Monday, 25 September 2023

184 apu DEmane nEmanu manenu (అపు డేమనె నేమను మనెను)

 ANNAMACHARYULU

184 అపు డేమనె నేమను మనెను 

(apu DEmane nEmanu manenu)

for Telegu (తెలుగు) Version press here

 

Synopsis: “It's a funny thing about life, once you begin to take note of the things you are grateful for, you begin to lose sight of the things that you lack.” ― Germany Kent

Summary of this Poem:

Chorus: Rama, filled with anticipation, inquired, "Hanuman, what did she say? What message did she send?" Hanuman replied, "My Lord, she lamented the agonizing separation. She conveyed that her enduring suffering is her form of penance."

 

Stanza 1: Rama unable to wait, showering questions “Oh Hanuman What did you convey? What were Sita's exact words? What message did the daughter of Mother Earth want you to deliver?" With composure, Hanuman replied, "My Lord, with her frail form and parched lips, she expressed her struggle to endure such a life. She lamented, 'O Mightiest of Sun Dynasty, how can I bear to stay separated on the other side?”

 

Stanza 2: Rama waiting with bated breath implored “O "Hanuman, please reveal the rest of her words. What were her precise expressions?  Speak without worrying the consequences, boldly, how she topped it up with what words?" Hanuman provided a straightforward response “My Lord! Sita moaned that this fake body will not fade away swiftly.  I must endure this punishment for mischief of seeking the Golden Deer!”

 

Stanza 3: Rama unable contain curiosity inquired “O Hanuma! What did she talk of me?”. Hanuman said, "My Lord! Sita confirmed though both are of different in bodies, your life is one. She is as saddened by this separation as you are! Her final words were, 'O Primordial Lord, I eagerly await our reunion of love!'" "That divine union can be seen even today on the majestic Venkata Giri!" Annamacharya declared.


Detailed Presentation 

Introduction: The poem takes the form of a dialogue between Rama and Hanuman. After Hanuman's return from his visit to Sita Devi, Rama bombards him with questions, revealing his deep concern for Sita's well-being. Annamacharya's words vividly depict the hardships faced by Sita.

It is a commonly acknowledged fact that people often undergo personal transformation only when confronted with challenging circumstances. Even the Bhagavad-Gita commences with Arjuna's expression of distress. It is in such trying times that an individual's dedication to truth is put to the test. Those who muster the courage to stand by the truth come to comprehend the true purpose of life. Consequently, through his portrayal of Sita's extreme adversity, Annamacharya conveys the essence of spirituality through poignant words.

 

శృంగార కీర్తన:

రాగిరేకు:  58-1 సంపుటము: 6-97

ROMANTIC POEM

Copper Leaf:  58-1 Volume: 6-97

అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె      ॥పల్లవి॥
 
పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల నెట్ల దరియించే ననె     ॥అపు॥
 
యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె    ॥అపు॥
 
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె      ॥అపు॥
apu DEmane nEmanu manenu
tapamE virahapu dApamane         pallavi
 
pavanaja yEmane paDati ma~rEmane
avanija ninu nEmanu manenu
ravikulEMdra bhAramu prANaMbanai
ivala neTla dariyiMchE nane apu
 
yiMkA nEmane yiMti ma~rEmane
koMkaka yEmani kosarumane
boMkuladEhamu pOdidi vEgane
chiMkavETa yiTu chEse nane apu
 
nanu nEmane prANamu mana kokaTane
tanaku nIvalene tApamane
manukulESa prEmapumanakUTami
ghanavEMkaTagiri gaMTi nane apu

 

 Details and Explanations: 

అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె           ॥పల్లవి॥

apu DEmane nEmanu manenu
tapamE virahapu dApamane      pallavi 

Word to word meaning: అపు డేమనె (apu DEmane) = Then what did she say; నేమను మనెను (nEmanu manenu) = what did she convey as her message; తపమే (tapamE) = penance; విరహపుఁ (virahapu) = Energy of separation/estrangement; దాపమనె (dApamane) = Heat thus generated 

Literal meaning: Rama, filled with anticipation, inquired, "Hanuman, what did she say? What message did she send?" Hanuman replied, "My Lord, she lamented the agonizing separation. She conveyed that her enduring suffering is her form of penance."

