Sunday, 9 October 2022

T-144 వెన్న చేతబట్టి నేయి వెదకనేలా

 తాళ్లపాక అన్నమాచార్యులు

144 వెన్న చేతబట్టి నేయి వెదకనేలా

 for English Version press here


ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు దార్శనికుడని నిరూపించడానికి ఈ ఒక్క కీర్తన సరిపోతుంది. గీసుకున్న గిరికి బయట వెదుకవలెనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ​ 

పోది నిన్ను మదిఁ దలపోయనేలా ( హీరో! మది లోపల నీ గురించే ఎందుకు మరీ మరీ  తలుస్తావు?) అనేది ప్రస్తావించదగిన విషయం. ఇది కేవలం ఆలోచన, ధ్యానము, చింతనల ద్వారా నువ్వు నీపై నీకు గల అంచనాలను మాత్రమే తెలుసుకుంటావు. ఇది పల్లవిలో చెప్పినదానికి వ్యతిరేకము. అన్నమాచార్యులు యీ సరళిలో ఇంకొంచెం ముందుకెళ్ళి మొత్తానికే  తనకే తాను పరాయి వ్యక్తి అవ్వాలని సూచించారు.

అన్నమాచార్యుల సాహసోపేతమైన ప్రకటనలు పరంపరగా వస్తున్న పద్ధతులకు వ్యతిరేకం కాదు, కానీ అవి మోక్షానికి మార్గం కావని అతని వాదన​. కీర్తన ద్వారా మానవులంతా "చర్య అంటే ఏమిటి" అని ఆలోచించాలన్నారు. మొత్తం భగవద్గీత ఉపదేశం కూడా అదే. 

ప్రపంచంతో ఎటువంటి ప్రతిఘటనలేని ఐక్య భావముతో కలసిపోవడం ఒక్కటే ధ్యానమని, ప్రపంచం నుండి దూరంగా జరిగిపోవడం కాదు అని నొక్కి చెప్పారు. 

"నారదశుకాదులును / యీవిధముననే ఆనతిచ్చినారు" అని ధ్యానమయ జీవితము స్వచ్ఛమైన చర్య యని సూచించారు.  అది కానివన్నీ అనగా మనం చేసేవన్నీ ధ్యానము లోనికి రావు. 

సాటిలేని కూర్పు అన్నమాచార్యుల మహోన్నత వ్యక్తిత్వానికి గీటురాయి.  అన్నమాచార్యులు బోధించట లేదు, అన్వేషించమని ప్రజలను అడుగుతున్నాడు. 

 

కీర్తన:

రాగిరేకు:  64-1  సంపుటము: 1-328

 

వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా
యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము ॥పల్లవి॥
 
నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె
వేదతో వేరొక చోట వెదకనేలా
ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు
పోది నిన్ను మదిఁ దలపోయనేలా ॥వెన్న॥
 
వారలతోడి మాటలు వడి వేదాంతపఠన
సారె వట్టిచదువులు చదువనేల
చేరి వారికరుణే నీ చేపట్టిన మన్ననలు
కోరి యింతకంటే మిమ్ముఁ గొసరనేలా ॥వెన్న॥
 
నావిన్నపము నిదె నారదశుకాదులును
యీవిధముననే ఆనతిచ్చినారు
శ్రీవేంకటేశ నీవు చేపట్టిన దాసులకు
కైవశమౌ యీబుద్ధి కడమేలా         ॥వెన్న॥  

Details and Explanations: 

వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా
యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము ॥పల్లవి॥

భావము: వెన్న చేతబట్టి నేయి వెదకుటెట్లు వ్యర్థమోతనకు కలది కనుగొనుట వివేకమా? .

వివరణము:All men are mortal” / “Socrates is a man” వంటి భ్రాంతవాదము కాదు. పల్లవి కేవలం "మీ వద్ద ఇప్పటికే ఉన్నదాన్ని కనుగొనడం జ్ఞానమని పించుకోదు" అని పేర్కొంది.

