Sunday, 27 February 2022

110. ముందరఁ గలదని మోసపోతి నిదె (muMdara galadani mOsapOti nide)

ANNAMACHARYA

 

110. ముందరఁ గలదని మోసపోతి నిదె 

(muMdara galadani mOsapOti nide)

                                                                                    

Introduction: Annamacharya in this poem describing the dilemma of a practitioner. These doubts appear natural in pursuit of Truth. Annamacharya says these doubts are actually exposing our shallowness.

Man likes to postpone, particularly unprofitable things till the end, to the extent he could. No wonder god falls in this category of things. It’s not that people do not keep the pictures, idols and chanting as part of their daily existence, ostensibly they are for display.

During the crisis, he thinks of God as a saviour, like we look forward to banks to hedge our deficit budget. What can a man submit to God as surety? one may say I have done much charity, chanting. What avail are they in exchange of purity of heart?

Can the man submit his heart to the god without anticipation? Instead, he likes to control, he likes to know what extent he achieved. Man wants quick results. He looks for a measure of his success. He has a scale for everything. What can you measure on the path of self-realisation? We feel, we may achieve a score of 6 or 8 out of 10 to qualify for a first-class entry into upper echelons of God. O Man! Who you want to deceive?

How far is God from us?   Inches, or miles? Annamacharya by questioning yiMdunE tudipada mekkitinA (యిందునే తుదిపద మెక్కితినా) is implying that as long as one is far, no matter they are inches or miles, our this existence based on comparison is mere secondary. It’s not life at all.

The action of truth is same on everyone. In this extraordinary poem, Annamacharya used a word chedaritinA  చెదరితినా (= చెలించితినా = Do I  get dazzled?) to indicate that we ordinary men get dazzled by this action of truth and thus move away from the truth (to spend time away from true life). The liberated, on the other hand, travel along with the truth.

ఉపోద్ఘాతము: కీర్తనలో అన్నమాచార్యులు సాధకునికి ఎదురయ్యే సందిగ్ధతను వివరిస్తున్నారు. మార్గమే లేని సత్యమను ధామమునకు వెళ్ళు బాటలో సందేహాలు కలగడం సహజం అనిపిస్తుంది. 'వాస్తవానికి మనలోని వెలితిని ఈ సందేహాలు ఎత్తిచూపిస్తున్నాయి' అన్నారు అన్నమాచార్యులు. 

మనిషి తనకు సాధ్యమైనంత వరకు, ముఖ్యంగా (ధన) లాభము లేని విషయాలను వాయిదా వేయబోతాడు. సహజముగా దైవము కూడా ఈ కోవలోకి రావడంలో ఆశ్చర్యం లేదు. ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా దేవుళ్ళకు సంబంధించిన చిత్రపటాలు, విగ్రహాలు మరియు జప మాలలు తమ దగ్గర ఉంచుకున్నప్పటికీ అవి ఎక్కువ భాగము ఇతరులకు తెలియచెప్పుటకే. 

లోటు బడ్జెట్‌ను అధిగమించడానికి  ప్రజలు బ్యాంకుల వైపు చూచునట్లుగా, సంక్షోభ సమయంలో, మానవుడు దేవుడిని రక్షకునిగా భావిస్తాడు. ఒక వ్యక్తి దేవునికి హామీగా ఏమి సమర్పించగలడు? మనము చాలా దానధర్మాలు చేశామని, జపతపాలు చేశామని అనుకోవచ్చు. తృప్తి పొందవచ్చు. నిష్కకల్మష హృదయానికి బదులుగా వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? 

