తాళ్ళపాక అన్నమాచార్యులు
262 ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ విన్నవించితి
For English version press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు మన మనస్సులలో ఆ మాయ తెలియకుండ ఎలా చొచ్చుకొని పోతుందో అద్భుతంగా వివరించారు. ఆ ప్రయోజన సిద్ధికే శృంగార కీర్తనగా మలిచారు.
శృంగార కీర్తన
|
రేకు: 542-2 సంపుటము: 13-186
|
ఇప్పుడే తెలుసుకో నీకెఱఁగ
విన్నవించితి
కొప్పువ ట్టీకె దీసితే గుంపించఁ
గలవా ॥పల్లవి॥ పుత్తడిబొమ్మవలె పూచిన లతికవలె
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో
నేమినవ్వేవు
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా ॥ఇప్పు॥ కొసరుఁగోయిలవలె కొలనితుమ్మిదవలె
పసని చిలుకవలెఁ బలికీనాపె
నసలు సేయుచు నిట్టే నాతో
మాటలాడేవు
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా ॥ఇప్పు॥ మెత్తినగందమువలె మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె
నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా ॥ఇప్పు॥
|
Details
and Explanations:
Telugu
Phrase
|
Meaning
|
ఇప్పుడే
తెలుసుకో
|
వెంటనే
గ్రహించు, ఇప్పుడు లేదా ఎప్పటికీ కాదు అన్న
అత్యవసర భావము
|
నీకెఱఁగ
విన్నవించితి
|
నేను
ముందే నీకు స్పష్టముగా వివరించితిని
|
కొప్పువ
ట్టీకె దీసితే
|
(కొప్పు = జుట్టు పట్టి; ఈకె = ఆ స్త్రీ, మాయ) మాయ స్త్రీ నన్ను జుట్టు పట్టి లాగుచున్నది
|
గుంపించఁ
గలవా
|
నన్ను
రక్షించగలవా? నిలబెట్టగలవా?
|
సూటి భావము:
అన్నమచార్యులు తనను స్త్రీగా వూహించుకుంటూ భగవంతునితో ఇలా అంటున్నారు. “ఇప్పుడే గ్రహించు, ఆలస్యం చేయకు. నేను నీకు ముందే అన్నీ వివరించాను. ఆమె నా జుట్టు పట్టి బలంగా లాగితే, ప్రియుడా నీవే రక్షిస్తావా?” (ఇక్కడ ఆమె అన్నది మనకెవరో తెలియదు).
అన్వయార్థము:
ఇది ఒకానొక
ఆత్మ తనను భగవదర్పణ చేయుచూ పలికిన మాటలు. "నువ్వేమో లోపలిరమ్మంటావు. జాగు చేయకు
అంటావు. అన్నీ చెప్పానంటావు. అదేమో (మాయ శక్తి)
నా జుట్టు పట్టి బయటకు బలంగా లాగుతుంటే నేను నిలబడగలనా? నువ్వేమో అలా విగ్రహంలా నిలబడె వుంటావు.” ఆ క్షణాన్ని
వూహించుతూ, ఆ ఘటన జరుగుతున్నప్పుడే దైవ సహకారం కోరుచున్నది.
(ఇది ఒంటరి ప్రయాణం. దీనికి గైడ్స్ (దారిచూపువారు) లేరు. అందుకే అన్న
మయ్య దైవానికే విన్నవించుకుంటున్నాడు.)
గూఢార్థవివరణము:
ఇప్పుడే
తెలుసుకో
అన్నమాచార్యులు
నొక్కి చెబుతున్నారు — "ఇప్పుడే తెలుసుకో" మంటున్నారు. తక్షణం చేయకపోతే, కొంచెం ఆగినా మనస్సు ఆకళింపు చేసుకొని
ఆ సంఘటనను రికార్డు చేయబోతుంది.
