Saturday, 1 May 2021

43 మదమత్సరము లేక మనసుపేదై పో (madamatsaramu lEka manasupEdai pO)

 

ANNAMACHARYA

43 మదమత్సరము లేక మనసుపేదై పో 

Introduction: In this path breaking keertana Annamacharya deals with modern and contemporary subjects “EGO and ENVY”. This 500 year old sonnet on such subject could be the oldest  

Before we begin, Please consider the following statement. 

Your ego is self-image created by thought. It’s your social mask requiring validation because it lives in fear of losing its sense of identity.

Thibaut

Thus ego is like a psychological wall it builds to protect itself. These walls prevent man from empathising with his neighbour. Because of the action of ego our society is but an assemblage of individuals but not togetherness. When the ego gets completely dissolved, there is a possibility for empathy and communion to prevail. Very rarely, like a husband and wife relationship, we can witness such togetherness where words do not matter. 

But what is the action of individual in most situations is either to reinforce or to defend _“EGO (one self)”_. He feels the loss of “sense of himself” even to part with a small part of this.  That is exactly what is meant by the line “మదమత్సరము లేక మనసుపేదై పో 

Thus by any measure, this chorus is not just amazing, but also could be termed as revolutionary, especially the one coming from a chaste Hindu Saint.  This single line is sufficient to prove deep sense of understanding Annamacharya had embedded in his poetry. Though this poem is rather radical yet it is wrapped in flowery words and subtle expressions. It flows like liquid gold in the ears of connoisseurs. I feel overwhelmed to write a small introduction to such great song. 

Lastly though it is exposing one’s ego, the actual impact it creates on the reader is to lead him to introspection and reflection. Thus Annamacharya’s works created unison rather than dissension despite dealing in highly provocative subjects. 

ఉపోద్ఘాతముఅందంగాను, వింతగాను, ఆశ్చర్యజనకంగాను ఉన్న యీ కీర్తన పల్లవిలో మానవ జీవితాన్ని నిర్వచించించే అహం మనిషి నిర్మించిన అడ్డు గోడల హర్మ్యమని అన్నారు. అవి తొలగిన నాడే అన్యోన్య సంబంధములు వికసిస్తాయి అన్నారు.  జీవన సారాన్ని రంగరించి తేనెలూరుతోందా అన్నంత  మధురమైన పదజాలంతో హృదయానికి హత్తుకునేలా వ్రాశారు. వ్రాశారు అనడం కంటే ప్రాసాదించారు అనడం సబబేమో. 

మనిషిలోని అహంభావము తన్ను తాను రక్షించుకొనుటకు అనేకానేక నిరొధాలను/ఆటంకాలను సృష్టిస్తుంది. ఆటంకాలే మనిషిని తన పొరుగువాడితో తాదాత్మ్యం చెందనివ్వవు. దానితో మన సమాజము, ఒక గుంపుగా మాత్రమే ఉండి,  ఒకరితో నొకరు  సానుభూతిని ప్రకటించడం ఒక  మర్యాదగానే మిగిలి, సహానుభూతిని చెందగలుగు స్థితి ఎదగ లేక పోయింది.  గర్వమనే, భ్రాంతి  కరిగిపోయినప్పుడే  పరస్పర సంబంధములలో అన్యోన్యతకు దారి యేర్పడు తుంది. అరుదుగా, దంపతుల మధ్య ఇటువంటి ఆంతరంగిక ఎఱుక  వర్తిల్లి మాటలకందని భావాలు యేర్పడతాయి. 

మనిషిలోని గర్వము తన లోని అహంకారమును రక్షిచుటకు శతవిధాలుగా ప్రయత్నము చేయును. మనిషి యేమాత్రమూ సూది మొన మోపినంత అహమును కూడా విడుచుటకు  సిధ్ధపడడు. ఆతనిలో "యేదో" కోల్పోతున్నాననే భావన కలుగుతుంది. సరిగ్గా ఇదే విషయం చెప్పారు అన్నమయ్యమదమత్సరము లేక మనసుపేదై పోఅంటూ. 