నీ చేతిలో ఏమి ఉంది? జీవితాన్ని సరిగ్గా జీవించే అవకాశం. నీవు "సజీవంగా ఉన్నావని" తెలుసుకోనునది ఏమీ?  అని పల్లవి ప్రశ్నించుచున్నది. 

మనిషి ఏం చేస్తాడు? అతడు "నేను ఏమిటి", "రేపు నేనేమౌతాను" "నన్ను ఎవరు సృష్టించారు" అని వెతుకుతాడు. సంస్కృతులతోను, దేశాలతోను సంబంధం లేకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రజల ధోరణి. ఈ ప్రవృత్తి ముఖ్యంగా "రేపు నేనేమౌతాను" ను పట్టి చూపిస్తున్న రెనే మాగ్రిట్‌ గారి "లా క్లైర్‌వాయెన్స్" (భవిష్యవాణి) పేరుతో  ఉన్న చిత్రాన్ని దిగువన చూడండి. చిత్రంలో ఉన్న కళాకారుడు రెనే మాగ్రిట్టే. ​

 


చిత్రకారుడు ఏమి చూస్తున్నాడు. ఒక గుడ్డు. కానీ అతను ఏమి చిత్రిస్తున్నాడు. ఒక పక్షిని. అదేవిధంగా, మనం, ఒక విషయాన్ని చూస్తాము కానీ చూసినదానిని చూసినట్లుగా గ్రహించకుండా తర్వాత ఏమౌతుందో అన్న ఆతృతో మరొకటిగా భావింపజూస్తాము.  ఊహింపజూస్తాము. "జీవించి ఉన్నాము" అని తెలుసుకోవడంలో మనకు తృప్తి లేదు, కానీ "నేను ఇంత పెద్దవాడిని", "నేనే గొప్పవాడిని" "నేను హీనుడిని" "నేను చాలా శక్తివంతుడిని" అని నిరూపించి, ధృవీకరించాలనుకుంటాము. మన అభిరుచులు మరియు వీలైన ప్రకారం మనము జీవనశైలిని సృష్టిస్తాము. రకంగా జీవితంలో నిమగ్నమై పల్లవి చెబుతున్న సత్యాన్ని అనుకోకుండా తిరస్కరిస్తాము.  

ఇది భగవద్గీతలో “కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి కర్మ యః” (=ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు, 4-18) అని చెప్పినట్లుంది. మనం ఏదైనా సంకల్పించి చేస్తే, అది ఖచ్చితంగా మన అవగాహనలోనిదే. ఇది పల్లవి మరియు భగవద్గీతల ప్రకారం చర్య కానే కాదు. అన్నమాచార్యుల మాటల్లోని ద్వ్యర్థత (double meaning) లోతైనదే కాదు, మనసు పెట్టి చదవకుంటే తప్పుద్రోవకూడా పట్టించవచ్చు. 

అన్వయార్ధము: మానవుడా​! (శుద్ధమైన, కలుషితంకాని​) చర్య అంటే ఏమిటో తెలుసుకో! 

నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె
వేదతో వేరొక చోట వెదకనేలా
ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు
పోది నిన్ను మదిఁ దలపోయనేలా ॥వెన్న॥ 

ముఖ్య పదములకు అర్ధములు: వేదతో = వేదములు మొదలుగాగల గ్రంథముల నుండి సంపాదించిన జ్ఞానముతో { ఇక్కడ, వేదతో అన్న  దానిని సహజంగా పొందిన విద్యకు వ్యతిరేకార్ధములో ప్రయత్నం ద్వారా నేర్చుకున్నది అనే అర్థంలో ఉపయోగించాడని నేను భావిస్తున్నాను}; ఆదిగొని = ఎదురుపడు, కన్ను వేయు, పోది = {this word is a short version of word పోదికాఁడు = పోటుకాఁడు = meaning a capable person for combat; here and in some other verses also Annamacharya had used shorter word పోది}, = వీరుడు. 

భావము: నీ దాసులున్న యీ ప్రపంచమే నిత్యవైకుంఠము. గ్రంథముల నుండి సంపాదించిన మిడి మిడి జ్ఞానముతో వేరొక చోట వెదకనేలా? ఈ భూమ్మీద ఎదురయ్యేవారంతా నీ ఆకారాలే కాదా? ఓ హీరో! ఎల్లప్పుడూ నీ తలపులలో నీవేనే? 

