Sunday, 25 May 2025

224. tolliyunu ma~r~rAku toTTelane (తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె)

 ANNAMACHARYULU

224. తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె

tolliyunu ma~r~rAku toTTelane 

తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి.

 

Introduction:

I’ve said this before, and I say it again — Annamacharya wrote only what he directly saw. This keerthana speaks of the origin of the universe, the unfolding of consciousness itself.

One may wonder,

“How could a 15th-century poet describe a creation that happened eons ago?”

Because what he saw was not in time. Such a vision can arise only when one transcends time itself. That’s why calling this composition mystical, matchless, one-of-a-kind is no exaggeration — it is simply accurate.


As the Bhagavad Gita tells us, the world we see is built from the five elements — matter shaped into form. Science confirms this too: whether in our solar system or distant stars, matter remains the same.
This brings both a quiet awe and a subtle disillusionment — as if, even across the galaxies, nothing is truly new.

In such a dead, uniform material cosmos, the spark of consciousness stands out as a deep mystery. Man searches the universe for signs of the divine — a trace, a footprint, a whisper.
But this search remains forever unfinished.


In this keerthana, Annamacharya reflects again and again on a piercing question:

Why does God continue the play of creation using worthless material vessels — the cradles of the world?

In asking this, he exposes the human flaw of judgement — of assigning value and worth to things based on ignorance. He gently shakes that illusion.


Within cosmic consciousness, countless processes are ever unfolding — across dimensions, through endless phases. Yet man stands blind to this flow. That blindness is his bondage.

But Annamacharya?
He had stepped beyond that veil. He saw. He sang.

This is not a lullaby.

This is a hymn to the

One who rocks the cradle of the cosmos itself. 

 

అధ్యాత్మ కీర్తన​

నిడురేకు: 4-1 సంపుటము: 4-532

Copper Leaf: 4-1 Volume: 4-532

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు    ॥పల్లవి॥
 
కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు            ॥తొల్లి॥
 
అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు ॥తొల్లి॥
 
వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు    ॥తొల్లి॥
tolliyunu ma~r~rAku toTTelane yUge gana
chellubaDi nUgIni SrIraMgaSiSuvu pallavi
 
kaliki kAvEri taragala bAhulatalanE
talagakiTu raMgamadhyapu toTTela
palumArudanunUchi pADagAnUgIni
chilupAla selavitO SrI raMga SiSuvu            tolli
 
adivo kamalajuni tiruvArAdhanaMbanaga
adana gamalabhavAMDamanutoTTela
udadhulu taraMgamulanUchagA mAgIni
chedarani sirulatODa SrI raMgaSiSuvu       tolli

 

vEdamule chErulai velayaMga SEshuDE
pAdukonu toTTelai paragagAnu
SrI dEvitOgUDi SrI vEMkaTESuDai
sEda dEreDi vADe SrI raMgaSiSuvu           tolli

 

 

Details and Explanation: 

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు ॥పల్లవి॥

tolliyunu ma~r~rAku toTTelane yUge gana
chellubaDi nUgIni SrIraMgaSiSuvu     pallavi 

First stanza:

కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు       ॥తొల్లి॥
 
kaliki kAvEri taragala bAhulatalanE
talagakiTu raMgamadhyapu toTTela
palumArudanunUchi pADagAnUgIni
chilupAla selavitO SrI raMga SiSuvu   tolli

From the very beginning —
In a cradle of banyan leaves —
The Sri Ranga Child (శ్రీరంగశిశువు)
Has been swaying ever so gently
In the silent swing of day and night,
Enchanting the world with his presence.

That divine grace —
Flowing like the sacred Kaveri —
Spreads its arms and embraces the world.
Yet He —
Untouched by action,

Rests motionless in the Sri Ranga of the heart,
Merely witnessing all.

Across countless ages —
It is we who sway, caught in the illusions of our own making —
And in that restless swing,
We imagine Him to be in motion.

But He, with the gentle smile
Fragrant like milk at the corner of His lips,
Watches the world in serene stillness.
Creation itself becomes the lullaby —
Singing to Him in the quiet language of love.