ఏదీ ఆపేక్షించ కుండా మనిషి తన హృదయాన్ని దేవునికి సమర్పించగలడా? యథార్థమునకు, అతడు తనను తాను నియంత్రించడానికి ఇష్టపడతాడు. ఏ మేరకు సాధించాడో తెలుసుకోవాలని ఉబలాట పడతాడు. మనిషికి తక్షణ ఫలితాలు కావాలి. అతను తన విజయానికి కొలమానం కోసం వెదుకుతాడు. లక్ష్యానికి దూరం కనిబెట్టబోతాడు. స్వీయ-సాక్షాత్కార మార్గంలో  ఏమి కొలవగలరు? దైవము యొక్క అంతరంగంలో ప్రవేశించడనికి మానము సృష్ఠించుకుంటాడు. ఉన్నతలోకాలలోకి ప్రథమ స్థాయి ప్రవేశానికి అర్హత మెట్లు కడతాడు. ఓ మానవుడా ఎవరి మెప్పు కొరకు యీ తపన​? 

దేవుడు మనకు ఎంత దూరంలో ఉన్నాడు? అంగుళాలా లేదా మైళ్లా? అన్నమాచార్యులు యిందునే తుదిపద మెక్కితినా అని ప్రశ్నించడం ద్వారా "దైవానికి  దూరంగా ఉన్నంత కాలం, అవి అంగుళాలు కానీండి లేదా మైళ్లు కానీండి, దైవానికి దూరమే కదా! పోలికలే ఆధారంగా కల మన ఈ ఉనికి కేవలం మనుగడ మాత్రమే. ఇది అస్సలు జీవితమే కాదు" అన్నారు అన్నమయ్య. 

సత్యం అందరికి ఒకటే. ఈ అసాధారణ కీర్తనలో, అన్నమాచార్యులు చెదరితినా (=చెలించితినా?) అనే పదాన్ని ఉపయోగించాడు, ఈ సత్యం యొక్క  చర్యతో మనం సాధారణ మనుషులు తబ్బిబ్బౌతామని మరియు తద్వారా సత్యానికి (జీవితానికి) దూరంగా ఉంటామని అన్నారు. మహాపురుషులు మాత్రం సత్యం వెంట నడుస్తారు. 

 

కీర్తన:

ముందరఁ గలదని మోసపోతి నిదె

యిందునే తుదిపద మెక్కితినా           ॥పల్లవి॥ 

కాయము మోచితి ఘడన గడించితి

చేయారఁబుణ్యము సేసితినా
పాయము గైకొంటి పలు రుచులెరిఁగితి
రోయఁదగిన విల రోసితినా   ॥ముంద॥ 

నిదుర మేల్కనితి నిక్కల గంటిని

హృదయపు విజ్ఞాన మెఱిఁగితినా
చదువులు చదివితి జపములు సేసితి
మది చంచలములు మానితినా           ॥ముంద॥ 

అందరిఁ గొలిచితి నన్నియుఁ జూచితి

నెందునైన మేలెఱిఁగితినా
కందువ శ్రీవేంకటపతి నీవే
చెంది కాచితివి చెదరితినా  ॥ముంద॥

 

muMdara galadani mOsapOti nide

yiMdunE tudipada mekkitinA      pallavi 

kAyamu mOchiti ghaDana gaDiMchiti

chEyArabuNyamu sEsitinA
pAyamu gaikoMTi palu ruchulerigiti
rOyadagina vila rOsitinA muMda 

nidura mElkaniti nikkala gaMTini

hRdayapu vij~nAna me~rigitinA
chaduvulu chadiviti japamulu sEsiti
madi chaMchalamulu mAnitinA  muMda

 aMdari golichiti nanniyu jUchiti

neMdunaina mEle~rigitinA
kaMduva SrIvEMkaTapati nIvE
cheMdi kAchitivi chedaritinA       muMda

 

 

Details and Explanations:

 

ముందరఁ గలదని మోసపోతి నిదె

యిందునే తుదిపద మెక్కితినా  ॥పల్లవి॥

 

muMdara galadani mOsapOti nide

yiMdunE tudipada mekkitinA      pallavi

 

Word to Word meaning: ముందరఁ (muMdara) = ahead, in front, in future; గలదని (galadani) = is available; మోసపోతి (mOsapOti) = got deceived; నిదె (nide) = presently this way, in an instant; యిందునే (yiMdunE) = in this; తుదిపద (tudipada) final step; మెక్కితినా (mekkitinA) = Did I climb?  

