ANNAMACHARYA
35. పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము
Introduction: Annamacharya says we are adults only by age but not grown up tall to see the end of our wants. He squarely puts our present state on the mat for us to see. He echoed the words “Seek to learn constantly while you live. Do not wait in faith that old age by itself will bring wisdom” (SOLON, the Greek lawmaker and poet).
Like children, we wish for repetition of experiences. Each of the petty wants is like slightly coloured curtain. When, many of them are put together, coalesce and make up formidable opacity to prevent the mind from seeing the reality. That’s the reason entire Hindu Philosophy is based on reducing wants.
ఉపోద్ఘాతము: అన్నమాచార్యులు మనము వయస్సుతో పెద్దలమయ్యాము కానీ జీవించడములో ఎదగలేదు అంటున్నారు. చిన్నయ సూరి గారు చెప్పినట్లు “ఎవ్వఁడు బుద్ధిమంతుఁడో వాఁడు వృద్ధుఁడు గాని, ఏండ్లు మీఱినవాఁడా వృద్ధుఁడు?”
చిన్న పిల్లల వలె ఇంతకు ముందర జరిగిన తీపి సంఘటనలు తిరిగి తిరిగి కావాలనుకుంటాము. మనము వాంఛించే చిన్న చిన్న కోరికలు, ఒక్కొక్కటి ఒక మేలి ముసుగు లాంటిది. అలాంటివి ఎన్నో చేరి సంఘటించినపుడు బుద్ధి మెఱుగుమాపి సత్యమును నిరోధించును. అందుకే ఈ అధ్యాత్మిక మార్గములో కోరికలు తగ్గించుకోమని ఘోషించారు.
పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము
pe~rugaga be~rugaga beddalamaitimi nEmu
Word to word meaning: పెఱుగఁగఁ (pe~rugaga) = growing by age; పెఱుగఁగఁ (pe~rugaga) = growing by age; బెద్దలమైతిమి = పెద్దలమైతిమి (beddalamaitimi = peddalamaitimi) = became adults ( but not elders); నేము (nEmu) = we; కఱకఱలే (ka~raka~ralE) = పళ్లునూరటం, పళ్లుకొరకటం, ఒరయుట-తఱుఁగుట సూచించు ధ్వన్యనుకరణపదము, only grunting/munching sounds ; కాని (kAni) = but కడగంట లేదు (kaDagaMTa lEdu) = end not seen.
Literal meaning: We became adults by age, but not elders. We know only grunting, did not grow tall enough to see the end.
Implied meaning: We are elders only in age, not in maturity. Life got wasted in grunting; therefore we did not find the path to salvation.
Comments: By word కఱకఱలే (ka~raka~ralE), Annamacharya meant many things. Chief of them being (a) time spent in anticipation of food and (b) grunting over the lost expectations.
భావము: పళ్ళూడే వయస్సుకు పెరిగాము. పళ్ళుకొరకటమే చేస్తున్నాము కాని చివఱకంటా చూచే ఎత్తుకు ఎదగలేదు.
విశేష భావము: వయస్సు పెరిగినా పరిపక్వము రాలేదు. జీవితమంతా పళ్లునూరటంలోనే వృధా చేసుకున్నాము. కట్టకడపటిది చూడనేలేదు.
వ్యాఖ్యలు :
కఱకఱలు అనగా పళ్లునూరటం అనుకుంటే తినడంలోనే మనిషి ధ్యాస ఉంచుతాడని చెప్పకయే చెప్పారు; కఱకఱలు అనగా పళ్లుకొరకటం అనుకుంటే తనను ఇతరులనూ నిందించు కోవడములోనే సమయము వృధా ఐపోతుంది అని అన్నారు.
సరి నిన్న భుజియించి చాలునన్న యన్నమే
అరిది నేఁడప్పటిని నాస రేఁచీని
ధరలో రాతిరి గూడి తనిసిన సతులే
పరగ నప్పటిని విభ్రాంతి రేఁచీని॥పెఱు॥
sari ninna
bhujiyiMchi chAlunanna yannamE
aridi
nEDappaTini nAsa rEchIni
dharalO rAtiri
gUDi tanisina satulE
paraga nappaTini vibhrAMti rEchIni ॥pe~ru॥
Word to word meaning: సరి (sari) = end, equal; నిన్న (ninna) = yesterday; భుజియించి (bhujiyiMchi) = ate; చాలునన్న (chAlunanna) = satisfied; అన్నమే (yannamE) = rice (food); అరిది (aridi) = Wonder, surprise, astonishment, నేఁడప్పటిని (nEDappaTini) = today again; ఆస (nAsa) = desire to consume; రేఁచీని (rEchIni) = to excite, rouse, stir, set on, to provoke, enrage, irritate; ధరలో (dharalO) = on this earth; రాతిరి (rAtiri) = night గూడి (gUDi) = meet; తనిసిన (tanisina) = satisfied; సతులే (satulE) = ladies; పరగ (paraga) =duly; అప్పటిని (nappaTini) = again; విభ్రాంతి (vibhrAMti) = ఊహించనిది జరిగినప్పుడు కలిగే ఆశ్చర్యం, surprise, shock; రేఁచీని (rEchIni) = to excite, rouse, stir, set on, to provoke, enrage, irritate;
Literal meaning: We are reminded of food every day, in spite of having sumptuous and satisfying dinner previous day. Similarly, the mind drives us to our ladies notwithstanding the good time spent previously.
