Friday, 21 March 2025

213 hari daggaranE vunnA DaMdAkA bAranIdu (హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు)

 ANNAMACHARYA

213. హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు

hari daggaranE vunnA DaMdAkA bAranIdu

తెలుగులో వ్యాఖ్యానము చదవడానికి ఒక్కడ నొక్కండి. 

Introduction:

Annamacharya ascended to intellectual and spiritual heights that remain beyond the reach of most humans. The fact that he wrote with the intention of contributing to the well-being of society is undeniable. However, he did not merely preach philosophy—he revealed what he perceived as truth. When layers of ego, pride, arrogance, delusion, and anger are stripped away, what remains is reality itself. He expressed this reality through countless compositions, in diverse ways, through various perspectives, and with an unbounded sense of divine joy. 

Writing a commentary on such profound compositions is no simple task. I present here my understanding and invite you to explore and reflect upon these works. 

Even when analysed line by line, his compositions do not yield their meaning easily. Over time, shifts in language usage and interpretation have added further complexity. Yet, it is no coincidence that the ideas conveyed in these songs align with the inquiries of 20th-century philosophers. 

Today, it is widely accepted that human beings are shaped by conditioning. But for Annamacharya to have articulated this insight in his time was nothing short of revolutionary. In essence, he conveyed that the greatest obstacle to human realization is none other than the individual himself.

 

Summary of the Poem: 

Chorus: "Though Hari is ever near, we restrain our minds from reaching him. Rather than living life to its fullest, we shorten it and turn away—this is the illusion of Govinda." Deeper Significance: "O human, lost in illusions! Do not let this fleeting life go to waste—offer it in service to Hari, even if it means surrendering everything." 

First Stanza: "The mind, like a relentless current, is ceaselessly stirred by the five senses—the five pools of perception. Yet, it never dives into the depths; it merely skims the surface, caught in endless motion. It consumes itself, delights in itself, and remains bound within its own loops. This is divine illusion. (This is conditioning.)"

 

Second Stanza: The five eternal elements of nature form indestructible gardens, through which the stream of time endlessly flows. Yet, no matter how long one drifts in its current, it brings no benefit to the body. This leather body is carried forward, by time’s relentless tide, drawing ever deeper into its illusion—an illusion woven into the very fabric of existence. 

Third Stanza: The five vital energies that constitute life are exceedingly subtle, around which the cycles of birth perpetually and incessantly flow. Amid these five elements stands Lord Sri Venkateswara, who bestows both strength and limitations as we understand them. Yet human nature prevents us from penetrating the veil of illusion; as slaves to our conditioning, we cannot fully grasp the truth.

 

 కీర్తన POEM

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు 253-2 సంపుటము: 3-303

Philosophical Poem

Copper Plate: 253-2  Vol: 3-303

హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు
కురచలోనే మగుడు గోవిందు మాయ        ॥పల్లవి॥
 
చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ    ॥హరి॥ 

తూలని పంచభూతాల తోఁట లైదింటికి
కాలమనియెడి దొక్కకాలువ వారుచునుండు
నేలాఁ దడియదు నీరూఁ దివియదు
తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ ॥హరి॥ 
 
ముట్టి పంచప్రాణముల మొలక లైదింటికి
పుట్టుగులనియేటి యేరు పొదలి పారుచునుండు
చెట్టుచెట్టుకే కొలఁది శ్రీవేంకటేశ్వరుఁడు
నట్టనడుమ నున్నాఁడు నాననీదు మాయ ॥హరి॥

hari daggaranE vunnA DaMdAkA bAranIdu
kurachalOnE maguDu gOviMdu mAya
pallavi

chenaki paMchEMdriyapu cheruvu laidiMTiki
manasaneDi dokaTi mahA pravAhamu
dinamu bAruchunuMDu diguvaku veLlalEdu
tanalOnE tAniguru daivamAya
hari

tUlani paMchabhUtAla tOTa laidiMTiki
kAlamaniyeDi dokkakAluva vAruchunuMDu
nElA daDiyadu nIrU diviyadu
tOludittikE koladi dorakonna mAya
hari

muTTi paMchaprANamula molaka laidiMTiki
puTTugulaniyETi yEru podali pAruchunuMDu
cheTTucheTTukE koladi SrIvEMkaTESvaruDu
naTTanaDuma nunnADu nAnanIdu mAya
hari

 

 Details and explanations:

హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు
కురచలోనే మగుడు గోవిందు మాయ     ॥పల్లవి॥

hari daggaranE vunnA DaMdAkA bAranIdu
kurachalOnE maguDu gOviMdu mAya
pallavi 

Word to Word Meaning: హరి (hari) = Lord Hari; దగ్గరనే (daggaranE) = is close by;  వున్నాఁడు (vunnADu) = existing; అందాఁకాఁ (aMdAkA) = until such time; బారనీదు (bAranIdu) = does not allow you to approach him; కురచలోనే (kurachalOnE) =  while it is short; మగుడు (maguDu) = returns back; గోవిందు మాయ (gOviMdu mAya) = Illusion of Govinda (= we humans). 

