తాళ్లపాక చిన తిరుమలాచార్యులు
246 ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా
For English version press here
వారి ప్రత్యేకత ఏమిటంటే —
సాంప్రదాయానికి లొంగకుండా,
మసిబారిన సమాజపు గోడల్ని ఛేదించి,
బంధనాన్ని నిర్దాక్షిణ్యంగా ఎత్తిచూపిస్తారు —
అది కూడా కవిత్వ రూపంలో — గుండెని తాకే శైలిలో.
కృతిరస విశ్లేషణ: ఈ కీర్తనని ప్రధానముగా ‘ధ్వని కావ్యం’గా భావించవచ్చును. ఎందుకంటే ఇందులో ఏ విషయము కూడా సూటిగా చెప్పకుండా ఉపపాదించ బడినది. కృతి విషయమంతా “దైవికము తాత్వికము లక్ష్యము” అనిపిస్తుంది. దీనిలోని స్థాయీ భావమును ‘వైరాగ్యం’గా భావిస్తే కృతిలోని ముఖ్య రసము ‘శాంత రసము’ అని మనకు తెలుస్తుంది. "హాస్యము" మోదమును పుట్టించక పోయినా ‘అంగిరసమై’ గంభీరతను సమతుల్యం చేస్తూ కొంత ఓదార్పు కలిగిస్తుంది.
సాహిత్యమును
అర్ధము చేసుకొనుట కొంత కష్టము కనుక ఈ కీర్తనను ‘కదళీ
పాకము’గా భావించ వలెను.
అధ్యాత్మ సంకీర్తన |
రేకు: 10-2 సంపుటము: 10-56 |
ఇందరి జూచి చూచి యెఱఁగవద్దా
బందెపసులకు మెడ పన్నించ నేలా ॥పల్లవి॥ యినుమునఁ జేసిరా యెవ్వరిదేహమైనా
పొనిఁగి పోతేఁబోవు పోకుంటే
మాను
పనివడి యిందుకుఁగా బాటువడ
నేమిటికి
మొనసి దొసపంటికి యినుప కట్టేలా ॥ఇంద॥ మంచి రాతఁ జేసిరా మనుజునిమే
నేమి
నించి చెడితేఁ జెడు నిల్చితే
నిల్చు
పొంచి పొంచి యిందుకుఁగా పొడిఁబడ
నేఁటికి
పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ
బెట్ట నేలా ॥ఇంద॥ చేఁగమానఁ జేసిరా చెల్లఁబో
నరుల నెల్లా
యీఁగి కుంగితేఁగుంగు హెచ్చితే
హెచ్చు
నాఁగువార శ్రీవెంకటనాథుఁడు
మన్నించఁగాను
దాఁగి జీలుగుబెండుకు తరమువెట్ట
నేలా ॥ఇంద॥
|
Details and Explanations:
పల్లవి:
Telugu
Phrase |
Meaning |
ఇందరి
జూచి చూచి యెఱఁగవద్దా |
ప్రపంచములోని
జనులను చూసి తెలుసుకోలేరా? |
బందెపసులకు |
ఇప్పటికే
బంధించబడిన పశువులకు (మనుషులకు) |
మెడ పన్నించ
నేలా |
పన్నించు = కట్టు, బంధించు
మెడను వంచి ఇవ్వనేలా?
|
ప్రత్యక్ష భావము:
ఇంత
మందిని చూశాకా కూడా అర్థం చేసుకోలేవా?
ఇప్పటికే
బందెలదొడ్డి పశువుల్లాంటి మనుషులకు
నీ
మెడను వంచనేలా?
వ్యాఖ్యానం:
ఇక్కడ కవి ఒక స్పష్టంగా మనిషి అనుభవించే దుఃఖానికి నిజమైన ఉపశమనం మానవులివ్వలేరని చెబుతున్నారు.
చిన్నతిరుమలాచార్యులు
కలల కోసం కలం పట్టలేదు.
కాలం అంటని —
కోటలు, కొండలు కూలినా నిలిచే
అజేయమైన కవిత్వాన్ని సృష్టించారు.
ఓ మానవుడా!
నీ తోడివారు ముందరిగినదీ చూచితివా?
వారెగిన చోటు తెలుసా? చిటికెలో మాయ — కోటి
కలలా!
తెలిసి ఉండీ, ఏమి చేయగలవు? చూరును పట్టుకుని వేళ్ళాడగలవా?
