Wednesday, 15 November 2023

T 188 ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక

 అన్నమాచార్యులు

188 ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక

 

for EnglishVersion press here

 

క్లుప్తముగా: "మనము ఈ ప్రపంచంలోనికి (ఎక్కడినుంచో) రాము; మనము చెట్ల నుండి ఆకుల వలె ప్రపంచం నుండి బయటకు వస్తాము. సముద్రంలో కెరటాలు పుట్టుకొచ్చినట్లు.  అలాగే విశ్వం నుండి  ప్రజలు." ప్రతి వ్యక్తి సమస్త సృష్టి యొక్క వ్యక్తీకరణ; అనంతము లోని పత్యేకతను సంతరించుకున్నవాడే - అలాన్ వాట్స్.

 

కీర్తన సారాంశం:

పల్లవి: జరుగుతున్నవన్నీ ఈశ్వరాజ్ఞ ప్రకారమే. అంతేకానీ నీ ప్రమేయము లేదు. హరి దాసుఁడవైతే చాలు, తానే రక్షించును.

చరణం 1: మానవుడు ప్రకృతినే అనగ తాను ప్రత్యక్షముగా అనుభూతి చెందగల దానినే పట్టి జీవనమును కొనసాగించును. దానికి విరుద్ధమైనది చెప్పబోతే వికటించునే గానీ వినదలచుకోడు. ఈ రకముగా తన మదిలో ఎక్కివున్న అసత్యమును కొనసాగిస్తాడు. ఒకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును? ఇప్పుడు అగపడుతున్నదానిని పైపైన మార్చ జూచిన వట్టిప్రయాసమే కాదా?

చరణం 2: పాపముతో పుట్టిన ఈ శరీరము (మాట వింటే) పాపమే చేయించును. మేలైన బుణ్యముతోవ ఎంతకూ పట్టదు. వేపచేఁదును వండితే అది బెల్లములా తీయనౌనా? పైనిపైని చేయు మన ప్రయత్నములన్నీ భ్రమలే కాని ఫలించనివే.

చరణం 3: ప్రపంచము నుండి వచ్చిన వారము. కావున ఈ ప్రపంచపు పోలికలతోనే వుందుము. అట్టి వారము మోక్షమును అంగీరించుదుమా? (=సమ్మతింౘము). శరణాగతుడగు భాగ్యవంతుడు  శ్రీవేంకటేశుఁడు దయఁజూడఁగ అధికుఁడౌఁ గాక.  

 

విపులాత్మక వివరణము 

ఉపోద్ఘాతము: 'పాత చింతకాయ పచ్చడి' అనిపించు ఈ అన్నమాచార్యుల కీర్తన అద్భుతమైన విషయములను వెల్లడించు గని వంటిది. 'పరము' అనునది ఈ 'ప్రకటమగు' జగత్తుకు సంబంధించనిదై వుండాలి. లేనిచో ఎందరో అక్కడికి చేరుకునేవారు. కానీ అట్టి విశేషమైన స్థితికి చేరుకున్నవారు అతి కొద్ది మంది మాత్రమే. కాబట్టి అట్టి  స్థితి మన ఇప్పటి  విశ్లేషణకు అందదు అని చెప్పవచ్చును.   

అనగా మనము 'పరము' గురించి విన్నవి, వ్రాసినవి ఊహించుకున్నవే తప్ప వాస్తవములు కావు. కావున మానవుడు ముఖ్యంగా తనకు తెలిసిన ఈ ప్రపంచమును మది నుండి బహిష్కరించ వలెను. ఈ కార్యములో ముఖ్యమైన ప్రతిఘటన స్వయముగా తన నుంచి వచ్చును. మాఱొడ్డునది తానే కనుక నిష్పాక్షికముగా పరిశీలించుట అసంభవమైనదే. 

