Saturday, 2 April 2022

115. ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు (ennaDokO suj~nAnamu yI yAtmaku)

ANNAMACHARYA 

115. ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు

(ennaDokO suj~nAnamu yI yAtmaku)

                                                                                    

Introduction: Annamacharya stated in this soothingly beautiful poem that visual and conceptual peculiarities entrench man in confusion, thus leading to delusion. 

Man trusts the information gained through sense organs. Man, sacrifices living in the endeavour to save his life. Annamacharya slashes your heart using soft but sharp words.

ఉపోద్ఘాతము: హృదయమునకు ఊరట కలిగించు ఈ  అందమైన కీర్తనలో అన్నమాచార్యులు దృశ్య భ్రమలు మరియు  మంచి చెడ్డలు నిర్ణయించ లేని అశక్తత  మనిషిని సందిగ్ధములో పెట్టి తప్పు త్రోవ పట్టించు నన్నారు.

ఇంద్రియముల నుండి గ్రహించి నిర్మించుకున్న ఊహలే నిజమని నమ్ముతాడు. క్షణికమైన ప్రాణాన్ని మనిషి కాపాడు కొనబోయి, జీవనమునే ఒడ్డుగా పెట్టి, లేని 'రక్షణ'ను కాంక్షించి వ్యర్థపరచుకొనును అన్నారు. మెత్తని మాటలతో గట్టి తూటాలు గుండెల్లో నాటడం  అన్నమాచార్యులకు వెన్నతో పెట్టిన విద్య. 

 

కీర్తన:

ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు

కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను॥పల్లవి॥ 

హేయములో సుఖము యెంగిలిలో సుఖము

కాయము నమ్మికదా కష్టపడెను
పాయములో చవులు పాపములో చవులు
మాయలు నమ్మికదా మనసూనిట్టాయను ॥ఎన్న॥ 

కల్లలోని బదుకు కాసు వీసపు బదుకు

కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను
యెల్లి నేఁటి తలఁపు యింద్రియాల తలఁపు
కొల్ల సంసారముఁగూడి గుణమునిట్టాయను ॥ఎన్న॥ 

అంగడిఁబెట్టే సిరులు యలయింపులో సిరులు

దొంగజీవుఁడు యిట్లానే తొట్రుపడెను
అంగపు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను
ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను ॥ఎన్న॥

 

ennaDokO suj~nAnamu yI yAtmaku

kannu lediTivi chUchi kAlamu niTTAyanu         ॥pallavi॥ 

hEyamulO sukhamu yeMgililO sukhamu

kAyamu nammikadA kashTapaDenu
pAyamulO chavulu pApamulO chavulu
mAyalu nammikadA manasUniTTAyanu           ॥enna॥ 

kallalOni baduku kAsu vIsapu baduku

kallari prANAlu nammi kaTTupaDenu
yelli nETi talapu yiMdriyAla talapu
kolla saMsAramugUDi guNamuniTTAyanu      ॥enna॥ 

aMgaDibeTTE sirulu yalayiMpulO sirulu

doMgajIvuDu yiTlAnE toTrupaDenu
aMgapu SrIvEMkaTESuDaMtalO manniMchagAnu
muMgilellA mOkshamAya muchchaTE yiTTAyenu ॥enna॥

 

Details and Explanations:

 

ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు

కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను ॥పల్లవి॥

 

ennaDokO suj~nAnamu yI yAtmaku

kannu lediTivi chUchi kAlamu niTTAyanu pallavi 

Word to Word meaning: ఎన్నఁడొకో (ennaDokO) = when? సుజ్ఞానము (suj~nAnamu) = appropriate knowledge; యీ (yI) = to this;  యాత్మకు (yAtmaku) = self; కన్ను లెదిటివి (kannu lediTivi) = (whatever) in front of the eyes; చూచి (chUchi) = seeing, observing;  కాలము (kAlamu) = time; నిట్టాయను (niTTAyanu) = happened this way; 

Literal meaning: All the time I am carried away by the things happening in front of me. When will I be getting the good (appropriate) knowledge?  

