Sunday, 19 September 2021

85. ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది (evvarinErpulu jeppa niMdu nEdi)

 ANNAMACHARYA

85. ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది 

Introduction: This is a marvellous and very deep poem on Meditation. Meditation is not a prayer.  It’s an act of merging the self to the divine.

Folded hands are not prayers. Neither closed eyes are. Nor the self-abnegation is.   Of course, Meditation is not an act of finding asylum of comfort and safety. It is not an escape from the world. Anything bereft of joining the heart with the nature is not meditation.

Annamacharya takes on the popular methods to emphasise that we shall do our part of the work and not to look for what happens next. Whereas the people at large are interested in finding a definition, a crystal clear demarcation to the impenetrable.   Looking for something, let it be god, is a conscious act and therefore not meditation.

ఉపోద్ఘాతము:  ది ధ్యానంపై అద్భుతమైన మరియు చాలా లోతైన అర్ధం తెలిపే కీర్తన. ధ్యానమనునది ప్రార్థన కాదు. అది దైవ సేవకై స్వీయమును కరిగించి వేయుట. 

ముడిచిన చేతులు, మూసుకున్న కళ్లు ప్రార్థన నకు సంకేతాలు కావు. ధ్యానం అనేది సౌకర్యం మరియు భద్రతలను కల్పించే ఆశ్రయమూ కాదు. అలాగే ప్రపంచం నుంచి విరమణా కాదు. వాస్తవానికి,  ప్రకృతితో హృదయం కలపనంత వరకు ఏదైనా ధ్యానమే కాదు.

అన్నమాచార్యులు జనాదరణ పొందిన పద్ధతులను నీరసించాడని అనలేము కానీ మన వంతు పనిని చేయకుండా, తరువాత ఏమి జరుగుతుందో అన్న జిజ్ణాస కూడదన్నాడు. అగమ్యగోచరమైన దానికి మానవులు స్పష్టమైన సరిహద్దులు మరియు నిర్వచనాలు కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉంటారు. దేనికోసమైనా వెతకడం, అది దైవమే కానివ్వండి, అది సచేతన చర్య కావున ధ్యానం కాదు.

కీర్తన:

 

ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది

రవ్వ సేయక జీవుల రక్షించవయ్యాపల్లవి॥ 

తలపోసి తలపోసి ధ్యానముసేతురు నిన్ను

యెలమి నింతని నిశ్చయింపలేరు
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు
కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరుఎవ్వ॥ 

పొదిగి పొదిగి నిన్నుఁ బూజలెల్లాఁ జేతురు

యెదుట నీశ్రీమూర్తి యెఱఁగలేరు
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా
పదిలపు నీభ క్తి పట్టఁగలేరుఎవ్వ॥

నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మెుక్కుదురుగాని

మక్కువ నీమహిమ నమ్మఁగలేరు
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత
తక్కక నిన్ను సేవించి తనియలేరుఎవ్వ॥

 

evvarinErpulu jeppa niMdu nEdi

ravva sEyaka jIvula rakshiMchavayyA pallavi  

talapOsi talapOsi dhyAnamusEturu ninnu

yelami niMtani niSchayiMpalEru
palumAru nIguNAlu paikoni nutiMturu
koladiveTTuchu mIgu~rutu leMchalEruevva 

podigi podigi ninnu bUjalellA jEturu

yeduTa nISrImUrti ye~ragalEru
vedaki vedaki sAre viMduru nIkatalellA
padilapu nIbha kti paTTagalEru evva 

nikki nikki chEtuletti nIku mekkudurugAni

makkuva nImahima nammagalEru
yikkaDa SrIvEMkaTESa yiTu nIkaruNachEta
takkaka ninnu sEviMchi taniyalEru    evva

 

 Details and Explanations: 

ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది

రవ్వ సేయక జీవుల రక్షించవయ్యా          ॥పల్లవి॥ 

evvarinErpulu jeppa niMdu nEdi

ravva sEyaka jIvula rakshiMchavayyA    pallavi 

Word to Word meaning: ఎవ్వరి (evvari) = Anone; నేర్పులు (nErpulu) = art, skill, craft;  జెప్పను (jeppa) = to say (here meaning is to count); ఇందున్ (niMdun) = in this world; ఏది (Edi) = where;  రవ్వ సేయక (ravva sEyaka) = do not wait even for small amount of time;   జీవుల (jIvula) = all the beings; రక్షించవయ్యా (rakshiMchavayyA) = save Sir.

