Friday, 23 September 2022

T-142 ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా

 తాళ్లపాక అన్నమాచార్యులు

142 ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా

 

for EnglishVersion press here

 

ఉపోద్ఘాతము: జటిలము, మహాద్భుతమగు ఈ కీర్తనలో అరుదైన క్రమమును అన్నమాచార్యులు పేర్కొనిరి​. ముందుగా మనస్సు తనకు తెలిసిన సమాచారముతోనే (డేటాతోనే) కార్యము సాధించ నెంచును అని పల్లవిలో అనిరి. మొదటి చరణంలో అనంతమగు జీవవాహినిని గుర్తించక మానవులు క్షయము దిశగా అడుగులు వేస్తారన్నారు. అడ్డదిడ్డముగా కనిపించు ఈ లోకము అపురూపము అబ్బురపాటు కలిగించు సమ్మేళనము అని గుర్తించమనిరి. చివరి చరణంలో  మానవుడు తనకున్న సమస్త శక్తియుక్తులను కూడగట్టుకుని ఆ యత్నము సేయక నిస్సారమగు జీవితమును చేపడుతున్నాడని వాపోయిరి.

 

అన్నమాచార్యులు ఎన్నడూ తన స్వస్థలాలను విడిచి బయటకు వెళ్లలేదు. ఐనా వారు ప్రపంచములో అంతర్లీనముగా దాగియున్న స్వాభావికమైన క్రమమును  (న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్, Natural Order of the universe) ప్రస్తావించిరి. ఇదియే ఆలోచించవలసిన విషయం. వారు ధ్యానము నందు పారవశ్య స్థితిని చేరి దీనిని అనుభవించినట్లు నేను భావిస్తున్నాను. విశ్వమునంతా ఏకత్రాటిపై సమన్వయముచేయు వ్యూహము యొక్క ప్రసక్తి విస్మయము కలిగించునదే కాక అసాధారణమని భావించవచ్చు.

 

అన్నమాచార్యులు ఎప్పుడూ జీవనము గురించి మాట్లాడుతారు, జీవితం గురించి కాదు. ఇక్కడ జీవించడం అంటే ప్రవహించే నది లాంటిదన్నారు. ఒక సాధారణ కీర్తన వలె ప్రారంభమై మొదటి నుండి చివరి చరణం వరకు పురోగమిస్తున్నప్పుడు, అన్నమాచార్యులు మనం ఏ అగాధములలో  కూరుకుని ఉన్నది స్పష్టం  చేస్తారు.

 

కీర్తన:

రాగిరేకు:  64-1  సంపుటము: 1-328

 

ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు॥ఏమి॥ 

వత్తిలోపలి నూనె వంటిది జీవనము
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక॥ఏమి॥ 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు
చేకొనిన నేమి యివి చెదిరినను నేమి॥ఏమి॥ 

గాదెఁబోసిన కొలుచు కర్మి సంసారంబు
వేదు విడువని కూడు వెడమాయ బదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
మోదంబు వడసినను మోక్షంబు గనుట॥ఏమి॥

 

 

Details and Explanations: 

ఏమి గలదిందు నెంత పెనగినఁ వృథా
కాముకపు మనసునకు కడ మొదలు లేదు
॥ఏమి॥ 

భావము: కడ, మొదలు లేని కోరికలతో కూడిన మనస్సును నమ్మి ఎందుకు వృథాగా ఈ లోకమున​ ఏముందని పెనుగులాడతావు? 

వివరణము: మానవుని ఆలోచనలు జ్ఞాపకములను పొరలనుండి ఉద్భవించును. అనగా కోరికలకు మూలము స్మృతులే. గతస్మృతులను గోరీలపై నాట్యమాడు ఆలోచనలు మానవునికి విముక్తిని ప్రసాదించలేవు. క్రింద యిచ్చిన లా బెల్లె లూరెట్ (అందమైన లూరెట్)లో, అధివాస్తవిక కళాకారుడు రీని మాగ్రిట్టే ఒక విచిత్రాన్ని సృష్టిస్తాడు. 1965లో గీసిన ఆ చిత్రలేఖనము నాటినుండి అర్ధము చేసుకొనుటకు సవాలుగాను, చూపరుల ​మనస్సులలో గందరగోళమును కలగజేస్తూనే వుంది. 