"భవిష్యత్తులో చేస్తాను" అన్న భద్రత కల్పిస్తుంది. ఆ రక్షణ వలయం నుంచి
బయటకు రాలేక గింజుకుంటాం. (జిడ్డు కృష్ణమూర్తి కూడా ఇలానే చెప్పేవారు)
కొప్పువ
ట్టీకె దీసితే
నా జుట్టు పట్టి బయటకు బలంగా లాగుతుంటే. ఇది హింసాకరమైన అనుభవం. నా జుట్టులో ఉన్నన్ని వెంట్రుకలు (నేనెన్ని రకాలుగా బంధింపబడ్డనో) ఓకేసారి తీసేస్తానంటే, జుట్టు మూలమూలల్లో నెప్పెడుతుంటే తట్టుకోగలనా? ఈ స్వీయ అవగాహన ప్రయాణంలో బాధ అనేది ఆటంకహేతువు. (ఇది మనసు ఆడు నాటకం)
వైతరణి
దాటుట
వైతరణి నది దాటుట ఒక మానసిక ఏకమార్గ (one way journey) ప్రయాణం అనుకోవాలి. ఈవలి ఒడ్డు = పాత మనస్సు, ఆలోచనలు, వ్యక్తిత్వం - మన ఇప్పటి మనఃస్థితి. ఆవలి ఒడ్డు = పాతవి వదలి వేసి కొత్త మనస్సుకు మారుట. ఇది కంప్యూటర్'లో పేర్లు మార్చి కొత్తవి పెట్టినట్లు కాదు.
చీము, నెత్తురు, ఎముకలు, మాలిన్యాలతో
పారుచుండు జుగుప్సాకరమైన వైతరణి నది ఆవలి ఒడ్డు చేరుటెట్లు? దీనినే
ఆచార్యులు "కొప్పువ ట్టీకె దీసితే" తో చూపారు.
సంకల్పం —అడ్డంకి.
ఈ యజ్ఞంలో బలి కావలసింది
మన సంకల్పమే.
“అమలమగు విజ్ఞానమను మహాధ్వరమునకు–
నమరినది సంకల్పమను మహాపశువు…” (Ref Poem 39)
మనిషి తాను సిద్ధమౌతాను, తాను సిద్ధం
చేసుకొంటాను అని చెప్పుకుంటే అదే అడ్డంకి. (భగవద్గీత 6-2
చూడండి)
ఈ వైతరణి నది దాటడం మన ప్రయత్నం ద్వారా నెరవేరదు. అది పూర్తి శరణాగతి ద్వారానే సాధ్యం.
ఈ సందర్భంగా అన్నమాచార్యులు శరణాగతిలోని బాధ గురించి ఎక్కువ ఆలోచించ వద్దంటూ ఇలా చెప్పారు.
(ఇంతగా
భయపడవద్దు. ఆ వక్రతలోనే నీలాలు నీ కొప్పులో కురుస్తాయి అని సముదాయిస్తున్నారు)
అలమేలుమంగ —సమర్పణ
ఈ శరణాగతి
దశలో వ్యక్తిగత భావాలు పూర్తిగా కరిగిపోతాయి.
ఈ శరీరం, ఈ మనసు “నాది” అన్న భావన తొలగిపోతుంది.
అది ధర్మమునకు, సత్యమునకు చెందినది — ఆయన సేవకు మాత్రమే అన్నది వేళ్ళూనుకొంటుంది.
ఈ స్థితినే
అన్నమాచార్యులు “అలమేలుమంగా” భావముతో వ్యక్తీకరించారు.
“అలమేల్మంగ
పురుషాకారమున ఆచార్యుననుమతి మెలఁగును.”
అంటే, ఆచార్యుని (దైవము) అనుగ్రహముతో, ఆత్మ దైవానికి సేవికగా మారుతుంది.
ఆ శరణాగతి
దశలో వారు తామున్న స్థితిని నిర్ధారణ చేయలేక పోతారు. వారి మనస్సు దైవము మనస్సుతో ఒకటై
వుంటుంది. తమను తాము గుర్తించ లేరు. “అన్నమాచార్యుల భాషలో అది అలమేలుమంగ
రూపంలో వెలిసింది; జిడ్డు కృష్ణమూర్తి దాన్ని ‘the
other’ అని పిలిచాడు. భిన్న భాషలు, ఒకే అనుభవ
సత్యం.”