అంతా మనలాంటివారే! మనకన్నా “ఎక్కువ తెలుసు” అన్నవారు —
బందెల దొడ్డిలో పశువులవలె గుంపులుగా గుమికూడుతున్నారు!
ఇందరిని చూచి చూచి... బేధించ తలచుతావా?
పట్టు పట్టగలదేముంది? మెడలే గాని, స్వేచ్ఛ కాదే!.
మొదటి చరణం:
పదబంధం |
అర్ధము |
యినుమునఁ
జేసిరా యెవ్వరిదేహమైనా |
ఎవ్వరి దేహము కూడా ఇనుముతో చేయబడలేదు (ఇక్కడ శాశ్వతంగా
వుండిపోలేమని అర్ధము) |
పొనిఁగి
పోతేఁబోవు పోకుంటే మాను |
ఇది పోతే పోనీయని. వుంటే వుండనీ |
పనివడి
యిందుకుఁగా బాటువడ నేమిటికి |
పనిగట్టుకొని దీనికోసము పాటుబడటము ఎందుకు? (అవసరం లేదని అర్ధము) |
మొనసి
దొసపంటికి యినుప కట్టేలా |
మొనసి = శూరత్వమున, సాహసమున;
సాహసము చేసి దొషమున్న పంటికి యినుప కట్టు వేసినా ఏమి ప్రయోజనము? (లేదు)
|
ప్రత్యక్ష భావము:
మనుషులారా
— ఎవరి దేహము
కాదు ఇనుము. లేదు శాశ్వతము.
ఇది పోతే పోనీ, వుంటే వుండనీ —
దేనికొరకు ఈ ఆరాటము?
అయితే,
అనిశ్చితమైన ఈ శరీరానికై
వెట్టి కూలీలా జీవితాంతం
పాటుపడటం ఎందుకు?
ఇనుప
కట్టువేసినా — పుచ్చు పన్ను ఊడదా?
దోషభరితమైన మనస్సు, ఆంక్షలతో ఆగుతుందా?
వ్యాఖ్యానం:
అది ఆకలితోను, ఆశయాలతోను అల్లుకున్నది కాదు.
—
ఆత్మసమర్పణలోనే మౌనంగా వికసించేది.
విచారణలకు అది అందదు,
రెండవ చరణం:
పదబంధం (Phrase) |
అర్థం (Telugu) |
మంచి రాతఁ
జేసిరా మనుజునిమే నేమి |
ఈ మానవులను
మంచి రాయితో చేసారా? (ఎప్పటికీ వుండిపోతామా ఏమిటీ?) |
నించి
చెడితేఁ జెడు నిల్చితే నిల్చు |
ఏదో ఒక
కారణంతో చెడిపోవచ్చు లేదా నిలువ వచ్చు. (ఆ కారణమును తెలియలేమని సూచిస్తూ) |
పొంచి
పొంచి యిందుకుఁగా పొడిఁబడ నేఁటికి |
అదేపనిగా, దీనికోసమెందుకు పాటుబడటం? |
పంచ నీరుబుగ్గు
రాతిబరణిఁ బెట్ట నేలా |
పంచ =
గృహాదిపార్శ్వ ప్రదేశము, ఇంటి చుట్టూ వున్న ప్రదేశము
పంచనే
వున్న నీటిబుగ్గ నీటిని రాతి భరిణలో దాచడమెందుకు?
|
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
Part 1
Part 2
ఎక్కడో
— సుదూరాన
దైవమూ, స్వర్గమూ.
కానీ ఓ మానవుడా,
నీవొక ఊహల సమాహారం —
భావాల గుళికల మిశ్రమం,
కూడని కూడికల కట్టడం,
భావాల సహవాసాల దోషం.
సమాలోచనల
అడ్డదారుల్లో
భ్రాంతినే బలంగా నమ్ము బాటసారి
కలల
వ్యవసాయం అడ్డదారి.
కల్పిత స్థితులను దాటి సాగు నిజం.
నీవు నిలిచినది ఒక మెట్టు కాదు —
కనిపించని ఒంటరి గట్టు.
ఆ ప్రవాహానికి ఆవల,
తనను తానే గమనించే గూఢచారి వలె.
