Saturday 11 September 2021

83. తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ (talachina vinniyu danakorakE)

 ANNAMACHARYA

83. తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ 

Introduction: Poems of  Annamacharya are like mirrors. They reflect human nature vividly. He did not leave a single avenue (for us) to explore.  This poem brings forward that all thoughtful actions of man are to satisfy certain selfish motive implying that there are no truly noble thoughts.

It is defining action in broader sense that all the conceptualised thinking has limited purpose. Man should dissociate from restricted actions and be aware that the world is his own reflection. This single statement is a proof of “how deep the ocean called  Annamacharya is”. All the known peaks will submerge within it.

Then he says if you look for the “other side”, as it is a conscious action, it only results in, ultimately, you coming back to the present state. A view beyond the reciprocal positions of this and the other sides is the path to Lord Venkateswara.

ఉపోద్ఘాతము:  న్నమాచార్యుల కవితలు దర్పణాల​ వంటివి. అవి మానవ స్వభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఆయన అన్వేషించడానికి మనకు ఒక్క మార్గాన్ని కూడా వదిలిపెట్టలేదేమో. ఈ కీర్తన మనిషి ఏది ఊహించినా, అది అతనిలో ఏదోవొక స్వార్థపూరిత కోణాన్ని సంతృప్తి పరచడానికే అని పైపైకి చెప్పి, వాస్తవానికి ఉదాత్తమైన​ ఆలోచనలనేవి లేనే లేవని గూఢముగా సూచిస్తుంది.

మానవుని ఆలోచనలన్నింటికీ పరిమిత ప్రయోజనం ఉంటుందని విస్తృత అర్థంలో చర్యను నిర్వచిస్తోంది. మనిషి వీటి నుంచి విడివడి ప్రపంచం తన సొంత ప్రతిబింబమే అని తెలియవలె. అన్నమాచార్య అనే సముద్రం ఎంత లోతైనదో ఈ ఒక్క ప్రకటనే రుజువు చేయును.  మనమెరిగిన​ శిఖరాలన్నీ అందులో మునిగిపోతాయి.

అప్పుడు మనిషి ఆవల అనుకుంటూ మోక్షమును వెతికితే, అది సచేతన చర్య కాబట్టి,  చివరికి, ప్రస్తుతం ఉన్న దగ్గరకే తిరిగి వస్తారని అన్నమయ్య చెప్పారు. పరస్పరం విలోమమగు స్థితులతో తులనాత్మక​ సంబంధం లేని వీక్షణమే వెంకటేశ్వర స్వామిని చేరు మార్గం. 

కీర్తన:

తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ

దెలియుట దనలోఁ దెలియుట కొరకే         ॥పల్లవి॥ 

ఉదయమందుట భవముడుగుట కొరకే

చదువుట మేలువిచారించు కొరకే
బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకేతలఁచి॥ 

తగులుట విడివడఁదలఁచుట కొరకే

నొగులుట కర్మమునుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే
బెగడుట దురితము పెడఁబాయు కొరకే తలఁచి॥ 

యీవలఁ జేయుట ఆవలి కొరకే

ఆవలనుండుట యీవలఁ కొరకే
యీవలనావల నెనయఁ దిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే        ॥తలఁచి॥

 

talachinavinniyu danakorakE veli

deliyuTa danalO deliyuTa korakE            pallavi 

udayamaMduTa bhavamuDuguTa korakE

chaduvuTa mEluvichAriMchu korakE
bradukuTa purushArdhaparuDauTa korakE
yediri ganuTa tanne~ruguTa korakE talachi 

taguluTa viDivaDa dalachuTa korakE

noguluTa karmamunubhaviMchu korakE
chigurauTa kommayi chelaguTa korakE
begaDuTa duritamu peDabAyu korakE talachi 

yIvala jEyuTa Avali korakE

AvalanuMDuTa yIvala korakE
yIvalanAvala nenaya diruguTella
SrIvEMkaTESvaru jEruTa korakE  talachi

 

 

Details and Explanations:

 

తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ

దెలియుట దనలోఁ దెలియుట కొరకే         పల్లవి॥ 

talachinavinniyu danakorakE veli

deliyuTa danalO deliyuTa korakE            pallavi  

Word to Word meaning:  తలఁచినవి (talachinavi) = those imagined, those considered; ఇన్నియుఁ (inniyu) = all these; దనకొరకేఁ (danakorakE) = for the self; వెలిఁ (veli) = Outside; దెలియుట (deliyuTa) = know, understand, assimilate; దనలోఁ (danalO) = with the self; దెలియుట (deliyuTa) = know, understand, assimilate; కొరకే (korakE) = for. 

