Saturday, 30 July 2022

134 ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే (unnachOTanE mUMDulOkA lUhiMchi chUchitE nIvE)

 ANNAMACHARYULU

134 ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే

(unnachOTanE mUMDulOkA lUhiMchi chUchitE nIvE)

 

WHOLENESS OF LIFE

 

Those interested in Telegu Version may press this link

 

Introduction:  Annamacharya in this deep scrutiny questions the basis for searching God. In this landmark poem, he shelves the idea of travelling somewhere to find God.  He suspects man's pride in professing purity of heart.

In this dissecting poem, he shreds man’s intentions to assert we don’t have basis to seek but has the option to remain in the service of God. 

The apparent iconoclastic stance of this saint from the 15th century only serves to emphasise how foolish humans are and not to shake his belief in God. His poetry acts more like a knife to cut through our firmly fixed mental postures. His poems radiate invisible rays that leave an impression on readers' hearts. 

 

కీర్తన:

రాగిరేకు:  213-6  సంపుటము: 3-78


ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానఁడింతే కాక   ॥పల్లవి॥
 
యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల
కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁడింతేకాక       ॥ఉన్న॥
 
యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా
దోమటి సంసారపు దొంతికర్మములఁ జిక్కి
కాముకుఁడై కిందుమీఁదు గానఁడింతేకాక     ॥ఉన్న॥
 
యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ
శ్రీవేంకటేశ్వరు సేవచేత నుండఁగా
భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు
కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక     ॥ఉన్న॥

POEM

Copper Leaf:  213-6     Volume: 3-78


unnachOTanE mUMDulOkA lUhiMchi chUchitE nIvE
kannachOTanE vedaki kAnaDiMtE kAka pallavi
 
yekkaDa voyyeDi jIvu DEdi vaikuMThamu
yikkaDa hari yunnADu hRdayamaMde
mukkuna nUrupu mOchi muMchi puNyapApAla
kakkasAna jikki tammu gAnaDiMtEkAka unna
 
yEmi vichAriMchI dEhi yeMdu dEvuni vedakI
kAmiMchi yAta DinniTA galiguMDagA
dOmaTi saMsArapu doMtikarmamula jikki
kAmukuDai kiMdumIdu gAnaDiMtEkAka unna
 
yE vidhulu tA jEsI yevvari nADagabOyI
SrIvEMkaTESvaru sEvachEta nuMDagA
bhAva mAtaDugAnu bratike nidivO nEDu
kAvarAna ninnALlu kAnaDiMtEkAka       unna

 

 

Details and Explanations:

ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే
కన్నచోటనే వెదకి కానఁడింతే కాక          ॥పల్లవి॥
 
unnachOTanE mUMDulOkA lUhiMchi chUchitE nIvE
kannachOTanE vedaki kAnaDiMtE kAka        pallavi 

Word to Word meaning:  ఉన్నచోటనే (unnachOTanE) = stay in the same place;  మూఁడులోకాలు (mUMDulOkAlu) = స్వర్గ మర్త్య పాతాళములను మూడు లోకములు, the three worlds Heaven, Earth and the lower world (PataLa, अधोलोक); ఊహించి (UhiMchi) = imagine, consider, reflect; చూచితే (chUchitE) = see ( kore in the sense of find); నీవే (nIvE) = You alone;  కన్నచోటనే (kannachOTanE) = place of human birth (actually indicating man’s insatiable lust);  వెదకి (vedaki) = search;  కానఁడింతే (kAnaDiMtE) = does not find; కాక (kAka) = except, besides; 

Literal meaning: Stay where you are and reflect on all the three worlds (heaven earth and hell) at the same time and find GOD alone is there in this universe. Man tries to search God from his origins (i.e. female genital parts meaning wrong places) only to get mislead. 

Explanation: The word మూఁడులోకాలు (mUMDulOkAlu) is used to indicate to take holistic view of life, not fragment of it. (Even in annual performance appraisals, HR department often advise us to take into account the whole year, not to get influenced by recent positive or negative incidents). When viewed in its entirety the life is deadly serious business and one cannot afford to err imagining that he could correct it later.