Second Stanza:

అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు       ॥తొల్లి॥

adivo kamalajuni tiruvArAdhanaMbanaga
adana gamalabhavAMDamanutoTTela
udadhulu taraMgamulanUchagA mAgIni
chedarani sirulatODa SrI raMgaSiSuvu         tolli 

 

అదన = అవకాశం, a chance;  కమలజ= brahma; గమలభవాండమను= great celestial bodies, milky ways; గమలభవాండమనుతొట్టెల = in the matters of the vast creation;  ఉదధులు = oceans; తరంగములనూఁచఁగా = rocked by the great waves; మాఁగీని = పరిపక్వస్థితికి తీసుకొని వెళ్లు, to bring up maturity;


Lo, the lotus-born Brahma — at the hallowed turning of seasons known as Tiruvārādhana,
Cradled the vast celestial spheres as if they were mere swings,
And gently ushered in the first note of creation’s lullaby.

The expansive skies, the galactic orbs,
The shoreless oceans —
All turned into a tender cradle for the Child Divine.

In the soft rocking of the ocean’s waves,
In the quiet shadow of time maturing,
The Sri Ranga Child
(శ్రీరంగశిశువు), with undiminished radiance
And unbroken stillness,
Rests in sweet repose, in the lap of endless creation
.


3rd Stanza:

వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు ॥తొల్లి॥
 
vEdamule chErulai velayaMga SEshuDE
pAdukonu toTTelai paragagAnu
SrI dEvitOgUDi SrI vEMkaTESuDai
sEda dEreDi vADe SrI raMgaSiSuvu    tolli

 


While the Vedas gently bestowed head rest,
And Adishesha became the humble bed on which He reclined,
In that vast cosmic scene, a divine union occurred —
of  Lord with Sridevi.
The Sri Ranga Child (శ్రీరంగశిశువు),
Filled with peace and unwavering stillness,
At the heart of the cosmic drama.

 

Explanation: “శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై” is indicative of Annamacharya becoming one with the God Venkateswara.



 

T-224. తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె

 తాళ్లపాక అన్నమాచార్యులు

224. తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె

For English version press here 

ఉపోద్ఘాతము 

అన్నమాచార్యులు ప్రత్యక్షముగా చూచినది మాత్రమే వ్రాశారు అని మీకు అనేక సార్లు విన్నవించుకొన్నాను.  ఈ కీర్తన విశ్వసృష్టి,  చైతన్యం యొక్క ఆవిర్భావము గురించి. "ఎప్పుడో జరిగిన సృష్టి గురించి పదిహేనవ శతాబ్దపు అన్నమాచార్యులు ఎలా చెప్పగలరు?" అన్న ప్రశ్న ఉదయించాలి. అనగా ఆచార్యుల వారు కాలాతీత స్థితిని చేరుకొన్నారని భావించ వచ్చును. కాబట్టి ఈ కీర్తన  అలౌకికము అసమాన్యము అద్వితీయము అపూర్వము  అనుట అతిశయోక్తి కాదు. కానేరదు.


భగవద్గీతలో చెప్పినట్లు పంచభౌతికములతో వ్యక్తమైన నిర్మాణం  కనబడు ప్రపంచం.  సూర్యమండలంలోనే కాక నక్షత్ర మండలములలో కూడా ద్రవ్యం ఒకే మాదిరి ఉండుట గమనించిన కొంత ఆశ్చర్యం కొంత నిరాశ కలుగుతుంది (అక్కడికి వెళ్ళినా క్రొత్తదిలేదే అని).  చైతన్యం లేని ద్రవ్యం విశ్వమంతటా వ్యాపించింది.   చైతన్యవంతమైన ఈ సృష్టి మూలమును కనుగొనుట మనిషికి ఒక సవాలుగా మారుతుంది. మానవుడు తన ప్రజ్ఞతో విశ్వాంతరాళాలలో  దేవుని కోసం, అతడి జాడల కోసం గాలిస్తూనే వుంటాడు.   కానీ ఈ దేవులాట అసంపూర్ణముగానే ఉంది. ఉంటుంది.