Literal meaning: All these things imagined (or considered) are only for the self. To know outer (world) is to know the self.   

Explanation: The first line connotes that all the thoughtful action of man, however decorated it might be, has roots in certain selfishness. Thus Annamacharya said there are no noble thoughts.

This implies that cessation of thought is selflessness. All the religions talk of pure heart. That is no iota of selfishness.  In that state, there shall be no thoughts. This is what Annamayya declared in the first line.

The second line stating that understanding of the outer world is to know the inner self. How are these two connected? As noted earlier, in almost every sense, the inner self (or ego) is a reaction to the outer world. Thus the inner being reaction (a reflection) cannot be corrected directly though appears to be tangible. (This is denoted as illusion).

When a person gets fever; temperature of his body raises. However, treatment should be for the fever, not for temperature which is merely a reflection of the malady in the body. Therefore, Innumerable attempts for correction of the inner by religions have failed because they are trying to treat the unreal thing. (Therefore man remained incorrigible from the time immemorial). What needs correction is not the reflection but the act? Please try to understand this simple logic. 

Now the question boils down to what is action? The Outer (the world) is not in (any) one’s control. Therefore cannot be corrected. If both the action and reaction are not tangible for improvement, what can one do? Do not do anything, but be aware. This is what Annamayaa said, by stating veli deliyuTa danalO deliyuTa korakE. (వెలిఁ దెలియుట దనలోఁ దెలియుట కొరకే). 

Remember the golden words of Sir Arthur Conan Doyle in the book The Sign of The FourOnce you eliminate the impossible, whatever remains, no matter how improbable must be the truth”. By the same logic, the path to Truth is not by knowing truth, but eliminating what it is not.  Probably, I learnt that, Vedas also say similar thing. 

Let us go back to the Chorus: First line is stating all thought is impure. So absence thought possibly indicates Purity. Without the external stimuli, all the inner reactions cease. Then there is possibility to see the Outer clearly. This action of pure, unadulterated seeing is Awareness.

Therefore the implied meaning of the chorus: cessation of thought is selflessness. Observation of the outer is uncovering of the inner.

Now consider this statement from Jiddu Krishnamurti from the book The Only Revolution (1969). Meditation is the freedom from thought, and a movement in the ecstasy of truth. ….Meditation is not an escape from the world; it is not an isolating self-enclosing activity, but rather the comprehension of the world and its ways.

Now you may note that both Jiddu and Annamayya said the same thing. Both of them wrote on uncomfortable and perplexing ideas, In spite of that,  both of them wrote in such a way as to bring comfort to the reader / listener without causing panic. Significantly, Annamayya encapsulated such complex ideas in beautiful songs to make it even easier, without compromising on the content.


భావము:  ఊహించిన, పరిగణించబడిన ఇవన్నీ స్వార్ధానికే. బాహ్యన్ని (ప్రపంచాన్ని) తెలుసుకోవడమే స్వీయతను ఆనవాలుపట్టడం.

వివరణము: మొదటి పంక్తి మనిషి యొక్క అన్ని ఆలోచనాత్మక చర్య, ఎంత అందంగా అలంకరించబడినా, కొంత స్వార్థంలో మూలాలను కలిగి ఉందని సూచిస్తుంది. ఈ విధంగా అన్నమాచార్యులు ఎటువంటి మేలు కలిగించు ఆలోచనలూ లేవని అన్నారు.

ఈ పంక్తి ఆలోచనలే లేని స్థితి నిస్వార్థత అని సూచిస్తుంది. అన్ని మతాలు స్వచ్ఛమైన హృదయం గురించి మాట్లాడుతాయి. అది స్వార్థానికి సంబంధించిన అంశమే కాదు. అనగా ఆ స్థితిలో, ఆలోచనలు ఉండరాదు. ఇదే మొదటి పంక్తిలో అన్నమయ్య ప్రకటించాడు.

బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అనేది అంతర్గత స్వభావాన్ని తెలుసుకోవడం అని రెండవ పంక్తి పేర్కొంది. ఈ రెండు ఎలా కలిపారో? ఇంతకు ముందే అనుకున్నట్లు, దాదాపు అన్ని విధాలా, అంతర్గత స్వభావం (లేదా అహం) అనేది బాహ్య ప్రపంచానికి ప్రతిచర్య. మానవునికి ప్రతిచర్యే (ప్రతిబింబమే) అందుబాటులో ఉండటంతో దాన్ని సరిచేయడనికి ఉద్యుక్తుడౌతాడు.  కారణము లేదా హేతువును సంస్కరించ వలె కాని, ప్రతిచర్యను కాదు. (ఇదే భ్రమ/మాయగా సూచించబడుతుంది).

ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు; అతని శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. (ఇది శరీరంలోని అనారోగ్యం యొక్క సూచిక  మాత్రమే; చర్య= జ్వరం ; ప్రతిచర్య = ఉష్ణోగ్రత). ఏదేమైనా, చికిత్స జ్వరం తగ్గించుటకు కాని ఉష్ణోగ్రత తగ్గించుటకు కాదు కదా? 

అదే తర్కముతో, చర్య= ప్రపంచం; ప్రతిచర్య = అహము అని అనుకుంటే  మతముల ద్వారా మనిషి అహమును  సరిదిద్దడానికి అసంఖ్యాక ప్రయత్నాలు ఎందుకు  విఫలమయ్యాయో సులభంగా బొధపడుతుంది. మనిషి ప్రాచీన కాలం నుండి ఒకే ధోరణిలో ఎందుకని పయనిస్తున్నాడో కారణము తెలియును.

దిద్దవలసింది చర్యనే కాని, ప్రతిచర్యను కాదు కదా? దయచేసి ఈ సాధారణ హేతుబద్ధమైన వివరణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

ఇప్పుడు చర్య అనగా ఏమిటో పరిశీలించెదము. బాహ్యము (ప్రపంచం) ఒకరి నియంత్రణలో ఉండదు. అందువల్ల దాన్ని సరిదిద్దలేము.  అహము అన్నది ప్రతిచర్య కాబట్టి  దానినీ దిద్దలేము. ఇట్లాంటప్పుడు   ఏమి చేయగలం? ఏమీ చేయవద్దు, కానీ తెలియండి. వెలిఁ దెలియుట దనలోఁ దెలియుట కొరకే అని పేర్కొనడం ద్వారా అన్నమయ్య చెప్పినది ఇదే.

ది సైన్ ఆఫ్ ది ఫోర్ అనే పుస్తకంలో సర్ ఆర్థర్ కోనన్ డోయల్ (షెర్లాక్ హోమ్స్  కధల ద్వారా ప్రాచుర్యం పొందిన బహుముఖ ప్రఙ్ణాశాలి) యొక్క సువర్ణాక్షరాలతో వ్రాయ తగిన మాటలను గుర్తుకు తెచ్చుకుందాం "ఒకసారి మీరు అసాధ్యమైన వాటిని తీసివేస్తే, ఏది మిగిలివుంటే, ఎంత అసంభవమైనా నిజమై ఉండాలి". అదే తర్కం ద్వారా, సత్యానికి మార్గం సత్యం కాని దానిని తొలగించడం ద్వారా మాత్రమే.  బహుశా, వేదాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని విన్నాను.

పల్లవిని ఇంకోమారు పరిశీలిద్దాం. మొదటి పంక్తి ఎంత గొప్ప ఆలోచనైనా ఎంతోకొంత స్వార్ధంతో కూడినదని తెలియజేస్తోంది. కాబట్టి  ఆలోచన లేకపోవడం స్వచ్ఛతను సూచిస్తుంది. బాహ్య ఉద్దీపనలు లేకుండా, అన్ని అంతర్గత ప్రతిచర్యలు ఆగిపోతాయి. అప్పుడు బాహ్యమును  (ప్రపంచాన్ని) స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన, కల్తీ లేని ఈ వీక్షణమే అవగాహన.

పల్లవి యొక్క భావార్ధము : ఆలోచనల నుంచి విరమణ అనేది నిస్వార్థం. వెలుపలిని పరిశీలించడం వల్ల లోపలిది  వెలికి వస్తుంది.

