Saturday, 3 April 2021

36. ఏది జూచినఁ దమకు (Edi jUchina damaku)

ANNAMACHARYA

36. ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె

Introduction: In this seminal verse Annamacharya declared that we are not lonely but saddled by residue of experiences. He said the entire world is suffering due to lack of compassion.

In a benign, but emphatic tone, he asserts that we are not lonely as each one of us reflects our society in its entirety. Therefore we are haunted by our collective experience.

While the world looks for fondly possessions to rejoice, he pointed out that all such acts are driven by lack of compassion. Of course, he reiterates that there are no virtuous acts to be performed except to avoid wrong actions.

Annamacahrya compells you to have a relook at your life. This particular verse is  the best example. He is not preacher, but asks you to probe.

 

ఉపోద్ఘాతము: సంభ్రమాశ్చర్యములు కలిగించే కీర్తనలో అనేక క్రొత్త విషయాలను ప్రస్తావించారు. మునుపు జరిగిన ఘటనల​ ఙ్ఞాపకాలు (అవశేషాలు) మనుషులకు మాటిమాటికి గుర్తుకు వచ్చి ఏకాంతము కూడా పొందకుండా అడ్డుపడుతున్నాయన్నారు.

ప్రపంచము దయ, కనికరము, కరుణల లేమితో కలవరపడుచున్నదని తెలిపిరి.  మనిషి అవిలేని వెలితిని గ్రహించి, కప్పిపుచ్చుకోవడానికి వస్తు, ధన సేకరణయందు గడిపి కొంత తృప్తి చెందడానికి ప్రయత్నం చేస్తాడు.

వేదాలు, జ్ఞానులు ఎంత చెబుతున్నా, పుణ్య కార్యము చేయుటకు ఏమీ లేదని తెలిసినా కానీ, పాపము వదిలించుకొనుటకు బదులు, మనిషి పుణ్య కర్మము చేయుటకు సిద్ధపడతాడు. ఇదే మాయ అని అనుకోవచ్చు. 

మీ జీవితంపై దృక్పథాన్ని మార్చుకోమని అన్నమాచార్యులు అనేక మార్లు ఒత్తి చెప్పారు. ఈ  కీర్తన అందుకు ఉత్తమ ఉదాహరణ. అతను బోధకుడు కాదు, కానీ మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడుగుతాడు. 

కీర్తన:

ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె

వేదు విడిచిన కూడు వెదకినను లేదు         ॥పల్లవి॥

 

ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు

పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక

యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి

కైకొన్నదురితములు కలపాటిగాక    ॥ఏది॥

 

హితవైనమమకార మెందుఁగల దిందరికి

ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక

మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు

జితమైన దైవమిచ్చిన పాటిగాక        ॥ఏది॥


యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకు

పరిమైనకర్మంబు పరిపాటిగాక
యెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁ

దిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక ॥ఏది॥


Details and Explanations:

ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె

వేదు విడిచిన కూడు వెదకినను లేదు  ॥పల్లవి॥ 

Edi jUchina damaku yinniyunu niTuvalene

vEdu viDichina kUDu vedakinanu lEdu         pallavi 

Word to word meaning: ఏది (Edi) = whatever; జూచినఁ (jUchina) = on laying the sight;  దమకు (damaku) = to you; యిన్నియును (yinniyunu) = everything; నిటువలెనె (niTuvalene) = the same way;  వేదు విడిచిన (vEdu  viDichina) = outside the ones prescribed by vedas ; కూడు (kUDu) = food; వెదకినను లేదు  (vedakinanu lEdu) = cannot find.

Literal meaning and explanation: Whatever you see, you feel the same way (to possess it).  What use is of searching for food proscribed by Vedas.

Man is conditioned to possess everything he sees.  Actions having roots in selfish gains are sinful. This verse is closely linked to Bhagavad-Gita shloka given below.

यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै: |

भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् || 3-13|| 

yajna-shishtashinah santo muchyante sarva-kilbishaih
bhunjate te tvagham papa ye pachantyatma-karanat
(3-13)

Purport: The people shall be released from all kinds of sins because they eat the leftover food after performing the sacrifice. Others, who prepare food for personal sense enjoyment verily, eat only sin.

Implied meaning: Actions performed like yajña, will dissolve accumulated sins. Actions having roots in selfish gains are sinful.

The word yajña means sacrifice Therefore it is always used to leave out or eschew something wrong. Therefore the above shloka is telling us that there are no  virtuous acts to be performed, but to abstain from wrong acts. And still man, due to ignorance, searches for the virtuous work to be performed.  

భావము మరియు వివరణము:  ఏది చూచినా తమకు  యిన్నియును ఇటువలెనె (సొంతము చేసుకోవాలనిపిస్తుంది). కానీ, వేదములలో  పేర్కొనని మార్గము వెతుకుట నిష్ప్రయోజనము.

