ANNAMACHARYA
84. తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను
Introduction: This is a very
interesting poem. It probably does not carry any message, but demonstrates
actual propensity of men.
Annamacharya did not
write poetry to satisfy Gods or Kings. His main subject is common man. His undisputable portrayal of everyday
happenings is very much relatable to each and every one.
He takes on the God,
like a simpleton “if we are your creation, how can we be wrong?” Does it sound
familiar?
The underlying
message is that the man without convincing himself, looks for answers outside. As
usual, he opens up the hypocrisy behind our seemingly innocent hearts like we
peal an orange.
He uses the same
expression aparAdhA lEvi mAku (అపరాధాలు యేవి మాకు) to question god in the first stanza, to generate
doubt (in the self) in the second and accepting grace of god in the third stanza.
The beauty of this poem is not in wording but lies in clever strategy.
ఉపోద్ఘాతము: ఇది చాలా ఆసక్తికరమైన కీర్తన. ఇది ఏ సందేశాన్ని ఇవ్వకపోయినా, కానీ పురుషుల వాస్తవ ప్రవృత్తిని కళ్ళకు కట్టినట్టు
చూపుతుంది. రోజువారీ సంఘటనల గురించి పేరుపెట్టలేనట్లుండే చిత్రణను ప్రతి పౌరుడు
సులభంగా అన్వయించుకో గలుగుతాడు.
అన్నమాచార్యులు దేవుళ్ళనో, రాజులనో సంతృప్తి పరచడానికి కవిత్వం రాయలేదు. అతని ప్రధాన విషయం సామాన్యుడే
అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ.
"మేము నిజంగా నీ సృష్టి అయితే, మాలో ఎలా
అపరాధాలుంటాయో చేప్పు?" అంటూ ఒక సాధారణ వ్యక్తి లాగా
దేవుడిని ప్రశ్నిస్తాడు. ఇదేదో బాగా పరిచయం ఉన్న వాక్యంలా అనిపిస్తోందా?
ఎప్పటిలాగే, అమాయకంగా కనిపించే మన హృదయాల వెనుక ఉన్న టక్కరి జిత్తులను నారింజ పండును వొలిచినట్లుగా అతడు తెరిచి, మన కళ్ళ ముందుంచాడు.
అన్నమయ్య "అపరాధాలు యేవి
మాకు" అనే పదాలు మొదటి చరణంలో దేవుడిని ప్రశ్నించడానికి, రెండవదానిలో సందేహం
పుట్టించటానికి మరియు మూడవ చరణంలో దేవుడి దయను అంగీకరించడానికి
ఉపయోగిస్తాడు. ఈ కవిత యొక్క అందం మాటల్లో కాదు, తెలివైన వ్యూహంలో ఉంటుంది.
కీర్తన:
తెలిసినవాఁడాఁ
గాను తెలియనివాఁడాఁ గాను యిల నొకమాట నీ
కెత్తిచ్చితిఁగాని ॥పల్లవి॥
పుట్టించేవాఁడవు
నీవే బుద్ధిచ్చేవాఁడవు నీవే యెట్టున్నా
నపరాధా లేవి మాకు
అట్టూ
నన్నవారముగా మనఁగా నీచి త్తమెట్టో
కిట్టి వొకమాట
మడిగితి నింతేకాని ॥తెలి॥
మనసులోపల నీవే
మరి వెలుపల నీవే యెనసి అపరాధాలు
యేవి మాకు
నిను
నౌఁగాదనలేము నీ సరివారముఁ గాము
అనవలసినమాట
అంటి మింతే కాని॥తెలి॥
అంతరాత్మవును
నీవే అన్నిటాఁ గావఁగ నీవే యెంతైనా నపరాధా
లేవి మాకు
వింత లేక
శ్రీవేంకటవిభుఁడ నీబంట నింతే
వంతుకు
నేనొకమాట వాకుచ్చితిఁగాని ॥తెలి॥
|
telisinavADA gAnu teliyanivADA gAnu yila nokamATa nI kettichchitigAni ॥pallavi॥
puTTiMchEvADavu nIvE buddhichchEvADavu nIvE yeTTunnA naparAdhA lEvi mAku
aTTU nannavAramugA managA nIchi ttameTTO
kiTTi vokamATa maDigiti niMtEkAni ॥teli॥
manasulOpala nIvE mari velupala nIvE yenasi aparAdhAlu yEvi mAku
ninu naugAdanalEmu nI sarivAramu gAmu
anavalasinamATa aMTi miMtE kAni ॥teli॥
aMtarAtmavunu nIvE anniTA gAvaga nIvE yeMtainA naparAdhA lEvi mAku
viMta lEka SrIvEMkaTavibhuDa nIbaMTa niMtE
vaMtuku nEnokamATa vAkuchchitigAni ॥teli॥
|
Details and Explanations:
తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను
telisinavADA gAnu teliyanivADA
gAnu
Word to Word meaning: తెలిసినవాఁడాఁ (telisinavADA) = Aware; గాను (gAnu) = not; తెలియనివాఁడాఁ (teliyanivADA) = unaware; గాను (gAnu) = not; యిల (yila) = in this world; నొకమాట (nokamATa) = one word; నీ కెత్తిచ్చితిఁగాని (nI kettichchitigAni) = ఐనా ఎదుటివారికి నేర్పు, yet teach others;
Literal meaning: I am either aware or unaware. Yet, I tried teaching others.