 

Literal meaning: There is none (in this world) who skill we can count (on). Therefore, save us Sir without waiting. 

Explanation:  Let us try to understand why our present skills are no avail. Many of us are skilled in various trades, medicine, Arts, communication, mobility, religion and war. We use these skills conveniently to serve limited personal/selfish purposes. 

The person inside, actually uses these skills, like a central CPU of a computer uses available programs thru the menu provided.  Factually the computer does not understand the programme, but simply performs an activity as per the command of the program. On the monitor (surface) we see it as playing a chess game OR tracking complicated path of an orbiting space object etc.

In the similar fashion, person inside, like the computer CPU, uses commands of instincts to run his life.  We people (the instinctive men) are trained by program called culture to behave with civility while remaining instinctive inwardly. Like man made computer programs come with innumerable defects, the cultured man’s training is also not PERFECT and cover of civility often gets punctured and demon inside gets unleashed.

Last two paras actually show that man, despite his education and skills imparted, still behaves by animal instincts.  Violence, depression and chaos  we witness in today's society are testament to this. Therefore there is need for deeper sense of change which education has failed to inculcate.

Now consider this statement from Bhagavadgita. निमित्तमात्रं भव सव्यसाचिन् || 11-33|| nimitta-mātra bhava savya-sāchin (11-33) (savya-sāchi = ambidextrous) Purport: O savya-sāchi (O ambidextrous archer, Arjun) “you will only be an instrument of my work.” Arjun’s   expertise is unmatched till date. Still such a great skill is no avail in the plan of God. What to speak of our skills?

Now you may acknowledge why Annamacharya is absolutely clear that the skills we acquire serve no purpose.

ravva sEyaka (రవ్వ సేయక) is signifying the need for urgency of action to help us  extricate from the difficult situation we got entrenched.  By declaring jIvula rakshiMchavayyA  (జీవుల రక్షించవయ్యా) Annamayya is praying to God on behalf of all of us. Probably he is not sure of our immediate action.

Now try to understand the titles of Jiddu Krishnamurti Books “The Urgency of the Change”, “The Only Revolution” and their connection with this poem.

భావము:  మాలో ఎవ్వరినేర్పులు చెప్పదగినవేవీ కావయ్యా.  జాగు సేయక జీవుల రక్షించవయ్యా.

వివరణము: మన నేర్పులు ఎందుకు పనికిరానివని అన్నమాచార్యులు అంటున్నాడో తెలుసుకుందాము. మనలో చాలామంది వివిధ వ్యాపారాలు, ఔషధం, కళలు, ప్రసారమాధ్యమాలలోను, చలనసాధనములోను, మతం మరియు యుద్ధంలోను నైపుణ్యం కలిగి ఉన్నారు. పరిమిత వ్యక్తిగత/స్వార్థ ప్రయోజనాల కోసం మనము ఈ నైపుణ్యాలను ఉపయోగిస్తామంతే.

కంప్యూటర్ సెంట్రల్ CPU మెనూ ద్వారా అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌లను ఉపయోగించుకున్నట్లు మన లోపలి వ్యక్తి, ఈ నైపుణ్యాలను ఉపయోగిస్తాడు. వాస్తవానికి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అర్థం చేసుకోదు; కానీ ప్రోగ్రామ్ ఆదేశం ప్రకారం కేవలం ఒక కార్యమును నిర్వహిస్తుంది. మానిటర్ (ఉపరితలం) లో మనము కంప్యూటర్ని చదరంగం ఆడుతున్నట్లుగానో  లేదా అంతరిక్ష నౌక కక్ష్య (మార్గాన్ని) నిర్దేశించుటయో చేస్తున్నట్లుగానో చూస్తాము.