Now have a deep look at the famous triptych painting "The Garden of Earthly Delights" by Hieronymus Bosch.  The said painting was of the same period as of Annamacharya. Some consider it as one of the greatest arts works ever made. Left most panel depicts birth. The central panel shows amorous activities of man, almost bordering animal like indulgence. The right most panel indicates the punishments of hell. The artist expresses the fears that dominated life in the Middle Ages-the insatiable weakness of man for not resisting sinful physical temptation, and eternal damnation in hell as just punishment of lustful human folly. I believe, the artist put together these make the on looker aware of fragility of human determination and to instil averse to do wrong.

It is easy to see that punishments are carried out by mechanical structures in infernal conditions. The artist directly points out that these are only fictional and therefore unreal. Similarly seething artificiality is obvious to the left panel, thus showing that both side panels are part of our imagination. The central panel points out that “The truth is that the man misses a great opportunity because of his weak faith”. 

It’s not incidental that the triptych of Bosch and this chorus are saying the same thing. The expressions of Annamacharya need to be viewed holistically as works of art of highest form.  They are not archaic statements of a hermit. They are beyond the reach of fading fashions and changing seasons. 

యెక్కడ వొయ్యెడి జీవుఁ డేది వైకుంఠము
యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల
కక్కసానఁ జిక్కి తమ్ముఁ గానఁడింతేకాక            ॥ఉన్న॥
 
yekkaDa voyyeDi jIvu DEdi vaikuMThamu
yikkaDa hari yunnADu hRdayamaMde
mukkuna nUrupu mOchi muMchi puNyapApAla
kakkasAna jikki tammu gAnaDiMtEkAka        unna

 

Word to Word meaning: యెక్కడ (yekkaDa) = Where వొయ్యెడి (voyyeDi) = go; జీవుఁడు (jIvu Du) = the atma, the person;  ఏది (Edi) = Which; వైకుంఠము (vaikuMThamu) = the abode of God, वैकुंठ;  యిక్కడ (yikkaDa) = here;  హరి యున్నాఁడు (hari yunnADu) = Lord Hari exists;  హృదయమందె (hRdayamaMde) = in the heart;  ముక్కున (mukkuna) = by the nose; నూరుపు మోచి (nUrupu mOchi) = ఊపిరి తీసుకుంటూ, allow inhalation and exhalation; ముంచి (muMchi) = మునిగి, get immersed; పుణ్యపాపాల (puNyapApAla) = good and bad;  కక్కసానఁ (kakkasAna) సంకటము, బాధ, కాఠిన్యము, మనఃక్రోధము, hardness, harshness, hardship, trouble;  జిక్కి (jikki) = get hooked;  తమ్ముఁ (tammu) = you (in respectful sense); గానఁడింతేకాక (gAnaDiMtEkAka) = except, he does not find you. 

Literal meaning: Where will the person (or atma) go after death? Where is the abode of God (वैकुंठ)? The Lord Hari stays in your heart. You are immersed in inhalation and exhalation business. In the avarice to continue this movement of air, man gets caught in trouble of separating good (pious) and bad (sin, treachery) and therefore cannot find God. 

Explanation: On the first look, through this poem, Annamacharya appears to question popular belief that man (rather his soul) goes to another world. With so many powerful observatories man installed to search space, is there single evidence of the other world. Absolutely NO. What we find is extension of material spread widely beyond the imagination, almost like fiction. Therefore, be sure, no one goes anywhere. We are the material, which we are rather less prepared to accept. 

Man takes the movement of air thru nose as measure of life. From this fundamental conviction he does all that he can to continue the life. In this process he gets trapped in various activities. When man is material, when the air is also material, inability to see that material alone cannot provide life (force) is absolute foolishness is the point made by Annamacharya. 

Thus, beyond the material considerations something else exists in all of us. That is energy of the soul mentioned in Bhagavad-Gita verse (जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्: 7-5). From this, we may take ముక్కున నూరుపు మోచి mukkuna nUrupu mOchi as man takes responsibility to stay alive is not necessarily a correct posture. When one has absolute faith in God, he leaves it on God. (This is also the meaning of Matthew 16:24-26.   24 Then Jesus said to his disciples, “Whoever wants to be my disciple must deny themselves and take up their cross and follow me. 25 For whoever wants to save their life will lose it, but whoever loses their life for me will find it. 26 What good will it be for someone to gain the whole world, yet forfeit their soul? Or what can anyone give in exchange for their soul?) 

