Wednesday, 24 March 2021

33. గుఱ్ఱాలఁ గట్టని (gu~r~rAla gaTTani)

 

ANNAMACHARYA

33. గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ

 

Introduction, Annamacharya In this cleverly worded verse, says man in his arrogance, without pausing for a moment, assumes the position of the rider for the horseless vehicle called body. 

He is critical of this unwanted liberty taken by man. Annamacharya wants all of us to introspect who should be the true rider? Which is the vehicle? Without freedom of mind, the rider is less likely to explore this beautiful inner world. 

ఉపోద్ఘాతము: చమత్కారమైన కీర్తనలో మనిషి అహంభావం కొలది, క్షణం కూడా ఆలోచించకుండా, తానే రౌతునని గుఱ్ఱాలు లేని దేహమనే వాహనాన్ని  అధిరోహిస్తాడు అంటారు అన్నమాచార్యులు. 

మనిషి  గర్వంతో చేతిలో తీసుకున్న స్వేచ్ఛను అన్నమాచార్యులు విమర్శించారు. ప్రతీ ఒక్కరూ, అసలైన రౌతు (సారథి) ఎవరు, నిజమైన రథమేది  అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. భగవంతుని కృప లేకుండా అత్యద్భుతమైన ఆత్మావలోకనం పైపైనే మిగిలి అసంపూర్ణమగునని సూచించారు. 

గుఱ్ఱాలఁ గట్టని తేరు కొంక కెందైనాఁ బారీ

విఱ్ఱవీఁగుచుఁ దీసీని వేడుకతో జీవుఁడు            ॥పల్లవి॥

 

gu~r~rAla gaTTani tEru koMka keMdainA bArI
vi~r~ravIguchu dIsIni vEDukatO jIvuDu         pallavi 

Word to word meaning: గుఱ్ఱాలఁ (gu~r~rAla) = horses;  గట్టని (gaTTani) = not tied; తేరు = car, vehicle;  కొంకక = without hesitation;  ఎందైనాఁ  = any where; బారీ = to run; having it moved;  విఱ్ఱవీఁగుచుఁ  (vi~r~ravIguchu) = wanton pride; దీసీని (dIsIni) = take out; వేడుకతో (vEDukatO) = జీవుఁడు (jIvuDu) = living being. 

Literal meaning: On this horseless vehicle, without any hesitation, with pride (that he knows or  he can tackle), man takes up the journey.  

Implied meaning: man's very assumption that he is the rider is lopsided. Man's life goes astray due to this wrong assumption 

భావము: గుఱ్ఱాలు లేని దేహమనే వాహనాన్ని కొంచెమైనా జంకు కొంకు లేకుండా, ఎక్కడికైనా విఱ్ఱవీఁగుచూ జీవుడు నడిపిస్తాడు. 

విశేష  భావము: నర రథానికి నేనే వాహకుడననే అపోహతో మానవుడు సవారీ చేస్తూ దారితప్పుతాడు. 

సరి పిఱుఁదే రెండు జంటబండికండ్లు

సరవితోఁ బాదాలు చాఁపునొగలు
గరిమఁజూపులు రెండు గట్టిన పగ్గములు
దొరయై దేహరథము దోలీఁబో జీవుఁడు   ॥గుఱ్ఱాల॥ 

sari pi~rudE reMDu jaMTa baMDi kaMDlu

saravitO bAdAlu chApu nogalu
garima jUpulu reMDu gaTTina paggamulu
dorayai dEharathamu dOlIbO jIvuDu       gu~r~rA

Word to word meaning: సరి (sari) = even;  పిఱుఁదే (pi~rudE) = buttocks; రెండు (reMDu) = two; జంట (jaMTa) = pair; బండికండ్లు (baMDi kaMDlu) = head lights of the vehicle; సరవితోఁ (saravitO) =  regularly; బాదాలు (bAdAlu) =  legs;  చాఁపు (chApu) = to stretch; నొగలు (nogalu) = రథాల ముందు భాగాలు; front part of a horse pulled cart/chariot;  గరిమఁ జూపులు =  momentous looks; రెండు (reMDu) = two; గట్టిన = tied; పగ్గములు = reins;  దొరయై = being governor, master, owner;  దేహరథము = this vehicle called body; దోలీఁబో = drive; జీవుఁడు = the living being; 

Literal meaning: The man assumes he is owner and rides the  vehicle called body   taking buttocks as the head lights, the legs as the front,  the eyes as the reins for this vehicle. 

