగా పనిచేస్తాయి.లోనగల చీకటిని చూచి చూచి, దానినే శూన్యమైన కాంతిపుంజమని భ్రమ పడతారు.
    కాని మనస్సు, ఇంద్రియములను స్వాధీనపరచుకొని అంటే బాహ్యముచే కలిగే వాటి అడ్డంకులను పూర్తిగా నిర్మూలించి,స్థిరచిత్తంతో తనలోనే నిర్విరామముగా శోధిస్తే స్వయంప్రకాశము,సర్వజ్ణుడు అయిన భగవంతుడిని అంటే ఆ హరిని కనుగొనవచ్చునని అన్నమయ్య అజ్ఞానం,జ్ఞానం;
    తిమిరాంధకారం, జ్ఞానప్రకాశం- వీటి మధ్య గల అంతరాన్ని, దైవాన్ని కనుగొనే మార్గాన్ని చక్కగా విశదీకరిస్తున్నాడు.

    చాలా రోజులు *జాగ్రదావస్థలో* ఉండే వాడు ఆ స్థితికి అలవాటైపోయి నిదురపోజాలడు.
    అంటే అతని మనస్సు విషయ వస్తువులయందు జ్ఞానేంద్రియాలతో
    అనుసంధానమై ఉంటుంది. అప్పుడతను వాటివల్ల జనియించే చిత్తవికారములైన మొహం, భ్రమలను గ్రహించలేడు.
    *సుషుప్తి* లో(గాఢనిద్ర) ఉన్నవానికి ఇంద్రియములు అసలు కారణమైన అజ్ఞానంలో లీనమైపోగా, ఐక్యమైపోగా వాటి వాటి పనులు నిర్వర్తించకుండా జడంగా ఉండిపోతాయి.బాహ్య జగత్తుకు సంబంధించిన అనుభవాలేమీ ఉండవు.
    కాని యోగనిష్ఠలో భగవంతునికి ఆత్మార్పణం చేసుకున్న యోగి గతస్మృతులను సంపూర్ణంగా మరచి *తురీయావస్థ* (సమాధి స్థితిను చేరి భగవంతుడిని కనుగొంటాడు.అనిర్వచనీయమైన ఈ అవస్థలో అవిద్య నశించి సంపూర్ణ జ్ఞానానందం కలుగుతుంది. ఈ తురీయుడే ఓంకారం అంటుంది ఉపనిషత్తు.

    ప్రాణము లైదు. పంచప్రాణములనే ఐదు రకముల వాయువులు శరీరంలో ఉచ్చ్శ్వాస నిశ్వాసల ద్వారా సంచరిస్తూ ఉంటాయి.ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి యుంటుంది.ఈ సంచారం ఆగిపోతే అన్ని జీవనక్రియలు ఆగిపోయి మరణం సంభవిస్తుంది. ప్రాణావాయువు ఒక్కటే ఐదు రూపములలో జనన, మరణములనే ప్రకృతి క్రియలు జరిగిపోతూ ఉంటాయి.

    ప్రాణాపాన వాయువులను నియంత్రించి, ధ్యానస్థితిలో శ్రీహరిని శ్రవణ మనన,నిధి, ధ్యాసల ద్వారా అనుభూతి పొందటమే తురీయావస్థ.
    అవస్థలు ఉండటాన్ని, లేకపోవటాన్ని చూసే సాక్షి గాను; స్వయంగా తాను ఒకప్పుడుండటం గాని, లేకపోవటం గాని లేకుండా నిత్యంగా, నిరంతరంగా,ఎడ తెగకుండా, అఖండంగా జ్ఞాన రూపంగా, ఏది ఉంటున్నదో అదే తురీయం. భగవద్గీత లో చెప్పినట్లు ( సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని) సమదృష్టి కలిగియుండే స్థితిని సాధకుడు పొందుతాడు.
    పసుమర్తి కృష్ణ మోహన్
    విశాఖపట్నం

    ReplyDelete
  5. సర్వత్రా హరిని చూడాలి కానీ అలాగ కాకుండా బాహ్యప్రపంచం మోహానికి గురి కావద్దు అని.

    పల్లవిలో వెలుపల సౌఖ్యాల కోసం చూస్తూ ఉంటే, అంతరాత్మ సంగతి మర్చిపోవాల్సిందే అని ఉద్దేశ్యం.

    అదే బాహ్య విషయాలు మర్చిపోతే, అంతరాత్మ స్పృహ కలుగుతుంది.

    వెలుపల అంటే భగవద్ విషయాలకి వెలుపల, లోపల అంటే, ఆ విషయాలకి లోపల.

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...