తాళ్లపాక అన్నమాచార్యులు
296 ఎవ్వారు లేరూ హితవు చెప్పఁగ వట్టి
For English version
press here
ఉపోద్ఘాతము
అన్నమాచార్యులు ఈక్షించి చెబుతారు.
సత్యము విడిగా ఉన్న ముడి పదార్థము కాదు.
అది జీవక్రియతోను, అంతర్దృష్టితోను కలసి
గ్రాహ్యమయ్యే అనుభవము.
అది
తత్వములను, గ్రంథములను వడగొట్టి
సంపాదించు సమాచారము కాదు.
కాబట్టి దానికి
మార్గము చూపగలిగినవారు బాహ్యంగా ఎవ్వరూ కానరారు.
అందుకే ఆయన
“ఎవ్వారు లేరూ హితవు చెప్పఁగ”
అని స్పష్టంగా చెబుతారు.
|
అధ్యాత్మ కీర్తన
|
|
రేకు: 3-2 సంపుటము: 1-15
|
|
ఎవ్వారు లేరూ హితవు చెప్పఁగ వట్టి నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా ॥ఎవ్వారు॥ అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక తొడరి కంపలకిందు దూరినట్లు నడుమ దురితకాననముల తరిఁ బడి వెడలలేక నేము విసిగేమయ్యా ॥ఎవ్వారు॥ తెవులు వడినవాఁడు తినఁబోయి మధురము చవిగాక పులుసులు చవి గోరినట్లు భవరోగములఁ బడి పరమామృతము నోరఁ జవిగాక భవముల చవులాయనయ్యా ॥ఎవ్వారు॥ తనవారి విడిచి యితరమైనవారి వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు అనయము తిరువేంకటాధీశుఁ గొలువక మనసులోనివాని మఱచేమయ్యా ॥ఎవ్వారు॥
|
Details
and Explanations:
పల్లవి
ఎవ్వారు
లేరూ హితవు చెప్పఁగ వట్టి
నొవ్వులఁ
బడి నేము నొగిలేమయ్యా ॥ఎవ్వారు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
ఎవ్వారు
లేరూ హితవు చెప్పఁగ
|
మానవుడా!
నీకు హితవు చెప్పుటకు ఎవ్వరు లేరు.
|
వట్టి నొవ్వులఁ
బడి నేము నొగిలేమయ్యా
|
అనవసరమైన (లేని) కష్టములలో బడి నలిగిపోతున్నామయ్యా
|
భావము:
మానవుడా!
నీకు హితవు చెప్పుటకు ఎవ్వరు లేరు. అనవసరమైన
(లేని) కష్టములలో బడి నలిగిపోతున్నామయ్యా
గూఢార్థవివరణము:
ఎవ్వారు లేరూ హితవు చెప్పఁగ
ఆహారము మన బదులు వేరే వాళ్ళు తినలేరు కదా!
హితవు చెప్పుటకు ఏమీ లేదు.
దాన్ని ఒక సూది మందులా ఎక్కించలేము.
మానవుడా, నీ అంతటకు నీవు తెలియవలసినదే.
అయ్యా ఇన్ని మత గ్రంథములు వున్నాయి కదా!
హితవు చెప్పుటకు లేదని ఎందుకంటూన్నారు?
నిజంగా అవి హితవు చెప్పగలిగితే
ఈనాటి పరిస్థితులు ఇలా వుండేవా? (కావే!).
వట్టి నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా
మనము
కేవలము నిమిత్తమాత్రులమని గ్రహించక
స్వధర్మమును
తెలియక
ఎదో
ఒకటి చేయబోయి కష్టములలో బడి నలిగిపోతున్నామయ్యా.
ఇక్కడ
స్వధర్మము అనగా తాత్విక భావన కాదు.
మనిషి తానెవడో, తనలో జరుగుతున్నదేమిటో తానే
గమనించుట.
సహజ
పరిణామమును అంగీకరించలేక చేయు కార్యములన్ని కష్టములకు మార్గములే.