Scientists say that we are using only very small fraction of our brain. Philosophers say that we are living on periphery. They say man’s mind is immeasurable. However, it must be understood that this uncovering of soul energy is not a matter of personal achievement. On observing the colossus of the Garden of Earthly Delights by Hieronymus Bosch, he joined herds of people in their enamoured engagements to indicate that the basis of life (consciousness) is common to all the living beings. Something similar is meant by wording   యిక్కడ హరి యున్నాఁడు హృదయమందె (yikkaDa hari yunnADu hRdayamaMde). 

యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ
కామించి యాతఁ డిన్నిటాఁ గలిగుండఁగా
దోమటి సంసారపు దొంతికర్మములఁ జిక్కి
కాముకుఁడై కిందుమీఁదు గానఁడింతేకాక          ॥ఉన్న॥
 
yEmi vichAriMchI dEhi yeMdu dEvuni vedakI
kAmiMchi yAta DinniTA galiguMDagA
dOmaTi saMsArapu doMtikarmamula jikki
kAmukuDai kiMdumIdu gAnaDiMtEkAka        unna 

Word to Word meaning: యేమి విచారించీ (yEmi vichAriMchI) = considering what; దేహి (dEhi) = the person; యెందు (yeMdu) = where; దేవుని (dEvuni) = god; వెదకీ (vedakI) = searches; కామించి (kAmiMchi) = by compassion;  యాతఁ డిన్నిటాఁ (yAta DinniTA) = everywhere that one;  గలిగుండఁగా (galiguMDagA) = being present; దోమటి (dOmaTi) = illusion, deceit; సంసారపు (saMsArapu) = wordly; దొంతికర్మములఁ (doMtikarmamula) = dual actions; జిక్కి (jikki) = get trapped; కాముకుఁడై (kAmukuDai) = driven by the desires; కిందుమీఁదు గానఁడింతే (kiMdumIdu gAnaDiMtEkAka)) = cannot differentiate upside from low side;  loses his sense, gets blinded; కాక (kAka) = except, besides.  

Literal meaning: What is the basis for searching God? Is the man blind not to sense omnipresent god’s compassion? The man gets subdued by dual actions and therefore cannot differentiate good from evil. 

Explanation: Most often, the basis for search has been curiosity, fear and Security. These are the creations of imprudent mind. When you infer the above Matthew 16:24-26, It says God does not provide for your fear and security, for God is beyond these considerations. 

Thus, by this stanza, Annamacharya asserted that without unwavering faith in God, its impossible to cross the limitations of        imposed by the mind and its reflections. However, readers may note that all the actions of man leads to duality i.e he remains in confusion. Therefore, confusion may not be solved by remaining inside it, but by becoming an outright outsider. 

యే విధులు తాఁ జేసీ యెవ్వరి నాడఁగఁబోయీ
శ్రీవేంకటేశ్వరు సేవచేత నుండఁగా
భావ మాతఁడుగాను బ్రతికె నిదివో నేఁడు
కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక           ॥ఉన్న॥
 
yE vidhulu tA jEsI yevvari nADagabOyI
SrIvEMkaTESvaru sEvachEta nuMDagA
bhAva mAtaDugAnu bratike nidivO nEDu
kAvarAna ninnALlu kAnaDiMtEkAka   unna

 

Word to Word meaning: యే విధులు (yE vidhulu) = what procedures; తాఁ జేసీ (tA jEsI) = by performing; యెవ్వరి (yevvari) = who; నాడఁగఁబోయీ (nADagabOyI) = by blaming; శ్రీవేంకటేశ్వరు (SrIvEMkaTESvaru) = Lord Venkateswara;  సేవచేత (sEvachEta) = by his service;  నుండఁగా (nuMDagA) = is available;  భావ మాతఁడుగాను (bhAva mAtaDugAnu) = the feelings are his;  బ్రతికె (bratike) = as life;  నిదివో నేఁడు (nidivO nEDu) = today (used more in the sense of every running moment); కావరాన (kAvarAna) = due to ego, due to pride; with arrogance;  నిన్నాళ్లు (ninnALlu) =  all these days; కానఁడింతేకాక (kAnaDiMtEkAka) = fail to see;  

Literal meaning: What procedures one need to perform to reach God? (none). Who one has to blame? (none). Is it not a better to live a life every moment as the Lord Venkateswara’s feelings? O Fool! arrogance and pride are blinding you from truth. 