ExplanationBy the word kannu lediTivi (కన్ను లెదిటివి) Annamacahrya indicated that we are deceived by what we witness. Thus, he laid foundation for this poem that we must not fall pray to information received and transmitted by the sense organs. He used it in general purpose to cover all the senses. 

By starting with word ennaDokO (ఎన్నఁడొకో = when?), he factually meant never. Thus, the intended meaning of this chorus is ‘One will never get that appropriate knowledge, as long as one is governed by the sensory perception’.

 

See this Bhagavadgita verse इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ | तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ||3-34|| indriyasyendriyasyārthe rāga-dvehau vyavasthitau tayor na vaśham āgachchhet tau hyasya paripanthinau (The senses naturally experience attachment and aversion to the sense objects; Thus, they take over the control (of you).  O Arjun! Know that they are the impediments and foes on your path to liberation)

It will not be out of place to mention previous submission titled eduTa nevvaru lEru yiMtA vishNumayamE (ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే) O Man! What do You see in front of You? God or Overwhelmed by your own imagination born of the senses? 

Implied meaning: O man! You shall remain chained by the awareness created by the sense organs. The appropriate knowledge is beyond the comprehension born of sensorial observations. 

భావము: కలకాలము కన్ను లెదిటివి చూచి వర్తించు మానవునికి సుజ్ఞానము ఎప్పటికో?

 

వివరణము: కన్ను లెదిటివి అంటూ కన్నులెదురుగా ఉన్నవన్నీ సత్యమని  మానవుడు భ్రమపడతాడన్నారు. అదే ప్రకారముగా వినికిడి ద్వారాను, వాసన ద్వారాను, స్పర్శతోను, జిహ్వతోను తెలియబడినవన్నీ యథార్థమని భావించి తప్పుటడుగు వేస్తాడు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని క్రింది పద్యాన్ని మననము చేసుకుందాము.

క. వినఁదగు నెవ్వరు సెప్పిన

వినినంతనె వేగపడక వివరింపఁదగున్‌
గని కల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ!

భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని కూడా చూడండి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ (3-34) {భావము:ఇంద్రియములకు లోనై, వాటిని అనుసరించిన, రాగాద్వేషాలు కలుగుతూ వుంటాయి. ఇవి మనిషిని లోబరచుకొని,  తమవైపు దృష్టిని మళ్లించి,  (మనిషి) తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో బండరాయిలా అడ్డుపడతాయి.} 

‘ఎన్నఁడొకో’ అని వీటితో (ఇంద్రియముల ద్వారా) ఎప్పటికీ సత్య దర్శనము కాదని రూఢీగా చెప్పారు. ఈ సందర్భంగా మునుపటి కీర్తన “ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే”ను మననము చేసుకుందాము. భావము: మానవుడా! ఎదుటనే ఉన్న భగవంతుని చూస్తున్నావా లేక నీలోని ఊహల్లోనే కొట్టుకుపోతున్నావా? 

అన్వయార్ధము: ఓ నరుడా! ఇంద్రియాలు సృష్టించిన అవగాహన ద్వారా నీవు బంధించబడతావు. ఇంద్రియముల గ్రహణశక్తిని దాటి సుజ్ఞానము కలదు.

 

హేయములో సుఖము యెంగిలిలో సుఖము

కాయము నమ్మికదా కష్టపడెను

పాయములో చవులు పాపములో చవులు

మాయలు నమ్మికదా మనసూనిట్టాయను ॥ఎన్న॥

 

hEyamulO sukhamu yeMgililO sukhamu

kAyamu nammikadA kashTapaDenu

pAyamulO chavulu pApamulO chavulu

mAyalu nammikadA manasUniTTAyanu        enna 

Word to Word meaning: హేయములో (hEyamulO) = విడువఁదగినది, in abominable things, in mean things, in base things, in vile things; సుఖము (sukhamu) = comfort, happiness, pleasure, enjoyment; యెంగిలిలో (yeMgililO) = in Spittle; సుఖము (sukhamu) = comfort, happiness, pleasure, enjoyment; కాయము (kAyamu) = body; నమ్మికదా (nammikadA) = alas trusting (the body);  కష్టపడెను  (kashTapaDenu) = works hard; పాయములో (pAyamulO) = in youth;  చవులు (chavulu) = curiosity, inquisitiveness, keenness (on experience);  పాపములో (pApamulO) = in sin (in the forbidden); చవులు (chavulu) = curiosity, keenness (on experience);  మాయలు (mAyalu) = illusions; నమ్మికదా (nammikadA) = alas trusting (the illusion) మనసూనిట్టాయను (manasUniTTAyanu) = this way his mind bends. 

