ANNAMACHARYA
38. కడలుడిపి నీరాడగా తలచువారలకు
Introduction: This is yet another remarkable verse. Waiting for opportune time for of attaining liberation is of no use - says Annamacharya. He draws its parallel to a person waiting to take bath at the seashore for the waves to subside. He said, one should not drag himself into never ending questions like which is first the egg or chicken. Getting out of bonds gradually is not solution, it's like a person wants to gradually become vegetarian. He becomes vegetarian only when he actually stops taking non vegetarian food. You can notice that Annamacharya thrusts highly impregnable ideas using very simple words.
Series of experiences keep happening in life. He is asking us to find that instrument by we can take them head-on, yet not conceding to them. He gets into such depth, leaving us wonder, how such ideas could be told in such clarity with such simple words.
ఉపోద్ఘాతము: సరియైన సమయం కొరకు నిరీక్షిస్తున్న వారు ఎదురు చూడటంలోనే సమయం వృధా చేసుకుంటారని అన్నమయ్య హెచ్చరించారు. గుడ్డా? పిల్లా? ఏది ముందర అనే మీమాంసలో పడకుండా, దైవమును ఈ క్షణం నుంచే ఆశ్రయించమని ఉద్భోధ చేసారు. క్రమక్రమంగా బంధాలను విడిపించు కోవాలనుకోవడము ఎలావుంటుందంటే మెలమెల్లగా ఒక మాంసాహారి శాఖాహారి కావడంలా. పూర్తిగా మాంసాహారం మానివేసినపుడు కదా శాఖాహారి అయ్యేది. అప్పటి దాకా అతనిని మాంసాహారి అనే అనుకోవాలి కదా! తేలిక పదాలలో గృహ్యమైన భావములను స్పురింపజేయడం అన్నమాచార్యుల ప్రత్యేకత. బలమైన భావాలను అందమైన పదాలలో పొందుపరచిన ఈ కీర్తన అన్నమయ్య కిరీటంలో ఒక వజ్రము.
విషయ (భోగ) వాంఛలు ఎప్పటికప్పుడు ఉత్పన్నమౌతూనే ఉంటాయి. వాటికి తలొగ్గకుండా బయటపడడానికి వాటిని ముఖాముఖిగా యెదిరించడానికి ఉపయుక్తమైన సాధనమేదో అలోచించండి అంటున్నాడు అన్నమయ్య.
కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు
kaDaluDipi nIrADagA
dalachuvAralaku
Word to word meaning: కడలుడిపి (kaDaluDipi) =waiting for the sea waves to subside; నీరాడగా (nIrADagA) = to take bath; దలఁచువారలకు =తలచువారలకు (dalachuvAralaku) = such people; కడలేని (kaDalEni) =endless మనసునకు (manasunaku) = mind; కడమ (gaDama = kaDama ) =end; ఎక్కడిది (yekkaDidi) = where?
Literal meaning: Those waiting for
the thoughts to abate, to take up the path of liberation are like those waiting at
seashore for the waves to subside to take bath.
Comments: There will
never be a time labelled as opportune moment for liberation, as the thoughts
will continue to consume our mind always. This “waiting” is a misconception that enters
our mind uninvited. Please conside the
great saying by Nathaniel Hawthorne. “Let us remember Time flies over us, but leaves its
shadow behind”
భావము: సముద్రములో అలలు నిలిచిన తరువాత స్నానము చేయదలచు వారికిని, అంతేలేని కోరికలకు నెలవైన మనస్సు విమోచనకూ అవకాశం ఉంటుందా? (ఉండదు)
వ్యాఖ్యలు : పైన చెప్పిన విధముగా సరైన సమయము కొరకు నిరీక్షించుట కాలము వ్యర్ధము చేయుటయే. క్రింది పద్యము చూడండి
క. గడచిన క్షణమును వెనుకకు
భావము: ఒక్క క్షణము (వ్యర్థముగా) గడిచిపోయినను ఎన్ని ప్రయత్నములు చేసి అయినను దానిని తిరిగి వెనుకకు తీసుకొని రాలేము. అహో ఎంతటి ఆశ్చర్యకరమయిన విషయమిది! కావున కాలము వ్యర్థము చేయక కాలముతో పాటుగా మనము కూడా మెలకువతో అప్రమత్తముగా నడువవలెను.
దాహమణఁగినవెనుక
తత్వమెరిఁగెదనన్న
dAhamaNaginavenuka
tatvamerigedananna
Word to word meaning: దాహమణఁగిన (dAhamaNagina venuka) = after the thirst is quenched; (here, Annamacharya meant దాహము (dAhamu) = passion/lust); తత్వమెరిఁగెదనన్న(tatvamerigedananna) = will find out the philosophy behind it; దాహమేలణఁగు (dAhamElaNagu) = will the thirst ever be completely quenched? తా (tA) = Self; తత్వ మే మెరుఁగు (tatva mE merugu) = what philosophy will he espouse? దేహంబుగలయన్ని(dEhaMbugalayanni) = as along as the body exists; దినములకుఁ (dinamulaku) = all the days; బదార్ఢ- (badArDha = padArDha) = material; మోహమేలుడుగు (mOhamEluDugu) = దా =( తా, dA = tA) = Self; ముదమేల కలుగు (mudamEla kalugu) = why ecstasy will shine on this person?
