Saturday, 9 April 2022

116. చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు (chavi nOri kEDa dettu saMpadEDa dettu)

 ANNAMACHARYA

 116. చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు

(chavi nOri kEDa dettu saMpadEDa dettu)

Live the Life Royal

                                                                                    

Introduction: Annamacharya in this incredibly great poem with beautiful rhythm is emphasising the need for absolute submission to God. 

He lambasts our casual approach to the God. In our ignorant ways we offer god what we value in life like money, gold and symbols of temporal authority. What a stupidity! Annamacharya says, Truly a man can offer to God is good behavior. Actually, that is living the Royal Life.’

Most significant statement made by Annamacharya is that vIni savariMchuTE nA saMpadidi gAdA (వీని సవరించుటే నా సంపదిది గాదా) implying It is man's responsibility to organise the bequeathed properties such as mind, senses, and knowledge. Instead of taking care of his work, he goes on to meddle with other’s affairs. Man creates anarchy and blames God. 

This verse may be termed as compression of entire Bhagavad-Gita into one single poem. It simply does not stop you from wondering what kind of magic compelled Annamacharya to pen such a sweet little poem. 

Finally, he declares that God is the only relation that accompanies man beyond the temporal existence. Of course, all his poems are incomparable, but this one, in particular, is one too many.

 

ఉపోద్ఘాతము: రచిపోలేని అందమైన లయతో కూడి, విస్మయము, వింతగొలుపు ఈ అద్భుతమైన ఈ కీర్తనలో అన్నమాచార్యులు మనిషి తనను తాను భగవంతుడికి సంపూర్ణంగా సమర్పించకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

అతడు దేవుని పట్ల మనకున్న నిర్లక్ష్య విధానాన్ని తప్పుబట్టాడు. మనము తెలివితక్కువకొద్దీ విలువైన వాటిని దేవుడికి సెలవుచేయబోయి ‘ధనము, బంగారము మరియు ప్రపంచముపై సాధించిన తాత్కాలిక అధికార ముద్రికల చిహ్నాలను’ సమర్పించి మనమేమిటో చెప్పకచెబుతాము. ఎంత మూర్ఖత్వం! “నిజంగా మనిషి భగవంతుడికి సత్ప్రవర్తనను మించి ఏమి అందించగలడు? వాస్తవానికి, అదే దొరలాగ జీవించడం." అంటారు అన్నమాచార్యులు.

 

'వీని సవరించుటే నా సంపదిది గాదా' అంటూ  అన్నమాచార్యులు మనస్సు, ఇంద్రియాలు మరియు జ్ఞానములను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ సరిదిద్దుకోవాలని (మనిషి) జీవితంలో నిర్వహించవలసిన విధిని స్పష్టం చేశారు. ఐతే మనిషి తన పనిని గమనించుకోకుండా, నిర్వర్తించకుండా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు. ఈ రకంగా మనిషే అరాచకం సృష్టించి దేవుణ్ణి నిందిస్తాడు. 

మొత్తం భగవద్గీతను ఒక చోట పేర్చి ఈ కీర్తన క్రింద కుదించారా అనిపిస్తుంది.  ఏ మత్తుమందు చల్లి ఏ మాయాజాలం చేసి అన్నమాచార్యులు ఈ  సీమటపాకాయ లాంటి చిన్ని కవితను మనకు అందించారో అని ఆలోచించకుండా ఉండలేరు. 

చివరగా, అన్నమాచార్యులు ఇహపరములలో మనిషికి తోడుగా ఉండే ఏకైక బంధువు దైవము అన్నారు. వాస్తవానికి, అన్నమయ్య కీర్తనలన్నీ సాటిలేనివే. వాటిలోనూ, ఈ కీర్తన చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

 

కీర్తన:

చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు వీని

సవరించుటే నా సంపదిది గాదా   ॥పల్లవి॥ 

పచ్చడా లెక్కడఁ దెత్తు పట్టుచీర లేడఁ దెత్తు

వెచ్చనిండ్లేడఁ దెత్తు వెంట వెంటను
తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట
వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా  ॥చవి॥

దొరతన మేడఁ దెత్తు దొడ్డసొమ్ము లేడఁ దెత్తు

యెరవులసిరుల నేనేడఁ దెత్తు
వెరవున నేనెవ్వరిని వేసరించఁజాలక
దరిచేరుటే దొరతనమిదిగాదా       ॥చవి॥ 

తోడఁబుట్టువుల నేడఁ దోడితెత్తుఁ జుట్టాల -

నేడఁ దెత్తు సుతులపొందేడఁ దెత్తును
వేడుకైనపొందు శ్రీవేంకటేశుఁ దలఁచుటే
ఈడులేనిబంధుకోటి ఈతఁడెకాఁడా           ॥చవి॥ 

chavi nOri kEDa dettu saMpadEDa dettu vIni

savariMchuTE nA saMpadidi gAdA        pallavi 

pachchaDA lekkaDa dettu paTTuchIra lEDa dettu

vechchaniMDlEDa dettu veMTa veMTanu
techchina yIpachchaDamu dEhamidi veMTaveMTa
vachchIgAka tannudAne vaddanagavachchunA chavi 

doratana mEDa dettu doDDasommu lEDa dettu

yeravulasirula nEnEDa dettu
veravuna nEnevvarini vEsariMchajAlaka
darichEruTE doratanamidigAdA chavi 

tODabuTTuvula nEDa dODitettu juTTAla -

nEDa dettu sutulapoMdEDa dettunu
vEDukainapoMdu SrIvEMkaTESu dalachuTE
IDulEnibaMdhukOTi ItaDekADA chavi

