ANNAMACHARYA
34. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది.
Introduction: In
this highly popular and landmark verse, Peda Tirumalaacharya declared being in
meditation as the ultimate goal of human existence. Main obstacle is man's ever
comfort seeking disposition. He has explained vividly, how we fall to our
senses at the cost of endeavour everyone is supposed to undertake in their
journey of life.
He describes,
how conveniently, we ignore, step aside with imperceptible degradation in our
own lives. Unfortunately, we realise after the complete degeneration.
Somewhere,
an iota of doubt actually exists. Tiny issues are influencing and diverting
interest in the ultimate.
Have
you ever wondered why the attraction in finding god pales against consuming
food and engagement with senses?
Man
cannot show evidence of having experienced the GOD. Thus, man cannot derive
gain physically, psychologically or financially from this adventure. Thus ever
profit or comfort seeking point of view, this search is utterly useless.
The
engagements with senses actually show up their reaction immediately. How can a
man without any evidence, put in time on imperceptible work?
What is
the force that attracts the man towards liberation, yet dissuades him from pursuing
it further?
I feel
this verse was written with considerations similar to the above.
ఉపోద్ఘాతము: చాలా ప్రసిద్ధి చెందిన ఈ కీర్తనలో సంపూర్ణ
ఆత్మ సమర్పణ మానవ జీవితానికి పరమావధిగా వర్ణించారు. అయితే ఎప్పటికప్పుడు సుఖం కోరుకునే
అతని భావనలే జీవిత లక్ష్యానికి అడ్డుగా నిలుస్తాయని
వివరించి చెప్పారు.
ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాలను కూడా అత్యంత సులభంగా
పక్కన పెట్టి అగ్రాహ్యమైన కారణాలతో నెమ్మది నెమ్మదిగా తనకు తెలియకుండానే మనిషి
అధోగతి పాలవుతాడు అని చెప్తున్నారు.
మనిషిలో ఎక్కడో అపనమ్మకం, దేవుని పొందాలనే వాంఛలను చిన్న
చిన్న విషయాలు ప్రభావితం చేస్తూ అడ్డుపడుతున్నాయి. మనిషికి ఆహారంపై, ఇంద్రియ సుఖాలపై
ఉన్న ఆకర్షణ భగవంతుని పొందడంపై లేదా?
భగవంతుని పొందడంపై మనిషి ఎవరికీ సాక్ష్యం చూపలేడు. కాబట్టి, మనిషికి దాని
నుంచి ఏ విధమైన భౌతిక మానసిక, ఆర్థిక ప్రయోజనం కలగదు. ఇలాంటి వ్యర్థమైన విషయాల్లో,
అన్నింటి నుండి ఏదో ఒక లాభం లేకుండా చేయని సాధారణ మానవుడు ఎందుకు చిక్కుకుంటాడు!!
ఇంద్రియ సుఖాలు వెనువెంటనే ప్రతిక్రియ చూపుతాయి. అవి అనుభవనీయమైవి, వాస్తవమైనవి. అనుభవించగలిగినదాన్ని వదిలిపెట్టి, అనుభవము లోనికి
రాని భగవంతుని పట్ల నిజానికి సాక్ష్యం లేకుండా,
మనిషి నమ్మకం ఉంచగలడా? వీటిలో ఏది ముందు?
వీటిని మనసులో ఉంచుకుని ఈ కీర్తన వింటే, పెద్ద తిరుమలాచార్యులు, ఎంత నిశితంగా పరిశీలించి వ్రాసినదీ తెలుస్తుంది.
ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
ekkaDi mAnushajanmaM bettina phalamE munnadi
Word to Word meaning: ఎక్కడి (ekkaDi) = where మానుష (mAnusha) = human జన్మంబు (janmaMbu) = birth ఎత్తిన (ettina) = take up ఫలమే మున్నది (phalamE munnadi?) use, value, purpose; నిక్కము (nikkamu) = truly నిన్నే(nine) = you only నమ్మితి (nammiti) = believed; నీ (nI) = your; చిత్తంబు (chittaMbu) = disposition, the seat of feeling, the heart; the will, wish, inclination; ఇకనూ (ikanU) = hereafter, henceforth, in future;
Literal meaning: No purpose served for being human, without truly believing and submitting one's will at God's disposal.
