Tuesday, 13 September 2022

T-141 నానాఁటి బదుకు నాఁటకము

 తాళ్లపాక అన్నమాచార్యులు

141 నానాఁటి బదుకు నాఁటకము  

for EnglishVersion press this link

 

ఉపోద్ఘాతము: ఆత్మతృప్తిని, ఆహ్లాదభావమును నింపు ఈ కీర్తనలో, అన్నమాచార్యులు చర్య యందు నిమగ్నమగుటకు, చర్యను చేయుటకు ప్రయత్నించుటకు గల అంతరమును నాటకమనిరి. 

ఈ సుప్రసిద్ధ కీర్తనకు వ్యాఖ్యానము వ్రాయడము సాహసమే. ఎంతో సులభముగానూ వినగానే అర్ధమైపోవుననిపించు ఈ కీర్తనకు వివరణ అనవసరము అనుకోవచ్చు. ఇక్కడ అన్నమాచార్యులు మనము చూచుదానికి, మనమూహించుదానికి గల వ్యత్యాసమును   గర్హించుటకు ‘నాటకమ’నిరి. "కానక కన్నది" అని పల్లవిలోనే మెలిక పెట్టిరి. 'కైవల్యము' అను పదము అర్ధమును క్రమక్రమముగా మార్చుతూ అది మానవుడు ఎంచుకోగల గమ్యముకాదని చెప్పక చెప్పిరి.  

కీర్తన:

రాగిరేకు:  299-5  సంపుటము: 3-576

నానాఁటి బదుకు నాఁటకము
కానక కన్నది కైవల్యము ॥పల్లవి॥
 
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును
కట్టఁగడపటిది కైవల్యము ॥నానాఁ॥
 
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాఁటినపుడే కైవల్యము     ॥నానాఁ॥
 
తెగదు పాపమును తీరదు పుణ్యము
నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక
గగనము మీఁదిది కైవల్యము    ॥నానాఁ॥

 


Details and Explanations:

నానాఁటి బదుకు నాఁటకము
కానక కన్నది కైవల్యము   ॥పల్లవి॥
 

ముఖ్య పదాలకు అర్ధాలు: కానక కన్నది = అతి కష్టముమీద కని అనుభవించినదైననూ కలిగెనని తెలుపలేనిది,

భావము: నరుడా! నానాఁటి బదుకు నాఁటకము.  గొప్ప ఏకాగ్రతతో కని అనుభవించినదైననూ కలిగెనని తెలుపలేనిది కైవల్యము​. (అందువల్ల, దీనిని కూడా ప్రజలు నాటకం అని పిలవవచ్చును.)

వివరణము: పల్లవిలోని కానక కన్నది అన్నపదములు ఎమ్ సి ఎస్చెర్ గారు గీసిన ఘనము (క్యూబ్) అను పేరుగల చిత్రమును (దిగువ ఇవ్వబడిందిగుర్తుకు తెస్తుంది. ఇది చాలా సాధ్యమే అనిపిస్తుంది. దగ్గరగా చూస్తే అది అసాధ్యం. అది సాధ్యాసాధ్యముల​ ఆకర్షణ శక్తితో తిరిగి తిరిగి వెనక్కి లాగుతుంది 



ఒక వ్యక్తి ప్రజల కోసమో, కుటుంబం కోసమో లేదా సంప్రదాయం కోసమో సత్యాన్ని అనుసరించిన​, అది ఒక విధిగా, ఒక నాటకంగా మిగిలిపోతుంది. అందువలన అన్నమాచార్యుడు ముందుగానే హెచ్చరిక జారీ చేసాడు. ఒక్క పల్లవితో అన్నమాచార్యులు ఎంత తీక్షణముగా, నిశితముగా కవిత్వము చెప్పినది తెలియవచ్చు.

