Wednesday 22 September 2021

86. మాయామోహము మానదిది (mAyAmOhamu mAnadidi)

 ANNAMACHARYA

86. మాయామోహము మానదిది

Introduction: In this extremely pleasing verse Annamacharya says realising the GOD is the only true thing. Rest are born of illusion.  

We in our myopic view equate time spent in labour with exchange of money. Is life so simple to capture in an equation? Isn’t it ignorance to equate precious life with anything?

All living beings must die. If one rues for whatever he got, he loses his time further.  Can Man, live conscious life without getting into bondages? Impossible!!   Therefore, Annamacharya declared that all the pursuits of man leave him high and dry ultimately.

ఉపోద్ఘాతము:   అత్యంత ఆహ్లాదకరమైన కీర్తనలో అన్నమాచార్యులు మనస్సులో భగవంతుడిని కలిగి ఉండటమే ఏకైక సత్యమని  మిగలినవన్నీ భ్రాంతి జనితములన్నారు.

మనము  హ్రస్వ దృష్టితో శ్రమతో గడిపిన విలువైన సమయాన్ని డబ్బు మార్పిడితో సమానం చేస్తాము. జీవితాన్ని ఒక​  సమీకరణంలో బంధించగలమా? అమూల్యమైన జీవితాన్ని దేనితోనైనా సమానం చేయడం అజ్ఞానమే కాదా?  సులభమైన అంకగణిత లావాదేవీలాంటిది కాదే జీవితం.

పుట్టిన ఏ జీవైన మరణించక తప్పదు. అంతమాత్రాన, ఉన్న కొద్దిపాటి సమయం కూడా ఏదో లేదని బాధపడుతూ కూర్చుంటే, సమయం కాస్తా వెళ్ళిపోతుంది. మనిషి తన చైతన్యమయ జీవితంలో బంధాలను అంటకుండా జీవించగలడా? అందుకే మనిషి యొక్క అన్ని వ్యాసంగములు/ వ్యాపకములు చివరికి మరింత అసంతృప్తినే మిగిలిస్తాయి అన్నారు అన్నమాచార్యులు.

కీర్తన:

 

మాయామోహము మానదిది

శ్రీయచ్యుత నీ చిత్తమే కలది ॥పల్లవి॥ 

యెంత వెలుఁగునకు నంతే చీఁకటి

యెంత సంపదకు నంతాపద
అంతటా నౌషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది మాయా॥ 

చేసిన కూలికి జీతమునకు సరి

పూసిన కర్మభోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన దలపే కలది మాయా॥ 

మొలచిన దేహము ముదియుటకును సరి

దలఁచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ-
గలిగిన మాకెల్ల ఘనతే కలదిమాయా॥ 

 

mAyAmOhamu mAnadidi

SrIyachyuta nI chittamE kaladi      pallavi

yeMta velugunaku naMtE chIkaTi

yeMta saMpadaku naMtApada
aMtaTA naushadha mapathyamunu sari
viMtE migilenu vEsaTE kaladi        mAyA

chEsina kUliki jItamunaku sari

pUsina karmabhOgamu sari
vAsula janmamu vaDi maraNamu sari
Asala migilina dalapE kaladi          mAyA

molachina dEhamu mudiyuTakunu sari

dalachina daivamu tanalOnu
yilalO SrIvEMkaTESa nI karuNa-
galigina mAkella ghanatE kaladi    mAyA

 Details and Explanations: 

మాయామోహము మానదిది

శ్రీయచ్యుత నీ చిత్తమే కలది      పల్లవి॥ 

mAyAmOhamu mAnadidi

SrIyachyuta nI chittamE kaladi            pallavi 

Word to Word meaning:

మాయామోహము (mAyAmOhamu) = passion and (pursuit of) illusion; మానదిది (mAnadidi) = does not leave; శ్రీయచ్యుత (SrIyachyuta) = O God Achyuta! నీ చిత్తమే (nI chittamE) = you only in the  mind;  కలది (kaladi)  = existing.           

Literal meaning: Man does not leave (pursuit of) passion and illusion. O God! Achyuta! Having ONLY YOU in the mind is true existence.

Explanation: Many of us know how true this is! Despite knowing that others have burnt their fingers, Man blindly pursues his ambition assuming himself to be cleverer. Unfortunately, He only repeats the history.

SrIyachyuta nI chittamE kaladi is signifying that pursuit of god is not easy for the multitalented personality. It is simply having God, nothing else (including thoughts and future plans) in the mind.

