Saturday, 28 June 2025

T-234 అంతరుమాలినయట్టి అధములాల

 తాళ్లపాక అన్నమాచార్యులు

234. అంతరుమాలినయట్టి అధములాల

For English version press here

ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము: 

అన్నమయ్య తత్వం ఒక్క మాటలో —
భక్తి అనేది నూరుపాళ్ళ శుద్ధ బంగారం కావాలి.
కొలతలో మోసం, సమర్పణలో వ్యామోహం —
అవి ఆయనకు తట్టవు, పొసగవు, సాగవు.
 
ఈ కీర్తనలో —
ఆయన భక్తియను దేవాలయమును
బజారుకు ఈడ్చినవాళ్లను నిలదీస్తారు.
సత్యాన్ని పక్కదోవ పట్టించిన వారిని ప్రశ్నిస్తారు.
ఆత్మతో ఎదిగే మార్గాన్నే సూచిస్తారు.
 
ఇది భాషణం కాదు —
నడుస్తున్న చరిత్రకు చురక.
సంతకూటాల భక్తికి గట్టి హెచ్చరిక.
నిజాన్ని నిలిపే నిర్భయపు వేదిక.

 

అధ్యాత్మ కీర్తన

రేకు: 103-5 సంపుటము: 2-17

అంతరుమాలినయట్టి అధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా       ॥పల్లవి॥
 
కనక మిత్తడితోడ కలయ సరిదూఁచితే
అనువవునా అది దోషమవుఁ గాక
ఘనుఁడైన హరితోఁ గడుహీనదేవతల
ననిచి సరివెట్టితే నయమవునా భువిని      ॥అంత॥
 
పట్టభద్రుఁడు గూర్చుండే బలుసింహాసనముపై
వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱ్ఱులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలఁ
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా          ॥అంత॥
 
కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక
అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను
కొంచపుదైవాల పలువంచలనే కాక ॥అంత॥ 

Details and Explanations:

పల్లవి: 

అంతరుమాలినయట్టి అధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా  ॥పల్లవి॥ 

పదబంధం

అర్థం

అంతరుమాలినయట్టి అధములాల

 

(ధర్మాధర్మముల) తారతమ్యములు గాలికి వదిలేసిన అధములారా!

పొంత సంతకూటమి పొరిచూపు గాదా

పొంత = సమీపమునవున్న, సంతకూటమి = బజారు వంటి వ్యాపార (లాభ నష్టములను బేరి వేసి) చేయు లావాదేవీలు;​ పొరిచూపు = భేదదృష్టి;

సులభముగా కనబడు బజారు వంటి వ్యాపార దృష్టితో (లాభ నష్టములను బేరి వేసి చేయు) లావాదేవీలు బేధభావము చూపడమే కదా!


భావము:

అధములాల! పైపై ఊగే అలల లారా,
అంతరంగమును గాలికి వదిలినారా,
పుణ్యమనే లాభమును కొలుచువారా,
భక్తిని  బజారు దారికి తెచ్చినారా?


వ్యాఖ్యానం:

వినయములు విచారణలు లేవే —
వ్రతాల పన్నుల లెక్కలు తేలవే,
లావాదేవీ మంత్రాలు నీ ప్రార్థనలవే
గుడిలోను గుండెల్లోనూ శూన్యమే పొందు తావే.

వెలుగు కోసం కాదు నా వరాల మూట.
తలపు లేని ప్రార్ధనలు వట్టి మాటల వూట
నాలికపై ఒకటి, లోపల మరొకటి,
కోటి మాయల మధ్య — మనసు మాయమటే.

ఇదే మీ విశ్వాసమా? ఇదో విన్యాసమా?
చాటి మత్తుల పండుగే భక్తిస్థలమా?
ధరలతో దేవతల్ని కొలిచే యత్నమా?
దైవాన్ని దుశ్శాపంగా మార్చే పథమా?


 మొదటి చరణం:

కనక మిత్తడితోడ కలయ సరిదూఁచితే
అనువవునా అది దోషమవుఁ గాక
ఘనుఁడైన హరితోఁ గడుహీనదేవతల
ననిచి సరివెట్టితే నయమవునా భువిని  ॥అంత॥

 

పదబంధం

తెలుగు అర్థం

కనక మిత్తడితోడ కలయ సరిదూఁచితే

బంగారాన్ని ఇత్తడితో కలిపి సరితూచితే

అనువవునా అది దోషమవుఁ గాక

అది సరికాదుగా? అది దోషమే కదా?

ఘనుఁడైన హరితోఁ గడుహీనదేవతల

మహాత్ముడైన శ్రీహరితో, ఆత్మస్వరూపం లేని ఆయన అంశయగు దైవాలను

ననిచి సరివెట్టితే నయమవునా భువిని

సమంగా చూడటమే తప్పు కదా భూమిలో?


భావము:

కనకమును ఇత్తడితో కలిపి,
సరిచూచుట దోషమే కదా!
పరబ్రహ్మమగు శ్రీహరిని వదిలి,
ఆయన కాంతిలో జనించిన దేవతలతో
పోల్చి సత్యాన్ని తూచగలమా?


వ్యాఖ్యానం:

ఎంత మెరిసినా ఇత్తడి బంగారం కాదురా! 
కంచు మ్రోగినట్లు కనకము మ్రోగదు రా. 
రూపుదిద్దిన రూపాలు వలపు వలయాలురా — 
రూపులేనివాడు తానకు తానే వెలుగురా.