Literal meaning: Man eyes the pleasure in mean things. Man finds the happiness in the spittle. Alas, trusting the (transient) body, he works hard. He eyes the experience of the youth. He is curious and gets engaged with the forbidden.  Regrettably, inquisitiveness overtakes him and this way his mind bends. 

Explanation: Annamacharya made the whole things abundantly clear. We are conditioned to believe the signals from the sense organs as absolute truth. We take pride in our sensitivity, intelligence, and awareness. What did man achieve over last one and quarter century? {so called great years of inventions and landmark changes}. 

Unfortunately, despite the material success and longevity of life, Man as a human did not move an inch ahead. He remained fundamentally the same. Low trust in fellow beings; Inwardly fearful; Scamper for safety remained the same since the days of the stone age. 

Thus, Gentlemen! Our intelligence is no good for fellow beings. Our sensitivity results in estrangement. Our awareness is a catastrophe for this planet. What kind of human beings we are? 

We must be happy to know that Buddha could find the path to truth and Niel Armstrong could lay his foot on the moon. However, Sir, be wary of your role in those magnificent acts; if there is one, it is inconceivably small. Thus, having the knowledge of your contribution, be humble. Leave the pride born of your knowledge, awareness, and achievement behind and join the never-ending consciousness that connects all beings.  

 

భావము: హేయమైన పనులలోను పరుల యెంగిలిలోను సుఖమును ఆశించి, దేహము నిజమని నమ్మి మానవుడు కష్టపడతాడు. యవ్వనములోను పాపములోను చవులుగొని, మాయలకు లోబడి మనోదౌర్బల్యమును పొందుతాడు.

వివరణము: అన్నమాచార్యులు ఏ విషయాలలో ఇరుక్కుంటాడో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంద్రియాల నుండి వచ్చే సంకేతాలను షరతు విధించినట్లు సంపూర్ణ సత్యంగా విశ్వసిస్తాము.  మన 'సున్నితత్వం', 'తెలివితేటలు' మరియు 'అవగాహన'లకు గర్విస్తాము. {ఆవిష్కరణలు మరియు విప్లవాత్మకమైన మార్పులకు ఆలవాలమని అనుకొంటున్న​} గత నూటయిరవై సంవత్సరాలలో మనిషి ఏమి సాధించాడు?

దురదృష్టవశాత్తు, మనుషుల​ ఆయుష్షు దీర్ఘమైనప్పటికీ, భౌతికమైన అనేక​ విజయాలు తోడైకూడా, మనిషి మనిషిగా ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. అతను ప్రాథమికంగా అలాగే (అనాగరికంగానే) ఉన్నాడు. ‘తోటి జీవులపై అపనమ్మకం’; ‘అంతరంగంలో భయం’;  ‘భద్రత కోసం పరుగులాట’ రాతి యుగము నుండి అలాగే ఉన్నవి.

కాబట్టి, స్నేహితుడా! మన తెలివి తోటి జీవులకు కాపు (రక్షణ) కాదు. మన సున్నితత్వం సమాజం నుండి వేరుపరచుటకు దారి. మన అవగాహన ఈ భూగ్రహానికే విపత్తు. మనం ఎలాంటి మనుషులం? కాబట్టి సత్యాన్వేషి! నీ యీ (ఇంద్రియ) జ్ఞానమును అవిద్య అని తెలిసి త్యజించుము. 