Literal meaning: I fool myself that I have certain time, opportunity ahead (for meditation). My time is consumed in counting where I am. 

Explanation: Annamacharya is a tough philosopher. What is he connotating in this? In the world of man, everything is comparison. A child looks for nod of the mother whether he is doing it right. When such compassionate guidance is absent, the path of nowhere (path of God), how do you know where you are? Who can determine where one is? 

As per Annamacharya, as we have seen in earlier verses, there are only two states. Either one is with God or Not. Is life a football match to expect pass after pass, kick by kick commentary? 

Significant thing said is assuming and expecting that one has time ahead. This is man's most irrational expectation. No one knows how much time one has. Therefore, Annamacharya in this chorus under lined urgency of this real step man can take towards GOD. All others are expended in foolery. 

Implied meaning: Take on the challenge of a one-way journey devoid of anticipation, O Man. 

భావము: (ధ్యానమునకు సమయం) ముందరఁ కలదనుకుని మోసపోయి, ఆతృతగా ఏ మెట్టు మీదున్నానో లెక్కించు కొంటూ గడిపేస్తున్నా.

వివరణము: అన్నమాచార్య పట్టువిడవని తత్వవేత్త. ఇందులో అతను ఏమి సూచించదలిచాడు? మనిషి ‘ప్రపంచంలో’, ప్రతిదీ పోలికలతో కూడియున్నది. ఒక పిల్లవాడు తను సరిగ్గా వెళుతున్నాడో లేదో తల్లి వైపుకు చూస్తూ నడుస్తాడు. దేవుడు  ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.  మార్గమేలేని సత్యమను బాటలో, నీవెక్కడ ఉన్నావో ఎవరు నిర్ణయించగలరు? అటువంటప్పుడు, నీవెన్నో మెట్టెక్కావో అని లెక్కించడం అవివేకమే కదా?

ఇంతకు ముందు చూసిన కీర్తనల్లో అన్నమాచార్యులు రెండే స్థితులున్నవి అన్నారు. ఒకటి దైవము వైపునుండుట​. మరొకటి అది కానిది.  క్షణక్షణమునకు బంతిని ఎవరెవరికి 'పాస్' చేసినది, ఎవరు ఏ రకంగా బంతిని తన్నింది విపులంగా ప్రత్యక్ష వ్యాఖ్యానము అందించుటకు జీవితము ఫుట్‌బాల్ మ్యాచ్ లాంటిదికాదు కదా!

ముఖ్యమైన విషయం ఏమిటంటే, భగవస్మరణకు సమయం తరవాత ఎప్పుడో దొరుకుతుందని ఆశించడం. ఇదే అత్యంత అహేతుకమైన నిరీక్షణ. ఇంకా ఎంత సమయం (మిగిలి) ఉందో ఎవరికీ తెలియదు. కాబట్టి, అన్నమాచార్యులు ఈ పల్లవిలో ఇంకో క్షణము కూడా ఆలస్యము చేయకుండా భగవంతుని వైపు వేయు అడుగులు మాత్రమే సత్యమన్నారు. మిగిలినవన్నీ కొరగనివే.

అన్వయార్ధము: ఓ మానవుడా! తక్షణమే, తగిన సమయం కోసం  ఎదురుచూడకుండా, ఈ తిరిగిరాని ప్రయాణాన్ని ఆరంభించు.

కాయము మోచితి ఘడన గడించితి

చేయారఁబుణ్యము సేసితినా

పాయము గైకొంటి పలు రుచులెరిఁగితి

రోయఁదగిన విల రోసితినా            ॥ముంద॥

 

kAyamu mOchiti ghaDana gaDiMchiti

chEyArabuNyamu sEsitinA

pAyamu gaikoMTi palu ruchulerigiti

rOyadagina vila rOsitinA  muMda 

Word to Word meaning: కాయము (kAyamu) = body; మోచితి (mOchiti) = carried on with life; ఘడన (= ‘గడన’కు రుపాంతరము. ‘గ’ కు బదులు ‘ఘ’ వాడడం విలక్షణము) = ghaDana) = సంపాదనము; earning;  గడించితి (gaDiMchiti) =  చేయారఁబుణ్యము (chEyArabuNyamu) = Whatever virtuous deeds possible within my powers; సేసితినా (sEsitinA) = did I perform? పాయము (pAyamu) = age (here meaning = this life); గైకొంటి (gaikoMTi) = taken up; పలు (palu) = multiple;  రుచులెరిఁగితి (ruchulerigiti) = got used to many tastes; రోయఁదగినవి (rOyadaginavi) the one that are worth eschewing;  ఇల (ila) = in this world;  రోసితినా (rOsitinA) = did I ostracise? 