Comments: By comparing the buttokcks with the headlights, Annamacharya indicated the man’s mind is occupied by passion for sex. 

భావము: పిరుదులే బండి  దీపాలు ( హెడ్ లైట్),  కాళ్లు ముందు భాగాలు, గరిమ చూపులు పగ్గాలుగా చేసుకుని తానే దొరననుకుంటూ జీవుడు దేహమనే రథంపై స్వారీ చేస్తాడు. 

వ్యాఖ్యలు : పిరుదులను బండికండ్లు అని చెప్పి మనిషి జీవితాన్ని కామము ఎంత ప్రభావితము చేస్తున్న సంగతి  ప్రస్తావించారు. 

పంచమహాభూతములు పంచవన్నెకోకలు

పంచల చేతులు రెండు బలుటెక్కెలు
మించైన శిరసే మీదనున్న శిఖరము
పంచేంద్రియరథము పఱపీఁబో జీవుఁడు         ॥గుఱ్ఱాల॥ 

paMchamahAbhUtamulu paMchavannekOkalu

paMchala chEtulu reMDu baluTekkelu
miMchaina SirasE mIdanunna Sikharamu
paMchEMdriyarathamu pa~rapIbO jIvuDu          gu~r~rA 

Word to word meaning: పంచమహాభూతములు (paMchamahAbhUtamulu) పంచవన్నెకోకలు (paMchavannekOkalu) = పంచల చేతులు (paMchala chEtulu) = hands on either side;  రెండు( reMDu) = two;  బలుటెక్కెలు (baluTekkelu) = strong flags ( on either side);   మించైన (miMchaina) = beyond this;  శిరసే (SirasE) = the head; మీదనున్న శిఖరము (mIdanunna Sikharamu) = pinnacle; పంచేంద్రియరథము ( paMchEMdriyarathamu) = this car made up of five sensory organs;  పఱపీఁబో pa~rapIbO) = = cause to run/spread;  జీవుఁడు (jIvuDu) = the living being. 

Literal meaning: The man runs this vehicle called body taking the five elements as the ornamental robes, his hands as direction indicators, and his head as the crown pinnacle. 

భావము: పంచ భూతముల నుంచి తయారైన పంచవన్నెల కోకలు రథానికి అమర్చి, చేతులు జెండాలుగాను శిరస్సును శీర్షముగాను భావించి నడుపుతాడు. 

పాపపుణ్యములు రెండు పక్కనున్నచీలలు

తోపుల యన్నపానాలు దొబ్బుఁదెడ్లు
యేపున శ్రీవేంకటేశుఁ డెక్కి వీథుల నేఁగఁగ
కాపాడి నరరథము గడపీఁబో జీవుఁడు ॥గుఱ్ఱాల॥ 

pApapuNyamulu reMDu pakkanunnachIlalu

tOpula yannapAnAlu dobbudeDlu
yEpuna SrIvEMkaTESu Dekki vIthula nEgaga
kApADi nararathamu gaDapIbO jIvuDu gu~r~rA 

Word to word meaning: పాపపుణ్యములు (pApapuNyamulu) = Virtuous and sinful deeds; రెండు (reMDu) =  both these; పక్కనున్న చీలలు pakkanunnachIlalu =  Side Stopper pin (cotter pin) to prevent the wheels from coming out; తోపుల (tOpula) = plenty of యన్నపానాలు = అన్నపానాలు (yannapAnAlu = annapAnAlu) = food and drink; దొబ్బుఁదెడ్లు (dobbudeDlu) =  thick oars/paddles; యేపున (yEpuna) = great; శ్రీవేంకటేశుఁ డెక్కి (SrIvEMkaTESu Dekki) = Sri Venkateswara having mounted ( the man’s heart); వీథుల నేఁగఁగ(vIthula nEgaga)  = came on to the streets;  కాపాడి (kApADi) = saved, to preserve;  నరరథము (nararathamu) = the vehicle called human;  గడపీఁబో జీవుఁడు (gaDapIbO jIvuDu) = man gets through trouble.