 

Details and Explanations:

 

చవి నోరి కేడఁ దెత్తు సంపదేడఁ దెత్తు వీని

సవరించుటే నా సంపదిది గాదా ॥పల్లవి॥

 

chavi nOri kEDa dettu saMpadEDa dettu vIni

savariMchuTE nA saMpadidi gAdA      ॥pallavi॥

 

Word to Word meaning: చవి (chavi) = రుచి, స్వాదము, అనుభూతి, taste, savour, perception, experience; నోరి (nOri) = to the mouth, to the lips;  కేడఁ (kEDa) = where, how; దెత్తు (dettu) = (I)  bring, usher; సంపదేడఁ (saMpadEDa) = wealth from where;   దెత్తు (dettu) = (I)  bring, usher; వీని (vIni) = these;  సవరించుటే (savariMchuTE) = only to rectify; only to correct, only putting them in order, only to adjust, only to prepare;  నా (nA) = my; సంపదిది (saMpadidi) = this wealth, these riches, this prosperity; గాదా (gAdA) = is it not?          

 

Literal meaning: How do I bring my experience to my lips? Where can I bring wealth to offer you? Is it not my prosperity to put the things (I already have) in order?

Explanation: This particular chorus has many aspects stuffed in it. By stating chavi nOri kEDa dettu (చవి నోరి కేడఁ దెత్తు) Annamacharya is saying it’s impossible to express the entire feelings one has. He is talking of an experience not put together by thought, not a conscious experience. How can one bring that to the fore?

 

Are there words to express how good a chocolate tastes? However hard one may try to articulate, still we fall short of the actual goodness of the chocolate taste in words. That the reason the food advertisement companies depend largely on facial expressions, not on words. Even for the case of mundane chocolate, we find it hard to describe.  Now ponder how to describe those inexpressible experiences of Annamacharya? 

Dear reader, please understand, Annamacharya did not write these poems for armchair enthusiasts. The magic, the indescribable He found made him restless, moved him so much that he penned those experiences so that we could benefit. 

What does he mean by vIni (వీని) = these? the five working senses (voice, hands, legs, genitals, and anus), the five knowledge senses (ears, eyes, tongue, skin, and nose), mind, intellect, ego, and prakṛiti (the primordial form of the material energy). We get to know and communicate with the world thru these. They provide data/information to the person.

Now let us consider the words of the last line. savariMchuTE nA saMpadidi gAdA (సవరించుటే నా సంపదిది గాదా) = literally means is it not wealth to put them in order. Here wealth means a body a property which we bequeathed. Keeping its upkeep in appropriate way is all the man should do. What kind of upkeep does it need? 

We feed body with too much food. Obviously, it throws up many symptoms and we spend lot of time in its upkeep. Of course, the physical body is not as treacherous as mind, intellect, ego, and prakṛiti are. The later really donot need any external upkeep, like the body requires. However, they do not stay neutral. They pull you away from truth as strong as they could. 

This Bhagavadgita verse aptly describing the activity of mind and the senses. इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते | तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि || 2-67|| {indriyāṇāṁ hi charatāṁ yan mano ’nuvidhīyate tadasya harati prajñāṁ vāyur nāvam ivāmbhasi Purport: Just as a strong wind sweeps a boat off its chartered course on the water, even one of the senses on which the mind focuses can lead the intellect astray}. 

We already learnt about the ways of mind from keertana kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu / yeMcharAdu paMcharAdu yeTTidO yImanasu (కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు / యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు. Meaning: The cruel mind can’t be polished or made to behave as you want. Neither we can judge its depth nor share what’s going on in the mind.) Thus, the mind is the most truculent of these adversities. How can a man put such mind in Order? Obviously, a humongous task. 

Here, Annamacharya is describing the work of a Yogi. He must maintain his stock well. Its common In India hear someone saying “Oh! He is a sanyasi. He has no work to do!”. Contrary to common understanding, it’s a strenuous work.  Whereas a common man ignoring his responsibilities, goes about meddling in others’ affairs. That’s why its no wonder Annamacharya said ‘saMpadEDa dettu’ (సంపదేడఁ దెత్తు) = where can I get wealth from? Means he has no time for other avocations and obviously has no avenues for income. 

Thus, to reach God, you do not need training, money, knowledge of the holy books and poetry. Complete attention in maintaining already received material. 

Implied meaning: O God! I am too naïve to praise you. You gave me so much baggage, I find it difficult to maintain. While I am so busy with these activities, where is the time to earn wealth and offer you? (You are too hard on me!) 

భావము: (నీ నామములోని రుచి అను) అనుభవాన్ని నా పెదవులపైకి ఎలా తెచ్చేది? నీ కివ్వడానికి సంపదను ఎక్కడది?  నీవిచ్చిన మనసు, మదమత్సరములను సంపదలను సవరించుటే గాదా నా పని?

వివరణము: ప్రత్యేకమైన పల్లవిలో అనేక అంశాలు అన్నమాచార్యులు ఇమిడ్చారు. చవి నోరి కేడఁ దెత్తు: మొట్టమొదటగా  ఒక వ్యక్తికి తనలో కలిగిన సాధారణ భావాలను కూడా పూర్తిగా వ్యక్తపరచడం కష్టం. అన్నమాచార్యులు ఆలోచనలను దాటి ఆవల కల, స్వానుభవం పరిధిలో లేని దాని గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి  దానిని ఏ  వ్యక్తియైనా తెరపైకి ఎలా తీసుకురాగలడు?