ఒక నాటకమునకు నటుడు(లు), మౌఖిక లేదా రాత ప్రతి మరియు ప్రేక్షకులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. జీవితంనాటకంలో మానవుడే తన స్వంత రాత ప్రతితో నటిస్తాడు మరియు విధివశాత్తు, తన జీవితానికి తానే ప్రధాన ప్రేక్షకుడు. అటువంటప్పుడు, నాటకము దిశలో పయనించునది ఎవ్వరైనా ఊహించ​గలరుఅందుకనే, మానవజాతి చాలా కాలంగా స్తబ్ధుగా ఉండిపోయినది.

ఒక నాటకం నుండి, మనకు కొంత సంతృప్తి, కొంత వినోదం లభిస్తాయి. కానీ, మన బదుకులా౦టి నిస్సారమైన, నిస్తేజమైన నాటకాన్ని చూడడానికి ఎవరు మూల్య౦ చెల్లిస్తారు? సినీ ప్రమాణాల ప్రకారం, అట్టర్ ఫ్లాప్. అయినప్పటికీ ఆ మానవుడు  తను గొప్పగా నటిన్నానని భావిస్తాడు!! ఎంత నిర్లజ్జ​! ఏంత అవివేకము?

ఇక్కడ వానమామలై వరదాచార్యులు గారు వ్రాసిన పోతన చరిత్రము (1-115) నుండి క్రింది పద్యమును ఉదాహరించుట సముచితమని అనుకొంటాను.

ఉ: వచ్చుచుఁ బోవుచుండె నటవర్గములోని కదేల యన్నచోఁ
జచ్చుచుఁ బుట్టుచుండె జనసంఘము భూస్థలి నేలయంచు వా
రెచ్చట కేఁగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచున్
బుచ్చునో యట్టి సూత్రధరు పొంతకుఁ పోదురటంచుఁ పల్కినన్

ఇంకా, అన్నమాచార్యులు జీవితమను నాటకములో మన పాత్ర నిర్వహించడానికి మనము సిద్ధంగా లేమని స్పష్టంగా సూచిస్తున్నారు. సందర్భముగా యీ ఐరిష్ సామెతను చూడండి. “ప్రపంచమొక నాటకరంగం; మనమంతా అశిక్షిత నర్తక సంఘం.” (Translated by Dr. M. Ramaprasad).

అన్వయార్ధము: అత్యావశ్యకరమైన జీవితమును గడుపుటకు ఇప్పటి నాటకాలకు ముగింపు పలుకుము. 

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును
కట్టఁగడపటిది కైవల్యము ॥నానాఁ॥

భావము: ఈ జనన మరణాలను#1 వాస్తవాల మధ్య (నీవే రచించిన కధతో) నాటకం ఆడతావు. (నీ) ముందున్న ప్రపంచములోని చిట్టచివరిది, శాశ్వతమైనది సత్యము  (లేదా కైవల్యము) మాత్రమే. 

వివరణము:  ‘ప్రపంచమును కట్టఁగడపటిది” అని అన్నమాచార్యుడు ఈ లోకంలో చివరిది మరియు శాశ్వతమైనది సత్యము అని చెప్పిరి. రెండు వేరు వేరు ప్రపంచాలు లేవు అని వెల్లడించిరి. 

మానవుడు తన ఊహల్లో రెండు లోకాలను నిర్మించుకుంటాడు. దుఃఖమంటని  ఊహాజనితమైన మరొక ప్రపంచాన్ని కోరుకుంటాడు. అన్నమాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి ఆధునిక తత్వవేత్తలు భావనతో ఏకీభవించరు. భగవద్గీత శ్లోకం 6-29 యొక్క పరోక్ష అర్థం కూడా అదే. 

అందువలన, సమస్యల్లేని ప్రపంచం మనిషి కల్పన. ఒక భ్రమ. అందువలన అన్నమాచార్యుడు దీనిని నాటకము అని పిలిచాడు.

అన్వయార్ధము: తారతమ్యాలు లేకుండా ప్రపంచాన్ని చూస్తే, సత్యము#2 ఇక్కడే నీ ముందే ఉంది.  

