తాళ్లపాక పెదతిరుమలాచార్యులు
243 నీకే సెలవని నెపమువేయుట యింతే
For English version press here
ఉపోద్ఘాతము
అధ్యాత్మ కీర్తన |
రేకు: 63-6 సంపుటము: 15-363 |
నీకే సెలవని నెపమువేయుట యింతే
కైకొని కాచే నీ వుపకారమే
దక్కినది ॥పల్లవి॥ వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా
లుండేనంటే
అట్టె నీకు లాభము అం దేమున్నది
జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి
నయ్యే నంటే
చుట్టుకొని నీకు గల్గే సుఖమం
దేమున్నది ॥నీకే॥ కడు నీ పాదతీర్థపు గంగలో
నానే నంటే
అడరిన తనివి నీ కందేమున్నది
అడవిలో ఘోరతప మంది నీకుఁ
జేసే నంటే
అడియాలమైన ఫల మందు నీ కేమున్నది
॥నీకే॥ నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే
గడ్డము వెంచే నంటే
అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది
వున్నతి శ్రీవేంకటేశ వూరకే
నీ వాఁడ నైతి
యెన్న నీకుఁ గాక యిఁక నం
దేమున్నది ॥నీకే॥
|
Details
and Explanations:
పల్లవి:
పదబంధం |
అర్థం |
నీకే సెలవని
|
నీకోసమే
ఇదంతాయని |
నెపమువేయుట యింతే |
అనే మిషయే
కానీ |
కైకొని
కాచే నీ వుపకారమే దక్కినది |
(దేవా) నీయంతట నువ్వు చేసే ఉపకారమే మాకు నిలిచి వుండేది |
|
|
ప్రత్యక్ష భావము:
“ఇదంతా నీకోసమే” అని చెప్పుకునేది మేమే.
కానీ నిలిచి వుండేది మాత్రం
(దేవా) నీవంతట నువ్వు చేసే
ఉపకారమే.
వ్యాఖ్యానం:
దీన్ని
మాగ్రిట్ గారి “ద్రాక్ష పంట చేతికొచ్చే కాలం”
అనే ప్రతీకాత్మక చిత్రంతో అర్థం చేసుకుందాం.
ఒక
గదిలో కిటికీ ఉంది.
గది అంతా గబ్బు చీకటిలో మగ్గుతోంది;
వెలుతురు మాత్రం ఆ కిటికీ ద్వారానే వస్తోంది.
కిటికీ
ఆవల చూస్తే—
బౌలర్ టోపీలు పెట్టుకున్న,
ఒకేలా కనిపించే మనుషులు వరుసగా నిలబడి ఉన్నారు.
జాగ్రత్తగా గమనిస్తే,
కిటికీ దాటి కూడా వారు అలాగే పునరావృతమవుతూనే ఉంటారు.
వారు
“పంట చేతికొచ్చింది కదా,
ఇప్పుడు మా వేతనం ఇవ్వండి!”
అని అడుగుతున్న కూలీలలాగా కనిపిస్తారు.
మనమూ
అలాగే—
గుడి ముందర నిలబడి, పుణ్యానికి ప్రతిఫలం
కోరుతాం.
జీవితమంతా లావాదేవీలకు అలవాటు పడి,
మోక్షాన్నికూడా అదే దృక్పథంలో కొలుస్తాం.
మాగ్రిట్
అధివాస్తవికత మనకు చెబుతుంది—
కిటికీ అనేది కేవలం బయటి ప్రపంచానికి ముడిపెట్టు స్మృతి, జ్ఞాపకం.
కానీ చైతన్యం మాత్రం గదినంతా కలుపుకుంటుంది—
వెలుతురున్న కిటికీని,
స్పృహ లేని చీకటి మూలలనూ.
కనబడుతున్నవి, కనబడనివి
మరియు
చూస్తున్న వాడిని
అన్నీ
కలిపి తానే యను బోధయే చైతన్యం.
పాక్షిక
జ్ఞానం అజ్ఞానమే.
అజ్ఞానం నుంచి పుట్టిన చర్యలు
మరిన్ని అజ్ఞానానికే దారి తీస్తాయి.
అందుకే అవి ఫలితాలకే కట్టుబడి ఉంటాయి.
మన
అరకొర ప్రయత్నాలు
మనల్ని మనమే తిరిగి ఎదుర్కోవడమే తప్ప,
ఎప్పటికీ సమగ్రము కావు.
అవి వృత్తాకార చలనాలు—
మోక్షానికి దారి చూపని అయోగ్య ప్రయత్నాలు.
పెదతిరుమలాచార్యులు
చివరగా చెబుతున్నారు—
“మనిషి చేతిలో ఏమీ లేదు;
దైవకృప కోసం వేచి ఉండడమే
మనకున్న ఏకైక అవకాశం.”
ఈ
లోకంలో జన్మించడమే
దుర్లభమైన భగవదనుగ్రహము;
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమనే
సందేశమే ఈ కీర్తన.
మొదటి చరణం:
పదబంధం |
అర్ధము |
వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే |
ఏమీ తినకుండా నీ కోసమే ఉపవాసాలుంటే |
అట్టె నీకు లాభము అం దేమున్నది |
అలా అయితే అందులో నేకు లాభమేమున్నది? (లేదు) |
జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే |
సమ్మతిగా నీ కోసము సన్యాసి నయ్యే నంటే |
చుట్టుకొని నీకు గల్గే సుఖమం దేమున్నది |
అది చుట్టుకోవడం వల్ల నీకు ఏమైన సుఖము కలుగుతుందా? (లేదు) |
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
పెదతిరుమలాచార్యుల మనసు స్పష్టం—
“దేవుని పేరుతో” అని చేసే పనులన్నీ
మన సంప్రదాయం, మన నమ్మకాలే.
