ANNAMACHARYA
63. అతిసులభం బిదె
Introduction: This is truly one
of the most beautiful and profound verses of Annamacharya. Obviously he is in
his elements. He assures the devotee that there is God.
ఉపోద్ఘాతము: ఇది నిజంగా అన్నమాచార్యుల యొక్క చాలా అందమైన, గూఢమైన కీర్తనలలో ఒకటి. సహజంగానే అన్నమయ్య అనేక మౌలికమైన విషయాలను స్పృశించారు. భగవంతుడు ఉన్నాడని భక్తుడికి భరోసా ఇస్తాడు.
కీర్తన
అతిసులభం బిదె శ్రీపతిశరణము
అందుకు నారదాదుల సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి॥పల్లవి॥
వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి
దైవమును
ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి॥అతి॥
తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల
నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి॥అతి॥
మరిగివుండుమీ వోజిహ్వా మరి
శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి॥అతి॥
Details and Explanations:
అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి॥పల్లవి॥
atisulabhaM bide SrIpatiSaraNamu
aMduku nAradAdula sAkshi
Word to Word meaning: అతిసులభంబు (atisulabhaMbu) = Easiest; ఇదె (ide) = this one; శ్రీపతిశరణము (SrIpatiSaraNamu) = submission to Sripati: అందుకు (aMduku) = for that; నారదాదుల (nAradAdula) = Narada and other saints; సాక్షి(sAkshi) = proof; ప్రతిలేదు (pratilEdu) = there is no alternative; ఇదియే (idiyE) = thois one alone; నిత్యానందము (nityAnaMdamu) = happiness forever; బహువేదంబులె (bahuvEdaMbule) = multiple vedas; యివే (yivE) = they; సాక్షి (sAkshi) = proof.
Literal meaning and Explanation: The easiest thing to perform is to bow to Lord Sripati. Narada and other saints are proof of this. The Vedas also proclaiming that, there is no alternative, this is the way to permanent happiness.
భావము మరియు వివరణము: శ్రీపతికి శరణము చాలా సులభము. నారదాది మునులే దీనికి ఋజువు. శాశ్వతానందమునకు మార్గమిదేనని (ప్రత్యామ్నాయం లేదనీ) వేదాలు కూడా దీనిని ప్రకటిస్తున్నాయి.
వేసరకుమీ జీవుఁడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నాఁడిదె అందుకుఁ బ్రహ్లాదుఁడే సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
సేసినభక్తికిఁ జేటు లేదు యీసేఁతకెల్ల ధ్రువుఁడే సాక్షి॥అతి॥
vEsarakumI jIvuDA vedakivedaki daivamunu
AsapATugA hari yunnADide aMduku brahlAduDE sAkshi
mOsapOkumI janmamA muMchina yanumAnamulanu
sEsinabhaktiki jETu lEdu yIsEtakella dhruvuDE sAkshi ॥ati॥
Word to Word meaning: వేసరకుమీ (vEsarakumI) = trouble, fatigue; జీవుఁడా (jIvuDA) = O man; వెదకివెదకి
(vedakivedaki) = searching repeatedly; దైవమును
(daivamunu) = god; ఆసపాటుగా (AsapATugA) = desire/ longing; హరి (hari) = God
Hari; యున్నాఁడిదె (yunnADide) = he is there; అందుకుఁ (aMduku) = for that; బ్రహ్లాదుఁడే (brahlAduDE) = Prahlada; సాక్షి(sAkshi) = is proof/witness;
మోసపోకుమీ (mOsapOkumI) = do not get deceived; జన్మమా (janmamA) = O life; ముంచిన (muMchina) = inundating; యనుమానములను (yanumAnamulanu) = doubts; సేసినభక్తికిఁ
(sEsinabhaktiki) = for the devotion you did; జేటు లేదు (jETu lEdu) = will not
go in-vain; యీసేఁతకెల్ల (yIsEtakella) =
for these works; ధ్రువుఁడే (dhruvuDE) = Dhruva; సాక్షి (sAkshi) =
proof/witness.
Annamacharya said that man instead of searching god, leaving the doubts, should concentrate on meditation. He assured that there is god, and he will act to save anyone who submits to him, like he did for Prahlada and Dhruva.