Literal meaning: by surrendering to quench the thirst (passion), how a person can find philosophy behind it, hence cannot ascertain true cause. As long as the body exists, obviously due to its inherent nature, passion is inevitable. Therefore how can anyone get true happiness? ##
Comments: through this
stanza, Annamacharya has raised fundamental questions. Can a person enjoy the
material nature and yet get out of it. Plain answer is Can I have cake and eat it too. The very nature of wanting best of
both worlds may be termed as DUALITY.
Human
life is Not a transaction in which man agree to do something in return of
something. How can a man consciously lose passion on the body? The key is in
Bhagavad-Gita 2-45 shloka given below.
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन |
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् || 2-45||
trai-guṇya-viṣhayā
vedā nistrai-guṇyo bhavārjuna
nirdvandvo nitya-sattva-stho niryoga-kṣhema ātmavān
Purport: The Vedas deal
with the three modes of material nature, O Arjun. Rise above the three modes to
a state of pure spiritual consciousness. Freeing yourself from dualities,
eternally fixed in truth, and without concern for material gain and safety, be
situated in the self.
As along as one is concerned about the safety (of self, his interests), he is unlikely to be in Yoga. Thus Annamacharya indicated that one must leave the circle of safety to attain the eternal happiness (ecstasy).
Devotion to GOD should be like a hunter’s concentration while waiting for right moment to shoot, without consciousness of his body comfort.
భావము: లౌకిక భోగములపై కోరికలు నశించిన పిమ్మట పరతత్త్వస్వరూపమును తెలిసికొందునన్నచో కోరిక లెట్లు నశించును? కోరికలు నశింపక పరతత్త్వమును జీవుడెట్లెరుంగగలడు? వీటిలో ముందేది? శరీరముపై అభిమాన మున్నంత కాలము జీవులకు భౌతికవస్తువులపై ఆశ నశింపదు. ఆశ నశింపక ఆత్మానందము సిద్దింపదు. ఈ ఆశను అధిగమించుటకు ఉపయుక్తమైన సాధనమేదో? ##
వ్యాఖ్యలు : కోరికలు తీర్చుకొనుచూ కోరికలను అధిగమించడం అసాధ్యము. కోరికలకు మూల కారణమైన మనస్సు ఒక ప్రక్క కోరికలు తీర్చుకొనమనునూ; ఇంకో ప్రక్క కోరికలు వదలివేయుమనును. ఈ రెంటి మధ్య మనిషి నలిగిపొతాడు. వీనినే ద్వందములు అందురు. క్రింది భగవద్గీత శ్లోకమును చూడండి.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
భావము:
వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి. నువ్వా త్రిగుణాలకు (సంసార విషయాలకు) అతీతుడవై, ద్వంద్వ భావాలను విడిచి, యోగక్షేమాలను అపేక్షించక, నిరంతరము గుణశుద్ధసత్యాన్నే అవలంభించి, ఆత్మజ్ఞానివి కావాలి.
క్షేమము గురించి ఎప్పుడూ తలచుచుండే వానికి యోగి కావడము అసాధ్యము. అన్నమాచార్యులు రక్షణ వలయము (అను మోహము) నుంచి మనిషి బయటపడినప్పుడే ఆత్మానందము కలుగునని అన్నారు.
తన శరీర సుఖం చూసుకోకుండా, వేటగాడు ఎలాగైతే పూర్తి ఏకాగ్రతతో, వేట కోసం నిరీక్షిస్తుంటాడో, ఆ రకంగా దేవుని కోసం ఆరాట పడాలని అన్నమాచార్యులు సూచిస్తున్నారు. చంచలము మానితేను సంసారమే సుఖము అనే కీర్తనలో.
ముంద
రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్న
muMda rerigina
venuka modalu marachedananna
Word to word meaning: ముంద రెరిఁగిన (ముందర ఎరిఁగిన muMda rerigina)
= If known/shared beforehand; వెనుక (venuka) = afterwards; మొదలు (modalu) = the
beginning; మరచెదనన్న(marachedananna)
= promise to forget; ముంద రేమెరుఁగుఁ (ముందర ఏమెరుఁగుఁ muMda rEmerugu)
= what will you know; దా = ( తా, dA = tA) =
Self; మొదలేల మరచు (మొదలు ఏల మరచు modalEla
marachu) = why he will forget the beginning; అందముగఁ (aMdamuga) =
beautiful; దిరువేంకటాద్రీశు
(diruvEMkaTAdrISu = tiruvEMkaTAdrISu) = the lord of seven hills; మన్ననల (mannanala) =
benediction; కఁదువెరిఁగినమేలు (కఁదువ ఎరిఁగిన మేలు kaMduveriginamElu)
= జాడ/ ఆచూకి తెలిసిన సుకృతము, benefit of being
aware; కలనైన లేదు (kalanaina
lEdu) = Not possible to imagine even in dreams.