మాగ్రిట్టేకు, బిల్బోక్వెట్ పరిపూర్ణ అధివాస్తవిక వస్తువు. దాని రూపం ఒక చదరంగం లోని సేనాపతిని (బిషప్’ని)భ్రమింపజేసే విధంగాను మరియు ఉద్వేగభరితంగానూ ఉంటుంది. అధివాస్తవికవాదులకు గణనీయమైన ఆసక్తిగల ఆట చదరంగం; దాని గుర్తింపు చాంచల్యములోను, అస్థిరతలోను ఉంటుంది. దాని తలపై ఒక కన్ను చిత్రించడం ద్వారా దానిని మానవరూపంగా మార్చి, మానవ రూపానికి దాని సమానత్వాన్ని నొక్కిచెప్పాడు. ధనము, పేరు, ప్రతిష్ట, అహంభావములను పదార్ధములను  పేర్చికట్టుకున్న  పూర్తి కృత్రిమ రూపమగు మానవుల అంతఃకరణమును బిల్బోక్వెట్'తో పోల్చుట సముచితము. 

దానిపై కప్పిన వస్త్రములు  చూసిన మరియు కనపడని వాటి మధ్య ద్వంద్వత్వాన్ని మరింతగా పెంచుతుంది.  చాలా ముఖ్యమైన భావనలను బహిర్గతం చేసేందుకు లేదా దాచిపెట్టేందుకు వస్త్రములు, తెరలు, ముసుగులు కళాకారునికి సామర్థ్యాన్ని కల్పిస్తాయి. 

మానవుడు ఆ బిల్బోక్వెట్'ను కప్పుకున్న శాలువా వలె అనేక ఆచ్ఛాదనముల వెనుక నక్కి దాక్కోబోతాడు. ఆ ఆచ్ఛాదనములను అసలు తానేమిటో తెలియనీయ కుండా ఊండుటకు ఉపయోగించి తననుతాను వున్నది వున్నట్లుగా అంగీకరించలేకపోతాడు.  ఇంతకంటే ఆత్మద్రోహము ఉంటుందా? ఇక్కడ సినిమాపాట "పుట్టినప్పుడు బట్ట కట్టలేదు...పోయేటప్పుడు అది వెంట రాదు..నడుమ బట్ట కడితే నగుబాటు ..నడుమ బట్ట కడితే నగుబాటు...నాగరీకం ముదిరితే పొరబాటు" స్మరణీయం. "మాగ్రిట్ ఎల్లప్పుడూ ద్యోతకము మరియు కప్పివుంచిన వాటి మధ్య బెసగుటకు వీల్లేని విధముగా బిగుతుగా బొమ్మలలో వ్యక్త పరిచిరి”. 

పెయింటింగ్'లో వేళ్ళూనుకుని పాతుకుపోయిన శిధిలావస్థలో వున్న బురుజు (లాంటి కట్టడం) గతించిన కాలాన్ని ప్రేరేపిస్తుంది. మున్నిటి జ్ఞాపకములకు చిహ్నం. అయితే బురుజుకు వేళ్ళున్నట్లు చూపి అది జీవునందలి అంర్భాగమని చెప్పిరి. వేళ్ళు ప్రకృతి కల్పించిన రూపాంతరమునకు గల అవకాశాలను సూచిస్తాయి. 

బిల్బోక్వెట్ (సేనాపతి) బురుజు వైపు చూడ్దం గతస్మృతులపై ఆధారము పడడమును సూచించును. ‘గతము త్రవ్వి ఏమి బావుకుంటావని?’ మాగ్రిట్టేగారు మనని అడుగుతున్నారు. మనిషి ముందుకు చూచుట బదులు వెనుకకు చూచి నడవగలననుకోవడం విచిత్రమే. అందుకే అన్నమాచార్యులు అట్టి ప్రయత్నములలో పెనగుట వృథా అనిరి. 

ఇక్కడ క్రింద​ చూపిన మైక్ సవాద్ (Mike Savad) గారు వేసిన 'ఇబ్బందికరమైన ఈగ' (Bothersome Fly) బొమ్మను ఒకసారి పరీక్షగా చూడమని విన్నపము​. ఒకవైపు గతము ఇంకోవైపు సమ్మతము అను రెండు వర్తుల మార్గములు సమ్మిళితమై మనలను భ్రమింపజేయును.  మైక్ సవాద్ గారి వ్యాఖ్యానము కూడా నవ్వుతెప్పిస్తూ మానవుని వెఱ్ఱితనమును ఎత్తిచూపును#5.  



వత్తిలోపలి నూనె వంటిది జీవనము
విత్తుమీదటి పొల్లు విధము దేహంబు
బత్తిసేయుట యేమి పాసిపోవుట యేమి
పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాక
॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: బత్తిసేయుట = భక్తిసేయుట, పొత్తు = స్నేహము, అవిభక్తత, ఏకమతత్త్వము. 