Explanation: Man is confused. Yet, man has the
audacity to teach others says Annamacharya.
There were many gurus even in the time
of Annamayya. Probably, he is taking a pot shot at those imposters.
భావము: తెలిసినవాఁడనూ గాను
తెలియనివాఁడనూ గాను. ఐనా ఎదుటివారికి నేర్పడానికి ప్రయత్నించాను.
వివరణము: మనిషికి తనలోనే
స్పష్టతలేక పోయినప్పటికీ, ఇతరులకు
బోధించే ధైర్యం చేస్తాడు అని అన్నమాచార్యులు అన్నారు.
ఇప్పటి లాగే అన్నమాచార్యుల కాలంలో కూడా గురువులకు కొరత లేదు. బహుశ్శా దొంగ గురువులను కూడా విమర్శించి వుండవచ్చు.
పుట్టించేవాఁడవు నీవే బుద్ధిచ్చేవాఁడవు నీవే
puTTiMchEvADavu nIvE
buddhichchEvADavu nIvE
Word to Word meaning: పుట్టించేవాఁడవు (puTTiMchEvADavu)
= the one that give life; నీవే (nIvE) = you
only; బుద్ధిచ్చేవాఁడవు (buddhichchEvADavu) = ther one that
provide intelligence/wisdom; నీవే (nIvE) = you only; యెట్టున్నాను (yeTTunnAnu) = however, it may be; అపరాధా లేవి (aparAdhA
lEvi) = Where are our faults/crimes; మాకు (mAku) = We; అట్టూ (aTTU) = that side; నన్నవారముగాము
(nannavAramugAmu) = claim that we are not; అనఁగా (anagA) = if claimed; నీ (nI) = your;
చిత్తమెట్టో (chi
ttameTTO) = which side is your mind? కిట్టి (kiTTi) = దగ్గర, సమీపించు, close by, to approach; వొకమాట (vokamATa) = one word; మడిగితి (maDigiti) =
sought; నింతేకాని (niMtEkAni) = but that’s all;
Literal meaning: You gave us life and intelligence; whatever side, we may be; how
can we be wrong? (It’s all by you). We claim that we are not on the other side of God! We just wanted to check what is on your mind. That’s why we approached and
sought a word from you.
Explanation: Annamayya is clear how human mind works.
We people want to wash away our responsibility in everything we do, by
declaring, everything is given by God. How can we be wrong?
aparAdhA lEvi mAku (అపరాధా లేవి మాకు = What is our guilt?”) is accurately depicting the man’s
attitude. Most often, our tendency is to cover up mistakes and support
ourselves by daring others (including god) by declaring “What is our guilt?”
We simply claim that we are not on the
other side of the table. Are we actually? We know the truth. Yet, we want to
try and say these things.
We are like that cat on the wall. We
just want to jump to the convenient side. Who are we cheating? We take that we
are more intelligent that GOD is. Just consider this sentence from Hebrew (4th
chapter).
“For the
word of God is alive and active. Sharper than any double-edged sword, it
penetrates even to dividing soul and spirit, joints and marrow; it judges the
thoughts and attitudes of the heart.”
The greatness of this poem is it is
depicting exactly the way we behave in the present times, though it is 500
years old.
