తాళ్లపాక అన్నమాచార్యులు
283 కడవ రాదు హరి ఘనమాయ
For English version press here
ఉపోద్ఘాతము
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 286-3
సంపుటము: 3-496
|
|
కడవ రాదు హరి ఘనమాయ । తెగి విడువఁగరాదు వేసరరాదు ॥పల్లవి॥ చూపుల యెదిటికి సోద్యంబైనది పాపపుణ్యముల ప్రపంచము తీపులు పుట్టించు దినదిన రుచులై పూపల సంసారభోగములు ॥కడ॥ మనసు లోపలికి మర్మంబైనది జననమరణముల శరీరము వెనవెనకఁ దిరుగు వెడ లంపటమై కనకపుటాసల కర్మములు ॥కడ॥ తగు మోక్షమునకుఁ దాపయైన దిదె నగి హరిఁ దలఁచిన నాలుకిది వెగటు దీరె శ్రీవేంకటపతియై యగపడె నిపుడు పురాకృతము ॥కడ॥
|
Details
and Explanations:
|
Telugu Phrase
|
Meaning
|
|
కడవ రాదు
హరి ఘనమాయ । తెగి
|
హరిమాయ
దాటలేము. ధైర్యముగా
|
|
విడువఁగరాదు
వేసరరాదు
|
ఆ మాయ నుండి బయటపడు ప్రయత్నము చేయక, విసుగు చెందకుండా (వేసరరాదు) నిలబడి వుండాలి.
|
భావము:
హరిమాయను
దాటలేము. కానీ ధైర్యముగా ఆ మాయ నుండి బయటపడు
ప్రయత్నము చేయక, విసుగు చెందకుండా (వేసరరాదు) నిలబడి
వుండాలి.
“విడువఁగరాదు వేసరరాదు” భగవంతుని విడువరాదు అట్లని ఆశ్రయించరాదు అని పరస్పర విరుద్ధమైన భావనలను ఒక చోట చేర్చి అన్నమాచార్యులు ఏమి చెప్పదలిచారో ఆలోచన తమ ఆలోచింతము. అన్నమాచార్యుల వారి ఇంకొక కీర్తనలో “తొడరి గాలప్పుడు తూఱ్పెత్తక తాను / విడిచి మఱచిన వెనక వెదకితే గలదా? ॥చదువులోనే॥“ (= గాలి వీచుచున్నప్పుడే తూర్పారబట్టడం చేయవలెను అలాగే మాయలకు లోనైనప్పుడే మానవుడు తాను మాయకు లోనైనానని తెలుసుకొనుటయే జ్ఞానము) అన్నారు.
అయ్యా ‘దీనిలో విశేషం ఏముంది? మా అందరికీ తెలుస్తూనే ఉంది కదా?’ అని మీరు అనవచ్చు. అవునండి మనం మాయకు లోనయి, లోనైన క్షణంలో మనం దానిని గుర్తించలేం. కొద్ది క్షణాల అనంతరం మనం గుర్తించగలం. మనది పోస్ట్ థాట్ అనగా జరిగిన తర్వాత వచ్చు స్పృహ. జ్ఞానులది జరుగుతున్నప్పుడు ఉన్న స్పృహ. రెండింటికీ ఆకాశానికి నేలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అట్లని ఇక మీదట జరుగుతున్నప్పుడు నేను గ్రహిస్తాను అని తీర్మానం చేసుకొని ఉంటే మనము గ్రహించునది అంతా కృత్రిమమని స్పష్టమవుతుంది. పైగా దీనిని కొంత కాలము తరువాత కొనసాగించలేము. కాబట్టి పైపై గ్రహింపులతో పరము (ధ్యానము నేర్చుకొనియో, తపస్సు చేసియో, కఠిన క్రమశిక్షణతోనో) సాధించ లేము.
