Monday, 2 March 2026

A 309 Tree of Knowledge No.5 (విచారణా వృక్షము – నం. 5)

HILMA af KLINT
 విచారణా వృక్షము – నం. 5” (Tree of Knowledge No.5) – 
వివరణము

హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన విచారణా వృక్షము – నం. 5” అనే చిత్రం సాధారణ ప్రకృతిలో పుట్టిన చెట్టు కాదు. ఇది ప్రపంచాన్ని మనం విచారణ చేసి అనుభవించే విధానాన్ని సూచించే ఒక సంకేతాత్మక చిత్రము. ఈ చిత్రంలో ఉన్న ఆకృతులు, రంగులు,  మరౘుట్టువలె తిరుగుడుగా పైకి ప్రాకు శంఖాకారపు గీతలు (స్పైరల్) — ఇవన్నీ కలిపి ఒక అంతర్గత నిర్మాణాన్ని సూచిస్తాయి. వీనికి విడివిడిగా అర్ధములున్నను ఇవన్నీ కలిపి ఏకకాల వీక్షణములో గమనించమని సూచన​. 

ఈ చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి మొదట దిగువ భాగంలో కనిపించే గుడ్డు ఆకారాన్ని గమనించాలి. ఆ గుడ్డు ఆకారంలో రెండు పక్షుల వలె కనిపించే ఆకృతులు ఒక కష్టతరమైన కానీ సున్నితమైన సమతుల్యతలో నిలబడి ఉన్నట్లు అనిపిస్తాయి. ఈ సమతుల్యతే మొత్తం చిత్రానికి ఆధారం. ఈ సమతుల్యత నుండే పైకి ఒక తెల్లని నిలువుటక్షరేఖ (vertical axis) లాగా నిలిచిన సన్నని కాంతి రేఖ​ పైకి విస్తరించినట్లు కనిపిస్తుంది. ఈ అక్షరేఖను కేంద్రంగా తీసుకున్నపుడే చిత్రమంతా స్పష్టంగా గమనించగలము.

ఈ అక్షాన్ని చుట్టి రెండు (శంఖాకారపు వక్రములు) స్పైరల్ ఆకృతులు కనిపిస్తాయి. అవి ఒకదానిని మరొకటి దాటి తిరుగుతున్నట్లు ఉంటాయి. మనము ఈ విభిన్న దిశలలో ఎగబ్రాకు స్పైరల్'ని  “నేను” మరియు “ప్రపంచం” అని విడదీసి అనుభవించే మానసిక విభజనకు ప్రతీకగా చూడవచ్చు. ఈ విభజన వల్లే 'మనం వేరు ప్రపంచం వేరు' అన్నట్లుగా అనిపిస్తుంది. 

చిత్రములో కింద భాగంలో ఉన్న పెద్ద వృత్తం మనం నివసించే కార్య–కారణ ప్రపంచాన్ని సూచిస్తుంది. ఈ వృత్తం నుండే స్పైరల్ కదలికలు ప్రారంభమై పైకి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నిర్మాణం భారతీయ తత్వశాస్త్రంలో చెప్పబడిన “సంసార వృక్షము”ను గుర్తు చేస్తుంది. భగవద్గీతలో చెప్పబడినట్టు, ఈ ప్రపంచ వృక్షం యొక్క అసలు రూపాన్ని సాధారణంగా గ్రహించలేమని చెప్పబడింది — “న రూపమస్యేహ తథోపలభ్యతే”(15-3). 

చిత్రములో మధ్యభాగములో కుడివైపు ఒక మండలంలాంటి ఆకృతి కనిపిస్తుంది. అది నాలుగు చేపలు తలలు ఒక కేంద్రానికి ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆకృతి మనం ప్రపంచాన్ని గ్రహించే స్థితిని సూచిస్తుంది.   

ఈ చిత్రంలోని ఆకుపచ్చ ఆకులు ఒక ముఖ్యమైన సంకేతం. అవి సంసార వృక్షపు పత్రాలను సూచిస్తాయి. ఆ పత్రము ఆ కార్య–కారణ ప్రపంచమునుంచి పుట్టినదని చెప్పటానికి ఆకు పైభాగము ఆ పెద్ద వృత్తం వైపు మళ్ళి వుంది. ​ఆ ఆకు ఈనెల వెంబడి మన చూపు వుంటుందని ఆ మండలంలాంటి ఆకృతిని చూపిన స్థానముతో తెలియవచ్చును.  మనము ఒక కేంద్రాన్ని ఊహించి దాని చుట్టూ అనుభవాలను కూర్చి అర్థం చేసుకుంటాము. కాని ఆ కేంద్రం నిజంగా ఉన్నదా? లేక మన అనుభవాల వల్ల ఏర్పడిన ఒక ఊహా నిర్మాణమా? అనేది స్పష్టం కాదు. 