అలాగే, కంప్యూటర్ CPU ప్రోగ్రామ్‌లను ఉపయోగించినట్లుగా వ్యక్తి తన జీవితాన్ని నడపడానికి సహజమైన ప్రవృత్తి ఆదేశాలనే ఉపయోగిస్తాడు. మనము అంతర్గతంగా పశు సహజ ప్రవృత్తితో ఉంటూనే పైపైన​ నాగరికతతో ప్రవర్తించడానికి సంస్కృతి అనే ముసుగును శిక్షణ ద్వారా పొందుతాము.

మానవ నిర్మిత కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు లెక్కలేనన్ని లోపాలతో వస్తాయి.  అలాగే సంస్కృతి అనే శిక్షణ కూడా లోపభూయిష్టమైనదే.  మరియు నాగరికత యొక్క ముసుగు తరచుగా చిల్లులు పడుతుంది. దాంట్లోంచి పైశాచికత్వం పొడుచుకువచ్చి జడలు విరజిమ్ముకుని నర్తిస్తుంది. ఇది ఎంత నిజమో మనకే తెలుసు.

మనిషి విద్య మరియు నైపుణ్యాలను సంపాదించుకున్నప్పటికి, వాస్తవంగా పశు ప్రవృత్తుల ద్వారానే వర్తిస్తాడని చివరి రెండు పేరాల నుంచి స్పష్టమౌతుంది. ప్రస్తుత సమాజంలోని హింస​, నైరాశ్యము, అస్తవ్యస్త స్థితులు  దీనికి తార్కాణం.  దైనందిక జీవితంలో గమనించే ఉంటాము. అందువల్ల లోతైన మార్పు యొక్క  అవసరం.  విద్య యీ అవగాహనను పెంపొందించడంలో విఫలమైంది. అందుకే మన నైపుణ్యాలు కొరగానివయ్యాయి.

భగవద్గీతలోని ఈ విషయాన్ని పరికించండి. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ (11-33) భావము: సవ్యసాచి నిన్ను నీవు భగవంతుని పనిలో కేవలం ఒక సంఙ్ణగా తలచుము. అర్జునుని ప్రావీణ్యము సాటిలేనిదే. ఐనప్పటికీ, అలాంటి  నైపుణ్యం సైతం దేవుని ప్రణాళికలో లెక్కకు రానిదే. ఇంక మన నేర్పులు ఏపాటివో?

రవ్వ సేయక అనేది వేళ్లూనుకున్న క్లిష్ట పరిస్థితి నుండి మానవులు బయటపడటానికి సత్వర చర్య యొక్క అవసరాన్ని సూచిస్తుంది. “జీవుల రక్షించవయ్యా అంటూ మనందరి తరపునా దైవమును వేడుకొంటున్నాడు. మనమెలాగూ సత్వర చర్యలు చేపట్టమనేమో?

ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాల శీర్షికలు  The Urgency of the Change మార్పు యొక్క ఆవశ్యకత”, “The Only Revolution ఏకైక విప్లవం”, మరియు వాటితో ఈ కవిత సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 

తలపోసి తలపోసి ధ్యానముసేతురు నిన్ను

యెలమి నింతని నిశ్చయింపలేరు
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు
కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరు     ॥ఎవ్వ॥ 

talapOsi talapOsi dhyAnamusEturu ninnu

yelami niMtani niSchayiMpalEru
palumAru nIguNAlu paikoni nutiMturu
koladiveTTuchu mIgu~rutu leMchalEru evva 

Word to Word meaning:  తలపోసి తలపోసి (talapOsi talapOsi) = పదేపదే ఒక విషయము ననుకొను, thinking repeatedly about a thing;  ధ్యానముసేతురు (dhyAnamusEturu) = people perform prayers; నిన్ను (ninnu) = you;  యెలమి (yelami) = వివేకం, తెలివి, intelligence; నింతని (niMtani) = నిశ్చయింపలేరు (niSchayiMpalEru) = unable to decide (contextual meaning is unable to measure); పలుమారు (palumAru) = many times; నీగుణాలు (nIguNAlu) = your qualities;  పైకొని (paikoni) =  To attempt నుతింతురు (nutiMturu) = praise; కొలఁదివెట్టుచు (koladiveTTuchu) = అపరిమితమగు, infinite;  మీగుఱుతు (mIgu~rutu) = your sign, your trace, your token;  your లెంచలేరు (leMchalEru) = unable to find; 

Literal meaning: People repeat the prayers. They do not understand your intelligence is beyond any measure. Many times, they praise your qualities. Yet they do not find your infinite signs, traces, token presence.