భావము: జీవనము అనేది వత్తిని ప్రకాశింపజేయు నూనె వంటిది. విత్తుమీదటి పొల్లులా విలువలేనిది దేహంబు.   భక్తిసేయుట యేమి? పాసిపోవుట యేమి? శరీరాలు పెనవేసుకొని పొరలుటకా సాంగత్యము? 

వివరణము: జీవనము ఒక స్రవంతి అని సూచించుచూ అది వత్తిలో ప్రవహించు నూనె వంటిదన్నారు. నూనె జ్వాల వరకు ఎగబ్రాకుటకు వత్తి ఎట్లు సహాయపడునో అటులనే కానీ దేహమునకు జీవనమందు ముఖ్య భూమికలేదని చెప్పిరి. వత్తిని ప్రకాశింపజేయక నూనె పాతగిలి మగ్గిపోవును. అటులనే జనులు జీవ వాహినిని గుర్తించలేక అత్యద్భుతమగు జీవితము నందు ఊక వంటి దేహమును గుర్తించుటలో మునిగి ఉన్నారని సూచించిరి. 

'బత్తిసేయుట యేమి'తో బాహ్యస్పృహలేక కార్యమందు నిమ్మగ్నమగుటను, తదేక దీక్షతో నిత్య నూతనమగు సత్యమును అనుభవించుటను తెలుపదలచిరి. 

పాసిపోవుట యేమి’తో సహజ కార్యమందు నిమ్మగ్నము కాలేని మనస్సు క్షీణతకు గురియై  శరీరముతో పాటు మనస్సు కూడా నాశము దిశగా పయనించునని తెల్పిరి. సహజ కార్యమందుండు మనస్సు శిథిలము కాదని కూడా తెలియవచ్చు. అదియే అనంతమును దర్శించు అవకాశమును కల్పించును. అనేకమార్లు అన్నమాచార్యులు అనంతమునకు, అవివేకమునకు గల వ్యత్యాసమును ఎత్తిచూపి మార్గనిర్దేశమును చేసిరి. 

పొత్తు అను పదముతో శబ్దముల​, మాటల భాషల ప్రమేయము లేకుండా అమేయమగు అవగాహనతో కలిసి సాగు పయనము చెప్పదలచిరి. పొత్తుల సుఖంబులకు పొరలుటలుగాకతో మనము బౌతికముగా కలిసి ఉంటాము కాని మానసికముగా కలిసి జీవించము అని తెలిపిరి. స్త్రీపురుషల కలయికను మోహము, శృంగారములకు, పైపై విషయములకు, సమిష్టి రక్షణ అవసరములకు పరిమితము చేసి, ఆ విధముగా మదిలో నిర్మించుకున్న సీమలను దాటలేని అశక్తితో ప్రపంచము సహానుభూతి, ఆదరణ, కారుణ్యముల లేమితో పుల్లసిల్లుచున్నదనిరి. వెలవెలబోవు చున్నదనిరి. 

అన్వయార్ధము: జీవనమను వృత్తిపై  నిమగ్నమై అనంతమును అనుభవించు అవకాశమును కాలితోతన్ని చెరకురసమును వదలి పిప్పిని తినుచుంటివా? 

ఆకాశ పాకాశ మరుదైన కూటంబు
లోకరంజకము తమలోనిసమ్మతము
చాకిమణుఁగుల జాడ చంచలపు సంపదలు
చేకొనిన నేమి యివి చెదిరినను నేమి
॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఆకాశ పాకాశము = అల్లకల్లొలము, చాకిమణుఁగులు = స్థిరత్వము లేనివి, 

భావము: ఈ అల్లకల్లొల ప్రపంచము అపురూపము అశక్యమగు ఆయతనము. లోని సంస్కారముతో గూడిన సమ్మతము లోకరంజకము. చాకిమణుఁగులగు  (స్థిరత్వము లేని) సంపదలు చేకొనిన నేమి? చెదిరినను నేమి? 

వివరణము: ఆకాశ పాకాశ మరుదైన కూటంబు: ఈ అసహ్యమైన, అస్తవ్యస్త ప్రపంచమొక అసాధారణమైన సమూహము. లోకంలో మనం ఎన్నో సమస్యలను చూస్తున్నాం. దోపిడీలు, అసమానతలు, దౌర్జన్యములు, అల్లకల్లోలములు. అకటవికటముల వెనుక దాగి ఒక అరుదైన క్రమం ఉంది#1,#2,#3. అది ఎంత తీక్షణమైన ఆలోచనలతోనూ చేరగలిగినది కాదు, ఊహింపదగినది కానీ కాదు. గందరగోళమును వ్యతిరేకించే బదులు ఉన్నది ఉన్నట్లే అంగీకరించండి. ధ్యానము అనేది అహంకారాన్ని చేర్చుకోవడం కాదు, రద్దు చేసుకోవడమే. లోకరంజకము తమలోనిసమ్మతము విధి ద్వారాను, సహజముగాను మీకు లభించిన వాటిని వినయంగా అంగీకరించండి. అదియే లోకహితము. 