అన్నమాచార్యులు ఈ కీర్తనలో  దైవం ఎందుకు పనికిరాని ద్రవ్యమునుండి (తొట్టెల నుండి) సృష్టిని కొనసాగిస్తున్న విషయం పలుమార్లు ప్రస్తావించి మానవుల భావనలో కొన్నిటికి ఎక్కువ విలువ కొన్నింటికి తక్కువ విలువ ఆపాదించు గుణమును తూలనాడిరి.


విశ్వచైతన్యంలో సమస్త ప్రక్రియలు అనేక దిశలలో అనేక దశలలో నిత్యము  జరుగుతూనే ఉంటాయి. దానిని గమనించలేని అసహాయ స్థితి మానవునిది.  అన్నమాచార్యులవారు అటువంటి మానవాతీత స్థితిని చేరుకుని వ్రాసిన కీర్తన ఇది. ఉయ్యాలా పాట కాదు. జగమనే ఊయలను ఊగించు మహాత్ముని కీర్తన ఇది. 

 

అధ్యాత్మ కీర్తన

నిడురేకు: 4-1 సంపుటము: 4-532

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు      ॥పల్లవి॥
 
కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు  ॥తొల్లి॥
 
అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు   ॥తొల్లి॥
 
వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు      ॥తొల్లి॥

 

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁ గన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు ॥పల్లవి॥

భావము:

అనాదిగా — మనం తక్కువగా భావించే మఱ్రాకు తొట్టెల వంటి వాటిలోనే
ఆ పరబ్రహ్మము — శ్రీరంగశిశువు —
తాను ఆడుకుంటున్నట్టు, ఊగుతున్నట్టు అనిపిస్తాడు.
అతడు ఊగడంలేదు — మనమే -
మన మాయా విలువలతో, మన ఊహలతో ఊగిపోతూ,

ఆ నిశ్చల పరబ్రహ్మను సాపేక్షంగా ఊగుతున్నట్టుగా చూస్తున్నాం.
ఆయన మాత్రం — శుద్ధమైన చిరునవ్వుతో,
అలంకారాల ప్రత్యయం లేకుండా,
అలౌకికమైన చైతన్యంతో,
మన కళ్లముందే నిశ్చలంగా కదలాడుతూ ఉన్నాడు. 

1st Stanza: 

కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగకిటు రంగమధ్యపు తొట్టెల
పలుమారుఁదనునూఁచి పాడఁగానూఁగీని
చిలుపాల సెలవితో శ్రీ రంగ శిశువు       ॥తొల్లి॥ 

కలికి = Charming, lovely, pretty; తలగ కిటుTagalakau= not touched; రంగ = place of action; చిలుపాల = little milk ;సెలవితో =at corner of the mouth;


భావము:

ఆది నుంచీ —
మఱ్రాకు తొట్టెలలో —
ఆ శ్రీరంగశిశువు
దివారాత్రుల నిశ్శబ్ద ఊయలలో
మృదువుగా ఊగిపోతూ అలరిస్తున్నాడు.
 
ఆ దైవకృప
కావేరి వలె ప్రవహించే చేతులై విస్తరించి,
ప్రపంచాన్ని హత్తుకుంటోంది.
కానీ ఆయనే —
క్రియలతో స్పృశింపబడకుండా,
హృదయంలోని శ్రీరంగంగా  నిశ్చలంగా తిలకిస్తున్నాడు.
 
యుగయుగాలుగా —
మన ఊహల ఊగిసలాటలో మనమే ఊగుతూ —
ఆ నిశ్చల సత్యాన్ని
కదులుతున్నట్టు మనమే ఊహించుకుంటున్నాం.
 
అతడు మాత్రం —
పాలసుగంధంతో నిండిన చిన్న చిరునవ్వుతో,
ప్రపంచాన్ని ప్రశాంతంగా పరికిస్తున్నాడు.
సృష్టి స్వరలయమే ఊయల పాటగా మారి —
ప్రేమభాషలో ఆయనకు లాలించే పాట పాడుతోంది.