Part 3
“పంచ నీరుబుగ్గు రాతిబరణిఁ బెట్ట నేలా” —
చిన తిరుమలాచార్యులు
జీవంతో
ప్రవహించే దైవానుభూతిని
ఒక శాశ్వత రాతిబరణిలో నిలుపుదామనడం మూర్ఖత్వమే.
ఈ
శరీరం కాని, మనస్సు కాని,
సృష్టించుకున్న అహం కాని —
ఏదీ దైవత్వాన్ని అనుభవించటానికి పనికిరావు.
అవి ప్రవాహాన్ని ఆపే
నీటిని రాతిబరణిలో నిలిపే నిస్సార ప్రయత్నాలే.
ఇదే
భావనను రెనే మాగ్రిట్ గారు
“అస్పష్ట వ్యవసాయం” (The Cultivation of Ideas, 1928)
అనే చిత్రంలో
మౌనంగానైనా మౌలికంగా చెప్పారు.
ఆ
చిత్రంలో కనిపించే చెట్లు —
పైకి పచ్చదనంతో, జీవంతో కనిపించినా —
వాటికి ములాలు లేవు.
రాతితో చేసిన కృత్రిమ వేదిక మీద
అవి కేవలం నిలబెట్టబడ్డ వృక్షాల వలె.
చిన
తిరుమలాచార్యుల “రాతిబరణి”
మాగ్రిట్ చూపిన తప్పుడు వేదికతో సమంగా భావించవచ్చు.
ఇవే మన అసత్యపు ఆధారాలు.
మనిషి తన అనుభవాలను, తత్వాలను,
తాను అనుకునే “నేను” అనే భావాన్ని
ఇలాంటి వేదికల మీదే నిర్మించుకుంటాడు.
శరీరం
ఒక పాత్ర కాదు.
ఆ ప్రవాహానికి ఇది అడ్డుకాదు.
దైవత్వం అనేది
భౌతికంగా, మనసులో నిలుపగలిగే వస్తువు కాదు.
మూడవ చరణం:
Telugu Phrase |
Meaning |
చేఁగమానఁ
జేసిరా చెల్లఁబో నరుల నెల్లా |
చేఁగమానఁ జేసిరా= బలమైన చెక్కతో చేసారా? చెల్లఁబో =ఆక్షేపార్థము;
భలే చెప్పారే! మనుషులందరిని బలమైన చెక్కతో చేసారా? ఏమిటి?
|
యీఁగి
కుంగితేఁగుంగు హెచ్చితే హెచ్చు |
దానముగా వచ్చిన ఈ దేహము కుంగితేఁకుంగనీ, పెరిగితే పెరగనీ |
నాఁగువార
శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను |
వడ్డీకాసులవాడు శ్రీవెంకటనాథుఁడు మన్నించఁగాను |
దాఁగి జీలుగుబెండుకు తరమువెట్ట నేలా |
లోపలదాక్కొని వున్న జిల్లేడు పిప్పికి రాళ్లు అడ్డుకట్టుట
దేనికంటా |
ప్రత్యక్ష భావము:
ఓహో!
ఇదెంత మాట!
మనుషులను బలమైన చెక్కతో తయారు చేశారా ఏంటి?
దానంగా లభించిన ఈ శరీరం
కుంగితే కుంగనీ, పెరిగితే పెరగనీ —
మన చేతిలో ఏమీ లేదు కదా!
వడ్డీకాసులు
వసూలు చేసే
శ్రీవెంకటేశ్వరుడు మనలను క్షమిస్తుంటే —
లోపల దాచిన జిల్లేడు పిప్పికి
రాళ్లతో పైపైగా అడ్డుకట్ట వేసినంత మాత్రాన ప్రయోజనమేముంది?
వివరణాత్మక వ్యాఖ్యానం:
సారాంశం:
ఈ
కీర్తన శరీరవైఖరికి వ్యతిరేకంగా,
అంతఃజాగరణకే ప్రాధాన్యంనివ్వడం స్పష్టం
చేస్తోంది.
శరీరాన్ని
శాశ్వతమని భ్రమించి
దానికోసం పాటుపడటం
అనర్థకమైన అనుసరణ.
ముక్తి
అనేది
శరీరములో కాక —
సాక్షిగా ఉండే ఆంతరిక జీవజ్ఞానంలోనె ఉంది.
కీర్తన
సారాంశం
X-X-The
END-X-X
No comments:
Post a Comment