A saint is saying do not waste time in search of God. Why? Rather he is advising to concentrate on meditation. As already proclaimed in Bhagavadgita, god is neither in material nor in meta physical plane. Such a thing cannot be conceived by man, being a creature in material. Therefore there is no point in search of God.
Inundating doubts is apt word used to indicate in this lonely journey of meditation, man has no avail, but himself. The doubts are more likely to overwhelm a person than in normal course.
As explained earlier, in Annamacharya's view, meditation is an act of dissolving the ego. It may also include prayer.
భావము మరియు వివరణము: ఓ మానవుడా ! భగవంతుడిని వెతుకుతూ వెతుకుతూ అలసిపోవద్దు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు ఉన్నాడనడానికి ప్రహ్లాదుడే సాక్షి. ముంచెత్తుతున్న సందేహాలకు తావివ్వకుండా భగవంతుని పట్ల ఉన్న భక్తిని కొనసాగించు, వృధాగాపోదు.
మనిషి దేవుణ్ణి వెతకడానికి బదులు, సందేహాలను వదిలి, ధ్యానంపై దృష్టి పెట్టాలి. దేవుడు ఉన్నాడని, అతడు ప్రహ్లాదుని మరియు ధ్రువుని రక్షించినట్లుగా శరణాగతులందరినీ రక్షిస్తాడని హామీ ఇచ్చాడు.
భగవంతుడిని వెతుక్కుంటూ సమయాన్ని వృథా చేయవద్దని ఒక తపస్వి చెబుతున్నాడు. ఎందుకో? బదులుగా అతను భగవద్ధ్యానంపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నాడు. భగవద్గీతలో ఇప్పటికే ప్రకటించినట్లుగా, దైవమునకు పదార్థ అస్తిత్వము ఉన్నదని కానీ, లేదని కానీ చెప్పలేము. అటువంటిది (పదార్థముతో నిర్మితమైన) మనిషి గ్రహింపులో ఉండదు. అందువల్ల భగవంతుడిని వెతకడంలో అర్థం లేదని కాబోలు.
ధ్యానమొక ఒంటరి యాత్ర అని సూచిస్తూ, తోడులేని ఆ ప్రయాణంలో సందేహాలు మనిషిని ముంచెత్తి తన లక్ష్యం నుండి తప్పించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇంతకు ముందే వివరించినట్లుగా, అన్నమాచార్యుల దృష్టిలో ధ్యానం అంటే అహమును కరగించి వేయు చర్య. అందులో ప్రార్థన కూడా ఉండవచ్చు.
తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుఁడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీఁదీఁది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుఁడే సాక్షి॥అతి॥
tamakiMchakumI dEhamA tagusukhadu@hkhaMbula nalasi
amitamu naraharikaruNa nammitE naMduku narjunuDE sAkshi
bhramayakumI vivEkamA bahukAlaMbulu yIdIdi
tamitO dAsyamu tanu rakshiMchunu dAniki balIMdruDE sAkshi ॥ati॥
Word to Word meaning: తమకించకుమీ (tamakiMchakumI) = చలించక, తత్తరపడక, do not get agitated; దేహమా (dEhamA) = O body; తగు (tagu) = suitable; సుఖదుఃఖంబులను (sukhadu@hkhaMbulanu) అలసి (nalasi) = get tired; అమితము (amitamu)= infinite; నరహరికరుణ (naraharikaruNa) = compassion of Narahari; నమ్మితేను (nammitEnu) = if you believe; అందుకును (naMduku) = for that; అర్జునుఁడే (narjunuDE) = Arjun; సాక్షి(sAkshi) = proof; భ్రమయకుమీ (bhramayakumI) = do not get shaken by illusion; వివేకమా (vivEkamA) = intelligence; బహుకాలంబులు (bahukAlaMbulu) = lot of time; యీఁదీఁది (yIdIdi) = swim & swim. (Meaning swim from one place to another and only to find it as wrong place); తమితో (tamitO) = కుతూహలముతో, willingly; దాస్యము (dAsyamu) = service (without expecting anything in return) తను (tanu) = He; రక్షించును (rakshiMchunu) = Will Save; దానికి (dAniki) = for that; బలీంద్రుఁడే (balIMdruDE) = Great King Bali; సాక్షి (sAkshi) = proof.