Explanation: like the western philosophers, Annamacharya always finds the roots of our wrong action in our pride (అహంకారము). As usual he does not find a method to reach God by any action, except unconditional submission of will to the Lord. The word బ్రతికె (bratike) is more close to the sense used in Matthew 16-26 (ref 2nd stanza). 

Repeated use of word కానఁడింతేకాక (kAnaDiMtEkAka) is indicating Bhagavad-Gita pronouncement : पश्यति पश्यति ya paśhyati sa paśhyati = They alone truly see, whose mind is prepared to see. This is more like Louis Pasteur statement “In the fields of observation chance favours only the prepared mind. 

There are many, who wish salvation as product to be purchased from a shop called religion. These kind people are filled with pride of pocession of money, power and knowledge – for them Annamacharya wrote కావరాన నిన్నాళ్లు కానఁడింతేకాక. 

To conclude this complex, rather overwhelming poem, let me put the synopsis.  This poem is about wholeness of life. Like the Garden of Earthly Delights, it paints complete picture before us. Its your choice.

 

References and Recommendations for further reading:

#1: Hieronymus Bosch, The Garden of Earthly Delights (Full Length): Great Art Explained


Summary of this Keertana: 

Chorus: Stay where you are and reflect on all the three worlds (heaven earth and hell) at the same time and find GOD alone is there in this universe. Man tries to search God from his origins (i.e. female genital parts meaning wrong places) only to get mislead.  

 

Stanza 1: Where will the person (or atma) go after death? Where is the abode of God (वैकुंठ)? The Lord Hari stays in your heart. You are immersed in inhalation and exhalation business. In the avarice to continue this movement of air, man gets caught in trouble of separating good (pious) and bad (treachery) and therefore cannot find God.

 

Stanza 2: What is the basis for searching God? Is the man blind not to sense omnipresent god’s compassion? The man gets subdued by dual actions and therefore cannot differentiate good from evil.

 

Stanza 3: What procedures one need to perform to reach God? (none). Who one has to blame? (none). Is it not a better to live a life every moment as the Lord Venkateswara’s feelings? O Fool! arrogance and pride are blinding you from truth.

 

 

 

 

 

Thursday, 21 July 2022

T-133 ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను

 

తాళ్లపాక పెదతిరుమలాచార్యులు

133 ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను 

Those interested in English Version may press this

 

ఉపోద్ఘాతము:  తాళ్లపాక పెదతిరుమలాచార్యులు అన్నమాచార్యుల కుమారుడు. పెద తిరుమలాచార్యులు తన తండ్రి లాగే అనేక కీర్తనలు రచించాడు. ప్రజలతో మమేకమవ్వడానికి  పసివానివలె అమాయకమైన విజ్ఞప్తులతో మెప్పిస్తాడు. ఆకర్షిస్తాడు. 

మానవుడు తన అజ్ఞానంతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అతడు దగ్గర ఉన్న అన్ని ఉపాయాలనే పాచికలు విసురుతాడు.  తన సామర్థ్యాలను దేవునికి నిరూపి౦చాల్సిన అవసర౦ లేదని గ్రహించడు.  ఆయనతో ఉండటమే 'అక్కడికి' చేరుకోవడం అని తెలియక నానా అవస్థలూ పడతాడు. 

దైవమును  చేరుటకు ప్రజలు ప్రార్థనలు, పూసలు లెక్కిస్తూ జపములు,  పూజలు, సారెలు, సేవలు, ఆచారాలు, నృత్యాలు, కఠినమైన క్రమశిక్షణలు మరియు ధ్యానం వంటి వివిధ పద్ధతులను అవిరామముగా ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన ప్రజలను విమర్శించాడు. విచిత్రమేమిట౦టే, భక్తిపూర్వక సమర్పణ లేకు౦డా, ఈ విషయాలు అస్సలు లెక్కలోనికే రావు.  భక్తి ఉంటే ఈ పద్ధతులేవీ అవసరంలేదు. 