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  222-4 సంపుటము: 3-123

ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక
తన్నుఁ దానే హరి గాచు దాసుఁడైతేఁ జాలు ॥పల్లవి॥
 
ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృతి గుణమే కాని
వికృతి బోధించబోతే విషమింతే కాదా
వొకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును
ప్రకటమైన వట్టిప్రయాసమే కాక        ॥ఇన్ని॥
 
పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ గాక
యేపునఁ బుణ్యముతోవ యేల పట్టును
వేపచేఁదు వండితేను వెస నేల బెల్లమవును
పైపై బలిమి సేసే భ్రమ యింతే కాక ॥ఇన్ని॥
 
ప్రపంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక
వుపమించ మోక్షమున కొడఁబడునా
ప్రపన్నుడైనవేళ భాగ్యాన శ్రీవేంకటేశుఁ-
డపుడు దయఁజూడఁగ నధికుఁడౌఁ గాక ॥ఇన్ని॥

Details and explanations: 

ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక
తన్నుఁ దానే హరి గాచు దాసుఁడైతేఁ జాలు ॥పల్లవి॥ 

భావము:  జరుగుతున్నవన్నీ ఈశ్వరాజ్ఞ ప్రకారమే. అంతేకానీ నీ ప్రమేయము లేదు. హరి దాసుఁడవైతే చాలు, తానే రక్షించును.

వివరణము: ‘ఇన్నిటికి నీశ్వరేచ్ఛ’: చాలా మంది ఈ అల్లకల్లోలగా కనబడు ప్రపంచము నందు ఒక క్రమముగానీ, నీయమము గానీ లేదనిపించునని అంటారు.  వారి వాదములో వాస్తవమున్నదని నమ్ము వారు కోకొల్లలు. అటువంటి వారికిఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాకవంటివి మూఢ నమ్మకాలుగా అగపడవచ్చును. కావున ఇది విచారించ తగ్గ అంశమే.

జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఈ గజిబిజి తింగరి లోకము నందు మనసు పట్టలేని, తెలియలేని, కానరాని వరుస​, సరణి వున్నవని అనేక మార్లు ప్రకటించిరి. మనకు తెలియనంత మాత్రమున ఒక విషయము సరి కాదని నిర్ధారణ చేయుటకూడా "ఆ చిందఱవందఱ జగము" లోని భాగమే అగును. మానవుడు తాను నిర్ణయించలేని వాస్తవములున్నాయని గ్రహించడు.

తాను సాధించిన దానితో గర్వము కలిగి, అది చూపు పరావర్తనములో  సత్యమును చూడజాలక వుండును. తన సామర్ధ్యమునకు మించిన విషయమును ఒప్పుకొనుట జ్ఞానము. లేనిచో అవివేకము. కావున ఎటువైపుకు మొగ్గక సమస్థితిలో వుండుటయే జ్ఞానము.

దాసుఁడైతేఁ జాలు: అన్నది కూడా కూలంకషముగా విచారించవలెను. ఊరకనేనేను హరిదాసుడనని చెప్పుకొను వారు హరిదాసులు కాజాలరు. భగవంతుడెవరో తెలియనివారు హరిదాసులు కాజాలరు.

ఒక ప్రక్క భగవంతుడు కనబడడని అంటూనే భగవంతుని తెలియమంటున్నారు? ఇది విచిత్రముగాను అసంబద్ధముగాను వున్నది అనవచ్చును. ఔనండి. మనము మాట్లాడుచున్నది బాహ్య చైతన్యము నందు లేనిదే. హరిదాసుడగుటకు ఒకే నీయమమున్నదండి.

మానవుడు తన అనుభవమునకు వచ్చు అన్నింటినీ తిరస్కరించుటయే. కానీ మానవుని వేధించునది తనకు తెలుసును అను స్వభావము. నేర్చినదానిని విడిచిపెట్టుట లేదా మఱచిపోవుట ఒక్కటియే మానవుని విధి. ఇదియే అత్యంత కఠినమైన పరీక్ష​. దీనికి మార్గములు లేవు. మనసునకు నచ్చునట్లు చెప్పుట కాదండి, వున్నది వున్నట్లు చెప్పిరి అన్నమాచార్యులు.

