Monday, 31 May 2021

55. ఇదివో సంసారమెంత సుఖమో కాని (idivO saMsArameMta sukhamO kAni)

 ANNAMACHARYA

55. ఇదివో సంసారమెంత సుఖమో కాని 

Introduction:   In this striking verse, Annamacharya described desire and passion as sons for man.  Then his daughter virakti takes him from the abyss he lands in. As early as  500 years before,  Annamacharya advocated importance of daughter which we  are presently witnessing through administrative propaganda. 

The descriptions are amply clear and I believe this song shall make some to re-think. 

ఉపోద్ఘాతము: వింతపాటలో 'కామము” “మోహములు పుత్రులుగాను, 'విరక్తి' పుత్రికగాను పేర్కొనబడినవి. దుష్టుడైన కొడుకు కంటె గుణవతియైన కూతురే మేలన్నవిషయము దీనిచే గ్రాహ్యము. రొజున మనము ప్రభుత్వము వివిధ మాధ్యమాల ద్వారా  బాలికలను రక్షించమని చేస్తున్న ప్రచారం, ఆనాడే అన్నమయ్య చెప్పిరనుకోవచ్చు.  పాట కొంత మందినైనా ఆలోచింపచేస్తుం దనుకొందును. 

ఇదివో సంసారమెంత సుఖమో కాని

తుదలేని దుఃఖమను తొడవు గడియించె        ॥పల్లవి॥ 

idivO saMsArameMta sukhamO kAni

tudalEni du@hkhamanu toDavu gaDiyiMche          pallavi 

Word to Word Meaning: ఇదివో (idivO) = O man see here;  సంసారమెంత (saMsArameMta) = this family life is much సుఖమో కాని (sukhamO kAni) = cannot say how comfortable it is; తుదలేని (tudalEni) = never ending; దుఃఖమను (du@hkhamanu) = (sobriquet) another name for sorrow; తొడవు (toDavu) = భూషణము, ornament; గడియించె (gaDiyiMche) = bagged. 

Literal Meaning and Explanation: O man! Cannot say how comfortable family life is, but it bagged ornamental sobriquet for sorrow. 

భావము & వివరణము : ఇదిగో మానవుడా సంసారమును  సుఖమని చేపట్టితివి. దీనిలో సుఖమెంతో  కాని చివరికిది అంతులేని దుఃఖమను భూషణమునే సంపాదించినది. 

సంసారమంటే ఎంత సుఖమో కాని, అది చివరికి దుఃఖములనే ఆభరణములు పెట్టుకొన్న ఆడది అని గ్రహించండనిఒక పెద్ద మనిషి అననే అన్నాడు. 

అన్వయార్ధము: ఇదిగో మానవుడా నువ్వు  చేపట్టిన సంసారమెంత సుఖమో  కాని చివరికది దుఃఖమునకు మారుపేరైనది. 

పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చి

కొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగాను
మించి కామంబనేడిమేఁటి తనయుండు జని-
యించి దురితధనమెల్ల గడియించె     ॥ఇదివో॥ 

paMchEdriyaMbulanu pAtakulu danudechchi

koMchepu sukhaMbunaku gUrpagAnu
miMchi kAmaMbanEDimETi tanayuMDu jani-
yiMchi duritadhanamella gaDiyiMche idivO 

Word to Word Meaning: పంచేద్రియంబులను (paMchEdriyaMbulanu) = five sensory organs (eyes, ears, nose, tongue and skin);  పాతకులు (pAtakulu) = sinners, criminals; దనుఁదెచ్చి (danudechchi) = brought body;  కొంచెపు (koMchepu) =  a little; సుఖంబునకుఁ (sukhaMbunaku) = comfort;  గూర్పఁగాను (gUrpagAnu) = arranged; మించి (miMchi) =  beyond; కామంబనేడిమేఁటి (kAmaMbanEDimETi) = a thing known as desire;  తనయుండు (tanayuMDu) = as son; జనియించి (janiyiMchi)  = born; దురితధనమెల్ల (duritadhanamella) = sinned money; గడియించె (gaDiyiMche) = amssed 

Literal Meaning and Explanation: these five sensory organs gave man insignificant comforts but in return handed man over to the family life. Then he had a son called Desire.  That stubborn son earned loads of sin thru his action 

భావము & వివరణము : చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు చర్మములను ఐదింద్రియములనెడు పాపాత్ములు తన్ను పట్టుకొని వచ్చి స్వల్పాతి స్వల్పమైన సంసారసుఖమునకంట గట్టిరి. అంతట 'కామము' అను గడుసరి కొడుకు తనలో పుట్టి పెరిగి పాప మనెడు ధనమును కొల్లలుగా ఆర్జించినాడు. 

పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చి

మాయంపు సుఖమునకు మరుపఁగాను
సోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁ
బోయి యీనరకమనుపురము గడియించె       ॥ఇదివో॥ 

pAyamaniyeDi mahapAtakuDu tanu dechchi

mAyaMpu sukhamunaku marupagAnu
sOyagapu mOhamanu sutuDEchi guNamella
bOyi yInarakamanupuramu gaDiyiMche        idivO 

Word to Word Meaning: పాయమనియెడి (pAyamaniyeDi) = = ప్రాయము, యౌవనము అను,  the one named as  Youth, manhood; మహపాతకుఁడు = great sinner; (mahapAtakuDu) తనుఁ దెచ్చి (tanu dechchi) = brought body;   మాయంపు (mAyaMpu) = illusory;  సుఖమునకు (sukhamunaku) = comforts;  మరుపఁగాను (marupagAnu) = got used to;   సోయగపు (sOyagapu) = handsome, beautiful; మోహమను (mOhamanu )  = named as  passion; సుతుడు (sutuDu) = son;  ఏచి (Echi) = విజృంభించి, boomed; గుణమెల్లఁ (guNamella) = all good qualities; బోయి (bOyi) = lost;  యీనరకమనుపురము (yInarakamanupuramu) = this city of hell;  గడియించె (gaDiyiMche) = made man to land ( in return to his acts).

Literal Meaning and Explanation: The youth and manhood is another great sinner. It tricked man to get used to comforts. It gave man another son Passion. This fellow usurped all man’s good qualities and landed man in hell (as a return gift to his acts). 

భావము & వివరణము :  జవ్వన మనెడు మహాపాపాత్ముడు తన్ను గొని తెచ్చి మాయలమారి సంసారసుఖమునకు మరపినాడు. వెంటనే ముచ్చటైన 'మోహము' అనెడు కొడుకుపుట్టి పెద్దవాడై విజృంభించి తనలోనున్న గుణములనెల్ల హరించి తుదకు నరకమను పట్టణమును గడించినాడు.

అతియుండగువేంకటాద్రీశుఁడను మహ-

హితుఁడు చిత్తములోన నెనయఁగాను
మతిలోపల విరక్తిమగువ జనియించి య-
ప్రతియయి మోక్షసంపదలు గడియించె          ॥ఇదివో॥ 

atiyuMDaguvEMkaTAdrISuDanu maha-

hituDu chittamulOna nenayagAnu
matilOpala viraktimaguva janiyiMchi ya-
pratiyayi mOkshasaMpadalu gaDiyiMche     idivO 

Word to Word Meaning: అతియుండగు (atiyuMDagu) = Exceedingly great person;  వేంకటాద్రీశుఁడను (vEMkaTAdrISuDanu) = by name Lord Venkateswara;  మహహితుఁడు (mahahituDu) = great benefactor;  చిత్తములోన (chittamulOna) = in the mind;  నెనయఁగాను (nenayagAnu) = అనుకూలమగు, favourable;  మతిలోపల = (matilOpala)  in the intellect, in the consciousness;  విరక్తిమగువ (viraktimaguva) = lady named dispassion; జనియించి (janiyiMchi) = born; యప్రతియయి (yapratiyayi) = unmatched;  మోక్షసంపదలు (mOkshasaMpadalu) = wealth called liberation; గడియించె (gaDiyiMche) = made it happen. 

Literal Meaning and Explanation: Watching the plight of man, great lord Venkateswara with intention to help the man, gave him a daughter called Dispassion. Immediately following her birth, she created conducive feelings in conscious mind and able to overcome resistance with her unmatched conviction. Thus man got saved.

భావము & వివరణము : చివరికి వేంకటేశ్వరుడికి మానువుడిపై జాలి కలిగి 'విరక్తి' అనే మంచి కుమార్తెను పుట్టించి దయ చూపాడు. వాడి మనస్సులో అప్రతిహతమైన మోక్షమనే సంపదపై ధ్యాసకలిగించి వాడికి మోక్షమును విరక్తి అనే కూతురు సంపాదించి ఇచ్చింది. (లేకపోతే వాడిగతి అధోగతే).