వివరణము: నీ దాసులు” అంటే ఈ ప్రపంచంలోని ప్రజలందరూ (మినహాయింపులు లేకుండా) ప్రభువు సేవకులనే అర్ధములో వాడారు. “నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె” {=ఈ ప్రపంచమే నిత్యవైకుంఠము} ఇది స్వర్గ తుల్యము. ఈ సందర్భముగా "ఆకాశ పాకాశ మరుదైన కూటంబు”#1 అన్న అన్నమార్యుని మాటలు గమనార్హము. 

“వేదతో వేరొక చోట వెదకనేలా” అనేది మనం కృషి చేసి మరీ  కల్పితమైన జ్ఞానంతో పని చేస్తామని సూచిస్తుంది. అందువలన, సత్యమును కాక 'రంగుల​' చిత్రాన్ని చూస్తాము. 

ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు  అనేది మనం చూసే యీ ప్రపంచం మన మనస్సు యొక్క ప్రొజెక్షన్ అని నిర్ధారిస్తుంది. భగవద్గీతలోని  "అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం" (= విభజించబడనప్పటికీ, విభజింపబడినట్లు కనిపిస్తుంది, 13-17) అన్నది కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. 

“పోది నిన్ను మదిఁ దలపోయనేలా” = హీరో! పోటుగాడా! ఎప్పుడూ అన్నీ నీ వైపు నుంచే ఎందుకు ఆలోచించుకోవాలి? ప్రపంచానికి నీవేనా కేంద్రము? ఇప్పుడు రెనే మాగ్రిట్టే వేసినగోల్కొండఅనే పెయింటింగ్ చూడండి.

 


మీరు చిన్న చిత్రములో అనేక రెనే మాగ్రిట్ బొమ్మలు చూపారు. నిశితంగా గమనిస్తే, పెయింటింగ్ మనం చూసేది మన గురించిన అంచనాలే తప్ప సత్యం కాదని సూచిస్తోంది 

అన్వయార్ధము: కనపడుతున్న ప్రపంచం మీ స్వంత ప్రొజెక్షన్ అని మీరు కనుగొన్నప్పుడు, మీరు ఇందులో నిమగ్నమౌతారా? అలాంటి దృక్పథం మీకు మీరే అపరిచితుడిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. 

వారలతోడి మాటలు వడి వేదాంతపఠన
సారె వట్టిచదువులు చదువనేల
చేరి వారికరుణే నీ చేపట్టిన మన్ననలు
కోరి యింతకంటే మిమ్ముఁ గొసరనేలా ॥వెన్న॥

ముఖ్య పదములకు అర్ధములు: వట్టిచదువులు = మిథ్యా జ్ఞానము, చేపట్టిన = స్వీకరించు, పుచ్చుకొను; గొసరనేలా = ప్రార్థించనేలా? కోరనేలా? 

భావము: భగవంతుని సేవకులతో చర్చ కంటే త్వరగా వేదాలను  అర్థం చేసుకోగల విధానమే లేదు.   నిరాధారమైన జ్ఞానాన్ని శ్రమపడి నేర్చుకోవడం వల్ల ఏ ప్రయోజనం చేకూరుతుందో? వారి కరుణను అంగీకరించడమే దేవదేవుని ఆశీర్వాదం. ఇంతకు మించి కోరుకునేది ఏముంటుంది? 

వివరణము: చరణం చాలా సాధారణముగా కనిపించినప్పటికీ ధ్యానము (లేదా తపస్సు) ఎక్కడొ మూల కూర్చుని చేసేది కాదని తెలియజేస్తున్నారు. అన్నమాచార్యులు ప్రజల మధ్య నివసించారు. అలాగే బుద్ధుడు మరియు జిడ్డు కృష్ణమూర్తి కూడా. 