Explanation: Annamacharya subtly suggests that the yearning to "reunite with Rama in Sita's thoughts" is a manifestation of desire rather than a strict act of penance. As a result, it comes with consequences such as sorrow and apprehension. For more insight, please refer to the final stanza. 

పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల నెట్ల దరియించే ననె          ॥అపు॥

pavanaja yEmane paDati ma~rEmane
avanija ninu nEmanu manenu
ravikulEMdra bhAramu prANaMbanai
ivala neTla dariyiMchE nane apu 

Word to word meaning: పవనజ (pavanaja) = Son of God controlling air = Hanuman;  యేమనె (yEmane) = what did he say; పడఁతి (paDati) = the Lady = Sita; మఱేమనె (ma~rEmane) = What did she say further; అవనిజ (avanija) = the one born to the mother earth = Sita;  నిను (ninu) = you (Hanuman); నేమను మనెను (nEmanu manenu) = What are the exact words she asked you to deliver; రవికులేంద్ర (ravikulEMdra) = the greatest among the descendants of Sun-clan (Surya Vamshi)  = Lord Rama; భారము (bhAramu) = it is too heavy; ప్రాణంబనై (prANaMbanai) = life; ఇవల (ivala) = this side (= far away in Lanka); నెట్ల (neTla) = How; దరియించే ననె (dariyiMchE nane) = can I bear?            Can I Continue?

 

Literal meaning: Rama unable to wait, showering questions “Oh Hanuman What did you convey? What were Sita's exact words? What message did the daughter of Mother Earth want you to deliver?" With composure, Hanuman replied, "My Lord, with her frail form and parched lips, she expressed her struggle to endure such a life. She lamented, 'O Mightiest of Sun Dynasty, how can I bear to stay separated on the other side?”

 

Explanation: Annamacharya illuminated an extraordinary truth through the words, "భారము ప్రాణంబనై / ఇవల నెట్ల దరియించే ననె" ("bhAramu prANaMbanai / ivala neTla dariyiMchE nane"). Yogis who have attained such a state, akin to Mother Sita, desire nothing more than to have their thoughts perfectly align with the mind of the Lord, which is the true essence of having His "Darshan" or sight.

Nevertheless, as elucidated in Bhagavad Gita verse 7-19, which states, "वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ:" (vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ), meaning "A wise person, recognizing that God is the essence of everything, surrenders to the Lord. However, individuals of such wisdom are exceedingly rare." Annamacharya belongs to this exceptional category. He devoted his life to expressing concepts that are exceedingly intricate to grasp and nearly impossible to articulate. His tireless efforts aimed to bridge the gap in comprehension.

Let's delve deeper into this concept using M C Escher's renowned lithograph titled "The Three Worlds." Executed using the woodcut technique, this image portrays an onlooker gazing at what appears to be an autumnal lake. It reflects bare tree branches on the lake's edge in the water, and floating leaves are visible on the surface. Concealed below these leaves, there's a lively fish with vibrant eyes. 

The artist intends for viewers to experience this artwork gradually, progressing from simple observation to the comprehension of its intricate structure. In this piece, the artist presents three primary elements (trees, leaves, fish) in a single location, creating a three-dimensional effect that guides the viewer's gaze. All three life stages are unveiled simultaneously. The technique of merging reflections and the water lens that envelops the viewer's perspective showcases an extraordinary level of mastery. 

Let us recall the beautiful poem “ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే“ (unnachOTanE mUMDulOkA lUhiMchi chUchitE nIvE = Stay where you are and reflect on all the three worlds (present life, past times and the death) in the same perspective and you will find it is yourself. One finds GOD alone is there in this universe. 

In the above picture, our present life is represented by a solitary fish, past times by the leaves floating on the surface, and death by a leafless old tree. The bare trees are shown as reflection instead of direct view to indicate inconceivable nature of death. The solitary fish is symbolic of loneliness we all feel in this world. Thus, we can say we are fortunate to have great artists like M C Escher who captured immortal truths in beautiful paintings. Once again, the human mind is symbolically depicted by the water, highlighting its shapeless and unpredictable essence. 