With inputs from అన్నమాచార్య సంకీర్తనామృతము by డా. సముద్రాల లక్ష్మణయ్య

zadaz

 

 

Reference: Copper Leaf 50-5, volume: 1-308

Sunday, 30 May 2021

54. ఊరులేని పొలిమేర పేరు పెంపు లేని బ్రతుకు (UrulEni polimEra pEru peMpu lEni bratuku)

 ANNAMACHARYA

54. ఊరులేని పొలిమేర పేరు పెంపు లేని బ్రతుకు 

Introduction: I am tempted to insert this beautiful shrumgara (శృంగార) Keertana in serious philosophical presentations. Here, Annamacharya assuming the position of a lady-help is advising a beautiful young lady who is in deep love and awaiting Lord Venkateswara. Please read the counselling he gives to her. 

ఉపోద్ఘాతము: శృంగార కీర్తనలో ఒక అందమైన యువతికి,  అన్నమయ్య తనను ఒక స్త్రీగా ఊహించుకొని చెప్పు సందేశము.   యువతి వేంకటేశ్వరునికై ఆశగా నిరీక్షిస్తూ ఉంటుంది. అతడామెకిచ్చు  సలహా యేమిటో చూద్దాము. 

ఊరులేని పొలిమేర పేరు పెంపు లేని బ్రతుకు

గారవంబు లేని ప్రియము కదియనేఁటికే         ॥పల్లవి॥

 

UrulEni polimEra pEru peMpu lEni bratuku

gAravaMbu lEni priyamu kadiyanETikE        pallavi

 

Word to Word Meaning: ఊరులేని (UrulEni) = where no village/town exists; పొలిమేర (polimEra) = outskirts; పేరు (pEru) = name; పెంపు (peMpu) = development;  లేని (lEni) = without; బ్రతుకు (bratuku) = life;  గారవంబు (gAravaMbu) = dignity;  లేని (lEni) without; ప్రియము (priyamu)  = love; కదియనేఁటికే (kadiyanETikE) = Why advance closer

 

Literal Meaning and Explanation: My dear young lady “why are you waiting for a non-existent place (it is neither in the village, nor at the outskirts). Are you still not sure of nameless, prideless life? What a waste of time is this unreciprocated love?” (You are foolishly trying to possess pointless things in your heart) 

Implied meaning: O Lady do not expect borderless infinite and immeasurable movement called life/love (Lord Venkatesa) is only for you. 

భావము & వివరణము : ఊరు ఉంటే పొలిమేర ఉంటుంది. ఊరు లే పొలిమేర ఉండదు. పేరు మర్యాదలేని బ్రతుకు వ్యర్ధం కదా! గారవము లేని ప్రేమ నిరుపయోగమే. అటువంటి వాటి కోసము ఉవ్విళ్ళూరుతున్నావు.  (అమాయకురాలా నువ్వు అనవసరమైన దాన్ని గుండెల్లో ప్రియముగా దాచుకుంటున్నావు.). 

అన్వయార్ధము: ఓ అమ్మాయీ! పొలిమేరల్లేని  వెంకటేశుని (అనంత ప్రవాహమైన ఆ పరమాత్ముడి) ప్రేమ నీ ఒక్కదానకే అందుతుందనుకోకు.  

ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల

యెండలేని నాఁటి నీడ యేమిసేయనే
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల
రెండునొకటి గాని రచన ప్రియములేఁటికే      ॥ఊరు॥

 

uMDarAni virahavEdana vuMDani suratasukhamEla

yeMDalEni nATi nIDa yEmisEyanE
daMDigalugu tamakamaneDi daMDalEni tAlimEla
reMDunokaTi gAni rachana priyamulETikE Uru 

Word to Word Meaning: ఉండరాని (uMDarAni) = unbearable; విరహవేదన (virahavEdana) = విడిపోవుట యందు కలిగే బాధ​/క్షోభ​,  the pangs of separation from or absence of  love; వుండని (vuMDani) = non existent; సురతసుఖమేల (suratasukhamEla) =స్త్రీ పురుషుల కలయికలోని సుఖము, enojoyment in meeting;  యెండలేని నాఁటి  (yeMDalEni nATi) = on a clody day; నీడ (nIDa) = shade; యేమిసేయనే (yEmisEyanE) = what utility it is;  దండిగలుగు (daMDigalugu) = much that get generated;  తమకమనెడి (tamakamaneDi) eagerness, impatience; దండలేని (daMDalEni) = not near, not in proximity; తాలిమేల (tAlimEla) why Endurance/ patience; రెండునొకటి గాని (reMDunokaTi gAni) = both not in one another; రచన (rachana) = design ప్రియములేఁటికే       (priyamulETikE) = why do you love? 

