239 ఇసుకపాతర యిందుకేది కడగురుతు
ఉపోద్ఘాతము
తమ శోకంలో “చూసే శక్తి” కలిగింది.
అధ్యాత్మ కీర్తన |
రేకు: 137-6 సంపుటము: 7-222 |
ఇసుకపాతర యిందుకేది కడగురుతు
రసికుఁడ నన్నునింత రవ్వశాయ నేఁటికి ॥పల్లవి॥
బయలు వలెనుండును పట్టరాదు వలపు
మొయిలువలెనుండును ముద్దశాయరాదు
నియతములేదించుకు నేరిచినవారిసొమ్ము
క్రియ యెరుంగుతా నన్నుఁ గెరలించనేఁటికి ॥ఇసుక॥
గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు
పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు
లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి ॥ఇసుక॥
వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు
వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు
మన్నించె యింక మారుమాటలాడనేఁటికి ॥ఇసుక॥
|
Details and Explanations:
పల్లవి:
పదబంధం |
అర్థం |
ఇసుకపాతర |
(పాతర
=ధాన్యముంచెడి గొయ్యి,
నేలలో త్రవ్విన గొయ్యి) ఇసుక గొయ్యి (ఆ గోతిలో
పడితే అలా క్రిందకి వెళుతూనే వుంటామన్న అర్ధంలో) |
యిందుకేది కడగురుతు |
దీనికేది ఇంత
లోతని చెప్పు సూచి. (లేదని భావము) |
రసికుఁడ |
ఓ రసజ్ఞుడా (దైవమా) |
నన్నునింత రవ్వశాయ
నేఁటికి |
తునకలు తునకలుగా చేయడమెందుకు |
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
Part A
ఇసుకపాతర
యిందుకేది కడగురుతు
Part B
Part C
చివరిగా:
అన్నమయ్య పల్లవిలో —
అందమును, ప్రేమను
ఆస్వాదించు రసికుఁడా
ప్రపంచమను భ్రమ,
మనో విభజన,
సూక్ష్మమైన ఏకత్వం
తెలిస్తే
ఇంక అడిగేదేముందో?
మొదటి చరణం:
పదబంధం |
అర్థం |
బయలు వలెనుండును
పట్టరాదు వలపు |
ప్రేమ అనేది
ఒక మైదానం వంటిది. దానిని పట్టుకోలేము |
మొయిలువలెనుండును
ముద్దశాయరాదు |
ఇది మేఘముల వలె
అందంగా, మృదువుగా
ఉంటుంది — కానీ ఎంత తడిసినా (అనుభవించినా) తనివి తీరదు |
నియతములేదించుకు
నేరిచినవారిసొమ్ము |
ఇది నియమాలకు
లోబడదు. ఇది గ్రహించినవారికి మాత్రమే దాని పట్టు దొరకవచ్చు — ఆ నేర్పు విద్య కాదు, అనుగ్రహంతో లబించవచ్చు. |
క్రియ యెరుంగుతా
నన్నుఁ గెరలించనేఁటికి |
ఓ ప్రభూ? అలాంటి ప్రేమను, నా వంటి
పామరుణ్ణి, అర్థం చేసుకోలేని వాడిని ఎందుకు ఇంత ఉడికింపచేస్తావు? |
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
మనము అనుభవించు వలపు (ప్రేమ) అన్నది
కేవలము మమకారము, ఆప్యాయము, అభిమానము,
ప్రణయము, మోహము, పాశము, ఇచ్చకముల వంటిది.
దానిలోని మాధుర్యాన్ని ఎంతకాలము అనుభవించినా తడిసిముద్ద
అవ్వం.
ఇంకా కావలనే భావన నిలుస్తుంది.
కానీ అన్నమాచార్యులు చెబుతున్న ప్రేమకు
ఎటువంటి నియమాలు లేవు.
ఎల్లలు లేవు.
కాలచట్రమునకు లోబడి లేదు.
దేహాభిమానమును దాటుకొని వున్నది.
సర్వమునకు మూలమై
సర్వమును చుట్టుకొని వున్నది.
ప్రపంచమును నడుపుచున్న వంచన మార్గములు తాకలేనిది
అవిద్యలు ఆదరించనిది.
అంచనాలకు అందనిది.
అది మనస్సుపెట్టి నేర్పు విద్య కాదు.
అందరాని పొందు కాదు. అందరికి మందు.
దానిపై పట్టు దొరకదు
అడిగితే రాదు
వద్దంటే పోదు
ఓ ప్రభూ
అదికాదిదికాదంటావు.
అలాంటి ప్రేమను ఎలా తెలియను?
పామరుణ్ణి. అవివేకిని. అంతా అయోమయం.
మమ్మల్నిఎందుకిలా పరీక్షిస్తున్ణావు?