Literal meaning and Explanation: DO not tire your body subjecting it to vagaries of life. Instead
believe in infinite Compassion of Narahari and offer prayers to him. Lord will
save you. Arjun is the proof of this. DO not let your intelligence be subjected
to illusion, save yourself from going here and there. Instead take up the
service of Lord (expecting nothing in return); Lord will save you. Emperor Bali
is the proof of this.
Annamayya advised us not to get engaged in chores of life as we do at present by stating తగు సుఖదుఃఖంబుల నలసి. This way we only get tired, and achieve nothing. He knows that we doubt his words. He assuaged by saying do not get agitated. The compassion of God is beyond all the measures.
Another notable thing he said is, do not look for reward in divine service. As noted many times before, the devotional service is to undertaken as the only avenue to live righteously, not as means to reach god.
భావము మరియు వివరణము: ప్రస్తుత జీవితానికి అలవాటుపడి సుఖదుఃఖంబులబడి అలసిపోకండి. తత్తరపడక, నరహరి యొక్క అనంతమైన కరుణను నమ్ముకోండి. ప్రార్థనలు చేయండి. నరహరి మిమ్మల్ని రక్షిస్తాడు. అర్జునుడే దీనికి రుజువు. మీరు భ్రమలకు గురియై, తెలివితేటలు పనిచేయక ఇక్కడికి మరియు అక్కడికి వెళ్ళి సమయాన్ని వృధా కాకుండా చూసుకోండి. ఆపేక్షతో, కుతూహలముతో దైవసేవను చేపట్టండి (ప్రతిఫలంగా ఏమీ ఆశించ కుండా); ప్రభువు మిమ్మల్ని కాపాడతాడు. బలి చక్రవర్తి దీనికి నిదర్శనం.
ప్రస్తుతం మనం చేస్తున్నట్లుగా జీవితపు చర్యల్లో నిమగ్నమవ్వవద్దని "తమకించకుమీ దేహమా తగుసుఖదుఃఖంబుల నలసి" అని అన్నమయ్య సలహా ఇచ్చారు. మనం తటపాయిస్తామని ఆయనకు తెలుసు. అందుకే ఆందోళన చెందవద్దు; అమితమైన నరహరి కరుణ అన్ని కార్యములకు మించినది అన్నారు.
ఆయన చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దైవ సేవలో ప్రతిఫలం కోసము చూడకండి. ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నట్లు, దైవ సేవ అనేది ధర్మబద్ధంగా జీవించడానికి ఏకైక మార్గంగా చేపట్టాలి, దైవాన్ని చేరుకోవటానికి ఒక మార్గంగా కాదు.
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతినుతులు
అరయఁగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోఁగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి॥అతి॥
marigivuMDumI vOjihvA mari SrIvEMkaTapatinutulu
arayaga nidiyE yIDEriMchunu aMduku vyAsAdulE sAkshi
tirugakumI vij~nAnamA drishTapumAyalakunu lO@Mgi
sarilE ditanipAdasEvakunu sanakAdulabradukE sAkshi ॥ati॥
Word to Word meaning: మరిగివుండుమీ (marigivuMDumI)= get used to; వోజిహ్వా (vOjihvA) = o my tongue; మరి (mari) =more, further; శ్రీవేంకటపతినుతులు (SrIvEMkaTapatinutulu) = songs in praise of Lord Venkteswara; అరయఁగ (arayaga) = on proper observation; నిదియే (nidiyE) =this alone; యీడేరించును (yIDEriMchunu) =సిద్ధింపజేయు, అపనయించు, make happen, fruitful; అందుకు (aMduku) = for that; వ్యాసాదులే (vyAsAdulE) = Saint veda vyas and his associates; సాక్షి(sAkshi) = proof; తిరుగకుమీ (tirugakumI) = do not wander; విజ్ఞానమా (vij~nAnamA ) = శాస్త్రాదులయందలి జ్ఞానము; Having theoretical knowledge; ద్రిష్టపుమాయలకును (drishTapumAyalakunu) = visual fallacie;s లోఁగి (lOgi) = పాలుపడు, తగ్గు, accepting; సరిలే ది (sarilEdu) nothing equals తని(itani) = his; పాదసేవకును (pAdasEvakunu) = service to his feet; సనకాదులబ్రదుకే (sanakAdulabradukE) = Life of Sanakadi brothers; సాక్షి(sAkshi) = Proof.