ఒక సంప్రదాయ పద్ధతిలోని యోగి నుంచి ఇటువంటి  విప్లవాత్మకమైన ఆలోచనలు 500 యేళ్ళ క్రితమే రావడము ఆశ్చర్యము, సంభ్రమమూ కలిగిస్తాయి. 

క్రాంతివంతమైన కవిత్వముతో  మనిషిలో మౌలికంగా పెనుమార్పు తీసుకురావడానికి అన్నమయ్య తీవ్రంగా కృషి చేసారనటానికి కీర్తన చక్కని ఉదాహరణ​. విప్లవాత్మక విషయాన్ని అందమైన పూల గుత్తిలా చుట్టీ కవిత్వానికే వన్నె తెచ్చారు. రచనలను మనిషిని ఉద్రేకపరచే కంటే, మార్పు తీసుకురావడానికి దోహదం చేసేలా సున్నితమైన పదాలతో పొదిగిరి.

 

మదమత్సరము లేక మనసుపేదై పో
పదరిన యాసలవాఁడువో వైష్ణవుఁడు
॥పల్లవి॥

 

madamatsaramu lEka manasupEdai pO

padarina yAsalavAMDuvO vaishNavuDu      pallavi 

Word to Word Meaning:  మదమత్సరము (madamatsaramu) = ego and envy; లేక (lEka) = without; మనసుపేదై పో (manasupEdai pO) = feels poorer; పదరిన (padarina) =   moving away, వీడిపోయిన; యాసల yAsala = wants; వాఁడువో  (vAMDuvO ) = that person;  వైష్ణవుఁడు (vaishNavuDu) =  ( true) Vaishnavaite. (A person who follows the path of VISHNU. 

Literal Meaning: A true Vaishnavaite is poor by absence of ego, envy and wants.

 

Implied Meaning: A true Vaishnavaite is bereft of feelings like me, myself, mine and wants.(Good men are poor by the absence of ego, envy and want)

 

Comments; When one leaves the feelings of me, mine and myself, it is true that one feels utter loss of sense of being. Annamacharya says one should eschew these. Only then there is possibility of realisation that he is not different from the surrounding world. Until such time man continues to be under wrong notion that he is a separate entity. Please consider the Bhagavad-Gita shloka below. Thus Annamacharya compressed great meaning into this simple single line.

 

अविभक्तं भूतेषु विभक्तमिव स्थितम् |
भूतभर्तृ तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु || 13-17||

avibhaktaṁ cha bhūteṣhu vibhaktam iva cha sthitam
bhūta-bhartṛi cha taj jñeyaṁ grasiṣhṇu prabhaviṣhṇu cha

Purport: (The Brahman) though indivisible, (HE) appears to be divided amongst living beings. Know the Supreme Entity to be the Sustainer, Annihilator, and Creator of all beings.


భావము:   అసూయ, అహంకారము, ఆశలు లేని పేదవాడే నిజమైన వైష్ణవుఁడు. 

అన్వయార్థము: నేను, నాది అన్న భావనలు  లేనివాడు, ఆశల వెంట పడనివాడే నిజమైన వైష్ణవుఁడు. 

వ్యాఖ్యలు :  నేను, నాది అన్న భావన లేనినాడు మనిషికి  తన సర్వస్వము కోలుపోయినట్లనిపిస్తుంది. దాన్నే వదలమటున్నారు అన్నమయ్య​. అప్పుడే మనిషి, తనకు ప్రపంచానికి మధ్య దూరము లేదని గుర్తించగలడు. అప్పటి దాకా తను వేరు ప్రపంచము వేరు అనిపిస్తుంది. ఒక చిన్న పాదములో ఇంత అర్ధము గుప్పించారు.   క్రింది భగవద్గీత శ్లోకమును కూడా చూడండి. 