పైన
పేర్కొన్న దానిని అద్భుతమైన అధివాస్తవిక చిత్రము
ద్వారా
మరింత విశదముగా తెలుసుకుందాం.
Visual
Reflection: Salvador Dalí
"A
Couple with Their Heads Full of Clouds" (1936)
ఈ
పెయింటింగులో గమనించ వలసినది
రెండు
రేఖలతో గీసిన మానవ ఆకారములు కనబడుతూ వున్నాయి.
వాటికేం
కనబడుతున్నాయో ఆ రేఖాకారములలో నింపి చూపారు.
ఒకటి
మనవైపు, ఇంకొకటి అవతలివైపు చూస్తున్నాయి.
అందుకే
వాటికి కనబడు దృశ్యములు వేరు వేరుగా చూపబడ్డాయి.
అంటే
మనం చూస్తున్న దృష్టికోణం బట్టి గ్రాహ్యత గోచరత మారిపోతాయి.
ఒకవైపునుంచి
చూస్తే రెండో వైపు దాని అనుభవమును పసిగట్టలేము.
ఆ
రకంగా మన చూపులే మన అనుభవముల
గ్రాహ్యత
గోచరతలను పరిమితం చేస్తాయి.
ఇదే
స్థితి కల్పించు భ్రమ.
రేఖాకారములు
- మేఘాలు
మేఘాలు, దృశ్యాలు మారినా ఆ రేఖాకారములు అవే వుంటాయి.
ఆ
రేఖాకారము కేవలము ఆవరణ మాత్రమే.
అది
మేఘాలు, దృశ్యాలను మార్చకుండా.
వున్నవి
వున్నట్లు చూపడమే దాని పని.
ఆ
మేఘాలను, దృశ్యాలను అంగీకరించక పోవుట దారి తప్పుట.
ఒకసారి
దిశ మారితే తక్కినదంతా వట్టి పనిలేని పని.
అది
తలకెత్తుకోకుంటే జీవితంలో భారమేది?
కర్త
అను భ్రమ
ఆ
రేఖాకారము "మనస్సు" యొక్క అసలు రూపము.
దానికి
"నేను" అన్న భావన కలిగినప్పుడు
"నా కంటూ ప్రత్యేకతను” నిలుపుకునేందుకు
"మనస్సు"ను రకరకాలపదార్థాలతో నింపుతుంది.
ఆ
నింపిన పదార్థాలు, కనబడు దృశ్యము ఒకదానితో నొకటి తారుమారై,
దృశ్యము
కంటే భిన్నమైన దానిని మనము అనుభవము చెందుతాము.
మొదటి చరణం:
అడవిఁ బడినవాఁడు
వెడలఁ జోటులేక
తొడరి కంపలకిందు
దూరినట్లు
నడుమ దురితకాననముల
తరిఁ బడి
వెడలలేక
నేము విసిగేమయ్యా ॥ఎవ్వారు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక
|
(అడవి
= క్రిక్కిరిసిన ప్రదేశము) అడవిలో చిక్కుకుని దారి తెలియలేక
|
|
తొడరి కంపలకిందు దూరినట్లు
|
(తొడరి
= అనుసరించి) గుడ్డిగా తనకు తెలిసిన విధముగా పోయి ముళ్ళ కంపలలో దూరినట్లు
|
|
నడుమ దురితకాననముల తరిఁ బడి
|
ఈ జీవనము నడుమన పాపపు అడవిలో ప్రయత్నించి (ఇరుక్కున్నాము)
|
|
వెడలలేక
నేము విసిగేమయ్యా
|
బయట పడలేక
విసిగిపోయామయ్యా
|
భావము:
అడవిలో
చిక్కుకుని దారి తెలియలేక గుడ్డిగా తనకు తెలిసిన విధముగా పోయి ముళ్ళ కంపలలో దూరి ఇరుక్కున్నట్లు, ఈ జీవనము నడుమన పాపపు వనములో ప్రయత్నించి మరీ ఇరకాటములో పడ్డాము. బయట పడలేక
విసిగిపోయామయ్యా!