Literal Meaning: "Though Hari is ever near, we restrain our minds from reaching him. Rather than living life to its fullest, we shorten it and turn away—this is the illusion of Govinda." 

Explanation: 

First Part: Relevance to Bhagavad Gita

The message in the chorus (pallavi) suggests that before experiencing life completely a person retreats. But why does Annamacharya say this? This is not a discussion about the physical lifespan of a person. 

The Bhagavad Gita Verse 4-5 बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन  (bahūni me vyatītāni janmāni tava chārjuna) conveys that: "Many births have passed for both you and me, O Arjuna. You have forgotten them, while I remember them all".  Likewise Gita 7-18 says ज्ञानी त्वात्मैव मे मतम्  (jñānī tvātmaiva me matam) "One whose intellect is firmly fixed on me, who sees me as their ultimate goal, I consider as my very own self." 

A devotee who reaches such a state finds their mind aligned with the divine. However, this is not something one can achieve solely through personal effort—it is by becoming worthy of divine grace. 

At that stage, the mental distance between oneself and the external world dissolves, allowing one to see the world within oneself and oneself within the world (Bhagavad Gita 6:29). Annamacharya emphasizes that even if such a divine, pure life lasts only a moment, it is enough. 

Second Part: Intent of Annamacharya

Instead of allowing life to unfold as it should, we try to shape it according to our own expectations. If we observe carefully, we often resist reality, exhaust ourselves in conflicts, and live with an illusory perspective, ultimately draining our life force. Instead of embracing the natural joy within us, we waste our energy trying to mould life into a predefined shape, thereby making an otherwise vast existence called life feel small. 

We mistake control for freedom. As Annamacharya points out, we do not let the mind run freely. People impose restrictions on themselves—trying to become like a film hero, a wealthy person, a fashion icon, or anything else they aspire to be. They bend and bind their minds to these external identities instead of allowing them to be as they are. And yet, they call this freedom! What could be more irrational than this? 

Now, consider—how true is the statement ""హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు"(= Even though Hari is near, man does not allow the mind to go in that direction"?) The conditioning of the human mind is so powerful—it makes the real appear unreal and the unreal appear real. That is why Annamacharya calls the human being "Govinda’s illusion. గోవిందు మాయ" 

Deeper Significance: "O human, lost in illusions! Do not let this fleeting life go to waste—offer it in service to Hari, even if it means surrendering everything."

First Stanza:

చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ   ॥హరి॥

chenaki paMchEMdriyapu cheruvu laidiMTiki
manasaneDi dokaTi mahA pravAhamu
dinamu bAruchunuMDu diguvaku veLlalEdu
tanalOnE tAniguru daivamAya
hari 

Word to Word Meaning: చెనకి (chenaki) =  striking, stirring; పంచేంద్రియపు (paMchEMdriyapu) = the five sense organs;  చెరువు లైదింటికి (cheruvu laidiMTiki) = these five (artificial) ponds; మనసనెడి దొకటి (manasaneDi dokaTi) = the one called mind;  మహా ప్రవాహము (mahA pravAhamu) = overwhelming flow; దినముఁ (dinamu) = everyday rather every moment; బారుచునుండు (bAruchunuMDu) = keeps running like that; దిగువకు (diguvaku) = to deeper (layers); వెళ్లలేదు (veLlalEdu) = cannot penetrate; తనలోనే తానిగురు (tanalOnE tAniguru) = it always dries up in itself, it always searches in itself, it always happy in itself,  దైవమాయ (daivamAya) = This is true illusion of God. 

Literal Meaning"The mind, like a relentless current, is ceaselessly stirred by the five senses—the five pools of perception. Yet, it never dives into the depths; it merely skims the surface, caught in endless motion. It consumes itself, delights in itself, and remains bound within its own loops. This is divine illusion. (“This is conditioning.") 

Explanation: 

First Part: Relevance to Bhagavad Gita 

The mind floating endlessly on the reservoirs of perception indulges in the pleasures mistaking them for true satisfaction. This is something we all experience. In the Bhagavad Gita Arjun asks the same question: Why is a person impelled to commit sinful acts, even unwillingly, as if by force (अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः3.36). 

Krishna answers: 'Desire and anger—both arise from an intense inner compulsion to act.' (काम एष क्रोध एष रजोगुणसमुद्भवः – 3.37). Driven by the urgency to achieve something, to do something, we create endless turmoil in the world. However, when the mind remains steady ceases its senseless action—when, at every level of our being, the mind and its responses (which arise from memory) cease to compete with each other—a new world unfolds before us." 

Second Part: What Great Philosophers said: 

Now compare Annamacharya’s verse with statement of Jiddu Krishnamurti in the picture below.