తన్నుఁ దానే హరి గాచు దాసుఁడైతేఁ జాలు: హరిదాసుడైనప్పుడు కదా!  మిగిలినవన్ని జరిగేది. అందుకే అన్నమాచార్యులు ఇలా అన్నారు "ముంద రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్న / ముంద రేమెరుఁగుఁ దా మొదలేల మరచు" 

ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృతి గుణమే కాని
వికృతి బోధించబోతే విషమింతే కాదా
వొకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును
ప్రకటమైన వట్టిప్రయాసమే కాక   ॥ఇన్ని॥ 

భావము:  మానవుడు ప్రకృతినే అనగ తాను ప్రత్యక్షముగా అనుభూతి చెందగల దానినే పట్టి జీవనమును కొనసాగించును. దానికి విరుద్ధమైనది చెప్పబోతే వికటించునే గానీ వినదలచుకోడు. ఈ రకముగా తన మదిలో ఎక్కివున్న అసత్యమును కొనసాగిస్తాడు. ఒకవిత్తు వెట్టితే వేరొకటేల మొలచును? ఇప్పుడు అగపడుతున్నదానిని పైపైన మార్చ జూచిన వట్టిప్రయాసమే కాదా?

వివరణము: మానవుని ఈ విపరీతమైన​ స్థితిని చూపుతున్న రెనె మాగ్రిట్ గారు వేసిన " లోపలి దృష్టి "(Le regard intérieur) పేరుతోవున్న అధివాస్తవిక చిత్రమును దర్శిద్దాము.



ఇక్కడ మనము ఒక ఎర్రని తెర​, దాని ప్రక్కన ఒక పెద్ద అందమైన పచ్చటి ఆకును స్పష్టంగా చూస్తాము. ఈ ఆకు అక్కడ వున్న పెద్ద కిటికిలో సింహ భాగాన్ని ఆక్రమించుకొని వుంది. ఈ ఆకు ఈనెలలో చెట్టు మీద వున్నట్లు అందమైన​ పక్షులు కూర్చొని వుంటాయి. కిటికి బయటకు చూస్తే చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. అదంతా ఏదో వెల వెల బోయినట్లు కొంచెం నేపథ్యం లోకి జారుకుంటోందా అని అనిపిస్తుంది. చిన్న చిన్న చెట్లు కనబడతాయి. అక్కడొక కుడిపక్కగా ఒక వాగు ప్రవహిస్తూ కనబడుతుంది.పెద్ద విశేషమైనవేమీ లేవు. ఆ కిటీకీలో పాక్షికముగా నిండిన గ్లాస్ కూడా కనబడుతున్నది.   

ఈ పెద్ద ఆకులోని పక్షులు మనమందించు పోషణకు గుర్తులు. కిటికి మన అంతరంగము అనుకుంటే, ఆకు మన దృష్టి పెట్టియున్న వస్తువు. నిజమునకు అన్నీ కనబడుతూనే వున్నా అవి చురుకైన స్థితిలో వుండవు. ఈ బొమ్మ ద్వారా.  ఆ ఆకులాగానే మనకు కొన్ని విషయాలు మాత్రమే వెల్లడియౌను. మీగిలినవి నేపథ్యంలోకి నెట్టివేయబడి స్ఫురణకు రావుఅని మాగ్రిట్ గారు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధముగా ఆ అరకొర నిండిన గ్లాస్'ను చూపి ఆ విషయమును మరింత ప్రస్పుటము చేశారు.

ఈ రకముగా మనకు కొన్ని విషయములు మాత్రమే స్పృహలో వుండి అవి మాత్రమే సత్యమనిపింప చేయు స్థితిని ప్రకృతి గుణము అన్నారు అన్నమాచార్యులు. ఇది మానవులందరికీ సామాన్యము.    .  .

పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ గాక
యేపునఁ బుణ్యముతోవ యేల పట్టును
వేపచేఁదు వండితేను వెస నేల బెల్లమవును
పైపై బలిమి సేసే భ్రమ యింతే కాక ॥ఇన్ని॥ 

ముఖ్య పదములకు అర్ధములు: అంచె = వరుస​; ఆకరము = సమూహము, గని, ఉపమించ = ఎన్ను, పోలించు;  ఒడఁబడు= అంగీరించ (=సమ్మతింౘ); ప్రపన్నుడు = శరణాగతుడు;

భావము:  పాపముతో పుట్టిన ఈ శరీరము (మాట వింటే) పాపమే చేయించును. మేలైన బుణ్యముతోవ ఎంతకూ పట్టదు. వేపచేఁదును వండితే అది బెల్లములా తీయనౌనా? పైనిపైని చేయు మన ప్రయత్నములన్నీ భ్రమలే కాని ఫలించనివే.