ఇప్పుడు రెనే మాగ్రిట్‌చే దిగువన ఉన్న key to the fields (క్షేత్రమునకు మార్గము, LA CLEF DES CHAMPS, year 1936) పేరుతో ఉన్న పెయింటింగ్‌ను శ్రద్ధగా చూడమని పాఠకులకు అభ్యర్థన​. (భగవద్గీతలో పేర్కొన్న 'క్షేత్రము'ను తలపుకు తెచ్చుచున్నది).  మనిషిని మరియు బయలు ప్రదేశమును వేరుచేసే గాజు విరిగిపోయిందని గమనించండి. విరిగిన ముక్కలను గమనించిన, గాజు పగలగొట్టే ముందు, మనం క్షేత్రము యొక్క పెయింట్ చేసిన చిత్రాన్ని మాత్రమే గమనిస్తున్నాము, నిజమైనక్షేత్రము'ను కాదు అని యిట్టే తెలియును. 



గాజును పగలగొట్టినవాడు చేస్తున్న పనిలో లీనమై గాజును ఎలా పగిలిదీ​ గమనించలేదని తెలుస్తోంది.  లేదా త్వరిత గతిని ఛేదించుకు పోవాలన్న తపన ప్రస్ఫుటం. సత్యానికి క్రమబద్ధమైన మార్గం లేదు. అనియమిత మరియు ప్రమాదయుక్తమైన మార్గం చిందరవందర ప్రపంచంయొక్క నైజమును చూపుతోంది. గాయాలకు భయపడి మనం గాజు గోడను దాటకపోతే అంతకంటే పిరికితనముండదు. 

చూపరునకు, క్షేత్రమునకు మధ్యగల గాజు తెర తొలగిపోయినది. ఇప్పుడు అతనికి అగపడునది నిజమగు క్షేత్రమే కానీ, దాని ప్రతిబింబము కాదు. ఇక త్యాగరాజు "తెరతీయగ రాదా   నాలోని,  తిరుపతి వెంకటరమణామత్సరమను తెరతీయగ రాదా" అన్నది; అన్నమాచార్యులు "మదమత్సరము లేక మనసుపేదై పో" అన్నది ఎంత సత్యమో అవగాహనకు వచ్చును. 

కాబట్టి, భగవంతుడిని చేరుకోవడానికి సుగంధము పూసి అలంకరించిన పూలబాటల కోసం ఎదురు చూడవద్దు అని చరణం యొక్క అర్థం. బదులుగా మీరు సమీకరించగలిగిన అన్ని శక్తులతో ఆ అడ్డువలను చించుకుని వెళ్ళు సాహసం చేయండి. లోకరంజకము తమలోనిసమ్మతము = భగవంతుని (ప్రకృతి) సంకల్పాన్ని బేషరతుగా అంగీకరించడం సమాజానికి మేలు చేస్తుందని ధృవీకరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, దైవసంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి అచంచలమైన ఏకాగ్రత మరియు తనపై సడలని విశ్వాసం (అహంకారం కాదు) అవసరం. 

రెనే మాగ్రిట్‌ చిత్రలేఖనము ద్వారా సత్యదర్శనము భాషల అంతరములను, సంస్కృతుల భేదములను అధిగమించి దేశకాల స్థితులపై అధారపడనిదని తెలుపును. అన్నమాచార్యులు ఒకేవొక పంక్తిలోనూ రెనే మాగ్రిట్‌గారు ఒక చిన్నబొమ్మలోను దివ్యత్వమును, దానికి దుర్గమమగు మార్గమును వర్ణించిరి.  

అన్వయార్ధముఈ వికారమైన ప్రపంచాన్ని బేషరతుగా అంగీకారించడమే అంతరంగ సామరస్యమునకు దారి. క్షణికమైన సంపదలు ఎటువంటి ప్రయోజనమూ కల్పించవు. 