Implied meaning: Do whatever, hunger and the desires do not satiated. They do comeback with vengeance next day. Therefore needs greater care in handling.
భావము: నిన్న తిన్నప్పటికీ యీ రోజున తిరిగి అన్నముపై ధ్యాస మళ్ళుతుంది. ముందు రాత్రి సుఖించినా కూడా తిరిగి నేడు స్త్రీలపై మనసు వద్దన్నాపోతుంది.
విశేష భావము: ఎంత అనుభవించినా ఆకలి, కోరికలు యెప్పటికీ తీరేవి కావు. అందుకే మనిషి వాని పట్ల జగరూకతతో వ్యవహరించవలెను.
మాయఁ గట్టి విడిచిన మలినపుఁ గోకలు
mAya gaTTi
viDichina malinapu gOkalu
yIyeDa
nudikitEnE yichcha rEchIni
kAyamupai mOchi
peTTe gaTTivEsina sommulu
mAyalai dinadinamu mamata rEchIni ॥pe~ru॥
Word to word meaning: మాయఁ (mAya) = till they became dirty; గట్టి (gaTTi) = worn; విడిచిన (viDichina) = discarded l మలినపుఁ (malinapu) = గోకలు (gOkalu) = clothes; యీయెడ (IyeDa) = after interval; ఉదికితేనే (udikitEnE) = by cleaning; యిచ్చ (yichcha) = intention to wear; రేఁచీని (rEchIni) = provoked; కాయముపై (kAyamupai) = on body మోఁచి (mOchi) = bear పెట్టెఁ గట్టివేసిన (peTTe gaTTivEsina) = kept in the box సొమ్ములు (sommulu) = jewellery; మాయలై (mAyalai) = illusion; దినదినము (dinadinamu) = day by day; మమత (mamata) = affection entertained for objects, from considering them as belonging to, or connected with oneself; రేఁచీని (rEchIni) = stirred up.
Literal meaning: we might discard a dirty cloth. However, we readily accept the same cloth after washing. Mind longs for the same jewellery which was stacked in boxes after long usage. (Mind longs for Repetition of known experiences).
భావము: మాసిన గుడ్డలు ఉతికిన తర్వాత తిరిగి వెసుకోవాలనిపించును. చాలా రోజులు వేసుకున్న తర్వాత పెట్టెలో దాచివుంచిన నగలు మళ్ళీ వేసుకోవాలి అనిపించును. (మదిలో ఎప్పటికప్పుడు పాతవి, కొరుకునేవి పునరవృతమవ్వాలని అనిపిస్తుంది).
నీవు వట్టిన చలమో నేము సేసినట్టి తప్పో
nIvu vaTTina chalamO nEmu sEsinaTTi tappO
Word to word meaning: నీవు (nIvu) = YOU; వట్టిన (vaTTina = paTTina) = on you insistence; చలమో (chalamO) = గుంట, pit (= మాటు, కపటోపాయము, trap) నేము (nEmu) = we; సేసినట్టి (sEsinaTTi) = committed; తప్పో (tappO) = mistake; శ్రీవేంకటేశ్వరుఁడ (SrIvEMkaTESvaruDa) = Oh lord of seven hills!! చిక్కితి (chikkiti) = got trapped ఇందు (miMdu) = in this; మోవరాని(mOvarAni) = unbearable; మోపయి (mOpayi) = weight / load; ములుగనియ్యదు (muluganiyyadu) = does not allow us to sink; prevents us from taking deep dive; మమ్ము (mammu) = us; చేవ (chEva) = courage; సంసారముపైఁ (saMsAramupai) = on the family and the world; జిమ్మి రేఁచీని (jimmi rEchIni) = uncontrolled eruption.
Literal meaning: Oh God! We are trapped (either by your methods or by our mistakes) in to this predicament of grappling with these unbearable loads of daily necessities of family and existence.
Implied meaning: We know not, if it is your trap or our mistake. We get engaged to the chores of life so that we do not get time to think of you.
భావము: దేవుడా వెంకటేశ్వరుడా!! ఇది నీ కపటోపాయమో మా తప్పో తెలియకున్నది. ఈ సంసారములో పడి మోయలేని సంసార బాధ్యతలలో చిక్కుకుని ములగలేక తేలలేక అవస్థలు పడుతున్నాము.
విశేష భావము: దేవుడా వెంకటేశ్వరుడా!! ఇది నీ కపటోపాయమో మా తప్పో తెలియకున్నది. ఈ సంసారములో చిక్కుకుని నిన్ను తెలియలేకున్నాము.
zadaz
Reference:
Copper Leaf: 261-4, Volume: 3-352