Literal meaning: I carried on with my life. I did earn money. However, did I perform all virtuous deeds possible within my powers? (Obviously not). I took up this life and tasted many great things. Did I, as an act of gratitude, eschew the ones worth discarding? (Conspicuously not). 

Explanation: Man has the discretion. Unfortunately, he is conditioned to use this decretory faculty to his assumed comfort. At this point, let us remember the wording of previous poem, vorula dUshiMtu gAni vokamAraina nA-/ duritakarmamulanu dUshiMchanu (వొరుల దూషింతుఁగాని వొకమారైన నా/దురితకర్మములను దూషించను. = I am quick to blame others, but I have never once condemned my own bad behaviour). Man acts from this assumed position.

What do we do with our life? Pursue good deeds (puNyamu?)? How do you know it is a good deed? Sir, there is no point in falling into the trap of these organised propaganda of identifying certain things as good and certain as not.  Thus, in this stanza, Annamacharya is asking you to see the world without the veil of conditioning.

As long as one keeps counting that he did that philanthropic work, this good gesture, he continues in the mind, the game of evaluation. Such avocations may give immense satisfaction, but often they are not true.  

Also refer to Bhagavad-Gita shloka बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते (2-50) buddhi-yukto jahātīha ubhe sukita-duhkite which states its prudence to get rid of both good and bad deeds.  

Implied meaning: O man! Can you stay absolutely neutral without ambiguity!

 

భావము: ఈ  దేహమును దరించితిని. ధనము సంపాదించితిని. చేతులారా చేయగలిగినంత పుణ్యము చేసితినా? (లేదే!) ప్రాయములో పలు రుచులు ఎరిగిన  సంతోషములో అసహ్యించుకోదగినవి  వదలితినా? (లేదే!)

 

వివరణము: మనిషికి విచక్షణ ఉంది. దురదృష్టవశాత్తు, అతడు దానిని, తన స్థితి కల్పించు కపటము లేదా భ్రాంతికి లోనై, యుక్తాయుక్త  వివేకము పక్కకు పెట్టి,  తనకు అనుకూలముగా ఉపయోగించబోతాడు. ఇక్కడ 'వొరుల దూషింతుఁగాని వొకమారైన నా / దురితకర్మములను దూషించను' అనే మునుపటి కీర్తనలోని మాటల్ని గుర్తుచేసుకుందాం. మనిషి కృత్రిమంగా నిర్మించుకున్న ఈ స్థానం నుండి వ్యవహరించ ఉపక్రమిస్తాడు..

మనం జీవితంతో  ఏమి చేస్తాము? మంచి పనులు, పుణ్య కార్యాలు చేయబోతాము. ఆయ్యలారా! వ్యవస్థీకృత ప్రచారాల ఉచ్చులో పడి,  కొన్ని విషయాలను మంచివిగాను, కొన్ని కానివిగాను నిశ్చయించి ప్రయోజనం లేదు. ఈ చరణంలో అన్నమాచార్యులు 'కండిషనింగ్' అనే ముసుగు లేకుండా, ప్రపంచాన్ని మీ కళ్ళతో స్పష్టంగా చూడగలరా? అని అడుగుతున్నారు.