అన్నమాచార్యుల వారి వంటి మహాత్ములు తమ కన్నులముందర వాస్తవమును కనులకు కట్టినట్లు నిలబెట్టించారు. మానవుడు తన లోపలతాను మరేవిధమైన కాంక్ష లేక భగవంతుడు ఒక్కడే అను మార్గంలో, తమకేమై పోతున్నను, తాను తానెంత నలిగిపోతున్నను భగవంతుని కృపకై మౌనముగా నిర్లిప్తంగా నిలిచి ఉండుట ఒక్కటే మానవుని చేతిలోని సాధనం.
మౌనముగా
నిర్లిప్తంగా నిలిచి ఉండుట సులభం అనిపించవచ్చు.
కానీ మన ఆలోచనలు నిర్లిప్తంగా ఉండవే. పోనీ అది కూడా సాధించాం
అనుకుందాం. ఇదంతా కృత్రిమం కాదా!. సహజం
కాని వన్నియు ధ్యానం లోనికి రావు. ఈ విధంగా చూస్తే మానవునికి
పరమాత్ముని చేరుటకు ఏ విధమైన సాధనములు లేవని తెలుస్తోంది. కాబట్టి
శరణాగతి ఒక్కటే సాధనము. ఏ విధమైన సాపేక్షతలకు లోను కాకుండా
పరమాత్మునికి తనను తాను అర్పించుకొనుటయే శరణ్యము.
పైన చెప్పినది పాశ్చాత్య దేశాలలోనూ కొంతవరకు గ్రహించిన మాట వాస్తవం. ముఖ్యంగా వారు మానవుని స్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. అటువంటి ఒక అద్భుతమైన కళాఖండము మీకు పరిచయం చేస్తున్నాను.
“Mystery and Melancholy of a Street” తో అనుసంధానము
ఈ
చిత్రాన్ని డి కిరికో వేశారు — “Mystery and Melancholy of a Street” (1914).
నాటి నుండి నేటి వరకు అది చూచిన ప్రతి ఒక్కరి మనసులో జీవించుటలోని ఒక
రహస్యమైన ప్రశ్నను, అవ్యక్త విచారారమును రేకెత్తిస్తుంది. ఇది కేవలం దృశ్యం కాదు — అది మనసు
నడిచే మార్గం, కాలపు నిశ్శబ్దంలో దాగివున్న ఆందోళన.
ముందుగా మనకు ఒక పొడవాటి కూడలి (ఇటాలియన్’లో పియాజా అంటారు) కనపడుతుంది. రెండు పొడవైన, ఆవరించుకున్న భవనాల మధ్య పండని కమలాపండు వర్ణంలో రహదారి వ్యాపించి ఉంటుంది. ఆ తెల్ల భవనపు చివర ఒక పొడవైన త్రిభుజాకార జెండా కట్టబడి వుంది — అది మానవ అహంకారమునకు ప్రతీక. మాయలో చిక్కుకున్న మనిషి తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటాడు. అతని (ఏక పక్ష నిర్ణయము) ఎజెండా తన జెండాను ఆకాశంలో ఎగరేయడమే.
చిత్రంలో నీడల ప్రభావం విస్తారంగా కనిపిస్తుంది. వెలుతురు ఒక వైపు నుంచే కాకుండా అనేక దిశల నుండి పడుతున్నట్టుంది. ఏ వెలుతురు? ఎక్కడి నుండి వస్తుంది? అన్న అనుమానం మనలో మెల్లగా ఉదయిస్తుంది — ఇది మన అంతరంగము వలెనే — వెలుగులో కనబడినా, ఆ వెలుగుకు మూలం తెలియదు.
చిన్న
పాప బండి చక్రం నడుపుకుంటూ పరుగెడుతోంది. ఆమె మీద వెలుతురు పడాలి — కానీ ఆమెను
నీడగా చిత్రించారు. ఆమెకి కొంతదూరంలో ఏదో తెలియని నీడ — మనిషిదా లేదా విగ్రహముదా
అని చెప్పలేని ఆకారం — ఎదురుగా నిలబడి ఉంది.