మహానుభావులు తాము నేర్చిన, తెలుసుకున్న జాగృతమైన వివేకము, నిస్సంశయమై అవబోధముల  వితరణమునకు ఎంతో ఆసక్తిగా సాధారణ ప్రజలతో కలిసిమెలిసి  మెలగారనేది వాస్తవం. ఇక్కడ పేర్కొన్న ముగ్గురూ తమ జీవితాన్ని కేవలం కార్యాచరణలోనే గడిపారు. జిడ్డు కృష్ణమూర్తి తన శిష్యులుగా ఎవరినీ అంగికరించకపోయినా  వారు గత శతాబ్దంలో ఇతర మత పెద్దల కంటే ఎక్కువ మంది వ్యక్తులను కలిసి  చర్చలు, గోష్టులు, సభలు నిర్విరామంగా 56 సంవత్సరాలపాటు జరిపిరి. 

అన్వయార్ధము: ప్రపంచం కంటే గొప్ప సత్యం లేదు. మీ తోటివారి కంటే గొప్ప ఉపాధ్యాయుడు లేడు. అంతరంగ సామరస్యముతోడి జీవనము కంటే జ్ఞానమూ ఉన్నతమైనది కాదు. 

నావిన్నపము నిదె నారదశుకాదులును
యీవిధముననే ఆనతిచ్చినారు
శ్రీవేంకటేశ నీవు చేపట్టిన దాసులకు
కైవశమౌ యీబుద్ధి కడమేలా        ॥వెన్న॥ 

ముఖ్య పదములకు అర్ధములు: కైవశమౌ = స్వాధీనమగు, లోకువగు. 

భావము: మహర్షులు నారదుడు మరియు శుకుడు అదే తెలియజేసారు. మీకు నా విన్నపము కూడా అదే. శ్రీ వేంకటేశ్వరుని సేవకులకు మనస్సు లొంగును. వారి అర్హతలకు హద్దుందా? 

వివరణము: అన్నమాచార్యులు అందరూ సమానమేనని, ప్రతి మనిషి మోక్షము పొందగలరని స్పష్టం చేశారు. కానీ మనిషి దాని వైపు అడుగులు వెయ్యాలి. 

ధ్యానము అనేది దీర్ఘాలోచనా కాదు, చర్చా కాదు. ధ్యానము అనేది స్వచ్ఛమైన చర్య. మనిషి తనను తాను అనంతంలోకి అర్పించుకునే చర్య. నారదుడు, శుకుడు వంటి మహానుభావుల సందేశం ఇదేనన్నారు. 

అన్వయార్ధము: మానవుడా! హృదయ ఘోష విను. ఋషిపుంగవుల ఆనతిపై, దైవమునకు నిజమైన బంటుగా మారి జీవన యానమున ముందుకు సాగుము#2.


కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: వెన్న చేతబట్టి నేయి వెదకుటెట్లు వ్యర్థమో, తనకు కలది కనుగొనుట వివేకమా?అన్వయార్ధము: మానవుడా​! (శుద్ధమైన, కలుషితంకాని​) చర్య అంటే ఏమిటో తెలుసుకో!

 

చరణం 1: నీ దాసులున్న యీ ప్రపంచమే నిత్యవైకుంఠము. గ్రంథముల నుండి సంపాదించిన మిడి మిడి జ్ఞానముతో వేరొక చోట వెదకనేలా? ఈ భూమ్మీద ఎదురయ్యేవారంతా నీ ఆకారాలే కాదా? ఓ హీరో! ఎల్లప్పుడూ నీ తలపులలో నీవేనే? అన్వయార్ధము: కనపడుతున్న ప్రపంచం మీ స్వంత ప్రొజెక్షన్ అని మీరు కనుగొన్నప్పుడు, మీరు ఇందులో నిమగ్నమౌతారా? అలాంటి దృక్పథం మీకు మీరే అపరిచితుడిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. 

 

చరణం 2: భగవంతుని సేవకులతో చర్చ కంటే త్వరగా వేదాలను అర్థం చేసుకోగల విధానమే లేదు.   నిరాధారమైన జ్ఞానాన్ని శ్రమపడి నేర్చుకోవడం వల్ల ఏ ప్రయోజనం చేకూరుతుందో? వారి కరుణను అంగీకరించడమే దేవదేవుని ఆశీర్వాదం. ఇంతకు మించి కోరుకునేది ఏముంటుంది? అన్వయార్ధము: ప్రపంచం కంటే గొప్ప సత్యం లేదు. మీ తోటివారి కంటే గొప్ప ఉపాధ్యాయుడు లేడు. అంతరంగ సామరస్యముతోడి జీవనము కంటే జ్ఞానమూ ఉన్నతమైనది కాదు. 