 

Third Part: Why don’t we dive deep into the mind? (దిగువకు వెళ్లలేదు) 

Why Annamacharya is saying that don’t we dive deep into the mind (దిగువకు వెళ్లలేదు)? Before that examine this statement by  Joseph Murphy. “The first thing to remember is the dual nature of your mind. The subconscious mind is constantly amenable to the power of suggestion; furthermore the subconscious mind has complete control of the functions, conditions, and sensations of your body. Trust the subconscious mind to heal you. It made your body, and it knows all of its processes and functions. It knows much more than your conscious mind about healing and restoring you to perfect balance.” 

The mind and its motives can somehow be observed in a direct experience notable things may be understood. However, the subconscious mind remains largely inaccessible and may be termed as an unyielding obstacle. Deep diving into these realms is a difficult task. Probably that is the hard work mentioned by Jiddu. It appears that Jiddu Krishnamurti, Joseph Murphy, and Annamacharya conveyed the same idea and thought along similar lines.

Second Stanza:

తూలని పంచభూతాల తోఁట లైదింటికి
కాలమనియెడి దొక్కకాలువ వారుచునుండు
నేలాఁ దడియదు నీరూఁ దివియదు
తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ   ॥హరి॥ 

tUlani paMchabhUtAla tOTa laidiMTiki
kAlamaniyeDi dokkakAluva vAruchunuMDu
nElA daDiyadu nIrU diviyadu
tOludittikE koladi dorakonna mAya
hari 

Word to Word Meaning:  తూలని (tUlani) = not possible to trip, stable; పంచభూతాల తోఁటలు (paMchabhUtAla tOTalu) = the gardens five basic elements; ఐదింటికి (aidiMTiki) = for those five; కాలమనియెడి (kAlamaniyeDi) = described as time; దొక్కకాలువ (dokkakAluva) = one canal; వారుచునుండు (vAruchunuMDu) = keeps flowing; నేలాఁ దడియదు (nElA) daDiyadu) = that ground forming the basic elements does not get wet (does not satiated, not a beneficial thing); నీరూఁ( nIrU) = that water (= The water of the canal = time) దివియదు (diviyadu) = does not stop pulling; does not stop its pull/attraction); తోలుఁదిత్తికే (tOludittikE) = for this leather body; కొలఁది (koladi) = suitably; దొరకొన్న (dorakonna) = belonging, being; మాయ (mAya) = illusion. 

Literal Meaning: The five eternal elements of nature form indestructible gardens, through which the stream of time endlessly flows. Yet, no matter how long one drifts in its current, it brings no benefit to the body. This leather body is carried forward, by time’s relentless tide, drawing ever deeper into its illusion—an illusion woven into the very fabric of existence. 

Explanation: deeper layers of understanding created by Annamacharya 

The core message of the stanza is that merely drifting with time does not lead to progress—we remain as we are. Annamacharya emphasizes that liberation is not an automatic process, like advancing from one school grade to the next. Instead, it requires conscious effort and action. 

తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ tOludittikE koladi dorakonna mAya). Another profound idea in this stanza is that time—at least in its psychological form—is an illusion. But how do we perceive this illusion? There is chronological time, which moves perpetually in one direction. Then there is psychological time, created by our sense of being—an illusion that shapes the very fabric of our existence. In general, we anchor ourselves to the time of our birth, as if true intelligence has awakened afresh in our era, disregarding the vast continuum of thought that preceded us. 

Let it be Buddha, Shankaracharya, or Jesus—after their colossal impact on the intelligentsia of their times, they were spoken of as if truth had been newly discovered by them. Similarly, the new messiahs of the 19th and 20th centuries proclaimed truths akin to those of ancient luminaries, each presenting their revelations (at least perceived to be) as groundbreaking, even as they emerged from an enduring continuum of wisdom. (Refer to Bhagavad-Gita 2-70) 

It consistently distinguishes between two dimensions of time—chronological time, which objectively flows, and psychological time, which is a subjective, constructed experience. This duality allows the argument to explain how every era, despite existing within a continuous timeline, tends to see its own insights as uniquely groundbreaking, even though they are part of a long, enduring continuum of wisdom. 

నేలాఁ దడియదు నీరూఁ దివియదు (nElA daDiyadu nIrU diviyadu): If we observe carefully, Annamacharya compared time and the mind to a flowing stream. A stream is defined by its dynamic motion—it has certain magnitude and direction. In contrast, our responses arise from memories, which are static and unchanging, defined only by quantity. Consequently, the dynamic nature of time cannot be fully comprehended by a mind rooted in fixed memories. 

