తాళ్లపాక అన్నమాచార్యులు
1R అమ్మే దొకటియును అసిమలోని దొకటి
For
English Version Press Here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు
మన నిత్యజీవితంలో కనిపించే కపటాన్ని
తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఈ
కీర్తనలో ఆయన మన నిజాయితీని ప్రశ్నిస్తూ మన హృదయాన్ని ఈటెల వంటి మాటతో గుచ్చుతారు.
మన ఉద్దేశాలను ఎటువంటి ముసుగులు లేకుండా అంతఃపరిశీలన కోసం మన ముందే పరచి చూడమంటారు.
ఆత్మ పరిశీలనలేని మాటలేలా? అన్నదాన్ని ధ్వనింపచేస్తారు.
|
అధ్యాత్మ
సంకీర్తన
|
|
రాగి రేకు: 231-3 సంపుటము - సంకీర్తన: 3-176
|
|
అమ్మే దొకటియును అసిమలోని దొకటి ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా ॥పల్లవి॥ యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు ॥అమ్మే॥ పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము వడి నీ పరతంత్రభావము మాకేది నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ యెడయేది నిన్ను నుతిఇంచేఅందుకును ॥అమ్మే॥ తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి వెనక ముందెంచక నీవే కావవయ్యా ॥అమ్మే॥
|
Details
and Explanations:
పల్లవి:
అమ్మే దొకటియును
అసిమలోని దొకటి
ఇమ్ముల మాగుణములు
యెంచఁ జోటేదయ్యా ॥పల్లవి॥
భావము:
|
కీర్తన పాదము
|
సాధారణ భావము
|
అంతరార్థము
|
|
అమ్మేదొకటియు
|
ఏమి ఇస్తామని చూపిస్తామో / వాగ్దానం చేస్తామో అది ఒకటి
|
(మనం) బయటకు చూపించే రూపం
ఒకటి;
|
|
అసిమలోనిదొకటి
|
(అసిమ = గోణి,
సంచి) సంచి లోపల ఉన్నది మరొకటి
|
మా అంతరంగంలో నిజంగా ఉన్నది మరొకటి . మా హృదయంలో దాగి ఉన్న అసలు ఉద్దేశం, కోరిక, స్వభావం బయట చూపించేదానికి భిన్నంగా ఉంటాయి
|
|
ఇమ్ములమా గుణములు యెంచ
చోటేదయ్యా!
|
మా దుర్గుణాలను లెక్కించడానికి స్థలం ఎక్కడుందయ్యా?
|
మా కుటిలత్వాన్ని నీవు లెక్కించ లేవయ్యా
|
గూఢార్థవివరణము:
“అమ్మేదొకటియు”
అనేది అమ్మకానికి పెట్టిన వస్తువుగానే కాకుండా
మనం బయటకు చూపించేది, ఇస్తామని చెప్పేది, మన గురించి ఇతరులకు కనిపించే రూపం అని కూడా ఊహించ వచ్చును. మనిషికి
తనలో ఉన్నదే తాను పూర్తిగా తెలియకపోవచ్చును. అంటే మనది మనను కూడా పూర్తిగా
గుర్తించలేని స్థితి.
ఈ
విషయాన్నే తర్వాతి చరణములలో, మనం మన అంతరంగము తెలియకయే
భగవంతుని కింకరులమని (సేవకులమని) దాసులమని, హరిని
తప్ప వేరే ఎవరినీ తలచమని చెప్పుకొందుము. లంపటాలలో మునిగి శ్రీహరి ఊడిగానికి
పాల్పడమని విమర్శిస్తున్నారు. అన్నమాచార్యులు పెదవులపై మాటలకు అంతరంగపు ఊహలకు పొంతన
లేని వారమని చూపి, మానవుని చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారు.
మొదటి చరణం:
యెప్పుడు
నేము చూచిన నింద్రియకింకరులము
ఇప్పుడు
నీకింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకు
దాస్యము నేము సేసేము
చెప్పి నీదాసులమన
సిగ్గుగాదా మాకు ॥అమ్మే॥
భావము:
|
కీర్తన
|
సాధారణ అర్థము
|
|
యెప్పుడు నేము చూచిన
నింద్రియకింకరులము
|
ఎప్పుడూ చూసినా మేము ఇంద్రియాలకు దాసులమై ఉంటాము. మేము మా
జీవితం వాటికి వశమైపోయాయి.
|
|
ఇప్పుడు నీకింకరుల
మెట్టయ్యేమో
|
ఇప్పుడు మాత్రం మేము నీ కింకరులమని ఎట్లు చెప్పుకోగలము? (చెప్పుకోలేము) చెప్పుకున్నంత మాత్రమున నీ దాసులమై పోతామా?
|
|
తప్పక ధనమునకు దాస్యము నేము
సేసేము
|
ఎటువంటి మినహాయింపులు లేకుండా మేము మనస్పూర్తిగా ధనమునకు
దాస్యులము.
|
|
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా
మాకు
|
అయినా నీ దాసులమని
చెప్పుకోవడానికి మాకు సిగ్గు ఉంటుందా? మా మాటలకు, చేతలకు పొంతన ఉండదే?
|
గూఢార్థవివరణము:
“ఎప్పుడు” — మన జీవితంలో ఎల్లప్పుడూ.