 

Literal meaning: The rider (man) runs this vehicle with virtuous and sinful deeds as the limiters to the axle of life; the consumed food may be taken as the oars/paddles. Man gets through trouble as the great Sri Venkateswara having Come on the streets riding on the vehicle called man. 

Implied meaning:  man under the spell of conditioning, gets his view limited by virtuous and sinful deeds. When a man submits his will to the GOD, he gets saved from the rig morale of life and death. 

భావము: పాపపుణ్యాలు అనే రెండు చీలల మధ్య మనిషి రథాన్ని నడిపిస్తాడు;  ఎక్కువైన అన్నపానాలు తెడ్లు లాంటివి; శ్రీ వెంకటేశ్వరుడు నరరథము ఎక్కి  వీధులలొ తిరుగాడగా మానవుడు రక్షింపబడ్డాడు. 

విశేష  భావము: మానవుడు స్థితివ్యాజమునకు {స్థితి కలిగించు వ్యాజము =భ్రమ​, మోహము, కపటము} లోనై పాపపుణ్యాలు అనే మాయలలో ఊహాత్మక గాడీలలో పడీ త్రోవతప్పుతాడు. శ్రీ వెంకటేశ్వరుని రౌతుగా గుర్తించి తలకెత్తుకున్న  మానవుడు చావు బతుకులనే మొహాన్నుంచి రక్షింపబతాడు. 

zadaz

 

 

Reference: Copper Leaf: 136-5, Volume: 2-152

 

 

 

Sunday, 21 March 2021

32. అన్నియు నాలో నుండఁగ (anniyu nAlO nuMDaga)

 

ANNAMACHARYA

32. అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము. 

Annamacharya wonders why man looks outside (for solutions) while all of us are bestowed with everything thing we need. He says this is the true illusion that man needs to overcome. 

Two important points to note from this verse are that man instead of extricating himself from the wrong position:

1.    Like to note and theorise our situation instead of taking action to correct

2.    Derives vicarious comfort that others are sailing in the same boat (along with him.)

Thus one can feel the profound observations of Annamacharya which are way beyond comprehension of the ordinary. In fact they appear to have been written after witnessing our present life. 

This verse is inexplicably inked with the shloka 2-46 of Bhagavad-Gita. We shall see that at the end of this explanation.

 

మనిషి అన్నీ తనలో నిక్షిప్తమై ఉండగా బాహ్యములో సమాధానము కొరకు వెతుకుతాడు. దీని కంటే విపరీతమైన​ భ్రమ వెరేమీలేదు అన్నారు అన్నమాచార్యులు. కీర్తనలో రెండు ముఖ్యమైన, నిశితమైన సూచనలు  గమనింపవచ్చు:

1.    మనిషి తన స్థితిని గురించి తెలుసుకునే ఉత్సాహాన్ని దాన్నుంచి బయటపడడానికి చూపడు.

2.    మానవుడు తనలాగే వేరే వాళ్ళు  ఉన్నారని తెలిసి అప్రయొజనకరమగు సంతృప్తిని పొందుతాడు.

ఈ కీర్తన సామాన్య గ్రహణశక్తిని మించి, ఇప్పటి మన జీవితాన్ని 500 స్మవత్సరాలకు ముందే చూచి క్షుణ్ణంగా పరిశీలించి వ్రాసారా అనుకునేటట్టుంది. ఈ కీర్తన భగవద్గీత లోని క్రింది శ్లోకంతో చెప్పలేనివిధముగా ముడిపడి ఉంది. అది చివర్లో చూద్దాం. 

అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము

యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా ॥పల్లవి॥ 

anniyu nAlO nuMDaga navvala nEmi chUchEmu

yennaDu gAnanimAya yeragavO manasA  ॥pallavi॥ 

Word to Word meaning: అన్నియు (anniyu) = everything (what so ever),  నాలో (nAlO) = in me; నుండఁగ = ఉండఁగ (nuMDaga) = existing, embedded; నవ్వల  = అవ్వల (navvala = avvala) = outside, beyond; నేమి (nEmi చూచేము chUchEmu  యెన్నఁడు (yennaDu) = till date గాననిమాయ  (gAnanimAya) యెరఁగవో (yeragavO) = understsand, be aware;  మనసా (manasA) = Oh Mind. 