చాక్లెట్ రుచి ఎంత బాగుంటుందో చెప్పడానికి పదాలు ఉన్నాయా? ఎంత కష్టపడి ప్రయత్నించినా, చాక్లెట్ రుచి యొక్క అసలు సిసలైన అనుభవాన్ని మనం పదాలలో చెప్పలేక పోతాము. అందుకనే చాక్లెట్ కంపెనీలు ప్రకటనలలో ముఖకవళికల ద్వారా చెప్ప ప్రయత్నిస్తారు. మామూలు చాక్లెట్ విషయంలోనే ఇంత కష్టమైతే, గ్రాహ్యమునకు కూడా రాని, ఆ వర్ణించలేని అనుభవాలను అన్నమాచార్యులు ఎలా వివరించగలడో, చెప్పగలడో ఒక్కసారి ఆలోచించండి!

అన్నమాచార్యులు ఈ కీర్తనలను వాలుకుర్చీలో కూర్చుని సాయంత్రము వేరుశనక్కాయలు తింటూ కాలక్షేపంగా అస్వాదించేందుకు కోసం వ్రాయలేదు అని దయచేసి అర్థం చేసుకోండి. అతను కనుగొన్న మాయాజాలం, వర్ణించలేని దివ్యానుభవము అతనిలో అశాంతిని రేపి, అతన్ని ఎంతగానో కదిలించింది. తన అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా వ్రాసాడు. ఐదు శతాబ్ధాల తరువాత కూడా అవి ఎందరికో కనువిప్పు కలిగిస్తూనే ఉన్నాయి.

'వీని'  ద్వారా అన్నమాచార్యులు ఏమి సూచించారు? ఐదు కర్మేంద్రియములు (కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగములు మరియు గుదము), ఐదు జ్ఞానేంద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, మరియు ముక్కు), మనస్సు, బుద్ధి, అహంకారము, మరియు ప్రకృతి (భౌతిక శక్తి యొక్క ఆదిమ స్వరూపము). భగవానుడు దశైకం చ (పది+ఒకటి) అన్న పదాన్ని పదకొండు ఇంద్రియములను సూచించటానికి ఉపయోగించాడు. 

చివరి పంక్తి "సవరించుటే నా సంపదిది గాదా"తో ఏమి అనబోయారో ఆలోచింతము.  ఇక్కడ సంపద అంటే శరీరం మనకు ప్రాప్తించిన ఆస్తి. దానిని తగు విధంగా నిర్వహించడమే మనిషి చేయగలిగినది. దానికి ఎటువంటి పోషణ, సంరక్షణ, నిర్వహణ కావాలో చూతము. 

అన్నమాచార్యులు దేహమును  బ్బుఁగవణంబు = {బ్బుఁ=స్థూలమైన, కవణంబు = గుఱ్ఱము మొదలగువాని యొక్క ఉలవలు లోనుగాఁగల భక్ష్యము}, స్థూలమైన మృగ భక్ష్యము; (అన్వయార్ధము: స్థూలమైన ఇంద్రియానుభవమే అని అన్నారు. (చూడరెవ్వరు దీని సోద్యంబు పరికించి అనే కీర్తనలో). 

మనము దానిని  కొంచెం ఎక్కువే ఆహారంతో దేహమును పోషించబోతాము. సహజంగానే, ఇది అనేక లక్షణాలను, చిహ్నాలను, సూచనలనూ పొడచూపుతుంది. మనము దాని నిర్వహణలో చాలా సమయాన్ని వెచ్చిస్తాము. 

కానీ మనస్సు, బుద్ధి, అహంకారం మరియు ప్రకృతిలకు నిజంగా నిర్వహణ అవసరం లేదు. అయితే, అవి తటస్థంగా ఉండవు. అవి మిమ్మల్ని వీలైనంత బలంగా తమ వైపు లాక్కొన చుస్తాయి. 

ఇదే విషయాన్ని చెబుతున్న భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని చూడండి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే । తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి (2-67) ఇంద్రియములను స్వాధీనం చేసుకుందామని, వాటి ఆలోచనే మనసులో నింపితే, ఆ మనసులోని ఆత్మధ్యానము పోతుంది. గాలివాటుకు నావ  గమ్యము తప్పినట్లే, స్వాధీనంలేని మనస్సు విషయములందే నిన్ను ముంచివుంచును. గమ్యమునుండి భ్రష్టమైన ఆ సాధకుణ్ణి, సంసారమను ఐహిక విషయాలలో ముంచును. 

అన్నమయ్య మనస్సు యొక్క వికృత స్వభావాన్ని వివరిస్తూ ఇలా అన్నారు. ‘కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు / యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు’ (మనిషి మనస్సు కంచూ కాదు, పెంపుడు జంతువులా పెంచడానికీ రాదు, చాలా కఠినమైనది, అది యేమో కూడా తెలియదు, ఇతరులతో పంచడానికీ వీలులేదు). ఈ విధంగా, మనిషికున్న ప్రతికూలతలలో ఈ మనస్సు అత్యంత చురుకైనది. అలాంటి మనసును మనిషి ఎలా క్రమబద్ధీకరించగలడు? సహజంగానే, ఒక భారీ పని. 