Just consider this nice poem by Bhadrachala Ramadasu:

Dorasina kāyamulmudimi tōcinam̐jūci prabhutvamulsirul‌

meṟapulugāgajūcimaṟi mēdinilōm̐ damatōḍivāru  muṁ
daruguṭacūci cūci tegunāyuveṟuṅgaka mōhapāśamu
ldarum̐gani vārikēmi gati dāśarathī! Karuṇāpayōnidhī!

Purport: Like the beautiful walls swelled with salt flakes with the progress of time, the old age in body unfolds. Still the fellow does not notice. Continues to uphold Monarchy, power, wealth as bright; He does not get alerted by the ascending old age notwithstanding he witnessing repeatedly his fellow beings vanishing from the face of the earth. What is the fate of those who are not freed from the bondage of passion? Dasharathi! The Compassionate!

భావము:  మాయానూ మోహమునూ మానదు ఈ మనస్సు. శ్రీయచ్యుత నీ యందే చిత్తమున్న సత్యమది.

వివరణము: ఇది ఎంత నిజమో మనందరికీ తెలుసును. అనేకానేక విషయములలో తగిలి, వాని యందు సంతృప్తి నిచ్చెదేదీ లేదని తెలిసికొని, సమయము వ్యర్ధమయ్యెనని విచారించు పలువురను చూచియూ మానవుడు తాను మిగిలిన వారందరి కంటే చాకచక్యముగా సాధించుకొని రాగలనను గ్రుడ్డి విశ్వాసంతో ముందుకెళ్ళి చరిత్రను పునరావృత్తం చేస్తాడు.

శ్రీయచ్యుత నీ చిత్తమే కలది: అంటే భగవంతుని పొందు బహుముఖ ప్రజ్ఞాశాలికి సులభమే కాదు. ఇదిదైవము మీదే మనస్సు లగ్నంచేసి వేరేమీ ఆలోచనలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు లేకుండా వర్తించడమే.

ఇంక మోహము యొక్క నిజమైన స్వరూపాన్ని భద్రాచల రామదాసు దాశరథీ శతకము నందు ఇలా చెప్పారు.

ఉ. దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్‌

మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁ దమతోడివారు  ముం
దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ! (దాశరథి శతకము 92)

తాత్పర్యము :  గోడలు ఉప్పు ఊరి పెచ్చులు ఊడిపోయి అందవికారముగా తయారైనట్లే శరీరము లోని ముసలితనము బయటపడుట చూచి;  రాచఱికము, అధికారము, సంపదలు ప్రకాశముగా భావించి; మరి భూమిమీద తమ తోటివారు తమ కళ్ళ ముందు పరమపదించుట పలుమార్లు చూచి కూడా; తరుగు చున్న ఆయువును గమనింపక మోహము,  బంధముల నుండి విముక్తులు కాకుండా వున్నవారి కేమి గతి? దాశరథీ! కరుణాపయోనిధీ!

యెంత వెలుఁగునకు నంతే చీఁకటి

యెంత సంపదకు నంతాపద
అంతటా నౌషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది      ॥మాయా॥
 

yeMta velugunaku naMtE chIkaTi

yeMta saMpadaku naMtApada
aMtaTA naushadha mapathyamunu sari
viMtE migilenu vEsaTE kaladi  mAyA 

Word to Word meaning: యెంత వెలుఁగునకు (yeMta velugunaku) quantum of light; నంతే చీఁకటి (naMtE chIkaTi) = matches with quantum of darkness; యెంత సంపదకు (yeMta saMpadaku) = quantum of wealth;  నంతాపద (naMtApada) = gets matching threat;   అంతటాను (aMtaTAnu) = everywhere; ఔషధము (aushadhamu) = medicine;  అపథ్యమును (apathyamunu) = eating prohibited food;  సరి (sari) = equal;  వింతే (viMtE) = only wonder or curiosity;  మిగిలెను (migilenu) = left out;  వేసటే (vEsaTE) = only fatigue or weariness; కలది (kaladi) = exists. 

Literal meaning: the more the light, the more the matching darkness. The more the wealth, the more is the threat. Eat prohibited food and take medicine leaves one in fatigue and makes you wonder why did I attempt (wrong thing)  in the first place? 

Explanation:  Here, Annamayaa is trying to sound a warning.  Do not get carried away in acquiring wealth. You will, further put matching efforts to save it. At the end it will leave you in wretched feeling of waste of time.  

It’s not that the medicines do not cure, but why attempt something that makes you take them. Medicine takes time to work on the body and in the meanwhile it leaves you poor state. .

