Saturday, 22 May 2021

52 దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి (dEvuDokkaDE guri delisinavAriki)

 

ANNAMACHARYA

52 దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి 

Introduction: In this inward looking verse, Annamacharya asserts that there is no objective to life other than god. He does not approve any ritualistic practices like prayers and penances. He says don’t waste time by looking here and there till the very end (of life). He counselled people look within themselves from today and declared that there is no pleasure or satisfaction beyond this knowledge in the realm. 

If poetry has to reflect the man in entirety, there may be few comparisons to this epochal verse. 

ఉపోద్ఘాతము: అంతర్దృష్టితో నుండే యీ కీర్తనలో అన్నమయ్య జీవితానికి దేవుడొక్కడే లక్ష్యమన్నారు. పరంపరగా వస్తున్న యాగములు, తపములు, ప్రాయశ్చిత్తాలను ఆయన అమోదించలేదు. అక్కడా, ఇక్కడా సమాధానాల కొఱకు చూస్తూ, మరణము దాకా సమయాన్ని  వృధా కాకుండా, క్షణము నుంచే నీ లోపలనే చూసుకో, అంతకు మించిన సన్మార్గము లేదనీ అన్నారు.   

దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి

యీవలావల చూచినా నిఁకలేదు తెఱఁగు        ॥పల్లవి॥ 

dEvuDokkaDE guri delisinavAriki

yIvalAvala chUchinA nikalEdu te~ragu pallavi 

Word to Word Meaning:  దేవుఁడొక్కఁడే (dEvuDokkaDE) = one and only God; గురి (guri) = లక్ష్యము, నిశ్చయత, certainty, target;    దెలిసినవారికి (delisinavAriki) = the one who is aware; who knows; యీవలావల (yIvalAvala) = this side or other side; చూచినా (chUchinA) నిఁకలేదు (nikalEdu) తెఱఁగు (te~ragu) = Way, path. 

Literal Meaning and Explanation: Only target man has in his life to submit to god. All other pursuits are only wastage of time. 

భావము & వివరణము : జీవితానికి దేవుడొక్కడే లక్ష్యమని తెలియండి. వేరే ఏవేవో ప్రయత్నించి సమయాన్ని వృధాచేసుకొవద్దు. 

కోపము మానితేనే కోటిజపాలు సేయుట

పాపము సేయకుంటేనే బలుతపము
లోపల తానూరకుంటే లోకమెల్లాఁ జరించుట
మాపుదాఁకా వెదకినా మఱిలేదు తెఱఁగు         ॥దేవుఁ॥ 

kOpamu mAnitEnE kOTijapAlu sEyuTa

pApamu sEyakuMTEnE balutapamu
lOpala tAnUrakuMTE lOkamellA jariMchuTa
mApudAkA vedakinA ma~rilEdu te~ragu          dEvu 

Word to Word Meaning: కోపము(kOpamu) = anger; మానితేనే (mAnitEnE) = if avoided; కోటిజపాలు (kOTijapAlu) = ( equal to ) million prayers; సేయుట (sEyuTa) = performing;  పాపము (pApamu) = worng acts;  సేయకుంటేనే (sEyakuMTEnE) = if not done; బలుతపము  (balutapamu)  = great penance; లోపల (lOpala) = inside;   తానూరకుంటే (tAnUrakuMTE) = if ( a person) kept quiet;  లోకమెల్లాఁ (lOkamellA) = the whole world; జరించుట (jariMchuTa) = to go OR to wander; ( here meaning perceiving/ experience) మాపుదాఁకా (mApudAkA) = till the midnight; వెదకినా (vedakinA) = searching; మఱిలేదు (ma~rilEdu)  = there is no alternative;  తెఱఁగు (te~ragu) = Way, path. 

Literal Meaning and Explanation: Eschewing anger is better than performing million prayers. Avoiding the wrong acts is nobler than any penance. If you are calm or quiet internally, it is experiencing the world.  Beyond this, if you keep searching (till night read it as death), you will not find any way out (of the situation you are in). 

Annamacharya is saying that man instead of performing prayers and other penances must look inside for what is fundamentally wrong with him. Instead, man goes in rigmarole of searching god (to seek shelter). Decrying this tendency, Annamayya repeatedly stated వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును (O man! do not get fatigued in search of god, because you will not find as it is not a matter of conscious experience). 

Annamacharya  is asking man to be calm inwardly. Human mind thinks between 60,000 – 80,000 thoughts a day on average. With so much zigzag activity of thought are happening inside man, obviously he creates a world with matching complexity and encompasses himself in such activity only to find that he is not free anymore.  How can one be free while his mind is engaged with thousands of wants? Obviously thoughts have to subside. 

