తాళ్లపాక అన్నమాచార్యులు
329 గందము వూసేవేలే కమ్మని మేన
పరిచయం
ఈ కీర్తనలో అన్నమాచార్యులు
అతి సులభమైన ఉపమానములతో
ఒకపక్క శృంగార రసము తొణకుతుండగానే
అతి లాఘవముగా తత్వమును స్ఫురింప చేస్తారు.
మీరే చదివి ఆనందించండి.
|
శృంగార సంకీర్తన
|
|
తాళ్లపాక వేంకటశేషాచార్యుల వ్రాతప్రతి
పుట: 236
సంకీర్తన:
247
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 109
|
|
గందము వూసేవేలే కమ్మని మేన యీ- గందము నీమేనితావికంటె నెక్కుడా ॥పల్లవి॥ అద్దము చూచేవేలే అప్పటపట్టికిని అద్దము నీ మోముకంటె నపురూపమా ఒద్దిక తామరవిరినొత్తేవు కన్నులు నీ- గద్దరికన్నులకంటె కమలము ఘనమా ॥గంద॥ బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా బంగారు నీతనుకాంతి ప్రతివచ్చీనా ఉంగరాలేఁటికినే వొడికిపువేళ్ళ వెంగలిమణులు నీ వేలిగోరఁబోలునా ॥గంద॥ సవర మేఁటికినే జడియు నీ నెరులకు సవరము నీకొప్పుసరి వచ్చీనా యివలఁ జవుల నీకునేలే వెంకటపతి - సవరని కెమ్మో విచవికంటేనా ॥గంద॥
|
Details
and Explanations:
పల్లవి:
గందము వూసేవేలే
కమ్మని మేన యీ-
గందము నీమేనితావికంటె
నెక్కుడా ॥పల్లవి॥
|
శృంగార భావము
|
తత్వ భావము
|
|
ఓ చెలియా! నీ కమ్మని మేనికి గంధమేలే పూసేవు? నీ సహజ పరిమళము కన్నా గంధము మిన్నయా? ఓ చెలియా! నీ కమ్మని మేనికి గంధములు పూసి వాటి హోదా పెంచనేలా? నీ సహజ పరిమళమునకు గంధము
సాటియా? (కాదు)
|
సహజమైన దానిని సహజముగా ఏల ఉంచవో? సహజ పరిమళమును ఏల కప్పుదువు? చేర్చిన అలంకారము సహజ జీవసౌరభమును మించునా? |
మొదటి చరణం:
అద్దము చూచేవేలే
అప్పటపట్టికిని
అద్దము నీ
మోముకంటె నపురూపమా
ఒద్దిక తామరవిరినొత్తేవు
కన్నులు నీ-
గద్దరికన్నులకంటె
కమలము ఘనమా ॥గంద॥
|
శృంగార భావము
|
తత్వ భావము
|
|
ఓ చెలియా! ఎప్పటికప్పుడు అద్దము చూచేవేలే?
నీ మోముకంటె అద్దము అపురూపమా?
|
అద్దములో ఏమి చూచేవే? ప్రతిబింబమే అపురూపమని నీ ముఖబింబము చూచుకొనవటే?
|
|
ఓ చెలియా! తామరపూలతో నీ కన్నులు పోల్చుకునేవు. లోతు, నైపుణ్యము లోలుకు కనులకన్నా కమలములు ఘనమా?
|
తామరపూలతో పోలికలేలా? జీవదృష్టినిచ్చు కనులతో నిశ్చల కమలములు మేలనగలవా?
|
రెండవ చరణం:
బంగారు వెట్టేవేలే
పడఁతి నీ మెయినిండా
బంగారు నీతనుకాంతి
ప్రతివచ్చీనా
ఉంగరాలేఁటికినే
వొడికిపువేళ్ళ
వెంగలిమణులు
నీ వేలిగోరఁబోలునా ॥గంద॥
|
శృంగార భావము
|
తత్వ భావము
|
|
ఓ చెలియా! నీ మేనినిండా బంగారు ఆభరణములేలే? నీ సహజ కాంతికి బంగారము సాటివచ్చీనా?