వివరణము: ‘పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ గాక’: అనునది తరువాతి చరణములో స్పష్టమగును. మానవుడు పుడుతూనే పాపి  అనికాదు దీని అర్ధము. 

మనమెరిగిన పాపములు పుణ్యములు మన వూహల వుయ్యాలలోనివే. పరము ఈ ప్రపంచమునకు సంబంధించనిది మనకు తెలియది కావున దానిపై చేయు వ్యాఖ్యలన్నీ కేవలము అభిప్రాయములు. వాస్తవములు కానేరవు. ఇట్టి స్థితి నుండి మనము చేయు నిర్ణయములన్నీ అజ్ఞానములోనివే ఔతాయి.

ఈ విధముగా చూచిన 'వేపచేఁదు వండితేను వెస నేల బెల్లమవును' అనునది ఎంతయును విచారించ తగ్గది. మనమందరమూ బయటి విషయములను గ్రహించి లోపలకు చేరుటను, ఆ గ్రహించినది మన స్మృతిలోనికి చేరుటను మునుపు చిత్ర పటములద్వారాను, ఉదాహరణములతోను నిర్ధారించితిమి. కావున లోపలను. వెలుపలను వున్నది ఆ తిమిరమే.  చీకటి నుంచి ఖాయము చేయు కార్యములు చీకటికి లోనికి కాక వేరెక్కడకు దారితీయును?

పైన పేర్కొన్న దానిని పొడిగించిన "పైపై బలిమి సేసే భ్రమ యింతే కాక" = పునాదిలేని గోడ వంటిది. అది ఏ క్షణములోనైనూ కూలిపోవచ్చు అను అర్ధములో వ్రాసిరి.

ప్రపంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక
వుపమించ మోక్షమున కొడఁబడునా
ప్రపన్నుడైనవేళ భాగ్యాన శ్రీవేంకటేశుఁ-
డపుడు దయఁజూడఁగ నధికుఁడౌఁ గాక ॥ఇన్ని॥ 

ముఖ్య పదములకు అర్ధములు: ఉపమించ = ఎన్ను, పోలించు; ఒడఁబడు= అంగీరించు (=సమ్మతించు); ప్రపన్నుడు = శరణాగతుడు;

భావము:  ప్రపంచము నుండి వచ్చిన వారము. కావున ఈ ప్రపంచపు పోలికలతోనే వుందుము. అట్టి వారము మోక్షమును అంగీరించుదుమా? (=సమ్మతింౘము). శరణాగతుడగు భాగ్యవంతుడు  శ్రీవేంకటేశుఁడు దయఁజూడఁగ అధికుఁడౌఁ గాక.

వివరణము: ఇక్కడ అలాన్ వాట్స్ గారి ప్రసిద్ధి చెందిన క్రింది పకటన ఎంతో సమర్ధనీయము. ​ “We do not "come into" this world; we come out of it, as leaves from a tree. As the ocean "waves," the universe "peoples." Every individual is an expression of the whole realm of nature, a unique action of the total universe.”

"మనము ఈ ప్రపంచంలోనికి (ఎక్కడినుంచో) రాము; మనము చెట్ల నుండి ఆకుల వలె ప్రపంచం నుండి బయటకు వస్తాము. సముద్రంలో కెరటాలు పుట్టుకొచ్చినట్లు.  అలాగే విశ్వం నుండి  ప్రజలు." ప్రతి వ్యక్తి సమస్త సృష్టి యొక్క వ్యక్తీకరణ; అనంతము లోని పత్యేకతను సంతరించుకున్నవాడే - అలాన్ వాట్స్.

అనగా మనమేదానితో చేయ బడితిమో అదియే మనలను విరోధించునది. ఇట్టి అసంభవమగు పరీక్ష పెట్టినాడు దైవము. ఇటువంటి పరిస్థితులలో శరణాగతి కాక వేరేమి వుపాయము గలదని అన్నమాచార్యులు ఘోషించున్నారు.