నేను వారికింత మేలు చేసాను,  ఇలా  సమాజానికి ఉపయోగపడ్డాను అంటూ లెక్కలు వేసుకునేవారు తమపై తాము న్యాయవిచారణ చేసుకుంటున్నట్లే.  ఈ విచారణలో న్యాయాధిపతి, అర్జీదారు ఒక్కరే కాబట్టి నిష్పక్ష విచారణ జరగదని తెలియండి. నేను ప్రక్కవాడి కంటే మంచి వాడినని మీకు మీరు నిరూపించుకుని లాభములేదు. అందుకే, వీటిలో (న్యాయాన్యాయ మీమాంసలో) ఇరుక్కొకండి అంటున్నారు అన్నమయ్య​.

‘వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును’ అని భగవద్గీతలోనూ (బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే 2-50) అన్నారు.

అన్వయార్ధము: ఓ మానవుడా! అటునిటు ఊగిసలాడక, మినహాయింపులేకుండా తటస్థంగా ఉండగలవా!

 

నిదుర మేల్కనితి నిక్కల గంటిని

హృదయపు విజ్ఞాన మెఱిఁగితినా

చదువులు చదివితి జపములు సేసితి

మది చంచలములు మానితినా   ॥ముంద॥

 

nidura mElkaniti nikkala gaMTini

hRdayapu vij~nAna me~rigitinA

chaduvulu chadiviti japamulu sEsiti

madi chaMchalamulu mAnitinA muMda

 

Word to Word meaning: నిదుర (nidura) = sleep; మేల్కనితి (mElkaniti) = get up (from); నిక్కల (nikkala) = నిజమైన కల, a dream that turns out true;  గంటిని (gaMTini) = experienced; హృదయపు (hRdayapu) = of the heart; విజ్ఞాన (vij~nAna) = నేర్పు, skill; మెఱిఁగితినా (me~rigitinA) = did I learn? చదువులు (chaduvulu) = learn; చదివితి (chadiviti) = by reading; జపములు (japamulu) = chanting holy names; counting beads;  సేసితి (sEsiti) = performed;  మది (madi) = mind’s;  చంచలములు (chaMchalamulu) = vacillations;  మానితినా (mAnitinA) = Did I stop? 

Literal meaning: I woke up from sleep. I have seen the dreams coming true. Yet not learnt the skill of the heart. I did learn a lot by reading holy books. I counted beads, recited holy names. Yet my mind continues its vacillations. 

Explanation: Even the fulfilment of my dreams did not make me understand my real heart. Man continues to be dissatisfied. Neither studying holy books, reciting holy names made me doubt free. If these beaten paths do not, what will free the man? Thus, Annamacharya is asking us to have radically different, dynamically evolving oneness with the self, leaving the pulls of daily existence.  

Now, let me quote from Jiddu Krishnamurti’s words from chapter 3, (3rd public talk at Brandeis University) from the book 'You are the world'. “Every experience leaves a mark, a residue, a memory of pain or pleasure. The word "experience" means to go through something. But we never "go through" something so it leaves a mark. If you have a great experience, go through the greatness of it, completely, so that you are free of it, then it does not leave marks as memory.”

“Why is it that every experience that we have had leaves a remembrance, conscious or unconscious? - because it is this that prevents innocency. You cannot prevent experiences. If you prevent or resist experience, you build a wall around yourself, you isolate yourself; that is what most people do.”

Please understand this Annamacharya is not a saint in traditional concept. He questions traditional knowledge and methods like an atheist. Yet, he talks of godliness.

Now observe how close Annamacharya& Jiddu Krishnamurti are by reading the below para from the book titled “The Only Revolution”.  “Unworldliness is not the loincloth or one meal a day or repeating some meaningless though stimulating mantra or phrase. It is worldliness when you give up the world and inwardly part of the world of envy, greed, fear of accepting authority and the division between the one who knows and the one who doesn't know. It is still worldliness when you seek achievement, whether it be fame or achievement of one may call as ideal, or God, or what you will. It is the accepted tradition of the culture that is essentially worldly, and withdrawinginto a mountain far from man does not absolve this worldliness. Reality, under no circustances, lies in that direction.

Implied meaning: O man, get up from the slumber. break the chains of tradition that is binding you to this world and find that state which keeps you calm and still.