ఇద్దరి మధ్య రహదారిపై, వెనుకవైపు తలుపులు తెరిచి ఉన్న ఒక ఖాళీ వాహనం ఉంది — అది డెలివరీ వ్యాన్ కావచ్చు. లేదా మనిషి శరీరమనే ఖాళీ పాత్ర కావచ్చు — భవిష్యత్తులో ఆ పాప మోయబోయే బరువులేమో?
డి కిరికో
ఈ చిత్రంలో ఆకాశాన్ని దాదాపు కనిపించనీయలేదు. మన చూపులన్నీ ఆ భవనాలు, వాటి నీడలు, వాటి మధ్య రహదారి మీదే నిలబెట్టాడు. ఆ రహదారి
ఖాళీగా ఉంది — కానీ దానిలోనే అత్యంత భారం నింపి కట్టిపడేస్తాడు. అది ఎరుక చొరని గూఢత్వాన్ని,
అమంగళాన్ని, తెలియని చెడు జరగబోతున్న అభద్రతా భావనను
కలిగిస్తుంది. నీడలో చూపబడిన ఆ అమ్మాయి — ఆట, వినోదం,
కష్టరహిత జీవితం కోరుకుంటున్న మానవుని ప్రతీక. ఆ డెలివరీ వ్యాన్ — కర్మభారమునకు
సూచన. దూరంగా నిలబడ్డ నీడ — ముసలితనం, నిస్సారత, “జీవితం అంతా వ్యర్థమైపోయిందన్న” శూన్యతా భావం. దాని వెనుక సన్నని స్తంభం నీడ
— “దీని దాటి నువ్వు ఏమీ చేయలేవు, అంతా శూన్యమే” అని చెప్పే సున్నితమైన
సూచన. ఖాళీ రహదారి — జీవితం ఒంటరి ప్రయాణమని సూచిస్తుంది.
ప్రతీకాత్మక వివరణ
ఆ తెలుపు భవనము — వ్యక్తము, మనం నిర్మించుకున్న చైతన్యం. ఆ నల్లని నీడతో కప్పివున్న చీకటి భవనము — అవ్యక్తము, పూర్వస్మృతుల సమూహం. ఆ రెంటి మధ్య ఉన్న బాట — మానవుని ప్రయాణం. ఆ చిన్న పాప ప్రవేశించబోయే మార్గం — చూడటానికి మృదువుగా ఉన్నా, కానరాని గుంటలతో నిండినది. ఆ మార్గం దుష్కరము, అసాధ్యము, అంతులేని సంసార చక్రం. “పాప బొమ్మను మనిషి బొమ్మను నీడలో చూపించి రెండు కూడా మాయ లోని భాగములే; పాప నుండి మనిషిగా మారు ప్రక్రియ కూడా మాయయే” అని చెప్పారు. అందుకే అన్నమాచార్యుడు ‘విడువఁగరాదు వేసరరాదు’ అని అన్నారు — మాయ నుండి బయటపడాలని ప్రయత్నమూ మాయయే..
అన్నమాచార్యుని
పల్లవితో అన్వయం
|
Telugu Phrase
|
Meaning
|
|
చూపుల యెదిటికి సోద్యంబైనది
|
చూచుటకు ఆశ్చర్యము, అద్భుతముగా కనబడుతూ
|
|
పాపపుణ్యముల ప్రపంచము
|
ఈ పాపపుణ్యముల మిశ్రమ ప్రపంచము
|
|
తీపులు పుట్టించు దినదిన రుచులై
|
దినదినము క్రొంగొత్త రుచులై నోరూరిస్తాయి
|
|
పూపల సంసారభోగములు
|
తీయని
సంసారభోగములు.
|
భావము:
ఆశ్చర్యము,
అద్భుతము కొలుపుతూ ఈ పాపపుణ్యముల
మిశ్రమ ప్రపంచము కాన్పట్టును. దినదినము క్రొంగొత్త రుచులై నోరూరిస్తాయి తీయని
సంసారభోగములు.