“ఇప్పుడు” — నీ ముందుకొచ్చినప్పుడు.
“ఇప్పుడు” — నీ ముందుకొచ్చినప్పుడు.
జీవితమంతా
ఇంద్రియాలకు, ధనానికి దాసులమై ఉండి, నీ
ముందుకొచ్చినప్పుడు మాత్రం “నీ దాసులము” అంటాము.
ధనానికి
దాస్యము చేతల్లో కనిపిస్తుంది;
దైవానికి
దాస్యము మాటల్లోనే మిగులుతుంది.
అన్నమాచార్యులు ఈ
వైరుధ్యాన్నే మన ముందుంచుతున్నారు.
రెండవ చరణం:
పడఁతుల కెప్పుడును
పరతంత్రులము నేము
వడి నీ పరతంత్రభావము
మాకేది
నడుమ రుచులకే
నాలుక అమ్ముడువోయ
యెడయేది
నిన్ను నుతిఇంచేఅందుకును ॥అమ్మే॥
భావము:
|
కీర్తన
|
సాధారణ అర్థము
|
|
పడఁతుల కెప్పుడును
పరతంత్రులము నేము
|
స్త్రీల అడుగులకు మడుగులొత్తడనికి ఎప్పుడూ సిద్ధం మేము. వారి
వశంలో ఉండడం మాకిష్టం.
|
|
వడి నీ పరతంత్రభావము మాకేది
|
మరి నీ పట్ల ఆ పరతంత్ర భావము మాలో ఎక్కడుంటుంది? మాకు స్త్రీల పట్ల ఉన్న ఇష్టము, మమకారము, అపేక్ష, ఆసక్తి,
నీ పట్ల ఎక్కడా?
|
|
నడుమ రుచులకే నాలుక
అమ్ముడువోయ
|
మా నాలుక మాత్రం రుచులకు విక్రయించబడినది.
అమ్ముడుపోయింది. అదే పనిగా అది ఇంకా
ఇంకా రుచుల కోసం అతృతగా ఎదురుచూస్తోంది.
|
|
యెడయేది నిన్ను నుతించె
అందుకును
|
ఎదురుచూపుల మధ్య ఖాళి
ఉంటేగా నిన్ను నుతింయించె అందుకును!
|
గూఢార్థవివరణము:
మాకు
స్త్రీల పట్ల సహజంగా ఉండే ప్రేమ, కాంక్ష, కోరిక,
కుతూహలం, తగులుబాటు, జంఝాటము
నీ పట్ల ఎక్కడా? అంటే దానికి తగిన కారణముంది — కనబడే
వాటికి తగులుకుంటాము; కనబడని నీకెందుకు
తగులుకుంటామయ్యా!
“నడుమ రుచులకే” అన్నది గమనించదగినది. రుచులు పుట్టుకతో వచ్చినవి
కావు; నడుమ వచ్చి నాలుకను ఆక్రమించుకున్నవి. రుచులతో మనసు మమేకమై పోయింది. మరి నీతో
ఏకమేలాగౌతుంది మరి నీతో ఏకమేలాగౌతుంది
మాకు స్త్రీల పట్ల ముచ్చట
హెచ్చు;
మాకు దైవంతో ముచ్చట లెచ్చట.
రుచులకు
నాలుక అమ్ముడుపోబట్టి
నిన్ను
తలచే సమయమే లేకుండే, సామీ!
మూడవ చరణం:
తనువులంపటానకు
తగ మీఁదెత్తితిమిదె
వొనరి నీవూడిగాన
కొదిగేదెట్టు
ననిచి శ్రీవేంకటేశ
నాఁడే నీకు శరణంటి
వెనక ముందెంచక
నీవే కావవయ్యా ॥అమ్మే॥
భావము:
|
కీర్తన
|
సాధారణ అర్థము
|
|
తనువులంపటానకు తగ
మీఁదెత్తితిమిదె
|
మాకై మేమే ఎత్తుకున్న లంపటాలు అధికమై ఈ దేహమును తనువును
అలపింప చేసుకుంటున్నాం
|
|
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
|
మరి పొందికగా నీకు ఊడిగం చేయడానికి, మా ఈ
అలసిపోయిన శరీరం ఎలా నీ సేవలో ఒదిగి ఉండగలదు?
|
|
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు
శరణంటి
|
ననచు = చిగిరించు, వికసించు అయినా కవిలో ఆశ తగ్గలేదు. “శ్రీవేంకటేశా! ఆ కాలములోనే నీకు
శరణు” అని అన్నాను.
|
|
వెనక ముందెంచక నీవే కావవయ్యా
|
మా గతాన్ని, మా భవిష్యత్
ప్రవర్తనను గణించక , నీవే మమ్మల్ని కాపాడవయ్యా
|
గూఢార్థవివరణము:
ఈ
చరణంలో ప్రశ్న మరింత తీవ్రమవుతుంది.
అయ్యా వెంకటేశ్వర!
తనువు లంపటాలకు తొణకదు;
దైవ సేవకు మాత్రం అణగదు.
చివరిగా:
మేమింతే
నిజాయితీ లేమింతే
బతుకు అతకరాదంతే
కొండలంత అయ్యను కోరితే —
అతుకుల బొంతను తెలియుమంతే!
X-X-X THE
END X-X-X
No comments:
Post a Comment