|
శృంగార సంకీర్తన
|
|
రేకు: 1990-1
సంపుటము: 29-475
|
|
తానే వచ్చీఁగాని తడవకువే పతిని చేనంటి మునుపే నాకు సేస వెట్టినాఁడు ॥పల్లవి॥ తలఁపులకొలఁదివే తగులాయాలు వలచినకొలఁదివే వాడికలు పిలుపులకొలఁదివే ప్రియములు బలిమి సేయఁగఁ బోతే పచ్చిదేరుఁ బనులు ॥తానే॥ ఆడినకొలఁదివే యాస మాఁటలు కూడినకొలఁదివే కూటములు వేడుకకొలఁదివే వినోదాలు వాడుకొనఁబోతేను వసగావు పనులు ॥తానే॥ ననిచినకొలఁదివే నగవులు యెనసినకొలఁదివే యింపు సొంపులు చెనకి నన్నేలినాఁడు శ్రీవేంకటేశుఁడు పెనఁగఁగఁబోతేను పెచ్చురేఁగుఁ బనులు ॥తానే॥
|
|
Telugu Phrase
|
Meaning
|
|
తానే వచ్చీఁగాని
తడవకువే పతిని
|
(తడవకువే
= తడవ రాదే ) పతి తానే వచ్చుగాని ఊరకనే ఏల తడవుతావే
|
|
చేనంటి
మునుపే నాకు సేస వెట్టినాఁడు
|
(చేనంటి =సాధారణమైన చేను లాంటి = ఏవిధమైన ప్రత్యేకతా లేని) నేను చేను లాంటి దాననైనా
నాకు కూడా అక్షతలు (ఆశీర్వాదము) పలికినాడు
|
|
Telugu Phrase
|
Meaning |
|
తలఁపులకొలఁదివే తగులాయాలు
|
తలపున
తలచినకొలది కావలసినవి (ఉదాహరణకు చుట్టాలు, అవకాశములు) దొరుకుతాయి.
|
|
వలచినకొలఁదివే వాడికలు |
వాడికలు=రహస్యనిధులు=
ఇక్కడ రహస్యాలు అని తీసుకొనవలెను); వలచినకొలది రహస్యాలు కూడుతుంటాయి = వలచినకొలది ముఖ్యంగా
ఇతరులనుంచి దాచవలసిన రహస్యాలు కూడుతుంటాయి. |
|
పిలుపులకొలఁదివే ప్రియములు
|
పిలుపులను బట్టి ప్రియములు తెలుస్తాయి. |
|
బలిమి
సేయఁగఁ బోతే పచ్చిదేరుఁ బనులు
|
అయితే
అవి వాస్తవముగా వున్నవా? లేవా? అని బలముగా
చూడబోతే అవి పైపైనే అని తెలుస్తుంది. |
గూఢార్థవివరణము:
అన్నమాచార్యుల
వారు జీవితము దాని నిర్మాణములను మన ముందుంచుతున్నారు. అవి పునాదులు లేని అసంపూర్ణ కట్టడములు.
నిమిత్తమునకు వున్నట్లు. అవసరానికి లేనట్లు.
"తలపున
తలచినకొలది" ముఖ్యంగా గమనించ వలెను. మనసు అవకాశములను కలిగించుకుంటుంది. అందువలన
తగిన సందర్భములు, బాహ్య స్పర్శాది ప్రేరేపణలకు వీలు ఏర్పడుతుంది
(ఇది బుద్ధుని "పస పచ్చయా వేదన"
= ‘స్పర్శ ద్వారా భావన కలుగును’ కు దగ్గరగా వున్నది)
రెండవ చరణం:
ఆడినకొలఁదివే
యాస మాఁటలు
కూడినకొలఁదివే
కూటములు
వేడుకకొలఁదివే
వినోదాలు
వాడుకొనఁబోతేను
వసగావు పనులు ॥తానే॥
|
Telugu Phrase |
Meaning |
|
ఆడినకొలఁదివే యాస మాఁటలు |
ఆశకు ఇంధనం మాటలు. |
|
కూడినకొలఁదివే కూటములు |
ఆలోచనలకు ధృవీకరణ ఇచ్చే వలయాలు కూటములు. |
|
వేడుకకొలఁదివే వినోదాలు |
వినోదాలలో పాల్గొన్న కొలది వాటీయందు అనురక్తి పెరుగుతుంది |
|
వాడుకొనఁబోతేను వసగావు పనులు |
ఉపయోగములోపెట్టబోతే పైన పనులేవి సారము లేనివే. కొరగానివే. |
సూటి భావము:
ఓ సఖి!