Literal meaning: Those who
claim that once they are granted liberation they promise to forget past (life).
What will they know? What will they ignore? There is no parallel to the benediction of
god.
Implied meaning: Don’t expect liberation
to be conferred. It may be attained by the person thru hard work. What value
can such person attach to such liberation? What will he cherish? (Is it a
material/mental gain for one to elate about it?). Will they ever know the wages
of benediction?
Commnets: Bhagavad-Gita already said that “uddhared
ātmanātmānaṁ” A man must elevate himself by his own mind, not degrade himself. Therefore
there is no question of anyone conferring liberation to any person. Every being
must by their immersed efforts should reach there.
Man may be
viewed as a house. Blessings of the lord are like wind always available. If the
windows of the house are kept open, wind
may flow inside. Mediation is the effort to keep the windows open. All other
actions are not.
Finally let us remember
the words of the great poet DHUURJATI. “one must find the path to the feet of lord
with great concentration while one is strong, not after losing all the
teeth, not when all the hair have turned white, not after unable to participate
in sensual activities”
భావము: ఇక ముందు భగవత్స్వరూపము నెరింగి ఆ పిమ్మటనే ఇంతదనుక
అనుభవములో నున్న సంసారసుఖమును విస్మరింతు నన్నచో, తాను భగవంతుని అటు మీదట ఎట్లెరుంగగలడు? అలవాటుపడిన సంసారమూలమైన ప్రకృతిని ఆ తరువాత నెట్లు మరువగలడు? కరుణానిధియగు శ్రీవేంకటేశ్వరుని క్షమాగుణ
స్వరూపమును గ్రహింపగల శ్రేయోదాయకమైన భక్తి కలలో గూడ జీవునకు లేదు. ఇక మాయామోహము నుండి విడివడి భగవత్స్వరూపము నెరుంగు యోగ్యత వాని కెక్కడిది?
వ్యాఖ్యలు : "నిన్ను నీవే తప్ప వేరెవరూ ఉద్దరించలేరు" అని భగవద్గీతలో చెప్పనే చెప్పారు. ఆనగా మనిషి ఇక్కడ చెప్పిన స్థితిని తనంట తానే చేరవలెను. “ముందర నువ్వు అది యివ్వు” అని అడిగితే, ఆ మనిషి అక్కడకు చేరలేదన్న మాట..అటువంటి వారికి వెంకటేశ్వరుని మన్ననలు యెలా దొరుకును.
మనిషిని ఒక ఇల్లు అనుకుంటే, దేవుని మన్ననలు గాలి లాంటివి. అవి యెప్పుడూ వుంటాయి. ఇంటి తలుపులు తీసి వుంటే గాలి లోపలికి రావచ్చును. మూసి వుంటే రానే రాదు. ప్రార్ధన తలుపులు తీసేందుకు మనిషి చేయగలిగిన ప్రయత్నము. మనిషి చేయు యే చేష్టలైనా తలుపులు తీసేందుకు వుపయోగ పడకపోతే అవన్నీ వ్యర్ధమే.
చివరిగా ధూర్జటి గారి పలుకులను క్రింది పద్యము ద్వార గుర్తు తెచ్చుకుందాము. (నీ) దంతాలు రాలక ముందే, జుట్టు నెరవక ముందే, జవసత్వాలుడగక ముందే, భార్య నీ వికృత రూపం చూసి అసహ్యించుకోక ముందే, ఆ భగవంతుని పాద చరణాలను ఆర్తితో వేడుకొనుము.
శా. దంతంబుల్పడనప్పుడే తనువునన్ దార్ఢ్యంబు నున్నప్పుడే
zadaz
Reference:
Copper Leaf: 36-7, Volume: 1-226
##This stanza also has reference to the following Bhagavad-Gita shlokas given below:
yajñārthāt karmaṇo ’nyatra loko ’yaṁ karma-bandhanaḥ
tad-arthaṁ karma kaunteya mukta-saṅgaḥ samāchara (3-9)
Purport:
All actions must be performed as a yajña (sacrifice) to the Supreme Lord; otherwise, work causes
bondage in this material world. Therefore, O son of Kunti, perform your
prescribed duties, without being attached to the results, for the satisfaction
of God.
Here in this stanza, action with intention to enjoy the passion/lust is not prescribed.
యజ్ఞార్ధాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ।। 3-9 ।।
భావము: కార్యములన్నీ ఒక యజ్ఞం లాగా, భగవదర్పితంగా చేయాలి, లేకపోతే, అవి కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఫలాపేక్ష లేకుండా యజ్ఞవిధిగా కర్మలను నిర్వర్తించుము.