ఎవరో బుద్ధునికి సత్యము గోచరమైనదనో, ఫలానా నీల్ ఆర్మ్'స్ట్రాంగ్ గారు చంద్రుని మీద ఎక్కారనో విని సంతోషించు. కానీ, ఆయా ప్రయత్నములలో నీ వంతు, అసలంటూ ఉంటే, సూక్ష్మాతిసూక్ష్మమని ఎరిగి గర్వపడవద్దన్నారు. అన్నమాచార్యులు  సర్వ జీవాళిని కలుపుచున్న ఆ చైతన్య స్రవంతిలో ‘నీలోని ఇంద్రియ జనితమైన మదమత్సరములను వదలి’ సమ్మిళితమవ్వమన్నారు. ​

 

కల్లలోని బదుకు కాసు వీసపు బదుకు

కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను

యెల్లి నేఁటి తలఁపు యింద్రియాల తలఁపు

కొల్ల సంసారముఁగూడి గుణమునిట్టాయను ॥ఎన్న॥

 

kallalOni baduku kAsu vIsapu baduku

kallari prANAlu nammi kaTTupaDenu

yelli nETi talapu yiMdriyAla talapu

kolla saMsAramugUDi guNamuniTTAyanu   ॥enna॥

 

Word to Word meaning: కల్లలోని (kallalOni) = అసత్యములోని, entrenched in lies;  బదుకు (baduku) = life;  కాసు వీసపు బదుకు (kAsu vIsapu baduku) = కొద్దిపాటి విలువ మాత్రమే కల బ్రదుకు; A life that has little or no value;  కల్లరి (kallari) = అసత్యము పలుకువాఁడు, వంచకుఁడు, A Lier; A deceiver;  ప్రాణాలు (prANAlu) = life; నమ్మి (nammi) = believing;  కట్టుపడెను (kaTTupaDenu) = stay put; యెల్లి (yelli) = రేపు, ఱేపు, tomorrow; నేఁటి (nETi) = today’s;  తలఁపు (talapu) = thought; యింద్రియాల (yiMdriyAla) = of the senses;  తలఁపు (talapu) = thought; కొల్ల (kolla) = దోచుకొను, కొల్లగొట్టు plunder, pillage సంసారముఁగూడి (saMsAramugUDi) = by joining this world;  గుణమునిట్టాయను (guNamuniTTAyanu) =he thus carved his qualities; 

Literal meaning: This life is entrenched in lies. It has no or little value. It stays put believing a lie; Where does that thought put up by senses gone? He (man) carved his qualities out of these lies by joining in this world. 

ExplanationGentlemen, if we know there is nothing certain to stand upon, there is no known principles to follow, be clear that you are standing on your own. Break the unfounded foundations. Clear the rubble on your path. 

This entire stanza is indicative of illusion man gets in. In the endeavour to save his life, he exchanges living to safety. Now consider this interesting statement from bible. Luke 9:23–25 23Then Jesus said to all of them, “If anyone wants to come after Me, he must deny himself and take up his cross daily and follow Me24For whoever wants to save his life will lose it, but whoever loses his life for My sake will save it. 25What does it profit a man to gain the whole world, yet lose or forfeit his very self?

 

Bhagavad-Gita says those engage in fulfilment of sensory pleasures shall go to hell.  अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृता: | प्रसक्ता: कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ||16-16|| (aneka-chitta-vibhrāntā moha-jāla-samāvṛitāḥ prasaktāḥ kāma-bhogeṣhu patanti narake ’śhuchau Possessed and led astray by such imaginings, enveloped in a mesh of delusion, and addicted to the gratification of sensuous pleasures, they descend to the murkiest hell). Whether they go to hell or not, its clear that we are creating and created hell here on the earth.

భావము: కొద్దిపాటి విలువ మాత్రమే కల బ్రదుకును కల్లలోని బదుకును మానవుడు కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను.  యింద్రియాల ద్వారా కలిగిన నిన్నటి తలఁపు ఈ రోజు లేదే! కొల్లగొట్టు సంసారమును కూడి గుణమున నిట్టాయను.

వివరణము: పెద్దమనుషుల్లారా! ఖచ్చితంగా నిలబడటానికి ఆధారం ఏమీ లేదని, అనుసరించడానికి సూత్రాలు లేవని తెలిస్తే,  స్వంతంగా  మీ  కాళ్ళపై మీరు నిలబడి ఉన్నట్లే.  ఇక ఆ ఆధారం లేని పునాదులను బద్దలు కొట్టండి. మీ దారిలో ఉన్న శిథిలాలను తొలగించండి.