Literal meaning: When everything is embedded in us, why do we look outside side? Oh mind, note this is the true illusion which is not known before. 

భావము: మనిషి కావలసినవన్నీ ఆతనిలోనే దాచబడి ఉండగా బాహ్యములో సమాధానము కొరకు వెతుకుతాడు. దీని కంటే   చెప్పతగ్గ  భ్రమ వేరేమీ లేదు. 

యీడనే సంసార మిదె యింద్రజాలమై యుండఁగ

యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము
పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ
వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను ॥అన్ని॥ 

yIDanE saMsAra mide yiMdrajAlamai yuMDaga

yEDakainA jUDa bOyE miMdrajAlamu
pADitO nA paTTugulE bahurUpAlai yuMDaga
vEDukayyI bahurUpavidyalu chUDaganu  anni 

Word to Word meaning: యీడనే (yIDanE ) = here itself; సంసార మిదె (saMsAra mide) = this visible  world; యింద్రజాలమై (yiMdrajAlamai) = mysterious; యుండఁగ (yuMDaga) = being;  యేడకైనాఁ (yEDakainA) = any where; జూడఁ బోయే (jUDa bOyE) = go to watch; మింద్రజాలము (ఇంద్రజాలము, miMdrajAlamu =iMdrajAlamu) = magic shows;  పాడితో (pADitO)  by nature; స్వభావముతో; నా పట్టుగులే (nA paTTugulE ) = my bondages;  బహురూపాలై యుండఁగ (bahurUpAlai yuMDaga) = exist with various forms and shapes; వేడుకయ్యీ (vEDukayyI) = with ironical interest; బహురూపవిద్యలు bahurUpavidyalu = an act win which a person portrays different forms;  చూడఁగను (chUDaganu) = to witness, to watch. 

Literal meaning: While our life itself is an enchantment, it’s paradoxical that we attend Magic shows. While our own bondages are very many, it’s ironical that we keep enjoying performances of a person enacting many faces in the same breath. 

భావము: (మన) బ్రతుకే ఇంద్రజాలమయ్యుండగా, అది చాలదనట్లు మనుషులు ఇంద్రజాలము చూడడానికి పొవడము విడ్డూరము కాదా!! మనిషి అనేక రూపాలలో  బంధితుడయ్యుండీ, వేషగాళ్ళు వేసే రూపాలను చూడ్డానికి పొవడము వింత కాదా! 

నటన దినదినము నాటకమై యుండఁగాను

సటవట నాటకాలు సారెఁ జూచేము
ఘటన మాయలెదుటఁ గనుకట్టై వుండఁగాను
అటమటపువిద్యలు అన్నియుఁ జూచేము   ॥అన్ని॥ 

naTana dinadinamu nATakamai yuMDagAnu

saTavaTa nATakAlu sAre jUchEmu
ghaTana mAyaleduTa ganukaTTai vuMDagAnu
aTamaTapuvidyalu anniyu jUchEmu           anni 

Word to Word meaning: నటన (naTana) = నటించవలసిరావడము,  cunning behaviour;  దినదినము (dinadinamu) = day by day;  నాటకమై (nATakamai) = a melodrama, యుండఁగాను (yuMDagAnu) = being;  సటవట (saTavaTa) = { సట= cunning, trickery వట = చుట్టుకొనుట, అల్లుట, surround} = ఏమఱపఱచు,   నాటకాలు (nATakAlu) = drama (enacted by professionals); సారెఁ (sAre) = repeatedluy, many; జూచేము (jUchEmu) = watched, witnessed; ఘటన = (ghaTana) dispensations of providence; మాయలెదుటఁ(mAyaleduTa) గనుకట్టై (ganukaTTai) = legerdemain; sleight of hand;  వుండఁగాను = being;  (vuMDagAnu) అటమటపు (aTamaTapu) = Trickery, guile, fraud;  విద్యలు (vidyalu) = practices; అన్నియుఁ(anniyu) = all, complete;  జూచేము (jUchEmu) = witness. 

Literal meaning: While our day to day life itself is akin to Drama, it is surprising that we repeatedly go and watch a drama to trick ourselves. The dispensations of providence in themselves are trickery; yet we are inclined to witness these practices of trickery exhibited by professionals.  

