ANNAMACHARYA
113. పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను
(pApa me~raganu puNyaphala me~raganu)
Introduction: In this naturally beautiful song, Annamacharya is questioning the sense of pursuit, be it sins or virtues. On the first look, this poem appears to be allowing man to yield to the senses, and material comforts. The main point of this wonderful poetry, however, is that the way to God is not through the senses, nor through activities, but through complete submission.
It’s an unbelievable poem breaking the ritualistic pedantry from a chaste Hindu monk. The fact it did appear, proves that Annamacharya must have braved the public opinion of his times. It not only survived but being talked about is a sign of foresight of Annamacharya. Few must have defied such unsurmountable pressure in the history of generally conforming religious literature.
ఉపోద్ఘాతము: పాపాలు, పుణ్యఫలాలు అనుకుంటూ వాటి వెంబడి పరుగులెత్తే సాధారణ మానవుని స్వభావాన్ని అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు. చూడంగానే ఈ కీర్తన మనిషి ఇంద్రియాలకు, భౌతిక సుఖాలకు లొంగిపోవచ్చనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఏమైనప్పటికీ, ఈ అద్భుతమైన కవిత్వం యొక్క అంతర్లీనమైనఅర్ధం ‘ఇంద్రియాల ద్వారా కాదు, అన్వేషణల ద్వారా కాదు, భగవంతుణ్ణి సంపూర్ణ ఆత్మ సమర్పణ ద్వారా మాత్రమే చేరుకోగలమని’.
ఛాందసానికి తావివ్వకుండా ఒక హిందూ తపసి నుండి ఈ రకమైన కీర్తన వచ్చిందంటే నమ్మశక్యం కాదు. దీనినిబట్టి, అన్నమాచార్యులు తన కాలంలోని ప్రజల అభిప్రాయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడనేది కాదనలేని వాస్తవం. సాధారణంగా అనుకృతమగు మతపరమైన సాహిత్య చరిత్రలో అలాంటి అధిగమించలేని ఒత్తిడిని కొందరే ధిక్కరించి ఉండాలి. ఆ పాట నిలదొక్కుకోవడమే కాకుండా చర్చనీయాంశంగా మారడం అన్నమాచార్యుల దూరదృష్టికి సంకేతం.
కీర్తన:
పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను మునుప నీవిషయముల ముద్ర మానుసులఁగా- కలిమిగల యింద్రియపుఁ గాఁపులుండిన వూరు కుటలములఁ బెడఁబాపి కోరిన చనవులెల్ల | pApa me~raganu puNyaphala me~raganu yE panulu nIku sela vinniyunu gAvA ॥pallavi॥ munupa nIvishayamula mudra mAnusulagA- nunichitivi nAmIda nokaTokaTinE aniSaMbu navi cheppinaTla jEyakayunna ghanuDa nIyAj~na nE gaDachuTE kAdA ॥pApa॥ kalimigala yiMdriyapu gApuluMDina vUru yelami nA kosagitivi yElumanuchu alasi vIrala nEnu nAdariMchaka kinisi tolagadrOchina nadiyu drOhamE kAdA ॥pApa॥ kuTalamula beDabApi kOrina chanavulella ghaTana jelliMchitivi ghanuDa nEnu aTuganaka SrIvEMkaTAdrISa nIdAsi- neTuchEsinA nIku nitavEkAdA ॥pApa॥ |
Details and Explanations:
పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను
యే పనులు నీకు సెల విన్నియునుఁ గావా ॥పల్లవి॥
pApa me~raganu puNyaphala me~raganu
yE panulu nIku sela vinniyunu gAvA ॥pallavi॥
Word to Word meaning: పాప మెఱఁగను (pApa me~raganu) = I do not know what sin is; పుణ్యఫల మెఱఁగను (puNyaphala me~raganu) = I do not now the results of virtuous acts; యే (yE) which; పనులు (panulu) = deeds; నీకు (nIku) = for you; సెల విన్నియునుఁ (sela vinniyunu) = ఇవన్నియు నీ ఆదేశము లోనివి, all these having your consent; గావా (gAvA = కావా? = kAvA?) = aren’t they?