భావము & వివరణము : కోపము పూర్తిగా మానిపొతే కోట్లాది జపాలు చేసినదానికన్నా గొప్ప. పాపము చేయక ఉండుటే తపస్సు కంటే యెక్కువ​. తనలోపల తాను నిశ్చలముగా ఉంటే ప్రపంచమంతటినీ తెలిసినట్లే. ఇంత కంటే చివరి(మరణము) దాకా వెదకిననూ వేరు దారి లేదు. 

యాగములు, తపములు, ప్రాయశ్చిత్తాల వంటి పనుల్లో నీ సమయాన్ని  వృధా చేసుకోకుండా మౌలికంగా నీ లోని తప్పులు తెలుసుకోమంటున్నాడు అన్నమయ్య​. కాని మానవుడు తనను కష్టాలనుంచి తప్పించమని దేవుణ్ణి వెడుకుంటాడు. మన ప్రస్తుత శైలిని విమర్శిస్తూ “వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును” అని పలుమార్లు చెప్పారు. తపము చేసుకునే ముని ఇటువంటి మాట లెందు కంటున్నాడు? ఆలోచించవలసిన విషయమే!! 

మనిషి తనలోపల తాను నిశ్చలముగా ఉంటాడా? ఒక సామన్య మానవుని మస్తిష్కములో  60 నుంచి 80 వేల అలోచనలు రోజూ  కలుగుతుంటాయి. వేలాది తలపులు జిగిబిగిగా లోపల తిరుగుతుంటే మనిషిలకి నిలకడ యెక్కడ​? తనలోని గందరగోళాన్నే ప్రతిబింబిస్తూ మనిషి సమాజాన్ని సృష్టించాడు. బయటి ప్రపంచాన్ని చూసి, ఇది తనకంటే వేరని భ్రమ పడతాడు.  మనిషి యెలా శాంతిని పొందుతాడు, అలోచనలుడుగకుంటే? 

పరకాంత నంటకుంటె బలుపుణ్యాలు సేయుట

సొరిది నాసమానుటే సోమపానము
సరిమోనాన నుండుటే సన్యాసము చేకొనుట
యిరవైతే నంతకంటే నిఁకలేదు తెఱఁగు         ॥దేవుఁ॥ 

parakAMta naMTakuMTe balupuNyAlu sEyuTa

soridi nAsamAnuTE sOmapAnamu
sarimOnAna nuMDuTE sanyAsamu chEkonuTa
yiravaitE naMtakaMTE niMkalEdu te~ragu       dEvu 

Word to Word Meaning:  పరకాంతను (parakAMtanu)= other ladies; అంటకుంటె (aMTakuMTe) = not touching (not wishing);   బలుపుణ్యాలు (balupuNyAlu) = doing many virtuous activities;   సేయుట (sEyuTa)  performing; సొరిది (soridi) = క్రమము gradually; నాసమానుటే (nAsamAnuTE) = moving away from the wants; సోమపానము (sOmapAnamu) = drinking Amritam (celestial drink to make men immortal); సరిమోనాన (sarimOnAna) = సమబుద్ధి, Equanimeous;  నుండుటే (nuMDuTE) = being; సన్యాసము (sanyAsamu)= relinquishment;  చేకొనుట (chEkonuTa) =adapting;  యిరవైతే (yiravaitE) =స్థానము, తగిన place, position, suitable; నంతకంటే (naMtakaMTE) = beyond this; నిఁకలేదు (niMkalEdu) = does not exist; తెఱఁగు (te~ragu) = a path; 

Literal Meaning and Explanation: Not wishing the other ladies is a great virtuous act.  Moving away from wants is equal to drinking the Amritam ( a celestial drink to make men immortal). Being Equanimeous is better than relinquishment of duties; there is no path or system better than these simple rules. 

Please read “other ladies” as the wants that titillate you, but barred by etiquette and civility to possess.  As long as we are prevented by the so called civilisation, rules, mind wants to find a method of obviating it. These unfulfilled wants are stress raisers. More of it, as it happens in family life, one feels he has been put in a straitjacket.  Therefore it is obvious that there are fissures in family life. Now, you can appreciate how arduous is the task of being Equanimeous. Hence to be in equanimity ones’ mind must be in a state of calmness. 

భావము & వివరణము : పరస్త్రీల పొందు కోరకుండుట అనేక పుణ్యాలతోను​, ఆశలు ఉడిగిపోవుట అమృతపానముతోను సమానమన్నారు.  సన్యాసమనగా సమబుద్ధి కలిగి యుండుటయే. నీ మనస్సును అలా ఉంచుటకంటే గొప్ప దారి లేదు. 

పరస్త్రీల పొందుఅనే పేరుతో మనము కావాలనుకుంటున్నా సమాజము, సభ్యతలను పరిగణనలోనికి తీసుకొని, అదిమిపెట్టే తీరని కోరికలను సూచిస్తున్నారు. మనస్సు వీటన్నింటినీ యేదోరకంగా దాటుకొని వెళ్ళాలనుకొంటుంది. అందుకే యీ తీరని కోరికలు వత్తిడి కలిగిస్తాయి. రోజుల్లో సంసారాలు, చిన్న చిన్న కట్టుబాట్లు వత్తిడీ కలిగించడం వల్ల యెలా సంఘర్షణకు లోనైయ్యేది చూస్తూనే ఉన్నాము. 