Explanation: With yelami niMtani niSchayiMpalEru (యెలమి నింతని నిశ్చయింపలేరు) Annamayya is signifying that HIS intelligence beyond the imagination, HE knows what you are doing. But we keep claiming O God I had submitted my will, implies that after that you are looking for something else from God. As already noted such expectation is not meditation.

Arjun in Bhagavad-Gita was actually shown the cosmic form of God. As he sees the infinite, unimaginable and unexplainable form of God, first tries to explain few things he could witness. But in few moments he realises that he cannot describe the infinite. Then he prays to God to restore his normal form.

Like Arjun, we are unable to comprehend the infinite signs, traces, token presence of God though present before our eyes, because we are looking thru the veil of anticipation, with desire to go to heaven, with desire to teach others.

 

భావము: ప్రజలు పదే పదే ప్రార్థనలను చేస్తారు. నీ తెలివితేటలు కొలమానానికి మించినవని వారు అర్థం చేసుకోలేరు. మాటిమాటికి వారు నీ గుణాలను ప్రశంసిస్తారు. ఇంకా వారు నీ అనంతమైన సంకేతాలు, జాడలు, ఉనికిని కనుగొనలేరు. 

వివరణము: యెలమి నింతని నిశ్చయింపలేరు ఊహకు అందని తెలివితేటలు గల భగవంతునికి మీరు ఏమి చేస్తున్నారో తెలియును. కానీ ఓ దేవుడా నన్ను నేను సమర్పించుకున్నాను అంటూ మనవి చేసుకుంటాం. ఈ వినతి మీరు దేవుడి నుండి ఏదో కోరుకుంటున్నారని సూచిస్తుంది. ఇప్పటికే అనుకున్నట్లుగా అలాంటి కాంక్ష ధ్యానము కాదు.

భగవద్గీతలోని అర్జునుడికి నిజానికి భగవంతుని విశ్వరూపం చూపించబడింది. అతడు దేవుని అనంతమైన, ఊహించలేని మరియు వివరించలేని రూపాన్ని చూసినప్పుడు, మొదట అతడు గుర్తుపట్టిన కొన్ని విషయాలను వివరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని క్షణాల్లోనే అతడు అనంతాన్ని వర్ణించలేనని  గ్రహిస్తాడు. అప్పుడు అతడు దైవమును తన సాధారణ రూపాన్ని పునరుద్ధరించమని  ప్రార్థిస్తాడు.

కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరు: అర్జునుడి లాగానే, మన కళ్ల ముందు ఉన్నప్పటికీ దేవుని అనంతమైన సంకేతాలు, జాడలు, ఉనికిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, ఎందుకంటే మనం స్వర్గానికి వెళ్లాలనే కోరికతోనో, ఇతరులకు బోధించాలనే కోరికతోనో అపేక్షించుట ఆశించుట అనే తెరల మాధ్యమునుండి చూస్తున్నాము.


పొదిగి పొదిగి నిన్నుఁ బూజలెల్లాఁ జేతురు

యెదుట నీశ్రీమూర్తి యెఱఁగలేరు
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా
పదిలపు నీభ క్తి పట్టఁగలేరు ॥ఎవ్వ॥

 

podigi podigi ninnu bUjalellA jEturu

yeduTa nISrImUrti ye~ragalEru
vedaki vedaki sAre viMduru nIkatalellA
padilapu nIbha kti paTTagalEru   evva 

 

Word to Word meaning       పొదిగి పొదిగి (podigi podigi) to encircle, to surround; నిన్నుఁ (ninnu) = for you; బూజలెల్లాఁ (bUjalellA) = all the prayers; జేతురు (jEturu) = perform; యెదుట (yeduTa) = the one directly in front; నీశ్రీమూర్తి (nISrImUrti) = your great shape; యెఱఁగలేరు (ye~ragalEru) = do not realise; వెదకి వెదకి (vedaki vedaki) = repeated search; సారె (sAre) = time and again; విందురు (viMduru) = hear;  నీకతలెల్లా (nIkatalellA) = your stories;  పదిలపు (padilapu) = security / vigilance;  నీభక్తి (nIbhakti) = devotion to you; పట్టఁగలేరు (paTTagalEru) = unable comprehend. 