మనం గ్రహించగలిగింది ఈ పత్రమంతటిని కాక ఆ యీనె చూపు  చిన్న కోణం మాత్రమే. కావున మనకు ఏ స్థితిలోను ఆ వృక్షము యొక్క సంపూర్ణ రూపం మనకు ప్రత్యక్షమవ్వదు. ​ గీతలోని లో “ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్” అని చెప్పినట్లు మనము ఆ ఆకు నంతా గ్రహించుట​. కానీ అది మనమున్న స్థితిలో సాధ్యముకాదు అని ఈ చిత్రము ద్వారా తెలియుచున్నది. 

ఈ విధంగా చూస్తే విచారణా వృక్షము – నం. 5” అనే చిత్రం ఒక ఆధ్యాత్మిక చిత్రరూప దర్శనం. ఇది ప్రపంచాన్ని ఒక స్థిరమైన వస్తువుగా కాకుండా, విభజనలతో నడిచే అనుభవ ప్రవాహంగా చూపిస్తుంది. ఈ ప్రవాహాన్ని సరిగా గమనించాలంటే మధ్యలోని అక్షరేఖపై నిలబడిన సమతుల్యత అవసరం. ఆ సమతుల్యతలో నుండే ప్రపంచ కదలికను స్పష్టంగా గమనించగలము. అందువలన ఈ చిత్రం కేవలం ఒక కళాఖండం కాదు. ఇది మనం ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తున్నామో, ఆ అనుభవానికి ఆధారం ఏమిటో అనే ప్రశ్నలను ముందుకు తెచ్చే సంకేతాత్మక రూపకము.


Interpretative Note

Hilma af Klint’s Tree of Knowledge – No. 5 is not a representation of a natural tree. It is a symbolic diagram suggesting the way human beings perceive and interpret the world. The shapes, colours, and upward spiralling forms combine to reveal an inner structure of experience. While each element may carry its own meaning, the painting invites us to observe the entire structure simultaneously.

To understand the painting, one must first notice the egg-shaped form at the bottom. Within this form appear two bird-like figures standing in a delicate and precarious balance. This equilibrium seems to be the foundation of the entire diagram. From this balance a thin white vertical axis rises upward through the centre of the painting. Only by standing on this axis can the movement of the entire structure be clearly observed.

Around this axis appear two spiral forms twisting upward and crossing one another. These spirals may be seen as representing the fundamental division through which human beings experience the world — the separation between observer and observed, self and world. Once this division begins, perception unfolds in multiple directions.

The large circular field at the lower portion of the painting may represent the world of cause and effect in which human life unfolds. From this field the spiral movements seem to emerge and extend upward. This structure recalls the symbolic “tree of the world” described in philosophical traditions, where the true form of the world-tree cannot easily be perceived. What we normally encounter are only its outward manifestations.

In the middle portion of the painting appears a mandala-like form, resembling four fish meeting head-to-head at a centre. This form may represent the position from which human beings attempt to understand the world. From this position we construct interpretations and centres of meaning. Yet the existence of such a centre may itself be uncertain — it may arise from the accumulation of many partial views rather than from an actual fixed origin.

The green leaves in the painting also function as an important symbol. They may be understood as representing the leaves of the cosmic tree — the visible expressions of the world. Yet what we perceive is never the whole leaf. Our attention follows only a narrow radial line along its vein. From this limited viewpoint we construct an understanding of the whole.

Thus what appears to us as knowledge may in fact be only a partial perception shaped by our position of observation. The painting quietly suggests that the full structure of the tree can never be grasped completely from any single viewpoint.

Seen in this way, Tree of Knowledge – No. 5 becomes a profound visual meditation. It does not present the world as a fixed object but as a dynamic structure shaped by division, perception, and interpretation. The delicate balance at the base of the painting — symbolised by the egg and the poised forms within it — provides the only stable reference point.

From that equilibrium emerges the axis of observation. From that axis the spiralling movements of the world become visible.

Thus the painting invites the viewer not merely to interpret its symbols, but to question from where and how the world itself is being observed.

A 309 Tree of Knowledge No.5 (విచారణా వృక్షము – నం. 5)

HILMA af KLINT   “ విచారణా వృక్షము – నం. 5” (Tree of Knowledge No.5) –  వివరణము హిల్మా ఆఫ్ క్లింట్ వేసిన “ విచారణా వృక్షము – నం. 5” అనే...