పుణ్యము లాభము బేరంగా మార్చకు,
త్రాసులలో హరిని తూచకు
సత్య రూపం కానిదాని ఆరాధన
నిస్సార మానవుల వంచన

ఓ యాత్రికుడా! ఒక్కసారి ఆగి చూడు —
నిప్పును బంగారమే తట్టుకు నిలబడు.
నిరాకారుని ఆకారముతో తూచే చిత్తమా భక్తి?
అది కాదు — అది సత్యాన్ని వంచించే యుక్తి.

రెండవ చరణం:

పట్టభద్రుఁడు గూర్చుండే బలుసింహాసనముపై
వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱ్ఱులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలఁ
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా
॥అంత॥ 

పదబంధం

అర్థం

పట్టభద్రుఁడు గూర్చుండే

చదువు పూర్తి చేసిన విద్యావంతుడు కూర్చొనవలసిన​ = యోగ్యుడు కూర్చొనవలసిన​

బలుసింహాసనముపై

అత్యున్నత సింహాసనంపై

వెట్టిబంటుఁ బెట్టేవారు

గుడ్డి బానిసను కూర్చోబెట్టే వారు

వెఱ్ఱులేకారా

వెఱ్ఱివాళ్లే కదా, అవివేకులు కదా

గట్టిగా శ్రీహరితోడ

నమ్మకముగా శ్రీహరితో కలిపి

కలగంపదేవతలఁ

కలగూరగంపలా కలపబడిన దేవతలను (శుద్ధస్వరూపం కానివారు)

బెట్టి కొలుచుట విందువెట్టి

 కలిపి ఆహ్వానం చేసి / ఆత్మీయంగా పిలిచి విందుపెట్ట బోయి

పగగాదా

పగతీర్చుకొనుట కాదా


భావము:

పట్టభద్రుని సింహాసనం —
వెట్టిబంటికి అనర్హం!
వెఱ్ఱివాళ్లే ఈ జనం;
సత్యం సులువంటే వినం.
 

అఖిలాండేశ్వరుడిని —
తక్కిన దేవతలతో సముడా?
ఇలాటి కలగూరగంప భక్తి
విందు వేసి పగ సాధించుట కాదా?
 


వ్యాఖ్యానం:

ప్రతి వాక్యం — సత్యమౌనా?
నిశ్శబ్దపు బరువెరుగునా?
పేరు కోసం కాదు సింహాసనం —
అర్హతకే తగిన ఋజుమార్గం.
 

వెలుగు తానే అయిన శ్రీహరిని,
ఆ వెలుగులో పుట్టిన దేవతలతో తూచి —
ఆరాధన పేరున వ్యంగ్యబేరం చేయడం,
విందు పేరిట పగ తీర్చుకోవడం!
 

నిష్ఠలేని పూజోపచారం —
నిజానికి ఆటలాడే అహంకారం.
విజ్ఞుడు నిశ్చలంగా వినును —
సత్యాన్ని తూచే త్రాసే నిర్మర్మం.


మూడవ చరణం:

కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక
అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను
కొంచపుదైవాల పలువంచలనే కాక      ॥అంత॥

 

తెలుగు పదబంధం

అర్థం

Meaning (English)

కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా

సింహమున్న గుహలోపల ఎవరు జీవించగలరు? (అది వారి స్థలం కాదు)

ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె

పన్ని పరులఁ జెప్పఁగఁ జోటేది

Can anyone dwell in a cave where a lion lives? (It’s not meant for the ordinary)

"In Your presence, O Lord, all paths converge.

 The infinite reflections before me render me silent, with no words left to offer to others."

పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక

ఎదురు చూసే నక్కలకెల్ల చివరకు మిగిలేది ఎముకలే

ప్రక్కదార్లు పట్టువారికి ఏమీ

మిగలదు అని తాత్పర్యం

All that remains for the waiting jackals are bones.

"Those who stray into side alleys

find nothing enduring at the end."

అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను

అన్ని ఆత్మల లోనూ స్థిరంగా వుండే పరమాత్మ శ్రీ వేంకటేశుడు

Lord Venkatesha who dwells steadily in every layer of the soul

కొంచపుదైవాల పలువంచలనే కాక

మానవులు ఊహించి నిర్మించుకున్న దేవతా రూపాలు వంచనలే కావా

"Aren’t the gods built by human imagination just a refined form of illusion?"


భావము & వ్యాఖ్యానం:

సింహమున్న గుహలో
ఎవరు నిలువగలరు?
అది ధీరుల నిలయం —
దౌర్బల్యానికి కాదే ఆలయం.
 

నీ సన్నిధిలో, ఓ వేంకటేశా —
మాయలన్నీ కరిగిపోతవి.
మాటలకే అర్థం లేదనిపిస్తుంది,
ఇతరులకు చెప్పదగినది
ఇంకేమీ మిగలదు.
 

పొంచే నక్కలకు మిగిలేది బొక్కలే —
పక్కదారుల ప్రయాణం
తిరిగొచ్చే వెలితితో పరిణయం,
ఖాళీ చేతులతో వారు
వెళతారు తిరిగి తిరిగి. 

నీ అంతరాళంలో నీవే వెలుగు —
నీవున్న చోట, రూపాలన్నీ నీడలే.
మనసు కల్పించిన దేవతలన్నీ
మెరుపైన మాయలు మాత్రమే.
వాటిలో సత్యం లేదు —
నీ సాన్నిధ్యంలో, అవి మైనంలా కరిగిపోతాయి.


 

 

1 comment:

  1. హాయిగా సాగిన హరి తత్వం

    ReplyDelete

235 mollalEle nAku tanne muDuchukommanave (మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె)

  ANNAMACHARYULU 235 మొల్లలేలె నాకు తన్నె ముడుచుకొమ్మనవె mollalEle nAku tanne muDuchukommanave తెలుగులో చదవడానికి ఇక్కడ నొక్కండి. I...