Literal meaning: They surround and perform prayers at your temples. Yet unable to cognise your actual shape. They hear your stories repeatedly. Yet we are unable to comprehend what is devotion to you.

Explanation: As stated umpteen times, God cannot be found by searching. Cannot be found by performing prayers. Just see this Bhagavad Gita Shloka which states that God knows all of us. Yet no living person knows him.

वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन | भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन || 7-26||vedāha samatītāni vartamānāni chārjuna bhavihyāi cha bhūtāni mā tu veda na kaśhchana Purport: O Arjun, I know of the past, present, and future, and I also know all living beings; but GOD no one knows.

What do we learn from the stories of Lord? The main character in each of these stories is not shaken by incidents around. They are unwaveringly  in devotion, they are not afraid, they believe in God. (Just take the case of Prahlad. He remains with the lord in the face of extreme provocation).   They behave well. They are compassionate. They acknowledge their defects.

Now kindly consider this Kabir Das ke Doha बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय, जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय। Purport: When I went in search of a Bad Person, really I could not find one. However, I looked inside myself; found that there can be no one worse than me. The Idea of giving this doha is there is enough accumulated sins with in us. Instead of removing them, try to be a good person is no use.

Also consider this great saying by Syrus: A man is at his worst when he pretends to be good.

Meditation is action of rejecting what is not true. Do we have the wisdom to know the truth from false is the ultimate question? Thus a meditative mind is challenged by unreal and it must be able to negate them. This negation is the Meditation, not the folded hands.

 

భావము: వారు నీ చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తారు. అదేమిటో నీ వాస్తవ ఆకృతిని గుర్తించలేరు. వారు నీ కథలను పదేపదే వింటారు. ఐనాకూడా  రక్షణ కల్పించు నీ పట్ల భక్తిని పట్టలేకున్నారు.

వివరణము: ఇంతకు మునుపు చాలాసార్లు అనుకున్నట్లుగా, వెతుకుట ద్వారా కానీ,  ప్రార్థనల ద్వారా కానీ దేవుడు కనుగొనబడడు.  దైవము యొక్క తత్వమును తెలుపు  ఈ భగవద్గీత శ్లోకాన్ని చూడండి.

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున । భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన (7-26) ఓ అర్జునా! నేను భూతభవిష్యద్వర్తమానకాలములందలి ప్రాణులందఱిని ఎఱుంగుదును. నన్నుమాత్ర మెవడును ఎఱుంగడు.

విష్ణువు  కథల నుండి మనం ఏమి నేర్చుకుంటాము? ఈ ప్రతి కథలోని ప్రధాన పాత్ర తన చుట్టూ జరిగే సంఘటనలతో ప్రభావము చెందదు.  వారు భక్తిలో స్థిరంగా ఉంటారు. వారు భయపడరు, వారు దేవుడిని నమ్ముతారు. (ప్రహ్లాదుడినే తీసుకోండి. హిరణ్యకశిపుని తీవ్ర ప్రకోపానికి గురైనప్పుడు అతడు అచంచల విశ్వాసముతో దైవముపై భారము వేస్తాడు). వారు సత్ప్రవర్తనతో వర్తిస్తారు. వారు కరుణామయులు. వారు తమ లోపాలను గుర్తించుతారు. 

కబీర్ గారు చెప్పిన ఈ సూక్తిని పరిశీలించండి. బురా జో దేఖన్ మే చలా, బురా న మిలియా కోయ్ / జో దిల్ ఖోజా అపనా, ముఝసే బూరా న కోయ్ భావము: ఈ ప్రపంచంలో చెడ్డవారిని వెతకబోతే నాకెవరూ తారసపడలేదు. నాలో వెతికితే, నా కంటే చెడ్డవారెవరూ లేరని బోధ పడింది..

