Sunday, 16 May 2021

50 ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁడు (ItaDE muktidOva yItaDE mAyAchAryuDu)

 ANNAMACHARYA

50 ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁడు 

Introduction: In this 50th Verse in my commentary. I thought it is befitting to include a tribute paid to Annnamacharya by his successors. His son PedaTirumalacharya said each verse of Annamayya is like one Veda mantra. His grandson China Tirumalacharya also paid rich tributes by writing many verses in praise of Annnamacharya. This verse, demonstrates real contribution of Annamayya to popularise Veda Dharma in society.  

He wrote those concepts which are otherwise difficult to put in words; impacted the life of people thru his revolutionary messages. Yet all his verses are packaged in beautiful and naturally flowing language. He did not mince words to call a spade a spade; his expressions were directly transmitted to the heart and endeared to people. He was frugal with words and language melted like wax to adjust to his poetry.  

Modernity of his concepts will continue to light generations to come; many great musicians have drenched and will drench themselves in the nectar of his poetry.  He will continue to fascinate the world, for the present research on his music is still in nascent stage.  

ఉపోద్ఘాతము: ఇది నేను వ్యాఖ్యానము చేస్తున్న 50 కీర్తన​. తాళ్ళపాక అన్నమాచార్యుల తదనంతరము వచ్చిన వారూ కవులే కావడము, వారు  అన్నమచార్యులను పొగడుతూ అనేక కీర్తనలను పాడడము జరిగినది.  పెదతిరుమలాచార్యుడు అన్నమాచార్యుల ఒక్కొక్క కీర్తన ఒక్కో వేద మంత్రము అని నుడివెను. కీర్తనలో అన్నమాచార్యులు వేదములలోని సారమును ప్రజలకు బోధపడునట్లు అందమైన పాటలుగా కట్టి సమాజ సేవ చేసిన సంగతి ప్రస్తావించారు. 

తాళ్ళపాక అన్నమాచార్యులు మాటలలో చెప్పలేని భావాలను,  విప్లవాత్మకమైన సందేశాలను అలవోకగా, సహజత్వము కోలుపోకుండా, వాడుక భాషలో,  హృదయములోకి సూటిగా వెళ్ళునట్లుగా, జన బాహుళ్యము నోళ్ళలో నానునట్లుగా, మనిషిని అలోచింపచేయునట్లుగా వ్రాసి కవిత్వానికే వన్నె తెచ్చారు. 

గొప్ప గొప్ప గాయకులు ఆతని పాటలు పాడి అమృతాన్ని చవిగొని, తన్మయత్వము చెంది ధన్యులగుచూనే యున్నారు.. ఎప్పటికీ ఆయన కీర్తనలు మోక్షానికి దారి చూపు దివిటీలుగా వెలుగుతూనే ఉంటాయి. రానున్న తరాలు మహానుభావుని సంకీర్తనామృతంలో ఓలలాడెదరు. అన్నమయ్య మీద పరిశోధనలలో ఇప్పటికీ వెలుగులోకి రాని వేలాది  కీర్తనలు బయలుపడతాయని భావిస్తాను.. 

ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁ

డీతఁడు గలుగఁబట్టి ఇందరు బదికిరి           ॥పల్లవి॥ 

ItaDE muktidOva yItaDE mAyAchAryu

DItaDu galugabaTTi iMdaru badikiri  pallavi 

Word to Word Meaning: ఈతఁడే (ItaDE) = He is; ముక్తిదోవ (muktidOva) = path to salvation; యీతఁడే (yItaDE) He is;  మాయాచార్యుఁడు (mAyAchAryuDu) = our teacher;  ఇతఁడు (ItaDu) = He is;  గలుగఁబట్టి (galugabaTTi)  = because of his being there; ఇందరు బదికిరి (iMdaru badikiri) = we all are saved ( from the darkness).

Literal Meaning and Explanation: He is our path to salvation. He is our Teacher (guru). But for him we would have been groping in darkness. 

For the great majority of the people (even today) it was not possible to relate to Sanskrit verses of Vedas. He used simple colloquial language to make people relate to the essence of Vedas. 

భావము & వివరణము : ఈతఁడే మాకు ముక్తిదోవ చూపెను. ఈతఁడే మాకు గురువు. ఈతఁడు లేకున్న మేమింకా చీకటిలో తచ్చడుతూనే ఉండెవాళ్ళము. 

ఆప్పుడే కాదు, ఇప్పటికీ చాలా మంది సంస్కృత శ్లోకాలను అర్ధము చేసుకోలేక సతమతమౌతారు. మనలాంటి వారి కోసము చక్కని సరళమైన భాషలో వేదాల సారాన్ని చిక్కబట్టి మనకదించారు అన్నమయ్య​. 

అదివో తాళ్లపాక అన్నమాచార్యులు

యిదె వీఁడె శ్రీవేంకటేశు నెదుట
వెదవెట్టి లోకములో వేదములన్నియు మంచి-
పదములుసేసి పాడి పావనము సేసెను       ॥ఈతఁ॥ 

adivO tALlapAka annamAchAryulu

yide vIDe SrIvEMkaTESu neduTa
vedaveTTi lOkamulO vEdamulanniyu maMchi-
padamulusEsi pADi pAvanamu sEsenu   ItaDE 

Word to Word Meaning: అదివో (adivO) = there he is;  తాళ్లపాక అన్నమాచార్యులు (tALlapAka annamAchAryulu) = Annamacharyulu;  యిదె వీఁడె (yide vIDe) = that very person; శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkeswara;  నెదుట (neduTa) = in front of ; వెదవెట్టి (vedaveTTi) = To cause to spread, To impregnate  లోకములో (lOkamulO) = in this world;  వేదములన్నియు (vEdamulanniyu) = the essense of all Vedas;  మంచి- పదములు (maMchi padamulu) = great literary works; సేసి (sEsi) = converted to;  పాడి (pADi) = sang;  పావనము సేసెను (pAvanamu sEsenu) = became clear/pious. 