గాదెఁబోసిన కొలుచు కర్మి సంసారంబు
వేదు విడువని కూడు వెడమాయ బదుకు
వేదనల నెడతెగుట వేంకటేశ్వరు కృపా-
మోదంబు వడసినను మోక్షంబు
గనుట ॥ఏమి॥ 

ముఖ్య పదములకు అర్ధములు: గాదెఁబోసిన =  కూడబెట్టిన, కొలుచు = ధాన్యము, వేదు విడువని కూడు = కంపు కొట్టు భోజనము, వెడమాయ బదుకు = అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. 

భావము: కూడబెట్టిన ధాన్యము లంటిది కర్మలతో గూడిన సంసారము.  కంపు కొట్టు భోజనము వంటిది అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. వేంకటేశ్వరు కృపా-మోదంబు వడసిన కదా వేదనల నుండి ముక్తి పొందుట​ మరియు  మోక్షంబు గనుట.  

వివరణము: కూడబెట్టిన ధాన్యము లాంటిది కర్మలతో గూడిన సంసారము అనగా కర్మలతో జీవితమును నింపు తున్నకొద్దీ, నిలువ వుంచిన ధాన్యము వలె పురుగు పట్టి పాడగును. నీచుకంపు వచ్చును​.  గబ్బు కొట్టు భోజనము వంటిది అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. ఇక్కడ అన్నమాచార్యులు ఒకే అర్ధము వచ్చు రెండు పంక్తుల్నెందుకు వ్రాశారో ఆలోచింతము. 

ఈ జీవితము నిలువవుంచు పదార్ధముగాదని, జీవనమొక ప్రవాహమని, అది ఎడతెరిపిలేనిదని సూచించిరి. మొదటి చరణంలో జీవనయానమును నూనెలో మునిగిన​ వత్తి కొన నుంచి చివరి మంటను చేరు నిరంతర ప్రయాణముతో  పోల్చిరి. అనగా జీవనము సంచయములేని గమనము అనిరి. మానవుడు తన జీవిత ధ్యేయము నెరుగుటకు బదులు ప్రోగుచేయుట యందు మనసు పడుచున్నాడనిరి. దిశనే తప్పినప్పుడు మార్గమేమి చేయుటకు వలసివచ్చును? 

‘వేదు విడువని#4 కూడు వెడమాయ బదుకు'ను యీ బైబిల్ (ముత్తయి 15) వాక్యముతోనూ అన్వయించవచ్చును “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? 17నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. 18కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? 19హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. 20మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు”  

అన్వయార్ధము: మానవుడా! నీవొక నిలువవుండని సరుకువని ఎఱిగి, కలిగిన అల్ప కాలమందు వేంకటేశ్వరు కృపా-మోదంబు పడయు యత్నము సేయుము.

 

కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: కడ, మొదలు లేని కోరికలతో కూడిన మనస్సును నమ్మి ఎందుకు వృథాగా ఈ లోకమున​ ఏముందని పెనుగులాడతావు?


చరణం 1: జీవనము అనేది వత్తిని ప్రకాశింపజేయు నూనె వంటిది. విత్తుమీదటి పొల్లులా విలువలేనిది దేహంబు.   భక్తిసేయుట యేమి? పాసిపోవుట యేమి? శరీరాలు పెనవేసుకొని పొరలుటకా సాంగత్యము? అన్వయార్ధము: జీవనమను వృత్తిపై  నిమగ్నమై అనంతమును అనుభవించు అవకాశమును కాలితోతన్ని చెరకురసమును వదలి పిప్పిని తినుచుంటివా?

 

 

చరణం 2: ఈ అల్లకల్లొల ప్రపంచము అపురూపము అశక్యమగు ఆయతనము. లోని సంస్కారముతో గూడిన సమ్మతము లోకరంజకము. చాకిమణుఁగులగు  (స్థిరత్వము లేని) సంపదలు చేకొనిన నేమి చెదిరినను నేమి? అన్వయార్ధముఈ వికారమైన ప్రపంచాన్ని బేషరతుగా అంగీకారించడమే అంతరంగ సామరస్యమునకు దారి. క్షణికమైన సంపదలు ఎటువంటి ప్రయోజనమూ కల్పించవు.

 

చరణం 3: కూడబెట్టిన ధాన్యము లంటిది కర్మలతో గూడిన సంసారము.  కంపు కొట్టు భోజనము వంటిది అల్పము, తుచ్ఛము, వ్యర్ధము అగు బతుకు. వేంకటేశ్వరు కృపా-మోదంబు వడసిన కదా వేదనల నుండి ముక్తి పొందుట​ మరియు  మోక్షంబు గనుట.  అన్వయార్ధము: మానవుడా! నీవొక నిలువవుండని సరుకువని ఎఱిగి, కలిగిన అల్ప కాలమందు వేంకటేశ్వరు కృపా-మోదంబు పడయు యత్నము సేయుము.