అవిభక్తం భూతేషు విభక్తమివ స్థితమ్
భూతభర్తృ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు ।। 13-17 ।। 

భావము:   ( బ్రహ్మము) విభజించబడనిదైననూ ప్రాణులయందు విభజించబడినట్లు కనబడునది. పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము. 

 

ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడి
పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి
యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి
వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు
॥మద॥

 

iTTunaTTu dirigADi yEmainA jeDanADi

peTTaraMTA bOyaraMTA bekkulADi

yeTTivArinainA dUri yevvarinaina jEri

vaTTiyAsala baDanivADuvO vaishNavuDu  mada 

Word to Word Meaning: ఇట్టునట్టుఁ (iTTunaTTu ) = this way & that way; దిరిగాడి (dirigADi) = wander; యేమైనా (yEmainA) = anything;   జెడనాడి (jeDanADi) = to revile, to criticise, to condemn, to attack, to brand, to denounce, to flay; పెట్టరంటాఁ బోయరంటాఁ (peTTaraMTA bOyaraMTA) =  received, not received (gifts, appreciation) etc; బెక్కులాడి (bekkulADi) = lament repeatedly; యెట్టివారినైనా దూరి (yeTTivArinainA dUri) = find fault with one and all; యెవ్వరినైనఁ జేరి (yevvarinaina jEri) = side with anyone;  వట్టియాసలఁ (vaTTiyAsala) pure wants;  బడనివాడుఁవో = (baDanivADuvO ) = not run after; వైష్ణవుఁడు (vaishNavuDu) = ( true) Vaishnavaite;. 

Literal Meaning: A ( true) Vaishnavaite.do not wander (here and there); do not condemns anything; do not repeatedly lament that he received less (than he deserves); find fault with one and all; does not side with anyone to satiate his wants. 

Comments: What do we do? In the earlier times we used to criticise one and all in daily newspapers. Now criticise whole day on social media. How can we be Vaishnavaites? 

భావము: అటూయిటూ ఊరకే తిరగక​, దేన్నైనా నిందించక​; అది నా కిచ్చారు, ఇది నాకు దొరకలేదు అని పలుమార్లు బాధపడక​; ఎవరు కనబడితే వారిని  తిట్టక; తన ఆశలు దక్కించుకోడానికి ఎవ్వరినైనా చేరనివాడే నిజమైన వైష్ణవుఁడు. 

వ్యాఖ్యలు : ఈనాడు మనం చేస్తున్నదేమిటి? చాలా సమయము (దినమంతా) వారినీ వీరినీ విమర్శిస్తూ సోషల్ మీడియాలో గడుపుతాము. మనమెలాంటీ వైష్ణవుఁలము?

 

గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి
నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి
వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల
వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు
॥మద॥ 

gaDanakoraku jikki kAmukavidyala jokki

niDivi nEmainA gani nikki nikki
voDaliguNamutODa vuduTuvidyala jAla
vaDadAki baDalanivADuvO vaishNavuDu    mada 

Word to Word Meaning  గడన (gaDana) = సంపాదనము, to earn money; కొరకుఁ (koraku)=  for; జిక్కి ( jikki)  =  get trapped; కాముకవిద్యలఁ  (kAmukavidyala) = worldly amorous  avocations;  జొక్కి (jokki) = to get intoxicated;  నిడివి (niDivi) = length; long నేమైనాఁ గని (nEmainA gani)  = whatever eyes see;  నిక్కి నిక్కి (nikki nikki)  To stretch; వొడలిగుణముతోడ (voDaliguNamutO Da) = nature of his body and mind ; ఉదుటు (vuduTu) = గర్వము,  దార్ఢ్యము  విలాసము; విద్యలఁ జాల (vidyala jAla) = many such avocations; వడదాఁకి  (vaDadAki)= get touched by love-struck, heat etc;  బడలని (baDalani) = అలసట లేని, not Fatigued,  not exhausted; వాఁడువో (vADuvO) = that person;   వైష్ణవుఁడు (vaishNavuDu)  = true Vaishnavite; 

Literal Meaning: A (true) Vaishnavaite does not engage in earning (money). He does not get intoxicated by amorous activities; he is does not play peeping tom. Does not display his body and meddle into related activities; He does not tire himself out. 