Third Stanza:

ముట్టి పంచప్రాణముల మొలక లైదింటికి
పుట్టుగులనియేటి యేరు పొదలి పారుచునుండు
చెట్టుచెట్టుకే కొలఁది శ్రీవేంకటేశ్వరుఁడు
నట్టనడుమ నున్నాఁడు నాననీదు మాయ       ॥హరి॥ 

muTTi paMchaprANamula molaka laidiMTiki
puTTugulaniyETi yEru podali pAruchunuMDu
cheTTucheTTukE koladi SrIvEMkaTESvaruDu
naTTanaDuma nunnADu nAnanIdu mAya
hari 

Word to Word Meaning:  ముట్టి (muTTi) = touching, encircling; పంచప్రాణముల (paMchaprANamula) = five vital energies that form life; మొలకలు (molakalu) = tender, fresh, unspoiled;  ఐదింటికి (laidiMTiki) = for those five; పుట్టుగులని (puTTugulani) = births; యేటి (yETi) = said to be, called as; యేరు (yEru) = flowing stream;  పొదలి (podali) = incessantly, exceedingly; పారుచునుండు (pAruchunuMDu) = keeps flowing; చెట్టుచెట్టుకే (cheTTucheTTukE) = for those gardens (mentioned in previous stanza), for every person (intended meaning); కొలఁది (koladi) = strength and limit; శ్రీవేంకటేశ్వరుఁడు (SrIvEMkaTESvaruDu) = Lord Venkateshwara; నట్టనడుమ నున్నాఁడు (naTTanaDuma nunnADu) = he is there in the center of these; నాననీదు మాయ (nAnanIdu mAya) = Illusion does not  allow it to sink in, the man himself is the obstruction.   

 

Literal Meaning:  The five vital energies that constitute life are exceedingly subtle, around which the cycles of birth perpetually and incessantly flow. Amid these five elements stands Lord Sri Venkateswara, who bestows both strength and limitations as we understand them. Yet human nature prevents us from penetrating the veil of illusion; as slaves to our conditioning, we cannot fully grasp the truth. 

Explanation:  

"The depth of this poem—especially this stanza—is beyond comprehension. For now, we can interpret Annamacharya as describing a journey toward the very source of life, the primordial river of existence. Those who ascend to such exalted planes transcend death. Within this river, life is in a state of perpetual reinvention. It lacks a fixed form or earthly definition; it is both the centre of creation and the creation itself, existing in equanimity as it unfolds." (Those interested in further reading may refer to Mahabharat, Bhishma Parva, description of Sanjaya explaining the suitability of the mother earth for creation) 

-X-X-The End-X-X-

Saturday, 15 March 2025

T-213. హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు

 అన్నమాచార్యులు

213. హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు

For Commentary in English please press here

ఉపోద్ఘాతము:

అన్నమాచార్యులు మానవమాత్రులు చేరలేని అత్యున్నత శిఖరాలను అధిరోహించి తానుగన్న విషయములను లోకకల్యాణమునకు తోడ్పడునట్లు వ్రాశారన్నది మాత్రము వాస్తవము. వారు తత్వమును చెప్పలేదు. వారి దృష్టికి కానవచ్చినది వెల్లడించారు. మానవునికి అహము, డంభము, దర్పము, మదము, అహంకారము, కోపములను తెరలు తొలగిపోతే కనబడునది సత్యమే. ఆ సత్యమునే వారికి తెలిసిన విధములలో, అనేక రీతులలో, అనేక మార్గములలో, లెక్కించలేనన్ని కీర్తనలలో, వారికి కలిగిన అలౌకికానందమును వ్యక్తపరిచిరి.

అట్టి విశిష్ట స్థితికి చేరుకొన్న అన్నమాచార్యుల కీర్తనలకు వ్యాఖ్యానము వ్రాయుట సాహసముతో కూడుకొన్నదే. నాకు తెలిసినది మీ ముందుకు పెట్టి వీనిని పరిశీలించమని వేడుకుంటున్నాను. 

ముఖ్యంగా ఈ పల్లవిని విడగొట్టి చూచినా సులభంగా బోధ పడదు. కాలగతిలో భాష వాడుకలోను, ప్రయోగములోను చోటు చేసుకున్న పరిణామములతో ఇది మరింత జటిలమయ్యింది. ఈ కీర్తనలో చెప్పిన విషయములను ఇరవైయ్యవ శతాబ్దపు తత్వవేత్తల పరిశీలనలతో పోలి వుండడం యాదృచ్ఛకము కాదు.

మానవులంతాా కండీషనింగ్'కు (స్థితివ్యాజమునకు) గురి యౌదురన్నది నేడు అందరూ ఒప్పుకున్నదే.  కానీ అన్నమాచార్యుల కాలములో ఈ విషయమును వెల్లడించుట విప్లవాత్మకమేమొత్తం మీద ప్రతీ మానవునికి అడ్డు మానవుడే (అతడే) అని అన్నమాచార్యులు చెప్పారు.

 

కీర్తన సంగ్రహ భావము:

పల్లవి: హరి సమీపంలోనే ఉన్నాడు. అయితే హరి దగ్గరకు (మనసు) పరుగెత్తనివ్వదు.  జీవితం పొడవైనదైనా దాన్ని పొట్టిగా మార్చుకుంటాం. ఇది గోవిందుని మాయ అంటున్నారు అన్నమాచార్యులు.  ​ అంతరార్థము: మాయలకు నిలయమౌ ఓ మానవుడా! ఈ చిన్ని జీవితాన్ని పణంపెట్టి మరీ సమీపములోనే ఉన్నహరిని సేవించుటకై వినియోగించుము. 