మనిషికి ఏది చూచినా (సొంతము చేసుకోవాలనిపిస్తుంది). కానీ, స్వార్ధమునకు చేయు పనులన్నీ పాపములే అని వేదములలో చెప్పిరి. ఒక రకముగా చూస్తే కీర్తన భగవద్గీతలోని క్రింది  శ్లోకాన్ని సూచిస్తోంది.

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ।। 3-13 ।।

భావము: యజ్ఞమందు భగవదర్పణము చేసి మిగిలినదానిని తిను సజ్జనులు సమస్త పాపముల నుండియు విముక్తులగుదురు. ఎవరైతే తమకోసం  వండుకుని తినుచున్నారో వారు  పాపము భుజించుచున్నారు.

అన్వయార్థము: మనం చేయు పని పరులకు, సమాజానికి వుపయోగ పడిన అది యజ్ఞమగును. స్వార్థంతో చేయు పనులు (దానమైననూ) పాపమునకు దారితీయును.

యజ్ఞం అనే పదానికి త్యాగం అని అర్ధం. కాబట్టి ఇది మనిషి తనలోని తప్పులను/ దోషాలను వదిలివేయడానికి యజ్ఞం అనే పదాన్ని ఉపయోగిస్తాం. అందువల్ల పై గీతా శ్లోకం మనకు చెప్తున్నది తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలని. ఇప్పటికీ మనిషి, అజ్ఞానం కారణంగా, పుణ్యం చేయబోతాడు 

ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు

పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక
యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి
కైకొన్నదురితములు కలపాటిగాక         ॥ఏది॥

 

EkAMtasaukhyaMbu lekkaDivi prANulaku

paikonnadu@hkhamula pAlupaDe gAka

yEkamagu puNyaMbu lEDAgala viMdariki

kaikonnaduritamulu kalapATigAka     Edi 

word to word meaning: ఏకాంతసౌఖ్యంబు (EkAMtasaukhyaMbu)  = state of being alone; లెక్కడివి? =  ఎక్కడివి? (lekkaDivi = ekkaDivi) where?  (= nowhere);  ప్రాణులకు (prANulaku) = for the living beings;  పైకొన్న (paikonna) = the one taken up willingly; దుఃఖముల (du@hkhamula) = sorrows;  పాలుపడెఁ (pAlupaDe) = To be subjected to;  గాక (gAka) = being;  యేకమగు (yEkamagu) = having unified effect;   పుణ్యంబులు (puNyaMbulu) = virtuous acts ఏడాఁ గల విందరికి (EDAgala viMdariki) = where exists for all? (Does not exist); కైకొన్న (kaikonna) = గ్రహించు; లక్ష్యపెట్టు; To undertake, to take up; దురితములు (duritamulu) = sins;  కలపాటి గాక (kalapATigAka) = only  flourishing.

Literal meaning and explanation: Man, even in isolation, is surrounded by sorrow due to remembrance of his past actions. There are no virtuous acts, only avoiding the wrong acts is all that may be under taken. 

Man is not lonely even in isolation, for his sorrowful  thoughts, do not leave him. Man cannot cherish even the little comfort like loneliness unless he has resolved all his sorrows. Man due to his stupidity attempts virtuous deeds, instead of dissociating from the corruption and contamination. 

It may be observed that Annamacharya is crystal clear that mans’ actions are leading to isolation, not to loneliness. As the technology is progressing, as it happened with introduction of mobile phones, this tendency of isolation is peaking beyond imagination. 

భావము మరియు వివరణము:  దుఃఖములు మనుషులకు ఏకాంతము కూడా ఇవ్వకుండా బాధించుచున్నవి. పుణ్యాలు చెయడానికి ఏమీ లేవు. పాపములు, మలినములు వదిలించుకొనుట ఒక్కటియే మానవుని చేతిలోనున్నది.

మునుపు జరిగిన ఘటనల​ ఙ్ఞాపకాలు (అవశేషాలు) మనుషులకు మాటిమాటికి గుర్తుకు వచ్చి ఏకాంతము కూడా పొందకుండా అడ్డుపడుతున్నాయి.

(అఙ్ఞానముచే) పుణ్యాలు చెయడానికి సిద్ధపడతాడు కానీ తనలోని పాపములు, మలినములు  తగ్గించుకొను మార్గము వెతకడు.

మనిషి చర్యలన్ని అతనిని సమాజము నుండి వేరు పరచుటకే సహాయ పడుతున్నవి కానీ, ఏకాంతమునకు కాదు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుచున్నకొలదీ, ముఖ్యంగా చరవాణి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషికి మనిషికి మధ్య ఊహించలేనంత దూరము పెరిగిపోయింది. అన్నమాచార్యులు ఈ కీర్తన ఎంత పరిశీలించి వ్రాసినదీ అర్ధం చేసుకోవచ్చు.​