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాఁటినపుడే కైవల్యము ॥నానాఁ॥ 

భావము: కుడచు అన్నము చుట్టు కోకలు అవసరమే. కానీ చిన్న విరామంలో (జనన మరణాల మధ్య కాలములో) వాటిపైననే దృష్టి వుంచుటే నాటకము​. మానవుడు వొడిఁ గట్టుకొనిన వుభయకర్మముల ద్వారా సృష్టించబడిన సరిహద్దులను దాటినప్పుడు, అనగా ఇకపై వాటితో ఎటువంటి సంబంధము లేనప్పుడు, మోక్షానికి అవకాశం ఉంటుంది.

వివరణము: మానవుని మదిలో ఆహారమునకు గల  ప్రాథమిక స్వభావాన్ని నొక్కిచెప్పడానికి తరచుగా దానిని పునరావృతం చేస్తారు అన్నమాచార్యుల వారు. లోకంలో మనిషి ఏమి చేసినా అది అతని మనస్సు పొరల అడుగు భాగంలో దాగి ఆహారము ఉంటుంది. ‘చిత్తరువు శీర్షికతో దిగువ ఇచ్చిన రెనే మాగ్రిట్టే పెయింటింగ్'ను  పరిశీలనము చేయమని పాఠకులకు అభ్యర్థన​. యూరోపియన్ సాంస్కృతిక​ యాసతో ఉన్నప్పటికీ చిత్రలేఖనమును పాఠకులు ఉపేక్షింపరని ఆశిస్తాను.



ప్లేటు మీద ఉన్న కన్ను నేరుగా చూపరుని వైపు చూస్తుంది. ఇది బహుశా ఆహారముతో మానవులు పారవశ్యము చెందడాన్ని ప్రశ్నిస్తుంది. ఎదుటి ప్రపంచమును ఆహారము నందించు మార్గముగా చూచుచున్నారని కొందరి అభిప్రాయము. మాగ్రిట్టే  చిహ్నాలను ఇష్టపడనప్పటికీ అతను కన్నును మనస్సాక్షికి చిహ్నంగా చిత్రించాడని చైమ్ కొప్పెల్మన్  అభిప్రాయపడ్డాడు. ఏదియేమైనా, 'ది పోర్ట్రెయిట్'లోని కన్ను తనను ఉపేక్షింపరాని దానిగా తీసుకొని గౌరవించాలని అంటోందని భావించవచ్చు.

 

మాగ్రిట్టే బహు సొబగైన శీర్షికచిత్తరువు అని పెట్టి చిన్న మార్పుతో చూపరులను ఆశ్చర్యములోను, సందిగ్ధములోను తోసివేసిరి. మనిషి హృదయమను చిత్తరువును చూపిరి. అన్నమాచార్యుల వారు, మాగ్రిట్టే గారు మనలను సహజముగానూ నైతికముగానూ ఆలోచించమని పదేపదే చెప్పిరి. కడుపు నింపుకొని పుణ్యము సంపాదించుదును అనుకోవడమే మనిషి ఆడు వింత నాటకము#3.

 

వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు / గడి దాఁటినపుడే కైవల్యము:  మనిషి పుణ్యములలో నిమగ్నం కావడానికి ప్రయత్నిస్తాడు. కానీ పాపపుణ్యములు మానవుడు తీర్మానించినవే. అందుకే అన్నమాచార్యులు వాటి హద్దులు దాటితేనే అనగా, మానవునికి, అతని చేష్టలకు ఆసాంతముగా అతీతముగా నుండుటను కైవల్యమునరి. ఇటువంటి అర్ధమునే యిచ్చు భగవద్గీత శ్లోకమును కూడా మననము చేసుకొందము బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే (2-50) భావము: వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును.