గూఢార్థవివరణము:.
ముందుగా
ఈ అధివాస్తవిక చిత్రాన్ని నిశ్శబ్దంగా చూడండి.
కొంతమంది
మనుషులు నిస్సత్తువ, విసుగు ఆవహింపగా
“ఎలా వెళ్ళాలి?” అని చర్చించుకుంటున్నట్లుగా
కనిపిస్తారు.
కానీ
వారు చివరకు
ఇంతకు ముందు వెళ్లిన దారినే
మళ్ళీ వెళ్లబోతున్నారు.
చిత్రం
కొంచెం అస్తవ్యస్తంగా కనిపించినా,
దూరంగా కనిపిస్తున్న కొండకు
అందరూ ఇంకా ఇటువైపే ఉన్నారు.
ఆ
దారికి ఇటు అటు వెళ్లినవారి పరిస్థితి కూడా భిన్నంగా లేదు.
మొత్తానికి ఈ చిత్రమంతా
“దారి లేదు” అన్న ధ్వనినే
వినిపిస్తుంది.
ఎవరైనా
సంగీతం పాడుకుంటూ ఉన్నా,
ఆడుకుంటూ ఉన్నా,
సమూహాలుగా కదులుతున్నా —
చివరికి ఇది ఏకాకి ప్రయాణమే.
దృక్కోణాలు
వేరువేరుగా ఉన్నా
పరిస్థితిలో మార్పు లేదు.
అన్నమాచార్యులు
చెప్పినట్లు —
“నడుమ దురితకాననముల తరిఁ బడి
వెడలలేక నేము విసిగేమయ్యా.”
రెండవ చరణం:
తెవులు
వడినవాఁడు తినఁబోయి మధురము
చవిగాక
పులుసులు చవి గోరినట్లు
భవరోగములఁ
బడి పరమామృతము నోరఁ
జవిగాక
భవముల చవులాయనయ్యా ॥ఎవ్వారు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
తెవులు వడినవాఁడు తినఁబోయి మధురము
|
తెగులు/వ్యాధిన పడినవాడు మధురము తినఁబోయి
|
|
చవిగాక పులుసులు చవి గోరినట్లు
|
రుచించక పులుపు పదార్థములను గోరినట్లు
|
|
భవరోగములఁ బడి పరమామృతము నోరఁ
|
మనోదుర్బలములకు లోనై నోటికి దగ్గరగా వచ్చినపరమామృతము (పరమాత్మ
తత్వము) నందు
|
|
జవిగాక భవముల చవులాయనయ్యా
|
బుద్ధిపుట్టక చావుపుట్టుకలలో ఆధారము కనబడుతుంది
|
సూటి భావము:
తెగులు/వ్యాధిన పడినవాడు ( ఆ వ్యాధి ప్రభావమున) మధురములు నాలుకకు రుచించక పులుపు పదార్థములను
గోరినట్లు; (ఇక్కడ అన్నమాచార్యులు జిహ్వ నుంచి బుద్ధికి లంకె
పెడుతున్నారు) జీవన్మరణముల చక్రములలో పడినవానికి నోటిదాకా వచ్చిన పరమామృతము నందు బుద్ధిపుట్టక సంసారములో (చావుపుట్టుకలలో) ఊతము కనబడుతుంది.
గూఢార్థవివరణము:
ముందుగా
క్రింది పల్లవిని జాగ్రత్తగా చూడండి.
వెన్న
చేతఁబట్టి నేయి వెదకనేలా
యిన్నిటా
నెంచి చూచితే నిదియే వివేకము ॥పల్లవి॥
చేతిలో
వెన్న పట్టుకుని నెయ్యి వెదకడము అంటే
మనము
ఆ పరమామృతమును (పరమాత్మ తత్వమును) తెలియుటకు చిట్టచివరి మెట్టు మీదున్నాం అన్నమాట.
పరమామృతము
నోరఁ
ఆ
పరమామృతము నోటివరకు వచ్చినది.
భవరోగములఁ బడి
= నిజంగా రోగములు కాదు, మనోదుర్బలములకు
లోనై.