యేమాత్రమూ కష్టంకాని చిన్న విషయాల్లోన్నే సర్దుకోలేక సతమతమౌతున్న మనకు ఇప్పుడు "సమబుద్ధి" చూపడం యెంత సంక్లిష్టమో అలోచించండి. జాగ్రత్తగా చూస్తే సమబుద్ధి కలగడానికి  మానసిక ప్రశాంతత అత్యవసరమని తెలుస్తుంది. 

పలు సుఖదుఃఖములఁ బాసి వుండుటే మోక్షము

అల చంచలము మానుటది యోగము
యిలపై శ్రీవేంకటేశుఁ డిచ్చిన సుజ్ఞానమిది
యెలమి బుద్ధిఁ బోల నిఁకలేదు తెఱఁగు            ॥దేవుఁ॥ 

palu sukhaduhkhamula bAsi vuMDuTE mOkshamu

ala chaMchalamu mAnuTadi yOgamu
yilapai SrIvEMkaTESu Dichchina suj~nAnamidi
yelami buddhi bOla nikalEdu te~ragu   dEvu 

Word to Word Meaning:  పలు (palu) many, multiple;  సుఖదుఃఖములఁ (sukhaduhkhamula) = comforts and travails;  బాసి (bAsi)  = stay away, ostracise; వుండుటే (vuMDuTE) = being;  మోక్షము (mOkshamu)= liberation;  అల = there, that;   చంచలము (ala chaMchalamu) = wavering;  మానుటది (mAnuTadi) = to stop;   యోగము (yOgamu) = great boon;  యిలపై (yilapai) = in this world; శ్రీవేంకటేశుఁ (SrIvEMkaTESuDu) = Lord Venkateswara; ఇచ్చిన (ichchina)  = provided; సుజ్ఞానమిది (suj~nAnamidi) = this great knowledge;  యెలమి(yelami) = సంతోషము, pleasure, satisfaction;  బుద్ధిఁ బోల(buddhi bOla)  = ద్రవములాగ అటునిటు పోగల మనస్సు, the fluid  thing called mind; నిఁకలేదు (nikalEdu)  = = does not exist; తెఱఁగు (te~ragu) = a path. 

Literal Meaning and Explanation: (when man can actually) avoid/stay away from comforts and travails is liberation. The greatest boon to man is when his  mind stops wavering. This is the knowledge imparted by Lord Venkateswara to us (to live comfortably in this world). There is no greater treasure than   your own mind to find the path to salvation.  

Please see so simple and clear statements of wisdom from Annamacharya. The only avail god given to man to liberate himself is his mind. This delicate instrument needs care. Care of compassion. The wonderful instrument needs freedom to act. The poor thing cannot function efficiently under the duress of demands of ignorance on it. After long mishandling, it may lose its vitality. There is still hope. That is the reason for using the word మాపుదాఁకా (mApudAkA) (Meaning don’t wait till the very end where reconciliation is impossible). 

భావము & వివరణము : మనిషి నిజంగా తనలో కలుగుతున్న సుఖదుఃఖముల జాడను గ్రహించి కూడా వాటిని స్పందించకుండా ఉండటము అత్యంత కఠినము. వాస్తవానికి అలా ఉండ గలిగితే అదే మోక్షము అన్నారు. పరిపరి విధముల పోయే మనస్సు ఒక్కచో నిలబడిన అదే మహా యోగమన్నారు.  మానవుడా వీటిని పొందుటకు శ్రీవెంకటేశ్వరుడే ఇచ్చిన సుజ్ఞానము నీ మనస్సు. అంతకు మించిన సంతృప్తి/ ఆనందము వేరేదేదీ  కలిగించలేదు. 

మానవుని చేతిలో ఉన్నది మనస్సు అనే సున్నితమైన పరికరము.  మనస్సు నిలకడ లేనిదని ముందే చెప్పారు.  దయ​, ప్రేమ కనికరము ఉంటేనే ఇది మనగలుగుతుంది. వీటికన్న ముందు దానికి స్వేచ్ఛ కావాలి.  మన అజ్ఞానపు కోరికలు దాని మీద అధకంగా ప్రభావము చూపి సమర్ధవంతంగా పనిచేయనివ్వవు. పరిస్థితి అలాగే కొనసాగితే మొద్దుబారి పనికిరాకుండా తయారౌతుంది. చేయిదాటక మునుపే తెలివి తెచ్చుకొని జీవించమని "మాపుదాఁకా" ఆగద్దన్నారు అన్నమయ్య​.

 

zadaz

Reference: copper leaf 152-2, volume: 2-241

 

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...