ఈ కవిత యొక్క నిజమైన సందేశాన్ని స్పష్టమైన యాంత్రిక, అసంకల్పిత చర్యలను తెరల వెనుక దాచి ఉంచారు. తపస్సు (ధ్యానం) అనునది అయోమయాన్ని విస్మరించే ప్రయాణము. అది కొంటెతనము నుండి దూరంగా జరుగు సన్నాహము.  

 

కీర్తన:

శ్రీరంగం రాగిరేకు:  18-17  సంపుటము: 15-449


ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను
దట్టపుటాసల నిన్నుఁ దడవుచున్నాఁడను ॥పల్లవి॥

పలుమారు మొక్కఁగాను పరాకు సేసిన ట్టౌనో
మలసి జపించఁగాను మతి యెంత గరఁగునో
కొలువఁగా గొలువఁగా కొసరిన ట్టౌనో
తల పెఱుఁగక నిన్నుఁ దగులుచున్నాఁడను ॥ఎట్టు॥
 
చేరి పూజించఁగా నిన్నుఁ జిక్కించు కొన్న ట్టౌనో
సారె నారగింపంచగా చవి మరపిన ట్టౌనో
వూరకే సేవ సేయఁగా వొలవేసినట్టౌనో
నోరఁగొలఁదుల నిన్ను నుతింపుచున్నాఁడను ॥ఎట్టు॥
 
ఆటలాడి నవ్వించఁగా నలయించి నట్టౌనో
పాటించి శరణనఁగా పట్టి పెనఁగిన ట్టౌనో
వాటమై శ్రీవేంకటేశ వరదుఁడవు నీ వైతే
మేటి నా యాసల నిన్ను మెప్పించుచున్నాఁడను ॥ఎట్టు॥

 

Details and Explanations: 

ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను
దట్టపుటాసల నిన్నుఁ దడవుచున్నాఁడను ॥పల్లవి॥ 

భావము: ఇటువంటి వాఁడనైన నన్ను ఎట్టు మన్నించెదవో?  ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను  (గుడ్డిగా) తడుముతున్నాను.

వివరణము: తిరుమలాచార్యులు తన స్పష్టమైన మరియు నిజాయితీతో కూడిన ప్రకటనతో మనలను ఆకట్టుకుంటాడు. ఎ౦.సి. యెస్చెర్ గారి ఈ క్రి౦ద ఉన్న చిత్ర౦లాంటి గాలిలో ఎగిరే కోట గురి౦చి ఒక పిల్లవానికి వర్ణి౦చామనుకోండి. అది పిల్లవాడి మనస్సుకు ఇట్టే హత్తుకుంటుంది. 

ఇది అతని ఊహల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఇటువంటి ఇతివృత్తంపై మనకు చాలా ఫాంటసీ సినిమాలు ఉన్నాయి. పై చిత్రంలోని పాత్ర వలె, దైవముపై మనకు లెక్కలేనన్ని అధ్రువమైన భావనలు ఉంటాయి. 

బొమ్మలోని పాత్రకు మరియు ఊహించిన వస్తువుకు మధ్య చాలా దూరం ఉందని గమనించండి.  మన౦ ఊహల్లో జీవి౦చిన౦తకాల౦, ఖచ్చిత౦గా మన౦ వాస్తవికతకు దూర౦గా ఉ౦టా౦.  కీర్తనను తిరుమలాచార్యులు ఇలాంటి ఆధారాలతో రచించి వుండొచ్చు.

అన్వయార్ధము: ఎందుకో తెలియదు, కానీ క్షమిస్తావనే నమ్మకంతో వచ్చాను.

 

పలుమారు మొక్కఁగాను పరాకు సేసిన ట్టౌనో
మలసి జపించఁగాను మతి యెంత గరఁగునో
కొలువఁగా గొలువఁగా కొసరిన ట్టౌనో
తల పెఱుఁగక నిన్నుఁ దగులుచున్నాఁడను ॥ఎట్టు॥

 

ముఖ్య పదాలకు అర్ధాలు: పరాకు సేసిన ట్టౌనో = ఆదమఱపు అనుకోవు కదా!, ఏమఱపాటు అనుకోవు కదా; మలసి = విజృంభించి, అదేపనిగా; తల పెఱుఁగక  = అంతరంగమెరుగక;

భావము: పలుమారు మొక్కి పరాకు చేస్తున్నానో? అదేపనిగా జపించితే ఎంతవరకు నీ మనసు కరుగునో? కొలువఁగా గొలువఁగా కొసరినట్లౌనో? నీ అంతరంగమెరుగక తగులుచున్నాఁడనో?