2nd Stanza

అదివొ కమలజుని తిరువారాధనంబనఁగ
అదనఁ గమలభవాండమనుతొట్టెల
ఉదధులు తరంగములనూఁచఁగా మాఁగీని
చెదరని సిరులతోడ శ్రీ రంగశిశువు       ॥తొల్లి॥

 

అదన = అవకాశం కమలజ= brahma; గమలభవాండమను= great celestial bodies, milkyways; గమలభవాండమనుతొట్టెల = in the matters of the vast creation;  ఉదధులు = oceans; తరంగములనూఁచఁగా = rocked by the great waves; మాఁగీని = పరిపక్వస్థితికి తీసుకొని వెళ్లు;


భావము:

అదిగో బ్రహ్మ — తిరువారాధనమని పిలవబడే ఆ ఋతుసంధికి, గమల భవాండములను తొట్టెలవలె మలచుకొని, సృష్టి పాటకు తొలి స్వరం ముద్రింపజేశాడు. ఆ విస్తారమైన గగనతలాలు, బ్రహ్మాండ గోళాలు, అవధులులేని సముద్రాలు — ఆ శిశువు కోసం మృదువైన ఊయలగా మారిపోయాయి. సముద్రతరంగాల స్నిగ్ధ ఊడకలో, కాలపు నిశ్శబ్ద ఛాయలో పరిపక్వతను పొందుతూ — శ్రీరంగ శిశువు తగ్గని తేజంతో, చెదరని శాంతితో, అనంత సృష్టి ఒడిలో లాలనగా విశ్రాంతి చెంది ఉన్నాడు.


3rd Stanza

వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై
సేద దేరెడి వాఁడె శ్రీ రంగశిశువు ॥తొల్లి॥ 

వేదములు తలగడలాగా మెత్తని అనువు కలిగించగా,
అదిశేషుడు ఒప్పిన తొట్టెల పడకగా విరాజించగా,
ఆ అపార బ్రహ్మాండ దృశ్యంలో —
ఒక మౌనమైన యోగసంధానం జరిగినది —
శ్రీదేవితో పరమాత్ముని ఐక్యం.
శాంతితో, స్థిరతతో నిండిన
శ్రీరంగశిశువు —
ఈ సృష్టినాటక హృదయంలో విశ్రమించియున్నాడు.

 

వివరణము: “శ్రీ దేవితోఁగూడి శ్రీ వేంకటేశుఁడై” అన్నది అన్నమాచార్యుల వారు దైవంతో ఐక్యమైన సంగతి తెలుపుచున్నది.


 

Saturday, 24 May 2025

223. venna chEtabaTTi nEyi vedakinaTTu (వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు)

 ANNAMACHARYULU

223. వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు

venna chEtabaTTi nEyi vedakinaTTu 

తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి.

 

Introduction:

Annamacharya composed countless keertanas, each exploring truth from a unique angle — yet no matter the direction,

what shines through is the same undivided Brahman.
In this keertana, he shows us — almost like holding up a mirror — that all our physical efforts to reach the Divine are ultimately futile.
Once that truth sinks in, what remains?
Not struggle, but stillness.
Not doing, but being.

To rest, unmoved, in inner silence — that, he says, is the highest path.
 

 

అధ్యాత్మ కీర్తన​

రేకు: 321-1 సంపుటము: 4-118

Copper Leaf: 321-1 Volume: 4-118

వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను ॥పల్లవి॥
 
కన్నులు మిన్నులు దాఁకీ కాయ మీడ వున్నఁగానే
తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల
యిన్నిటి కొడయఁడవై యిందిరేశ నీవు నాలో
నున్నరూపు గానలేను వూహించి ఇపుడు ॥వెన్న॥
 
కాయము పాయము గీరీ కాల మీడ నుండఁగానే
ఆయపు మనసు ముంచీ నన్నిటియందు
యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము
పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో ॥వెన్న॥
 