భావము: పుట్టించేవాఁడవు, బుద్ధిచ్చేవాఁడవు
నీవే ఐనప్పుడు, మేము యెట్లున్నా అపరాధాలు ఉండరాదే! అటు ఉన్నవారముగాము
అంటే నీచిత్తమెటు వైపో తెలుసుకుందామని దగ్గరకొచ్చి వొకమాట అడిగితిమి అంతే.
వివరణము: అన్నమయ్యకు మానవుల మనస్తత్వం స్పష్టంగా తెలుసు. "ప్రతిదీ దేవుడిచేత ఇవ్వబడింది. ఇందులో మా తప్పేంటో? అంటూ మన బాధ్యతను దులుపేసుకుంటాం అని అన్నారు.
“అపరాధా లేవి మాకు” ద్వారా మా తప్పేంటి అని అడుగుతూ, మాటిమాటికి మన తప్పులు మనమే కప్పిపుచ్చుకుని సమర్ధించుకునే ధోరణిని అద్భుతంగా చూపారు. మనమేదో పునీతులమైనట్లు అందరికీ చూపించడనికి విశ్వప్రయత్నము చేస్తాము.
మనము న్యాయానికి మరొక వైపు లేమని చెప్పుకుంటాం. మనం నిజంగా ఉన్నామా? మనలో మనకు నిజం తెలుసు. ఐనా, మనము ఈ విధంగా ప్రయత్నించి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాము.
గోడమీద పిల్లిలాగా అటు దూకాలో ఇటు దూకాలో నిశ్చయించుకోలేం! పైగా భగవంతుడా నువ్వెటున్నావో చెప్పు అంటూ సతాయిస్తాము. మనం ఎవరిని మోసం చేస్తున్నామో? దేవుడి కంటే మనమే తెలివైనవాళ్లం అని అనుకుంటాం. ఐతే బైబిల్ నుండి ఈ వాక్యాన్ని పర్యాలోచించండి.
(హెబ్రీయులకు అధ్యాయం 4) 12ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. 13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
ఈ కవిత యొక్క గొప్పతనం ఏమిటంటే, 500 సంవత్సరాల క్రితం వ్రాసినప్పటికీ, ప్రస్తుత కాలంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో సరిగ్గా దాన్నే వర్ణిస్తోంది.
మనసులోపల నీవే మరి వెలుపల నీవే
manasulOpala nIvE mari velupala
nIvE
Word to Word meaning: మనసులోపల (manasulOpala) = inside our mind; నీవే (nIvE) = you only; మరి (mari) = then; వెలుపల (velupala) = out side; నీవే (nIvE) = you only; యెనసి (yenasi) = సరి చూసుకుంటే, పోల్చు, If we count; అపరాధాలు (aparAdhAlu) = our faults/crimes; యేవి (yEvi) = where; మాకు (mAku) = to us; నిను (ninu) = you; నౌఁగాదనలేము (naugAdanalEmu) = ఔను అనలేము లేదా కాదు అనలేము, Cannot Yes or No; నీ (nI) = your; సరివారముఁ గాము (sarivAramu gAmu) = not equals; అనవలసినమాట (anavalasinamATa) = appropriate word; అంటిమి (aMTi) = uttered; ఇంతే కాని (iMtE kAni) = that is all;
Literal meaning: You are there in our mind and outside. When
everything is existing in you, where is the question of counting our faults? We
can neither say Yes or No to you. We are not your equals. We just said the appropriate words. That is
all.
Explanation: In this stanza, Annamayya mellowed down a bit. He is no more
questioning like in the previous stanza. Here he used a new expression augAdanalEmu (ఔగాదనలేము) where a person is unable to say Yes or No.
He is tormented between the two extremes. Finally unable to decide which way to
go. This defines life position taken by many of us.
The other day, I was watching a pet dog
trying to take on a street dog. The pet Dog became mildly ferocious. Then the owner
came in between the dogs. Per dog, though ferocious, yet on seeing the owner
still wagged its tail and returns to normalcy.
Our position is similar to the dog. We
want to follow the wilder side of our instincts yet we get manicured by the
cultured living. This dichotomy leads to dissatisfaction in life.
anavalasinamATa
aMTi miMtE kAni (అనవలసినమాట అంటి మింతే కాని) is
signifying that We repeat prayers of peace without really implying them.