భావము: నిదుర మేల్కొంటిని. కలలు నిజమైనవి. ఐనా గుండెల్లో ఏమున్నదీ తెలియలేను. చదువులు చదివినా, జపములు సేసినా, నా మనో చంచలములు అలాగే ఉన్నాయి.

వివరణము: నా కలలను నెరవేర్చుకున్నా కూడా నా హృదయంలో  అసంతృప్తి అలాగే కొనసాగుతున్నది. (పవిత్ర) గ్రంధాలను చదవడం, జపములు చేయడం వంటివి నా సందేహలన్నింటినీ తొలగించలేదు. ఐతే మనిషిని విడిపించేది ఏమిటి? ఈ విధంగా, అన్నమాచార్యులు దైనందిన జీవితపు పెనగులాటలను విడిచిపెట్టి, తనతో తానే పూర్తిగా భిన్నమైన, చైతన్యవంతంగా అభివృద్ధి చెందుతున్న ఏకత్వాన్ని కలిగి ఉండమని చెప్పారు.

జిడ్డు కృష్ణమూర్తిగారు ఈ విషయమై ‘యూ ఆర్ ది వరల్ద్’ అనే పుస్తకంలో ఇలా అన్నారు. “ప్రతి అనుభవం ఒక గుర్తును, అవశేషాన్ని, విషాదమో లేదా ఆనందమో యొక్క జ్ఞాపకాన్ని వదిలివేస్తుంది. "అనుభవం" అనే పదానికి అర్థం ఇంద్రియముల ద్వారా అంతఃకరణ పదార్థములపై వ్యాపించి ఆయాపదార్థముల స్వరూపమును గ్రహించుట. కానీ ఎప్పుడూ మనం  "గ్రహించుటకు బదులు" దాని గుర్తును పట్టుకుని వేలాడతాం. మీకు గొప్ప అనుభవం ఉంటే, దాని గొప్పతనాన్ని పూర్తిగా అనుభవించండి, తద్వారా మీరు దాని నుండి విముక్తులౌతారు, అప్పుడు అది దాని గుర్తులను జ్ఞాపకాలుగా మిగల్చదు.”

“ఇలా మనకు ఎదురైన ప్రతి అనుభవం స్మారక లేదా అపస్మారక జ్ఞాపకాలుగా ఎందుకు వదిలివేస్తుంది. ఇదే కాలుష్యమనుకోండి. వాతావరణములోని   కాలుష్యము సూర్యకాంతిలోని రంగులను మార్చినట్లుగా, ఈ గుర్తులు స్వచ్ఛతను నిరోధిస్తాయి. మీరు అనుభవాలను నిరోధించలేరు. మీరు అనుభవాన్ని నిరోధిస్తే లేదా ప్రతిఘటిస్తే, మీరు మీ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు, మిమ్మల్ని మీరు సత్యము నుండి వేరుచేసుకుంటారు; మనలో చాలా మంది చేసేది అదే."

అన్నమాచార్యులు సంప్రదాయ కోణంలో తపసి కాదని దయచేసి అర్థం చేసుకోండి. నాస్తికుడిలా సంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నిస్తాడు. అయినప్పటికీ, ఆయన దైవభక్తి గురించే మాట్లాడారు.

అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి ఒకేలా ఆలోచించేవారని చెప్పడానికి ఈ కీర్తన మంచి ఉదాహరణ​.  ఈ చరణమునకు క్రింది "ద ఓన్లీ రివల్యూషన్" నుంచి తీసుకున్న పేరాను చదివి సమీప పోలికలు గమనించండి.

“లోకానికి బాహ్యంగా ఉండడం అంటే గోచీ గుడ్డలను కట్టుకోవడమో లేదా రోజుకు ఒక పూట భోజనం చేయడమో లేదా అర్ధంలేని పదబంధాలను (మంత్రాలు) కొన్నింటిని పునరావృతం చేయడమో కాదు. అసూయ, దురాశ, భయంతో కూడిన ఆ ప్రపంచమును, దానిలో అంతర్భాగమైన అధికారాన్ని విడిచిపెట్టడమే బాహ్యము. మీరు విజయాన్ని, కీర్తిని కోరుకుంటే అదీను ప్రాపంచికతయే. ఇది  ప్రాపంచికమైన సంస్కృతి యొక్క ఆమోదించబడిన సంప్రదాయం.  మనుషులకు దూరంగా ఉన్న పర్వతాలోకి వెళ్లడమూ ఈ లోకతత్వాన్నుంచి  విముక్తం చేయదు. సత్యము, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆ దిశలో ఉండదు.

