Friday, 9 April 2021

37. కలలోని సుఖమే కలియుగమా (kalalOni sukhamE kaliyugamA)

 

ANNAMACHARYA

37. కలలోని సుఖమే కలియుగమా

 

Introduction: In this aptly worded verse, Annamacharya said the man lives by faking himself. He is goading people to remove the veil of hypocrisy in their lives. Man drifts and goes astray in pursuance of transient comforts and ignoring permanent ones. That's why man is addressed Kaliyuga to indicate he represents mischievous and fraudulent time. Annamacharya did not criticize some known rogue or villian, but common people like you and me.  

ఉపోద్ఘాతముఅన్నమాచార్యులు తపసిలా కాక తత్వవేత్తవలె తాను ప్రత్యక్షముగా చూచినది, అనుభవమునకు వచ్చినది మనకు కీర్తనల రూపములో చెప్పిరి. ఐతే వారు ఏ సిద్ధాంతమును కూడా ప్రతిపాదించలేదు. వారి భావవ్యక్తీకరణలో నిష్పాక్షికత ఆదర్శప్రాయమైనది.

వారు పరంపరను కొనసాగించుటకు కానీ, మనకు బోధనలను చేయుటకు కానీ కీర్తనలు వ్రాయలేదండి. వున్న విషయమును వున్నట్లుగా చెప్పుటకు సాహసించిరి.  ఆ ప్రయత్నములో వారు అంతవరకు వస్తున్న సంప్రదాయములను, పద్ధతులను విమర్శించుటకు వెనుకాడలేదు. వారి పరిశీలనలు, అనుశీలనలు నేటికీ అత్యంత ప్రయోజనకారులై  వుండుటను గమినించి ఈ వ్యాఖ్యానములను వ్రాయు ప్రయత్నము చేసితిని. అందుకే ఇక్కడ మనిషిని అతని పోకడలను సూచిస్తూ కలియుగమా అని సంబోదించారు

కలలోని సుఖమే కలియుగమా, వెన్న

కలిలో నెక్కడిదె కలియుగమా ॥పల్లవి॥

kalalOni sukhamE kaliyugamA - venna

kalilO nekkaDide kaliyugamA      pallavi

Word to word meaning:  కలలోని (kalalOni) = in dream; సుఖమే (sukhamE) =only comfort;  కలియుగమా (kaliyugamA) = the fourth age of the world (Oh Man!); వెన్న (venna) = butter; కలిలో (kalilO) =in Fermented rice water (rice beer), పులియబెట్టిన బియ్యపు కడుగు; నెక్కడిదె = ఎక్కడిదె (nekkaDide = ekkaDide) = where? కలియుగమా (kaliyugamA) = Oh Man?

Literal Meaning: Oh Man!! The real comforts are similar to the dreams, are short-lived.  How do you expect butter on fermented rice water?

Implied meaning: OH Man knowing well, why do you still anticipate comforts that truly not existing?

భావము: పులియబెట్టిన బియ్యపు కడుగులో వెన్న ఉంటుందా? సుఖాలు కలలలాగ క్షణిక మాత్రమే.

వివరణము: 

1.    క్షణికానందాలలో పడి, శాశ్వతమైన దాన్ని గుర్తించక ఎటో పోతుంటాడుఅందుకే ఇక్కడ మనిషిని అతని పోకడలను సూచిస్తూ కలియుగమా అని సంబోదించారు.

a.   వెధవ​, ఏబ్రాసి, అర్భకుడా, గాడిద వంటివి ఒక మనిషిని నిందించడానికి ఆక్షేపించడానికి వుపయోగిస్తాము.

b.    గాడిద​ కొడుకా అని ఒక కుటుంబమును తిట్టడానికి వాడతాము.

c.     అప్రాచ్యుడా (తూర్పునకు చెందనివాడా), అనార్యుడా అని సమూహమునుంచి వెలివేస్తాము, తెగలతో తెంపులు చేయుటను చూపుతాము..

d.    "కలియుగమా" ఒక తరమును కానీ, దేశమును కానీ కాక మొత్తము మానవులందరినీ సూచిస్తున్న ఒక భౌతిక, దేశ కాలముల సమ్మిళితమైన ఒక దానిని సూచిస్తున్నారు.