భావము:
మనసులో మరియు బయట నువ్వే ఉన్నావు. అన్నీ నీలో
ఉన్నప్పుడు, సరి చూసుకుంటే మా అపరాధాలు ఉండవే? మేము నిన్ను అవుననలేము, అట్లని కాదనలేము. మేం మీతో సమానం కాదు. ఏదో అనవలసినమాటలు అన్నామంతే.
వివరణము: ఈ చరణంలో, అన్నమయ్య కాస్త
మెత్తబడ్డాడు. ఇక్కడ మానవుడు అవుననికానీ
లేదా కాదనికానీ అని చెప్పలేక పోతాడంటూ కొత్త పదాన్ని ఔగాదనలేము అని
ఉపయోగించాడు. అతను రెండింటి మధ్య నలిగిపోతాడు. ఐనా, చివరకు ఏ
మార్గంలో వెళ్లాలో నిర్ణయించుకోలేడు. ఇది
మనలో చాలామంది అనుసరించే జీవిత స్థితిని నిర్వచిస్తుంది.
ఒక రోజు నేను
ఒక పెంపుడు కుక్క వీధి కుక్కమీదకు మొరుగుతూ
పైకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా చూశాను. అది దాని సహజ ప్రవృత్తి. పెంపుడు
కుక్క కోపంగా ఉంది. అప్పుడు యజమాని కుక్కల మధ్యకు వచ్చాడు.
పెంపుడు కుక్క కోపంగా ఉనప్పటికీ, యజమానిని చూడగానే
తోక ఊపడం చేసింది. మళ్ళి మామూలు స్థితికి వచ్చింది.
మనమూ ఆ పెంపుడు కుక్క లాగే. పశుప్రవృత్తితో కూడిన విశృంఖలమైన
కోరికలను పొందాలను కుంటాము. ఇంతలో సంస్కారయుక్తమైన నాగరికత అనే పాశం వెనక్కి
లాగుతుంది. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ
అసంతృప్తి పొందుతాం.
అనవలసినమాట అంటి మింతే కానితో మనము శాంతి మంత్రాలు నిజంగా
మనస్సులో లేనప్పటికీ యధాలాపంగా అనేస్తామని సూచిస్తుంది.
అంతరాత్మవును నీవే అన్నిటాఁ గావఁగ నీవే
aMtarAtmavunu nIvE anniTA
gAvaga nIvE
Word to Word meaning: అంతరాత్మవును (aMtarAtmavunu) = soul; నీవే (nIvE) = you only; అన్నిటాఁ (anniTA) = in all; గావఁగ (gAvaga) = save; నీవే (nIvE) = you only; యెంతైనా (yeMtainA) ) = whatever; నపరాధా లేవి (naparAdhA lEvi) =where faults/ deficiencies; మాకు (mAku) = for us; వింత లేక (viMta lEka) = without curiosity; శ్రీవేంకటవిభుఁడ (SrIvEMkaTavibhuDa) = lord Venkateswara; నీబంట (nIbaMTa) = your servant; నింతే (niMtE) = that all; వంతుకు (vaMtuku) = as per turn; నేనొకమాట (nEnokamATa) = one word; వాకుచ్చితిఁగాని (vAkuchchitigAni) = పలికితిని గానీ, uttered but;
Literal meaning: You are soul for all. You save us in all our
troubles. How can there be faults/
deficiencies? O Lord Venkateswara I submit as your servant (without the curiosity to know any further). I might
have said one word as per my turn.
Explanation: viMta lEka (వింత లేక) is denoting action without curiosity of what
happens next. He is satisfied in his mind that he does
not need to explore further or look for answers. It is Similar to the one
described in Bhagavad-Gita. (4-20) त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रय: tyaktvā karma-phalāsaṅgaṁ nitya-tṛipto nirāśhraya (Purport: Such people, having given up attachment
to the fruits of their actions, are always satisfied and not dependent on
external things.)
Last line “vaMtuku
nEnokamATa vAkuchchitigAni” (వంతుకు నేనొకమాట వాకుచ్చితిఁగాని) is indicating that Annamayya
composed the songs as per the divine instruction.
భావము: అంతరాత్మవును నీవే. మా కష్టాలన్నింటిలోనూ నీవే రక్షిస్తావు. అపరాధాలు మాకు ఎలా ఉంటాయి? ఓ శ్రీవేంకటవిభుఁడా, సేవకుడిగా నీకు సమర్పించు కున్నాను. (ఆ తర్వాత ఏమైందో తెలుసుకునే ఆతృత లేకుండా). నా వంతు ప్రకారం నేను ఒక మాట (పాట) పాడి ఉండవచ్చు.