Literal meaning: I do not know what sin is. Neither do I know the results of virtuous acts. Aren’t these deeds have your consent?
Explanation: What is the meaning of these words? They simply mean that there is no point in any pursuit right or wrong. This is based on Bhagavad-Gita verse 5-15 नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु: | अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव: || nādatte kasyachit pāpaṁ na chaiva sukṛitaṁ vibhuḥ ajñānenāvṛitaṁ jñānaṁ tena muhyanti jantavaḥ (Purport: The omnipresent God does not involve Himself in the sinful or virtuous deeds of anyone. The living entities are deluded because their inner knowledge is covered by ignorance.)
Thus, Annamacharya is saying these deeds really do not have consent of the God. (=సెల విన్నియునుఁ గావు = sela vinniyunu gAvu). If there is no work to be performed, what does the man is expected to do? The answer is in the very question; సెలవుగల పనులేమి? Selavugala panulEmi? What work has your consent. No living person can answer you this. Therefore, it is the primary duty of the man to find the duty for which he arrived here.
Now consider this verse from Bhagavad-Gita. श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् | स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: || 3-35|| śhreyān swa-dharmo viguṇaḥ para-dharmāt sv-anuṣhṭhitāt swa-dharme nidhanaṁ śhreyaḥ para-dharmo bhayāvahaḥ It is far better to perform one’s natural prescribed duty, though tinged with faults, than to perform another’s prescribed duty, though perfectly. In fact, it is preferable to die in the discharge of one’s duty, than to follow the path of another, which is fraught with danger.
Whence, we understand it’s the duty of man to find his natural prescribed duty. Whereas now, we are not in our natural state but drifted away from it. This is what practitioner should imbibe and move toward the natural state. That movement, that journey is called meditation.
Implied meaning: O man, do not get trapped in the spiral of Good or Bad deeds. Rather find what is the Order of the lord to you.
భావము: పాపమేదో ఎరగను. పుణ్యఫలమేదో ఎరగను. ఈ పనులన్నీ నీ ఆదేశముతోనే జరుగుతున్నవి కావా?
వివరణము: ఈ పల్లవి ద్వారా అన్నమాచార్యులు ఏమి చెప్పదలచుకున్నారు? పాపాలు, పుణ్యఫలాలు అనుకుంటూ వాటి వెంబడి పరుగులెత్తే సాధారణ మానవుని స్వభావాన్ని అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది భగవద్గీత నందలి 5-15వ శ్లోకము అధారముగా వ్రాసివుండవచ్చు. నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభు: / అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జన్తవ: (భావము: (సర్వాంతర్యామి అయిన) భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్య కర్మలను కానీ స్వీకరింపడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు).
ఈ విధంగా, అన్నమాచార్యులు ఈ పనులు (పాపపుణ్యాలు) భగవంతుని సమ్మతిలోనివి కావన్నారు. చేయవలసిన పని ఏదీ లేకపోతే, మనిషి ఏమి చేయాలని ఈ లోకంలోకి పంపాడో? దీనికి సమాధానం జీవించి ఉన్న ఏ వ్యక్తి కూడా ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోయాడు. అందువల్ల, అతను ఇక్కడకు వచ్చిన విధిని తనకుతానే కనుగొనడం మనిషి యొక్క ప్రాధమిక కర్తవ్యం.
ఇప్పుడు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని కూడా చూడండి. 'శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్' / 'స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః' (3-35) {భావము: చక్కగా పాటింపబడిన పరధర్మము కన్ననూ గుణము లేనిదైననూ స్వధర్మాచరణమే శ్రేయస్కరము. స్వధర్మాచరణమందు మరణము సంభవించిననూ మేలే, ఏలయనగా పరధర్మము భయంకరమైనది}.
దీని నుండి, తన సహజ నిర్దేశిత విధిని తెలియుటయే మనిషి ధర్మము అని అర్థం చేసుకుంటాము. అయితే, ఇప్పుడు మనం మన సహజ స్థితిలో లేము (దాని నుండి దూరంగా జరిగి కృత్రిమావస్థలో ఉన్నాము). దీన్ని అభ్యాసకుడు గ్రహించి సహజ స్థితి వైపు పయనించాలి. ఆ కదలికయే, ఆ ప్రయాణమే ధ్యానం (లేదా తపస్సు).