 

 

References and Recommendations for further reading:

#1 105. కనినవాఁడాఁ గాను కాననివాఁడాఁ గాను (kaninavADA gAnu kAnanivADA gAnu)

#2 89. తలఁపులోననే దైవము వీఁడిగో (talapulOnanE daivamu vIDigO)

#3 137 ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము (AtaninE nE kolichi nE naMditi bO nijasukhamu)

#4 36. ఏది జూచినఁ దమకు (Edi jUchina damaku)

#5 https://mikesavad.com/featured/optical-illusion-bothersome-fly-mike-savad.html

 

Wednesday, 14 September 2022

141 nAnATi baduku nATakamu (నానాఁటి బదుకు నాఁటకము)

 ANNAMACHARYULU

141 నానాఁటి బదుకు నాఁటకము

(nAnATi baduku nATakamu)

for Telegu (తెలుగు) Version press here 

Introduction:  Annamacharya described the difference between action and attempting to act as drama of life in this serene, soul-filling verse, thus the wording of the chorus. 

Writing a commentary on this well-known poem is a challenge. One may wonder why explain something which is quite clear. However, Annamacharya weaved many surprise phrases like "Kanaka kannadi" ("కానక కన్నది") to denote something we see but do not actually see.  Here, Annamacharya referred to the distinction between reality and what we perceive and believe as drama. By gradually changing the meaning of the word 'Kaivalyamu' ('కైవల్యము' = liberation) he emphasizes that it is not a destination that can be chosen by a human being.

 

కీర్తన:

రాగిరేకు:  299-5  సంపుటము: 3-576

POEM

Copper Leaf:  299-5  Volume: 3-576

నానాఁటి బదుకు నాఁటకము
కానక కన్నది కైవల్యము ॥పల్లవి॥
 
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును
కట్టఁగడపటిది కైవల్యము ॥నానాఁ॥
 
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాఁటినపుడే కైవల్యము     ॥నానాఁ॥
 
తెగదు పాపమును తీరదు పుణ్యము
నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక
గగనము మీఁదిది కైవల్యము    ॥నానాఁ॥
nAnATi baduku nATakamu
kAnaka kannadi kaivalyamu pallavi
 
puTTuTayu nijamu pOvuTayu nijamu
naTTanaDimi pani nATakamu
yeTTaneduTa galadI prapaMchamunu
kaTTagaDapaTidi kaivalyamu nAnA
 
kuDichE dannamu kOka chuTTeDidi
naDumaMtrapu pani nATakamu
voDi gaTTukonina vubhayakarmamulu
gaDi dATinapuDE kaivalyamu nAnA
 
tegadu pApamunu tIradu puNyamu
naginagi kAlamu nATakamu
yeguvane SrIvEMkaTESvaru DElika
gaganamu mIdidi kaivalyamu nAnA

 

 

Details and Explanations: 

            నానాఁటి బదుకు నాఁటకము
            కానక కన్నది కైవల్యము   ॥పల్లవి॥

nAnATi baduku nATakamu
kAnaka kannadi kaivalyamu pallavi 

Word to Word meaning: నానాఁటి (nAnATi) = day by day; బదుకు (baduku) = life; నాఁటకము (nATakamu) = a drama, a play, an act; కానక కన్నది (kAnaka kannadi) = అతి కష్టముమీద కనినదైననూ కలిగెనని తెలుపలేనిది, seen yet not seen; that cannot be ascertained; కైవల్యము (kaivalyamu) = the liberation.

Literal meaning: Present day to day life is a drama. With great concentration, one may experience the truth but cannot be ascertained with any certainty. (Therefore, even that may be termed as drama by public.) 

Explanation: The wording కానక కన్నది (=seen yet not seen, kAnaka kannadi) is something like the picture of cube (given below) by MC Escher. It looks very much possible. On close look it is impossible. But it draws you back with its magnetic attraction that it is possible.


 

If one is pursuing truth for the sake public, family or tradition, it remains an act, a practice, an observance, a drama. Thus, Annamacharya issued a warning at the beginning itself.  The intensity with which Annamacharya wrote poems can be measured in this single chorus. 

A drama necessarily involves the actor(s), oral or written script and audience. Here in the drama life the same person is the actor, he writes his own script and unfortunately, he is the primary audience for his life. It's anyone's guess as to which direction this drama will lead. Hence, mankind has remained stagnant for a long time. 