 

అన్వయార్ధము: నరుడా! నీ దృష్టిని మరలించు విషయములే నీ చేత నాటకమాడించునవి. అవి పాపపుణ్యములను ఎరలనుచూపి చేజేతులా నీవే స్వేచ్ఛకు దూరమగునట్లు  క్రీడించు చున్నవి.

 

తెగదు పాపమును తీరదు పుణ్యము
నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక
గగనము మీఁదిది కైవల్యము ॥నానాఁ॥

ముఖ్య పదాలకు అర్ధాలు: గగనము = దుర్లభము.

భావము: పాపము తెగదు. పుణ్యము ఎంతైనా తీరదు. వీటి నాటకం కొనసాగుతుండగా, వెకిరించుతూ సమయం ఎగిరిపోతుందిపైవాడు వేంకటేశ్వరుడు మన యేలిక​. సత్యము అసాధ్యానికి ఆవలిది.

వివరణము: ఈ చరణము యొక్క ఉద్దేశ్యం పుణ్యము చేయబోవునప్పుడు మరియు పాపము నివారించబోవునప్పుడు మానవునికి  అంతర్గత ప్రతిఘటన ఎదురౌతుంది. దీనిని స్పష్టంగా ఆర్ ఎల్ స్టీవెన్సన్ గారి ప్రసిద్ధ నవల, డాక్టర్ జెకిల్ మరియు మిస్టర్ హైడ్ యొక్క వింత ఉదంతం (The Strange Case of Dr Jekyll and Mr Hyde by R L Stevenson) నందు గమనించవచ్చు. అన్నీ మంచి లక్షణాలున్నప్పటికీ డాక్టర్ జెకిల్ చివరికి మిస్టర్ హైడ్ (దుర్మార్గుడు)గా ఉండటానికి మొగ్గు చూపుతాడు. మనందరి పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే అని అన్నమాచార్యుల భావము.

“గగనము మీఁదిది కైవల్యము”: మానవుడు తరచుగా అసాధ్యమైన వాటికి భయపడుతాడనీ ఐతే వాస్తవానికి ఏది సాధ్యమో కనుగొనడానికి అతడు దానిని పరిశీలించడనీ సూచిస్తుంది. అసాధ్యమును వాడుకగా కొట్టివేయుట విచారణ కాదు, అది వ్యవస్థీకృత ప్రతిక్రియ మాత్రమే.

అన్వయార్ధము: పాపపుణ్యముల ఊసెత్తక సమయమే లేనట్లు అసాధ్యమని వదలక పైవాడు వేంకటేశ్వరుని చేరుటకు చేయు సాధనయే యత్నము. తక్కినవన్నీ నాటకములే.  



కీర్తన సంగ్రహ సారం:

పల్లవి: నరుడా! నానాఁటి బదుకు నాఁటకము.  గొప్ప ఏకాగ్రతతో కని అనుభవించినదైననూ కలిగెనని తెలుపలేనిది కైవల్యము​. (అందువల్ల, దీనిని కూడా ప్రజలు నాటకం అని పిలవవచ్చును.) అన్వయార్ధము: అత్యావశ్యకరమైన జీవితమును గడుపుటకు ఇప్పటి నాటకాలకు ముగింపు పలుకుము.

 

చరణం 1: ఈ జనన మరణాలను వాస్తవాల మధ్య (నీవే రచించిన కధతో) నాటకం ఆడతావు. (నీ) ముందున్న ప్రపంచములోని చిట్టచివరిది, శాశ్వతమైనది సత్యము  (లేదా కైవల్యము) మాత్రమే.  అన్వయార్ధము: తారతమ్యాలు లేకుండా ప్రపంచాన్ని చూస్తే, సత్యము ఇక్కడే నీ ముందే ఉంది.