చరణం 3: మహర్షులు నారదుడు మరియు శుకుడు అదే తెలియజేసారు. మీకు నా విన్నపము కూడా అదే. శ్రీ వేంకటేశ్వరుని సేవకులకు ఈ మనస్సు లొంగును. వారి అర్హతలకు హద్దుందా? అన్వయార్ధము: మానవుడా! హృదయ ఘోష విను. ఋషిపుంగవుల ఆనతిపై, దైవమునకు నిజమైన బంటుగా మారి జీవన యానమున ముందుకు సాగుము#2.

 References and Recommendations for further reading:

#1 T-142® ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా (Emi galadiMdu neMta penagina vRthA

#2 47. ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా (yemmela puNyAlu sEsi yila nElavachchu gAka / kammi hari dAsuDu gAvachchunA)


Saturday, 8 October 2022

144 venna chEtabaTTi nEyi vedakanElA (వెన్న చేతబట్టి నేయి వెదకనేలా)

 ANNAMACHARYULU

144 వెన్న చేతబట్టి నేయి వెదకనేలా

(venna chEtabaTTi nEyi vedakanElA)

for Telegu (తెలుగు) Version press here

Introduction: This single poem is sufficient to prove Annamacharya is a philosopher. He called on people to think radically, outside the box of convention. 

The wording పోది నిన్ను మదిఁ దలపోయనేలా (pOdi ninnu madi dalapOyanElA = O Hero! why should you keep reflecting on yourself?) is something worth a mention. It simply conveys by thinking and contemplation you only get to know the projections of yourself. This is direct denial of the statement of the chorus.  Annamacharya goes to the extremes of suggesting one should be an alien to oneself. 

Annamacharya’s daring declarations are not against established practices, but he contends that they are not the route for salvation. He simply wanted men to contemplate on “what action is” through this poem. Entire Bhagavad-Gita is also saying the same thing. 

He further emphasises by stating being in harmony with this world is the only meditation, not alienation from the world. 

Further the sentence నారదశుకాదులును / యీవిధముననే ఆనతిచ్చినారు (nAradaSukAdulunu / yIvidhamunanE AnatichchinAru) declares that “this is the interpretation provided by great saints Narada and Suka”. Thus, implying the life of meditation is pure action and everything else we do is non-action.  

This incomparable composition has all marks of a great soul behind it. Annamacharya is not preaching, he is asking people to explore.   

 

కీర్తన:

రాగిరేకు:  232-1  సంపుటము: 3-180

POEM

Copper Leaf:  232-1  Volume: 3-180

 

వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా
యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము ॥పల్లవి॥
 
నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె
వేదతో వేరొక చోట వెదకనేలా
ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు
పోది నిన్ను మదిఁ దలపోయనేలా ॥వెన్న॥
 
వారలతోడి మాటలు వడి వేదాంతపఠన
సారె వట్టిచదువులు చదువనేల
చేరి వారికరుణే నీ చేపట్టిన మన్ననలు
కోరి యింతకంటే మిమ్ముఁ గొసరనేలా ॥వెన్న॥
 
నావిన్నపము నిదె నారదశుకాదులును
యీవిధముననే ఆనతిచ్చినారు
శ్రీవేంకటేశ నీవు చేపట్టిన దాసులకు
కైవశమౌ యీబుద్ధి కడమేలా         ॥వెన్న॥ 