వివరణము: 'తల పెఱుఁగక'తో  ఊహించలేని దైవమును మన అల్ప మనస్సులలో ఇరికించబోయి, ఆతడునూ మన వలెనే అను భావముతో మనిషి వ్యవహరించునని పెదతిరుమలాచార్యులు తెలిపిరి.

అన్వయార్ధము: తల పెఱుఁగక చేయు కార్యములన్నీ దేవుని తగులుకొనుటకు ఉపయోగపడవని తెలియుము.

 

చేరి పూజించఁగా నిన్నుఁ జిక్కించు కొన్న ట్టౌనో
సారె నారగింపంచగా చవి మరపిన ట్టౌనో
వూరకే సేవ సేయఁగా వొలవేసినట్టౌనో
నోరఁగొలఁదుల నిన్ను నుతింపుచున్నాఁడను ॥ఎట్టు॥

 

ముఖ్య పదాలకు అర్ధాలు: చవి = రుచి,  స్వాదము; నోరఁగొలఁదుల = నోటితో నేను చేయగలిగినంతా;

భావము: చేరి పూజించఁగా నిన్నుఁ చే  జిక్కించు కొన్నట్టా? ప్రసాదాలు నైవేద్యమిచ్చిన చవి మరపినట్టా? నీకు సేవ చేయబోతే వలవేసినట్టా? (నువ్వేదో చేస్తావు అను ఆశతో) శక్తికొలది నిన్ను నుతింపుచున్నాఁడను.  

వివరణము: 'నోరఁగొలఁదుల' తెలివిలేని, వివేకములేని ప్రయత్నాన్ని సూచిస్తుంది. 

అన్వయార్ధము: నోరఁగొలఁదుల పూజించినా, చవి మరపినా, దైవమును చిక్కించు కొన్నట్లు కాదు

 

ఆటలాడి నవ్వించఁగా నలయించి నట్టౌనో
పాటించి శరణనఁగా పట్టి పెనఁగిన ట్టౌనో
వాటమై శ్రీవేంకటేశ వరదుఁడవు నీ వైతే
మేటి నా యాసల నిన్ను మెప్పించుచున్నాఁడను      ॥ఎట్టు॥ 

ముఖ్య పదాలకు అర్ధాలు: నలయించి నట్టౌనో = ఆయాసపెట్టు నట్టౌనో, శ్రమపెట్టు నట్టౌనో; పట్టి పెనఁగిన ట్టౌనో = బలవంతపు పట్టు పట్టినట్లు కాదా; వాటమై = అనుకూలమైనది, త్రోవ, ౘుట్టు వెలుగు వేసిన చోటు; శ్రీవేంకటేశ వరదుఁడవు = శ్రీవేంకటేశుడా! వరములనిచ్చువాఁడవు; మేటి = కుప్పలుగా పోసిన;

భావము: ఆటలాడి నర్తించబోతాము. నీకు అలపుకలిగేలా చేస్తామో. నీయమాలు పాటించి శరణని పట్టుబడతామో. హితము, త్రోవ,  వెలుగు, చోటు నీవేనని తెలియక శ్రీవేంకటేశుడా  నీ ముంగిట కోరికల కుప్పలు పోసి విసిగిస్తామో.

వివరణము: మొదటి రెండు చరణాలలోనూ పలికించిన గమ్యములేని మానవుని వెంపర్లాటమును కొనసాగించిరి. మానవుడు స్వంత ఊహల్లో కొట్టుకొనిపోతుంటాడు. దిగువ చిత్రాన్ని లోతుగా పరీక్షించండి. 