అన్నమాచార్యుల
వ్యూహం
ఈ లోతైన
సత్యం భయంకరముగా, అసహ్యముగాను వుండవచ్చు.
ఆ అనిర్వచనీయమైన
మార్పు లోక సంక్షేమమునకు, అసాధ్యమైన దానిని సులభముగా ప్రజల ముందుంచారు.
దానికి
ఆయన శృంగారము అద్ది — ప్రేమ, కలహం, మాధుర్యముల
ద్వారా అందరిని ఆకర్షించారు.
సారాంశం
- ఇప్పుడే చూడు. ఆలస్యం
చేయకు.
- పాత conditioning నుండి లాగిపడవేయబడటం బాధాకరం.
- దాన్ని మానవ సంకల్పం ఆపలేడు; సమర్పణ మాత్రమే రక్షణ.
- ఆ సమర్పణలోనే వ్యక్తిత్వం
కరుగుతుంది.
- ఆ తరువాతి వెలుగు — “అలమేలుమంగా”
అనుభవం: శరీరం, మనస్సు, జీవితం
ప్రభువుకు చెందింది.
మొదటి చరణం:
పుత్తడిబొమ్మవలె
పూచిన లతికవలె
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా ॥ఇప్పు॥
Telugu Phrase
|
Meaning
|
పుత్తడిబొమ్మవలె
|
పుత్తడిబొమ్మవలె
|
పూచిన లతికవలె
|
పూచిన లతికవలె
|
చిత్తరుపతిమెవలెఁ జెలి యున్నది
|
చిత్రపటమువలె
అందముగా కనబడుతుంది
|
మత్తిల్లి యప్పటి నేఁడు మాతో నేమినవ్వేవు
|
Intoxicated by yesterday (by association of past) what's 'new' do you have to laugh with me
|
వొత్తుకాపె విలిచితేఁ బోకుండఁగలవా
|
But if the moment of her call comes, will you be able to withstand and
not break?
|
సూటి భావము:
ఆమె పుత్తడిబొమ్మవలె మెరుస్తూ, కొత్తగా పూసిన లతికవలె సొగసుగా, చిత్రపటమువలె మైమరచిపోయే అంత అందముగా కనబడుతుంది. ఆకర్షణ, ఆప్యాయత, సులభముగా అందినదని అనిపించే మత్తు నవ్వులతో మనసును బంధిస్తుంది. కానీ నిజమైన పరీక్షా వేళ వచ్చినప్పుడు —ఆమె పిలుపు వినబడినప్పుడు — ఇలానే నిలబడగలవా? లేక మల్లె పువ్వులా వెంటనే వాడిపోతావా?
గూఢార్థవివరణము:
మనిషి అందుకోగలిగిన, ఆస్వాదించగలిగిన, రుచి చూడగలిగిన, కొలవగలిగిన, అంతస్తులున్న, ఏదోవొక రీతిలో నిరూపించగలిగిన వాటిపట్లే ఆకర్షితుడవుతాడు. ప్రపంచమున అందరి జీవనానుభవాలు కలిపితే దాదాపు అపరిమితం. కాబట్టి వాటిని ఆయా ప్రత్యేక కోణాల్లో చూచినప్పుడు క్రొత్తగా అగుపడతాయి. సమాజం సహజంగానే వీటినే ప్రోత్సహిస్తుంది, ఆరాధిస్తుంది.