 

చరణం 2: కుడచు అన్నము చుట్టు కోకలు అవసరమే. కానీ ఈ చిన్న విరామంలో (జనన మరణాల మధ్య కాలములో) వాటిపైననే దృష్టి వుంచుటే నాటకము​. మానవుడు వొడిఁ గట్టుకొనిన వుభయకర్మముల ద్వారా సృష్టించబడిన సరిహద్దులను దాటినప్పుడు, అనగా ఇకపై వాటితో ఎటువంటి సంబంధము లేనప్పుడు, మోక్షానికి అవకాశం ఉంటుంది. అన్వయార్ధము: నరుడా! నీ దృష్టిని మరలించు విషయములే నీ చేత నాటకమాడించునవి. అవి పాపపుణ్యములను ఎరలనుచూపి చేజేతులా నీవే స్వేచ్ఛకు దూరమగునట్లు  క్రీడించు చున్నవి.

 

చరణం 3: ఈ పాపము తెగదు. ఆ పుణ్యము ఎంతైనా తీరదు. వీటి నాటకం కొనసాగుతుండగా, వెకిరించుతూ సమయం ఎగిరిపోతుంది.  పైవాడు వేంకటేశ్వరుడు మన యేలిక​. సత్యము అసాధ్యానికి ఆవలిది. అన్వయార్ధము: పాపపుణ్యముల ఊసెత్తక సమయమే లేనట్లు అసాధ్యమని వదలక పైవాడు వేంకటేశ్వరుని చేరుటకు చేయు సాధనయే యత్నము. తక్కినవన్నీ నాటకములే.  

 

References and Recommendations for further reading:

#1 4. ఇన్ని చదవనేల (inni chaduvanEla)

#2 96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)

#3 కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు (kaDaluDipi nIrADagA dalachuvAralaku)

 

 


Wednesday, 7 September 2022

140 మనుజుఁడై పుట్టి మనుజుని సేవించి (manujuDai puTTi manujuni sEviMchi)

 ANNAMACHARYULU

140 మనుజుఁడై పుట్టి మనుజుని సేవించి

(manujuDai puTTi manujuni sEviMchi)

Service of Man

 for Telegu (తెలుగు) Version press this link


Introduction:  In this popular, short yet utterly complex poem, Annamacharya once again brings to the fore that there is only one truth. And man, failing to get out of his sinuous captivations, falters and go astray.

Annamacharya is a university to demonstrate use of daily words to connote ideas which possibly cannot be put in words. His brutally honest descriptions of our hideous occupation are touchstones of bravery. His ability to take us to indescribable worlds in few phrases is demonstration of high art.   

కీర్తన:

రాగిరేకు:  32-2  సంపుటము: 1-196

POEM

Copper Leaf:  32-2     Volume: 1-196

మనుజుఁడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ॥మనుజు॥
 
జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెఁడు గూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరఁడు గాన ॥మనుజు॥
 
అందరిలోఁ బుట్టి అందరిలోఁ బెరి-
గందరి రూపము లటు దానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరాని పదమందె నటు గాన   ॥మనుజు॥
manujuDai puTTi manujuni sEviMchi
anudinamunu dukhamaMdanElA manuju
 
juTTeDu gaDupukai choranichOTlu chochchi
paTTeDu gUTikai batimAli
puTTina chOTikE porali manasu peTTi
vaTTilaMpaTamu vadalanEraDu gAna manuju
 
aMdarilO buTTi aMdarilO beri-
gaMdari rUpamu laTu dAnai
aMdamaina SrIvEMkaTAdrISu sEviMchi
aMdarAni padamaMde naTu gAna manuju

 

 

Details and Explanations:

 

మనుజుఁడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా          ॥మనుజు॥

manujuDai puTTi manujuni sEviMchi
anudinamunu dukhamaMdanElA          manuju

 

Word to Word meaning: మనుజుఁడై పుట్టి (manujuDai puTTi) = having born as human; మనుజుని (manujuni) = (another) human; సేవించి (sEviMchi) = by serving; అనుదినమును (anudinamunu) = everyday; దుఃఖమందనేలా (dukhamaMdanElA) = = why receive sorrow?   