 

venna chEtabaTTi nEyi vedakanElA
yinniTA neMchi chUchitE nidiyE vivEkamu pallavi
 
nI dAsulunnachOTa nityavaikuMTha mide
vEdatO vEroka chOTa vedakanElA
Adigoni vArirUpu laviyE nIrUpulu
pOdi ninnu madi dalapOyanElA venna
 
vAralatODi mATalu vaDi vEdAMtapaThana
sAre vaTTichaduvulu chaduvanEla
chEri vArikaruNE nI chEpaTTina mannanalu
kOri yiMtakaMTE mimmu gosaranElA venna
 
nAvinnapamu nide nAradaSukAdulunu
yIvidhamunanE AnatichchinAru
SrIvEMkaTESa nIvu chEpaTTina dAsulaku
kaivaSamau yIbuddhi kaDamElA venna

 

Details and Explanations: 

వెన్న చేతఁబట్టి నేయి వెదకనేలా
యిన్నిటా నెంచి చూచితే నిదియే వివేకము ॥పల్లవి॥

venna chEtabaTTi nEyi vedakanElA
yinniTA neMchi chUchitE nidiyE vivEkamu pallavi 

Word to word meaning:  వెన్న (venna) = butter; చేతఁబట్టి (chEtabaTTi) = holding in hand;  నేయి (nEyi) = ghee (oil); వెదకనేలా (vedakanElA) = why search?; యిన్నిటా (yinniTA) = In all these; నెంచి (neMchi) = by evaluating;  చూచితే (chUchitE) = seeing, watching;  నిదియే (nidiyE) = this alone is; వివేకము (vivEkamu) = intelligence.           

Literal meaning: Do you look for the ghee (oil) with the butter in the hand? When all possible actions are weighed, this alone is intelligence.

Explanation: The chorus sounds something like a fallacy “All men are mortal” / “Socrates is a man”. It’s simply stating, “Finding out what you already have is not intelligence”.

What do we have in hand? The opportunity of living (this life). The chorus is implying that finding or knowing you are “already alive” is a fallacy. This sounds very illogical but is the meaning. 

What man does? He goes about finding “what he is”, “what he would be” and “who created him”. Irrespective of the country of origin, this is the tendency of people. See the picture below titled “La Clairvoyance” by Rene Magritte capturing this propensity of "What will I be tomorrow". The artist in the picture is Rene Magritte. 



What is the object painter is seeing. An egg. What is he painting. A Bird. Similarly, we people, see one thing but “assume / create’ it to be another. We are not satisfied to know that “we already alive”, but want to prove and confirm “I am this big”, “I am this great” “I am so low” “I am so powerful”. we create a lifestyle according to our tastes and means. Thus, we inadvertently deny the truth of this chorus by engaging in life like we do now. 

This chorus is similar to Bhagavad-Gita statement कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: (karmayakarma ya paśhyed akarmai cha karma yaḥ 4-18) = Those who see action in inaction and inaction in action are truly wise amongst humans. This implies that awareness that I am doing this is incorrect. If we do anything consciously, we are definitely aware of it. This is not action as per the Chorus and Bhagavad-Gita. Syllogism in Annamacharya’s words is not just deep, but deceptive. 

Implied Meaning: Man! figure out what (pure and unadulterated) action is. 

 

నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె
వేదతో వేరొక చోట వెదకనేలా
ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు
పోది నిన్ను మదిఁ దలపోయనేలా ॥వెన్న॥
 
nI dAsulunnachOTa nityavaikuMTha mide
vEdatO vEroka chOTa vedakanElA
Adigoni vArirUpu laviyE nIrUpulu
pOdi ninnu madi dalapOyanElA venna 

Word to word meaning:  నీ దాసులున్నచోట (nI dAsulunnachOTa) = where your servants stay; నిత్యవైకుంఠము (nityavaikuMThamu) = Ever New paradise of Vishnu; ఇదె (ide) = this one;  వేదతో (vEdatO) = వేదములు మొదలుగాగల గ్రంథముల నుండి సంపాదించిన జ్ఞానముతో, with knowledge from books and memory {here, I feel he used it in the sense of one learnt by effort, rather than one received naturally}; వేరొక చోట (vEroka chOTa) = Elsewhere;  వెదకనేలా (vedakanElA) = why search? (no need) ఆదిగొని (Adigoni) = the ones you encounter, the ones on which you see;   వారిరూపు (vArirUpu) = their forms; లవియే (laviyE) = the same; నీరూపులు (nIrUpulu) = your shapes;   పోది (pOdi)  = {this word is a short version of word పోదికాఁడు = పోటుకాఁడు = meaning a capable person for combat; here and in some other verses also Annamacharya had used shorter word పోది}, = వీరుడు,  hero; నిన్ను (ninnu) = you (God); మదిఁ (madi) = in the mind; దలపోయనేలా (dalapOyanElA) = why reflect or investigate; 