అన్నమాచార్యులు ఐదువందల సంవత్సరాల క్రితమే చెప్పినది అనేక మంది ఆధునిక తత్త్వవేత్తలు ప్రకటించుటను తలవని తలంపుగా సంభవించినది కాదు. వారి దార్శనీకతకు ప్రమాణము.   

                                                                          -x-x-x-

Friday, 10 November 2023

187 vittokaTi veTTagA vErokaTi molachunA ( విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా)

 ANNAMACHARYULU

187 విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా

(vittokaTi veTTagA vErokaTi molachunA) 

 

for Telegu (తెలుగు) Version press here

 

Synopsis: Life is like an echo - Annamacharya

Summary of this Poem:

Chorus: Don’t expect a different harvest from the seeds sown. Therefore “O Lord elevate me from life's tribulations and grant salvation.

Stanza 1: This body is the source of fascination and attachments, the abode of imagination and misunderstandings. It gets entangled in thirst and hunger. How can one expect the absence of worldly passions in this body?

Stanza 2: Within this body, the five sense organs find their garden bed, and it collaborates with unsteady, ever-moving hopes. A rich source of undesirable qualities, dispassionately observing it raises the question: how can true intelligence flourish within this body?

Stanza 3: The root of worldly pleasures lies in this body, a product of both virtuous and sinful deeds. O Lord Venkateswara, my body has been dedicated to your service and has thrived. Henceforth, how can there be any fear?

 

Detailed Presentation

 

Introduction: Annamacharya poignantly pointed out that humans often hope for results different from the seeds they sow, leading them to experience the repercussions of their actions. 

However, he offers a solution to this dilemma. By dedicating oneself to the service of Sri Venkateshwara, one can find a way out. This entails embracing the consequences of one's actions with complete acceptance and without resistance or regret.

 

అధ్యాత్మ కీర్తన:

రాగిరేకు:  307-6 సంపుటము: 4-42

Philosophical Poem

Copper Plate: 307-6 Vol: 4-42

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తు గాక ॥పల్లవి॥
 
మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు ॥విత్తొ॥
 
పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు ॥విత్తొ॥
 
యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు॥విత్తొ॥

 

vittokaTi veTTagA vErokaTi molachunA
yetti hari nIvu nanu nIDErtu gAka pallavi
 
mOhabAMdhavamulaku mUlaMbu tanuvu
vUhApOhalaku vuniki yI tanuvu
dAhamuna kAkaTiki tagulu yI tanuvu
yIhI vairAgya miMdeTTu galugu vitto
 
paMchEMdriyamulaku pAdu yI tanuvu
chaMchalapuTAsalaku jaMTa yI tanuvu
aMche durgaNamulaku nAkaramu tanuvu
yeMchi chUDa vivEka miMdeTTu niluchu vitto 
yIhalOkasukhamulaku hEtuvI tanuvu
bahupuNyapApAlaku phalamu yI tanuvu
yihamunaku SrIvEMkaTESa nIdAsyamuna
vihariMche danuvu yika ve~rapEla kalugu vitto

 

 

Details and Explanations:

విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా
యెత్తి హరి నీవు నను నీడేర్తు గాక ॥పల్లవి॥

vittokaTi veTTagA vErokaTi molachunA
yetti hari nIvu nanu nIDErtu gAka pallavi 

Word to Word Meaning: విత్తొకటి (vittokaTi) = one seed; వెట్టఁగా (veTTagA) = when sown; వేరొకటి (vErokaTi) = something else; మొలచునా (molachunA) = will crop up? యెత్తి (yetti) = by lifting; హరి (hari) = O Lord Hari; నీవు (nIvu) = you; నను (nanu) = me; నీడేర్తు గాక (nIDErtu gAka) = You shall save me.

 

Literal Meaning: Don’t expect a different harvest from the seeds sown. Therefore “O Lord elevate me from life's tribulations and grant salvation.