 

Literal meaning: Why continue to suffer day after day by serving another human? 

Explanation: Here దుఃఖమందనేలా (dukhamaMdanElA = why should you be in sorrow?) is used in the broader sense. Serving others has unreasonable consequences. Consider this Sanskrit saying (from Neeti Satakam by Bhartruhari) below: 

मौनान्मूकः प्रवचनपटुवाचको जल्पको वा
धृष्टः पार्क्ष्वे भवति च वसन् दूरतोऽप्यप्रगल्भः ।
क्षान्त्या भीरुयदि न सहते प्रायशो नाभिजातः
सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ॥ ४८ ॥ 

Purport: The Owner’s view of a servant is as below: 

If the servant is silent, owner feels he must be a fool.
if servant talks cleverly, owners feel he is talkative
(Only talks but does not do work).
if servant forbears, Owner thinks servant is coward.
If servant does not show patience, he casts him of low birth.
If Servant becomes close to Owner, he is scorned off for the etiquette.
If servant keeps distance the owner feels he must be timid.
it’s impossible to understand the expectations of Proprietor even for a yogi. 

{सेवा करने वाला यदि मौन रहे तो गूंगा, वाक्पट हो तो बकवादी, समीप रहे तो ढीठ और दूरी बनाकर रखे तो मूर्ख, क्षमाशील हो तो भीरु, असहनशील हो अकुलीन कहा जाता है। यह सेवा धर्म अत्यंत ही कठिन है।} 

Implied meaning: Don't waste your life serving others, which confuses even saints.

 

జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెఁడు గూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరఁడు గాన        ॥మనుజు॥ 

juTTeDu gaDupukai choranichOTlu chochchi
paTTeDu gUTikai batimAli
puTTina chOTikE porali manasu peTTi
vaTTilaMpaTamu vadalanEraDu gAna manuju

 

Word to Word meaning: జుట్టెఁడు (juTTeDu) = చాపబడిన బొటనవేలికి చూపుడువేలికి గల మధ్య కొలత​, జానేడు, hand span length;  గడుపుకై (gaDupukai) = for the stomach;  చొరనిచోట్లు (choranichOTlu) = unsuitable spaces; చొచ్చి (chochchi) = penetrate, infiltrate, enter; పట్టెఁడు (paTTeDu) = handful, fistful; గూటికై (gUTikai) = for food; బతిమాలి (batimAli) = beg, beseech, implore, entreat; పుట్టిన చోటికే (puTTina chOTikE) = place of birth;  పొరలి (porali) =  to roll over, to wallow; bring to the fore again and again, to desire; మనసు పెట్టి (manasu petti) = concentrating  the mind;  వట్టి (vaTTi) = pure/ empty/ only; లంపటము (laMpaTamu) = bondage, {వట్టిలంపటము =  pure, empty, only bondage}; వదలనేరఁడు గాన (vadalanEraDu gAna) = వదలివేయుట నేర్వడు కాన, because did not learn to let go, because he cannot eschew.

 

Literal meaning: Man, seeps into inappropriate places to fill tiny stomach of size of a hand span. He implores for fistful of grain. Yet, unabashedly, he concentrates mind, time and again on the place of his birth (female genital organs).  He becomes trapped in meaningless bonds because he cannot learn to let go. 

Explanation: One is to surrender to the senses at times.  But becoming mentally accustomed to the things that plague us every day is a problem to ponder. Annamacharya is not denying food. But is questioning the thought that says: “What about food for the evening and tomorrow?”. This makes man to go any extent in search of food.  The mind builds pathways to such possibilities by broadening the available information. Therefore, the wording జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి (juTTeDu gaDupukai choranichOTlu chochchi = sweats to reach impossible places) is not just accurate, but a hard and undeniable reality. 