ఇహమే పరము గోరీ యీడ నిట్టె వుండఁగాను
మహిలో శ్రీవేంకటేశ మహిమెట్టిదో
అహరహమును నీ వంతర్యామివై
సహజమై యుండఁ గంటి చాలు నిఁక నాకు ॥వెన్న॥
venna chEtabaTTi nEyi vedakinaTTu
yennaga nIvuMDagAnu yekkaDO chUchEnu pallavi
 
kannulu minnulu dAkI kAya mIDa vunnagAnE
tinnani vInulu meTTI dikkulanella
yinniTi koDayaDavai yiMdirESa nIvu nAlO
nunnarUpu gAnalEnu vUhiMchi ipuDu venna
 
kAyamu pAyamu gIrI kAla mIDa nuMDagAnE
Ayapu manasu muMchI nanniTiyaMdu
yEyeDa nAlOnunna yISvara nI nilayamu
pAyakuMDa gOralEnu pAyamu nAkeTTidO venna
 
ihamE paramu gOrI yIDa niTTe vuMDagAnu
mahilO SrIvEMkaTESa mahimeTTidO
aharahamunu nI vaMtaryAmivai
sahajamai yuMDa gaMTi chAlu nika nAku venna

 

Details and explanations:

వెన్న చేతఁబట్టి నేయి వెదకినట్టు
యెన్నఁగ నీవుండఁగాను యెక్కడో చూచేను ॥పల్లవి॥
 
venna chEtabaTTi nEyi vedakinaTTu
yennaga nIvuMDagAnu yekkaDO chUchEnu pallavi

 

Literal Meaning: Searching everywhere with a stick in the pot is pure folly,
Like trying to find ghee while holding butter in your hand is just confusion.
To obtain ghee, the butter must be gently warmed.
Likewise, to realize that You (Divine) dwell within me, It’s not outside, but requires the courage to look deep inside.
Without this courage, we remain lost and drenched on the endless paths of world.


This chorus (pallavi) can be meaningfully interpreted alongside The Human Condition, a surrealist painting by René Magritte. 


In the painting, a man appears to gaze through a window at a landscape of hills. But in front of the window, resting on an easel, stands a canvas — and strikingly, the image on the canvas mirrors the scene outside. It provokes an unsettling question: what are we truly seeing? The external landscape? Or merely the artist’s representation of it?
 

The mind, however, wants to believe both are the same — even though we have no certainty to justify that belief. The painting's insight reflects our own lives: the mind, quick to draw conclusions from limited sensory cues, mistakes appearances for truth. By relying solely on the external world as our scale and measure, we sideline the deeper capacity for inner seeing — the true consciousness within. 

Like Magritte’s painting, our awareness is caught in a quiet confusion: what is real, and what is constructed? Is the scene before us the world itself, or our mental projection of it? We attempt to grasp reality by sketching its outlines, modelling its forms, translating its patterns into logic or mathematics — hoping, somehow, to reach what we call “truth.” 

This very paradox echoes in Annamacharya’s pallavi:

"Like holding butter in hand and searching for ghee,
Though YOU are within me always, I keep looking for YOU elsewhere."
 

The realization that You are within hasn’t yet dawned. And so I search outside — absurdly, like one seeking ghee while already holding butter. Magritte’s canvas captures the same inward irony — the mind’s blind insistence on looking elsewhere. 

That painting — like our own inner canvas — is a projection born of the psyche. What we see, we ourselves have shaped.
We will return to this idea with deeper insight in the commentary on the third stanza.


First Stanza:

కన్నులు మిన్నులు దాఁకీ కాయ మీడ వున్నఁగానే
తిన్నని వీనులు మెట్టీ దిక్కులనెల్ల
యిన్నిటి కొడయఁడవై యిందిరేశ నీవు నాలో
నున్నరూపు గానలేను వూహించి ఇపుడు ॥వెన్న॥
 
kannulu minnulu dAkI kAya mIDa vunnagAnE
tinnani vInulu meTTI dikkulanella
yinniTi koDayaDavai yiMdirESa nIvu nAlO
nunnarUpu gAnalEnu vUhiMchi ipuDu          venna

 

Literal Meaning: I leave my body right here,
and send my eyes searching across the skies.
I strain my ears in every direction,
hoping to hear the sound of Your footsteps —
believing You must be somewhere far away.
But You are the master of these very senses.
And the truth — that You dwell within me —
is a depth even my imagination cannot reach.


Let us understand this verse by immersing in an immaculate art piece by MC Escher titled “Relativity”



In that painting, people appear climbing and descending stairs in every possible direction —each convinced they’re moving toward their destination.
A step down for one looks like a step up for another.
Some stairs tilt sideways, some spiral backwards, some hang upside down —
yet each figure, from their own angle, is certain their path is the right one.