అతనితో నీవు ఆడినకొలఁది మనసు అటుపోతుంది. మీరిరువురు
కూడుకున్న కొద్ది సాంగత్యము బలమౌను. వేడుకలు వినోదాలతో మీరు మరింత దగ్గరౌతారు. అయితే
అతడిని ఏనాడు, ఎప్పుడు (నీ పనులకు) వాడుకోవలదు. అక్కడే నీ చాతుర్యము/నైపుణ్యము తెలుస్తుంది.
సూచిత భావము:
(అన్నమాచార్యుల వారు మన దైనందిక కార్యములు మనసును ఏ రకముగా దారి మళ్ళిస్తాయో
తెలుపుతున్నారు.) ఆశకు ఇంధనం మాటలు. ఆలోచనలకు ధృవీకరణ ఇచ్చే వలయాలు
కూటములు కలిసిన కొలది — మన ఆలోచనకు బలం పెరుగుతుంది. వినోదాలలో పాల్గొన్న కొలది వాటియందు
అనురక్తి పెరుగుతుంది. (దైవకార్యము నందు, సత్యాన్వేషణలోను) ఉపయోగములోపెట్టబోతే పైన పనులేవి సారము లేనివే. కొరగానివే.
గూఢార్థవివరణము:
ఆచార్యుల
వారు మనసు ఆ మొదటి చరణంలో పేర్కొన్న నిర్మాణములలో
ఏరకముగా చిక్కుకొని అసలు విషయమునే మరచునో తెలుపుచున్నారు.
మూడవ చరణం:
ననిచినకొలఁదివే
నగవులు
యెనసినకొలఁదివే
యింపు సొంపులు
చెనకి నన్నేలినాఁడు
శ్రీవేంకటేశుఁడు
పెనఁగఁగఁబోతేను
పెచ్చురేఁగుఁ బనులు ॥తానే॥
|
Telugu Phrase |
Meaning |
|
ననిచినకొలఁదివే నగవులు |
నగవులు పెరుగుతూ ఇష్టము, ప్రీతిని పుట్టిస్తాయి |
|
యెనసినకొలఁదివే యింపు సొంపులు |
పోల్చుకున్నకొలది ఆనందము, సమృద్ధిలలో మునిగి పోవాలనిపిస్తుంది. |
|
చెనకి నన్నేలినాఁడు శ్రీవేంకటేశుఁడు |
నాలోని "నన్ను"ను అణచి ఏలుచున్నాడు శ్రీవేంకటేశుఁడు |
|
పెనఁగఁగఁబోతేను పెచ్చురేఁగుఁ బనులు |
ఇందులో పెనగులాడితే ఈ పనులు మరింత కష్టమౌతాయి. |
సూటి భావము:
ఓ సఖి!
అలా నగవులు పెరుగుతూ ఇష్టము, ప్రీతిని పుట్టిస్తాయి. ఆ మంటలు రేగుతున్న
కొద్ది ఆ ఆనందము, సమృద్ధిలలో మునిగి పోవాలనిపిస్తుంది. అయినా
సఖియా! ఆ శ్రీవేంకటేశుఁడు నన్ను బలముగా అణచి ఏలుచున్నాడు. ఇక్కడే మెలకువ అవసరం. నువ్వు
పెనగకుండా అణిగి వుండాలి. అంతే!