We all know that this this baseless avocation of man has led to many wars, classifications and genocides. One of the root causes of all the problems faced by man in this world must be analysed. To be understood completely. First, take a careful look at this world-famous painting by René Magritte below titled 'La Carte Blanche' (= The White Paper).




 

On examining the above picture, it becomes clear that it is impossible. It is incongruous to imagine a horse with its rider as depicted in the picture. On close scrutiny, it’s not difficult to find that ‘the picture of the horse rider is cut into three parts and arranged into the painting. But the mind, disregarding the analysis, believes that there is a horse. (I am thankful to Mr. Scott McDaniel#1 for his analysis of #16: The Blank Check, by René Magritte. You can find full article at reference No 1) 

Surrealist artists try to disengage us from our normal thoughts by introducing tweak in ordinary things. When we take a few separate parts of an image and line them up correctly, our brain perceives them as a single object. This is called induced closure. Some more explanation on this can be found in the following picture. 


Annamacharya said “the mind makes us worry about confirming tomorrow’s meal today itself.  This is a pure waste of effort”. However, from the news everyday, we witness hunger deaths, poverty, inequality, exploitation, oppression, luxurious life of the rich etc. Each of them applies their pressure on the mind. Net effect is that man puts the truth aside by overtly trusting the logic he creates based on the information he perceived. He believes there is a horse. 

Like we did in this picture, our mind constructs unwanted possibilities with respect to security of food to separate us from the world. వట్టిలంపటము వదలనేరఁడు గాన "vaTTilaMpaTamu vadalanEraDu gAna" is indicting our vanity is preventing us from seeing the truth. This man Annamacharya is impossible. 

Now let us understand పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి (puTTina chOTikE porali manasu petti) = man in his mind visits many times, the place of his birth (female genital organs). By piecing together information to build a sizable library. On careful observation, anyone can find that this is another artificial structure we build. We tend to cover it as a symbol of vitality and purpose of existence. Man tries to derive non-existent satisfaction.  Thus, prepares himself for a counterattack. Annamacharya does not shy of expressing such base feelings we really undergo. He is a revolutionary. 

This tendency is, again due to the induced closure described above. But human beings keep these things hidden in their hearts. That's why there are countless sites on the Internet today about romance and sex. Annamacharya criticized this as "వట్టిలంపటము వదలనేరఁడు గాన" "vaTTilaMpaTamu vadalanEraDu gAna" which means man gets trapped in a senseless slavery because he could not learn to let go. In this way man becomes a prisoner in the cage he has built. What use is of blaming God?

Implied meaning: You are the one who tests and the tested. Where is the question of truth in this? Therefore, reject both.  Have you noticed what is left?

అందరిలోఁ బుట్టి అందరిలోఁ బెరి-
గందరి రూపము లటు దానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరాని పదమందె నటు గాన ॥మనుజు॥ 
 
aMdarilO buTTi aMdarilO beri-
gaMdari rUpamu laTu dAnai
aMdamaina SrIvEMkaTAdrISu sEviMchi
aMdarAni padamaMde naTu gAna        manuju

 

Word to Word meaning: అందరిలోఁ బుట్టి (aMdarilO buTTi) = taking the birth like all others; అందరిలోఁ బెరిగి (aMdarilO berigi) = live like all others; అందరి రూపములు (aMdari rUpamulu) = all their figures, shapes; అటు (aTu) = that side; దానై (dAnai) = self being, take upon the self; అందమైన (aMdamaina) = beautiful; శ్రీవేంకటాద్రీశు (SrIvEMkaTAdrISu) = Lord Venkteswara; సేవించి (sEviMchi) = by serving; అందరాని (aMdarAni) = impossible; పదమందెను (padamaMdenu) = step ascended;  అటు గాన (aTu gAna) = on reaching that side. 

Literal meaning: He (the yogi) takes birth and lives like an ordinary man. On the other side he takes upon the self all their figures, shapes. He remains the steadfast servant of the Lord Venkteswara. Finally ascends impossible step to the other side. 