గూఢార్థవివరణము:
డి
కిరికో చిత్రంతో అన్వయం
|
అన్నమాచార్యుని భావం
|
డి కిరికో చిత్రంలో ప్రతీక
|
తాత్విక అర్థం
|
|
చూపుల యెదిటికి సోద్యంబైనది
|
బంగారు వర్ణపు రహదారి
|
జీవితం బాహ్యంగా ఆకర్షణీయమైన మాయ
|
|
పాపపుణ్యముల ప్రపంచము
|
రెండు భవనాల మధ్య ఖాళీ రహదారి
|
తెలిసిన–తెలియనివాని మధ్య మనసు నడిచే మార్గం
|
|
తీపులు పుట్టించు దినదిన రుచులై
|
చక్రం తోడు పరిగెత్తే చిన్న పాప
|
భోగములో తాత్కాలిక ఆనందమును వెంబడించే మనస్సు
|
|
పూపల సంసారభోగములు
|
ఖాళీ వ్యాన్, ఖాళీ బాట
|
“ఇంకా నింప వచ్చు” అనే తపన — ఎవరూ చూడటం లేదన్న
ధైర్యం
|
ఉల్లేఖనీయ నిర్ణీతార్థము:
పై దానిని వడకట్టుతూ పోతే ఈ క్రింది వాక్యములు బయటపడతాయి:
|
Telugu Phrase
|
Meaning
|
|
మనసు లోపలికి
మర్మంబైనది
|
పైన చెప్పుకున్నదంతా అర్ధమైనట్లు కనబడినా ఏదో తెలియని
మర్మము పూర్తిగా తెలియకుండా అడ్డుపడుతుంది
|
|
జననమరణముల శరీరము |
ఈ శరీరము జననమరణములకు లోనగునని (మనస్పూర్తిగా అంగీకరించలేము)
|
|
వెనవెనకఁ
దిరుగు వెడ లంపటమై
|
(లంపటములు =గొడ్డు మెడకు వేలాడగట్టిన రెండుకొయ్యల పలకలు -దాన్ని పరిగెత్తనివ్వవు) వెనవెనక తిరుగుతు ఇంకా కావాలి
ఇంకా కావాలి అను తహతహ లంపటమై
|
|
కనకపుటాసల
కర్మములు
|
బంగారం లాంటి ఆశలు కర్మములై వుండును
|
సూటి భావము:
పైన చెప్పుకున్నదంతా
అర్ధమైనట్లు కనబడినా ఏదో తెలియని మర్మము పూర్తిగా తెలియకుండా అడ్డుపడుతుంది. ఈ శరీరము
జననమరణములకు లోనగునని (మనస్పూర్తిగా అంగీకరించలేము). వెనవెనక తిరుగు ఇంకా కావాలి ఇంకా
కావాలి అను తహతహ గొడ్డు మెడకు వేలాడగట్టిన
రెండుకొయ్యల పలక మాదిరి అడ్డుగా మారి బంగారం లాంటి ఆశల కర్మములో త్రిప్పుతూ వుంచును.
గూఢార్థవివరణము:
డి
కిరికో గారి బొమ్మలో చక్రం తిప్పుతూ పరుగెత్తే చిన్నారి —
ఆమెకు ఆ ఆట తప్ప వేరే లోకం లేదు.
రహదారి అంతా ఆమెకు పూల బాటగానే కనిపిస్తుంది.
దూరంలో తాను ఒక రోజు ముసలిదానిగా మారిపోతానని
ఆమె ఊహించదు, ఒప్పుకోదు, పరిగణించదు.