The perspective described above becomes attainable only when the mind is tranquil, undisturbed by thoughts or the turbulent ripples of our imagination. However, we are aware that our minds are often filled with countless thoughts, turning them into murky waters akin to rivers during the rainy season. 

యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె         ॥అపు॥

yiMkA nEmane yiMti ma~rEmane
koMkaka yEmani kosarumane
boMkuladEhamu pOdidi vEgane
chiMkavETa yiTu chEse nane apu 

Word to word meaning:      యింకా (yiMkA) = yet more, still yet; నేమనె (nEmane) = did she utter; యింతి (yiMti) = Lady (Sita); మఱేమనె (ma~rEmane) = further, in addition; కొంకక (koMkaka) = without worrying about consequences, fearlessly; యేమని (yEmani) = what did (she); కొసరుమనె (kosarumane) = topped it up with what words? (What message?); బొంకులదేహము (boMkuladEhamu) = this unreliable body (signals); పోదిది (pOdidi) = do not fade away; వేగనె (vEgane) = quickly; చింకవేఁట (chiMkavETa) = my desire to get the Golden Deer; యిటు (yiTu) = this way; చేసె ననె (chEse nane) = resulted in. 

Literal meaning: Rama waiting with bated breath implored “O "Hanuman, please reveal the rest of her words. What were her precise expressions?  Speak without worrying the consequences, boldly, how she topped it up with what words?" Hanuman provided a straightforward response “My Lord! Sita moaned that this fake body will not fade away swiftly.  I must endure this punishment for mischief of seeking the Golden Deer!” 

Explanation: Annamacharya made a profound expression by words బొంకులదేహము పోదిది వేగనె” (boMkuladEhamu pOdidi vEgane) = this body made up of wrong notions doesn’t pass away easily from sight, memory and existence. We have built this body over years starting from the very birth with many unfounded notions that ‘this is mine’, ‘this is not mine’ and “I shall have that’ and ‘I don’t want this’. 

"చింకవేఁట యిటు చేసె" (chiMkavETa yiTu chEse) signifies the repercussions of desires. Sita's candid acknowledgment of deserving punishment carries great weight. When the mind is perturbed by external events, our capacity for objective perception becomes compromised. Under such influences, we are unable to perceive the world with the same clarity. We might admire M C Escher's artwork, but our perception of the world remains obscured.

నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె           ॥అపు॥

nanu nEmane prANamu mana kokaTane
tanaku nIvalene tApamane
manukulESa prEmapumanakUTami
ghanavEMkaTagiri gaMTi nane apu 

Word to word meaning: నను నేమనె (nanu nEmane) = what did she talk of me; ప్రాణము మన కొకటనె (prANamu mana kokaTane) = We have one life though bodies are different; తనకు (tanaku) = to her; నీవలెనె (nIvalene) = like you; తాపమనె (tApamane) = too hard to bear; మనుకులేశ (manukulESa) = O primordial lord; ప్రేమపుమనకూటమి (prEmapumanakUTami) = our association of love; ఘనవేంకటగిరిఁ (ghanavEMkaTagiri) = The Great hill of Venkata Girir; గంటి (gaMTi)= found; ననె (nane) = she said sir;          

Literal meaning: Rama unable contain curiosity inquired “O Hanuma! What did she talk of me?”. Hanuman said, "My Lord! Sita confirmed though both are of different in bodies, your life is one. She is as saddened by this separation as you are! Her final words were, 'O Primordial Lord, I eagerly await our reunion of love!'" "That divine union can be seen even today on the majestic Venkata Giri!" Annamacharya declared.

Explanation: Annamacharya, through the phrase "మనుకులేశ ప్రేమపుమనకూటమి / ఘనవేంకటగిరిఁ గంటి ననె” (manukulESa prEmapumanakUTami / ghanavEMkaTagiri gaMTi nane), is asserting that truth is a living form of 'knowledge' or 'ज्ञान' cannot be acquired individually, like pocket money, because life is an inseparable blend of body, truth, and compassion. 

