తాళ్లపాక అన్నమాచార్యులు
145 కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ
జెడి
"ఎందుకు జీవించాలో తెలిసినవాడు ఎలాగైనా ఎటువంటి కష్టాన్నైనా భరించగలడు".
ఫ్రెడరిక్ నీట్షే
క్లుప్తముగా: మానవుడు ఎప్పటికైనా కోరికల నుండి బయటపడతాడా? ఈ చిల్లర కోరికలకు అతను చెల్లించే
మూల్యం ఏమిటి?
కీర్తన సంగ్రహ సారం:
పల్లవి: నా కోరికలు ఎప్పుడు తీరుతాయో? ఎలా గుణము అవగుణమునుఁ స్వభావాలు అణిగిపోతాయో? ఏ ఉద్దేశమూ లేకుండా నా మనసు నీ మీదే కేంద్రీకరించే రోజు వస్తుందా? (రాదని అర్ధము) అన్వయార్ధము: ఎప్పుడూ కోరికలచే నిర్దేశించబడి, భౌతిక స్వభావంచే పాలించబడే నేను, నిష్కల్మషమైన హృదయంతో నిన్ను వెతకడాని సాహసించగలనా?
చరణం 1: మనసు ఎప్పటికీ సంతృప్తి చెందదు. ఏదో లోటు ఆలోచనలలో వుండనే వుంటుంది. అలా పైకొను గొలుసు కట్టు కపరితాపమునకు హద్దుల్లేవు. కూడగట్టుకున్న పాపపుణ్యాల నుండి వచ్చేది తాత్కాలికమే. ఆ రకముగా అనంతమగు జీవ శక్తిని శరీరమునకే పరిమితము చేసుకుంటూ రోజులు దొర్లిపోతాయి. అన్వయార్ధము: ఏదోలేదనే ఎడతెగని భావన మనిషి దృష్టిని సత్యమునుండి దూరం చేస్తుంది. మనిషి తప్పనిసరిగా ఎత్తిన బరువుపై శ్రద్ధ వహించాలి. మానవుడు ఆహ్వానము లేకయే, తెలియకుండానే ఈ బ్యాలెన్సింగ్ చర్యలో నిమగ్నమై ఉండగా, సమయం ఎగిరుకుంటూ వెళ్ళిపోతుంది. కళ్ళు తెరిచి మూర్ఖత్వానికి దూరంగా జరుగుమి! గొప్ప అవకాశాన్ని కోల్పోతున్న సంగతిని గుర్తించుమి.
చరణం 2: జీవుడు పరతంత్రుఁడుగన శరీర
సేవలో లీనమై భగవంతుని గురించి ఆలోచించడు. అన్ని జీవులకు పుట్టుక, మరణము సహజము. శ్రీవనితాహృదయేశ్వర!
ఓ వేంకటగిరి స్వామి! ఈ జీవులెప్పటికైనా పరిశుద్ధమైన, పవిత్రమైన హృదయాలతో జీవించుదురా?
విపులాత్మక వివరణ
ఉపోద్ఘాతము: భగవంతుణ్ణి దర్శించుకోవాలనుకోవడమూ ఒక కోరికేనని అన్నమాచార్యులు నొక్కి వక్కాణించారు. ఏ కోరికా లేని మనిషి తనంతట తానుగా నిలబడినప్పుడు, అనంతాన్ని అనుభవించవచ్చు. మిగిలిన ప్రయత్నాలన్నీ కేవలం విచలనాలు, ఇవి సమయాన్ని వృధా చేస్తాయే తప్ప మరేమీ కాదు.
"జీవులు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన జీవితాన్ని గడిపే రోజంటు వస్తుందా?" అని అన్నమాచార్యులు ఆడిగారు. స్వచ్ఛతకు పిలుపు కొత్తది కాదు, కానీ జీవితాన్ని సిద్ధాంతీకరించడం కంటే అలా జీవించడం చాలా ముఖ్యం.
కీర్తన: రాగిరేకు: 29-1 సంపుటము: 1-176
|
కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడి వూరక యీమది నీపై నుండుట యెన్నఁడొకో ॥కోరికె॥ చిత్తం బాఁకలి దీరదు చింత దలంపునఁ బాయదు యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర హత్తిన పుణ్యము బాపము నప్పటి సుఖముల కొరకే వత్తికి నూనెఁకు గొలఁదై వడిఁ జనె దివసములు ॥కోరికె॥ జీవుఁడె పరతంత్రుఁడుగన చింతింపఁడు నిన్నెప్పుడు చావునుఁ బుట్టుగు సహజము శరీరధారులకు శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నఁడొకో ॥కోరికె॥
|
Details and Explanations:
ముఖ్య పదములకు అర్ధములు: జెడి = చెడు, పాడగు, నాశమగు; యెన్నఁడొకో = ఎప్పటికో? (ఎప్పటికీ కాదు అనే అర్ధము).