2.    అన్నమయ్య ఎవరో సినిమాలలో చూపించే  కరడుగట్టిన ప్రతినాయకుని లాంటి వారిని కాదు, మన లాంటి సామాన్యులనే ప్రత్యక్షంగా విమర్శించారు.

3.    మనిషిని కలియుగమా అని సంబోధించి  కొంటెతనము ప్రమాదము మరియు వంచన అంచులలో సమయాన్ని గడుపుతున్న   విషయాన్ని సూచిస్తున్నారు.

4.       మనము కల వంటి అస్పష్టమైన జీవితాన్ని గడుపుతామని సూచించారు. అటువంటి కలలో కూడా సుఖానుభవమే కోరుకుంటాం. కానీ సుఖాలు మనకై మనము నిర్మించుకున్న భవనములు అని క్షణము కూడా ఆలోచించము. 

5.    కలి యొక్క నిషాలో మనిషి సత్యమును వెదుకబోతాడు. "తా వలచినది రంభ​" అన్న నానుడి ఇక్కడ బాగా వర్తిస్తుందండి. కొందరికి "స్త్రీలు, మందు, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, దైవము" నిషా అవుతాయి. 

6.    మన  పోకడలను సూచిస్తూ Rafal Olbinsky గారు వేసిన చిత్రమును చూడండీ. ఇక్కడ ఒక బాలుడు నీటి గొట్టమును పట్టుకుని వుంటాడు. ఆ గొట్టమునుంచి వచ్చె నీటి ప్రవాహములో ఒక ఓడ ప్రయాణిస్తూ కనబడుతుంది. మనిషీ తన వూహలలలోనే విహరిస్తూ, అవ్వానిని నిజము చేయు ప్రయత్నములను వృధా ప్రయాస అనిరి. బాలుని బొమ్మతో మానసికముగా ఎదగని స్థితిని చూపారు. ఈ సందర్భముగ ఆచార్యుల వారి కీర్తన పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము గుర్తుకు తెచ్చుకుందాము.



విశేష  భావము:   జీవుడా!! తెలిసికూడా  ఆశ కొద్దీ లేని సుఖాలు కోరుకుంటావు ఎందుకో?

 

కడిగడి గండమై కాలము గడపేవు

కడుగఁగడుగ రొంపి కలియుగమా
బడలికె వాపవు సరమేదో చూపవు
గడిచీటియును నీవు కలియుగమా ॥కలలోని॥ 

kaDigaDi gaMDamai kAlamu gaDapEvu

kaDuga@MgaDuga roMpi kaliyugamA
baDalike vApavu saramEdO chUpavu
gaDichITiyunu nIvu kaliyugamA  kalalOni 

Word to word meaning:  (కడి = అన్నపుముద్ద, A lump of Food; గడి, = Limit, border) కడిగడి = అన్నపుముద్దే ఎల్లగా, సీమగా, పొలిమేరగా, A lump of Food as  limit, as boundary; గండమై (gaMDamai) = ప్రమాదమై, అపాయమై, becoming threat; కాలము (kAlamu) = time; గడపేవు (gaDapEvu) = to let go; కడుగఁగడుగ (kaDugagaDuga)_ = To wash, lave, cleanse repeatedly; రొంపి (roMpi) =  పంకము. అడుసు, బురద Mud, mire, kaliyugamA = Oh Man!!; బడలికె వాపవు (baDalike vApavu) = unable bear the hard work;  సరమేదో (saramEdO) = what is శ్వాసము, ముక్కుగాలి; చూపవు (chUpavu) = do not see, do not show; గడిచీటియును (gaDichITiyunu) = ఒక హద్దు పూర్తి యైనదని తెలిపెడి చీటీ; నీవు (nIvu) = you;  కలియుగమా = Oh Man!!