Literal Meaning and Explanation: There, you see Annamacharyulu stood in the presence of Lord Venkateswara. He converted the essence of Vedas in to great literary works to spread the message (to the masses) and sang them with such devotion to become clear of all the corporal bondages. 

భావము & వివరణము : అదిగో తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవేంకటేశ్వరుని ఎదుట నిలిచి వేదములన్నింటి సారమును అందమైన పాటలు చేసి ప్రజలకు అవి అందించి, వాటిని తన్మయత్వముతో పాడి, జన బాహుళ్యము నోళ్ళలో నానునట్లుగా చేసి, పునీతుడైనాడు 

అలరుచుఁ దాళ్లపాక అన్నమాచార్యులు

నిలిచి శ్రీవేంకటనిధియే తానై
కలిదోషములు వాప ఘనపురాణములెల్ల
పలుకుల నించినించి పాడినాఁడు హరిని   ॥ఈతఁ॥ 

alaruchu dALlapAka annamAchAryulu

nilichi SrIvEMkaTanidhiyE tAnai
kalidOshamulu vApa ghanapurANamulella
palukula niMchiniMchi pADinADu harini   ItaDE 

Word to Word Meaning: అలరుచుఁ(alaruchu) = సంతోషపెట్టు, to please, to gratify; దాళ్లపాక అన్నమాచార్యులు (dALlapAka annamAchAryulu) Annamacharyulu; నిలిచి (nilichi)  = staying; శ్రీవేంకటనిధియే(SrIvEMkaTanidhiyE) =  తానై (tAnai) కలిదోషములు (kalidOshamulu ) =detrimental effects of Kaliyuga; = వాప (vApa) = to eradicate, to diminish;   ఘనపురాణములెల్ల (ghanapurANamulella) = all the great epics;  పలుకుల (palukula) = in the poetry; నించినించి (niMchiniMchi) = filled to the brim;  పాడినాఁడు (pADinADu) = he sang and praised; హరిని (harini) = Lord Hari. 

Literal Meaning and Explanation: Annamacharyulu, stood firmly by the God, composed poetry filled with great epics   and sang the story of Hari in his verses to diminish the effect of Kaliyuga ( on the public at large). 

భావము & వివరణము : శ్రీవేంకటేశ్వరుని దాసుడై అన్నమాచార్యులు, ప్రజలకు కలియుగ దోషములు అంటకుండా రూపుమాపుటకు, పురాణములలోని విశేషములు అద్భుతమైన కీర్తనలుగా పాడి,  హరిని సంతోషపెట్టెను. 

అంగవించెఁ దాళ్లపాక అన్నమాచార్యులు

బంగారు శ్రీవేంకటేశు పాదములందు
రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు-
మంగను యిద్దరిఁ బాడి మమ్ము గరుణించెను        ॥ఈతఁ॥ 

aMgaviMche dALlapAka annamAchAryulu

baMgAru SrIvEMkaTESu pAdamulaMdu
raMgumIra SrIvEMkaTa ramaNuni yalamElu-
maMganu yiddari bADi mammu garuNiMchenu ItaDE 

Word to Word Meaning: అంగవించెఁ (aMgaviMche) = made great relationship;  దాళ్లపాక అన్నమాచార్యులు (dALlapAka annamAchAryulu) Annamacharyulu; బంగారు  = gold; (baMgAru) శ్రీవేంకటేశు (SrIvEMkaTESu) = Lord Venkateswara; పాదములందు(pAdamulaMdu) = at the feet;  రంగుమీర (raMgumIra)  Sang with such devotion that his cheeks turned red; శ్రీవేంకట రమణుని (SrIvEMkaTa ramaNuni) Lord Venkateswara; యలమేలు- మంగను (yalamElu-maMganu) = Alamelu  Manga;  యిద్దరిఁ బాడి (yiddari bADi) = praised both;  మమ్ము గరుణించెను (mammu garuNiMchenu) = he showered us with blessings; 

Literal Meaning and Explanation: Annamacharyulu unassailable relationship with the lotus feet of the Lord. He sang in praise of Lord and his wife Alamelu  Manga so much that his cheeks turned red  ( he does not have consciousness of time and body pain during the bhakti singing) and he showered us with his blessings. 

భావము & వివరణము : శ్రీవేంకటేశ్వరుని పాదాలతో అవినాభావ సంబంధము కలిగి వేంకట రమణుని అలమేలుమంగను యిద్దరిని కలిపి తన చెక్కిళ్ళు యెరుపెక్కినా  (దేహము మీద స్పృహ లేకుండా) అపకుండా పాడేవాడు. అన్నమాచార్యులు మమ్ము కరుణించెను.

 

zadaz

Reference: copper leaf 232-4, volume: 3-183

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...