ఇక్కడ, అన్నమాచార్యులు ఒక యోగి యొక్క నీయమిత కార్యమును వివరిస్తున్నాడు. అతను తన సంపదగా వచ్చిన దేహమును సమర్ధవంతంగా నిర్వహించాలి. మన ఊళ్ళలో “వాడు సన్యాసి రా. చేయడానికేం పని లేదు!” అంటూవుంటాం. కానీ అది చాలా శ్రమతో కూడుకున్న పని గ్రహించము. ఇటువంటి ఆపోహలతో ఒక సామాన్యుడు తన బాధ్యతలను విస్మరించి, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు. అన్నమాచార్యులు 'సంపదేడఁ దెత్తు' అంటే అట్టివానికి ఇతర కార్యకలాపాలకు సమయం లేదు కాబట్టి స్పష్టంగా ఆదాయ మార్గాలు లేవు అని చెప్పారు. 

కాబట్టి, భగవంతుడిని చేరుకోవడానికి, మీకు శిక్షణ, డబ్బు, పవిత్ర గ్రంథముల జ్ఞానం మరియు కవిత్వము అవసరం లేదు. పూర్తి శ్రద్ధ మాత్రమే దీనికి అవసరం. 

అన్వయార్ధము: ఓ దేవా! నిన్ను స్తుతించడానికి నేను చాలను. (చాలా అవివేకిని). మీరిచ్చిన సంపదను నిర్వహించడం కష్టంగా ఉంది. నేను ఈ కార్యకలాపాలతో సతమతమైపోతుంటే, సంపదన ఎక్కడ ఉంటుంది? (నీవు చాలా కఠినమైన వాడివి!)

 

పచ్చడా లెక్కడఁ దెత్తు పట్టుచీర లేడఁ దెత్తు

వెచ్చనిండ్లేడఁ దెత్తు వెంట వెంటను

తెచ్చిన యీపచ్చడము దేహమిది వెంటవెంట

వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా       ॥చవి॥

 

pachchaDA lekkaDa dettu paTTuchIra lEDa dettu

vechchaniMDlEDa dettu veMTa veMTanu

techchina yIpachchaDamu dEhamidi veMTaveMTa

vachchIgAka tannudAne vaddanagavachchunA chavi 

Word to Word meaning: పచ్చడా (pachchaDA) = దుప్పటి లేక​ శాలువా, A bed sheet or  Shawl; లెక్కడఁ (lekkaDa) = where (from); దెత్తు (dettu) = (I)  bring, usher;  పట్టుచీర (paTTuchIra) =Silk cloths;  లేడఁ (lEDa) = where ( from); దెత్తు (dettu) = (I) bring, usher;  వెచ్చనిండ్లేడఁ (vechchaniMDlEDa) = from where warm houses;  దెత్తు (dettu) = (I) bring, usher; వెంట వెంటను (veMTa veMTanu) = along with me; తెచ్చిన (techchina) = the one brought;  యీపచ్చడము (yIpachchaDamu) = this bead sheet; దేహమిది (dEhamidi) = my body; వెంటవెంట (veMTaveMTa) = always follow; వచ్చీఁగాక (vachchIgAka) = follow (invariably);  తన్నుఁదానె (tannudAne) = how can I for myself; వద్దనఁగవచ్చునా (vaddanagavachchunA)          = deny. 

Literal meaning: How can I bring the shawls or silk clothes or houses? All that I could bring is myself. This bedsheet (euphemistically called body) I bought cannot be separated from me, it always follows me. 

Explanation: Implies that do not follow others. They may offer many things to God. But having the God (or truth) in the heart is all that matters. Such a one may stand first in the queue at the temple. He may not visit temple. The one who is already true in his heart, he is never far from the God. 

Similar view was expressed in the verse below. jagamulOkula jUchi jaragedanaMTE jagamulu nImAyajanakamulu (జగములోకులఁ జూచి జరగెదనంటే / జగములు నీమాయ జనకములు). If I follow the people of the world, again they are only an illusion created by you. (Hence, I find it is better to follow it’s the creator of illusion). 

Obviously Annamacharya is offering the best a man could offer. What use is of any other offering to God? Of course, this offering is not a lip service. Such a person will allow the nature (the part of God) to act on body as if he himself is a non actor and remain observer. (refer to the explanation of verse pApa me~raganu puNyaphala me~raganu పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను) 

Dear Reader, do not take this submission to be easy. It’s the most arduous task a man could undertake in his life. Yet, the knottiest thing is it must be achieved with out effort. Thus, Annamacharya said these two apparently contradictory statements can be met only when sahajAna nUrakunna saMtatamu sukhamu (సహజాన నూరకున్న సంతతము సుఖము) staying naturally quiet. Ostensibly this is the easiest thing a man can do, yet millions (if not billions) fail to act according to this simple thing. 

This subject of God has been intensely searched (and contested). Please recognise that it is so difficult to stay absolutely neutral. Millions have made efforts, still making efforts, without grasping that “the very effort, is the negation of the truth”. Friends! This task {of vIni savariMchuTE (వీని సవరించుటే)} is what keeps a yogi fully occupied. The claims by many that ‘I have seen God’, ‘I have found God’ are all conscious experiences, forming part of the material knowledge, therefore are adding to ignorance and confusion in this world. 

Implied meaning: Sir, I come empty Handed. All that I could submit you is myself and my body (for forces of nature to act at their will).