The expression "తపమే విరహపుఁ దాపమనె” (tapamE virahapu dApamane) implies that when considered considering the preceding statement, all mental resolutions or aspirations inevitably fall within the category of "desire," leading to sorrow and dispersion. Consequently, 'knowledge' or 'ज्ञान' should be perceived as an amalgamation of action, encompassing truth, love, and life. Hence, it is unsuitable for formal publication in books and preserving in the confines of intellectual libraries. 

Therefore, the declaration "ఘనవేంకటగిరిఁ గంటి ననె” (ghanavEMkaTagiri gaMTi nane), which means "I am able to see that inconceivable union," is something that eludes perception with our conditioned minds.

-x-x-x-

 

 

 


 

Saturday, 23 September 2023

T-184 అపు డేమనె నేమను మనెను

 అన్నమాచార్యులు

184 అపు డేమనె నేమను మనెను

For English version press here

క్లుప్తముగా: జీవితంలో విచిత్రమైన విషయం ఏమంటే మీరు కృతజ్ఞత చూపవలసిన విషయాలను గమనించడం ప్రారంభించిన తర్వాత, కొరవడినవి  మరుగున పడిపోతాయి.- జర్మనీ కెంట్

 

కీర్తన సారాంశం:

పల్లవి: రాములవారు ఓ హనుమా!  అప్పుడేమన్నది?  ఏమనుమన్నది?”  హనుమంతులవారు ప్రభూ! విరహముతో కూడిన తపమే తాపమని అన్నది”. 

చరణం 1: రాములవారు “ఓ హనుమా! నువ్వేమన్నావు? పడతి సీత ఏమన్నది? అవనిజ నిను ఏమని అనమంది? హనుమంతులవారు “ప్రభూ! శుష్కించిన శరీరముతో వున్న సీతామాత తనకు మిగిలిన ప్రాణములు కూడా భారమైయ్యెనని రోదించినది. రవికులేంద్రా నీవు లేని అటువైపు తనువును ధరించి ఎట్లుందునని  అడిగిందయ్యా? 

చరణం 2: రాములవారు “ఓ హనుమా! ఇంకా ఏమంది? ? యింతి సీత మఱేమనె? సందేహించక యేమని కొసరు గా చెప్పింది కూడా చెప్పు?” హనుమంతులవారు “ప్రభూ! బూటకపు ఈ దేహము తొందరగా పోదు. ఆ మూగజీవి జింకను కోరుట అనే  అపకారము తలపెట్టిన తనకు తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!" 

చరణం 3: రాములవారు “ఓ హనుమా! నన్నింకా ఏమంది?" హనుమంతులవారు “ప్రభూ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటేనంది. తనకూ నీ వలెనే ఈ వియోగము తాపమన్నదయ్యా!  ఆఖరి మాటగా ఓ మనుకులేశా! ప్రేమతోడి నీ కలయికకై ఎదురు చూస్తున్నానని అన్నదయ్యా! ఆ కూటమి  ఘన వేంకట గిరిపై ఈనాటికీ కనబడుతున్నదయ్యా!“ ఆ కూటమి ఘన వేంకట గిరిపై ఈనాటికీ కనబడుతున్నదయ్యా! అన్నారు అన్నమాచార్యుల వారు. 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: ఈ మధుర కీర్తన రామాంజనేయుల మధ్య జరిగిన సంభాషణ. సీతాదేవిని దర్శించిన  హనుమను రాములవారు ప్రశ్నలడగడంలోనే వారి మనస్సులోని  ఆత్రుతను సూచించారు.   ఆర్ద్రతతో సీతామాత కష్టములను కనుల ముందు చూపుతారు ఆచార్యులవారు. 

మనుషులకు తాము మౌలికముగా మారాలి అన్న వివేకము తరచుగా విపత్కర పరిస్థితులేర్పడినప్పుడు, అధికమైన దుఃఖములో మునుగుటచేతను వచ్చుననునది విదితమే. అటువంటి స్థితిలో వున్న సీతామాత నోటి నుండి విషాదముతో కూడుకున్న మాటలలోనూ అన్నమయ్య అధ్యాత్మికతను పలికించారు.