భావము: నా కోరికలు ఎప్పుడు తీరుతాయో? ఎలా గుణము అవగుణమునుఁ స్వభావాలు అణిగిపోతాయో? ఏ ఉద్దేశమూ లేకుండా నా మనసు నీ మీదే కేంద్రీకరించే రోజు వస్తుందా? (రాదని అర్ధము)
వివరణము: ‘వూరక’ను మనం దేవునితో "నువ్వది చేస్తే, నీకు నేనిది చెస్తా" వంటి లావాదేవీల వ్యవహారము కాదని సూచించుటకై వాడారు. "నీపై నుండుట" అనేది మనస్సు సత్యానికి దూరంగా వుండి అటుయిటూ ఊగిసలాడుతూనే ఉంటుందని చెబుతోంది. దానిని క్రమశిక్షణలోకి తీసుకురావడానికి మనిషి చాలా కష్టపడాలి.
ఇప్పుడు రెనే మాగ్రిట్టే గీసిన ‘సత్యాన్వేషణ’ ("లా రీచెర్చే డి లా వెరిటే" La Recherche de la verité, Search for Truth) అనే శీర్షికతో జతచేయబడిన చిత్రాన్ని చూడవలసిందిగా పాఠకులకు అభ్యర్థన. అక్కడ ఒక గదిలో కిటికీకి దగ్గరగా, గోడను ఆనుకొని నిట్టనిలువుగా నిలబడి, నిర్బంధము నుండి బయటకు రావడానికి వువ్విళ్ళూరుతున్న చేపను చూడండి. చేప భవనంలో వుండడము, అదీ నిలబడి ఉన్నట్లు చూపడము పూర్తిగా కృత్రిమం. కిటికీని, దాని నుండి కనబడే నీటిని చూడవచ్చు. చేప దాని సహజ జీవన స్థలము నీటిలోకి వెళ్ళగలదు. ప్రస్తుతం చిక్కుకున్న బూటకపు పరిసరాల నుండి తప్పించుకోవడానికి దానికి అన్ని అవకాశాలు ఉన్నాయని సూచించేందుకు పెద్ద కిటికీని చూపారు.
సత్యం కోసం మనిషి యొక్క అన్వేషణ పై చిత్రంలో ఉన్న చేప మాదిరిగానే ఉంటుంది. అతను ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రేక్షకుడిలా సత్యాన్ని పరిశీలకుడిలా చూడాలని కోరుకుంటాడు. అతను మానవ నిర్మిత పరిస్థితులలో ఓదార్పుని పొంద జూస్తాడు. అయినా సత్యం కోసం తహతహలాడుతున్నా నంటాడు. కానీ అతడు వాస్తవానికి సత్యంతో సహవాసం చేయుటకు ఇష్టపడడు. అతడే సత్యం కాదు. అదే మనిషి దుర్నీతి. అన్నమాచార్యులు జెడి (= పాడగు, నాశమగు, కుళ్ళిన) పదాన్ని ఉపయోగించడానికి కారణం అదే.
అన్వయార్ధము: ఎప్పుడూ కోరికలచే నిర్దేశించబడి, భౌతిక స్వభావంచే పాలించబడే నేను, నిష్కల్మషమైన హృదయంతో నిన్ను వెతకడాని సాహసించగలనా?
ముఖ్య పదములకు అర్ధములు: హత్తిన = కూడిన, వత్తికి = శరీరమునకు (అని అన్వయం); నూనెఁకు = జీవ
శక్తికి (అని అన్వయం); గొలఁదై = సీమలు ఏర్పరస్తూ, హద్దులు నిర్మించుకుంటూ;
భావము: మనసు ఎప్పటికీ సంతృప్తి చెందదు. ఏదో లోటు ఆలోచనలలో వుండనే వుంటుంది. అలా పైకొను గొలుసు కట్టు కపరితాపమునకు హద్దుల్లేవు. కూడగట్టుకున్న పాపపుణ్యాల నుండి వచ్చేది తాత్కాలికమే. ఆ రకముగా అనంతమగు జీవ శక్తిని శరీరమునకే పరిమితము చేసుకుంటూ రోజులు దొర్లిపోతాయి.
వివరణము: 'ఎత్తిన పరితాపము'తో మనిషి తనకు తానే నెత్తిన పెట్టుకున్న 'పరితాపము' అని, వేరెవరి ప్రమేయము లేదని సూచించారు. అయితే, ఇది అనాలోచిత చర్యయైనా కావచ్చు. సముచితమైన చర్యను నిర్ణయించడంలో మనిషి తడబడతాడన్నారు. ఇది కన్ఫ్యూషియస్ చెప్పినట్లుగా ఉంది "జీవితం చాలా సులభమే, కానీ మనము దానిని సంక్లిష్టంగా మార్చాలని పట్టుబడతాము"
దీన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి, ప్రసిద్ధ అధివాస్తవికతావాది రెనే మాగ్రిట్‌చే పర్పెచ్యువల్ మోషన్ (నిరంతర కదలిక) పేరుతో వున్న దిగువ చిత్రాన్ని చూడండి.