మొదటి చరణం: నిత్యము పంచేంద్రియములను ఐదు చెరువులను అదేపనిగా తట్టుచూ మనసు అను మహా ప్రవాహము  పరుగిడుతూనే ఉండును. ఐతే అది లోతుకు వెళ్లలేదు. (పైపైనే తిరుగును). తనలోనే తాను శోషించును. సంతోషించును. ఇదియే దైవమాయ. అదియే కండీషనింగ్ (స్థితివ్యాజము). 

రెండవ చరణం: పంచభూతాలనే ఐదు తోఁటల మీదుగా కాలము అనే ఒక్కకాలువ ప్రవహించుచునుండు. ఎంత కాలమైనా ఆ శరీరమునకు మేలు కలుగదు. ఆ కాలమనే ప్రవాహము తోలుఁతిత్తిని (ఈ శరీరాన్ని) ఈడ్చుట ఆపదు. ఈ మాయ ఆ శరీరమునకు తగినదే. 

మూడవ చరణం: పంచప్రాణములు అతి సుకుమారమైనవి. వాటిని చుట్టుకొని పుట్టుకలు అను ఏరు అతిశయించుచు పారుతూ ఉండును. ఆ పంచభూతాల తోఁటల మధ్యలో వుండి బలము, పరిమితి (ఇచ్చువాడు) శ్రీవేంకటేశ్వరుఁడు. మానవుని నైజమే లోపలికి పోనివ్వదు. మాయను కనుగొననివ్వదు.

కీర్తన: 

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 253-2      సంపుటము: 3-303

హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు
కురచలోనే మగుడు గోవిందు మాయ        ॥పల్లవి॥
 
చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ      ॥హరి॥
 
తూలని పంచభూతాల తోఁట లైదింటికి
కాలమనియెడి దొక్కకాలువ వారుచునుండు
నేలాఁ దడియదు నీరూఁ దివియదు
తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ ॥హరి॥
 
ముట్టి పంచప్రాణముల మొలక లైదింటికి
పుట్టుగులనియేటి యేరు పొదలి పారుచునుండు
చెట్టుచెట్టుకే కొలఁది శ్రీవేంకటేశ్వరుఁడు
నట్టనడుమ నున్నాఁడు నాననీదు మాయ ॥హరి॥ 

Details and explanation: 

హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు
కురచలోనే మగుడు గోవిందు మాయ    ॥పల్లవి॥

 

టీకా: హరి = హరి; దగ్గరనే = సమీపములోనే;  వున్నాఁడు = వున్నాఁడు; అందాఁకాఁ = అప్పటి దాకా; బారనీదు = పరుగెత్తనివ్వదు; కురచలోనే =  పొట్టిగా వుండగానే; మగుడు = వెనుకకు మరలు; గోవిందు మాయ= గోవిందుని మాయ (ఇక్కడ మనిషి అని తీసుకొనవలెను). 

భావము: హరి సమీపంలోనే ఉన్నాడు. అయితే హరి దగ్గరకు (మనసు) పరుగెత్తనివ్వదు.  జీవితం పొడవైనదైనా దాన్ని పొట్టిగా మార్చుకుంటాం. ఇది గోవిందుని మాయ అంటున్నారు అన్నమాచార్యులు.  

వివరణము:

మొదటి భాగంభగవద్గీత ఏం చెప్పింది 

మనిషి తన జీవితాన్ని పూర్తిగా అనుభవించక ముందే వెనుకకు వెళ్లిపోతాడని పల్లవి సందేశం. అన్నమాచార్యులు అలా ఎందుకు అన్నారో ఆలోచింతము.​ మానవుని భౌతిక జీవన కాలము గురించి కాదు ఇక్కడి చర్చ​. 

భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఐదవ శ్లోకం దీన్నే తెలుపుతున్నది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున (= ఓ అర్జునా మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీ వెరుగవు. నే మరువను.) జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ 7-18. దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఈ రెండు శ్లోకములను క్రోడీకరించిన ఆ స్థితికి చేరిన భక్తుని మనసు భగవంతుని మనసుతో కలసి పయనించును. ఐతే ఇది మానవుడు స్వయముగా సాధించలేడు. తన ప్రయత్నము ద్వారా భగవద్ కృపకు పాత్రుడు కాగలడు. 

ఆ సమయములో మానవునికి తనకు ఎదుటి ప్రపంచమునకు గల మానసిక దూరము తొలగి ప్రపంచమునందు తనను, తనలో ప్రపంచమును చూడగలుగును (భగవద్గీత6-29). అట్టి దివ్యము, పావనము అగు జీవితము ఒక్కనాటిదైననూ చాలని  అన్నమాచార్యుల అభిప్రాయము. 