సైరస్ చెప్పిన ఈ సూక్తిని కూడా పరిగణనలోనికి తీసుకోండి ఒక మనిషి మంచివాడుగా నటిస్తున్నాడంటే, అతను మిక్కిలి నీచస్థితిలో నున్నట్లు.

ఇప్పుడు అలోచించండి, ధ్యానం అనేది నిజం కాని దానిని తిరస్కరించే చర్య. అసత్యము నుండి సత్యాన్ని వేరుపరచగలిగే జ్ఞానం మనకు ఉందా? మనస్సుకు సవాలు విసిరేది అవాస్తవమే. దాని నిరాకరణమే ధ్యానము.

 

నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మెుక్కుదురుగాని

మక్కువ నీమహిమ నమ్మఁగలేరు
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత
తక్కక నిన్ను సేవించి తనియలేరు          ॥ఎవ్వ॥

 

nikki nikki chEtuletti nIku mokkudurugAni

makkuva nImahima nammagalEru
yikkaDa SrIvEMkaTESa yiTu nIkaruNachEta
takkaka ninnu sEviMchi taniyalEru          evva

 

Word to Word meaning: నిక్కి నిక్కి (nikki nikki) To stand on the toes  out of curiosity to observe/find what is there next OR what the other man is doing;  చేతులెత్తి (chEtuletti) = lift their hands; నీకు (nIku) = to you;  మెుక్కుదురుగాని (mokkudurugAni) = pay obeisance; మక్కువ (makkuva) = affection, love; నీమహిమ (nImahima) = your majesty, grandeur; నమ్మఁగలేరు (nammagalEru) = unable to believe; యిక్కడ (yikkaDa) = here in this world; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = O Lord Venkateswara;  యిటు (yiTu) = this side; నీకరుణచేత (nIkaruNachEta) = because of your compassion; తక్కక (takkaka) =తప్పక, అవశ్యము, surely;  నిన్ను (ninnu) = you;  సేవించి (sEviMchi) = serving; తనియలేరు (taniyalEru) = do not get satisfied;                       

Literal meaning: People stand on their toes and lift hands to pay their obeisance. Yet they donot understand your affection and donot believe your grandeur. Here in this world O Lord Venkateswara! still they fail to serve you and remain dissatisfied. 

Explanation: you might have observed many words have been intentionally repeated by Annamayaa. Tthey are talapOsi talapOsi (తలపోసి) podigi podigi (పొదిగి) vedaki vedaki (వెదకి) nikki nikki (నిక్కి). This to indicate the action of man is to repeat what he knows. Unfortunately this is not what is required. 

When you visit Niagara Falls or the Grand Canyon for the first time you get a wonderful feeling. The second time you see, it doesn't have the impact of awesome feeling it provided in the first visit.  For the first time our intellect opens up to grasp those things. 

During the second time, we get a feeling that it is not the same one as before; Comparisons such as the rainbow seen today, which is less colourful than the one seen last time, enter our mind and affect our perception. The Niagara Falls and the Grand Canyon remain the same; however note that the absence of internal reaction in the first visit has tremendous impact. 

In fact every second in our life is special. But, many things in real life, as the comparisons affected the perception about rainbow in the above example, diminish the uniqueness of that moment and reduce our normal life dull experience. 

In order to prevent that from happening, we have to dissolve the notions and specific opinions that have gone unnoticed in us. Hence meditation is an attempt to dissolve the inner tribulation. That is devotion. 

Please refer to the wording poMchi SarIrapubhOgamu luDigina / chuMchubAvamulu sukRtamulE (పొంచి శరీరపుభోగము లుడిగిన / చుంచుఁబావములు సుకృతములే) = When body enjoyment ceases only then nascent (or fresh) feelings actually will have chance to flower. They are the truly virtuous things. From kirtana తప్పదు తప్పదు దైవము కృప యిది (tappadutappadu daivamu kRpa yidi). 

Now you can appreciate advanced thinking embedded in kirtanas by Annamacharya.  Thus he tacitly said that repetition is not a way for liberation.  