Implied meaning: Man with complete conviction should leave his will to the GOD.
భావము: మనిషిగా జన్మమెత్తిన దానికి మించి ఇంకేమి ఫలము కావాలి? నా సర్వస్వం నీకే అర్పించాను. ఆపై నీ యిష్టం.
విశేష భావము: భగవంతుని మీద పూర్తి నమ్మకంతో, మనిషి అన్నీ వదిలి నిరీక్షించాలి అని గూఢార్థము.
మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
ma~ravanu AhAraMbunu ma~ravanu
saMsArasukhamu
ma~ravanu yiMdriyabhOgamu mAdhava
nI mAyA
ma~racheda suj~nAnaMbunu
ma~racheda tatvarahasyamu
ma~racheda nuruvunu daivamu mAdhava nI mAyA ॥ekkaDi॥
Word to Word meaning: మఱవను (ma~ravanu) don't forget; ఆహారంబును (AhAraMbunu) = food; మఱవను (ma~ravanu) = don't forget; సంసార సుఖము (saMsArasukhamu) = pleasures of life మఱవను (ma~ravanu) = don't forget యింద్రియ (yiMdriya) = senses; భోగము (bhOgamu) = enjoyment; మాధవ (mAdhava) = God; నీ (nI) = your; మాయ (mAyA) = created illusion; మఱచెద (ma~racheda) = will forget; సుఙ్ణానంబును (suj~nAnaMbunu) = good knowledge; మఱచెద (ma~racheda) = will forget; తత్త్వ రహస్యము (tatvarahasyamu) = philosophical secrets; మఱచెద (ma~racheda) = will forget గురువును (guruvunu) = teacher; దైవము (daivamu) = god; మాధవ (mAdhava) = God; నీ (nI) = your; మాయ (mAyA) = created illusion.
Literal meaning: Oh! God!! The spell you cast makes me overlook (hard learnt) philosophy, teachers, good learning. Yet I don't forgo tasty food, worldly pleasures and engagement with senses.
భావము: ఓ దేవా! నీ మాయ ఏమో కానీ కష్టపడి నేర్చుకున్న తత్వ రహస్యాలను, సుజ్ఞానమును, గురువులను మరచిపోయినట్టుగా ఆహారాన్ని, సుఖాలని, ఇంద్రియ భోగములను మరువనే!
విడువనుఁ బాపము పుణ్యము
విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు
విష్ణుఁడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు
విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుఁడ
నీ మాయా ॥ఎక్కడి॥
viDuvanu bApamu puNyamu viDuvanu
nA durguNamulu
viDuvanu mikkili yAsalu vishNuDa
nI mAyA
viDicheda shaTkarmaMbulu
viDicheda vairAgyaMbunu
viDicheda nAchAraMbunu vishNuDa nI mAyA ॥ekkaDi॥
Word to Word meaning: విడువను (viDuvanu) = do not let go; పాపము (pApamu) = sin; పుణ్యము (puNyamu) = virtue; విడువను (viDuvanu) = do not let go; నా దుర్గుణములు (nA durguNamulu) wrong obsessions; విడువను (viDuvanu) = do not let go; మిక్కిలి (mikkili) = many ఆసలు (yAsalu) = wants; విష్ణుడ (vishNuDa) = God; నీమాయ (nI mAyA) = illusion created you; విడిచెద (viDicheda) = let go షట్కర్మంబులు (shaTkarmaMbulu) = six good deeds/habits ( = యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహములు, performing sacrifice (yagna), make others do yagna, study of scriptures, make others read & listen to the scriptures, do donation, accept donation); విడిచెద (viDicheda) = let go; వైరాగ్యంబును (vairAgyaMbunu) = asceticism; విడిచెద (viDicheda) = let go; ఆచారంబును (AchAraMbunu) = good practices; విష్ణుడ (vishNuDa) = God; నీమాయ (nI mAyA) = illusion created you.
Literal meaning: Sir, under the spell of illusion, I keep holding my firm views on sin and virtue. Neither I let slip my wrong obsessions nor curtail my wants. Yet, I am ready to relinquish long practiced aceticism, six good habits.
భావము: సాధన చేసి సంపాదించిన షట్కర్మంబులు, వైరాగ్యం, ఆచారాలు ఎంతో తొందరగా విడిచిపెట్టినట్టు, ఆశలను, దుర్గుణాలను, పాపం పుణ్య మీమాంసలను విడిచిపెట్టలేనే?
తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
tagileda bahulaMpaTamula tagileda bahubaMdhaMbula
Word to Word meaning: తగిలెద (tagileda) = Get hooked to; బహు (bahu) = many; లంపటముల (laMpaTamula) = lustful pleasures; తగిలెద (tagileda) = Get hooked to; బహు (bahu) = manty; బహుబంధంబుల (baMdhaMbula ) = bondages; తగులను (tagulanu) = never Get hooked to; మోక్షపుమార్గము (mOkshapumArgamu) = liberation path; తలపున (talapuna) = in my thoughts యెంతైనా (yeMtainA) = even iota of time; అగపడి (agapaDi) = that can be seen; శ్రీ వేంకటేశ్వర (SrI vEMkaTESvara) = God, lord of seven hills; అంతర్యామివై (aMtaryAmivai) = the one who's inside; నగి నగి always smiling; నను ( nanu) = me; నీవు ( nIvu) = you ఏలితి (Eliti) = ruling నాకా (nAkA) = to me; యీమాయ (yI mAyA) = these illusions.
Literal meaning: I always get hooked to lustful pleasures and bondages. Yet, my thoughts even for iota of time, never got hooked to the path liberation. I know you are there and omnipresent. We get into the trap deep illusion created by you and must be laughing at my ignorance.
Comments: It would not be out of context to quote a native story of Seven Fish. It states that even king’s work gets derailed by insignificant reasons.
A king had seven children. All of them go to a pond and fetch seven fish. They were kept for drying. Next day, they find all but one did not dry up. The prince sought the reason for not drying up from the fish.
The fish answered "the shadow from the (pile of) hay prevented me from drying up"
Prince asked (rice) hay why it hindered drying of the fish. Hay replied: "the cow did not consume me."
The prince demanded explanation from Cow. Cow said "the I was tied; the servant did not release me from the peg"
Servant said, "My mother did not give food. I was waiting".
Mother said “my little son was crying all the while. Did not get time to prepare food"
Little son said "I was crying due bite from an ant.”
Ant said: “I have to bite anyone who messes up with my beautiful abode"
Thus even kings’ work can be prevented by a tiny ant.
భావము: అనేక లంపటాలలో, భావం బంధాలలో ఇరుక్కున్నట్లు, మోక్షము మార్గములో ఎందుకు తగులుకోనో!! నువ్వు కళ్ళముందే ఉన్నా, అంతర్యామివై యున్నావని తెలిసినా, నీ మాయలకు తగులుకొన్న నా అజ్ఞానమునకు నీకు నవ్వొస్తుందేమో!!
వ్యాఖ్యలు :
మనందరికీ తెలిసిన ఏడు చేపల కథ క్రింద ఇస్తున్నాను.
ఈ కధలో నీతి ఏమిటంటే, రాజుగారి పని కూడా చీమ కుట్టడం లాంటి చిన్న చితకా కారణాలతో ఆగిపోతుంది. ఇంకా భగవంతుని విషయంలో ఏకాగ్రచిత్తంతో మననము చేయడం ఇలాంటి కారణాలతో ఆగిపోకూడదు.
అనగనగా ఒక రాజు గారున్నారు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వారు ఒకనాడు వేటకు వెళ్ళారు. ఏడు చేపలుతెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు.
చేపా ! చేపా ఎందుకెండలేదంటే, గడ్డిమోపు అడ్డమొచ్చిందని చెప్పింది.
గడ్డిమోపా ! గడ్డిమోపా !ఎందుకడ్డమొచ్చావంటే, ఆవు నన్ను మేయలేదంటుంది.
ఆవు ! ఆవు !
ఎందుకు మేయలేదంటే, పాలేరు మేపలేదంటుంది.
పాలేరా ! పాలేరా ! ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలేదంటాడు.
అవ్వా ! అవ్వా ! ఎందుకు బువ్వ పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నా
డంటుంది.
పిల్లవాడా ! పిల్లవాడా !
ఎందుకు ఏడుస్తున్నావంటే, చీమ కుట్టిందంటాడు.
చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటుంది.
zadaz
Reference:
Copper Leaf: 7-1, Volume: 15-38