అన్వయార్ధము: ఓ మానవుడా! మంచి లేదా చెడు పనుల వలయములలో చిక్కుకోవద్దు. బదులుగా దైవము నీకై ఇచ్చిన ఉత్తరవు ఏమిటో కనుగొనుము.
మునుప నీవిషయముల ముద్ర మానుసులఁగా-
నునిచితివి నామీఁద నొకటొకటినే
అనిశంబు నవి చెప్పినట్లఁ జేయకయున్న
ఘనుఁడ నీయాజ్ఞ నేఁ గడచుటే కాదా॥పాప॥
munupa nIvishayamula mudra mAnusulagA-
nunichitivi nAmIda nokaTokaTinE
aniSaMbu navi cheppinaTla jEyakayunna
ghanuDa nIyAj~na nE gaDachuTE kAdA ॥pApa॥
Word to Word meaning: మునుప (munupa) = Earlier; నీవిషయముల (nIvishayamula) = your material; ముద్ర మానుసులఁగాన్ (mudra mAnusulagAn) = నీ సంజ్ఞల క్రింద నుండు మనుషులుగా, as a signet or stamp of your people; ఉనిచితివి (unichitivi) = ఉండునట్లుచేయు, నీయమించు, appointed, prearranged; నామీఁద (nAmIda) = on me; నొకటొకటినే (nokaTokaTinE) = one by one; అనిశంబు (aniSaMbu) = నిరంతరముగా, continuously; నవి (navi) = their; చెప్పినట్లఁ (cheppinaTla) = directions, instructions, జేయకయున్న (jEyakayunna) = not followed; ఘనుఁడ (ghanuDa) = great man; నీయాజ్ఞ (nIyAj~na) = your orders; నేఁ (nE) = me; గడచుటే (gaDachuTE) = ఉల్లంఘించుట, disobey, disregard; కాదా (kAdA) = is it not?
Literal meaning: Earlier you had left us here as signets of your material existence. These materials you made continuously befall on us one after the other (seeking our attention). Is it not disobeying your orders not to give into their demands?
Explanation: Annamacharya used very apt word mudra mAnusulagA (ముద్ర మానుసులఁగా) to indicate man, in his ignorance takes these material manifestations as representative of God. Therefore do not feel ashamed of this abject submission. Thus, the description is accurately capturing the condition of the man.
Man derives consolation that 'he is not alone' but he has many companions. He looks towards the god forever, like tax payers long for waivers and concessions like the municipal bodies ‘offers’ on accrued tax liabilities at the end of the year.
Implied meaning: O Man! These material things though appear like the marks of the god; though they continuously pressure you to surrender; yet impartially observe the reactions they are causing in you?
భావము: పూర్వము నుంచీ నీవు విషయములను నీ ముద్ర మానుసులఁగా అనిపింప చేసితివి? అవి ఒకటొకటిగా నామీఁద ఎప్పుడూ వాటికి లొంగిపోవాలని ఒత్తిడి పెంచుతూనే ఉన్నవి. అవి చెప్పినట్లఁ జేయకయున్న ఘనుఁడగు నీ యాజ్ఞ నేను ఉల్లంఘించుట కాదా? ( లొంగక ఏమి చేయను?)
వివరణము: మనిషిని భగవంతుని ప్రతినిధిగా సూచించడానికి ఈ చరణంలో అన్నమాచార్యులు చాలా సముచితమైన పదం 'ముద్ర మానుసులు' అని ప్రయోగించాడు. కానీ మానవుడు అతని అజ్ఞానం కొలది ఈ భౌతిక వ్యక్తీకరణలను (ఇంద్రియాలనే) భగవంతునికి మాఱుగా తీసుకుంటాడు. వాటికి బానిస ఔతాడు. కాబట్టి ఈ చరణం మనిషి యొక్క పరిస్థితిని ఖచ్చితంగా అద్దం పట్టినట్లు చూపిస్తోంది.