Literal meaning: There is paradise here in this world where your servants stay. Why do you search elsewhere with the impure knowledge. The one you encounter in this world are your shapes only. O hero! why should you keep contemplating on God? 

Explanation: నీ దాసులు {nI dAsulu = your servants} meant that all the people of this world are the servants of the lord (no exclusions). నీ దాసులున్నచోట నిత్యవైకుంఠ మిదె{nI dAsulunnachOTa nityavaikuMTha mide} is indicating this world is a paradise. This is reminiscent of ఆకాశ పాకాశ మరుదైన కూటంబు#1(AkASa pAkASa marudaina kUTaMbu = this untidy, disorderly world is an unusual cluster).  This ugly, chaotic world is an extraordinary congregation. 

వేదతో వేరొక చోట వెదకనేలా (vEdatO vEroka chOTa vedakanElA) is implying that we work with “manufactured knowledge” born of effort. Therefore, we see ‘coloured’ picture. 

ఆదిగొని వారిరూపు లవియే నీరూపులు (Adigoni vArirUpu laviyE nIrUpulu) is confirming that the world we perceive is the projection of our mind. Its indicative of Bhagavad-Gita statement अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् (13-17) avibhakta cha bhūtehu vibhaktam iva cha sthitam = Though indivisible, appears to be divided. 

పోది నిన్ను మదిఁ దలపోయనేలా (pOdi ninnu madi dalapOyanElA) = O Hero! why should you keep reflecting on yourself?  Does this world has only 'you' as the center? Now see the painting titled “Golconda” by Rene Magritte. 



You will find numerous Rene Magritte pictures populated in small area. It is suggesting that on careful observation, we find that what we see is projections of ourselves, not the truth. 

Implied Meaning: When you find this world is your own projection, will you engage in this? Such a view is possible only when you are a stranger to yourself. 

Explanation: this is similar to poem ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు మఱి తెలివికంటే మఱుపే శుభము e~ruguTakaMTE ne~ragamE mElu / ma~ri telivikaMTE ma~rupE Subhamu = Forgetting is more benign than awareness. It is more vital to unlearn the wrong than to learn new.

 

వారలతోడి మాటలు వడి వేదాంతపఠన
సారె వట్టిచదువులు చదువనేల
చేరి వారికరుణే నీ చేపట్టిన మన్ననలు
కోరి యింతకంటే మిమ్ముఁ గొసరనేలా ॥వెన్న॥
 
vAralatODi mATalu vaDi vEdAMtapaThana
sAre vaTTichaduvulu chaduvanEla
chEri vArikaruNE nI chEpaTTina mannanalu
kOri yiMtakaMTE mimmu gosaranElA venna

 

Word to word meaning:   వారలతోడి (vAralatODi) = with them; మాటలు (mATalu) = discussion; వడి (vaDi) = quicker way; వేదాంతపఠన (vEdAMtapaThana) = studying or reciting Vedas; సారె (sAre) = మాటిమాటికి, time and again; వట్టిచదువులు (vaTTichaduvulu) = మిథ్యా జ్ఞానము, groundless knowledge; చదువనేల (chaduvanEla) = why learn? చేరి (chEri) = by approaching them; వారికరుణే (vArikaruNE) = their compassion; నీ (nI) = your; చేపట్టిన (chEpaTTina) = స్వీకరించు, పుచ్చుకొను,  మన్ననలు (mannanalu) = blessings;  కోరి (kOri) = deiring;  యింతకంటే (yiMtakaMTE) = beyond this;  మిమ్ముఁ (mimmu) = you (God); గొసరనేలా (gosaranElA) = ప్రార్థించనేలా? కోరనేలా? Why wish? Why anticipate? 