హితవైనమమకార మెందుఁగల దిందరికి

ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక
మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు
జితమైన దైవమిచ్చిన పాటిగాక ॥ఏది॥ 

hitavainamamakAra meMdugala diMdariki

pratilEni virahatApamu koladigAka
matilOni vEDukalu mariyEmi manujulaku
jitamaina daivamichchina pATigAka   Edi

word to word meaning: హితవైన (hitavaina) = beneficial, wholesome; మమకారము  (mamakAramu) = నాదియను (స్వంతమను) అభిమానము, The interest or affection entertained for objects, from considering them as belonging to, or connected with oneself; మెందుఁగల దిందరికి (eMdugala) = where for all? ( no where); ప్రతిలేని (pratilEni) = unhindered, unabated; విరహతాపము (virahatApamu) =  విడిపోవుట యందు కలిగే బాధ​/క్షోభ​,  the pangs of separation from or absence of  love; కొలఁదిగాక (koladigAka) = due to; మతిలోని (matilOni) = the one that can be felt in mind;  వేడుకలు (vEDukalu) = pleasure, joy, delight; మరియేమి (mariyEmi) = then what;  మనుజులకు (manujulaku) = for the people; జితమైన (jitamaina) = Conquered, mastered, overcome; దైవమిచ్చిన  పాటిగాక! (daivamichchina pATigAka) = Equal to the one conferred by God!

Literal meaning and explanation: (As noted earlier, man’s actions are isolating him.) Humans get disturbed due to separation (from the society). In order to get solace from this (unhindered) sorrow of separation, they search for beneficial belongingness which does not exist. No pleasures a man can enjoy beyond the ones conferred by the God.

This stanza is continuation of the previous stanza. Belongingness indicates holding to one thing in preference to others. This holding to one idea/thing is the root cause of separation.

That’s the reason Indian philosophy always propagated the idea of non-belongingness, yet having compassion, similar to a droplet of water on a lotus leaf.  (He is there yet not there, Bhagavad-Gita Verse 5-10).

భావము మరియు వివరణము:   మనిషి చర్యలతో అతనికి సమాజమునకు మధ్య ఊహించలేనంత దూరము పెరిగిపోయింది. ఈ విడిపోవుట యందు కలిగే హద్దులేని బాధ/క్షోభ నుండి  స్వాంతన కొరకు ​సముచితమైన మమకారము (= స్వంతమను అభిమానము) కోరుకొంటాడు.  కానీ అటువంటిది ప్రపంచమున లేదని గ్రహించడు. సుఖము/సంతోషము దేవుడిచ్చినంత మాత్రమే కానీ అంతకు మించి లేవు.

యోగ్యమైన మమకారము (= స్వంతమను అభిమానము) మానవుల దృష్టిలోపమేనని  ప్రపంచము నుండి  విడిపోవుట యందు కలిగే బాధ/క్షోభ నుండి  స్వాంతన కొరకు వస్తువులు, ధనము, పేరును సంపాదించుటలో వెచ్చించుచూ దుఃఖము పొందుతున్నాడు.

అందుకే భారతీయ పద్ఢతిలో మమకారము వదిలివేయమని, అట్లని ప్రేమలేక ఉండుట కాదని అంటూతామరాకు మీద నీటి బొట్టులా ఉండమన్నారు” (భగవద్గీత 5-10).

యిరవైన దైవకృపయేల దొరుకునుఁ దమకు

పరిమైనకర్మంబు పరిపాటిగాక
యెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁ
దిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక       ॥ఏది॥ 

yiravaiva daivakRpayEla dorukunu damaku

parimainakarmaMbu paripATigAka
yeravainapenubaMdha mEla vIDeDu nAtma
diruvEMkaTESukRpa tiramaina gAka            Edi

word to word meaning: యిరవైన  (yiravaina) constant; దైవకృప (daivakRpa) = blessings of god;  యేలదొరుకునుఁ దమకు (yEla dorukunu damaku) = why should it be conferred on you? పరిమైన (parimaina) = tiring, tiresome; కర్మంబు (karmaMbu) = work/chores  పరిపాటిగాక (paripATigAka) = as usual; యెరవైన (yeravaina) = అన్యం, లాతి, అపరిచితం, అజ్ఞాతం, the other unseen;  పెనుబంధము  (penubaMdhamu) strong bonds; ఏల​ వీడెడు (Ela vIDeDu) = why does not leave out/extricate;   నాత్మఁ (nAtma) = in the self; దిరువేంకటేశుకృప (diruvEMkaTESu kRpa) =  blessings of god; తిరమైనఁ గాఁక (tiramaina gAka ) = until they become permanent. 

Literal meaning and explanation: Do not rue for not gaining the blessings of the god. First act to release yourself from the clutches of wrong acts. When you do it actually, the blessings of Lord of Seven Hills are permanent with you.

భావము: మనిషి సామాన్యముగా కర్మలందు చిక్కుకుని చీదరపడతాడే కానీ వాటి నుంచి బయటపడే మార్గము వెతకడు. పెనుబంధాలను తానే తెంచుకున్నప్పుడు కదా శాశ్వతమైన​ వేంకటేశు కృప కలిగేది!! 

 

zadaz

 

 

Reference: Copper Leaf: 16-1, Volume: 1-95

 

 

 

 


T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...