అన్వయార్ధము: ఓనరుడా, నిద్ర నుండి మేల్కో. ప్రశాంతంగాను మరియు నిశ్చలంగాను ఉంచే ఆ స్థితిని కనుగొనడానికి నిన్ను ఈ ప్రపంచానికి బంధించే సంప్రదాయపు గొలుసులను విచ్ఛిన్నం చేయి.

 

అందరిఁ గొలిచితి నన్నియుఁ జూచితి

నెందునైన మేలెఱిఁగితినా

కందువ శ్రీవేంకటపతి నీవే

చెంది కాచితివి చెదరితినా           ॥ముంద॥

 

aMdari golichiti nanniyu jUchiti

neMdunaina mEle~rigitinA

kaMduva SrIvEMkaTapati nIvE

cheMdi kAchitivi chedaritinA      muMda

 

Word to Word meaning: అందరిఁ (aMdari)  = all; గొలిచితి (golichiti) = served;  నన్నియుఁ (nanniyu) = all జూచితి (jUchiti) = felt, experienced;  నెందునైన (neMdunaina) = noe of these;  మేలెఱిఁగితినా (mEle~rigitinA) = did I find merit? కందువ (kaMduva) = సంకేతస్థలము, ఏకాంతము, a secret covenant; శ్రీవేంకటపతి (SrIvEMkaTapati) = Lord venkateswara; నీవే (nIvE) = you yourself; చెంది (cheMdi) = to happen, befall, to experience; కాచితివి (kAchitivi)= saved; చెదరితినా (chedaritinA) = am I dazzled? 

Literal meaning: I served everyone; I have seen everything. Yet not found merit in anything. O God, I felt, in my hearts of hearts, you had saved me. 

Explanation: It's clear from this stanza that Annamacharya is hinting submission of will to the god. To keep the mind open to receive. It means such submission is to allow the nature to act on it freely on one’s mind. Though this statement may appear trivial, its near impossible to do that way. 

The action of truth is same on everyone. In this extraordinary poem, Annamacharya used a word chedaritinA (= చెదరితినా = చెలించితినా = Do I  get dazzled?) to indicate that we ordinary men get dazzled by this action of truth and thus move away from the truth (to spend time away from true life). The liberated, on the other hand, travel along with the truth.

Implied meaning: O Man there is no merit in any pursuit. Submit to the lord without bewildering. God will save you. 

భావము: అందరికీ  సేవ చేసాను; అన్నీ చూశాను. అయినా దేనిలోనూ ఔచిత్యము కానలేను. ఓ దేవా, ఎక్కడో, నా హృదయాంతరాళలో నువ్వు నన్ను రక్షించావు అని నేను భావించాను. 

వివరణము: ఈ చరణం నుండి, అన్నమాచార్యులు భగవంతుని సంకల్పానికి హృదయము సమర్పించమని అన్నట్లు  స్పష్టమవుతుంది. అటువంటి సమర్పణ అనేది ఒకరి మనస్సుపై ప్రకృతిని స్వేచ్చగా వ్యవహరించడానికి  అనుమతించడమే. ఈ ప్రకటన సులభంగా కనిపించినప్పటికీ, ఆ విధంగా చేయడం దాదాపు అసాధ్యం.  జిడ్డు కృష్ణమూర్తి జీవిత చరిత్రయే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ​.

సత్యం అందరికి ఒకటే. ఈ అసాధారణ కీర్తనలో, అన్నమాచార్యులు చెదరితినా (=చెలించితినా?) అనే పదాన్ని ఉపయోగించాడు. సత్యం యొక్క  చర్యతో సాధారణ మనుషులము తబ్బిబ్బౌతామని మరియు తద్వారా సత్యానికి (జీవితానికి) దూరంగా ఉంటామని అన్నారు. మహాపురుషులు మాత్రం సత్యం వెంట నడుస్తారు. 