కానీ క్రూరమైన వాస్తవం ఏమిటంటే —మనిషికి కావలసింది సత్యం కాదు. సత్యం గురించి మాట్లాడటమే కావలసింది. అందుకే వేలాది సంవత్సరాలుగా ఒక “ఆధ్యాత్మిక వినోదం” అనే పరిశ్రమ ఏర్పడింది: గ్రంథాలు, వాటిపై వ్యాఖ్యానాలు, ప్రబంధములు, నాటకాలు, యాగాలు, వేదికలు, వేడుకలు, బుర్రకధలు, స్థానిక/భాషా రూపాంతరాలు, సినిమాలు, టీవీ సీరియల్స్, మహత్తరమైన ఊరేగింపులు. ఇవన్నీ ప్రజలను మరింత “ఆధ్యాత్మికంగా” భావింపజేస్తాయి. ఇంకా రసవత్తరమైన ప్యాకేజీ కోసం వీటిలొ శృంగారాన్ని చొప్పిస్తారు కూడా. ఈ ఆకర్షణను ఎవ్వరూ కాదనలేరు.
ఇలాంటి నేపథ్యములో అన్నమాచార్యులు ఒక్కసారిగా సూదికొన నిశితత్వముతో అడుగుతున్నారు: “ఆమె పిలిచినపుడు — నీవు నిలబడగలవా?”
జవాబు: నిర్దాక్షిణ్యంగా లేదు.
ఎందుకంటే మాయ బిచ్చ మెత్తుకుంటూ రాదు. ఆమె బంగారు బొమ్మలా, వికసించిన లతలా, వెలిగే చిత్రపటంలా వస్తుంది. ఆహ్లాదకరంగా, మనోహరంగా, మత్తెక్కించేలా ఆకర్షిస్తుంది. ఒక క్షణం నీతోనే నవ్వుతుంది కూడా — పరిచయమై, హాని లేనట్టుగా. ఇలాంటి రూపాన్ని వదిలి, లంగోటీ బట్టల సాములతో ఎవరు వెళతారు చెప్పండి? ఆమె పిలుపు రాగానే స్వాములవెంట పరుగెత్తే కొద్ది మంది కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతారు. పాపం ఆ స్వామికి కూడా సందేహం పుట్టుకొచ్చేలా!
రెండవ చరణం:
Telugu phrase
|
Meaning
|
కొసరుఁగోయిలవలె
|
Like a cooing koel (sweet voice, alluring call)
|
కొలనితుమ్మిదవలె
|
Like a blossoming lotus in the pond (beauty, freshness,
delicate charm)
|
పసని చిలుకవలెఁ బలికీనాపె
|
Like a green parrot (playful, colorful, delightful) she
keeps offering gestures (tokens of affection)
|
నసలు సేయుచు నిట్టే నాతో మాటలాడేవు
|
With smiles and sweet talk she engages with me as if always
familiar
|
వొసగితే విడెమాకె వొల్లననఁగలవా
|
But if she offers me betel leaves (విడెము,
కిళ్ళి — traditional token of love), will I have the
strength to refuse?
|
సూటి భావము:
ఆమె (మాయ)
కొయిల వలె కూస్తుంది, కొలనులో తుమ్మెద వలె వికసిస్తుంది,
పచ్చని చిలుక వలె చలాకీగా కనబడుతుంది. చిరునవ్వులు చిందిస్తూ ముచ్చట్లు
చెబుతుంది. కానీ ఆమె ప్రేమకు గుర్తుగా విడెముని చేతిలో పెడితే — దానిని తిరస్కరించగలవా?
గూఢార్థవివరణము:
మాయ మనల్ని ఆకర్షించేది కేవలం రూప సౌందర్యంతోనే కాదు. ఆమె మనల్ని లోతైన సంబంధం ద్వారా, ఆత్మీయత ద్వారా బంధిస్తుంది. మాటలతో, నవ్వులతో, ప్రేమ సూచనలతో — “ఇదిగో విడెము” అని మనసును తాకుతుంది.
ఇదే అత్యంత
ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటి ప్రేమసూచనను, ఆత్మీయతను, సాన్నిహిత్యాన్ని
నిరాకరించడం చాలా కష్టం. ఇది మన బుద్ధికి మాత్రమే కాదు — మన హృదయపు ఆత్రుతకు కూడా తోడౌతుంది.