భావము: యెంత వెలుఁగైతే అంతే చీఁకటి. యెంత సంపదైతే అంతే ఆపద. అపథ్యమును (తినరానిది) తిని మళ్ళీ ఔషధమును మింగడమెందుకో? ఇంతా చేస్తే కష్టంతో పాటు అయ్యో ఎందుకు తిన్నానో అనే ఏవగింపే మిగిలేది.  

వివరణము: సంపాదించడంలో పడి ఉండకండి. మీరు దానిని రక్షించుకునే ప్రయత్నాలే మరింత చేస్తారు. చివరకు, సమయం వృధా చేసిన బాధాకరమైన అనుభూతిని మిగులుస్తుంది అని  అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు.   

మందులు పనిచేయవని కాదు, కానీ వాటిని తీసుకునేలా చేసే పనులు ఎందుకు చేయాలి. ఔషధం పని చేయడానికి సమయం పడుతుంది మరియు ఈ వ్యవహారమంతా జరుగుతున్నంత సేపూ మీరు బాధలో మునిగి ఉంటారు. అడుసు తొక్కనేలా .. కాలు కడుగనేలా?

చేసిన కూలికి జీతమునకు సరి

పూసిన కర్మభోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన దలపే కలది      ॥మాయా॥ 

chEsina kUliki jItamunaku sari

pUsina karmabhOgamu sari
vAsula janmamu vaDi maraNamu sari
Asala migilina dalapE kaladi      mAyA 

Word to Word meaning: చేసిన (chEsina) = performed; కూలికి (kUliki) = labour;  జీతమునకు  (jItamunaku) = to received salary, to received wages; సరి (sari) = equal; పూసిన (pUsina) = flowered;  కర్మభోగము (karmabhOgamu) = enjoyment of work/errand/karma; సరి (sari) = equal; వాసుల (vAsula) = the residents; జన్మము (janmamu) = birth;  వడి (vaDi) = quickly; మరణము (maraNamu) = death;  సరి (sari) = equal; ఆసల (Asala) = wanting, longing;  మిగిలిన (migilina) = remainining; దలపే (dalapE) = thoughts; కలది  (kaladi) = existing. 

Literal meaning: Received wages equal to the performed labour? You will enjoy the results equal to your deeds (karma)? Birth of beings gets balanced with death? For ever, man is left with thoughts of unfulfilled hopes.

Explanation: Like the medicine does not balance the proscribed food (as in first stanza), Received wages  cannot equal  the performed labour? Enjoyed results are unequal to your deeds (karma)? Birth of beings gets does not get balanced with death?

The fact remains that the human beings are often left with unfulfilled hopes. That is why hundreds of millions of people around the world are dissatisfied and anxious. It is the same thing that puts a man in many afflictions.

భావము:  చేసిన కూలి జీతముతో సరియౌనా? పూచిన కర్మము భోగముతో సరియౌనా? భూలోక వాసుల జన్మము వడి మరణముతో సరియౌనా? మానవునికి నెరవేరని ఆశల తలపులే  మిగిలేది.

వివరణము: ముందటి చరణంలో ఔషధ మపథ్యమును సరి లో  ఔషధము అపథ్యము ఎలా సరికావో, అలాగే ఇక్కడ​ చేసిన కూలి జీతముతో సరికాదు. పూచిన కర్మము భోగముతో సరికాదు. భూలోక వాసుల జన్మము వడి మరణముతో సరికాదు అని అర్ధము.

మానవునికి నెరవేరని ఆశల తలపులే  మిగిలేది అనునది పరమ సత్యము. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్లమంది  ప్రజలు తృప్తిలేక ఆందోళన చెందుచున్నది. మనిషిని అనేక ఈతి బాధలలో ఇరికించేది అదే.. వాటి నుంచి బయటకు రాలేక మనోవ్యధనొందుతాడు.​

మొలచిన దేహము ముదియుటకును సరి

దలఁచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ-
గలిగిన మాకెల్ల ఘనతే కలది      ॥మాయా॥ 

molachina dEhamu mudiyuTakunu sari

dalachina daivamu tanalOnu
yilalO SrIvEMkaTESa nI karuNa-
galigina mAkella ghanatE kaladi          mAyA 

Word to Word meaning: మొలచిన (molachina) = taking birth;  దేహము (dEhamu) = body; ముదియుటకును (mudiyuTakunu) = to grow old;  సరి (sari) = equal, balanced; దలఁచిన (dalachina) = regarded, considered;  దైవము (daivamu) = god; తనలోను (tanalOnu) = is inside you; యిలలో (yilalO) = in this world; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = Lord Venkteswara; నీ (nI) = your; కరుణ-గలిగిన (karuNa-galigina) = showered compassion;  మాకెల్ల (mAkella) = for all of us;  ఘనతే (ghanatE) = greatness, glory;  కలది (kaladi) = is there; 

Literal meaning: The body that takes birth eventually get old (and falls). At the same time, the Lord whose name we take is there in the very body. Glories to Those receive his showered compassion.