Explanation: We humans sow the seeds of our feelings and thoughts, disseminating them through the waves in the environment that envelops us. we reap the outcomes in alignment with what we planted, whether consciously or unconsciously. Annamacharya believed that the consequences are identical for both.

 

Thus, having observed inevitability of this continuous cycle of actions and reactions, Annamacharya implores God to swiftly rescue him from the troubles of life, without any delay.

The painting given below, "Large Family" by René Magritte offers a captivating perspective on this concept. The artwork depicts an ocean, a subdued sky, and a prominent, oversized bird. However, only the outline of the bird with its wings outstretched is visible, and within this bird, we can see a bright, cloudy sky. Despite the overall dimness of the sky, the bird shines brightly.



What makes this painting truly captivating is its ability to engage the viewer within its narrative. It encourages us to envision the sea and the sky as the world, and the onlooker as a seed. From the picture, one can infer that what is in the mind of the onlooker is mirrored in the world. (Also. it may be noted that we do not understand our actions but realise them thru knowing the results). 

This interpretation draws a parallel between the beholder's mind and a seed, while the visible scene is akin to a tree. This analogy underscores the idea that both Annamacharya and René Magritte are conveying a similar message, emphasizing the power of perception and how our actions can shape reality.

 

యెత్తి హరి నీవు నను నీడేర్తు గాక (yetti hari nIvu nanu nIDErtu gAka) is signifying that we continuously are planting seeds as we move along the path of life. it implies that our actions, whether positive or negative, contribute to the circumstances we find ourselves in.

The plea to the Lord, "యెత్తి హరి నీవు నను నీడేర్తు గాక," can be understood as a request for divine intervention to lift the individual out of their current predicament, acknowledging a sense of despair or hopelessness in the face of life's challenges.

 

మోహబాంధవములకు మూలంబు తనువు
వూహాపోహలకు వునికి యీ తనువు
దాహమున కాఁకటికి తగులు యీ తనువు
యీహీ వైరాగ్య మిందెట్టు గలుగు ॥విత్తొ॥
mOhabAMdhavamulaku mUlaMbu tanuvu
vUhApOhalaku vuniki yI tanuvu
dAhamuna kAkaTiki tagulu yI tanuvu
yIhI vairAgya miMdeTTu galugu vitto

 

Word to Word Meaning: మోహబాంధవములకు (mOhabAMdhavamulaku) = for the fascination and bondages; మూలంబు (mUlaMbu) = root cause; తనువు (tanuvu) = this body; వూహాపోహలకు (vUhApOhalaku) = for imagination and misgivings; వునికి (vuniki) = abode; యీ తనువు (yI tanuvu) = This boy; దాహమున కాఁకటికి (dAhamuna kAkaTiki) = to the thirst and hunger; తగులు( tagulu) = get caught, get influenced by; యీ తనువు (yI tanuvu) = This body; యీహీ (yIhI) = represents laughter of contempt; వైరాగ్య (vairAgya) = absence of worldly passions;  మిందెట్టు గలుగు (miMdeTTu galugu) = how it happen?

Literal Meaning: This body is the source of fascination and attachments, the abode of imagination and misunderstandings. It gets entangled in thirst and hunger. How can one expect the absence of worldly passions in this body?

Explanation: Annamacharya is very clear that the body is the source of man’s troubles and does not believe that we can get thru the liberation while attached to it.

Let me explain this stanza by referring to René Magritte's surreal painting given below, "The Natural Encounters" vividly illustrates this peculiar human condition. The room's boundaries are not defined, creating an ambiguous space. The window is fragmented, and one half is tilted, and hovers slightly above the ground, revealing a view of the sea and a bright sky. This is the sole glimpse of the outside world.



The other half of the window is positioned too high for the bilboquet-mannequins to observe naturally, offering only a view of the radiant sky. One of the mannequins holds a leaf, symbolizing a hopeful approach to life. The expressions on the mannequins' faces convey their suffering.

Overall, the mannequins resemble humans and exist in a state of uncertainty. Like humans, they grapple with a distorted perspective, perhaps shaped by peering through a slanted window.