|
బంగారముతో నీ మేని కాంతిని కప్పనేల? పై మెరుగు బంగారానిది. నీలోని కాంతికి
బంగారమే పాటి?
|
|
ఓ చెలియా! నీ
మనోజ్ఞమైన వేళ్లకు ఉంగరములేలా? నీ వేలిగోరంత సౌందర్యము పామరపు మణులకు వచ్చునా?
|
జీవస్పందన గల వేళ్లకన్నా మణుపుటుంగరములు మిన్ననా? సహజ చైతన్యము పామరపు మణులకు అంటునా?
|
మూడవ చరణం:
సవర మేఁటికినే
జడియు నీ నెరులకు
సవరము నీకొప్పుసరి
వచ్చీనా
యివలఁ జవుల
నీకునేలే వెంకటపతి -
సవరని కెమ్మో
విచవికంటేనా ॥గంద॥
|
శృంగార భావము
|
తత్వ భావము
|
|
ఓ చెలియా! దట్టమగు నీ వెంట్రుకలకు కొప్పుననకు సవరమెందుకే? ఈ సవరము నీ అసలు కొప్పుకు సరి పోవునా?
|
ఓ చెలియా! సహజముగా దట్టమైన నీ కొప్పుననకు అతకని చేర్పులేలా?”
|
|
ఓ చెలియా! ఇహమువైపు ఈ రుచులు నీకు ఏలే? అందమైన వెంకటపతి అధరముల రుచి కంటేనా?
|
ఓ చెలియా! ఇహముపై ఈ రుచుల జాడ నీకు ఏలే? అందమైన వెంకటపతి అధరముల రుచి ఎట్లంటునే?
|
సమీక్ష
పై
కీర్తనలో మొత్తము ఏడు ఉపమానములతో అన్నమాచార్యులు
మానవుడు
తనకు ఉన్నదానిని
పైపై
పూతలతో, ఆభరణములతో, అలంకారములతో
ఏవిధముగా
ఈ ప్రపంచములో
తానొకడినని
నిరూపించుకోబోతాడో చూపించారు.
ఒక్కక్షణం
కూడా ఆలోచించడు ఈ "నిరూపణలెవ్వరికోసమో?"
క్రింది
అన్నమాచార్యులు వేర్వేరు కీర్తనలలో చెప్పిన ఉదాహరణలు ఇక్కడ చర్చించుట ముఖ్యమని మీ
ముందు ఉంచుతున్నాను.
“కల్లగందవొడిఁ గాఁగేను”
లేనిదానిలోనే
మాధుర్యం ఊహిస్తాడు.
ఆ
ఊహే:ఆ
మంట. అదే కంటకము.
అదే
తృష్ణ. తీరని దాహము..
“మనసు లోపలనుండి మరి మీఁదఁ దానుండి”
"తాను" అనేది మనసు లోపల వుండక మనసుపై పెత్తనము చెలాయించ బోతుంది
“అంగడి గందపుఁ బూఁతలట్టే వుండీనా”
అంగడిలో
కొన్న గంధపు పూతలు అట్లే వుండి పోవునా? (సడలి పడిపోవా?)
కంపు
దేహాలపై గుమాయింపు కొరకు పులుము కొన్న పూతతో పరిమళిద్దామను వైఖరి. మానవుడా కొని
తెచ్చుకున్న ఆచ్ఛాదనలు అలాగే నిలిచి వుంటాయా?
ఆత్మసాక్షి
ముందు ఏ ముసుగు నిలవదు.
ఏ
ముసుగు లేనప్పుడు ఆత్మసాక్షి అవసరమూ లేదు.
అటువంటి
స్థితిలో మానవునికి తన అసలు స్థితి అనుభవమునకు వచ్చును.
X-X-X THE
END X-X-X
No comments:
Post a Comment