Literal meaning: Discussion with the servants of God is the quicker way to understand the Vedas. What purpose does it serve to learn the groundless knowledge.  Accepting their compassion is the blessings. What is there to wish for more? 

Explanation: Though this stanza appears to be very traditional, Annamacharya is simply conveying that Meditation is not isolation. Annamacharya lived among the people. So was Buddha and Jiddu Krishnamurti. 

The fact remains that these great men earnestly mingled with the masses to convey what they learnt. All the three mentioned here spent their life only in that activity.  Jiddu Krishnamurti though did not want anyone to be his disciple, he met more men than any other religious leader in the last century. 

Implied Meaning: There is no greater truth than this world. No teacher is better than your fellow men. No knowledge is higher than the wisdom of harmonious living.

 

నావిన్నపము నిదె నారదశుకాదులును
యీవిధముననే ఆనతిచ్చినారు
శ్రీవేంకటేశ నీవు చేపట్టిన దాసులకు
కైవశమౌ యీబుద్ధి కడమేలా        ॥వెన్న॥
 
nAvinnapamu nide nAradaSukAdulunu
yIvidhamunanE AnatichchinAru
SrIvEMkaTESa nIvu chEpaTTina dAsulaku
kaivaSamau yIbuddhi kaDamElA venna 

Word to word meaning:  నావిన్నపము (nAvinnapamu) = my submission;  నిదె (nide) = is same; నారదశుకాదులును (nAradaSukAdulunu) = Great saints Narada and Suka; యీవిధముననే (yIvidhamunanE) = same method; ఆనతిచ్చినారు (AnatichchinAru) = instructed, communicated, announced; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = Lod Venkteswara; నీవు (nIvu) = you;  చేపట్టిన (chEpaTTina) = adopt, patronise; దాసులకు (dAsulaku) = servants;  కైవశమౌ (kaivaSamau) = స్వాధీనమగు, లోకువగు, become obedient, become submissive;   యీబుద్ధి (yIbuddhi) = this mind; కడమేలా (kaDamElA) = why any less. 

Literal meaning: Great Saints Narada and Suka communicated the same. Even my submission to you is same. For the servants of the Lord Venkateswara, this mind is submissive. Do they deserve any less? 

Explanation: Annamacharya is clear that all men are equal, and every human being can receive this blessing. Its for the man to walk towards it. 

Meditation is not a reflection, not a deliberation. Meditation is pure action. Annamacharya says this is the message of great saints like Narada and Suka. 

Implied Meaning: O Man! listen to the heart. On the assurance of great saints, move forward to become a true servant of God#2.

 

Summary of this Poem:

Chorus: Do you look for the ghee (oil) with the butter in the hand? When all possible actions are weighed, this alone is intelligence. Implied Meaning: Man! figure out what (pure and unadulterated) action is.

 

Stanza 1: There is paradise here in this world where your servants stay. Why do you search elsewhere with the impure knowledge. The one you encounter in this world are your shapes only. O hero! why should you keep contemplating on God? Implied Meaning: When you find this world is your own projection, will you engage in this? Such a view is possible only when you are a stranger to yourself.

 

Stanza 2: Discussion with the servants of God is the quicker way to understand the Vedas. What purpose does it serve to learn the groundless knowledge.  Accepting their compassion is the blessings. What is there to wish for more? Implied Meaning: There is no greater truth than this world. No teacher is better than your fellow men. No knowledge is higher than the wisdom of harmonious living.

 

Stanza 3: Great Saints Narada and Suka communicated the same. Even my submission to you is same. For the servants of the Lord Venkateswara, this mind is submissive. Do they deserve any less? Implied Meaning: O Man! listen to the heart. On the assurance of great saints, move forward to become a true servant of God#2

 

References and Recommendations for further reading:

#1 T-142® ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా (Emi galadiMdu neMta penagina vRthA

#2 47. ఎమ్మెలఁ బుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక / కమ్మి హరి దాసుఁడు గావచ్చునా (yemmela puNyAlu sEsi yila nElavachchu gAka / kammi hari dAsuDu gAvachchunA)

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...