భావము: నేను శాలువాలు లేదా పట్టు వస్త్రాలు లేదా ఇళ్లను ఎలా తీసుకురాగలను? నేను తీసుకురాగలిగినదంతా నన్నే. నాతో వచ్చిన ఈ దుప్పటి (సభ్యోక్తిగా దేహము అని పిలుస్తారు) నా నుండి వేరు చేయబడలేదు కాబట్టి ఎల్లప్పుడూ నన్ను అనుసరిస్తుంది. 

వివరణము: ఈ చరణము ఇతరులను అనుసరించవద్దు అని సూచిస్తుంది. వారు దేవునికి అనేక వస్తువులను సమర్పించవచ్చు. కానీ తన హృదయంలో సత్యమును దర్శించుచున్నవాడు, ఎప్పుడూ దైవమునకు దూరంగా ఉండడు. అలాంటి వాడు గుడి వద్ద వరుసలో ముందుగా నిలబడకపోవచ్చు. అసలు అతడు ఆలయాన్ని సందర్శించకపోవచ్చు. 

ఒక మనిషి సహజంగా సమర్పించగల అత్యుత్తమమైన దాని గురించే అన్నమాచార్యులు చెబుతున్నాడు. భగవంతునికి వేరేవి నివేదించడం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ సమర్పణ నామమాత్రపు సేవ అయితే కాదు.  అది ప్రకృతి తనకైతాను స్వంత మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించిన స్థితి. అలాంటి వ్యక్తి తన శరీరంలో ప్రకృతి వలన జరిగే చర్యలను గమనించీ వాటిలో జోక్యము చేసుకోడు. అన్ని ప్రతిచర్యలు ఆగిపోయిన స్థితి అది 

పాఠకులారా, ఈ సమర్పణను తేలికగా తీసుకోకండి. ఒక మనిషి తన జీవితంలో సాధించగలిగే అత్యంత కఠినమైన పని అది. వింతైన విషయం ఏమిటంటే అదీ శ్రమ లేకుండా సాధించాలి. ఈ పరస్పర విరుద్ధమైన నిబంధనలకు ఒకే పరిష్కారము, అదే అన్నమాచార్యులు తరచు పేర్కొనే "సహజాన నూరకున్న సంతతము సుఖము"  (= ఒకడు ఎప్పటికప్పుడు తనలో కలుగు ప్రతిచర్యలను  అతి జాగరూకతతో గమనించియూ సహజముగా ఊరకున్న చాలు) అన్నారు. ఇది మనిషి చేయగలిగే ‘అతి సులభమైన పని’ అని అనిపించిప్పటికీ లక్షలాది మంది (కోట్లాది కాకపోయినా) ఈ సాధారణ విషయాన్ని అనుసరించడంలో విఫలమవుతారు.  

అతి పురాతన కాలము నుండీ ఈ దేవుడనే విషయం తీవ్రంగా పరిశోధించబడింది (& వివాదాస్పదమైనది). దయచేసి పూర్తిగా తటస్థంగా ఉండటం చాలా కష్టమని గుర్తించండి. లక్షలాది మంది ప్రయత్నాలు చేసారు, ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఆ ప్రయత్నమే సత్య నిరాకరణ అని గ్రహించకుండా. జనులారా! ఈ పల్లవిలో పేర్కొన్న​ 'సవరించుట' అనుపని ఒక యోగి సమయము నంతా పూర్తిగా ఆక్రమించి ఉంచుతుంది. ‘నేను భగవంతుడిని చూశాను’, ‘భగవంతుడిని కనుగొన్నాను’ అని చాలా మంది చేస్తున్న వాదనలు అన్నీ బాహ్యప్రజ్ఞ లోని అనుభవాలు; అవి భౌతిక విషయ పరిజ్ఞానంలో భాగం, కాబట్టి అవి అజ్ఞాన జనితములని భావము.   

అన్వయార్ధము: దేవుడా! నేను ఖాళీ చేతులతో వచ్చాను. నేను ఇచ్చుకోగలిగినదంతా నేను, నా శరీరం మాత్రమే (ఇక ప్రకృతి శక్తులు వాటిమీద ఇష్టానుసారం పనిచేయ వచ్చు).

 

దొరతన మేడఁ దెత్తు దొడ్డసొమ్ము లేడఁ దెత్తు

యెరవులసిరుల నేనేడఁ దెత్తు

వెరవున నేనెవ్వరిని వేసరించఁజాలక

దరిచేరుటే దొరతనమిదిగాదా      ॥చవి॥

 

doratana mEDa dettu doDDasommu lEDa dettu

yeravulasirula nEnEDa dettu

veravuna nEnevvarini vEsariMchajAlaka

darichEruTE doratanamidigAdA            chavi

 

Word to Word meaning: దొరతన (doratana) = ప్రభుత్వము,  రాజత్వము,  అధికారము, పాలనము, Governance, rule, reign; మేడఁ (mEDa) = from where;  దెత్తు (dettu) = bring, usher; దొడ్డసొమ్ము (doDDasommu) = Costly gifts;  లేడఁ (lEDa) = from where; దెత్తు (dettu) = bring, usher;  యెరవులసిరుల (yeravulasirula) = క్షణికమైన సిరులు, (Transient)  Momentary Wealth; నేనేడఁ (nEnEDa) = I from where; దెత్తు (dettu)  = bring, usher; వెరవున (veravuna) = by way, by method; నేనెవ్వరిని (nEnevvarini) = to anyone;  వేసరించఁజాలక (vEsariMchajAlaka) = శ్రమపఱచ కుండా, బాధించ కుండా, without causing trouble;  దరిచేరుటే (darichEruTE) = reaching the shore; దొరతనమిదిగాదా (doratanamidigAdA)     =అదే రాజసము కాదా?, is it not the royal way; 

Literal meaning: I am not an official. Neither Can I bring costly gifts. Nor can I bring wealth. If I reached you without causing trouble to my fellow beings, don’t you think, it’s the royal way? 