Literal Meaning and Explanation: My dear young lady: your longing for the lord is understandable. Peculiarly, this pain of love becomes intolerable once you become aware of the impossibility of meeting your lover. What use is of shade on a cloudy day? Your lover is far away. Where this eagerness should dissipate to? Why should you fall in love, if not for being in oneness (with HIM)? 

Implied meaning: Stupid: this is your imagination that you are separate from him. Your feeling that you did not become one with him is just an illusion. Why do not you set aside your desires, these pangs of separation and have clear look at him. O moron!! When both your minds are one and the same, then there is no need to exhibit your passion. 

భావము & వివరణము : జవ్వని!! విడిపోవుట యందు కలిగే క్షోభ భరింపరానిదే! సమాగమము లేనప్పుడు అంతులేని విరహము దండుగ మారి వ్యవహరమే! కదా! యెండలేని నాఁటి నీడ ఉండి ప్రయోజనము లేనిదే? దండిగా ఉన్న తమకమునకు తాలిమితో పనియేమి? ఇద్దరు ఒక్కటి కాకపోయాక, ఎంత ప్రేమ వొలకబోసినా అదంతా యెందుకు? 

అన్వయార్ధము: పిచ్చిదానా! విడిపోయావని నువ్వనుకుంటివి. ఇద్దరు ఒక్కటి కాలేదని అనుకొంటావు. ఇదంతా నీ భ్రమ. నీ విరహన్ని, తమకాన్ని పక్కనబెట్టి, నీ మనస్సు అతనిలో కలిపి చూసావా? ఆ మనసులు రెండూ ఒక్కటి కాకపోయాక, ఇంత ప్రేమ వొలకబోయ డమెందుకో​? 

మెచ్చులేనిచోట మంచిమేలు గలిగీనేమి సెలవు

మచ్చికలేనిచోట మంచిమాటలేఁటికే
పెచ్చు పెరుగలేనిచోట ప్రియముగలిగి యేమిఫలము
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే     ॥ఊరు॥

 

mechchulEnichOTa maMchimElu galigInEmi selavu

machchikalEnichOTa maMchimATalETikE
pechchu perugalEnichOTa priyamugaligi yEmiphalamu
ichchalEninATi sobagulEmi sEyanE  Uru

Word to Word Meaning: మెచ్చులేనిచోట (mechchulEnichOTa) = where praise is absent;  మంచిమేలు (maMchimElu) = very favourable (situation);  గలిగీనేమి సెలవు (galigInEmi selavu) = what use is of happening;   మచ్చికలేనిచోట (machchikalEnichOTa) = at an unfamiliar place; మంచిమాటలేఁటికే (maMchimATalETikE) = why good words;  పెచ్చు  పెరుగలేనిచోట (pechchu  perugalEnichOTa) = హెచ్చుగా వర్ధిల్లని, (a thing with) not much growth; ప్రియముగలిగి (priyamugaligi) =having warmth ( in the heart);  యేమిఫలము (yEmiphalamu)  = what use?; ఇచ్చలేనినాటి (ichchalEninATi)  = where desires don’t rake up;  సొబగులేమి సేయనే (sobagulEmi sEyanE) = what use is of Beauty and prettiness? 

Literal Meaning and Explanation: Annamayya, making further in roads:  “Did he ever compliment your beauty? Do you really have such acquaintance to know his mind?  Why continue relationship wanting of admiration and love? I understand, he is rather impassive. What avail is of your beauty and prettiness with such one?” 

Implied meaning: O simpleton! don’t anticipate compliments from the embodiment of indifference. I do not think you know HIM who is as old as time. O drab!! Will you stop relationship with Him just for want of few words and strokes? O Silly!! What use is of your beauty and prettiness to HIM? (Wish for him deeply within your heart as if nothing else exists.).