మూడవ చరణం:
మెత్తినగందమువలె
మెడకంటసరివలె
ముత్తెమువలెనే వురమున నుందాకె
హత్తి శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
బత్తి సేసితివాపెతోఁ బంతమాడఁగలవా ॥ఇప్పు॥
Telugu
Phrase
|
Meaning
|
మెత్తిన
గందమువలె మెడకంటసరివలె
|
మెత్తని
గంధంలాగా, మెడలో ధరించే హారం వలె — దగ్గరగా,
శరీరానికి అంటుకునేలా, మనసును కట్టిపడేసేలా.
|
ముత్తెమువలెనే
వురమున నుందాకె
|
ముత్యమువలె
నేరుగా గుండెను తాకినది — అత్యంత లోతైన ప్రీతితో, లోనికి చొచ్చుకుపోయిన ఆకర్షణ.
|
హత్తి
శ్రీవేంకటేశుఁడ అట్టె నన్నుఁగూడితివి
|
నన్ను
ఎత్తి, శ్రీవేంకటేశుడు తనలోకి
చేర్చుకున్నాడు — ఆత్మను స్వీకరించిన దైవానుభవం.
|
బత్తి
సేసితివాపెతోఁ బంతమాడఁగలవా
|
కానీ, ఆ స్త్రీ (మాయ) ఆమె బాణసంచా వత్తి లాంటిది. అంటిన
తక్షణమే పేలుతుంది. ఆమెతో పంతములాడగలవా? (అంటే, నిజంగా ఆ ఆటను తట్టుకోగలవా?)
|
సూటి భావము:
ఆమె (మాయ)
మెత్తని గంధంలాగా, మెడలో ధరించే హారం వలె శరీరానికి అంటుకొని
ఉంది. స్వచ్ఛమైన ముత్యమువలె గుండెను తాకుతుంది. కానీ శ్రీవేంకటేశుడు నన్ను ఈ అంధకారం
నుంచి ఎత్తి నాతో కూడివున్నాడు. కానీ,
ఆ స్త్రీ (మాయ) ఆమె బాణసంచా వత్తి లాంటిది. అంటిన తక్షణమే పేలుతుంది.
ఆమెతో పంతములాడగలవా? (అంటే, నిజంగా ఆ ఆటను
అంటే నిప్పుతో చెలగాటాన్ని తట్టుకోగలవా?)
గూఢార్థవివరణము:
అన్నమాచార్యుల
భాషా వ్యూహం ఇక్కడ చాలా చమత్కారమైంది:
- మొదటి చరణం → మాయ యొక్క వెలుపలి ఆకర్షణ (బంగారు బొమ్మ, చిత్రపటం).
- రెండో చరణం → సన్నిహితత, అనుబంధం (చిలుక, కోయిల).
- మూడో చరణం → లోతైన బంధం, గుండెను తాకే ఆకర్షణ. ఇప్పుడు స్పర్శ, లోనికి చేరే తాకిడి.
కానీ ఇక్కడ
అన్నమయ్య కొంత వ్యంగ్యంగా అ దైవంతో సహా అందరికీ సవాలు విసురుతున్నట్లుంది. "ఎత్తి నన్ను నీలో చేర్చుకున్నావు కదా? అది సరే
కానీ, బాణసంచా లాంటి ఆ స్త్రీ అంటిన (ముట్టుకున్న) వెనువెంటనే
నీలో మంటలు రేపుతుంది. ఆ అగ్గితో చెలగాటం ఆడగలవా”?
ఈ
కీర్తన ముఖ్య సందేశం
అన్నమాచార్యులు ఆ మాయ పట్ల ఎంత జాగరూకతతో వుండాలో చెప్పారు.
X-X-The
END-X-X
అంత ఎరుక గలిగిన అన్నమయ్య ఆ దైవాన్ని కూడా మాయకు లొంగుతావని ఎలా ప్రశ్న వేఉఅగలడు? ఇది (ఈ కీర్తన) నా బోటి సామాన్యుల గురించేనేమో.
ReplyDelete