 

Explanation: One may not get food. One may have to perform tough task. Notwithstanding the trying circumstances, one must retain his good behaviour. t's not only your words, it's your entire body speaks what you have in the mind. Now see this beautiful shloka from Hitopadesam:  thus dear Firend, one can't hide what one has in mind despite talking sweet through the tongue.

आकारैरिंगितैर्गत्या चेष्टया भाषणेन चनेत्रवक्त्रविकारैश्च लक्ष्यते अंतर्गतं मनः ॥ (- पञ्चतंत्र, मित्रभेद-50) AkAraiH ingitaiH gatyA cheShTayA bhAShaNena cha । netravaktravikAraiH lakShyate antargatam manaH ॥ - panchatantra, mitrabhedam. Purport: Shape Assignation, Style of Walk, Manner of action, Phrases in your words, eys and face reveal your inner feelings. (The sloka is also referred in Udyog Parvamu of Mahabharatam)

Also refer to the biblical quote below: For the word of God is alive and active. Sharper than any double-edged sword, it penetrates even to dividing soul and spirit, joints and marrow; it judges the thoughts and attitudes of the heart. (Hebrews 4:12)

Nothing in all creation is hidden from God’s sight. Everything is uncovered and laid bare before the eyes of him to whom we must give account. (Hebrews 4: 13)

Therefore, this behaviour must be Internalized, not practiced to get stamped as a good person in this temporal world, but actually being nice in behaviour at the core. It shall be inseparable like skin. 

Implied meaning: O God! We're not sure what you're expecting. Try to offer costly gifts, wealth, signets, and sceptres in our insignificant ways. You actually expect us to treat other people with respect. The only gift you want is to reach you without causing harm to anyone. That is truly the life of a king. 

భావము: దొరతన మేడఁ దెత్తు. దొడ్డసొమ్ము లేడఁ దెత్తు. (క్షణికమైన సిరులు) యెరవులసిరుల నేనేడఁ దెత్తు. జీవనోపాయ యుక్తముగా నేనెవ్వరిని శ్రమపఱచ కుండా, బాధించ కుండా నీ దరి చేరడమే దొరతనము గాదా?

 

వివరణము: ఆహారం లభించకపోవచ్చు. ఒక కఠినమైన పని లభించవచ్చు (చేయవలసి రావచ్చు). క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పటికీ, వ్యక్తి తన సత్ప్రవర్తనను, సద్భాషణమును నిలుపుకోవాలి. మాటలే కాదు, మొత్తము దేహము నందలి ప్రతి భాగము మనసులో   వ్యక్తమగు భావనలను ప్రస్పుటంగా ప్రతిబింబించును. కావున మనసున లేని సుహృద్భావమును బలవంతముగా పెదవుల మీదకు తెచ్చుకొనీ ప్రయోజనము లేదు. హితోపదేశం-మిత్రభేదంలోని క్రింద శ్లోకమును చూడండి.

శ్లో || ఆకారైరింగితై ర్గత్యా చేష్టయా భాషణేన చ
నేత్ర వక్త్ర వికారేణ లక్ష్యతే౽న్తర్గతం మనః.

భావము: ఆకారము, సంకేతము, నడక, చేష్ట, మాట, నేత్ర, ముఖ వికారములచే మనస్సులో తలచునది (ఇతరులకు) తెలియును.

కాబట్టి ప్రవర్తన ప్రపంచంలో మంచివాడుగా చలామణి అగుటకు ధరించు అంగ వస్త్రములా కాకుండా, నీ నుంచి వేరు చేయలేని చర్మములా స్వంతము చేసుకోమని అంతరార్థం. ఇదే విషయమును విశదపరచు చున్న బైబిలు లోని క్రింది వాక్యములను పరిశీలించండి.

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4-12)

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. (హెబ్రీయులకు 4-13) 

అన్వయార్ధము: ఓ దేవా! నీవు ఏమి కోరుకుంటావో మాకు అర్థం కాదు. మా అల్పమైన బుద్ధికి తోచిన ఖరీదైన బహుమతులను, సంపదలను రాజముద్రికలను, మరియు  రాజదండాలను సమర్పించడానికి ప్రయత్నిస్తాము. మేము తోటి జీవులతో మంచిగా ప్రవర్తించాలని నిజంగా నీవు ఆశిస్తావు. ఎవరికీ హాని చేయకుండా నిన్ను చేరుకోవడమే నీవు కోరుకునే ఏకైక బహుమతి. అదే కదా అసలైన రాచరిక జీవితం. 