రెండవ భాగంఅన్నమాచార్యుల ఆంతర్యం

జీవితం వెళ్లినట్లుగా కాక మనం అనుకున్నట్లు జీవితం గడపాలని ఆలోచించుదుము. జాగ్రత్తగా గమనిస్తే, రోజువారి జీవితంలో సత్యమును సమ్మతింపక సంఘర్షణలతో, అవాస్తవికత దృక్పధంతో సహజ శక్తిని కోల్పోతు చివరకు జీవితాన్ని ముగిస్తాము. అన్నమాచార్యులు చెప్పిన లోక రంజకము తమలోని సమ్మతమును వమ్ము చేస్తూ కాలం గడిపేస్తాం. జీవకళను జీవశక్తిని వృథా చేస్తూ మనము అమర్చుకున్నట్లుగా జీవనము సాగాలని మనల్ని మనమే హింసించుకుంటాము. ఈ రకముగా అనూహ్యమైన పొడవు గల జీవితాన్ని కురచగా చేసుకుంటాం. 

మనము నియంత్రణను స్వతంత్రతను ఒకే విధంగా చూస్తాం. అన్నమాచార్యులు చెప్పినట్టుగా మనసును పారనివ్వము. ఎవరో ఒక సినిమా హీరో ఉన్నట్టుగానో, ధనవంతులు ఉన్నట్లుగానో, ఫ్యాషన్ ఐకాన్లు ఉన్నట్లుగానో ఉండటానికి, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు  మనసును కట్టడి చేస్తారు. దానిని తనలా ఉండనివ్వం. ఈ రకమైన కట్టడిని మనము స్వతంత్రం అని భావిస్తాం. ఇంతకంటే అవివేకం ఏముంటుందండి. 

ఇప్పుడు చెప్పండి "హరి దగ్గరనే వున్నాఁ డందాఁకాఁ బారనీదు" అన్నది ఎంతవరకు నిజమో? మన కండీషనింగ్ (స్థితివ్యాజము) అతి భయంకరము. వున్నవి లేనట్లుగా, లేనివి వున్నట్లుగా చూపిస్తుంది. అందుకే మనిషిని అన్నమాచార్యులు "గోవిందు మాయ"  అని సంబోధించారు. 

అంతరార్థము: మాయలకు నిలయమౌ ఓ మానవుడా! ఈ చిన్ని జీవితాన్ని పణంపెట్టి మరీ సమీపములోనే ఉన్నహరిని సేవించుటకై వినియోగించుము. 

మొదటి చరణం: 
చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ   ॥హరి॥ 

టీకా: చెనకి =  బాదుచూ, మొత్తుచూ; పంచేంద్రియపు = పంచేంద్రియముల;  చెరువు లైదింటికి = చెరువులు ఐదింటికి; మనసనెడి దొకటి = మనసు అన్నది ఒకటి;  మహా ప్రవాహము = మహా ప్రవాహము; దినముఁ = ప్రతిరోజు; బారుచునుండు = అలా పరుగిడుతూనే ఉండును; దిగువకు = లోతుకు; వెళ్లలేదు = వెళ్లలేదు; తనలోనే తానిగురు = తనలోనే తాను ఇంకి పోవును, తనలోనే తాను శోషించును, తనలోనే తాను సంతోషించును,  దైవమాయ = ఇది దైవమాయ. 

భావము: నిత్యము పంచేంద్రియములను ఐదు చెరువులను అదేపనిగా తట్టుచూ మనసు అను మహా ప్రవాహము  పరుగిడుతూనే ఉండును. ఐతే అది లోతుకు వెళ్లలేదు. (పైపైనే తిరుగును). తనలోనే తాను శోషించును. సంతోషించును. ఇదియే దైవమాయ. అదియే కండీషనింగ్ (స్థితివ్యాజము). 

వివరణము: 

మొదటి భాగంభగవద్గీత ఏం చెప్పింది 

మనసు అను మహా ప్రవాహము పంచేంద్రియములను  చెరువులను తాకి తాకి అవి కల్పించు సుఖములలోనే తేలియాడుచూ తృప్తిని పడయుచుండును. ఇది అందరికీ తెలిసినదే. దీనికి కారణం కూడా భగవద్గీత చెప్పేసింది. "మానవులు పాపములను  చేయవలెనని కోరనప్పటికీ దేనిచేత ప్రేరేపింపబడి బలాత్కారముగా పాపములు చేయుచున్నారు?" (అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః – 3-36).. 

దీనికి సమాధానంగా కృష్ణుడు: "కోరికలు, కోపము—ఏదో చేయాలనే బలమైన ప్రేరణ నుండి ఉద్భవిస్తాయి" (కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః – 3-37). "ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి" అన్న ఆతృతతో మనం ప్రపంచంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తాం. కానీ, ఇవేవీ సంబంధం లేని, స్థిరమైన మనసుతో—అంటే, మన అంతరగములో అన్ని స్థాయిలలోను మనసు  & జ్ఞాపకాల (మెమొరీ) ప్రతిస్పందన అగు ఆలోచనలు ఒకదానితో మరొకటి పోటీ పడకుండా తొలగిపోతే—ఒక కొత్త ప్రపంచం మన ముందు తెరచుకుంటుంది. 