The double words నిక్కి నిక్కి (nikki) nikki) is indicating the lot of curiosity to know. A curious mind is not meditative mind. Such people, when actually receive the love of god are unaware of the same. It is important to recall the Bhagavad Gita words मां तु वेद न कश्चन (7-26) tu veda na kaśhchana Purport: but GOD no one knows.

 

భావము: ప్రజలు తమ మునికాళ్ళమీద నిలబడి, చేతులు ఎత్తి మెుక్కుతారు.  అయినప్పటికీ వారు నీ ఆప్యాయతను, నీమహిమను, గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక పోతారు. ఈ లోకంలో ఓ వేంకటేశ్వరుడా! వారు నిన్ను సేవించ లేక, కరుణకు పాత్రులుకాక  అసంతృప్తితో మిగిలిపోతారు.

వివరణము: తలపోసి తలపోసి; పొదిగి పొదిగి; వెదకి వెదకి; నిక్కి నిక్కి అంటూ అన్నమయ్య ఉద్దేశ్యపూర్వకంగా అనేక పదాలు పునరావృతం చేయడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. మనిషి తన దైనందిక జీవితంలో (తనకు తెలిసినదాన్ని) తిరిగి తిరిగి చేస్తాడని సూచించారు.

నయాగరా జలపాతం కానీ గ్రాండ్ కాన్యాన్ కానీ  మొదటి సారి చూసినపుడు అద్భుతమైన భావన కలుగుతుంది.  అవే, రెండో సారి చూసినపుడు, మొదటి సారి చూసినప్పటి లాంటి భావన ఎందుకు కలగదు?  ఎందుకంటే మొదటి సారి మనకు మన మేధస్సు ఆయా విషయాలను గ్రహింపుకై తెరుచుకుంటుంది. 

రెండో సారి నుంచి, క్రితం చూసిన దానిలాగ లేదే; ఈ రోజు చూసిన ఇంద్రధనుస్సు, క్రితం సారి చూసిన దాని కంటే తక్కువ ప్రకాశవంతంగా ఉంది లాంటి పోలికలు ప్రవేశించి  గ్రహింపును ప్రభావితం చేస్తాయి. నయాగరా జలపాతం కానీ గ్రాండ్ కాన్యాన్ కానీ  మొదటి సారి చూసినపుడు  అంతర్గత ప్రతిక్రియ లేకపోవడం గమనార్హం. 

నిజానికి జీవితంలో ప్రతీ క్షణము ప్రత్యేకమే. కానీ, నిజ జీవితంలో అనేక విషయాలు, పై ఉదాహరణలో ఇంద్రధనుస్సును పోలికలు ప్రభావితం చేసినట్లు, ఆ క్షణము యొక్క ప్రత్యేకతను క్షీణింప చేసి సాధారణ స్థాయికి తగ్గించి, జీవితాన్ని  మొద్దుబారుస్తాయి. 

అలా జరగకుండా ఉండాలంటే, మనలో పేరుకు పోయిన ఊహలూ, నిర్దిష్టమైన అభిప్రాయాలూ కరిగిపోవాలి. అందుకే అంతర్గత ప్రతిక్రియను కరిగించు ప్రయత్నమే ధ్యానం. అదియే భక్తి. 

తప్పదు తప్పదుదైవము కృప యిది అనే కీర్తన రెండవ చరణంలోని దీనిని చూడండి పొంచి శరీరపుభోగము లుడిగిన చుంచుఁబావములు సుకృతములే {శరీర భోగములు కోసము ఎదురు చూపులు ఆగిపోయినప్పుడు మాత్రమే కొత్త (లేదా తాజా) భావాలు పుష్పించే అవకాశం ఉంటుంది. అవే నిజంగా సద్గుణమైన విషయాలు.) 