In essence, the "encounter" is not just between two figures but between the outer and inner worlds. Now, the contradictions within the painting recede into the background. partly stable and partly visible outside world through the skewed windows may be likened to half-truths. This prompts introspection and deep contemplation.

In any case, it becomes evident that humans perceive the world around them from a limited vantage point, hindering them from grasping the complete truth. This is what exactly stated in this stanza. 

పంచేంద్రియములకు పాదు యీ తనువు
చంచలపుటాసలకు జంట యీ తనువు
అంచె దుర్గణములకు నాకరము తనువు
యెంచి చూడ వివేక మిందెట్టు నిలుచు ॥విత్తొ॥

 

paMchEMdriyamulaku pAdu yI tanuvu
chaMchalapuTAsalaku jaMTa yI tanuvu
aMche durgaNamulaku nAkaramu tanuvu
yeMchi chUDa vivEka miMdeTTu niluchu vitto

 

Word to Word Meaning: పంచేంద్రియములకు (paMchEMdriyamulaku) = for the five sense organs; పాదు (pAdu) = A garden bed or the watered earth round a tree. యీ తనువు (yI tanuvu) = this body; చంచలపుటాసలకు (chaMchalapuTAsalaku) = unsteady and moving hopes;  జంట (jaMTa) = collaborator; యీ తనువు (yI tanuvu) = this body; అంచె (aMche) = orderly, in a series; దుర్గణములకు (durgaNamulaku) =wrong qualities; నాకరము (nAkaramu) = a rich source, a mine; తనువు (tanuvu) = body; యెంచి చూడ (yeMchi chUDa) = seeing it dispassionately; వివేక మిందెట్టు నిలుచు (vivEka miMdeTTu niluchu) = how can intelligence happen in this?

 

Literal Meaning: Within this body, the five sense organs find their garden bed, and it collaborates with unsteady, ever-moving hopes. A rich source of undesirable qualities, dispassionately observing it raises the question: how can true intelligence flourish within this body?

Explanation: The logic given by Annamacharya is too strong to negate. He is at best in his objective presentation in this poem.

 

యీహలోకసుఖములకు హేతువీ తనువు
బహుపుణ్యపాపాలకు ఫలము యీ తనువు
యిహమునకు శ్రీవేంకటేశ నీదాస్యమున
విహరించెఁ దనువు యిఁక వెఱపేల కలుగు॥విత్తొ॥
 
yIhalOkasukhamulaku hEtuvI tanuvu
bahupuNyapApAlaku phalamu yI tanuvu
yihamunaku SrIvEMkaTESa nIdAsyamuna
vihariMche danuvu yika ve~rapEla kalugu vitto

Word to Word Meaning: యీహలోకసుఖములకు (yIhalOkasukhamulaku) = for the worldly pleasures; హేతువీ (hEtuvI) = the cause; తనువు (tanuvu) = body; బహుపుణ్యపాపాలకు (bahupuNyapApAlaku) = for the virtuous and sinful acts; ఫలము (phalamu) = result; యీ తనువు (yI tanuvu) = this body; యిహమునకు (yihamunaku) = in this world; శ్రీవేంకటేశ (SrIvEMkaTESa) = O Lord Venkateswara: నీదాస్యమున (nIdAsyamuna) = in your servitude; విహరించెఁ (vihariMche) = its roaming;  దనువు (danuvu) = body; యిఁక వెఱపేల కలుగు (yika ve~rapEla kalugu) = hereafter, how can one be afraid? 

 

Literal Meaning: The root of worldly pleasures lies in this body, a product of both virtuous and sinful deeds. O Lord Venkateswara, my body has been dedicated to your service and has thrived. Henceforth, how can there be any fear?

Explanation: In this context, the term "నీదాస్యమున" (nIdAsyamuna) takes on a nuanced meaning. While it literally translates to "servitude," Annamacharya employs it to represent a state where duality dissolves, eradicating distinctions between seeing, doing, time, dharma, and justice. In this meditative state, he experiences absolute oneness with the truth. In that state unison with Truth, his actions remain subservient to the truth. Hence, the term "నీదాస్యమున" (nIdAsyamuna) is profoundly apt in capturing this essence.

 

 

 

 

-x-x-x-

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...