రెండవ భాగం: మహా తత్వవేత్తలు ఏమన్నారు?

ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రకటన చూడండి. దానికి తెలుగుసేత కూడా ఇచ్చాను. 



మీరు ఎప్పుడైనా పూర్తిగా కదలిక లేకుండా చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారా? మీరు ప్రయత్నించండి – నిజంగా స్థిరంగా, వెనుకను నిటారుగా ఉంచుకుని కూర్చోండి, మరియు మీ మనసు ఏమి చేస్తుందో గమనించండి. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించకండి, ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు, ఒక ఆసక్తి నుంచి మరో ఆసక్తికి అది మారిపోకూడదని అనుకోకండి. అదెలా ఎగిరిపోతుందో కేవలం తెలుసుకోండి. దానిని మార్చాలనే ప్రయత్నం చేయకండి, కానీ ఒక నదితీరంపై కూర్చొని నీరు ఎలా ప్రవహిస్తుందో గమనించినట్టు మనసును గమనించండి. 

ఆ ప్రవహించే నీటిలో ఎన్ని వస్తువులున్నాయి! చేపలు, ఆకులు, చనిపోయిన జంతువులు—అయితేనేం, నది ఎప్పుడూ జీవంతో నిండిపోయి ప్రవహిస్తూనే ఉంటుంది. మనసు కూడా అంతే. అది నిరంతరం చంచలంగా ఉంటూ, ఒక ఆలోచన నుంచి మరోదానికి, ఒక ఆసక్తి నుంచి మరో ఆసక్తికి ఒక సీతాకోకచిలుకలా ఎగిరిపోతూనే ఉంటుంది.  జిడ్డు కృష్ణమూర్తిగారు అన్నమాచార్యులు ఒకేలా ఆలోచించారనితెలుస్తోంది. 

మూడవ భాగం: ఎందుకు దిగువకు వెళ్లలేదు

ఇక అన్నమాచార్యులు దిగువకు వెళ్లలేదు ద్వారా ఏమి చెప్పదలిచారో ఆలోచింతము. ఇప్పుడు జోసెఫ్ మర్ఫీ గారి ప్రకటన చూడండి. “The first thing to remember is the dual nature of your mind. The subconscious mind is constantly amenable to the power of suggestion; furthermore the subconscious mind has complete control of the functions, conditions, and sensations of your body. Trust the subconscious mind to heal you. It made your body, and it knows all of its processes and functions. It knows much more than your conscious mind about healing and restoring you to perfect balance.”  Joseph Murphy 

(“మొదట గుర్తుంచుకోవలసిన విషయం మీ మనస్సు యొక్క ద్వంద్వ స్వభావం. subconscious mind (ఉపచేతన స్థితిలోని మనస్సు) నిరంతరం బాహ్య సూచనల శక్తికి ప్రభావితమై వాటికి అనుకూలంగా పనిజేస్తుంది; ఐతే ఉపచేతన మనస్సు మీ శరీరం యొక్క విధులు, పరిస్థితులు మరియు అనుభూతులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. (మిమ్మల్ని బయట శక్తులు బాగు చేయలేవు.)  మిమ్మల్ని నయం చేయడానికి ఉపచేతన మనస్సును విశ్వసించండి. ఇదే మీ శరీరాన్ని తయారు చేసింది. మరియు దానికి అన్ని ప్రక్రియలు మరియు విధులు తెలుసు. వైద్యం చేయడం మరియు మిమ్మల్ని సంపూర్ణ సమతుల్యతకు పునరుద్ధరించడం గురించి పైపైన తచ్చాడు, అనుభూతికి వచ్చు మనస్సు కంటే దీనికి చాలా ఎక్కువ తెలుసు.- జోసెఫ్ మర్ఫీ) 

అనుభూతికి వచ్చు మనస్సును ఎదో విధముగా పరికించి తెలియవచ్చును. ఈ ఉపచేతన స్థితిలోని మనస్సు కొరకరాని కొయ్య అనుకోవచ్చును. దీనిని వెలికితీయుట కష్టసాధ్యము. జిడ్డు కృష్ణమూర్తిగారు, జోసెఫ్ మర్ఫీ గారు అన్నమాచార్యులు ఒకేలా ఆలోచించారని; ఒకే విషయమును తెలిపారని తెలుస్తోంది. 

రెండవ చరణం  
తూలని పంచభూతాల తోఁట లైదింటికి
కాలమనియెడి దొక్కకాలువ వారుచునుండు
నేలాఁ దడియదు నీరూఁ దివియదు
తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ   ॥హరి॥ 

టీకా: తూలని = చలించని; పంచభూతాల తోఁటలు = పంచభూతాల తోఁటలు; ఐదింటికి = ఐదింటికి; కాలమనియెడి = కాలము అనె; దొక్కకాలువ = ఒక్కకాలువ; వారుచునుండు = పారుచునుండు, ప్రవహించుచునుండు; నేలాఁ దడియదు = ఆ  నేల తడిసిపోదు = పంచభూతాలుండు శరీరమునకు మేలు కలుగదు; నీరూఁ = నీరు (= ఇక్కడ కాలము) దివియదు = లాగుట ఆపదు​, ఈడ్చుట ఆపదు, ఆకర్షించుట ఆపదు; తోలుఁదిత్తికే = ఈ శరీరానికే; కొలఁది = తగినంత; దొరకొన్న = పొందిన, చెందిన; మాయ = మాయ. 