మనిషి తాను ఈ ప్రయాణంలోను, అజ్ఞానంలోను ఒంటరిని కాదని; తనకు చాలా మంది సహచరులు ఉన్నారని అర్థము లేని ఓదార్పును పొందుతాడు. కానీ, అతడు ఎప్పటికప్పుడు ఎగవేసిన పన్నులపై సంవత్సరాంతంలో మునిసిపల్ సంస్థలు అందించే మాఫీలు మరియు రాయితీల కోసం ఎదురు చూసేవానిలా దైవంవైపు చూస్తూనే ఉండిపోతాడు.
అన్వయార్ధము: మానవుడా నీకు విషయములు భగవంతుని ముద్ర మానుసులుగా అనిపించినప్పటికీ? అవి లొంగిపోవాలని ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, వాటికి తల వంచక నీలో కలిగించు ప్రతిచర్యలు నిష్పక్షపాతంగా గమనింప గలవా?
కలిమిగల యింద్రియపుఁ గాఁపులుండిన వూరు
యెలమి నా కొసఁగితివి యేలుమనుచు
అలసి వీరల నేను నాదరించక కినిసి
తొలఁగఁద్రోచిన నదియు ద్రోహమే కాదా ॥పాప॥
kalimigala yiMdriyapu gApuluMDina vUru
yelami nA kosagitivi yElumanuchu
alasi vIrala nEnu nAdariMchaka kinisi
tolagadrOchina nadiyu drOhamE kAdA ॥pApa॥
Word to Word meaning: కలిమిగల (kalimigala) = being rich {here the implied meaning is influential} యింద్రియపుఁ (yiMdriyapu)= made of senses; గాఁపులుండిన (gApuluMDina) = being guarded by; వూరు (vUru) = place / village / town; యెలమి (yelami) = సంతోషం కొద్దీ, with pleasure; నా కొసఁగితివి (nA kosagitivi) = handed over to me; యేలుమనుచు (yElumanuchu) = to rule, to govern, to manage; అలసి (alasi) = ఇక్కడ ‘నిర్లక్ష్యం’ అని భావము, if I do not heed; వీరల (vIrala) = to these; నేను (nEnu) = me; నాదరించక (nAdariMchaka) = not give due respect; కినిసి (kinisi) = become angry; తొలఁగఁద్రోచిన (tolagadrOchina) = set aside; నదియు (nadiyu) = even that; ద్రోహమే (drOhamE) = disobedience; కాదా (kAdA) = is it not?
Literal meaning: You handed me over a kingdom guarded by influential sentries called senses to rule to manage. Even if I ignore and disregard your (these) representatives, that may be construed as disobedience to you.
Explanation: what is the challenge to man? Is it food or survival? Neither. Real task is to understand the action of senses on the self. That is the reason Annamacharya used word yiMdriyapu gApuluMDina vUru (యింద్రియపుఁ గాఁపులుండిన వూరు) he is talking of a place which is protected by the sense organs.
Whatever knowledge we have is accumulation of data acquired by the senses. Its only data. That means we do not know anything about the town (Atman) mentioned.
Thus, Annamacharya is taking on the god in this stanza by questioning him what’s wrong in yielding to the sense organs. Let there be no mistake, we cannot understand this world without senses. He is simply implying that we get carried away by them, rather than using them to understand ourselves.
See this pontiff making such a detailed description of how we get trapped by senses. Man, if decides to fight these organs, for sure he will lose. Where is the question of controlling them?
Further, we can't perceive this world without the senses. What use is of a life in such darkness. Therefore, avoiding senses is not a solution. Rather we should make proper use of them by dissociation with the past knowledge.
Implied meaning: O man! Do not look down upon the kingdom guarded by influential sentries called senses. Do you know you are not the Lord of these?
భావము: బలవంతులగు యింద్రియములు కాపులుగా ఉండిన వూరు నాకిచ్చితివ నుకున్నాను. వీటిని అలుసుగా తీసుకుని ఆదరించక ప్రక్కకు త్రోచివేసిన అది నీకు ద్రోహమే కాదా?
వివరణము: మనిషికి అసలు సవాళ్ళేమిటి? ఆహారమా లేదా మనుగడా? ఏదీ కాదు. ఆత్మపై ఇంద్రియాల చర్య(ల)ను అర్థం చేసుకోవడం నిజమైన పని. అన్నమాచార్యులు యింద్రియపుఁ గాఁపులుండిన వూరు అంటూ జ్ఞానేంద్రియాలచే రక్షించబడిన ప్రదేశం గురించి చెబుతున్నారు.