జిడ్డు కృష్ణమూర్తి గారి  ది ఓన్లీ రివల్యూషన్ (1969) అనే పుస్తకం నుండి ఈ వాక్యాన్ని పరిశీలించండి. ధ్యానం అనేది ఆలోచనల నుండి స్వేచ్ఛ; మరియు సత్యం యొక్క పారవశ్యంలోని కదలిక. .... ధ్యానమనగా ప్రపంచం  నుండి తప్పించుకోవడం కాదు; ప్రపంచం నుండి తనను తాను వేరు పరచుకునే, తలుపులు, తలపులూ మూసివేసే కార్యకలాపమూ కాదు, వాస్తవానికి ప్రపంచం మరియు దాని మార్గాల అవగాహనయే.

జిడ్డు మరియు అన్నమయ్యా కూడా ఒకే  సంగతి గురించి చెప్పారని ఇప్పుడు మీరు గమనించవచ్చు. అవి అంతగా కొరుకుడుపడని విషయాలే, వీరిద్దరూ కూడా చదువరులకు, వినువారికి భయభ్రాంతులను కలిగించకుండా సాంత్వన చేకూర్చులాగానే రచనలు చేయడం గమనార్హము. అయితే, అన్నమయ్య అటువంటి సంక్లిష్ట విషయాలను రాజీ పడకుండానే అందమైన పాటలో రమణీయంగా పొందుపరిచినట్లు ఇట్టే తెలిసిపోతుంది.


ఉదయమందుట భవముడుగుట కొరకే

చదువుట మేలువిచారించు కొరకే
బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకే
యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే         తలఁచి॥ 

udayamaMduTa bhavamuDuguTa korakE

chaduvuTa mEluvichAriMchu korakE
bradukuTa purushArdhaparuDauTa korakE
yediri ganuTa tanne~ruguTa korakE      talachi 

Word to Word meaning: ఉదయమందుట (udayamaMduTa) = to take birth; భవముడుగుట (bhavamuDuguTa) = పుట్టుక చాలించుట, మరణము, cessation of The condition of being on earth, to die; కొరకే (korakE) = only for; చదువుట (chaduvuTa) = Education; మేలువిచారించు (mEluvichAriMchu) = to understand appropriate thing (to perform); కొరకే (korakE) = only for; బ్రదుకుట (bradukuTa) = to live; పురుషార్ధపరుఁడౌట (purushArdhaparuDauTa) = మానవుఁడు జీవితమున సాధించవలసిన లక్ష్యములు. [ఇవి నాలుగు ధర్మము-అర్థము-కామము-మోక్షము అనునవి.], జీవించుటకు చేయదగినది, ప్రయత్నించడానికి అర్హమైనది ఏదైనా; The principal object of human life and pursuit, of which four are enumerated (the gratification of desire, acquirement of wealth, discharge of duty, and final emancipation), Something worth doing, any object that deserves striving for; కొరకే (korakE) = only for; యెదిరిఁ (yediri) = ఎదుటివాడు, తన కెదురుగా నున్నవాడు, the person in front of you;  గనుట (ganuTa) = Seeing, observing; తన్నెఱుఁగుట (tanne~ruguTa) = knowing the self; కొరకే (korakE) = only for; 

Literal meaning: the moment birth happens, death is certain (after sometime); Education is only for knowing what is the appropriate action; to live is to know what is worth doing; to Observe the person in front of you is only to realise what you are;

Explanation: As illustrated by many great men, education is not for learning cunning ways. But unfortunately, most often, we use our knowledge for the personal gain.

This stanza is questioning the very life we live. Do we understand what is worth living for?   OR swept away by the wind?

What do we observe in others?  Time and again, we behave like a judge.  This below para form Matthew (chapter7) is worth mentioning here.  

 

“Why do you look at the speck of sawdust in your brother’s eye and pay no attention to the plank in your own eye? How can you say to your brother, ‘Let me take the speck out of your eye,’ when all the time there is a plank in your own eye? 5 You hypocrite, first take the plank out of your own eye, and then you will see clearly to remove the speck from your brother’s eye.

 

We are mostly engaged in our thoughts and when we see others, we only find defects. Now relate it to the chorus of this song and see how accurate it is.  All these things imagined (or considered) are only for the self. To know other person is to know the self.”  

భావము:  పుట్టినప్పుడు, మరణం (కొంతకాలం తర్వాత)ఖచ్చితంగా ఉంటుంది ; తగిన చర్య ఏమిటో తెలుసుకోవడానికి మాత్రమే విద్య; జీవించుట ఏమి చేయుటయో తెలుసుకోడానికే; ఎదుటివాడిని గమనించడం అంటే నువ్వు (అనగా) ఏమిటో  గ్రహించుటకే.