వివరణము: వింత లేక తరువాత ఏమి జరుగుతుందనే
ఉత్సుకత లేకుండా చేయు చర్యను సూచిస్తుంది. ఇది భగవద్గీతలో వివరించిన త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః (4-20) లాగా అనుకోవచ్చు. అటువంటివారు, తమ కర్మ ఫలములపై ఆసక్తి/మమకారం త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తి తో ఉంటారు మరియు బాహ్య వస్తు-విషయములపై ఆధారపడరు.
వంతుకు నేనొకమాట వాకుచ్చితిఁగాని అన్న చివరి పంక్తి అన్నమయ్య దైవిక సూచనల మేరకు పాటలు
వ్రాసారని సూచిస్తోంది.
Summary of
this Keertana:
I am either aware or
unaware. Yet, I tried teaching others.
You are the one that gave us life and intelligence; whatever side, we may be; how
can we be wrong? (It’s all by you). We claim that we are not on the other side,
God! We just wanted to check what is on your mind. That’s why we approached and
sought a word from you.
You are
there in our mind and outside. When everything is existing in you, where is the
question of counting our faults? We can neither say Yes or No to you.
We are not your equals. We just
said the appropriate words. That is all.
You are soul for all. You save us
in all our troubles. How can there be
faults/ deficiencies? O Lord Venkateswara I submit as your servant (without the curiosity to know any further). I might
have said one word as per my turn.
కీర్తన సంగ్రహ భావము:
తెలిసినవాఁడనూ
గాను తెలియనివాఁడనూ గాను. ఐనా ఎదుటివారికి నేర్పడానికి ప్రయత్నించాను.
పుట్టించేవాఁడవు, బుద్ధిచ్చేవాఁడవు
నీవే ఐనప్పుడు, మేము యెట్లున్నా అపరాధాలు ఉండరాదే! అటు
ఉన్నవారముగాము అంటే నీచిత్తమెటు వైపో తెలుసుకుందామని దగ్గరకొచ్చి వొకమాట అడిగితిమి
అంతే.
మనసులో
మరియు బయట నువ్వే ఉన్నావు. అన్నీ నీలో ఉన్నప్పుడు, సరి చూసుకుంటే
మా అపరాధాలు ఉండవే? మేము
నిన్ను అవుననలేము, అట్లని
కాదనలేము. మేం మీతో సమానం కాదు. ఏదో అనవలసినమాటలు అన్నామంతే.
అంతరాత్మవును
నీవే. మా కష్టాలన్నింటిలోనూ నీవే రక్షిస్తావు. అపరాధా మాకు ఎలా ఉంటాయి? ఓ
శ్రీవేంకటవిభుఁడా, సేవకుడిగా
నీకు సమర్పించు కుంటున్నాను (ఆ తర్వాత ఏమైందో తెలుసుకునే వింతలు/ ఉత్సుకతలు
లేకుండా). నా వంతు ప్రకారం నేను ఒక మాట (పాట) పాడి ఉండవచ్చు.
Copper Leaf: 108-4 Volume 2-46
Beautiful verse and clear commentary. The essence of the kirtana is given at the end of commentary and that is a good effort to give more clarity to the reader. Thank you.
ReplyDeleteVery well explained, Srinivas 👏 - our duvidha, confused state of mind 🤔
ReplyDeleteIt rings me a bell of Ramadas's kriti - palukebangaramaayena. We tend to blame the Almighty for our plight.... These mahaanubhaavulu tried to make you understand the reality, ie self realisation. Kudos to you for such a wonderful explanation ☺️
- Kameswararao
Deleteభగవద్గీత,బైబిల్ లోని అంశాలను ఉటంకిస్తూ ఒక సగటు మానవుని మనోప్రవృత్తిని మంచి వ్యాఖ్యానంతో వివరించారు.👏👍🙏
ReplyDeleteకృష్ణ మోహన్
ReplyDeleteవిశాఖపట్నం
భగవద్గీత,బైబిల్ లోని అంశాలను ఉటంకిస్తూ ఒక సగటు మానవుని మనోప్రవృత్తిని మంచి వ్యాఖ్యానంతో వివరించారు.👏👍🙏