మనకు ఉన్న ఏ జ్ఞానమైనా ఇంద్రియాల ద్వారా పొందిన డేటా మాత్రమే. అంటే ఆ ఊరు (ఆత్మ) గురించి నిజంగా మనకు ఏమీ తెలియదని భావము.
ఇంద్రియాలు కలిగించు భ్రమలలో మనం ఎలా చిక్కుకుపోతామో అనే దాని గురించి ఈ యోగి వివరణాత్మకంగా వివరించడం చూడండి. మనిషి ఈ అవయవాలతో పోరాడాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా అతను ఓడిపోతాడు. ఇక వాటిని నియంత్రించడం అన్న ప్రశ్నే ఉదయించదు.
ఇంకా, ఇంద్రియాలు లేకుండా ఈ ప్రపంచాన్ని మనం గమనించలేము. అటువంటి చీకటిలో బ్రతకడం వల్ల ఏమి ఉపయోగం. కాబట్టి, ఇంద్రియాలకు దూరంగా ఉండటం పరిష్కారం కాదు. బదులుగా మనం పోగు చేసుకుని ఉంచుకున్న జ్ఞానం నుండి వాటిని గుర్తించడం ద్వారా సద్వినియోగించ వలెను.
అన్వయార్ధము: యింద్రియపుఁ గాఁపులుండిన వూరును అలుసుగా చూడక; నీవే యేలిక అనుకోక వుండాగలవా?
కుటలములఁ బెడఁబాపి కోరిన చనవులెల్ల
ఘటనఁ జెల్లించితివి ఘనుఁడ నేను
అటుగనక శ్రీవేంకటాద్రీశ నీదాసి-
నెటుచేసినా నీకు నితవేకాదా ॥పాప॥
kuTalamula beDabApi kOrina chanavulella
ghaTana jelliMchitivi ghanuDa nEnu
aTuganaka SrIvEMkaTAdrISa nIdAsi-
neTuchEsinA nIku nitavEkAdA ॥pApa॥
Word to Word meaning: కుటలములఁ (kuTalamula) =కప్పుకున్నవి (ఇక్కడ కప్పుకున్నవి అంటే కంటిమీద కప్పుకున్న అజ్ఞానపు పొరలు), coverings (here implied meaning is the dark layers of ignorance) బెడఁబాపి (beDabApi) = made to separate, made to disjoin; కోరిన చనవులెల్ల (kOrina chanavulella) = అభీష్టములెల్లా, ప్రేమలెల్లా, all that wished, all that beloved; ఘటనఁ జెల్లించితివి (ghaTana jelliMchitivi) = సంఘటిల్లఁజేయు, కూర్చు, integrated everything; ఘనుఁడ (ghanuDa) =great (here meaning, Blessed); నేను (nEnu) = me; అటుగనక (aTuganaka) = that side, that way; శ్రీవేంకటాద్రీశ (SrIvEMkaTAdrISa) నీదాసి (nIdAsi) = your servant; నెటుచేసినా (neTuchEsinA) = whatever you may do; నీకు (nIku) = to you; నితవేకాదా (nitavEkAdA) = is it not beneficial?-
Literal meaning: You separated me from these layers (of ignorance); I am blessed; and you amalgamated me (into the eternal formless existence). O lord Venkateswara! I am your servant and whatever you do to me is it not beneficial? (Yes, it is).
Explanation: Important word used is aTuganaka (అటుగనక) to indicate that the Lord not withstanding his present condition bestowed him benevolence. In his stanza, Annamacharya is describing the condition after submission, that's to allow the nature to take its own course. Such a person doesn't interfere with actions going on his body. It's a state when all the reaction has ceased.
When it was stated earlier that we aren't not in our natural state, means we are in a state of reaction to the external stimuli. When such reaction cases, man arrives in a state of true action. This is the state that Jiddu Krishnamurti explained in all of his talks from 1929 to 1986.