వివరణము: ఎంతో మంది గొప్పవారిచే వివరించబడినట్లు, విద్య /చదువు అనేది స్వార్ధపూరిత మార్గాలను నేర్వడం కోసం కాదు. దురదృష్టవశాత్తు, చాలా వరకు, మనము విద్యను వ్యక్తిగత లాభం కోసమే ఉపయోగిస్తాము. 

ఈ చరణం మనం దేనికోసం జీవిస్తున్నదీ  ప్రశ్నిస్తోంది. దేనికోసం జీవించడం విలువైనదో మనకు అర్థమైందా? లేదా గాలికి కొట్టుకుపోతున్నామా? 

ఇతరులలో మనం ఏమి గమనిస్తాము? అధిక శాతం న్యాయాధిపతిలా వ్యవహరిస్తాము. ఈ దిగువ పేరాను (మాథ్యూ, బైబిల్) చూడండి. 

(మత్తయి సువార్త 7వ ఆధ్యాయము.) నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? 5 ఓ కపటీ! మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును. 

మనం ఎక్కువగా మన ఆలోచనలలోనే నిమగ్నమై ఉంటాము.  ఇతరులను చూసినప్పుడు, వారి లోపాలను మాత్రమే కనుగొంటాము. ఇప్పుడు  ఈ కీర్తన పల్లవిని ఎంత పదునుగా వ్రాసినది చూడండి. "ఊహించిన, పరిగణించబడిన ఇవన్నీ స్వార్ధానికే. ఇతరులను తెలుసుకోవడం నీకు నువ్వేమిటో గుర్తుపట్టడానికే."   

తగులుట విడివడఁదలఁచుట కొరకే

నొగులుట కర్మమునుభవించు కొరకే
చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే
బెగడుట దురితము పెడఁబాయు కొరకే     తలఁచి॥ 

taguluTa viDivaDa dalachuTa korakE

noguluTa karmamunubhaviMchu korakE
chigurauTa kommayi chelaguTa korakE
begaDuTa duritamu peDabAyu korakE  talachi 

Word to Word meaning: తగులుట (taguluTa) = get hooked; విడివడఁ (viDivaDa)= to get separated; దలఁచుట (dalachuTa) = longing; కొరకే (korakE) = only for; నొగులుట (noguluTa) = to be in pain; కర్మమునుభవించు (karmamunubhaviMchu) = to receive the fruits of action; కొరకే (korakE) = only for; చిగురౌట (chigurauTa) = to sprout,; కొమ్మయి (kommayi) = become a branch; చెలఁగుట (chelaguTa) = spread; కొరకే (korakE) = only for; బెగడుట (begaDuTa) = సంకటపడు, unease, disquiet;  దురితము (duritamu) = sin, crime;  పెడఁబాయు (peDabAyu) = ఎడఁబాయు, to part with, to discard; కొరకే (korakE) = only for;           

Literal meaning: We get hooked only to long for separation. Suffering is to receive the fruits of action. To sprout is to branch out and spread. Unease and disquiet are due to parting with the sin.

Explanation: Overall this stanza is indicating that there is escape from the sins. One must be circumspective not to get engaged in wrong actions.

భావము:  లంపటలలో తగులుట విడిపోవడానికే.  బాధ పొందడమే చర్యల ఫలితము. మొలకెత్తడం అంటే కొమ్మలుగా మారి విస్తరించడమే. పాపం నుండి విడిపోవడంలోనే అసౌకర్యం మరియు అశాంతి.

వివరణము: మొత్తంమీద ఈ చరణం పాపాల నుండి తప్పించుకోలేమని సూచిస్తుంది. తప్పుడు చర్యలలో నిమగ్నమవ్వకుండా జాగ్రత్తపడమంటోంది. 