ఆచారాన్ని తిట్టరు,
కానీ మృదువుగా మాత్రమే ప్రశ్నిస్తారు—
“వీటితో దేవుడికి లాభమేంటి?”
అయినా నేటికీ
ఇవే ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి,
“ఎదో పొందుతామని” భక్తులు నమ్ముతూనే ఉన్నారు.
రెండవ చరణం:
పదబంధం (Phrase) |
అర్థం (Telugu) |
కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే |
అదేపనిగా
నీ పాదతీర్థపు గంగలో మునిగి వుంటానంటే |
అడరిన తనివి నీ కందేమున్నది |
అందులో
నీకు తృప్తి కలిగించే దేమున్నది? (లేదు) |
అడవిలో ఘోరతప మంది నీకుఁ జేసే నంటే |
అడవిలో
వెళ్ళి ఘోర తపము చేసేనంటే |
అడియాలమైన ఫల మందు నీ కేమున్నది |
గురుతుపట్టగల
ఫలము అందులో నీ కేమున్నది (లేదు) |
ప్రత్యక్ష భావము
వ్యాఖ్యానం:
టావో తె చింగ్ – లావో జు
“ప్రయత్నం ఆపితేనే మార్గం కనిపిస్తుంది.”
కఠిన తపస్సు కూడా
అహంకారానికి మరో రూపమే.
టావో (సత్యం) సహజంగానే ప్రవహిస్తుంది—
ప్రయత్నాలకు, లావాదేవీలకు అతీతంగా.
మూడవ చరణం:
Telugu Phrase |
Meaning |
నిన్నుఁ
గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే |
నిన్ను కనుఁగొన్నదాకా నేను గడ్డము పెంచే నంటే |
అన్నిటా
నీకుఁ గూడేది అందేమున్నది |
ఇలాంటి మా తీర్మానములతో నీకు ఒనగూడేదేమైనా వుందా? (లేదు) |
వున్నతి
శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి |
ఎంతో ఎత్తున వెలసిన శ్రీవేంకటేశ, ఏ విధమైన కోరికలు లేకుండా నీ వాడనని అనుకున్నానో
లేదో నీ వాడినైపోయాను |
యెన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది |
ఇలలో మనుషులకు ఎంచుకోవడనికి నీవు గాక మరేమున్నది |
|
వ్యాఖ్యానం:
కీర్తన సారాంశం
ఉపవాసములు, యాత్రలు, సన్యాసము—
ఆయన పేరుతో చేస్తాము,
కానీ ఆయన మహిమ పెరగదు, తగ్గదు కూడా.
తీర్థస్నానమో, అడవిలో తపస్సో, కఠోర నియమమో—
ఇవన్నీ మన లోకపు వ్యవహారాలు, ఆయనకు అంటవు.
“నిన్ను కనుగొనే వరకు…” అన్న ప్రతిజ్ఞలు వ్యర్థం;
ఏ కోరికలు కోరకుండానే ఆయనవాడినైపోవడమే సత్యం.
దైవకృప
కోసం వేచి ఉండడమే మనకున్న ఏకైక శరణ్యం
X-X-The
END-X-X
జ్ఞానం సాధనలో రెండే దశలు...
ReplyDelete1. సంపూర్ణ అజ్ఞానము
2. సంపూర్ణ జ్ఞానము
పాక్షికజ్ఞానము అనేది ఏదీలేదు. అది అజ్ఞానమే...🙏
ప
Well said. Even Ekadashi upavAsam is a practice of the ritualistic society and has no spiritual significance for those who believe He is both the means to reach Him and goal to be reached. The concept of nirhetuka kripa which is well presented in Annamaayyas' and his immediate suvcessors' poetry is well explained by you.
ReplyDeleteఊరకే నీ వాడనైతి, ఎన్న నీకు గాక - నీకు తప్ప మరి ఎవరికి నన్ను ఎంచుకుని రక్షించే సామర్థ్యం ఉంది అని అర్థం తీసుకోవచ్చు. అప్పుడు, నా సుకృతం అంటూ ఏమీ లేకుండానే, ఊరకే నీ వాడిని అయ్యాను.
ReplyDeleteఉపవాసములు, వ్రతములు, గంగాస్నానం, ముక్కు మూసికొని తపస్సు చేయటం, శిరోముండనము చేసికొని సన్యసించటం వలన ఫలితం లేదంటున్నారు పెద తిరుమలాచార్యుల వారు.నీ దర్శనమగునంత వరకు దీక్ష చేస్తానంటే ఒనగూడు ప్రయోజనమేమీ లేదని, వీటన్నిటి వలన పరమాత్మ సంతృప్తి చెందడని పెద తిరుమలాచార్యులంటున్నారు గహనమైన ఈ కీర్తనలో.
ReplyDeleteతలలు బోడులైన తలపులు బోడులా అన్న వేమన గారి పద్యం గుర్తునకు వచ్చినది.
మహాభారతంలోని శాంతిపర్వంలో ధర్మజుడిచ్చిన సందేశమునుటంకించి ఈ కీర్తనకు శ్రీనివాస్ గారు సులభగ్రాహ్యము చేసినారు.
రినే మాగ్రిట్టి గారి చిత్రంలో అన్నట్లు అంతరంగమందున్న పరమాత్మను వదలి, ఫలాపేక్ష కోసం దేవుణ్ణి పూజించటం వంటిది. సందర్భోచితంగా నున్నది.
ఓమ్ తత్ సత్ 🙏🏻🙏🏻🙏🏻
కృష్ణమోహన్