|
అన్నమాచార్యుల పాదము
|
డి కిరికో చిత్రంలో ప్రతీక
|
తాత్త్విక వ్యాఖ్యానం
|
|
మనసు
లోపలికి మర్మంబైనది
|
ఏ దిశ
నుండి పడుతున్నదో తెలియని కాంతి
మూలము, విరుద్ధ నీడలు సృష్టించుచూ
|
అవగాహన
అనే దాని స్వరూపం సులభంగా చెప్పలేము. మనము అవగాహన లేని స్థితి నుండి చైతన్య స్థితికి
వస్తాము; మరల తెలియకుండానే తిరిగి ఆ నిద్రావస్థలోకి
జారిపోతాము. కృషితో నిలబెట్టుకునే చైతన్యం నిజమైన అవగాహన కాదు — అది కూడా మాయలో భాగమే.
|
|
జననమరణముల
శరీరము
|
వీధి
చివరలో తలుపులు తెరిచి ఉన్న ఖాళీ వాన్
|
ఆ
వాన్ ఈ క్షీణించు శరీరానికి ప్రతీక. అది ఆత్మ వెళ్ళే పాత్రను సూచిస్తుంది; జీవన మరణ చక్రాన్ని, ఈ
శరీరపు తాత్కాలికతను గుర్తు చేస్తుంది.
|
|
వెనవెనకఁ
దిరుగు వెడ లంపటమై
|
చక్రం
తిప్పుతూ పరుగెత్తుతున్న చిన్నారి
|
ఆ
చక్రం అంతులేని తపన, అలవాటు చక్రాన్ని సూచిస్తుంది.
కోరిక నిరంతరం తిరుగుతూ జీవనాన్ని ఆటలాగా చూపుతుంది కానీ మనసును బంధనంలో
ఉంచుతుంది.
|
|
కనకపుటాసల
కర్మములు
|
మెరిసే
కానీ ఖాళీగా ఉన్న బంగారు రంగు రహదారి
|
బయటకు
అందంగా కనిపించే ఆ బంగారు మార్గం లోపల ఆసక్తి బంధనాన్ని కనబడనీయదు. ఇంద్రియ
సుఖములు కర్మబంధనముగా మారిపోతాయి.
|
నిర్ణీతార్థము:
మానవుడు
తన శక్తి, చాతుర్యంపై నమ్మకం ఉంచి అనంతమైన కోరికలలో మునిగిపోతాడు. దేహానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడంతో మనసుని అనుసరిస్తుంది. జీవిత చక్రం ఈ విధంగా అవగాహన — అజ్ఞానం — అవగాహన మధ్య తిరుగుతూ ఉంటుంది. ఇంకొంచం
జాగ్రత్తగా చూస్తే భగవద్గీతలో (2-28) చెప్పిన వ్యక్తం నుంచి
అవ్యక్తమునకు మార్గమే జీవితం అని తెలుస్తోంది. విచిత్రంగా డీ
కిరికో గారి బొమ్మలో కూడా ఇదే అర్థం ప్రతిధ్వనిస్తోంది.
మూడవ చరణం:
|
Telugu Phrase
|
Meaning
|
|
తగు మోక్షమునకుఁ దాపయైన దిదె
|
మోక్షమునకు నిచ్చిన వంటిది ఇదే
|
|
నగి హరిఁ దలఁచిన నాలుకిది
|
నవ్వుతూ హరిని నిరంతరమూ తలుచు నాలుక
|
|
వెగటు దీరె శ్రీవేంకటపతియై
|
నా కష్టమంతా తీరి శ్రీ వెంకటపతియై
|
|
యగపడె నిపుడు పురాకృతము
|
నాకిప్పుడు ఎరుకకు వచ్చినవి పూర్వ జన్మలో నేను చేసిన
పుణ్యపాపముల దొంతర.
|
ఈ
జీవితము మోక్షమునకు నిచ్చెన వంటిది. నవ్వుతూ హరిని నిరంతరము తలచు నాలుకయే
అదృష్టము. ఇప్పుడు నా కష్టమంతా తీరి శ్రీ వెంకటపతి కృపతో
పూర్వ జన్మలో నేను చేసిన పుణ్యపాపముల దొంతర ఎరుకకు వచ్చినది.
గూఢార్థవివరణము:
ఈ కీర్తన ముఖ్య సందేశం

Nice explanation about life
ReplyDelete