Explanation: The yogi takes birth and lives like ordinary man. Then by his unwavering quest for truth he crosses all the barriers. The word అటు దానై (that side the same self) are key words of this verse. This side is our world, full of illusion. The other side is truly existing world perpetuated by truth. The word ‘అటు(aTu) is indicating a hitch, a twist, a point of no return. One may equate it to transformation of a caterpillar into butterfly. This point is the ultimate a man may climb.

However, this cannot be achieved by prayers, philanthropy and humanitarian acts.  Also, understand the strong statement of the first stanza. One has to come out of the unnatural things. As explained above in first stanza, we construct many artificial edifices and dwell in them. What to talk of the hypocrisy we perpetrate.   

The position described is not a give and take bargain. Whether “one can transcend the barrier or not” is not in the man's hand. We can keep the window of the mind open. Whether we are admitted to the other side is a million dollar question. Nevertheless, it’s worth noting the warning given by Annamacharya.తగు మునులు‌ ఋషులు తపములు సేయఁగ / గగనము మోచియుఁ గర్మము దెగదా’ {= Many saints and yogis have moved the mountains and oceans. Yet they haven’t found what inaction is}. I request the readers to re-visit the Bhagavad-Gita verse गहना कर्मणो गति: (4-17) gahanā karmaṇo gatiḥ = impossible to understand the nature of action. 


అందరి రూపములు (= all their figures, shapes). You may wonder what this word would mean. Does not make sense otherwise. However, as mentioned in the Bhagavad-Gita verse, the yogi shall feel the world in himself. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि | ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन: || 6-29|| sarva-bhūta-stham ātmānaṁ sarva-bhūtāni chātmani / īkṣhate yoga-yuktātmā sarvatra sama-darśhanaḥ Purport: The yogi uniting his consciousness with God, seated in equanimity, finds all living beings in himself and himself in all living beings. 

As I mentioned many times before, the purpose of these commentaries are not theoretical explorations, but actual and plausible human experiences in flesh and blood. Jiddu Krishnamurti felt these. Now, request readers to refer to the life story of jiddu Krishnmurti. In August 1922, Krishnamurti, for the first time, could feel the world in himself. (Refer to page 116, Years of Awakening, by Mary Lutyens). Thus Sir, When Annamacharya says అందరి రూపము లటు దానై (aMdari rUpamu laTu dAnai) he is describing his own state. 

అందరాని పదమందె నటు గాన#2: Many of us are aware that Annamacharya experienced కైవల్యము (= the ultimate truth = the abode of Lord Vishnu). This is what he is indicating by surmounting the impossible step. 

In this beautiful poem, Therefore, Annamacharya is asking the listeners to take up the path of devotion. Not to be blinded by the faith but with open eyes to embrace the divine love by eschewing ignorance.

 

References and Recommendations for further reading:

#1 http://www.scottmcd.net/artanalysis/?p=115) (Read Mr. Scott McDaniel's Beautiful explanation on Blank Check by Rene Magritte )

#2 92. మోహము విడుచుటే మోక్షమది (mOhamu viDuchuTE mOkshamadi) 

 

 

 

Summary of this Keertana:

 

Chorus: Why continue to suffer day after day by serving another human?  Implied meaning: Don't waste your life serving others, which confuses even saints.

 

Stanza 1: Man, seeps into inappropriate places to fill tiny stomach of size of a hand span. He implores for fistful of grain. Yet, unabashedly, he concentrates mind, time and again on the place of his birth (female genital organs).  He becomes trapped in meaningless bonds because he cannot learn to let go. Implied meaning: You are the one who tests and the tested. Where is the question of truth in this? Therefore, reject both.  Have you noticed what is left

 

Stanza 2: He (the yogi) takes birth and lives like an ordinary man. On the other side he takes upon the self all their figures, shapes. He remains the steadfast servant of the Lord Venkteswara. Finally ascends impossible step to the other side.

 

 

 

 

 

 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...