Literal Meaning: OH man!! You spend all your time in arranging food  security. But be assured the more you delve into these things, more mud you will find. Neither can you bear the hard work. Nor you understand/know how long the present breath going to last

Implied meaning: You are occupied in worrying about the next meal all the time; there is no point in going deeper into the engagement with senses, as they only lead to more dubious activities. All the conscious activities undertaken only tire you out. Know not how long you will be present in this world.

Comments: This perplexing man’s dilemma on food is as old as man.  Saint Poet Vemana said as below:

. కడుపు కెంత నరులు కళవళపడుదురు

కడుపుకొఱకు నూళ్ళు గహనములును
కడుపు కెట్ల యయినఁ గలుగును భుక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ.

Purport: Oh Learned Vema, Men waste their life in search for food so much that they go around the world, enter into impenetrable regions, not realising that somehow the need for food gets fulfilled.  

భావము: మానవుడా!! ముద్ద ముద్దకి మధ్య కాలాన్ని గండంలా గడుపుతూ బ్రతికేస్తావు. ఎంత త్రవ్వినా మురికే వస్తుంది. కష్టపడలేవు. ముక్కుగాలి హద్దును చూడవు.

విశేష  భావము:  మానవుడా!! ఒక భోజనము తరువాత ఇంకో భోజనం కోసము ఆరాటపడుతూ గడిపేస్తావు. ఎంత తరచి చూచినా మనిషి జీవితములో బురదే కాని వేరేమీ లేదు. నిన్ను నీవు తెలుసుకోడానికి కష్టపడలేవు. శ్వాస ఎంత కాలము ఉండేది చెప్పలేము.

వ్యాఖ్యలు మనిషిని అల్లలాడించే భొజన తాపత్రయము గురించి వేమన గారు ఇలా అన్నారు:మానవులు  కడుపు  ఎట్లైననూ నిండునని గ్రహింపక, ఒక్క ముద్ద అన్నము కోసము  ఊళ్ళన్నీ తిరుగుచూ దూరరాని కంతలలో దూరుచూ కళవళపడుతూ జీవితము వ్యర్ధము చేసుకొందురు.​ 

కరపేవు కఱతలే మఱపేవు మమతలే

కరకఱ విడువవు కలియుగమా
తెరచీర మఱఁగింతే తెరువేల మూసేవు
గరుసేల దాఁటేవో కలియుగమా    ॥కలలోని॥ 

karapEpu ka~ratalE ma~rapEvu mamatalE

ka~raka~ra viDuvavu kaliyugamA
terachIra ma~ragiMtE teruvEla mUsEvu
garunEla dATEvO kaliyugamA   kalalOni 

Word to word meaning:  కరపేవు (karapEpu) = చేసేవు; కఱతలే (ka~ratalE) = దుండగములే, చెడ్డ పనులే, (pure) Villainy or audacity; మఱపేవు (ma~rapEvu) = కపటవర్తనము కలిగియుండు, సంశయించు, deceitful ways; మమతలే (mamatalE) = The interest or affection entertained for objects, from considering them as belonging to;  కఱకఱలే (ka~raka~ra) = పళ్లునూరటంపళ్లుకొరకటంఒరయుట-తఱుఁగుట సూచించు ధ్వన్యనుకరణపదము, only grunting/munching sounds ; విడువవు  (viDuvavu) =- do not leave; కలియుగమా (kaliyugamA) = oh Man; తెరచీర (terachIra) = curtain; మఱఁగింతే  (ma~ragiMtE) = only because of nature of  hiding ; తెరువేల (teruvEla) = దారి ఏల, Why the way; మూసేవు (mUsEvu) = (you) close; గరుసేల దాటేవో (garunEla dATEvO) = మర్యాద ఎందుకు మీరేవో; why transgress etiquette; కలియుగమా (kaliyugamA)= Oh Man.

