Monday 11 January 2021

16. ఆసమీఁద విసువౌ దాఁక (AsamIda visuvau dAka)

 

ANNAMACHARYA

16. ఆసమీఁద విసువౌ దాఁక

Annamacharya in this hard hitting satirical verse derides our never ending wants. He describes vividly how awful our life is. He criticized that we live in oblivion of intelligent ways.

ఆసమీఁద విసువౌ దాఁక యీ-

గాసిఁ బరచు తన కపటమే సుఖము ॥పల్లవి॥


AsamIda visuvau dAka yI-
gAsi barachu tana kapaTamE sukhamu ॥pallavi॥

 

Word to word meaning: ఆసమీఁద (AsamIda) = on wants, on hopes; విసువౌ (visuvau) =tired of; దాఁక (dAka) =till then; యీ (yI) = this; గాసిఁ బరచు (gAsi Barachu) = wearying; తన (tana) = self; కపటమే (kapaTamE) = deceit only; సుఖము (sukhamu) = comforting. 

Literal meaning: until one is tired of endless wants (hopes) he continues to enjoy the comforting deceit. 

Implied meaning: Don’t deceive yourself without finding the root cause of your present wretched existence. 

Comments:  Annamacharya is very clear that our present existence is pale in comparison to the intelligent ways. In most of his verses, Annamacharya stirs up these issues. Of course, Jiddu Krishnamurti also talked of intelligent ways. Jiddu Krishnamurti tried to persuade his audience to find the same from 1929 till his death in 1986.


||చ|| తిరమగుఁ కర్మము దెగుదాఁక తన-
గరిమ సుఖము పొగడునందాఁక
పరమార్గం బగపడుదాఁక తన-
పరితాపపు లంపటమే సుఖము ॥ఆస॥

tiramagu karmamu degudAka tana-
garima sukhamu pogaDunaMdAka
paramArgaM bagapaDudAka tana-
paritApapu laMpaTamE sukhamu ॥Asa॥

Word to word meaning: తిరము (tiramu) = permanent/ constant; అగుఁ (agu) = said to be కర్మము (karmamu) = chores/errands/work; దెగు= తెగు (degu =tegu) = cut off దాఁక ( dAkAa) = till then; తన (tana) = self; గరిమ (garima) = esteem, importance సుఖము (sukhamu) = comfort;  పొగడునందాఁక (pogaDunaMdAka) = praise till such time; పరమార్గం (paramArgaM) = the other path;  అగపడుదాఁక  (agapaDudAka) = unless seen by తన (tana) = self; పరితాపపు (paritApapu) = sorrow generating; లంపటమే (laMpaTamE) only lustful pleasures;  సుఖము (sukhamu) = solace.  

Literal meaning: unless one has cut off the never ending chores, until one has stopped enjoying self-esteem and importance, without finding the path to the truth, sorrow generating lustful pleasures are the only solace (to the people). 

Comments: Annamacharya continues  his analysis. Engagement with chores and apple polishing activities (of the self-esteem) continues to occupy our time. Thus we reconcile ourselves that we really don’t have time to think about the other path.

 

||చ|| కాయము గడపల గనుదాఁక యీ
మాయ దన్ను వెడమరుదాఁక
రాయడి మదము గరఁగుదాఁక యీ-
రోయఁదగిన తనరూపమే సుఖము
॥ఆస॥

 

kAyamu gaDapala ganudAka yI

mAya dannu veDamarudAka

rAyaDi madamu garagudAka yI-

rOyadagina tanarUpamE sukhamu Asa

 

Word to word meaning:  కాయము (kAyamu) =body; కడపల  (gaDapala) =ముగింపు end; కనుదాఁక  (ganudAka) =unless found; యీ (yI) = ,  this; మాయ (mAya) = illusion;  దన్ను = తన్ను (dannu =tannu) =self;పెడ మరుదాఁక (veDamarudAka = peDamarudAka) = till forgotten; రాయడి  (rAyaDi) =causing friction, (= jealousy); మదము (madamu) = vain pride; గరఁగుదాఁక = కరఁగుదాఁక  (garagudAka = karagudAka) = till they get melted; యీ= (yI) = this; రోయఁదగిన  (rOyadagina) = worthy of disgust; తనరూపమే (tanarUpamE) =own shape/ own body; సుఖము (sukhamu) = consolation.

Literal meaning: Until the body meets the end, as long as the illusion titillates the person; unless the jealous causing pride has been melted away, this disgusting body is the only consolation (to the people).  