 

తోడఁబుట్టువుల నేడఁ దోడితెత్తుఁ జుట్టాల -

నేడఁ దెత్తు సుతులపొందేడఁ దెత్తును

వేడుకైనపొందు శ్రీవేంకటేశుఁ దలఁచుటే

ఈడులేనిబంధుకోటి ఈతఁడెకాఁడా        ॥చవి॥

 

tODabuTTuvula nEDa dODitettu juTTAla -

nEDa dettu sutulapoMdEDa dettunu

vEDukainapoMdu SrIvEMkaTESu dalachuTE

IDulEnibaMdhukOTi ItaDekADA chavi

 

Word to Word meaning: తోడఁబుట్టువుల (tODabuTTuvula) = siblings; నేడఁ (nEDa) = where; దోడితెత్తుఁ (dODitettu) = bring along;  జుట్టాల - (juTTAla) = relations;  నేడఁ (nEDa) = where; దెత్తు (dettu)  =(I) bring, usher; సుతులపొందేడఁ (sutulapoMdEDa) = how do my children; దెత్తును (dettunu) = (I) bring; వేడుకైనపొందు (vEDukainapoMdu) = delightful union; శ్రీవేంకటేశుఁ (SrIvEMkaTESu) = Lord Venkateswara; దలఁచుటే (dalachuTE) = considering, regarding; ఈడులేనిబంధుకోటి (IDulEnibaMdhukOTi) = ageless close relation; ఈతఁడెకాఁడా (ItaDekADA)  = is he not. 

Literal meaning: O God! I cannot bring my siblings or my relations or my children to submit to you. O Lord! Is it not the most delightful union to regard you as my only relation in this world, in the next and forever? 

 

Explanation: What is relationship? Is the fundamental question we need to answer. Let us listen directly from Jiddu Krishnamurti as below. 

So, there can be understanding only when the mind is silently aware, observing - which is arduous, because we take delight in being active, in being restless, critical, in condemning, justifying. That is our whole structure of being; and through the screen of ideas, prejudices, points of view, experiences, memories, we try to understand. 

Is it possible to be free of all these screens, and so understand directly? Surely, we do that when the problem is very intense; we do not go through all these methods - we approach it directly. So, the understanding of relationship comes only when this process of self-criticism is understood, and the mind is quiet. If you are listening to me and are trying to follow, with not too great an effort, what I wish to convey, then there is a possibility of our understanding each other. (Public Talk 10 Ojai, California, USA - 14 August 1949). 

Very often, you will find that Annamacharya said parents, wife and children are the first set of aberrations one must overcome. Infallibility of physical evidence distracts man. Therefore, question of true relationship one needs to deep dives into what forms self and its impermanency. 

Annamacharya is referring to a relationship that extends beyond this world's boundaries. That is something beyond knowing.     

Implied meaning: I am ignorant on true relationship. O God! Are you not the true and the only relation that survives beyond this temporal existence? 

భావము: తోబుట్టువులను, చుట్టాలను, సుతులను నీ వేడుకైన పొందునకు కైంకర్యమునకు తీసికురాలేను.  వారికి శ్రీవేంకటేశుడే ఈడులేని బంధుకోటి ఈతడని తలపింపలేను. 

వివరణము: దీనిని వివరించటానికి జిడ్డు కృష్ణమూర్తిగారి క్రింది సందేశమును చూడండి. “ఆలోచన స్వేచ్ఛగా మరియు అడ్డంకులు లేకుండా ఉన్నప్పుడే చర్య యొక్క పూర్తి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోగలుగుతాము. మనకు మనంగా సృష్టించుకున్న తప్పుడు భ్రమలు, భావనలను విలువలను స్పష్టంగా చూడగలిగినప్పుడు, వాటి భారం మన మీద​, లేనప్పుడు జీవితం యొక్క ప్రవాహమే చర్య అని తెలుసుకుంటారు. కూడపేట్టటమే ఆశయముగా  గల ఆలోచనలు, వాని  నిర్మాణమును, మీరు వ్యక్తిగతంగా గుర్తించడం ప్రారంభించాలి.”

“కానీ ఈ అవరోధం లేని చర్య యొక్క పారవశ్యాన్ని గ్రహించాలంటే, ఆలోచనను ఆదర్శాల సంకెళ్ళ నుండి, మూసకట్టు నుండి బయట పడెయ్యాలి. ఆ అధారములేని అనిశ్చితిని మేల్కొల్పాలి. ఎంపిక లేని మనస్సుతో విచారణ చేయగలిగినప్పుడే, చర్య యొక్క మైమఱచు ఆనందము తెలియును.” (ఓజై, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రములు, 14 ఆగస్ట్ 1949)

చాలా తరచుగా, తల్లిదండ్రులు, భార్య మరియు పిల్లలు తప్పక అధిగమించాల్సిన మొట్టమొదటి మెట్టు అని అన్నమాచార్యులు చెప్పినట్లు మీకు విదితమే. కన్నులెదిటి సాక్ష్యం ఎంతటివారినైనా తప్పులో కాలు వేయిస్తుంది. కాబట్టి, నిజమైన సంబంధాన్ని శోధించుటకు స్వీయము మరియు దాని అశాశ్వత రూపాలను లోతుగా విచారించాలి.

అన్నమాచార్యులు ఈ ప్రపంచపు హద్దులు దాటి విస్తరించిన సంబంధాన్ని సూచిస్తున్నాడు. అది తెలుసుకోలేని విషయం.

అన్వయార్ధము: అసలైన​ సంబంధమేమో మాకు తెలియదు. ఓ దేవా! ఈ తాత్కాలిక అస్తిత్వాన్ని దాటి జీవించి ఉండే ఏకైక సంబంధం నీవే కాదా?