From a drama, we derive certain satisfaction, certain entertainment. Who will pay to watch such insipid, slow and dull drama of life of ours? By our present cinema standards, it’s an utter flop show. Yet the actor in chief feels he is doing a great job!! What an indifference! If this is not drama what else is? 

At this juncture, I am reminded of a poem by Vanamamalai Varadacharyulu. I am giving a free translation the same below.   

Know they are coming to the stage
Know they go away from this page
Know many come every age
None know where they go amaze

Know not where they go,
Yet they come, act and go
Know not text prepared so
Yet not know that director so 

Further, Annamacharya is clearly indicating we are not prepared to conduct this drama of life. It appears like the popular Irish Proverb All the world is a stage; We are desperately unrehearsed”.

Implied meaning: Put an end to the drama to live the vital life.

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును
కట్టఁగడపటిది కైవల్యము ॥నానాఁ॥
 
puTTuTayu nijamu pOvuTayu nijamu
naTTanaDimi pani nATakamu
yeTTaneduTa galadI prapaMchamunu
kaTTagaDapaTidi kaivalyamu nAnA


Word to Word meaning: పుట్టుటయు (puTTuTayu) = birth; నిజము (nijamu) = truth; పోవుటయు (pOvuTayu) = death; నిజము (nijamu) = truth; నట్టనడిమి (naTTanaDimi) = in the middle; పని (pani) = acts, works, errands; నాఁటకము (nATakamu) = a drama (more in the sense of an illusion); యెట్టనెదుటఁ (yeTTaneduTa) = in front (of all); గలదీ (galadI)= existing; ప్రపంచమును (prapaMchamunu) = in this world;  కట్టఁగడపటిది (kaTTagaDapaTidi) = the very last thing; కైవల్యము (kaivalyamu) = liberation;
 

Literal meaning: In between these tangible realities birth and death#1 you play the drama (of your own script). The last thing and the lasting thing in the world before you is the truth. 

Explanation: Annamacharya started the disambiguation when he says the last and the lasting thing in this world is the truth. The truth remains that there are no two worlds. 

Man in his imagination constructs two worlds. The other world he always dreamt to be a utopia, where he will not be touched by the sorrow. Annamacharya and modern philosophers like Jiddu Krishnamurti do not agree with this concept. The Implied meaning of Bhagavad-Gita verse 6-29 is also the same. 

Thus, the man’s belief in the world bereft of troubles is just an imagination, an illusion. Therefore, Annamacharya called it as నాఁటకము (nATakamu = drama).

Implied meaning: Observe the world without aberrations. The truth is here in front of you.#2 

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాఁటినపుడే కైవల్యము ॥నానాఁ॥
 
kuDichE dannamu kOka chuTTeDidi
naDumaMtrapu pani nATakamu
voDi gaTTukonina vubhayakarmamulu
gaDi dATinapuDE kaivalyamu nAnA

 

Word to Word meaning: కుడిచే దన్నము (kuDichE dannamu) = the food we eat; కోక (kOka) = cloth; చుట్టెడిది (chuTTeDidi) = to wrap; నడుమంత్రపు (naDumaMtrapu) = మధ్యకాలమునఁ గలిగినది, An interval; middling i.e., neither here nor there (by middling Annamcharya intended to describe shortness of life); పని (pani) = work, errand;  నాఁటకము (nATakamu) = a drama (more in the sense of an illusion); వొడిఁ గట్టుకొనిన (voDi gaTTukonina) = resorting to undesirable things (here implying accumulated undesirable things); వుభయకర్మములు (vubhayakarmamulu) = both sins and virtues; గడి (gaDi) = a limit, a boundary;  దాఁటినపుడే (dATinapuDE) = when overtaken, when crossed; కైవల్యము (kaivalyamu) = liberation;      

Literal meaning: the food we take and the cloth we wrap are necessary. But glorifying them in this small interval (between birth and death) is the drama man performs. When man crosses the boundaries created by virtues and sins, i.e., when he no longer has any relationship with them, possibility exists for liberation.

Explanation: Annamacharya often repeats this motif of food to emphasize its primal nature on the human mind. Everything that a person does in this world, it always remains at the back of his memory. Readers are requested to consider the painting below by Rene Magritte (titled: the Portrait).  I hope readers will appreciate painting despite its European cultural accent.


 

The eye on the plate looks directly at the viewer. it perhaps questions the human obsession with food. Eli Siegel who claims that in digesting food people are "using the world" in their way. Chaim Koppelmann believes that despite Magritte's dislike of symbols he painted the eye as a symbol of conscience. However, the eye in 'The Portrait' stresses that food be taken seriously and respected. 