రెండవ చరణం:
పాఠ్యం (Line) |
పదార్థం (Meaning in Telugu) |
గాలివలెఁ బారుచుండు కానరాదు మనసు |
మనసు గాలిలా పారుతూ తిరుగుతుంది — కానీ కదలిక కనిపించదు |
పాలవలెఁ బొంగుచుండు పక్కననణఁగదు |
అది పాలలా మరిగిపోతూ పొర్లుతుంది — పక్కన నిలవడం
దానికి అలవాటు కాదు |
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగగుజ్జు |
దాన్ని ఏరకంగాను ఓడించడం సాధ్యం కాదు — అది మూర్ఖమైన
ఏనుగు పిల్లలా మూర్ఖంగా మొండిగా ఉంటుంది |
లోలోనె మమ్మునింత లోఁచి చూడనేఁటికి |
అలాంటి మమ్మల్ని నీవు లోలోపలే అణచి, లోతుగా గమనించడం ఎందుకో, ఓ దైవమా? |
ఓ
ప్రభూ!
వ్యాఖ్యానం:
లోలోనె
మమ్మునింత లోఁచి చూడనేఁటికి
దేహమనే
పాత్రలో
పాల
వంటి మనస్సు పొంగుతూ
కక్కిరిబిక్కిరి
చేస్తుంది మనిషిని.
అణుకువగా
వొదిగి వుండదు.
మనిషి
ఎంత ఒదగడానికి పోతే అంత పరీక్షలు తప్పవు –
"నేను" అనే దాని అంతు చూసే వరకు.
మూడవ చరణం:
పాఠ్యం (Line) |
పదార్థం (Meaning in Telugu) |
వెన్నెలే కాయుచునుండు వింతగాదు వయసు |
యవ్వనమంటే వింతేమీ కాదు — అది వెన్నెలలా మెరుస్తూన్నా
మామూలులే. సాధారణమే. |
అన్నిటా వసంతరుతువై యుండుఁ బోదు |
కానీ జీవితం అంతా వసంతకాలంలా మధురంగా ఉండదు |
వున్నతి శ్రీ వేంకటేశుఁడుండనుండఁ జవి వుట్టు |
ఎలాగో తెలియదు కానీ — ఆ పైనున్న వేంకటేశుని కృపల
రుచి నాకు కలిగింది |
మన్నించె యింక మారుమాటలాడనేఁటికి |
ఆయన నన్ను మన్నించాడు — ఇక నేను మారు మాట్లాడాల్సిందేముంది? |
ప్రత్యక్ష భావము
వయసులో
నున్నప్పుడు జీవితం వెన్నెలలా అనిపించును.
కానీ, వసంత ఋతువు అలాగే నిలిచిపోదే?
పైని
లోకాలలో వున్న శ్రీ వేంకటేశుఁనిపై నాకు రుచి కలిగెను.
వ్యాఖ్యానం:
ఇప్పుడే స్పందించాలి
అని అన్నమయ్య అంటున్నారు —
ఇంకెప్పుడో
చూద్దాం అనుకోవడమే భ్రమ.
ఉపక్రమించిన బావుంది . గుజ్జు, రవ్వ పదముల అన్వయము తో కూడిన వివరణ బావుంది
ReplyDeleteవివరణ చాలా బావుంది.మన లోపల జరుగుతున్న అంతర్మధనం, చూపుతోంది. యస్య,డాలి చిత్రాలు,బాగ కుదిరాయి.పద ప్రయోగం చాల బావుంది
ReplyDeleteఇసుకపాతర వంటి అంతులేని కోరికలతో గమ్యం లేనిదీ జీవితమని, ఇదంతా దైవం సృష్టించిన మాయే నని అన్నమయ్య ఆవేదన చెందుచున్నారు.
ReplyDeleteమమకార, మోహముతో కూడిన ప్రేమలో చిక్కుకున్న మనిషికి సంతృప్తి యనేది ఉండదు.అది తనివి తీరని ఐహి ప్రేమ.కాని భగవంతుని యొక్క ప్రేమ అప్రమేయము, అనియమితము, మృదువైనదని, దైవకృపతో మాత్రమే లభించునదని, దానిని అనుభూతి చెందినవానికే దాని స్వరూపస్వభావములు తెలుస్తాయని అన్నమయ్య చెబుతున్నారు.
మనసనేది నిరంతరప్రవాహము వలె నుండునని, విషయముల వైపు ఆకర్షితమై ఉండునని, యవ్వనం ఆశాశ్వతమని, మనోనిగ్రహం అంటే దానిపై పట్టు సాధించటం కష్టసాధ్యమని చెబుతూ, పరమాత్మ కృపాకటాక్షముల వలన ఆయనతో భక్తి, ప్రేమ సంబంధమేర్పడిన కారణంగా లౌకికమైన ఈ జీవితము నుండి పారమార్థికమైన, అలౌకికమైన భగవంతుని ప్రేమకు పాత్రుడనైతినని,యింక లోటన్నది లేదని ఆచార్యులవారు చెబుతూ పరమాత్మ సన్నిధికి యోగ్యత అన్నది ప్రయత్నపూర్వకముగా సాధించాలని అంటున్నారు.
మీ వ్యాఖ్యానము చాలా బాగుంది శ్రీనివాస్ గార.
ఓమ్ తత్ సత్ 🙏🏻
పసుమర్తి కృష్ణ మోహన్