 

శృంగార కీర్తన:

రాగిరేకు:  58-1 సంపుటము: 6-97

అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె      ॥పల్లవి॥
 
పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల నెట్ల దరియించే ననె     ॥అపు॥
 
యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె    ॥అపు॥
 
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె      ॥అపు॥

 Details and Explanations: 

అపు డేమనె నేమను మనెను
తపమే విరహపుఁ దాపమనె           ॥పల్లవి॥ 

భావము: రాములవారు ఓ హనుమా!  అప్పుడేమన్నది?  ఏమనుమన్నది?”  హనుమంతులవారు ప్రభూ! విరహముతో కూడిన తపమే తాపమని అన్నది”. 

వివరణము: ఇక్కడ అన్నమార్యులు సీత మనస్సులో రాముణ్ణి కలవాలి అన్న సంకల్పమును విరహముతో కూడిన తపము అని, అది తాపము వంటిదేనని సెలవిచ్చారు. మరింత వివరణ కొరకు చివరి చరణము చూడ ప్రార్థన​.

పవనజ యేమనె పడఁతి మఱేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనై
ఇవల నెట్ల దరియించే ననె          ॥అపు॥

ముఖ్య పదములకు అర్ధములు:

భావము: రాములవారు “ఓ హనుమా! నువ్వేమన్నావు? పడతి సీత ఏమన్నది? అవనిజ నిను ఏమని అనమంది? హనుమంతులవారు “ప్రభూ! శుష్కించిన శరీరముతో వున్న సీతామాత తనకు మిగిలిన ప్రాణములు కూడా భారమైయ్యెనని రోదించినది. రవికులేంద్రా నీవు లేని అటువైపు తనువును ధరించి ఎట్లుందునని  అడిగిందయ్యా? 

వివరణము: అన్నమాచార్యులు “భారము ప్రాణంబనై / ఇవల నెట్ల దరియించే ననె” తో సామాన్యముగా కనబడని అత్యద్భుతమైన సత్యమును వెల్లడించారు. ఆ స్థితికి చేరుకున్న యోగులకు సీతామాతవలె ఆ భగవానుని దర్శనము తప్ప మరి యేదియు కోరుకొనరు. ఇక్కడ దర్శనము అనగా సదరు వ్యక్తి మనసు భగవానుని మనస్సులో లీనమవ్వడము. 

అటువంటి మహానుభావులు "వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।।7-19।। = జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ములు నిజముగా చాలా అరుదు" అని భగవద్గీతలో చెప్పనే చెప్పారు. ఆ కోవకు చెందిన అన్నమాచార్యులు వ్రాసినదంతా అనేక కోణములలో చెప్పలేని సూచించలేని మనకు అనుభవములోలేని వానిని వ్యక్త పరచుటకే. 

దీనిని ఎస్చెర్ గారు వేసిన “మూడు లోకములు” అను పేరుగల ప్రసిద్ధ లిథోగ్రాఫ్ ద్వారా మరింత వివరముగా తెలుసుకొందాము. ఇది వుడ్‌కట్ టెక్నిక్. ఒక పరిశీలకుడు శరదృతువులో సరస్సుగా భావించేదాన్ని చూస్తున్నట్లు కబబడే ఈ చిత్రములో సరస్సు ఒడ్డున వున్న ఆకులులేని చెట్ల కొమ్మల ప్రతిబింబాలు నీళ్ళలో కనబడుతుంటాయి. నీటిపై తేలియాడుతున్న ఆకులు వాటి అడుగున దాగి కళ్ళతోనే జీవము వుట్టిపడుతున్న మత్స్యమును చూడవచ్చును.

 


సాధారణ పరిశీలన నుండి దాని సంక్లిష్ట నిర్మాణం యొక్క సాక్షాత్కారానికి దారితీసే ఈ కళాకృతిని ప్రజలు క్రమంగా చూడాలని రచయిత కోరుకుంటాడు. కళాకారుడు మూడు ప్రధాన వస్తువులను (చెట్లు, ఆకులు, చేప) ఒకే చోట త్రిమితీయ (3D) కోణములో చూపి పరిశీలకుడి దృష్టిని వేగవంతము చేస్తాడు. ఒక్కసారిగా జీవితములోని మూడు దశలను ప్రస్పుటము చేయును. 