ఈ చరణం మొత్తం మనిషికి కలిగే భ్రమలను సూచిస్తుంది. తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో, మనిషి సురక్షితంగా జీవించడాన్ని ఎంచుకుని జీవనమునే పందెముగా ఓడతాడు.

ఇప్పుడు బైబిల్ నుండి ఈ ఆసక్తికరమైన ప్రకటనను పరిశీలించండి. లూకా అధ్యాయము (9:23-25) నందు యేసు తన శిష్యులను చూచీ ఇట్లనెను.   23“ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.” 24“తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.” 25“ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?”

 

భగవద్గీత ఇంద్రియ సుఖాల నెరవేర్పులో నిమగ్నమై ఉన్నవారు నరకానికి వెళతారు అన్నది. అనేకచిత్తవిభ్రాంతాః  మోహజాలసమావృతాః  । ప్రసక్తాః  కామభోగేషు పతంతి నరకేఽశుచౌ  (16-16) {భావము: మోహము (భ్రమ) నొందినవారును, అనేకవిధములైన చిత్తచాంచల్యములతో గూడినవారును, మోహము (దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము) అను వలచే బాగుగ గప్పబడినవారును, కామముల ననుభవించుట యందు మిగుల యాసక్తి గలవారును అయి, వారు (అసురప్రకృతి గలవారు) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు.} వారు నరకానికి వెళ్లుదురో లేదో తెలియదు కానీ, మనం ఈ భూమిపై నరకాన్ని సృష్టిస్తూనే ఉన్నాము

 

అంగడిఁబెట్టే సిరులు యలయింపులో సిరులు

దొంగజీవుఁడు యిట్లానే తొట్రుపడెను

అంగపు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను

ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను ॥ఎన్న॥

 

aMgaDibeTTE sirulu yalayiMpulO sirulu

doMgajIvuDu yiTlAnE toTrupaDenu

aMgapu SrIvEMkaTESuDaMtalO manniMchagAnu

muMgilellA mOkshamAya muchchaTE yiTTAyenu enna

 

Word to Word meaning: అంగడిఁబెట్టే (aMgaDibeTTE) = బట్టబయలు చేయు, అల్లరి పెట్టు, make things open, disturb, discompose; సిరులు (sirulu) = riches; యలయింపులో (yalayiMpulO) = ఆయాసపెట్టు, శ్రమపెట్టు సిరులు (sirulu) = riches; దొంగజీవుఁడు (doMgajIvuDu) = thief like man;  యిట్లానే (yiTlAnE) తొట్రుపడెను (toTrupaDenu) = సంభ్రమింౘు, తడఁబడు totter, stumble, be bewildered or perplexed; అంగపు (aMgapu) = శరీర సంబంధం గల బంధువులు, దగ్గరి బంధువులు truly bodily related;  శ్రీవేంకటేశుఁడంతలో (SrIvEMkaTESuDaMtalO) =  Lord Venkateswara quickly;  మన్నించఁగాను (manniMchagAnu) = having pardoned me;  ముంగిలెల్లా (muMgilellA) = ఇండ్లముందరియంకణము; the court yard in front of the house;  మోక్షమాయ (mOkshamAya) = liberated;  ముచ్చటే (muchchaTE) = ఆప్యాయము, మురిపెము, satiety; యిట్టాయెను (yiTTAyenu) = happened this way;

 

Literal meaning: Acquiring wealth, on the other hand, seriously jeopardizes your intentions.  It makes you sweat a lot.  Thus, the man stumbles in his journey of life. Closely related Lord Venkateswara quickly pardoned (my wrong doings) and the entire courtyard got blessed. 

Explanation: its very clear that once the avarice to become rich takes over the man, there is no end to his downfall. This we have witnessed in our lifetime. 