Each person believes their truth, their effort, their direction —
seeking the divine in ways that feel natural to them.
But the silence in the painting says something else:
every path begins in the mind.
The steps we walk are only symbols of belief — not of truth.

This is precisely what Annamacharya reflects in his verse:
We extend all our senses outward in search of God —
yet fail to imagine the divine within.

Spend time with the image,
and the illusion becomes clear:
The search itself is the mirage.
There is nowhere to go.
That stillness — that unmoving truth —
is the heart of the verse.


Second Stanza:

కాయము పాయము గీరీ కాల మీడ నుండఁగానే
ఆయపు మనసు ముంచీ నన్నిటియందు
యేయెడ నాలోనున్న యీశ్వర నీ నిలయము
పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో ॥వెన్న॥
 
kAyamu pAyamu gIrI kAla mIDa nuMDagAnE
Ayapu manasu muMchI nanniTiyaMdu
yEyeDa nAlOnunna yISvara nI nilayamu
pAyakuMDa gOralEnu pAyamu nAkeTTidO  venna 

కాయము = body; పాయము = youth; గీరీ = arrogance; ఆయపు మనసు = a mind that accumulates; ముంచీ నన్నిటియందు = makes me dip in all sorts of activities; యేయెడ = where; పాయకుండఁ గోరలేను పాయము నాకెట్టిదో = I cannot seek you without leaving these things = (implied meaning) = I want to have these material comforts  and those bliss of being with you. 

Literal Meaning: My life today — filled with the pride of body, youth, and ego — keeps drowning me in endless activity.
In such a state, how can I recognize you, who dwell within me?
Without letting go of all this, it’s impossible to truly seek you.
And yet… I still wish to find you without giving any of it up!


Third Stanza: 

ఇహమే పరము గోరీ యీడ నిట్టె వుండఁగాను
మహిలో శ్రీవేంకటేశ మహిమెట్టిదో
అహరహమును నీ వంతర్యామివై
సహజమై యుండఁ గంటి చాలు నిఁక నాకు ॥వెన్న॥
 
ihamE paramu gOrI yIDa niTTe vuMDagAnu
mahilO SrIvEMkaTESa mahimeTTidO
aharahamunu nI vaMtaryAmivai
sahajamai yuMDa gaMTi chAlu nika nAku     venna 

Literal Meaning: Though I live in this world —
there isn’t the slightest distance between me and my longing for you.
Still... I remain like this, doing nothing at all.
I may not fully grasp the greatness of your majesty, O Venkatesha…
But one truth has become clear to me —
You dwell within everything, always — naturally, effortlessly, as the indwelling presence.
That truth alone is enough...


Explanation:

On René Magritte’s The Human Condition: A Parallel (also referred in Chorus).

René Magritte’s painting The Human Condition, with its image of a canvas partially covering a window, speaks to the inner workings of our mind — the images we construct and take to be reality.

The scene painted on the canvas blends seamlessly with the landscape outside the window. As viewers, we cannot distinguish what is real and what is merely a reflection. Though the idea may not be entirely new, its impact on the mind is profound — because it confronts the reality we have manufactured for ourselves.

In this painting, the canvas becomes a metaphor for the imagery painted upon the surface of the mind.

Wanting to remove it, replace it, or erase it — all these are just different ways of distorting truth.


One who fully understands this — to borrow Annamacharya’s words —
" yIDa niTTe vuMDagAnu" —
remains as he is, without agitation, without delusion, accepting even his inner limitations without resistance. That is the supreme state of being.

In such a state, the mental canvas gradually fades away.
The seen image and the truth behind it become one.
And in that moment, what remains is a pure experience:
of the divine — present in everything, at all times — effortlessly, silently, immanently.

In that state, the mind harbours no desires.
The truth alone suffices.
That is the heart of Annamacharya.



 

238 alamElumaMga nIvanniTA noraparivi (అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి)

  ANNAMACHARYULU 238 అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి alamElumaMga nIvanniTA noraparivi తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. Introduction ...