భావము & వివరణము : అన్నమయ్య ఇంకొంచము ముందుకెళ్ళుతూ ఏమే! (నీ అందాలు చూచి) అతడు నిన్నెప్పుడైనా మెచ్చుకున్నాడా? నీకు (నిజంగా) అతని మనసు తెలియునంత పరిచయం ఉందా? మెచ్చు, పెచ్చు లేనిచోట మంచిమాటలేఁటికే? కోరికల్లేని వాడి మన్సులో నీ సొబగులేమి ఇచ్చ రేపునే? 

అన్వయార్ధము: పిచ్చిదానా! నిర్లిప్తతకు ప్రతియైన అతడు మెచ్చుకుంటా డనుకోకు. ఆదియనాది లేని వాడి మనసు తెలియునంత పరిచయం ఉందనుకోవచ్చా? మెచ్చు, పెచ్చు లేదని  మంచిమాటలాడ్డం వదిలేస్తావా? వెర్రిదానా! నీ సొబగులు చూపించి వాడిలో కోరికల్లేపలేవే! ( గాఢమైన ప్రేమతో అతడు తప్పించి వేరేమీ లేదని  తపించి చూడు)  

బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన

శంకలేక కదియలేని చనవులేఁటికే
కొంకుగొసరు లేని మంచికూటమలర నిట్లఁ గూడి
వేంకటాద్రివిభుఁడు లేని వేడుకేఁటికే       ॥ఊరు॥ 

boMkulEni chelimigAni poMdulEla manasulOna

SaMkalEka kadiyalEni chanavulE@MTikE
koMkugosaru lEni maMchikUTamalara niTla@M gUDi
vEMkaTAdrivibhu@MDu lEni vEDukE@MTikE         Uru 

బొంకులేని (boMkulEni) = without trace of falsehood;  చెలిమిగాని (chelimigAni) = is true friendship; పొందులేల (poMdulEla) = why to meet (physically);  మనసులోన (manasulOna) = in the mind; శంకలేక (SaMkalEka) = without doubt;  కదియలేని = (kadiyalEni) = that cannot bring close;  చనవులేఁటికే (chanavulETikE) = what use is of affection? కొంకుగొసరు లేని (koMkugosaru lEni) సంకోచము లేని, without Hesitation or reluctance; మంచికూటమలర (maMchikUTamalara) blossom into great assembly  నిట్లఁ (niTla) = this way; గూడి (gUDi) = joining;  వేంకటాద్రివిభుఁడు లేని (vEMkaTAdrivibhuDu lEni) without Lord Venkateswara;  వేడుకేఁటికే (vEDukETikE) = can there be celebration. 

Literal Meaning and Explanation: “Is it not that guileless friendship is his company! You blend into him keeping away those nagging doubts and differences in the mind. Your unconditional love will bring him close to you. Do not try to exhibit superficial affection.  Without fear and confusion take the name of Lord Venkatesa. All the multi-faceted effulgence is the  Lord himself.” 

Implied meaning: “DO not be silly!! He is aware of your insincerity and love. However, leaving all the doubts, fill him in your mind. He shall not fall to any trickery. Just submit to him with all your might.  There is no celebration without the ultimate.” 

భావము & వివరణము : కపటమేలేని స్నేహమే అతడి పొందు కాదా? మనస్సులో యేమాత్రం శంకలు అరమరికలు లేకుండా అతనితో కలసిపో. నీ ప్రేమే అతడిని దగ్గరకు తీస్తుంది.  కాని పై పై చనవులు (ఆప్యాయతలు) యెందుకు? కొంకుకొసరు లేని (భయము, సంకోచము లేనట్టి) మంచి భక్తితో శ్రీవేంకటేశ్వరుని వేడుకో. వేంకటాద్రివిభుఁడు లేని వేడుక ఎక్కడిదే? 

అన్వయార్ధము: నీ కపటాలు, నీ చెలిమి అతడికి తెలియవను కొంటున్నావా?  మనస్సులో యేమాత్రం శంకలు అరమరికలు లేకుండా అతనికి మనసిచ్చెయ్యి. పై పై ఆప్యాయతలకు అతడు పడిపోడు. ఇక భయము, సంకోచము  లేకుండా శ్రీవేంకటేశ్వరుని వేడుకో. శ్రీహరియే లేని వేడుకేఁమిటో?

 

zadaz

 

 

Reference: Copper Leaf 9-6, volume: 5-55

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...