దీనిని
మొదటి రెందు పంక్తులలోని వ్యాధి ప్రభావము గమనించండి.
వ్యాధి
ప్రభావమున మధురము నుండి పులుసునకు
మనోమనోదుర్బలత
వలన పరమామృతము నుండి భవముల జీవితం
భవరోగములఁ
బడి పరమామృతము నోరఁ
జవిగాక
భవముల చవులాయనయ్యా
పరమామృతమును
కోరుకున్నప్పటికీ
మనోదుర్బలముల ప్రభావముతో
ఈ జీవితమును కొనసాగించుటలోనే
ఎక్కువ మెరుపు
లేదా ఆస్కారము కనబడతాయి.
మూడవ చరణం:
తనవారి
విడిచి యితరమైనవారి
వెనకఁ
దిరిగి తా వెఱ్ఱైనట్లు
అనయము
తిరువేంకటాధీశుఁ గొలువక
మనసులోనివాని
మఱచేమయ్యా ॥ఎవ్వారు॥
|
Telugu Phrase
|
Meaning
|
|
తనవారి విడిచి యితరమైనవారి
|
తనవారిని (శ్రీవేంకటేశు దాసులను) విడిచి ఇతరులను
|
|
వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లు
|
వెనుక దిరిగి (చివరికి) తన వెఱ్ఱితనము తెలుసుకొని (ప్రయోజనమేమి?)
|
|
అనయము తిరువేంకటాధీశుఁ గొలువక
|
నిరంతరము తిరువేంకటాధీశుని
గొలువక
|
|
మనసులోనివాని మఱచేమయ్యా
|
మన అంతరంగములో నిజముగా కొలువై ఉన్న అతనిని మరచిపోదుము.
|
సూటి భావము:
తనవారిని
(శ్రీవేంకటేశు దాసులను) విడిచి ఇతరులను వెనుక దిరిగి (చివరికి) తన వెఱ్ఱితనము తెలుసుకొని
ప్రయోజనమేమి? నిరంతరము
తిరువేంకటాధీశుని గొలువక మన అంతరంగములో నిజముగా కొలువై ఉన్న అతనిని మరచిపోదుము.
గూఢార్థవివరణము:
తనవారి
విడిచి యితరమైనవారి
ఈ కీర్తన "ఎవ్వారు లేరూ"తో
మొదలైంది. మరి ఇక్కడ ఆచార్యులవారు "తనవారి విడిచి" అని ఎందుకంటున్నారు? మొదటగా "తనవారు"తో శ్రీవేంకటేశు దాసులను సూచించారు. అనేక కీర్తనలలో
వారిని గుర్తించలేని మన అశక్తతత గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు నిజజీవితంలో
అర్భాటాలను చూపరు. వారు తమను తాము తెలుసుకొనుటలో నిమగ్నమై వుంటారు. కావున వారిని తెలిసే
అవకాశం చాలా తక్కువ.
యితరమైనవారి
వెనకఁ
వీరి దర్శనం నిత్యం. వీరికి
ఎన్ని ఉపచారాలైనా చేయించుకుంటారు. వారి వెనుక
తిరిగి ప్రయోజనం శూన్యం. కానీ వారే సమాజంలో పేరుప్రతిష్టలతో జీవిస్తారు.
మనసులోనివాని
మఱచేమయ్యా
కనబడని అంతరంగములోని వానిని
తెలియుట దాదాపు అసాధ్యం. ఒకవేళ వాని ఛాయలు తెలుసుకున్నా అవి హృదయములో నిలుపలేరు. ఆ
ఛాయలు తెచ్చు సిరులకు లొంగుట సులభము. ఒకసారి ఆ బాటలో పడితే మనసులోనివానిని మఱచుదుము.
"ఎవ్వారు లేరూ" తెలుపు జీవనప్రయాణం "అందరి వానికి" దారి.
అందరు
మెచ్చు యానము వృథా ప్రయాసము.
X-X-The
END-X-X


No comments:
Post a Comment