చిత్రం మన మానసిక స్థితి గురించి మనకు చాలా విషయాలు చెబుతుంది. మన మెదడు తర్కము ప్రకారము పని చేస్తుంది. చిత్రంలో చూపిన విధంగా మనస్సు తన స్వంత మార్గాన్ని అనుసరిస్తుంది. మనస్సు వాస్తవికతను తనకు అనుకూలంగా మార్చబోవును. పాపం మెదడు ఏమి చేయుటయో నిర్ణయింపలేక అయోమయంలో పడుతుంది. అందువల్ల, మనిషి ఎప్పటిలాగానే మూర్ఖముగానే ఉంటాడు.

ఎంత ఉదాత్తమమైనవైనా కొన్ని ఆశలను దృష్టిలో పెట్టుకొని మనం చేసేవన్నీ అవివేకమైన చర్యలే. దేవునికి మన ఉద్దేశాలు వెల్లడియే. మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, మాటా మాట్లాడవలసిన అవసర౦ లేదు. మన చేతన స్పష్టంగా ఉన్నప్పుడు, పనీ చేపట్టనవసరం లేదు, ఎందుకంటే మనస్సులోని స్పష్టతయే చర్య. అదే పరమానందము.

అందుకే తిరుమలాచార్యులు భగవంతుని ఆకట్టుకోవడానికి చూడవద్దు. బదులుగా ప్రయత్నములు మాని, ఉన్నవారు ఉన్నట్లే ఉండండి. ఇతరములన్నీ దుఃఖమునకు దారులు అన్నాడు.

అన్వయార్ధము: దైవమును మెప్పించుటను యత్నములే కుర్రచేష్టలు. వానిని వీడి భగవంతుడి కోసం మీ మనస్సును తెరిచివుంచండి. అతడే మార్గము, కాంతి, అనుగ్రహము, వరము, మరియు సమస్తమూనూ.

 

References and Recommendations for further reading:

#1 24. చంచలము మానితేను సంసారమే సుఖము (chaMchalamu mAnitEnu saMsAramE sukhamu)

 

 

#2  85. ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది (evvarinErpulu jeppa niMdu nEdi)


కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: ఇటువంటి వాఁడనైన నన్ను ఎట్టు మన్నించెదవో?  ఎన్నో ఆశలు పెట్టుకొని నిన్ను  (గుడ్డిగా) తడుముతున్నాను. అన్వయార్ధము: ఎందుకో తెలియదు, కానీ క్షమిస్తావనే నమ్మకంతో వచ్చాను.

 

చరణం 1: పలుమారు మొక్కి పరాకు చేస్తున్నానో? అదేపనిగా జపించితే ఎంతవరకు నీ మనసు కరుగునో? కొలువఁగా గొలువఁగా కొసరినట్లౌనో? నీ అంతరంగమెరుగక తగులుచున్నాఁడనో? అన్వయార్ధము: తల పెఱుఁగక చేయు కార్యములన్నీ దేవుని తగులుకొనుటకు ఉపయోగపడవని తెలియుము.

 

చరణం 2: చేరి పూజించఁగా నిన్నుఁ చే  జిక్కించు కొన్నట్టా? ప్రసాదాలు నైవేద్యమిచ్చిన చవి మరపినట్టా? నీకు సేవ చేయబోతే వలవేసినట్టా? (నువ్వేదో చేస్తావు అను ఆశతో) శక్తికొలది నిన్ను నుతింపుచున్నాఁడను.  అన్వయార్ధము: నోరఁగొలఁదుల పూజించినా, చవి మరపినా, దైవమును చిక్కించు కొన్నట్లు కాదు.

 

చరణం 3: ఆటలాడి నర్తించబోతాము. నీకు అలపుకలిగేలా చేస్తామో. నీయమాలు పాటించి శరణని పట్టుబడతామో. హితము, త్రోవ,  వెలుగు, చోటు నీవేనని తెలియక శ్రీవేంకటేశుడా  నీ ముంగిట కోరికల కుప్పలు పోసి విసిగిస్తామో. అన్వయార్ధము: దైవమును మెప్పించుటను యత్నములే కుర్రచేష్టలు. వానిని వీడి భగవంతుడి కోసం మీ మనస్సును తెరిచివుంచండి. అతడే మార్గము, కాంతి, అనుగ్రహము, వరము, మరియు సమస్తమూనూ.

 

 

 


 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...