Comments: This is what we do actually every day. It appears that Annamacharya could fore see our present lives so accurately. Sometimes, I felt that he indicated about present day reality shows on TV.

భావము: దినదిన జీవితము నాటకమై యుండఁగాను, ఏమఱపఱచు నాటకాలను మళ్ళి మళ్ళి చూడడానికి ఆసక్తి  చూపిస్తాము. మాయలు  కన్నులెదుటఁ ఘటించుచున్నా కూడా, కానకుండఁ జేయు  విద్యలు చూచుటకు కుతూహలము చూపుదుము. 

పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను

కోపుల నాటలవారిఁ గోరి చూచేము
యేపున శ్రీవేంకటేశు డిటు మమ్ము భ్రమపాపె
నాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను      ॥అన్ని॥ 

pApapuNyamulu reMDu bArividya luMDagAnu

kOpula nATalavAri gOri chUchEmu
yEpuna SrIvEMkaTESu DiTu mammu bhramapApe
nApanulu nEnE chUchi navvulu navvEnu anni 

Word to Word meaning: పాపపుణ్యములు (pApapuNyamulu reMDu = virtuous and sinful deeds;  రెండు = tow of them; బారివిద్య లుండఁగాను = existing repetitive tasks;   కోపుల (kOpula) = ఒకరిపేరు పెత్తనమును పరోక్షముగా విమర్శించు, innuendo; నాటలవారిఁ (nATalavAri) = who enacts such; గోరి చూచేము = crave to witness; యేపున = అధికము, వృద్ధి, విలాసము, excess, growing; grace; శ్రీవేంకటేశు డిటు = Sri Venkateswara thu; భ్రమపాపె (bhramapApe) = cleared illusion; నాపనులు (nApanulu) = my deeds;  నేనే (nEnE) = myself;  చూచి (chUchi) = having observed;  నవ్వులు నవ్వేను (navvulu navvEnu) = would laugh. 

Literal meaning: We grapple constantly with the virtuous and sinful deeds all the while; still we crave to see the plays full of innuendos. I now understand, having been extricated by the Lord Venkateswara from the  perplexity of  the illusion. I now can see my foolishness to laugh at myself. 

భావము: పాపపుణ్యములలో యెది చేబట్టమో అనే సంశయము ఎప్పుడూ తేల్చుకోలేని మేము; ఒకరి పేరు, పెత్తనమును పరోక్షముగా విమర్శించు ఆటలను కోరి కోరి చూస్తాము. కరుణకొలది శ్రీవేంకటేశుడు నన్ను భ్రమనుండి రక్షింపగా నా వెర్రితనము చూచి నాకే నవ్వొస్తొంది. 

వ్యాఖ్యలు: “కోపుల నాటలు” అన్న పదాన్ని జగ్రత్తగా గమనిస్తే రోజుల్లొ మనము చూస్తున్న జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. 

Comments: Overall after writing the meaning of this verse, I felt this is linked to the Bhagavad-Gita verse below. This verse actually states that the YOGI will realise the knowledge (that encompasses everything including the tranquillity) within the self. This is what Annamacharya meant by అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము (anniyu nAlO nuMDaga navvala nEmi chUchEmu). 

yāvān artha udapāne sarvataḥ samplutodake
tāvānsarveṣhu vedeṣhu brāhmaṇasya vijānataḥ
 

Purport: Whatever purpose is served by a small well of water is naturally served in all respects by a large lake. Whatever is the peace / bliss obtained by all the karmas mentioned in the Vedas, the yogi has all that peace / bliss in his knowledge. 

శ్లో|| యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే

తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ।। 2-46 ।। 

భావము: తక్కువ నీళ్లు ఉండే నూతులు, చెరువుల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో, ప్రయోజనం ఎక్కువ నీళ్లు ఉండే సరస్సుల లోనూ నిక్షిప్తమై ఉంటుంది. వేదాలలో చెప్పిన సమస్త కర్మలవలననూ పొందబడే శాంతి/ఆనందము ఏదైతే ఉందో, యోగియైన వాడికి తన జ్ఞానం లోనే శాంతి/ఆనందము సమస్తమూ  ఇమిడి ఉంటుంది.

zadaz


Reference: Copper Leaf: 333-1, Volume: 4-190

 

 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...