అన్వయార్ధము: ఓ మానవుడా, యోగ్యమైన కార్యమే లేదు. హృదయము చెదరకుండా దైవమునకు సమర్పించుకో. దేవుడు రక్షించును. 

 

Recommendations for further reading:

109. చదివితిఁ దొల్లి కొంతచదివే నింకాఁ గొంత (chadiviti dolli koMtachadivE niMkA goMta)

31. చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి (chAla novvi sEyunaTTi janmamEmi maraNamEmi)


Summary of this Keertana:

I fool myself that I have certain time, opportunity ahead (for meditation). My time is consumed in counting where I am. Implied meaning: Take on the challenge of a one-way journey devoid of anticipation, O Man! 

I carried on with my life. I did earn money. However, did I perform all virtuous deeds possible within my powers? (Obviously not). I took up this life and tasted many great things. Did I as an act of gratitude, eschew the ones worth discarding? (Conspicuously not). Implied meaning: O man! Can you stay absolutely neutral without ambiguity! 

I woke up from sleep. I have seen the dreams coming true. Yet not learnt the skill of the heart. I did learn a lot by reading holy books. I counted beads, recited holy names. Yet my mind continues its vacillations. Implied meaning: O man! get up from the slumber. break the chains of tradition that is that is binding you to this world and find that state which keeps you calm and still.

I served everyone; I have seen everything. Yet not found merit in anything. O God, I felt, in my hearts of hearts, you had saved me. Implied meaning: O Man! there is no merit in any pursuit. Submit to the lord without bewildering. God will save you.

 

 

కీర్తన సంగ్రహ భావము:

(ధ్యానమునకు సమయం) ముందరఁ కలదనుకుని మోసపోయి, ఆతృతగా ఏ మెట్టు మీదున్నానో లెక్కించు కొంటూ గడిపేస్తున్నా. అన్వయార్ధము: ఓ మానవుడా! తక్షణమే, తగిన సమయం కోసం  ఎదురుచూడకుండా, ఈ తిరిగిరాని ప్రయాణాన్ని ఆరంభించు.

ఈ  దేహమును దరించితిని. ధనము సంపాదించితిని. చేతులారా చేయగలిగినంత పుణ్యము చేసితినా? (లేదే!) ప్రాయములో పలు రుచులు ఎరిగిన  సంతోషములో అసహ్యించుకోదగినవి  వదలితినా? (లేదే!) అన్వయార్ధము: ఓ మానవుడా! అటునిటు ఊగిసలాడక, మినహాయింపులేకుండా తటస్థంగా ఉండగలవా!

నిదుర మేల్కొంటిని. కలలు నిజమైనవి. ఐనా గుండెల్లో ఏమున్నదీ తెలియలేను. చదువులు చదివినా, జపములు సేసినా, నా మనో చంచలములు అలాగే ఉన్నాయి. అన్వయార్ధము: ఓనరుడా, నిద్ర నుండి మేల్కో. ప్రశాంతంగాను మరియు నిశ్చలంగాను ఉంచే ఆ స్థితిని కనుగొనడానికి నిన్ను ఈ ప్రపంచానికి బంధించే సంప్రదాయపు గొలుసులను విచ్ఛిన్నం చేయి.

అందరికీ  సేవ చేసాను; అన్నీ చూశాను. అయినా దేనిలోనూ ఔచిత్యము కానలేను. ఓ దేవా, ఎక్కడో, నా హృదయాంతరాళలో నువ్వు నన్ను రక్షించావు అని నేను భావించాను. అన్వయార్ధము: ఓ మానవుడా, యోగ్యమైన కార్యమే లేదు. హృదయము చెదరకుండా దైవమునకు సమర్పించుకో. దేవుడు రక్షించును. 

 

Copper Leaf: 228-1  Volume 3-156 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...