Comments: Annamacharya wants us to realise our love for the body, our pride and jealousy are blinding our intelligence and is making us to act the way we do now. He is sarcastically saying that our (perishing) body presumed to be better thing in lieu of liberation.

 

||చ|| లంకెలఁ బొరలి నలఁగుదాఁక యీ
యంకెల భవము లెరవౌదాఁక
వేంకటపతిఁ దడవిన దాఁక యీ
కింకురువాణపు గెలుపే సుఖము॥ఆస॥

 

laMkela borali nala gudAka yI

yaMkela bhavamu leravaudAka

vEMkaTapati daDavina dAka yI

kiMkuruvANapu gelupE sukhamu ॥Asa॥ 

Word to word meaning: లంకెలఁ (laMkela) =bondages;  బొరలి = పొరలి (borali = porali) to roll; నలఁగుదాఁక (nalagudAka) =gets pounded; యీ  (yI) = this; అంకెల = చెంతన close by, (association); భవములు (bhavamu) = existence; ఎరవు (avau) = borrowed; దాఁక = dAka) = till such time; వేంకటపతిఁ (vEMkaTapati) = lord of seven hills, God; తడవిన దాఁక (daDavina dAka) = till such time caressed by;  యీ (yI) =this; కింకురువాణపు (kiMkuruvANapu) = obeying, subservient; గెలుపే (gelupE) = victory only; సుఖము (sukhamu) = relief. 

Literal meaning: Until one gets disillusioned by the ever persecuting wants, battering bondages, till such time one is not blessed by the vEMkaTapati (God), this subservient existence is the victorious relief (to the people). 

Comments: Annamacharya underlined that we don’t realise and act to put an end to this continuous cycle of birth and death. Thus we continue our ignorance.

 zadaz

Reference: Copper Leaf: 34-5, Volume: 1-212

 

 

 

 

 

 

 

1 comment:

  1. సుఖాలనిచ్చేది యనే భ్రమలో పడవేసి తుదకు దుఃఖాన్ని మిగిల్చేదే భోగేచ్ఛ. అంతులేని కోరికల లంపటంలో పడి అలసిసొలసి కడకు అంతేలేని దుఃఖాన్ని అనుభవించే మానవజీవితం మోసపూరితమైనదే. అంటే యిట్టి జీవితాన్ని గడిపి, తన్ను తాను వంచించుకొంటున్నాడు మానవుడు.

    జీవితసత్యాన్ని, పరమార్థాన్ని గ్రహించేదాకా, అహంకారమదంతో
    దుఃఖభాజనములైన యీ ప్రాపంచిక కర్మలను చేస్తూనే ఉంటాడు మనిషి. వాటియందే సుఖముందనే భ్రమలో పరితపిస్తూనే ఉంటాడు.

    ఈ విధంగా మాయామోహంలో కొట్టుమిట్టాడు వరకు,శరీరం కడతేరు వరకు, మదమత్సరములు అణగిపోవు వరకు అసహ్యకరమైన యీ శరీరమే మానవుడికి సుఖదాయకంగా ఉంటుందని అన్నమయ్య వ్యంగ్యంగా అంటున్నాడు.
    అంటే, శాశ్వతమైన పరమసుఖాన్ని యిచ్చే మోక్షం కంటె తాత్కాలికమైన ఆనందాన్నిచ్చే నశ్వరమైన యీ శరీరమే సుఖప్రదమనే మాయలో జీవితాన్ని గడుపుతుంటాడు మానవుడని అన్నమయ్య అంటున్నాడు.

    సంసారసుఖములు భవబంధాలు అనిత్యములని తెలిసికొను వఱకు,వేంకటపతి అనుగ్రహం ప్రాప్తించు వఱకు ఈ మాయాజీవితమే మనిషికి ఉపశమనమని అంటున్నాడు అన్నమయ్య. అంటే, ఈ భవబంధములు, ప్రాపంచిక భోగములు సంపూర్ణముగా విడిచిపెట్టినగాని మనిషి మోక్షమును పొందజాలడని
    రేకెత్తించే అద్భుతమైన ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు నిర్ద్వంద్వంగా వక్కాణించుచున్నారు.
    ఓం తత్ సత్🙏🙏🙏
    కృష్ణ మోహన్

    ReplyDelete

T-202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ

  అన్నమాచార్యులు T 202. నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : నేను ఇంత కాలము ఆ సొమ్ములు , ఈ బాంధవ్యాలు ...