The layers ( kutalamulu = కుటలములు) mentioned by Annamacharya are same as was mentioned after centuries later by Jiddu Krishnamurti and Tyagaraja. They're speaking of what they have witnessed in that ir-recountable act of meditation. It's no accident that all three described those (ignorant) things as layers.
This submission of will is not a theoretical act but actually allow the nature to act on its own. This requires tremendous discipline and concentration to bring the physical body, mind, and the soul into unified action.
Most important thing said here is ghaTana jelliMchitivi (ఘటనఁ జెల్లించితివి) is to indicate that the fragmented existence has come to an end and Annamacharya could feel integration with the eternal. As proclaimed many times earlier, these poems are not written for consumption, but to light up the way for the true seekers.
Implied meaning: Surrender to the Lord. He shall take you out of these unfathomable depths of ignorance.
భావము: దైవమా! అటుగనక (అటు నా పాపములు గనక) కుటలములను (అజ్ఞానపు పొరలను) ఎడఁబాపి; సంఘటిల్లఁజేసితివి (నన్ను ఆ సమస్తము లోనికి చేర్చుకొంటివి). ఘనుని చేసితివి. శ్రీవేంకటాద్రీశ నీ దాసుని-ఎటుచేసినా నీకు హితవే కాదా?
వివరణము: అన్నమాచార్యులు ‘అటుగనక’ అని భగవంతుడు ఆతడి ప్రస్తుత స్థితిని పరిగణించకనే కృపను ప్రసాదించాడని అన్నారు. ఈ చరణంలో ఆత్మ సమర్పణ తర్వాత పరిస్థితిని వివరిస్తున్నారు. అది ప్రకృతి తన స్వంత మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించిన స్థితి. అలాంటి వ్యక్తి తన శరీరంలో జరిగే చర్యలకు అంతరాయం కలిగించడు. అన్ని ప్రతిచర్యలు ఆగిపోయిన స్థితి అది.
మనం మన సహజ స్థితిలో లేమని ముందే అనుకున్నాము. ప్రస్తుత స్థితిలో బాహ్య ఉద్దీపనలకు ప్రతిచర్యలు జరుపుతూ గడిపేస్తుంటామని అర్థం. అటువంటి ప్రతిచర్యలు లేని సందర్భాలలో, మనిషి సహజ స్థితికి చేరుకుంటాడు. జిడ్డు కృష్ణమూర్తి తన జీవితమంతా ఈ సహజ స్థితిని గురించి వివరించడానికే వెచ్చించారు.
ఈ ఆత్మ సమర్పణ అనేది సైద్ధాంతిక చర్య కాదు. కానీ వాస్తవానికి ప్రకృతి తనంతట తానుగా పనిచేయడానికి అనువైన వాతావరణం కల్పించడమే మనిషి తీసికోవలసిన ఒకే ఒక చర్య. భౌతిక శరీరాన్ని, మనస్సును మరియు ఆత్మను ఒకేతాటిపైకి తీసుకురావడానికి దీనికి అత్యంత కఠినమైన క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరం.
అన్నమాచార్యులు పేర్కొన్న (కుటాలములు =) పొరలు శతాబ్దాల తర్వాత జిడ్డు కృష్ణమూర్తి, త్యాగరాజులు ప్రస్తావించిన వాటి వంటివే. చెప్పనలవికాని ధ్యానము నుండి వారు గమనించిన వాటిని ఆ ముగ్గురు కూడా పొరలు గానే అభివర్ణించడం గమనార్హం.
ఇక్కడ చెప్పబడిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, 'ఘటనఁ జెల్లించితివి'= సంఘటిల్లఁజేసితివి = ఛిన్నాభిన్నమైన (ముక్కలు ముక్కలుగా వున్న) అస్తిత్వం ముగింపుకు వచ్చిందని మరియు అన్నమాచార్యులు శాశ్వతత్వంతో ఏకీకరణను అనుభవించారని సూచించడమైంది. ఇంతకుముందు చాలాసార్లు ప్రకటించినట్లుగా, ఈ కీర్తనలు చదివేసి, నాకు ఈ కీర్తన తెలుసు అని కాలర్ ఎగేసుకోవడనికి వ్రాయబడలేదు, నిజమైన అన్వేషకులకు మార్గాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మాత్రమే ఆన్నమయ్య కృషి చేశారు.