పై చిత్రంలో ఎత్తిన బరువు క్రింద పడుతుందేమో అన్న ఆందోళనతో వ్యక్తి తన చేయి ఆధారముగా తులాదండము చివరవున్న బరువును తన తలతో బ్యాలెన్స్ (సమము) చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చిత్రంలో ఉన్న వ్యక్తి అవివేకముగా తన చేతితో రెట్టింపు బరువును మోస్తున్నాడని గమనించండి. అతడిలా వుంటే అలసిపోడా? దీన్ని సమబుద్ధి అనవచ్చా?ఇతనికి స్వేచ్ఛ ఉందా? యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర?
పై చిత్రంలో వర్ణించిన దేనికీ కదలికలేదని గమనించండి. అయినా దాని శీర్షిక 'నిరంతర కదలిక' ఆశ్చర్యఁం గొలుపుతూ మనిషి యొక్క నిజమైన నైజమును సూచించుచున్నది.
వత్తికి నూనెఁకు
గొలఁదై (= సజీవ శక్తి శరీరానికే పరిమితమా?) అనేది మనము అవివేకముతో జీవించడానికి లేని
సరిహద్దులను నిర్దేశించుకుంటామని సూచిస్తుంది. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని పరిశీలించండి.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ । జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్
॥ 7-5 ॥ భావం : ప్రకృతి శక్తులను అధిగమించి అనంతమైన శక్తి, జీవ-ఆత్మ శక్తి (చైతన్య
శక్తి), జగత్తుయందు ఉన్న సమస్త జీవరాశులకు మూలాధారమై ఉంది.
మనము చర్య అనగా ఏమిటో తెలియకయే వాటిలో నిమగ్నమౌతాము. అటువంటి చర్యల యొక్క పరిణామాలను నిర్వహించ బోయి అనేక విషయములలో తగులుకొని, సమయమును, శక్తిని వ్యర్థ పరుస్తాము. దానితో మనము ఆత్మ యొక్క శక్తిని పరిమితం చేస్తాము. పసలేని జీవితాన్ని గడుపుతాము. ఇప్పటి మన చర్యలు అసలు చాక్లెట్‌ను వదలి దానిప చుట్టివున్న కాగితము కోసము ఆరాటపడుట వంటివి.
మహాత్ములు చర్యలలో చిక్కుకుని బయటకు రావడం అసాధ్యమని గ్రహించి; జీవ శక్తిని, మనశ్శక్తిని, దేహశక్తిని ఒకేత్రాటిపై తెచ్చుకొను అభ్యాసము నందే నిరంతరము వుండి, వారు భౌతిక సరిహద్దులను దాటి ప్రకృతితోను, అనంతముతోను ఏకత్వంలో ఉంటారు. క్షణక్షణమునకు మారు మనస్సును కట్టుబాటులో నుంచుట ఎడతెగని శ్రమయే కదా!
అన్వయార్ధము: ఏదోలేదనే ఎడతెగని భావన మనిషి దృష్టిని సత్యమునుండి దూరం చేస్తుంది. మనిషి తప్పనిసరిగా ఎత్తిన బరువుపై శ్రద్ధ వహించాలి. మానవుడు ఆహ్వానము లేకయే, తెలియకుండానే ఈ బ్యాలెన్సింగ్ చర్యలో నిమగ్నమై ఉండగా, సమయం ఎగిరుకుంటూ వెళ్ళిపోతుంది. కళ్ళు తెరిచి మూర్ఖత్వానికి దూరంగా జరుగుమి! గొప్ప అవకాశాన్ని కోల్పోతున్న సంగతిని గుర్తించుమి.
భావము: జీవుడు పరతంత్రుఁడుగన శరీర సేవలో లీనమై భగవంతుని గురించి ఆలోచించడు. అన్ని జీవులకు పుట్టుక, మరణము సహజము. శ్రీవనితాహృదయేశ్వర! ఓ వేంకటగిరి స్వామి! ఈ జీవులెప్పటికైనా పరిశుద్ధమైన, పవిత్రమైన, హృదయాలతో జీవించుదురా?
వివరణము: మూర్ఖత్వంతోను, మొండితనముతోనూ మన అవిచ్ఛిన్న మరియు నిరంతర అనుబంధాన్ని సూచించే పై చిత్రం యొక్క "నిరంతర కదలిక" అన్న శీర్షిక ఔచిత్యాన్ని గమనించే వుంటారు. ఇక మనిషికి చిక్కుముళ్ళను విడదీసుకునే సమయం ఎక్కడిది?
References
and Recommendations for further reading: