Sunday, 20 April 2025

219. uyyAla maMchamumIda nUchi vEsAritimi (ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి)

 ANNAMACHARYA

219. ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి

uyyAla maMchamumIda nUchi vEsAritimi 

 తెలుగులో చదవడనికి ఇక్కడ నొక్కండి.


This is Annamacharya’s soliloquy. The poetry that emerged in an elevated state free from personal desires or cultural conditioning. He took language to places untouched by poetry, devotion, or philosophy - to a gentle, intangible space where meanings and words merge and dissolve. He didn’t try to capture the extraordinary experience; instead, he stood within it, letting it speak through him as a listener, allowing us to hear it. 

Grace of God is beyond our petty considerations. Therefore, Annamacharya is requesting us to join this journey without judgement of present dispositions. In this poem, for those who listen or read, a profound transformation unfolds before their eyes: 

Pallavi: A sign of yearning, inner restlessness.

First Stanza: The problem — being trapped in illusion, settling into the world of sensory pleasures.

Second Stanza: A herald of transformation — with the grace of the Divine, the soul begins to prepare itself for peace and transcendence of desires.

Third Stanza: Realization — the return to truth, clarity, and bliss. 

This poem is not easily understood at first glance. But it is not unclear either. It is very real, and powerful, and when we are able to see through a perspective not bound by the mind, it becomes easy to grasp. This is the greatness of Annamacharya. He fills language with flames, somehow enters in our hearts, and revealing the truth directly. 

Summary of the Poem:

Chorus:

"They rock us on this endless cradle of life and death. 
Even if we close our eyes for rest, they only open elsewhere." 

First Stanza: Here, the "moon-faced beauty" is a symbol — an embodiment of softness and radiant purity. She stands in endless anticipation. In such longing, there is no sleep. No rest. No matter what surrounds her, the soul finds no peace. Silently, she keeps waiting — for the darkness to lift and the light to arrive. “What can she do?” Though she stands amidst soothing fragrances, a palace of sandalwood, and a chamber filled with perfume — there is no true sleep. No real wakefulness either. For all the outward comforts, when the heart remains unfulfilled, silence is nowhere to be found. Her wakefulness is confusion — a restless drift. A churning of the spirit in search of inner stillness - a quiet torment. 

Second Stanza: She is the very arrow of Manmatha — delicate, irresistible, and transient. But unlike the outwardly romantic imagery, here the "flower-arrow" is not a celebration of union, but an emblem of bondage to sensory charm. Annamayya flips the symbol — this isn't playful desire; it's the tool of nature’s snare. No interaction. This is not silence of realization, but of inertia. Of Tamas (తమోగుణం), the sleep continues under closed lids. The "repplu" (eyelashes) are not barriers, but symbolic shutters pulled down over perception. We do not close our eyes in peace — we close them in avoidance. When the eyelids slightly part — not fully open yet — a truth seeps in. That we have been asleep to life, ignorant of joy, playing in tamas. And when even a glimpse of that realization dawns — tears flood. It is not just sorrow. It is the cost of misused time. The weeping of awakening. 

Third Stanza:
In the moonlight of Venkatadri, I stood —
a stranger, unnoticed, unacknowledged —
even as I gazed at Him, He gave me no smile in return."
“I know not the moment my heart turned to the Lord of Lords —
but my whole being swelled and throbbed with joy.”

 

శృంగార కీర్తన

రేకు: 30-6 సంపుటము: 5-172

Copper Leaf:30-6 Volume: 5-172

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును ॥పల్లవి॥
 
చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును ॥ఉయ్యాల॥
 
పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు ॥ఉయ్యాల॥
 
వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ ॥ఉయ్యాల॥
uyyAla maMchamumIda nUchi vEsAritimi
muyyadiMchukayu reppa mUsinA derachun pallavi
 
chaMdamAma pAdamAna satiki vEginadAkA
yeMdunu nidralEdEmi sEtamE
gaMdapuTOvarilOna gappuraMpuTiMTilOna
yiMdumukhi pavvaLiMchu niMtalOnE lEchunuuyyAla
 
paMchasAyakuni pushpabANamAna yiMdAka
maMchamupai bavvaLiMchi mATalADadu
niMchina vAlugannula nidduraMTAnuMDitimi
vaMchina reppalaveMTa vaDisI gannIru uyyAla
 
vennelala vEMkaTAdrivibhuni lEnavvulAna
nannu jUchiyainA jeli navvadAyanu
inniTAnu saMtasilli yI dEvadEvuni gUDi
mannanala yiMta lOna malasIni jeliya uyyAla

 

Details and explanations:

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును
॥పల్లవి॥ 

uyyAla maMchamumIda nUchi vEsAritimi
muyyadiMchukayu reppa mUsinA derachunu       pallavi 

Literal Meaning:

"They rock us on this endless cradle of life and death.
Even if we close our eyes for rest, they only open elsewhere.
 

Commentary and comparisons:

Part 1: Celestial Swing 

The soul is caught in an eternal swing — not of comfort, but of unceasing movement.

Rest feels near yet never arrives. Sleep (death) comes, but not as peace — only as pause.

Even the act of closing the eyes does not bring stillness.

They open again, in another form, in another world.

As stated in the Bhagavad Gita (4.18) - even the moments we perceive as 'inaction or rest' are part of the journey. What seems like the absence of action is merely a doorway to another path of action. And thus, the cradle never stops. We remain in eternal motion, endlessly burdened by unseen sorrow.

And so, the Swing of Life never stops.


Part 2: Comparison with Sleep (1937) a surrealist painting by Salvador Dalí.



Dalí paints a bizarre image (as given above): a bloated, wrinkled head suspended midair, propped up by crutches. It does not symbolize rest — it speaks of instability and fragility.

This mirrors the essence of Annamacharya’s cradle:

  • The cradle and Dalí’s crutches — both depict a fragile state of suspension, not true stillness.
  • The sagging face — like the soul in sleep — appears still but is far from liberation.
  • In the pallavi, it is said that even when the eyelids close, they open again — hinting at a restlessness that never allows for true sleep. Similarly, in Dali’s painting, the figure seems disturbed — perhaps by the wind, or by one of the supporting props falling. It readjusts into a new posture, like someone roused from sleep, struggling to settle again. The scene evokes a condition where tranquility remains just out of reach — never truly attained

In both, sleep is not rest. Stillness is only an illusion — movement lies beneath.

Dalí’s “Sleep” becomes a striking visual metaphor for the human condition. Annamacharya laments a life caught in the cradle of samsara (this temporal world) swaying between birth and death, never truly free.


First Stanza:

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును        ॥ఉయ్యాల॥
 
chaMdamAma pAdamAna satiki vEginadAkA
yeMdunu nidralEdEmi sEtamE
gaMdapuTOvarilOna gappuraMpuTiMTilOna
yiMdumukhi pavvaLiMchu niMtalOnE lEchunu       uyyAla

Literal Meaning:

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా / యెందును నిద్రలేదేమి సేతమేHere, the "moon-faced beauty" is a symbol — an embodiment of softness and radiant purity. She stands in endless anticipation. In such longing, there is no sleep. No rest. No matter what surrounds her, the soul finds no peace. Silently, she keeps waiting — for the darkness to lift and the light to arrive. “What can she do?” 

గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన / యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును: Though she stands amidst soothing fragrances, a palace of sandalwood, and a chamber filled with perfume — there is no true sleep. No real wakefulness either. For all the outward comforts, when the heart remains unfulfilled, silence is nowhere to be found. Her wakefulness is confusion — a restless drift. A churning of the spirit in search of inner stillness — a quiet torment.


Commentary:

Similarly, in Gita 2.28, Krishna reminds Arjuna that grief over the death, or the apparent end of life is futile because the soul itself is eternal. Just as Annamacharya’s moon-faced woman remains in a state of longing and waiting, unaware of the transient nature of her surroundings, people in life often remain trapped in desires, confusing the impermanent with the permanent. Their restlessness, much like the woman’s, stems from an inability to understand the true nature of existence. 

Now compare the maid’s condition to a painting titled “Elective Affinities” by Rene Magritte given below. The picture with an egg caged is self-explanatory. Egg is indicative of possibility for transforming into a bird, liberation. 


Caged Security

This is not a cage of desire.
It is a security we ourselves have constructed—
A security born from unknown fears,
From unseen forces,

From the longing to continue the present state unchanged.
This cage is not in the dark;
It exists right in the light.
In rooms filled with fragrance—
In a prison of perfumes—
In a space where loneliness is beautifully adorned. 

It is the illusion of safety—
A security without understanding.
A sense of protection born without maturity,
A structure built out of fear.
A desperate grip to go on living

Without truly understanding the truth.
It is not desire—
It is security born from vagueness.
It is not liberation—
And yet, in such a cage, we sleep with open eyes. 

Second Stanza: 

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు ఉయ్యాల॥

paMchasAyakuni pushpabANamAna yiMdAka
maMchamupai bavvaLiMchi mATalADadu
niMchina vAlugannula nidduraMTAnuMDitimi
vaMchina reppalaveMTa vaDisI gannIru        uyyAla 

Literal Meaning:

In this stanza, Annamacharya continues to deepen the portrayal of the restless soul, using metaphors that are both poignant and powerful. 

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక: - She is the very arrow of Manmatha — delicate, irresistible, and transient. But unlike the outwardly romantic imagery, here the "flower-arrow" is not a celebration of union, but an emblem of bondage to sensory charm. Annamayya flips the symbol — this isn't playful desire; it's the tool of nature’s snare. 

మంచముపై బవ్వళించి మాటలాడదు: She lies still, not speaking a word. The arrow that once flew with energy and intent now lies dormant, symbolizing the soul that, despite its yearning and emotional beauty, finds itself unable to find resolution. It speaks to a silence that comes from inner conflict or despair. The soul, though full of beauty, does not find the words to express its unrest. Instead, it remains in a passive state, caught in confusion and waiting for release. 

నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి: Her eyelids flutter as though sleep eludes her, though she seeks it. The fluttering eyelids are symbolic of an inner struggle — a soul that cannot sleep, that cannot rest. Despite the quietude and external comforts, she remains alert, unable to escape the confusion and turmoil within. This condition mirrors the inner restlessness faced by many who experience emotional turmoil, caught between the longing for peace and the inability to find it. 

వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు: this line explodes. When the eyelids slightly part — not fully open yet — a truth seeps in. That we have been asleep to life, ignorant of joy, playing in tamas. And when even a glimpse of that realization dawns — tears flood. It is not just sorrow. It is the cost of misused time. The weeping of awakening. 


Commentary: 

Annamacharya’s second stanza mirrors a core idea from the Gita (11.33): निमित्तमात्रं भव सव्यसाचिन् You are but the instrument.” The divine will is already in motion - but the soul must be refined to serve it. 

The woman in the poem, like Arjuna, is caught in desire and restlessness. Her tears and fluttering eyes aren’t weakness - they show an instrument not yet tuned. She is the arrow of Kāma, but still unaware of the purpose – to spread love and compassion. 

This inner turmoil is necessary. It prepares her to shed illusion, transcend longing, and align with a higher purpose. Just as Arjuna must rise above sorrow, the woman too must awaken. 

Thus, the stanza isn’t just about pain — it’s the beginning of transformation. A soul being readied to play its part in the divine symphony.


J. Krishnamurti once fell into a bottomless sorrow after the death of his brother Nitya. For about ten days, he was overwhelmed by uncontrollable weeping. But when he emerged from that grief, he said something remarkable: “I know how to weep — that is human. I know now, with greater certainty than ever before, that there is real beauty in life…” These words resonate deeply with the second stanza.


Third Stanza:

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ
ఉయ్యాల 

vennelala vEMkaTAdrivibhuni lEnavvulAna
nannu jUchiyainA jeli navvadAyanu
inniTAnu saMtasilli yI dEvadEvuni gUDi
mannanala yiMta lOna malasIni jeliya uyyAla 

Literal Meaning:

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన/ నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను: "
In the moonlight of Venkatadri, I stood —
a stranger, unnoticed, unacknowledged —
even as I gazed at Him, He gave me no smile in return."

ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి / మన్ననల యింత లోన మలసీని జెలియ 

“I know not the moment my heart turned to the Lord of Lords —
but my whole being swelled and throbbed with joy.”


Interpretation:

In this stanza, Annamacharya presents a powerful expression of spiritual transformation and ecstasy, marking the culmination of the internal journey. 

The first two lines are a reflection of doubtful existence. The speaker, symbolizing the soul, stands before the divine without expectation, in a state of humility and quiet longing. The moon light – a hazy feeling. Suggests a moment of spiritual confusion or solitude. Yet, even in this state, there is an underlying awareness and patience, with no demands or immediate responses from the divine. 

This waiting is a profound state of surrender, where the soul doesn't seek answers or immediate rewards. It is similar to the idea expressed by John Milton, “They also serve who only stand and wait.” The essence of this line is that waiting with devotion, even without visible action or external recognition, is itself an important act of spiritual service. 

In summary, the third stanza reflects the final realization in the journey of the soul, where waiting and surrender lead to a transformative union with the divine. It emphasizes that true devotion does not require outward action, but can be found in the stillness of the heart, filled with patience, surrender, and trust. Through this sacred silence, the soul experiences the ecstasy of divine union. 

x-x-The End-x-x

 

 

T-219. ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి

 అన్నమాచార్యులు

219. ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి

For English version Press Here 

ఉపోద్ఘాతము:

ఇది అన్నమాచార్యుల స్వగతం. ఆయన్నుంచి వచ్చిన కవిత్వం వ్యక్తిగత ఆకాంక్షలకు కానీ, సహజమగు సాంస్కృతిక పరంపరలకు (cultural conditioning) కానీ లోనవ్వదు. ఆయన భాషను కవిత్వం, భక్తి,, తత్త్వాలు కూడా తాకని ప్రదేశాలకు తీసుకెళ్ళారు - ఆయా అర్థాలూ, భాషలూ కరిగి సమ్మిళితమై పోయే ఆ మృదువైన, పట్టరాని అంచున నిలిపారు. ఆ అసమాన్య అనుభవాన్ని పట్టివుంచాలని కాదు; ఆ అనుభవంలోనిలబడి, అది మాట్లాడేదాకా తానే ఓ శ్రోతగా నిలిచి మనకు వినిపిస్తారు. 

దైవ కృప మన ఈ జీవితపు అభిప్రాయాలకు అతీతం. అందుకే అన్నమాచార్యులు మన స్థితిని, ప్రవర్తనను బేరీజు వేసుకోకుండా – ఈ యాత్రలోకి రావాలని మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ కవితలో వినేవారికి, చదవేవారికి ఒక అద్భుతమైన రూపాంతరము తమ కన్నుల ముందు ఆవిష్కరింపచేస్తారు. 

పల్లవి: కోరిక, అంతఃకలహాలకు సూచిక​. 

మొదటి చరణం: సమస్య - మాయలో చిక్కుకోవడం, ఇంద్రియసుఖాలలో స్థిరపడిపోవడం. 

రెండవ చరణం: పరివర్తనకు నాంది – పరమాత్ముని కృపతో ఆత్మ ప్రశాంతతకు, కోర్కెలు దాటి వెళ్ళడానికి సిద్ధమవటం. 

మూడవ చరణం: భావనలో  సత్యము, స్పష్టత కానవచ్చుట​. పరమానందము పొందుట​. 

ఈ కీర్తన​ చూస్తూనే అర్థం కాకపోవచ్చు. కానీ అంత అస్పష్టమూ కాదు. చాలా నిజమైనది. విలువైనది. మనం మనస్సుతో చూడలేని దృక్పథాన్ని అందుకోగలిగితే ఇంకా సులభమౌతుంది. ఇదే అన్నమాచార్యుల గొప్పతనము. భాషలో నిప్పును రగిలిస్తారు. మన హృదయములో నిలిచి కనిపింపచేస్తారు.

కీర్తన సంగ్రహ భావము:


పల్లవి: "ఈ జనన మరణాల ఊయలలో మనల్ని ఊచుతూనే ఉంటారు.
కనులు మూసుకుని విశ్రాంతి పొందదామన్నా, అవే మరెక్కడో తెరుచుకుంటాయి." 

మొదటి చరణం: ఇక్కడ చందముఖి అని సంభోధించి -సున్నిత​త్వానికి, కాంతికి ప్రతీకగా చూపారు. ఆమె అంతులేని నిరీక్షణలో ఉంది. ఎదురు చూపులలో - నిద్ర వుండదు. విశ్రాంతి కలుగదు. ఏమిచేసినా ఆత్మకు శాంతి లభించదు. నిశ్శబ్దంగా ఎదురు చూస్తూనే ఉంది — చీకటి తొలగి వెలుగు రావాలని. "ఏమి సేతమే?" చుట్టూ సుగంధ వాతావరణం, చందనపుటిల్లు, పరిమళభరిత గదులు ఉన్నా — ఆమెకు నిద్ర లేదు. మెలకువ లేదు. ఎందుకంటే ఆ బాహ్యంగా ఎన్ని సౌకర్యాలు వున్నా మనసులో తృప్తిలేకుంటే శాంతి లేదు. ఆ  మెలకువ అయోమయం. అది స్పష్టత లేని కలకలం. అది అంతర్గత శాంతి కోసం జరిగిన యమ యాతన. 

రెండవ చరణం: ఆమె మన్మథుని పుష్పబాణమే — సున్నితమైనది, ఆకర్షణీయమైనది, కానీ అచిరమైనది. అయితే ఇక్కడ ఈ "పుష్పబాణం" అనేది ప్రేమకు చిహ్నం కాదు; అది ఇంద్రియల మాయలో బందీ. అన్నమయ్య ఈ చిహ్నాన్ని తిప్పి చూపిస్తున్నారు - ఇది కేవలం కోరిక కాదు, ప్రకృతి వేసిన వలలో పడ్డామనటానికి సంకేతం. ఆమె మంచంపై నిశ్చలంగా పడుకొని, మాటలాడదు. ఆ బాణం ప్రయాణించ గలిగి కూడా ఇప్పుడు అచేతనము. అందంతోనూ నిండినప్పటికీ, అది సంకెళ్లలో చిక్కుకొని, మాటలే లేని స్థితిలో ఉండిపోతుంది. మదిలో వెలుగు లేక తికమక పడే మౌనం. ఆత్మలోని కలవరమును చెప్పజాలని భావము. భావముల కందని భాష​. రెప్పలు నిద్రకు ఒరుగుతున్నాయి - నిద్ర రాకున్నా, నిద్రించాలనే తపన. ఈ రెప్పల కదలికలు లోపలి తపనకు సంకేతం. మౌనములోనే అంతర్యుద్ధం. ప్రశాంతత లేని నిర్లిప్తత. - నిద్రపోవాలనుకుంటోంది. శాంతి కావానుకుంటోంది. కానీ తత్తఱపాటు నుండి తప్పించుకోలేకపోతోంది. ఈ పాదం ఒక్కసారిగా ఒక విస్ఫోటంలా విచ్చుకొంటుంది. రెప్పలు కాస్త తెరచిన వేళ - పూర్తిగా కన్ను తెరిచీతెరవక మునుపే -సత్యం లోపలికి ఇంకిపోతుంది. జీవితం పట్ల మనం తమో గుణములో ఉన్నామన్న నిజం, ఆనందానికి బదులు పట్ల మౌఢ్యంలో మునిగిపోయామన్న బాధ స్పష్టమవుతుంది. ఆ మెలకువకే ఆ కన్నీళ్లు. అది కేవలం దుఃఖం కాదు. అది పోగొట్టుకున్న సమయానికి చెల్లించాల్సిన మూల్యం. అది మెలకువ తీసుకొచ్చే రోదన. 

 

మూడవ చరణం: వెన్నెల పరచుకున్న వేంకటాద్రి మీద నేను నిలిచినప్పటికీ —
అతడి దృష్టిలో నేను పరాయిదాన్ని.
నన్ను చూసినా, ఆ శ్రీముఖంలో ఒక్క చిరునవ్వు లేదు.
(అదే నిశ్శబ్దత, అది నిరసనయో — ఓ మౌన బంధమో ఎవరికి తెలుసు?) 
నిజం చెప్పాలంటే, ఎప్పటి నుంచి
నా హృదయం మారిపోయిందో నాకు తెలియదు —
అతడి మన్ననలతో ఇంతలోనే అనిర్వచనానందం. 

 

శృంగార కీర్తన

రేకు: 30-6 సంపుటము: 5-172

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును  ॥పల్లవి॥
 
చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును    ॥ఉయ్యాల॥
 
పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు       ॥ఉయ్యాల॥ 

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ ॥ఉయ్యాల॥ 

 

Details and explanations:

ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును     ॥పల్లవి॥ 

భావము:

"ఈ జనన మరణాల ఊయలలో మనల్ని ఊచుతూనే ఉంటారు.
కనులు మూసుకుని విశ్రాంతి పొందదామన్నా, అవే మరెక్కడో తెరుచుకుంటాయి." 

వ్యాఖ్యానము మరియు పోలికలు: 

మొదటి భాగం: అంతరిక్షపు ఊయల 

ఆత్మ ఒక శాశ్వతమైన ఊయలలో చిక్కుకొని ఉంది - ఇది సుఖానుభవం కాదు, శాంతి లేని అనియంత్రిత కదలిక. 

విశ్రాంతి దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది — కానీ దరి చేరదు. 

నిద్ర (మరణం) వస్తుంది - కానీ అది ప్రశాంతత కాదు, ఒక తాత్కాలిక విరామం మాత్రమే. కళ్ళు మూసుకున్నా- ఆ నిశ్చలత లేదు. అవి మరొక జన్మలో, మరొక లోకంలో తెరుచుకుంటాయి. 

భగవద్గీత 4-18లో చెప్పినట్టు — మనం 'నిష్క్రియ'గా భావించే క్షణాలూ - ఈ యాత్రలో భాగమే. కార్యముకాదు అనిపించే స్థితీ, మరో క్రియాపథానికి ద్వారమే. అందుకే - ఊయల ఆగదు. శాశ్వతంగా ఆటమటించుతూనే వుంటాం. 


రెండవ భాగం:

ఇప్పుడు ఈ పల్లవిని సాల్వడోర్ డాలీ వేసిన నిద్ర (స్లీప్) (1937)తో పోల్చి చూద్దాం.



డాలీ చిత్రించిన ఈ భయముగొల్పు సర్రియలిస్ట్ (అధివాస్తవిక) చిత్రంలో, గాలిలో తేలియాడుతున్నట్టుగా ఉన్న, ముడతలు పడిన, ఒదిగిపోతున్న తలను కర్రల వూతములు పెట్టి నిలబెట్టినట్లు మనం చూస్తాం - అది విశ్రాంతికి సంకేతం కాదు - అస్థిరతకి, బలహీనతకి సంకేతం.

ఊయ్యాల​, డాలీ వేసిన ప్రాపులు — రెండూ మన అస్థిర స్థితిని తెలుపుతున్నాయిగానీ, నిశ్చలతని చూపుటలేదు.

ఒదిగిన ముఖం - మన ఆత్మ నిద్రలో ఉందని భావించినా, అది వాస్తవానికి శాంతి కాదు.

పల్లవిలో రెప్పలు మూసుకుంటే మళ్ళీ తెరుచుకుపోతాయి అన్నారు; అలాగే డాలీ బొమ్మలో అక్కడ చూపిన ఆ ఆకారం కర్రలు గాలికి వూగినా, పడిపోయినా నిద్ర చెడి లేచి తిరిగి ఆ స్థితిలోనే పడుకునే ప్రయత్నాన్ని సూచిస్తుంది- ప్రశాంతత కానరాదు.

రెంటిలోనూ చూపిన నిద్ర అనేది విశ్రాంతి కాదు. నిశ్చలత వెనుక చలనమే దాగి ఉంది.

అన్నమాచార్యులు వేదనతో వర్ణించిన ప్రపంచ మనే ఊయ్యాలో ఊగుతూ ఉన్న మన స్థితికి డాలీ వేసిన నిద్ర అద్భుత దృశ్య రూపకం.

(ప్రపంచమనే ఊయ్యాల: ప్రముఖ ఆంగ్ల రచయిత, తత్వవేత్త అలాన్ విల్సన్ వాట్స్ ఇలా అన్నారు. "మనము ఎక్కడినుంచో ఈ ప్రపంచంలోకి "వచ్చి పడలేదు"; మనము ఒక చెట్టు నుండి ఆకులు వలె బయటకు వస్తాము. సముద్రం నుంచి "అలలు" వచ్చినట్లుగా, విశ్వము నుండి "మనుషులు" వస్తున్నారు.)


మొదటి చరణం:

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును       ॥ఉయ్యాల॥ 

భావము:

చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా / యెందును నిద్రలేదేమి సేతమే: ఇక్కడ చందముఖి అని సంభోధించి -సున్నిత​త్వానికి, కాంతికి ప్రతీకగా చూపారు. ఆమె అంతులేని నిరీక్షణలో ఉంది. ఎదురు చూపులలో - నిద్ర వుండదు. విశ్రాంతి కలుగదు. ఏమిచేసినా ఆత్మకు శాంతి లభించదు. నిశ్శబ్దంగా ఎదురు చూస్తూనే ఉంది — చీకటి తొలగి వెలుగు రావాలని. "ఏమి సేతమే?" - చెరసాల అధికారి తలుపు తీసిన కదా బందీ బయటకు వచ్చేది. ఇక్కడ "ఏమి సేతమే" ఒక విలక్షణమైన ప్రయోగము. విశ్వమంత భావాన్ని చూపారు. బందీ ఏమీ చేయకూడదని భావము. ఏమీ చేయకుండా వుండడమే మానవుని సమస్య​. 

గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన / యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును: చుట్టూ సుగంధ వాతావరణం, చందనపుటిల్లు, పరిమళభరిత గదులు ఉన్నా — ఆమెకు నిద్ర లేదు. మెలకువ లేదు. ఎందుకంటే ఆ బాహ్యంగా ఎన్ని సౌకర్యాలు వున్నా మనసులో తృప్తిలేకుంటే శాంతి లేదు. ఆ  మెలకువ అయోమయం. అది స్పష్టత లేని కలకలం. అది అంతర్గత శాంతి కోసం జరిగిన యమ యాతన. 


వ్యాఖ్యానము మరియు పోలికలు: 

భగవద్గీత 2-28లో శ్రీకృష్ణుడు అర్జునునితో "జీవులు మధ్యలో కలిగిన వ్యక్త సంసారము పుట్టుకకు పూర్వము, మరణమునకు పిమ్మట అవ్యక్తము అని గ్రహించ లేక పోవుట వలన దుఃఖమునకు లోనౌతున్నా" రంటాడు. అన్నమాచార్యుల చందముఖి — తాత్కాలిక ప్రపంచపు ఆకర్షణలలో చిక్కుకుని, వాటిని శాశ్వతంగా భావిస్తూ మానసిక కలవరపడుతుంది. మనిషి నిజ జీవితంలో ఇవే​ - తాత్కాలికమైన భావాలే శాశ్వతమైనవి అనుకొని ఆశలలో చిక్కుకుంటాడు. ఆమె మెలకువ కూడా, మన మనస్సుల వలెనే - స్పష్టత లేని కలతతో నిండి ఉంటుంది.


ఇప్పుడు ఈ స్థితిని రినే మాగ్రిట్ చిత్రించిన " కోరుకున్న బందిఖానా (ఎలెక్టివ్ అఫినిటీస్)" అనే చిత్రంతో పోల్చి చూద్దాం:  చిత్రంలో - ఒక గుడ్డును పంజరంలో పెట్టినట్లు చూపారు. అది బహుళార్థాల గర్భం. గుడ్డు అనేది పక్షిగా మారే సంభావ్యతకు చిహ్నం - విముక్తికి సూచన. కానీ అది పరిణామము చెందు అవకాశము లేని స్థితిలో చిక్కివుంది. మన మనసులకు మాయని మసి - కసి.  తోందర​. ఇప్పుడే అన్నీ అయిపోవాలి.

 


భద్రతా పంజరం 

ఇది కోరికల పంజరం కాదు.
ఇది మనమే కల్పించుకున్న భద్రత.
అర్థం లేని భయాలనుంచి — తెలియని శక్తులనుంచి —
ప్రస్తుత స్థితి ఇక కొనసాగాలి అన్న ఆకాంక్షనుంచి.
 
ఈ పంజరం చీకటిలో కాదు;
ఇది వెలుగులోనే ఉంది.
ఇది సుగంధాల గదిలో — పరిమళాల పంజరంలో —
ఒంటరితనాన్ని అందంగా అలంకరించిన స్థలంలో.
 
ఇది భద్రత అనే మాయ —
అర్థం లేని భద్రత.
పరిపక్వత లేకుండా ఏర్పడిన రక్షణ భావం.
భయంతో ఏర్పడిన నిర్మాణం.
సత్యాన్ని అర్థం చేసుకోకుండా
బతికిపోవాలన్న గట్టి పట్టుదల.
 
అది కోరిక కాదు —
అది అస్పష్టతలోంచి పుట్టిన భద్రత.
అది విముక్తి కాదు —
ఇలాగే ఉండిపోవాలన్న భయం. 

 రెండవ చరణం:

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు    ॥ఉయ్యాల॥ 

పంచసాయకుని పుష్పబాణమాన = మనధుని పుష్పబాణము వంటి


 భావము:

చరణంలో అన్నమాచార్యులు — ఆత్మ యొక్క అశాంత స్థితిని మరింత లోతుగా, శక్తివంతంగా, హృదయాన్ని తాకే ఉపమానాల ద్వారా చిత్రిస్తున్నారు. 

పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక: ఆమె మన్మథుని పుష్పబాణమే — సున్నితమైనది, ఆకర్షణీయమైనది, కానీ అచిరమైనది. అయితే ఇక్కడ ఈ "పుష్పబాణం" అనేది ప్రేమకు చిహ్నం కాదు; అది ఇంద్రియల మాయలో బందీ. అన్నమయ్య ఈ చిహ్నాన్ని తిప్పి చూపిస్తున్నారు - ఇది కేవలం కోరిక కాదు, ప్రకృతి వేసిన వలలో పడ్డామనటానికి సంకేతం. 

మంచముపై బవ్వళించి మాటలాడదు: ఆమె మంచంపై నిశ్చలంగా పడుకొని, మాటలాడదు. ఆ బాణం ప్రయాణించ గలిగి కూడా ఇప్పుడు అచేతనము. అందంతోనూ నిండినప్పటికీ, అది సంకెళ్లలో చిక్కుకొని, మాటలే లేని స్థితిలో ఉండిపోతుంది. మదిలో వెలుగు లేక తికమక పడే మౌనం. ఆత్మలోని కలవరమును చెప్పజాలని భావము. భావముల కందని భాష​. 

నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి: రెప్పలు నిద్రకు ఒరుగుతున్నాయి - నిద్ర రాకున్నా, నిద్రించాలనే తపన. ఈ రెప్పల కదలికలు లోపలి తపనకు సంకేతం. మౌనములోనే అంతర్యుద్ధం. ప్రశాంతత లేని నిర్లిప్తత. నిద్రపోవాలనుకుంటోంది. శాంతి కావానుకుంటోంది. కానీ తత్తఱపాటు నుండి తప్పించుకోలేకపోతోంది. 

వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు: ఈ పాదం ఒక్కసారిగా ఒక విస్ఫోటంలా విచ్చుకొంటుంది. రెప్పలు కాస్త తెరచిన వేళ - పూర్తిగా కన్ను తెరిచీతెరవక మునుపే -సత్యం లోపలికి ఇంకిపోతుంది. జీవితం పట్ల మనం తమో గుణములో ఉన్నామన్న నిజం, ఆనందానికి బదులు పట్ల మౌఢ్యంలో మునిగిపోయామన్న బాధ స్పష్టమవుతుంది. ఆ మెలకువకే ఆ కన్నీళ్లు. అది కేవలం దుఃఖం కాదు. అది పోగొట్టుకున్న సమయానికి చెల్లించాల్సిన మూల్యం. అది మెలకువ తీసుకొచ్చే రోదన. ​


వ్యాఖ్యానము మరియు పోలికలు: 

ఈ పద్యం గీతా శ్లోకం 11.33 ("నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్")తో సారూప్యాన్ని కలిగి ఉంది. ప్రకృతి-ధర్మం ముందే నడుస్తోంది - కానీ ఆ తత్వానికి సేవచేసేందుకు ఆత్మ సిద్ధమవ్వాలి. 

చరణంలో ఉన్న యువతి - అర్జునుడిలాగే - కోరికలతో, కలవరంతో చిక్కుకుపోయినవారికి ప్రతిరూపం. ఆమె రెప్పల తళతళలు, కన్నీళ్లు — వీటిని బలహీనతగా చూడకూడదు. ఆమె మేళము చేయని, శృతి పరచని సంగీత వాద్యం. ఆమె మన్మథబాణమైనా — ప్రేమకు, దయకు నీడనిచ్చే సాధనాన్నని తెలుసుకోలేని చెరలో బందీగా ఉంది. 

ఇంత మనో వ్యథ, కలవరము లేకుండా ఆమె మాయలోంచి బయట పడలేదు. కోరికలను దాటి, ఓ మహత్తర ప్రయోజనం దిశగా అమెను నడిపిస్తుంది. అర్జునుడు తన దుఃఖాన్ని అధిగమించినట్టు, ఆమె కూడా తన స్థితిని తెలుసుకొని మేలుకొవల్సిందే. 

కాబట్టి, చరణం దుఃఖాన్ని కాదు - మార్పుకు ఆరంభాన్ని వ్యక్తం చేస్తుంది. అది ఒక ఆత్మ పరమ సత్యాన్ని సేవించేందుకు సిద్ధమవుతున్న ఘడియ.


జిడ్డు కృష్ణమూర్తి తన సోదరుడు నిత్య మరణించినప్పుడు అపారమైన దుఃఖంలో మునిగిపోతాడు. దాదాపు పది రోజులపాటు అదుపు తప్పిన కన్నీళ్లలోనే గడుపుతాడు. ఆ బాధనుంచి బయటపడిన తర్వాత ఆయన పలికిన మాటలు విచిత్రంగా, కానీ లోతుగా అనిపిస్తాయి — “నాకు ఏడవడం తెలుసు, అది మానవుల చిహ్నం. ఇప్పుడు నాకు మరింత స్పష్టంగా తెలిసింది — జీవితంలో నిజమైన అందం ఉందని, నిజమైన ఆనందం ఉన్నదని...” ఈ మాటలు అన్నమాచార్యుల రెండవ చరణానికి బాగా నప్పేలా అనిపిస్తాయి.​


మూడవ చరణం:

వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ       ॥ఉయ్యాల॥ 

 భావము: 

వెన్నెలల వేంకటాద్రి విభుని లేనవ్వులాన /
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను:

వెన్నెల పరచుకున్న వేంకటాద్రి మీద నేను నిలిచినప్పటికీ —
అతడి దృష్టిలో నేను పరాయిదాన్ని.
నన్ను చూసినా, ఆ శ్రీముఖంలో ఒక్క చిరునవ్వు లేదు.
(అదే నిశ్శబ్దత, అది నిరసనయో — ఓ మౌన బంధమో ఎవరికి తెలుసు?)
 
ఇన్నిటాను సంతసిల్లి ఈ దేవదేవుని గూడి ।
మన్ననల యింత లోన మలసీని జెలియ: 
నిజం చెప్పాలంటే, ఎప్పటి నుంచి
నా హృదయం మారిపోయిందో నాకు తెలియదు —
అతడి మన్ననలతో ఇంతలోనే అనిర్వచనానందం.
అది మాత్రమే అంతులేని ఆనందం..

వ్యాఖ్యానము: 

ఈ చరణంలో అన్నమాచార్యులు ఒక అద్భుతమైన ఆత్మీయ పరివర్తనను, అలౌకిక పరవశాన్ని వ్యక్తీకరిస్తారు - అంతర్గత యాత్రకు ఇది సమాప్తి బిందువు. 

మొదటి రెండు పంక్తులు:
ఒక సందిగ్ధమైన ఆత్మస్థితిని ప్రతిబింబిస్తాయి.
ఆత్మకు ప్రతినిధిగా ఉన్న కవి,
పరమాత్మ ముందుండి,
ఆశలేమీ లేక, వినయంగా, మౌనమైన తాపంతో నిలుస్తాడు. 

వెన్నెల - అది స్పష్టతను కాదు, ఒక మసక వెలుగును సూచిస్తుంది.
ఆ వెలుగు మనస్సు గందరగోళాన్ని, ఒంటరితనాన్ని సూచిస్తుంది.
అయినా ఆ మసకలోనూ ఒక తత్వ బోధ, ఓర్పు కనిపిస్తుంది.
దైవం నుంచి స్పందన రాకపోయినా, ఎదురు చూసే ఆత్మలో నిరీక్షణకు ఒక విశ్వాసముంటుంది. 

ఈ నిరీక్షణ సామాన్యమైనది కాదు. ఇది పరమార్పణ స్థితి. ప్రశ్నలు లేవు. ప్రతిఫలాల కోరిక లేదు. ఏమౌతుందో తెలియదు. 

మిల్టన్ చెప్పినట్టు —
అతని వెంబడి మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే. -జాన్ మిల్టన్  (
“They also serve who only stand and wait.”)

దీని సారాంశం ఏమిటంటే — క్రియలతో కాక, సమర్పణతో నిండిన మౌనతలోనూ భక్తి తళుకుతుంది. 

చివరి పాదాలు:
ఆత్మయాత్రలో తుది స్థితిని సూచిస్తాయి — ఎదురు చూసే సహనంతో ఆత్మ పరమాత్మతో ఏకత్వాన్ని పొందుతుంది. ఇది తెలియజేసేది- భక్తి అనేది వెలుపల కనిపించే కార్యాలు అవసరం లేని ఒక అంతర్లీన స్థితి అని. మనస్సు నిశ్చలమై, సమర్పణతో, విశ్వాసంతో నిండినప్పుడు — అదే నిజమైన ఆరాధన. 

ఆ మౌనమే సాధన. ఆత్మ తన వ్యక్తిత్వాన్ని విడిచిన చోటే, దైవికమైన ఆనుభవంతో నిండిపోతుంది..

-X-X- సమాప్తం -X-X-

238 alamElumaMga nIvanniTA noraparivi (అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి)

  ANNAMACHARYULU 238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి alamElumaMga nIvanniTA noraparivi తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. Introduction ...