అన్వయార్ధము: దైవమునకు శరణాగతి కంటే వేరు మార్గములేదు. అతడే మిమ్మల్ని అజ్ఞానపు అగాథముల నుండి బయటకు తీయును.
Recommendations for further reading:
96. ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే (eduTa nevvaru lEru yiMtA vishNumayamE)
95. తహతహలిన్నిటికి తానే మూలము (tahatahalinniTiki tAnE mUlamu)
Summary of this Keertana:
I do not know what sin is. Neither do I know the results of virtuous acts. Aren’t these deeds have your consent? Implied meaning: O man, do not get trapped in the spiral of Good or Bad deeds. Rather find what is the Order of the lord to you.
Earlier you had left us here as signets of your material existence. These materials you made continuously befall on us one after the other (seeking our attention). Is it not disobeying your orders not to give into their demands? Implied meaning: O Man! These material things though appear like the marks of the god; though they continuously pressure you to surrender; yet impartially observe the reactions they are causing in you?
You handed me over a kingdom guarded by influential sentries called senses to rule to manage. Even if I ignore and disregard your (these) representatives, that may be construed as disobedience to you. Implied meaning: O man! Do not look down upon the kingdom guarded by influential sentries called senses. Do you know you are not the Lord of these?
You separated me from these layers (of ignorance); I am blessed; and you amalgamated me (into the eternal formless existence). O lord Venkateswara! I am your servant and whatever you do to me is it not beneficial? (Yes, it is). Implied meaning: Surrender to the Lord. He shall take you out of these unfathomable depths of ignorance.
కీర్తన సంగ్రహ భావము:
పాపమేదో ఎరగను. పుణ్యఫలమేదో ఎరగను. ఈ పనులన్నీ నీ ఆదేశముతోనే జరుగుతున్నవి కావా? అన్వయార్ధము: ఓ మానవుడా! మంచి లేదా చెడు పనుల వలయములలో చిక్కుకోవద్దు. బదులుగా దైవము నీకై ఇచ్చిన ఉత్తరవు ఏమిటో కనుగొనుము.
పూర్వము నుంచీ నీవు విషయములను నీ ముద్ర మానుసులఁగా అనిపింప చేసితివి? అవి ఒకటొకటిగా నామీఁద ఎప్పుడూ వాటికి లొంగిపోవాలని ఒత్తిడి పెంచుతూనే ఉన్నవి. అవి చెప్పినట్లఁ జేయకయున్న ఘనుఁడగు నీ యాజ్ఞ నేను ఉల్లంఘించుట కాదా? ( లొంగక ఏమి చేయను?) అన్వయార్ధము: మానవుడా నీకు విషయములు భగవంతుని ముద్ర మానుసులుగా అనిపించినప్పటికీ? అవి లొంగిపోవాలని ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, వాటికి తల వంచక నీలో కలిగించు ప్రతిచర్యలు నిష్పక్షపాతంగా గమనింప గలవా?
బలవంతులగు యింద్రియములు కాపులుగా ఉండిన వూరు నాకిచ్చితివ నుకున్నాను. వీటిని అలుసుగా తీసుకుని ఆదరించక ప్రక్కకు త్రోచివేసిన అది నీకు ద్రోహమే కాదా? అన్వయార్ధము: యింద్రియపుఁ గాఁపులుండిన వూరును అలుసుగా చూడక; నీవే యేలిక అనుకోక వుండాగలవా?
దైవమా! అటుగనక (అటు నా పాపములు గనక) కుటలములను (అజ్ఞానపు పొరలను) ఎడఁబాపి; సంఘటిల్లఁజేసితివి (నన్ను ఆ సమస్తము లోనికి చేర్చుకొంటివి). ఘనుని చేసితివి. శ్రీవేంకటాద్రీశ నీ దాసుని-ఎటుచేసినా నీకు హితవే కాదా? అన్వయార్ధము: దైవమునకు శరణాగతి కంటే వేరు మార్గములేదు. అతడే మిమ్మల్ని అజ్ఞానపు అగాథముల నుండి బయటకు తీయును.
Copper Leaf: 111-2 Volume 2-62