Literal Meaning: OH man!! Why do you engage in villainy? Deceive yourself in possessing. Do not stop grunting. The way (to liberation) is hidden only by a curtain. Why do you close your way and waste your time?

భావము: మానవుడా!! దుండగపు  పనులలో మునుగుతూ, మమతలలో భ్రమించుతూ, పళ్ళు నూరుతూ గడిపేస్తావు.  మర్యాద మీరుతూ, తెరవెనుక(ఉండే మోక్షమునకు) దారి మూసుకుంటూ వెళుతూ గుడ్డిగా  జీవితం సాగిస్తావు.

వ్యాఖ్యలు : కఱకఱలు అనగా పళ్లునూరటం అనుకుంటే తినడంలోనే మనిషి ధ్యాస ఉంచుతాడని చెప్పకయే చెప్పారు; కఱకఱలు అనగా పళ్లుకొరకటం అనుకుంటే తనను ఇతరులనూ నిందించు కోవడములోనే సమయము వృధా ఐపోతుంది అని అన్నారు.

కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు

కానీలే కానీలే కలియుగమా
పైనిదే వేంకటపతి దాసులుండఁగ
కానవా నీ విదేమి కలియుగమా॥కలలోని॥ 

kAnide mechchEvu kapaTAlE yichchEvu

kAnIlE kAnIlE kaliyugamA
painidE vEMkaTapati dAsuluMDaga
kAnavA nI vidEmi kaliyugamA       kalalOni

 

Word to word meaning:  కానిదె (kAnide) = what should not be;  మెచ్చేవు (mechchEvu) = praise, accept;  కపటాలే (kapaTAlE) = hoodwink, trickery;  యిచ్చేవు (yichchEvu) = provide in return; కానీలే కానీలే = kAnIlE kAnIlE కలియుగమా (kaliyugamA) = oh Man; పైనిదే (పైనిదే = పైన+ఇదే painidE = paina + idE) = above these ( indicating very close to you);  వేంకటపతి vEMkaTapati) = Lord Venkateswara; దాసులుండఁగ (dAsuluMDaga) = devotees are there;  కానవా (kAnavA) = can't you observe? నీ (nI) = you;  విదేమి (vidEmi) = why this way?,  కలియుగమా (kaliyugamA) = oh Man;

Literal meaning: You always approve and enjoy what you should not; you always hoodwink; Disregarding the true devotees here, why do you drift  and go astray?

Comments: After reading this stanza, I am reminded of the below quote by Boris Pasternak.

“The great majority of us are required to live a constant, systematic duplicity. Your health is bound to be affected by it if, day after day, you say the opposite of what you feel, you grovel before what you dislike and rejoice at what bring brings you nothing but misfortune.

Boris Pasternak in Dr Zhivago

భావము: మానవుడా!! మెచ్చరానిది మెచ్చి, కొరగాని కపటాలే  జీవితమని బతుకుతావు. కానీ, ఇక్కడి వేంకటేశుని దాసులను గుర్తించక ఎటో తిరుగుతావు.

వ్యాఖ్యలు: చరణం చదువుతుంటే బోరిస్ పాస్టర్నాక్ గారి క్రింది సూక్తి గుర్తుకొస్తుంది. మనలో చాలా మంది కపటమే జీవితమని గడుపుతారు.  రోజూ నువ్వనుకునే దానికి వ్యతిరేకమైనది పలుకుతూ, నీకు నచ్చని దానికి సాష్టాంగ పడుతూ,  (మూర్ఖంగా)  దురదృష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తూంటే, నీ ఆరోగ్యం సడలిపోదా?

 

zadaz

 

 

Reference: Copper Leaf: 19-6, Volume: 1-118

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...