యీవలఁ జేయుట ఆవలి కొరకే

ఆవలనుండుట యీవలఁ కొరకే
యీవలనావల నెనయఁ దిరుగుటెల్ల
శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే          తలఁచి॥ 

yIvala jEyuTa Avali korakE

AvalanuMDuTa yIvala korakE
yIvalanAvala nenaya diruguTella
SrIvEMkaTESvaru jEruTa korakE            talachi 

Word to Word meaning: యీవలఁ (yIvala) = this side;  జేయుట (jEyuTa) = performing; ఆవలి (Avali) = that side; కొరకే (korakE) = for; ఆవలనుండుట (AvalanuMDuTa)= staying that side; యీవలఁ (yIvala) = this side; కొరకే (korakE) = for; యీవలనావలను (yIvalanAvala) = Either side; ఎనయఁ (nenaya) = ఏకమగు, కూడు, సంగమించు, become one; join together; దిరుగుటెల్ల (diruguTella) = all the movement;  శ్రీవేంకటేశ్వరుఁ (SrIvEMkaTESvaru) = Lord Venkateswara;  జేరుట (jEruTa) = To draw near or approach; కొరకే (korakE) = for.

Literal meaning: Performing actions this side is for the other side. Staying that side is to comeback. When both sides join together, that movement is to reach Lord Venkateswara.

Explanation: this stanza is absolutely indecipherable, without the assistance from the following text by Jiddu Krishnamurti. (Krishnamurti’s Notebook, 27th June 1961, Ojai)

There is only one movement in life, the outer and the inner; this movement is indivisible, though it is divided. Being divided, most follow the outer movement of knowledge, ideas, beliefs, authority, security, prosperity and so on. In reaction to this, one follows the so-called inner life, with its visions, hopes, aspirations, secrecies, conflicts, despairs. As this movement is a reaction, it is in conflict with the outer. So there is contradiction, with its aches, anxieties and escapes.

There is only one movement, which is the outer and the inner. With the understanding of the outer, then the inner movement begins, not in opposition or in contradiction. As conflict is eliminated, the brain, though highly sensitive and alert, becomes quiet. Then only the inner movement has validity and significance. Out of this movement there is a generosity and compassion which is not the outcome of reason and purposeful self-denial. The flower is strong in its beauty as it can be forgotten, set aside or destroyed. The ambitious do not know beauty. The feeling of essence is beauty.

భావము: యీవలఁ జేయుట మరొక వైపు (ఆవలి) కోసమే. ఆ వైపు ఉండటం యీవలఁ కొరకే.  యీవల ఆవల రెండు కలిసినప్పుడు, ఆ కదలికయే వేంకటేశ్వరుడిని చేరుకోవడం.   .

వివరణము: ఈ చరణం జిడ్డు కృష్ణమూర్తి గారి క్రింది వచనం నుండి సహాయం లేకుండా పూర్తిగా వివరించడం అసాధ్యము. (Krishnamurti’s Notebook, 27th June 1961, Ojai)

జీవితంలో ఒకే ఒక కదలిక ఉంది, బాహ్య మరియు అంతర్గతముల ఏకమైన కదలిక​; ఈ కదలిక విభజించి నట్లు అనిపించినప్పటికీ, విడదీయరానిది.  చాలా మంది బాహ్య కదలికను అనుసరిస్తారు. జ్ఞానం, ఆలోచనలు, నమ్మకాలు, అధికారం, భద్రత, శ్రేయస్సు మరియు మొదలైనవి. దీనికి ప్రతిస్పందనగా, ఒక వ్యక్తి తన అంతర్గత జీవితం,  ఆశలు, ఆశయాలు, రహస్యాలు, విభేదాలు, నిరాశలతో కూడి ఉంటుంది.  ఈ యత్నము ఒక ప్రతిచర్య కాబట్టి, ఇది బాహ్యంతో విభేదిస్తుంది. కాబట్టి దానితో బాధలు, వ్యతిరేకతలు  ఆందోళనలు మరియు పలాయనవాదాలు పుడతాయి.

బయట మరియు లోపలలో ఒకే ఒక కదలిక ఉంటుంది. బాహ్య అవగాహనతో, అనుగుణమైన అంతర్గత చలనము ప్రారంభమవుతుంది. సంఘర్షణ తొలగిపోయినప్పుడు, మెదడు, అత్యంత సున్నితమై మరియు అప్రమత్తమై ఉన్నప్పటికీ, నిశ్శబ్దంగా మారుతుంది. అప్పుడు లోపలి కదలికకు మాత్రమే ప్రామాణికత మరియు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చలనము నుండి  కారణములు మరియు ఉద్దేశపూర్వక స్వీయ-తిరస్కరణ (purposeful self-denial) ఫలితములకు అతీతంగా ఉదారత మరియు కరుణలు పుట్టుకొస్తాయి.  ఒక పువ్వు యొక్క బలం దాని అందం. మనిషి  దానిని మర్చిపోవచ్చు, పక్కన పెట్టవచ్చు లేదా నాశనం చేయవచ్చు. ఐనా​, దాని అందం ఉన్నంత సేపూ తరగదు కదా! పేరు ప్రతిష్టలకై  వెంపర్లాడు వారికి అందం తెలియదు. సారాంశం యొక్క భావన అందం. (స్వేచ్ఛానువాదం)

(Just observe how close the thinking of these two great men is:

The feeling of essence is beauty – Jiddu Krishnamurti

రూపైన రుచిలోని రుచి వివేకంబు - అన్నమాచార్యులు


Summary of this Keertana:

All these things imagined, considered are only for the self. To know outer (world) is to know the self.

The moment birth happens, death is certain (after sometime); Education is only for knowing what is the appropriate action; to live is to know what is worth doing; to Observe the person in front of you is only to realise what you are;

We get hooked only to long for separation. Suffering is to receive the fruits of action. To sprout is to branch out and spread. Unease and disquiet are due to parting with the sin.

Performing actions this side is for the other side. Staying that side is to comeback. When both sides join together, that movement is to reach Lord Venkateswara.

 

కీర్తన సంగ్రహ భావము:

ఊహించిన, పరిగణించబడిన ఇవన్నీ స్వార్ధానికే. బాహ్యన్ని (ప్రపంచాన్ని) తెలుసుకోవడమే నువ్వేమిటో (స్వీయతను) ఆనవాలుపట్టడానికే.

పుట్టినప్పుడు, మరణం (కొంతకాలం తర్వాత)ఖచ్చితంగా ఉంటుంది; తగిన చర్య ఏమిటో తెలుసుకోవడానికి మాత్రమే విద్య; జీవించుట ఏమి చేయుటయో తెలుసుకోడానికే; ఎదుటివాడిని గమనించడం అంటే నువ్వు (అనగా) ఏమిటో  గ్రహించుటకే.

లంపటలలో తగులుట విడిపోవడానికే.  బాధ పొందడమే చర్యల ఫలితము. మొలకెత్తడం అంటే కొమ్మలుగా మారి విస్తరించడమే. పాపం నుండి విడిపోవడంలోనే అసౌకర్యం మరియు అశాంతి.

యీవలఁ జేయుట మరొక వైపు (ఆవలి) కోసమే. ఆ వైపు ఉండటం యీవలఁ కొరకే.  యీవల ఆవల రెండు కలిసినప్పుడు, ఆ కదలికయే వేంకటేశ్వరుడిని చేరుకోవడం.

 

Copper Leaf: 11-4  Volume 1-70


5 comments:

  1. I like the table format of full song before explaining each stanza. I like the efforts in connecting Sherlock Holmes quotations, Bible message, and Jiddu krishnamurthy and using them to explain this Annamacharya padam.

    Annamacharya make us understand profound philosophical aspects with simple words, simple examples that most can understand and finally connects with devotion to and reaching Godhead of Venkatesha.
    This total devotion and surrender to God Venkatesha is easy for every one.

    Your translation of Bhavam for each pallavi/stanza are very good. Just put them together at the end. Reading them as a summary makes us appreciate Annamacharya padam most.

    ReplyDelete
  2. The explanation is too good.The keerthana showing the advanced thinking of Annamachrya... Vardhani

    ReplyDelete
  3. కీర్తనపై మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది.
    కీర్తన యొక్క భావసంగ్రహము చివరలో సమర్పించటం
    చదువరులకు యెంతో ఉపయుక్తంగా ఉన్నది.
    జిడ్డు కృష్ణమూర్తి గారి,తదితరుల quotes వ్యాఖ్యానాన్ని పరిపుష్టం చేశాయి. విపులమైన వ్యాఖ్యానం ప్రశంసనీయం.
    కృష్ణ మెహన్
    విశాఖపట్నం

    ReplyDelete
  4. కీర్తన భావాన్ని బాగ తెలిపారు. అవసరమైన చోట ప్రముఖుల వాఖ్యలను, భావాలను కూడ బాగ వ్రాసారు. చివరలో తాత్పర్యం ఇవ్వడము బాగుంది. భావం ఇవ్వడములో మీరు పడిన శ్రమ హర్షనీయము.
    గొర్తి వేంకటేశ్వర్లు హైదరాబాదు

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...