Literal meaning and Explanation: O tongue!!, get used to praise the lord Venkateswara. I find he alone make this (liberation) happen. Saint Veda Vyas is a proof of this. O mind (of theoretical knowledge), Do not wander and get distracted by visual fallacies. Nothing can equal to the service of HIS lotus feet. For that Life of Sanaka Sanandana brothers are the proof.
Obviously we use our tongue only for
taste of food. Do we taste the name of the Lord similar to a sweet dish? What do
we use our tongue for? Kindly consider the famous Shloka by Bhrtruhari.
भर्तृहरि नीतिशतकम् ।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम् II
Purport: “Bracelets do not adorn a person, nor do the pearl necklaces which shine like the full moon, nor a cleansing bath, nor anointment of the body, nor flowers, nor the decoration of the hair. It is the cultured speech alone that embellishes a man. All other ornaments lose their glitter with time. Only a jewel of a speech remains as the jewel of jewels” ( Vedanta vani July 2010, a Chinmaya publication)
He said that our intellect can mislead; and visual illusions should not
be confused with truth. You might have witnessed that even educated get tricked
often by uneducated people. He therefore
suggested that the intelligentsia should be duly vigilant.
భావము మరియు వివరణము: ఓ నాలుకా!, వెంకటేశ్వరుడిని స్తుతించటానికి అలవాటుపడు. అతడే విముక్తి కలిగేలా చేస్తాడు. అందుకు వ్యాసాదులే సాక్షి. ఓ మనస్సా! సైద్ధాంతిక జ్ఞానంతో విర్రవీగుతూ పరధ్యానం చెందకు. దృశ్యభ్రమలు తప్పుదోవ పట్టించవచ్చు. దైవము యొక్క పాదాల పద్మముల సేవకు సమానమైంది ఏదీ లేదు. దానికి సనకాదుల జీవితమే రుజువు.
మనం మన నాలుకను ఆహార రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామేమో!. తీపి వంటకం మాదిరిగానే ప్రభువు నామంలోని మాధుర్యము తెలిశావా? మన నాలుకను దేనికి ఉపయోగిస్తామో? భర్తృహరి రాసిన ప్రసిద్ధ శ్లోకాన్ని దయచేసి పరిగణించండి.
భర్తృహరి నీతి శతకంలోని 15వ శ్లోకం
భావము: చేతి కంకణములు, చంద్ర హారాలు, మణిపూసలు మొదలైన ఆభరణాలు గానీ, పన్నీటి స్నానాలు, చందన లేపనాలు, పుష్పమాలా విలాసాలు గానీ, నిగారింపుతోనున్న నిగ నిగ లాడుచున్న జుట్టు జడ గానీ, మనుషులకు నిజంగా అలంకారములు కావు సుమా!. ఎందుకనగా, ఆభరణాలు కొంతకాలానికి మసక బారిపోతాయి. పూవులు వాడిపోతాయి. అయితే, ఎప్పటికీ చెక్కుచెదరక, ఎప్పటికీ (హృదయములో) నిలిచిపోయే -- చక్కగా సంస్కరింపబడిన పదజాలముతో కూడిన మాటలే మానవులకు నిజమైన అలంకారములు సుమా!
అన్నమయ్య మన మేధస్సు తప్పుదోవ పట్టించవచ్చని,
దృశ్యభ్రమలను సత్యముతో పొరపడవద్దని అన్నాడు. చదువుకున్నవారిని సైతం చదువుకోని చిన్నాచితకా
పని చేసుకునేవారు బోల్తాకొట్టించడం మనకందరకూ అనుభవమే. పరధ్యానంలో పడకూడదని చెబుతున్నాడు. అందుకని మేధావి
వర్గానికి కూడా తగు అప్రమత్తత అవసరమని సూచన చేసారు.
zadaz
Reference:
Copper Leaf: 107-5, Volume: 2-41