నిక్కి నిక్కి అనే ద్వంద పదాలు మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని సూచిస్తున్నవి. ఇట్టి ఆసక్తులున్న మనస్సు ధ్యానమున నిమ్మగ్నమవదు.  అలాంటి వ్యక్తులు, నిజంగా దేవుని ప్రేమను పొందినా గ్రహించలేరు. ఈ సందర్బంలో "మాం తు వేద న కశ్చన" 7-26, (కానీ దైవము ఎవరికీ తెలియదు) అన్న భగవద్గీత వాక్యాన్ని గుర్తుచేసుకోవడం సబబని అనుకుంటా. 

 

Summary of this Keertana:

There is none (in this world) who skill we can count (on). Therefore, save us Sir without waiting. 

People repeat the prayers. They do not understand your intelligence is beyond any measure. Many times, they praise your qualities. Yet they do not find your infinite signs, traces, token presence.   

They surround and perform prayers at your temples. Yet unable to cognise your actual shape. They hear your stories repeatedly. Yet we are unable to comprehend what is devotion to you. 

People stand on their toes and lift hands to pay their obeisance. Yet they do not understand your affection and do not believe your grandeur. In this world, O Lord Venkateswara! still they fail to serve you and remain dissatisfied.

 

కీర్తన సంగ్రహ భావము:

మాలో ఎవ్వరినేర్పులు చెప్పదగినవేవీ కావయ్యా.  జాగు సేయక జీవుల రక్షించవయ్యా.

ప్రజలు పదే పదే ప్రార్థనలను చేస్తారు. నీ తెలివితేటలు కొలమానానికి మించినవని వారు అర్థం చేసుకోలేరు. మాటిమాటికి వారు నీ గుణాలను ప్రశంసిస్తారు. ఇంకా వారు నీ అనంతమైన సంకేతాలు, జాడలు, ఉనికిని కనుగొనలేరు. 

వారు నీ చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేస్తారు. అదేమిటో నీ వాస్తవ ఆకృతిని గుర్తించలేరు. వారు నీ కథలను పదేపదే వింటారు. ఐనాకూడా  రక్షణ కల్పించు నీ పట్ల భక్తిని పట్టలేకున్నారు.

ప్రజలు తమ మునికాళ్ళమీద నిలబడి, చేతులు ఎత్తి మెుక్కుతారు.  అయినప్పటికీ వారు నీ ఆప్యాయతను, నీమహిమను, గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక పోతారు. ఈ లోకంలో ఓ వేంకటేశ్వరుడా! వారు నిన్ను సేవించ లేక, కరుణకు పాత్రులుకాక  అసంతృప్తితో మిగిలిపోతారు. 

 

Copper Leaf: 160-1  Volume 2-287

 

 

 


 


2 comments:

  1. మనిషి సాధించిన నైపుణ్యములన్నీ స్వప్రయోజనార్థములే మరియు నవి నిరూపయోగములే. పరమాత్ముని ప్రణాళికలో అవి లేశమాత్రమేయని, మనిషి కేవలం నిమిత్తమాత్రుడే యని
    గ్రహించవలయును.

    జనులు పదే పదే నీ గుణగణములను కీర్తిస్తూ నీకు ప్రదక్షిణలు చేస్తూ నిన్ను మ్రొక్కుతూ ప్రార్థిస్తుంటారు.కానీ వారు నీ అనంతత్వమును,
    నిత్యత్వమును,సర్వజ్ఞతను, మహిమను, అవ్యాజమైన నీ ప్రేమను , నీ ఘనతనూ
    తెలిసికొన లేకున్నారు. నిన్ను సేవించి, నీ కరుణకు పాత్రులు కాలేక వారంతా అసంత్రుప్తులుగానే మిగిలిపోతున్నారు.
    అయిననూ జాగు చేయక అట్టి జనులను రక్షించవయ్యా అంటూ అన్నమయ్య వేంకటపతిని వేడుకొంటున్నాడు అద్భుతమైన యీ కీర్తనలో.

    భగవద్గీత శ్లోకములను,కబీర్ దాస్ దోహాలను,జిడ్డు కృష్ణమూర్తి గారి శీర్షికలతో అనుసంధానం చేస్తూ శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యానం ప్రశంసనీయం. 🙏

    ReplyDelete
  2. మంచి మంచి పదాలతో అద్భుతంగా వివరణ ఇచ్చారు.

    ReplyDelete

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...