సూచిత భావము:
అలా నగవులు
పెరుగుతూ ఈ దేహము, జీవితముల పట్ల ఇష్టము, ప్రీతిని పుట్టిస్తాయి. ఇక పోల్చుకున్నకొలది ఆనందము, సమృద్ధిలలో మునిగి పోవాలనిపిస్తుంది. నాలోని "నన్ను"ను అణచి ఏలుచున్నాడు
శ్రీవేంకటేశుఁడు. ఇందులో పెనగులాడితే ఈ పనులు మరింత కష్టమౌతాయి.
గూఢార్థవివరణము:
ననిచినకొలఁదివే
నగవులు
నగవులు
పెరుగుతూ ఇష్టము, ప్రీతిని పుట్టిస్తాయి. ఇక్కడ అన్నమాచార్యులు
మనకు తెలియని దానిని చెప్పుటలేదు. మనము గమనించని దానిని చూడ మంటున్నరు. పలుచని అట్టపెట్టె పైమూతను మూసితే దానికి బలము వచ్చినట్లు
ఒకదానికొకటి బలమిచ్చునవి ఈ మనో నిర్మాణములు.
కానీ అంతా ఒక్క క్షణంలో పేకమేడలా కూలిపోతుంది. (ఇది బుద్ధుని
కార్యకారణ సముత్పాదనము "వేదనా పచ్చయా తణ్హా"కు 'భావము
ద్వారా రాగము కలుగును' కు దగ్గరగా వున్నది)
చెనకి నన్నేలినాఁడు
శ్రీవేంకటేశుఁడు
విముక్తి చాలా సుఖదాయమని గ్రంథములు
చెబుతున్నా, అన్నమాచార్యులు
అందుకు విరుద్ధముగా “తనను త్రొక్కిపట్టి శ్రీవేంకటేశుఁడు ఏలినట్లు” చెప్పడం గమనించదగ్గది. "అదిగాక నిజమతం బదిగాక యాజకం-బదిగాక హృదయసుఖ మదిగాక
పరము" అని పరము అనునది మన అభిప్రాయాల కంటే వేరుగా, యజ్ఞము/త్యాగముల మీద ఆధారపడకుండా, మానవుని చేష్టలను ఆశ్రయించక,
ఊరట కూడా కలిగించక పోవచ్చు అన్నారు.
జిడ్డు కృష్ణమూర్తి కూడా ఇటువంటి
అభిప్రాయమునే వెల్లడించారు. వీరిరువురి భావనలు మానవుల భావనలు కావున అదియే సత్యమని తెలియవలెను.
పెనఁగఁగఁబోతేను
పెచ్చురేఁగుఁ బనులు
మనమంతా గ్రహించవలసిన ముఖ్యమైన
సంగతి చెబుతున్నారు. దైవమునకు మానవ సహాయము ఏమాత్రము అవసరం లేదు. మనము చేయ వలసినదంతా
"ఊరక" వుండడమే. ఇదే విషయమును జాన్ మిల్టన్ గారు క్రింది కవితలో పేర్కొన్నారు.
Sonnet
No. 19
When I
consider how my light is spent:
When I
consider how my light is spent,
Ere
half my days, in this dark world and wide,
And
that one Talent which is death to hide
Lodged
with me useless, though my Soul more bent
To
serve therewith my Maker, and present
My
true account, lest he returning chide;
“Doth
God exact day-labour, light denied?”
I
fondly ask. But patience, to prevent
That
murmur, soon replies, “God doth not need
Either
man’s work or his own gifts; who best
Bear
his mild yoke, they serve him best. His state
Is
Kingly. Thousands at his bidding speed
And
post o’er Land and Ocean without rest:
They
also serve who only stand and wait.”
-జాన్ మిల్టన్
స్వేచ్ఛానువాదం: ధ్యేయం
జీవితం
ఎలా గడిచిందో నేను ఆలోచించినప్పుడు
సగం
రోజులు ఈ నిడివైన చీకటి ప్రపంచంలో
నాకున్న
ఒక ప్రతిభకు మరణం అడ్డుతున్నప్పుడు
నా
ఆత్మ మరింత కోరుతున్నప్పటికీ
ప్రతిభ
నాతో వుండి కూడా పనికిరానిదైంది
సృష్టికర్తకు
సేవ చేయడానికి మరియు
నా
నిజమైన హృదయాన్ని సమర్పించడానికి
అతను
నా పై తిరిగి కోపించకుండా
“దైవమిచ్చిన ఈ అవకాశానికి కొంత బదులుగా సమర్పించుకోవాలా?
ఇకపై
వెలుగును చూడలేనా?"
అని
అనుమానంగా నాలో నేనే గొణిగాను.
నాలో
నేను పాలుపోక వుంటే,
నా
మౌనాన్ని పటాపంచలు చేస్తూ వెంటనే సమాధానం,
“దేవునికి మనిషి నేర్పరితనములు గాని, బహుమానములు గాని అవసరం లేదు;
అతడి
తేలికపాటి శిలువను ఎవరు నిరుత్తరంగా భరిస్తారో,
వారు
ఆయనకు ఉత్తమంగా సేవ చేస్తారు.”
“అతని రాజ్యం మహోన్నతమైనది”.
కానీ
వేలమంది విశ్రాంతి లేకుండా
భూమిని
మరియు సముద్రాన్ని త్రవ్వుతున్నారు అతడి అనుజ్ఞకై.
అతనివెంబడి
మౌనంగా నిలబడి వేచి ఉన్నవారు కూడా సేవ చేస్తున్నట్లే.
-జాన్ మిల్టన్
మౌన
సమ్మతము: ఈ కవితలో చెప్పినట్టు మానవునికి
దైవమిచ్చిన ఈ జీవితమును మౌనంగా "నాకే ఇన్ని పరీక్షలా?" అను సందేహాలను కట్టిపెట్టి మౌనంగా నిర్లిప్తంగా ఎటువంటి ప్రతిక్రియలు
లేకుండా జీవితము సాగించటమే ఉత్తమము అని తెలుస్తున్నది. అన్నమాచార్యులు “లోకరంజకము తమలోని సమ్మతము” అన్న దాని అర్థం కూడా ఇదే.
తమలోనిసమ్మతము మనిషి తనతో తాను అంతర్గతముగా సహవాసము చేయలేక పోవుటయే జీవితములోని
అసౌకర్యమునకు కారణము. అందుకు ఉన్నదానిని ఉన్నట్లుగా సమ్మతించక సర్దిచెప్పుకుపోవు
ప్రయత్నములు చేసెదము. ఇది కొనుగోలు చేసిన సంధి. దీనికి మూల్యము చెల్లించక తప్పదు.
అంతరంగ
సామరస్యము: తమలోనిసమ్మతము అంతరంగ సామరస్యమునకు దారి. అంతరంగములో లేని సామరస్యము బాహ్యముగా ఎంత
ప్రయత్నించినా సమకూరదు. ఆ సామరస్యము పరిశుద్ధమైన అంతఃకరణములేక సాధించుటెట్లు? కనపడునది కనపడినట్లుగా అంగీకరించుటకు, మౌనము, ప్రశాంతత లేక సాధ్యమా? దానిని ప్రభావితము చేయు మలినములను పూర్వానుభవముల జాడలు ప్రక్కకు త్రోచివైచుటెట్లు?
నిర్మలమైన
మనస్సు: తమలోని సమ్మతము అనగా నిర్మలమైన అంతరంగముతో, స్థిరుడై (అటునిటు చూడక),
సమస్త కార్య కలాపములు నిగ్రహించువాడై, మౌనియై నిర్వర్తించువానికి
మాత్రమే సాధ్యము. భగవద్గీతలో “అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః । సర్వారంభపరిత్యాగీ
యో మద్భక్తః స మే ప్రియః ॥ 12-16 ॥“ అని పేర్కొన్నది యిదియే.
లోకరంజకము: అటు
వంటి సూక్ష్మబుద్ధిగల ద్రష్టలు లోకరంజకము కాక మరేమి? .
X-X-The
END-X-X
No comments:
Post a Comment