 

Recommendations for further reading:

15. కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు (kaMchUM gAdu peMchU gAdu kaDubeluchu manasu)

113. పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను (pApa me~raganu puNyaphala me~raganu)

95. తహతహలిన్నిటికి తానే మూలము (tahatahalinniTiki tAnE mUlamu)

46 మొదలుండఁ గొనలకు - మోచి నీళ్ళు వోయవేల (modaluMDa gonalaku mOchi nILLuvOyanEla)

 

 

Summary of this Keertana:

 

How do I bring my experience to my lips? Where can I bring wealth to offer you? Is it not my prosperity to put the things (I already have) in order? Implied meaning: O God! I am too naïve to praise you. You gave me so much baggage, I find it difficult to maintain. While I am so busy with these activities, where is the time to earn wealth and offer you? (You are too hard on me!)

 

How can I bring the shawls or silk clothes or houses? All that I could bring is myself. This bedsheet (euphemistically called body) I bought cannot be separated from me, it always follows me. Implied meaning: Sir, I come empty Handed. All that I could submit you is myself and my body (for forces of nature to act at their will).

 

I am not an official. Neither Can I bring costly gifts. Nor can I bring wealth. If I reached you without causing trouble to my fellow beings, don’t you think, it’s the royal way?  Implied meaning: O God! We're not sure what you're expecting. Try to offer costly gifts, wealth, signets, and sceptres in our insignificant ways. You actually expect us to treat other people with respect. The only gift you want is to reach you without causing harm to anyone. That is truly the life of a king.

 

O God! I cannot bring my siblings or my relations or my children to submit to you. O Lord! Is it not the most delightful union to regard you as my only relation in this world, in the next and forever? Implied meaning: I am ignorant on true relationship. O God! Are you not the true and the only relation that survives beyond this temporal existence?


 

కీర్తన సంగ్రహ భావము:

 

(నీ నామములోని రుచి అను) అనుభవాన్ని నా పెదవులపైకి ఎలా తెచ్చేది? నీ కివ్వడానికి సంపదను ఎక్కడది?  నీవిచ్చిన మనసు, మదమత్సరములను సంపదలను సవరించుటే గాదా నా పని? అన్వయార్ధము: ఓ దేవా! నిన్ను స్తుతించడానికి నేను చాలను. (చాలా అవివేకిని). మీరిచ్చిన సంపదను నిర్వహించడం కష్టంగా ఉంది. నేను ఈ కార్యకలాపాలతో సతమతమైపోతుంటే, సంపదన ఎక్కడ ఉంటుంది? (నీవు చాలా కఠినమైన వాడివి!)

 

నేను శాలువాలు లేదా పట్టు వస్త్రాలు లేదా ఇళ్లను ఎలా తీసుకురాగలను? నేను తీసుకురాగలిగినదంతా నన్నే. నాతో వచ్చిన ఈ దుప్పటి (సభ్యోక్తిగా దేహము అని పిలుస్తారు) నా నుండి వేరు చేయబడలేదు కాబట్టి ఎల్లప్పుడూ నన్ను అనుసరిస్తుంది. అన్వయార్ధము: దేవుడా! నేను ఖాళీ చేతులతో వచ్చాను. నేను ఇచ్చుకోగలిగినదంతా నేను, నా శరీరం మాత్రమే (ఇక ప్రకృతి శక్తులు వాటిమీద ఇష్టానుసారం పనిచేయ వచ్చు).

దొరతన మేడఁ దెత్తు. దొడ్డసొమ్ము లేడఁ దెత్తు. (క్షణికమైన సిరులు) యెరవులసిరుల నేనేడఁ దెత్తు. జీవనోపాయ యుక్తముగా నేనెవ్వరిని శ్రమపఱచ కుండా, బాధించ కుండా నీ దరి చేరడమే దొరతనము గాదా? అన్వయార్ధము:  ఓ దేవా! నీవు ఏమి కోరుకుంటావో మాకు అర్థం కాదు. మా అల్పమైన బుద్ధికి తోచిన ఖరీదైన బహుమతులను, సంపదలను రాజముద్రికలను, మరియు  రాజదండాలను సమర్పించడానికి ప్రయత్నిస్తాము. మేము తోటి జీవులతో మంచిగా ప్రవర్తించాలని నిజంగా నీవు ఆశిస్తావు. ఎవరికీ హాని చేయకుండా నిన్ను చేరుకోవడమే నీవు కోరుకునే ఏకైక బహుమతి. అదే కదా అసలైన రాచరిక జీవితం.

తోబుట్టువులను, చుట్టాలను, సుతులను నీ వేడుకైన పొందునకు కైంకర్యమునకు తీసికురాలేను.  వారికి శ్రీవేంకటేశుడే ఈడులేని బంధుకోటి ఈతడని తలపింపలేను. అన్వయార్ధము: అసలైన​ సంబంధమేమో మాకు తెలియదు. ఓ దేవా! ఈ తాత్కాలిక అస్తిత్వాన్ని దాటి జీవించి ఉండే ఏకైక సంబంధం నీవే కాదా?

 

 

Copper Leaf: 355-6 Volume 4-326

T-210 విజాతులన్నియు వృథా వృథా

  అన్నమాచార్యులు T- 210. విజాతులన్నియు వృథా వృథా   సకల క్రియల సమన్వయమే సుజాతి   కీర్తన సంగ్రహ భావము : పల్లవి : సత్యమునకు అనుగు...