మన ఇప్పటి జీవితమును ఒంటరి చేపతోనూ, గతించిపోయిన కాలమును ఉపరితలముపై తేలుతున్న ఆకులతోనూ మరియు మరణమును ఆకుల్లేని మోడువారిన చెట్ళతోనూ చూపించారు. ఇక్కడ “ఉన్నచోటనే మూఁడులోకా లూహించి చూచితే నీవే” అను కీర్తన స్మరణీయం. సరస్సులో నీరును మనస్సుతో పోల్చారు.

ఇక్కడ సరస్సులో నీరు నిశ్చలముగా వుండి పైన చూపిన చిత్రము సాధ్యమైంది. కాని మన మనస్సులు క్షణక్షణము కదులుటతో మనకు ఈ కళాఖండములోచూపినట్లు జీవితము అగపడదు. 

యింకా నేమనె యింతి మఱేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకులదేహము పోదిది వేగనె
చింకవేఁట యిటు చేసె ననె         ॥అపు॥

భావము:  రాములవారు “ఓ హనుమా! ఇంకా ఏమంది? ? యింతి సీత మఱేమనె? సందేహించక యేమని కొసరు గా చెప్పింది కూడా చెప్పు?” హనుమంతులవారు “ప్రభూ! బూటకపు ఈ దేహము తొందరగా పోదు. ఆ మూగజీవి జింకను కోరుట అనే  అపకారము తలపెట్టిన తనకు తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!" 

వివరణము: అన్నమాచార్యులు బొంకులదేహము పోదిది వేగనె  / చింకవేఁట యిటు చేసె ననె”తో అతి కష్టమైన అతి గుహ్యమైన బోధను చేశారు. బొంకులదేహము అనగా అసత్యములతో నిర్మింపబడినదని అర్ధము. చిన్ననాట నుండి 'ఇది నేను' 'ఇది నాదికాదు' అను భావనలతో పెంచుకుంటూ వస్తున్న దానిని కాదని త్రోసిపుచ్చుట సులభముకాదు. 

చింకవేఁట యిటు చేసె”తో మనస్సులో రేగు కోరికల పరిణామమును సూచించిరి. పైనున్న ఎస్చెర్ గారి పటము ఊహలు అను అలల అలజడితో వున్న యెడల గోచరము కాదు. అటులనే సత్యము కూడాను. 

నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి
ఘనవేంకటగిరిఁ గంటి ననె           ॥అపు॥ 

భావము: రాములవారు “ఓ హనుమా! నన్నింకా ఏమంది?" హనుమంతులవారు “ప్రభూ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటేనంది. తనకూ నీ వలెనే ఈ వియోగము తాపమన్నదయ్యా!  ఆఖరి మాటగా ఓ మనుకులేశా! ప్రేమతోడి నీ కలయికకై ఎదురు చూస్తున్నానని అన్నదయ్యా! ఆ కూటమి  ఘన వేంకట గిరిపై ఈనాటికీ కనబడుతున్నదయ్యా! అన్నారు అన్నమాచార్యుల వారు

వివరణము: అన్నమాచార్యులు మనుకులేశ ప్రేమపుమనకూటమి / ఘనవేంకటగిరిఁ గంటి ననె”తో ఈ జ్ఞానము అనునది సాధింపతగునది కాదని జీవము సత్యము మరియు కరుణ/ప్రేమలతోడి విడదీయరాని మిశ్రమమే కానీ ప్రత్యేకముగా ఇది జ్ఞానము అని చెప్పుటకు వీలుకానిదని సెలవిచ్చిరి. 

తపమే విరహపుఁ దాపమనె” అని సంకల్పముతో కూడిన వన్నీ కోరికల కోవలోనికి వచ్చునని తెలిపిరి. కావున అది తాపమునకు దారితీయునని విజ్ఞుల అభిప్రాయము.  జ్ఞానము అనగా ప్రాణము, దైవము, ప్రేమలను వానివాని మూల రూపములలో విడి విడిగా దర్శించుటకు కానరానివని తెలుపు చర్య​. కావున భగవద్గీతలో పేర్కొన్న జ్ఞానము కూడానిదియే. పుస్తకములలో ప్రచురించి తెలుపుటకు వీలుకానిది.

-x-x-x-

 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...