Explanation:  Please note that  Annamayya built a case against our common place assumptions. We equate is time spent with money. We equate wealth with happiness. His main contention is that when we get engaged in these, we lose time. By repeating about birth and death twice, he is making it abundantly clear that the purpose of life is not to wait for the death to happen, but to discover the god who is there inside us.    

భావము:  మొలచిన దేహము ముడుతలుపడి పాడైపోవుటతో సరియౌనా? తలఁచిన దైవము తనలోనే ఉన్నాడు. యిలలో శ్రీవేంకటేశ నీ కరుణారసమును అందుకున్న వారికెల్ల వారికి ఘనత / గరిమ / మహిమ దక్కినది.

వివరణము: అన్నమయ్య మన సాధారణ అంచనాలకు వ్యతిరేకంగా తన వాదాన్ని నిర్మించాడని గమనించండి. మనము డబ్బుతో సమయాన్ని కొలుస్తాము. మనము సంపదను ఆనందంతో సమానంగా భావిస్తాము.  మనం వీటిలో నిమగ్నమైనప్పుడు, మనం విలువైన సమయాన్ని కోల్పోతాము అన్నది అతని ప్రధాన వాదన.

జననం మరియు మరణం గురించి రెండుసార్లు చెప్పడం ద్వారా, జీవితం యొక్క ఉద్దేశ్యం మరణం జరిగే వరకు వేచి ఉండటం కాదని, మనలో ఉన్న దేవుడిని కనుగొనడమేనని అతను చాలా స్పష్టంగా చెప్పాడు.

Summary of this Keertana:

Man does not leave (pursuit of) passion and illusion. O God Achyuta! Having ONLY YOU in the mind is true existence.   

The more the light, the more is the (matching) darkness. The more the wealth, the more is the threat. Eat prohibited food and take medicine leaves one in fatigue and makes you wonder why did I attempt (wrong thing) in the first place?  

Received wages equal to the performed labour? You will enjoy the results equal to your deeds (karma)? Birth of beings gets balanced with death? For ever, man is left with thoughts of unfulfilled hopes. 

The body that takes birth eventually get old (and falls). At the same time, the Lord whose name we take is there in the very body. Glories to Those receive his showered compassion.  

 

కీర్తన సంగ్రహ భావము:

మాయానూ మోహమునూ మానదు ఈ మనస్సు. శ్రీయచ్యుత నీ యందే చిత్తమున్న సత్యమది.

యెంత వెలుఁగైతే అంతే చీఁకటి. యెంత సంపదైతే అంతే ఆపద. అపథ్యమును (తినరానిది) తిని మళ్ళీ ఔషధమును మింగడమెందుకో? ఇంతా చేస్తే కష్టంతో పాటు అయ్యో ఎందుకు తిన్నానో అనే ఏవగింపే మిగిలేది.

చేసిన కూలి జీతముతో సరియౌనా? పూచిన కర్మము భోగముతో సరియౌనా? భూలోక వాసుల జన్మము వడి మరణముతో సరియౌనా? మానవునికి నెరవేరని ఆశల తలపులే  మిగిలేది.

మొలచిన దేహము ముడుతలుపడి పాడైపోవుటతో సరియౌనా? తలఁచిన దైవము తనలోనే ఉన్నాడు. యిలలో శ్రీవేంకటేశ నీ కరుణారసమును అందుకున్న వారికెల్ల వారికి ఘనత / గరిమ / మహిమ దక్కినది.

 

 

Copper Leaf: 298-1  Volume 3-566

 

 

 


 


3 comments:

  1. మీ వివరణ చాలా సరళంగాను, తేటతెల్లముగాను యున్నది.
    మోహబంధముల యొక్క అసలు స్వరూపమును దాశరథి శతక మందలి భక్తరామదాసు పద్యం ద్వారా వివరించి సందర్భోచితమైన
    వ్యాఖ్యానం బాగుంది.
    కీర్తన సంగ్రహ భావము చదువరులకు ఎంతో ఉపయుక్తముగా నున్నది శ్రీనివాస్ గారు. 🌹🌹🙏🙏

    ReplyDelete
  2. This gives me a feeling that the whole universe has the same amount of matter and anti-matter. The net result is zero.....Our sages ro espouse this concept is really great....Your explanations are, as usual, captivating.....👍😊

    ReplyDelete
  3. Very neat and clear explanation

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...