భావము: పంచభూతాలనే ఐదు తోఁటల మీదుగా కాలము అనే ఒక్కకాలువ ప్రవహించుచునుండు. ఎంత కాలమైనా ఆ శరీరమునకు మేలు కలుగదు. ఆ కాలమనే ప్రవాహము తోలుఁతిత్తిని (ఈ శరీరాన్ని) ఈడ్చుట ఆపదు. ఈ మాయ ఆ శరీరమునకు తగినదే. 

వివరణము: 

మనం జాగ్రత్తగా గమనిస్తే కాలమును మనసును అన్నమాచార్యులు ప్రవాహం తోటి పోల్చారు. ప్రవాహం అంటే పరుగిడుచున్నదని. అంటే డైనమిక్ (గతి) అనగా దానికి ప్రమాణముగా పరిమాణము మరియు దిశ రెండూ వుంటేనే దానిని నిర్వచించ గలము. మన స్పందన జ్ఞాపకముల నుండి వచ్చును. జ్ఞాపకము అనునది  కదలికలేని, స్థిరంగా ఉండునది. దానికి పరిమాణము మాత్రము చెప్పిన సరిపోవును. కాబట్టి  డైనమిక్ (గతిగల) విషయమును స్థిరంగా వుండు జ్ఞాపకముల నుండి వచ్చు మనసుతో చేరలేము. 

మూడవ చరణం: 
ముట్టి పంచప్రాణముల మొలక లైదింటికి
పుట్టుగులనియేటి యేరు పొదలి పారుచునుండు
చెట్టుచెట్టుకే కొలఁది శ్రీవేంకటేశ్వరుఁడు
నట్టనడుమ నున్నాఁడు నాననీదు మాయ       ॥హరి॥ 

టీకా: ముట్టి = తాకి, చుట్టుకొని; పంచప్రాణముల = పంచప్రాణములను; మొలకలు = అంకురము, లేతఐదింటికి = ఐదింటికి; పుట్టుగులనియేటి = పుట్టుకలు అనుయేరు = ఏరుపొదలి = అతిశయించుచు, వ్యాపించుచు; పారుచునుండు = పారుతునుండు; చెట్టుచెట్టుకే = ఆ పంచభూతాల తోఁటలకు; కొలఁది = బలము, పరిమితి; శ్రీవేంకటేశ్వరుఁడు = శ్రీవేంకటేశ్వరుఁడు; నట్టనడుమ నున్నాఁడు = వీటికి మధ్యలో నున్నాఁడు; నాననీదు మాయ = మానవుడే లోపలికి ఇంక నివ్వడు, పోనివ్వడు.    

భావము: పంచప్రాణములు అతి సుకుమారమైనవి. వాటిని చుట్టుకొని పుట్టుకలు అను ఏరు అతిశయించుచు పారుతూ ఉండును. ఆ పంచభూతాల తోఁటల మధ్యలో వుండి బలము, పరిమితి (ఇచ్చువాడు) శ్రీవేంకటేశ్వరుఁడు. మానవుని నైజమే లోపలికి పోనివ్వదు. మాయను కనుగొననివ్వదు.    

వివరణము:

జంబూద్వీపమును మహాభారతములో కూడా పేర్కొన్నారు. సృష్టి అంతా చెట్టునుంచి వచ్చినట్లు తెలుస్తొంది. వాటిని ప్రత్యక్షముగా చూచినవారు అన్నమాచార్యులు. జిడ్డు కృష్ణమూర్తిగారు కూడా దాదాపు అటువంటివాటినే దర్శించారని Jiddu Krishnamurti: Years of Awakening అను పుస్తకం ద్వారా తెలియ వచ్చును. మొత్తం మీద  మానవునికి అడ్డు మానవుడే (అతడే) అని  అన్నమాచార్యులు చెప్పారు.

మరణము లేని జీవనము లేదు. ఏదైనా నిరంతరంగా కొనసాగాలి అంటే, అది నిరంతర పునరుజ్జీవనంతో (జీవనము-మరణము-జీవనము) అను చక్ర క్రమములో తిరుగుతుండవలెను. ఇదే ఈ చరణానికి ఆంతర్యము. 

x-x-x-xx-x-x-x

T-216. అమ్మెడి దొకటి అసిమలో దొకటి.

  అన్నమాచార్యులు 216. అమ్మెడి దొకటి అసిమలో దొకటి.   ఉపోద్ఘాతము:   మాటలను కత్తుల్లాగా వాడొచ్చు అని విని ఉంటాం . అందుకు ఉదాహరణ ఈ కీర్తన ...