Magritte had put the elegant title 'the Portrait' (Le Portrait); with a small change he left the viewers in surprise and uncertainty.  Thus, he portrayed the real heart of a man. When we view these pictures in their perspectives, it becomes clear that man’s favourite pass time i.e., search of food and security, is baseless#3. Impartial view of history is interplay of food and security with the facades of pretexts changing to suit the times. 

వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు / గడి దాఁటినపుడే కైవల్యము:  Virtues are the most important thing man tries to engage in life. The fact remains that these are our collective projections, not necessarily correct. Annamacharya said, one may understand what liberation is only when one crosses the assumed boundaries of virtues and sins. Similar idea can be found in Bhagavadgita verse बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते (2-50) buddhi-yukto jahātīha ubhe sukṛita-duṣhkṛite Purport:  One who prudently practices the science of action without attachment shall get rid of both virtues and sins in this life itself. That is the equanimity. 

Implied meaning: Man! Things that distract you are the ones that you dramatize. They entice you away from freedom with the promise of virtues.

తెగదు పాపమును తీరదు పుణ్యము
నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక
గగనము మీఁదిది కైవల్యము ॥నానాఁ॥
 
tegadu pApamunu tIradu puNyamu
naginagi kAlamu nATakamu
yeguvane SrIvEMkaTESvaru DElika
gaganamu mIdidi kaivalyamu nAnA

Word to Word meaning: తెగదు (tegadu) = cannot disconnect; పాపమును (pApamunu) = sin and; తీరదు (tIradu) = never ending (here used in the sense of never can be completed);  పుణ్యము (puNyamu) = virtuous deeds; నగినగి (naginagi) = chuckling away; కాలము (kAlamu) = time; నాఁటకము (nATakamu) = drama (more in the sense of an illusion); యెగువనె (yeguvane) = high above;  శ్రీవేంకటేశ్వరుఁ (SrIvEMkaTESvaru) = Lord Venkateswara; డేలిక (DElika) = the ruler, the master;  గగనము (gaganamu) = దుర్లభము, impossible;  మీఁదిది (mIdidi) = beyond;  కైవల్యము (kaivalyamu) = the truth;       

 

Literal meaning: Man cannot disconnect himself from the dirt and sin. Similarly, he can never achieve virtue. While this drama continues, the time chuckles and flies away.  High above all these, the master, the ruler Venkateswara is there. The truth is beyond the impossibility.

Explanation: the purpose of the stanza is to emphasize the attempts to do good and avoidance of sin are met with internal resistance. In the famous novel, the strange case of Dr Jekyll and Mr Hyde by R L Stevenson, Dr Jekyll with all his good qualities tilts towards being Mr Hyde in the end. Same is the case with all of us. 

గగనము మీఁదిది కైవల్యము (gaganamu mIdidi kaivalyamu) = is indicating that man often is afraid of the impossible. But he does not look into it to find what is actually possible. Hackneyed dismissal of impossible is not an enquiry, but conditioned reflex. 

Implied Meaning: The endeavour to reach the Lord Without taking the cue of Virtues and Sins, caring less for the difficulty of the task, as if there is no time left, is action. Everything else is drama


References and Recommendations for further reading:

#1 4. ఇన్ని చదవనేల (inni chaduvanEla)

#2 96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)

#3 కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు (kaDaluDipi nIrADagA dalachuvAralaku)

 

 

 

 

 

Summary of this Keertana:

 

Chorus: Present day to day life is a drama. With great concentration, one may experience the truth but cannot be ascertained with any certainty. (Therefore, even that may be termed as drama by public.) Implied meaning: Put an end to the drama to live the vital life.

 

Stanza 1: In between these tangible realities birth and death you play the drama (of your own script). The last thing and the lasting thing in the world before you is the truth. Implied meaning: Observe the world without aberrations. The truth is here in front of you.

 

Stanza 2: the food we take and the cloth we wrap are necessary. But glorifying them in this small interval (between birth and death) is the drama man performs. When man crosses the boundaries created by virtues and sins, i.e., when he no longer has any relationship with them, possibility exists for liberation. Implied meaning: Man! Things that distract you are the ones that you dramatize. They entice you away from freedom with the promise of virtues.

 

Stanza 3: Man cannot disconnect himself from the dirt and sin. Similarly, he can never achieve virtue. While this drama continues, the time chuckles and flies away.  High above all these, the master, the ruler Venkateswara is there. The truth is beyond the impossibility. Implied Meaning: The endeavour to reach the Lord Without taking the cue of Virtues and Sins, caring less for the difficulty of the task, as if there is no time left, is action. Everything else is drama

 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...