Word doMgajIvuDu (దొంగజీవుఁడు) is interesting. Here it meant that man deceives himself. The word aMgapu SrIvEMkaTESuDu(అంగపు శ్రీవేంకటేశుఁడు) meaning that God is the true relative of man. The other relationships we create in this world are temporary. 

భావము: సిరులు అల్లరి పెట్టడమే కాకుండా (చీకాకు) ఆయాసపెడతాయి కూడా. నిశ్చయములేని దొంగజీవుఁడు సంభ్రమించి, సిరుల వెంటపడి తడఁబడతాడు. దగ్గరి బంధువు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను ముంగిలెల్లా మోక్షమై ముచ్చటాయెను.

వివరణము: ధనవంతుడు కావాలనే దురాశ మనిషిని ఆక్రమించిన తర్వాత, అతని పతనానికి అంతం ఉండదు అనేది చాలా స్పష్టం.  మన జీవితకాలంలో ఇది జరగడం మనం గమనించే ఉంటాము.

ఆసక్తికరమైన “దొంగజీవుఁడు” అన్న పదం మనిషి తనను తాను మోసం చేసుకుంటాడని సూచిస్తోంది. “అంగపు శ్రీవేంకటేశుండు” అంటూ దేవుడే మనిషికి నిజమైన బంధువు అని చెప్పారు. ఈ ప్రపంచంలో మనం సృష్టించుకునే ఇతర సంబంధాలు తాత్కాలికమైనవని భావము.

 

Recommendations for further reading:

96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)

87. తల లేదు తోఁక లేదు దైవమా నీ మాయలకు (tala lEdu tOka lEdu daivamA nI mAyalaku)

 

Summary of this Keertana:

 

All the time I am carried away by the things happening in front of me. When will I be getting the good (appropriate) knowledge?  Implied meaning: O man! You shall remain chained by the awareness created by the sense organs. The appropriate knowledge is beyond the comprehension born of sensorial observations.

 

Man eyes the pleasure in mean things. Man finds the happiness in the spittle. Alas, trusting the (transient) body, he works hard. He eyes the experience of the youth. He is curious and gets engaged with the forbidden.  Regrettably, inquisitiveness overtakes him and this way his mind bends.

 

This life is entrenched in lies. It has no or little value. It stays put believing a lie; Where does that thought put up by senses gone? He (man) carved his qualities out of these lies by joining in this world.

 

Acquiring wealth, on the other hand, seriously jeopardizes your intentions.  It makes you sweat a lot.  Thus, the man stumbles in his journey of life. Closely related Lord Venkateswara quickly pardoned (my wrong doings) and the entire courtyard got blessed.

 

కీర్తన సంగ్రహ భావము:

 

కలకాలము కన్ను లెదిటివి చూచి వర్తించు మానవునికి సుజ్ఞానము ఎప్పటికో? అన్వయార్ధము: ఓ నరుడా! ఇంద్రియాలు సృష్టించిన అవగాహన ద్వారా నీవు బంధించబడతావు. ఇంద్రియముల గ్రహణశక్తిని దాటి సుజ్ఞానము కలదు.

హేయమైన పనులలోను పరుల యెంగిలిలోను సుఖమును ఆశించి, దేహము నిజమని నమ్మి మానవుడు కష్టపడతాడు. యవ్వనములోను పాపములోను చవులుగొని, మాయలకు లోబడి మనోదౌర్బల్యమును పొందుతాడు.

కొద్దిపాటి విలువ మాత్రమే కల బ్రదుకును కల్లలోని బదుకును మానవుడు కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను.  యింద్రియాల ద్వారా కలిగిన నిన్నటి తలఁపు ఈ రోజు లేదే! కొల్లగొట్టు సంసారమును కూడి గుణమున నిట్టాయను.

సిరులు అల్లరి పెట్టడమే కాకుండా (చీకాకు) ఆయాసపెడతాయి కూడా. నిశ్చయములేని దొంగజీవుఁడు సంభ్రమించి, సిరుల వెంటపడి తడఁబడతాడు. దగ్గరి బంధువు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించఁగాను ముంగిలెల్లా మోక్షమై ముచ్చటాయెను.


Copper Leaf: 379-2 Volume 4-460

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...