Comments: We do exactly opposite. We engage in earning money; we keep watching provocative material in various media. We are much interested in what neighbour’s activities (but not his welfare). How can we be called Vaishnavaites? 

భావము: సంపాదనలో పడక​; శృంగార సంబంధమైన విద్యలఁలొ తగులుకొనక​; అత్యంత ఉత్సాహంతో మునికాళ్ళమీద నిలబడి ఎదో చూచూటకు ప్రయత్నము చేయక​; తన శరీర  దార్ఢ్యమును గర్వంగా ప్రదర్శింపక​; మరి అలాంటి వేరే ప్రసంగముల జోలికి వెళ్ళక​; అలసట చెందక  ఉండు వాడే నిజమైన వైష్ణవుఁడు. 

వ్యాఖ్యలు :ప్రతీవారు  చేస్తున్నదేమిటి?  సంపాదనలో పడతాం. శృంగార సంబంధమైన విద్యలు దృశ్య శ్రవణ మాధ్యమాలలో అనందిస్తాము. ప్రక్కవాడు యేమి చేస్తున్నాడో మునికాళ్ళమీద నిలబడి చూచూటకు ప్రయత్నము చేస్తాము. శరీర  దార్ఢ్యమును ప్రదర్శిస్తాము.  మనమెక్కడి వైష్ణవుఁలము?

 

ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని
చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక
కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప
వావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు
॥మద॥

 

Avala vorula jeDanADaga vinivini

chEvamIri yevvarini jeDanADaka

kOvidu SrIvEMkaTESu golichi peddalakRpa

vAvivartanagalavADuvO vaishNavuDu         mada 

Word to Word Meaning: ఆవల (Avala) = that side; వొరులఁ(vorula) = others; జెడనాడఁగ (jeDanADaga) = to flay; వినివిని (vinivini) = hearing many times;  చేవమీరి (chEvamIri) = just because he has strength; యెవ్వరినిఁ (yevvarini) = any one; జెడనాడక (jeDanADaka) = to denounce; కోవిదు (kOvidu) =   A skilful or wise man శ్రీవేంకటేశుఁ (SrIvEMkaTESu) = Lord Venkateswara; గొలిచి (golichi ) = by Prayer;  పెద్దలకృప (peddalakRpa) = blessings of the elders;  వావివర్తనగలవాడుఁవో (vAvivartanagalavADuvO) = has appropriate behaviour and conduct; వైష్ణవుఁడు (vaishNavuDu)  = true Vaishnavite 

Literal Meaning: A (true) Vaishnavaite does not encourage others criticising a third person.  Even by mistake he shall not blame others; having understood the human predicament he is in prayer. He serves elders.  Exhibits appropriate behaviour and conduct. 

Comments: We are clever enough to keep elders in old age homes for our comfort. We keep postponing the prayer to the end (as if we know when the end is?).


భావము:  ఎవ్వరైనా ఇంకొకరిని ఆడిపోసికొంటుండగా పట్టించుకోనివాడు, బుద్ధిమాలి ఎవ్వరిని నిందించనివాడు, వివేకియై శ్రీవేంకటేశ్వరుని (దైవమును) కొలుచువాడు, సేవలచే పెద్దల మన్ననకు పాత్రుడై, సరి యైన నడవడి గలవాడే నిజమైన వైష్ణవుఁడు. 

వ్యాఖ్యలు పెద్దలను మన సౌఖ్యము కొరకు వృధ్ధాశ్రమములలో ఉంచు వివేకులము. దైవమును జీవితపు (ఏదో తెలియని) చివరలో ప్రార్ధించవచ్చని వాయిదావేయు సమర్ధులము. మనమా వైష్ణవులము?

.

zadaz

Reference: copper leaf 9-5, volume: 1-59

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...